7, ఆగస్టు 2021, శనివారం

19 వ సామాన్య ఆదివారం

సామాన్య 19 వ ఆదివారం

1 రాజుల 19: 4 - 8, ఏఫేసి 4: 30; 5: 2, యోహాను 6 :41-51

ఈనాటి సువార్త పట్నంలో యేసు "నేనే పరలోకమునుండి దిగివచ్చిన ఆహారమును" అని ఎలుగెత్తి పలుకుచున్నాడు. పరలోక పిత క్రీస్తును మానవాళికి ఆహారంగ ఒసగాడు. క్రీస్తు ద్వారా అందించిన ఆయన వాక్కు, సందేశం, ఉపదేశం మనందరకు జీవాహారం. క్రీస్తును విశ్వాసంతో స్వీకరించినవాడే ఆ జీవాన్ని పొందగలడు. నన్ను విశ్వసించువాడు నిత్య జీవము పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అని యేసు పలికెను. భౌతిక జీవితానికి ఆహారము అత్యవసరమైనట్లే, క్రీస్తు ఈ లోకములో మానవ జీవితానికి ఏంతో అవసరం. ఆయన మానవాళికి జీవాహారం. యావే భోజనం ప్రయాణంలో అలసి సొలసి పడిఉన్న ఏలీయా ప్రవక్తకు శక్తినిచ్చి గమ్యానికి నడిపించింది. ఇపుడు నూతన వేదంలో దేవుడే స్వయంగా ప్రజలకు ఆహారoగా దిగి వచ్చాడు. ఈ లోకములో మనం జీవిత ప్రయాణాన్ని కొనసాగించి మన గమ్యస్థానాన్ని చేరుకోవాలంటే ఆ దివ్య భోజనం మనకెంతో అవసరం. క్రీస్తు శరీరం మన జీవితానికి దివ్య భోజనం. జీవితంలో అలసి, సొలసి విసిగి వేసారి బాధలతో మ్రగ్గుతున్న ప్రజలకు ఆ దివ్యాసప్రసాదం శక్తిని, ఓదార్పును, శాంతిని ఒసగుతుంది. దివ్యాసప్రసాదాన్ని లోకేనేటప్పుడు   నిజంగా మనం దైవకుమారిని శరీరాన్ని బక్షిస్తునాం. కనుక ఆయన మనయందు ప్రవేశించి మనకు శక్తిని జీవాన్ని ప్రసాదిస్తాడని విశ్వసించాలి. విశ్వాసంతో యోగ్యతతో దివ్యాసప్రసాదవిందులో పాల్గొన్న వారికే అట్టి అనుభవం లభిస్తుంది.

క్రీస్తు వాక్కు, సందేశం, మన జీవితానికి దివ్యవరం. ఆ ఆహారాన్ని స్వీకరించినపుడే మనం క్రెస్తవులుగా జీవించగలం. అపుడే మనకు భౌతికమైన ఆకలిదప్పులు అప్రధానంగా గోచరించగలవు. క్రీస్తుతో నిండినవాడు ఆకాలిదప్పులను గూర్చి అలమటించడు. మరణాన్ని గూర్చి భయపడడు. ఎలైన అతని యందు నిత్యజీవము ఎపుడు పారుతూ ఉంటుంది. మనం ఇతరులకు ఆహారమై ఉండాలి మన ఆదర్శ జీవితం ద్వారా సత్య సందేశం ద్వారా మనం ఇతరులకు ఆహారమై జీవిస్తుండాలి.- Br.Ratna Raju

19 వ సామాన్య ఆదివారం

19 వ సామాన్య ఆదివారము

1 రాజులు 19: 4-8 

ఎఫెసీ 4: 30 – 5: 2

యోహాను 6: 41-51

నేటి దివ్య పఠనాలు మరొకసారి దేవుని యొక్క జీవాహారం, ఆ జీవాహారం ఇచ్చే శక్తిని గురించి భోదిస్తున్నాయి. దేవుని యొక్క ఆహరం స్వీకరించడము ద్వారా విశ్వాసుల యొక్క జీవితాలలో అనేక రకాల మేలులు, అద్భుతాలు జరుగుతుంటాయి, దీవెనలు పొందుతారు.

