మరియమాత దివ్య మాతృత్వ పండగ | Mary Mother of God Telugu | Carmel Shobha
మరియమాత దివ్య మాతృత్వ మహోత్సవం ఈ రోజు మనం మూడు ముఖ్యమైన పండుగలు చేసుకుంటున్నాము. మొదటిది మరియ మాత దివ్య మాతృత్వ పండగ. ఏమిటి మరియమాత మాతృత్వం, ఆ మాతృత్వ గొప్పతనం ఏమిటి అంటే ఇది సాధారణ మాతృత్వం కాదు. దేవునికి తల్లి అవ్వడం. దేవునికి తల్లి అవ్వడం అంటే ఏమిటి ? రెండవది యేసు ప్రభువుకు సున్నతి చేసి పేరు పుట్టిన రోజు. మూడవదిగా ఈరోజు మనము నూతన సంవత్సరములోనికి అడుగుపెడుతున్నాము. ఈ యొక్క పదాన్ని 431వ సంవత్సరంలో ఎఫెసుస్ కౌన్సిల్ లో మొదటిగా మరియమాత దేవుని తల్లి అని అనడం జరిగింది. దానిమీద అనేక వాదనలు జరిగాయి. వీటన్నింటి సారాంశం ముఖ్యముగా దేవుని గురించే. అది యేసు ప్రభువు ఈలోకమునకు మానవునిగా రావడం వలన ఈ మానవ రూపంలో దైవత్వాన్ని పూర్తిగా చూపించడం ప్రధాన అంశం యేసు ప్రభునియొక్క మానవత్వాన్ని మరియు దైవత్వాన్ని పూర్తిగా మనము పూర్తిగా అంగీకరించినప్పుడు మరియమాత యొక్క దైవత్వాన్ని అంగీకరిస్తాము. మరియమాతకు ఉన్న పేరులలో చాలా ముఖ్యమైనది దేవుని తల్లి. ఆమె దేవునికి మానవునిగా జన్మనిచ్చిన తల్లి. ఈ పేరుకి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి అంటే ఇది యేసు ప్రభువు పూర్తిగా మానవుడు మరియు దేవ...