7, ఆగస్టు 2021, శనివారం

19 వ సామాన్య ఆదివారం

సామాన్య 19 వ ఆదివారం

1 రాజుల 19: 4 - 8, ఏఫేసి 4: 30; 5: 2, యోహాను 6 :41-51

ఈనాటి సువార్త పట్నంలో యేసు "నేనే పరలోకమునుండి దిగివచ్చిన ఆహారమును" అని ఎలుగెత్తి పలుకుచున్నాడు. పరలోక పిత క్రీస్తును మానవాళికి ఆహారంగ ఒసగాడు. క్రీస్తు ద్వారా అందించిన ఆయన వాక్కు, సందేశం, ఉపదేశం మనందరకు జీవాహారం. క్రీస్తును విశ్వాసంతో స్వీకరించినవాడే ఆ జీవాన్ని పొందగలడు. నన్ను విశ్వసించువాడు నిత్య జీవము పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అని యేసు పలికెను. భౌతిక జీవితానికి ఆహారము అత్యవసరమైనట్లే, క్రీస్తు ఈ లోకములో మానవ జీవితానికి ఏంతో అవసరం. ఆయన మానవాళికి జీవాహారం. యావే భోజనం ప్రయాణంలో అలసి సొలసి పడిఉన్న ఏలీయా ప్రవక్తకు శక్తినిచ్చి గమ్యానికి నడిపించింది. ఇపుడు నూతన వేదంలో దేవుడే స్వయంగా ప్రజలకు ఆహారoగా దిగి వచ్చాడు. ఈ లోకములో మనం జీవిత ప్రయాణాన్ని కొనసాగించి మన గమ్యస్థానాన్ని చేరుకోవాలంటే ఆ దివ్య భోజనం మనకెంతో అవసరం. క్రీస్తు శరీరం మన జీవితానికి దివ్య భోజనం. జీవితంలో అలసి, సొలసి విసిగి వేసారి బాధలతో మ్రగ్గుతున్న ప్రజలకు ఆ దివ్యాసప్రసాదం శక్తిని, ఓదార్పును, శాంతిని ఒసగుతుంది. దివ్యాసప్రసాదాన్ని లోకేనేటప్పుడు   నిజంగా మనం దైవకుమారిని శరీరాన్ని బక్షిస్తునాం. కనుక ఆయన మనయందు ప్రవేశించి మనకు శక్తిని జీవాన్ని ప్రసాదిస్తాడని విశ్వసించాలి. విశ్వాసంతో యోగ్యతతో దివ్యాసప్రసాదవిందులో పాల్గొన్న వారికే అట్టి అనుభవం లభిస్తుంది.

క్రీస్తు వాక్కు, సందేశం, మన జీవితానికి దివ్యవరం. ఆ ఆహారాన్ని స్వీకరించినపుడే మనం క్రెస్తవులుగా జీవించగలం. అపుడే మనకు భౌతికమైన ఆకలిదప్పులు అప్రధానంగా గోచరించగలవు. క్రీస్తుతో నిండినవాడు ఆకాలిదప్పులను గూర్చి అలమటించడు. మరణాన్ని గూర్చి భయపడడు. ఎలైన అతని యందు నిత్యజీవము ఎపుడు పారుతూ ఉంటుంది. మనం ఇతరులకు ఆహారమై ఉండాలి మన ఆదర్శ జీవితం ద్వారా సత్య సందేశం ద్వారా మనం ఇతరులకు ఆహారమై జీవిస్తుండాలి.- Br.Ratna Raju

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...