ఈనాటి మొదటి పఠనములో ఏలీయా ప్రవక్త రొట్టెను భుజించి శక్తిని పొందిన విధానము తెలుసుకుంటున్నాము. ఏలీయా ప్రవక్త ఇశ్రాయేలులో ప్రవచించే సమయములో కార్మెల్ కొండమీద 450 మంది బాలు ప్రవక్తలను వధించి నిజదేవుడైన యావే గురించి తెలియజేసారు. అటు తరువాత ఆ విషయము విన్న అన్య జాతికి చెందిన యెసెబెలు రాణి ఇది భరించలేక వెంటనే ఏలీయా ప్రవక్తను చంపాలన్న వార్తను పంపించింది. అది విన్న ప్రవక్త భయముతో ఉన్నారు. హోరేబు కొండవద్దకు వచ్చి ప్రాణాలను కాపాడుకోవాలనుకున్నారు. అప్పుడు దేవుని దూత ప్రత్యక్షమై ఏలీయా ప్రవక్తను పోషిస్తుంది. ఆయనలో కొత్త ధైర్యము, ఒక నూతన తేజాన్ని నింపుతుంది  

ఇక్కడ మనము అర్ధము చేసుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి

  1. రొట్టె భుజించిన తరువాత మార్పు వచ్చింది. అప్పటివరకు బలహీనంగా ఉన్నాడు, ప్రాణభయంతో ఉన్నారు, శారీరక శక్తి నశించిపోతుంది. ఎందుకంటే చాల దూరం అరణ్యములో ప్రయాణము చేసారు. ఒక్కసారి రొట్టెను భుజించిన తరువాత తాను శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తిని పొందాడు. తనలో కొత్త ధైర్యము వచ్చింది, కొత్త విశ్వాసము నమ్మిక పుట్టుకొచ్చాయి. దేవుని యొక్క పని బ్రతికినా, మరణించినా పరిపూర్తి చేయాలనుకున్నారు. మనలో కూడా దేవుని యొక్క జీవాహారము భుజించినప్పుడు  మార్పు రావాలి. మనము పాపులం కావచ్చు, అన్యాయము చేసినవారు కావచ్చు, వివిధ రకాలుగా స్వార్ధపు ఆలోచనలతో జీవించిన వారు కావచ్చు. అయినప్పటికీ దేవుడిని నీ నా హృదయములోనికి పిలిచినప్పుడు స్వీకరించినప్పుడు పాపి పుణ్యాత్ముడుగా మారాలి, స్వార్ధం నిస్వార్ధము అవ్వాలి, అన్యాయము న్యాయము చేసేలా ఉండాలి. మనలో మార్పు వస్తేనే మనము స్వీకరించే దివ్యసత్ప్రసాద స్వీకరణకు ఒక మంచి అర్ధము ఉంటుంది 

  2. ఇక్కడ దేవదూత ఏలీయాతో నీవు చాల దూరము ప్రయాణము చేయాలి అని చెబుతుంది. ఒక జీవితము ప్రారంభించిన తరువాత (క్రైస్తవ జీవితము) మనము కూడా దేవునిలో ప్రయాణము చేయాలి. ప్రయాణము అంటే ముందుకు సాగుట. అది ఎక్కడినుండి అయినా సరే. ముందుకు వెళ్ళుట అని కూడా చెప్పవచ్చు. ఏలీయా నీవు ప్రయాణం చేయాలి అనగా దేవుని యొక్క పనిని పూర్తి చేయుటకు నీవు ప్రయాణం చేయాలి. ఆ పనిలో ముందుకు సాగాలి. దేవుని కీర్తిని వెదజల్లుటలో ముందుకు వెళ్ళాలి. దేవుని యొక్క సాన్నిధ్యం అనుభవించుటలో ముందుకు వెళ్ళాలి. ప్రతి యొక్క ప్రయాణములో దేవుని యొక్క అభయ హస్తమును చవిచూడాలి. ఇశ్రాయేలీయులు తమ ప్రయాణములో దేవుణ్ణి తెలుసుకున్నారు. అలాగే ఏలీయా కూడా తన ప్రయాణములో ఇంకా దేవుణ్ణి తెలుసుకుని అయన కోసం నిలబడాలని దీని అర్ధం. ఏలీయా ఎలాగైతే ప్రయాణము చేసాడో మనము కూడా అలాగే ప్రయాణము చేయాలి. దివ్యసత్ప్రసాదము స్వీకరించిన తరువాత దేవుని వైపు మాత్రమే ప్రయాణము చేయాలి. దేవుని ప్రేమను పంచుటలో ప్రయాణము చేయాలి. దేవుని సాన్నిధ్యము రోజురోజుకి ఎక్కువగా అనుభవించుటకు ముందుకు ప్రయాణము చేయాలి. సమస్యలు అను పర్వతము ఎక్కి మరి ప్రయాణము చేయాలి. అలాగే కుటంబ జీవితము జీవిస్తున్న భార్యాభర్తలు చాలాదూరం అన్యోన్యముగా, ప్రేమగా ప్రయాణము చేయాలి, మంచిగా ఉండాలి.  

  3. దేవుని యొక్క అభయం ఉంటే ఎవ్వరు ఎన్నడును ఒంటరి కాదు. ఎందుకంటే వారికి దేవుడు తోడుగా ఉంటారు. నిస్సహాయుడిగా ఉన్న ఏలీయాకు దేవుడు తోడుగా ఉన్నారు, ఓదార్చారు, నడిపించారు. పడిపోయిన తనను మరల లేవనెత్తుతున్నారు. అలాగే మన బాధల సమయములో మనము ఒంటరి కాదు దేవుడు మనకు తోడుగా ఉంటారు.

  4. మనము విశ్వసించే దేవుడు, సమకూర్చే దేవుడు. ఏలీయా ప్రవక్త తన ప్రయాణములో తాను ఏమి తీసుకువెళ్లకపోయిన దేవుడు ఆహారము ఒసగుతున్నారు, సమకూరుస్తున్నారు.

రెండవ పఠనములో పౌలు గారు క్రీస్తునందు నూతన జీవితము గురించి బోధిస్తున్నారు. క్రీస్తుని అంగీకరించిన తరువాత, స్వీకరించిన తరువాత వారిలో కొత్త జీవితము ఉండాలి. ఆ జీవితములో పరస్పర ప్రేమ, దయ ఉండాలి. క్షమించుకునే మనస్సు ఉండాలి. అయన తన శరీర రక్తాలు మన కోసము ధారపోసి మరణించారు కాబట్టి ఆయనను మనలోకి ఆహ్వానించే సమయములో ఇలాంటి మంచి గుణాలు మనలోకి రావాలి. మొదటి పఠనములో చెప్పిన విధముగా రొట్టె స్వీకరించినప్పుడు మార్పు వచ్చిన విధముగా క్రీస్తుని శరీర రక్తాలు స్వీకరించినపుడు క్షమా, దయ, ప్రేమ అనేవి మనలో పుట్టాలి. మనము మారాలి. ప్రేమతో నడుచుకోవాలి. 

సువిశేషములో మరొకసారి దివ్యసత్ప్రసాదము గురించి చేసిన ప్రభోదం గురించి వింటున్నాము. యేసు ప్రభువు తాను పరలోకము నుండి దిగివచ్చిన ఆహారముగా అంటున్నారు. చాల మందికి అర్ధం కాని విషయం ఇది. ఎందుకంటే ఎలాగా ఒకరు పరలోకము నుండి దిగివస్తారని మానవ ఆలోచన. అందుకే వారు విశ్వసించలేదు. దేవుడిని విశ్వసించాలన్న, దేవుని యొక్క మాటలు అంగీకరించాలన్నా మనలో దేవుని యొక్క ఆత్మ ఉండాలి. దేవుని యొక్క ఆత్మకు మనము సహకరించాలి. యేసు ప్రభువు ఎన్నో అద్భుతాలు చేసారు. ఎవ్వరుకూడా చేయనటువంటి గొప్ప కార్యాలు చేసారు. అయినా సరే వారు అంగీకరించలేదు. ఎందుకంటే వారు ఆయనలో తప్పును మాత్రమే వెదికారు. కొందరు మాత్రమే ఆయనను రక్షకునిగా అంగీకరించారు. వారి హృదయాలు కఠినమైనవి. వారి విశ్వాసము కన్నా వారి తర్కము వారిని ఎక్కువగా ప్రభావితము చేసింది. దేవుని విషయాలు మనము విశ్వాసము ద్వారా అర్ధము చేసుకోవాలి. యేసు ప్రభువే జీవాహారము. మన ఆత్మలకు జీవము. మనయొక్క ఆత్మలను పోషించేవారు కాబట్టి ప్రభువును ఎపుడు స్వీకరించాలి.

దేవుని యొక్క దివ్య సత్ప్రసాదం స్వీకరించుట ద్వారా కలుగు ఆశీర్వాదాలు .

1.మనం నిత్య జీవం పొందుతాముద

2.దేవుని ఐక్యమై ఉంటాం (యోహాను 6 :57 )

3.మనకు ధైర్యం ఇస్తుంది

4.మనకు శక్తిని ఇస్తుంది

5.అనారోగ్యాలను బాగు చేస్తుంది

6.హృదయ పరివర్తనకు దారి తీస్తుంది

7.పరలోక ద్వారాలను తెరుస్తుంది

8.దేవుని యొక్క తోడునిస్తుంది.ఆమెన్

By Rev. Fr. Bala Yesu OCD

సామాన్యకాలపు ఇరవై ఏడవ ఆదివారము

సామాన్యకాలపు ఇరవై ఏడవ ఆదివారము  ఆదికాండము 2:18-24 హెబ్రీయులకు 2:9-11 మార్కు 10:2-16 క్రీస్తునాధునియందు ప్రియ సహోదరీ సహోదరులారా, దేవుని బిడ్డ...