14, ఆగస్టు 2021, శనివారం

అమ్మా, నువ్వే నా ప్రాణం”


                     ఇది ఒక తల్లి కొడుకుల ప్రేమ కథ. తల్లి పేరు మని. కుమారునిపేరు ప్రేమ్.

          మని తన కుమారుని తన చిన్న నాటి నుండి అల్లారు ముద్దుగా పెంచుతూ, తనకు ఏది కావాలన్న ప్రతి ఒక్కటి ఇస్తూ తన కుమారుడిని సంతోష పరుస్తూ, ఆ ఆనందంలో తాను మురిసిపోతూ ఉండేది. ప్రేమ్ పెద్ద వాడయ్యే కొద్దీ జ్ఞానం పెరుగుతూ, చదువులో మంచిగా రాణిస్తూ, ఆటలలో ఎప్పుడు ముందంజలో వుంటూ ఎంతో చురుకుగా ఉండేవాడు. తాను స్కూల్లో చేసిన ప్రతి ఒక్కటి తన తల్లికి చెప్పి మురిసిపోతుండేవాడు. ఒకరికి ఒకరు అంటే ఎంతో ప్రాణం. ఒకరిని ఒకరు చూడకుండా ఒక్కరోజైన ఉండలేరు. 

          కానీ, ఒకరోజు ప్రేమ్ ను తన స్నేహితులు తన తండ్రి గురించి గుచ్చి గుచ్చి అడిగినపుడు ఏంచెప్పాలో తనకు అర్థం కాలేదు. భాదతో, నిరాశతో ఇంటికి వచ్చి మౌనంగా వున్నాడు. ఇది గమనించిన తన తల్లి ప్రేమ్ దగ్గరకు వచ్చి తన ఒడిలోకి తీసుకొని ఏమైంది నాన్న, ఎందుకలా వున్నావు? స్కూల్లో ఏమైనా జరిగిందా? ఎవరైనా నిన్ను తిట్టారా? టీచర్ ఏమైనా కొట్టిందా? అని ప్రేమ్ ని అడిగినపుడు, ప్రేమ్ తన తల్లి చేతులు పట్టుకొని, జాలిగా, అమ్మా, నాన్న ఎక్కడమ్మా? నేను పుట్టినప్పటి నుండి నా నాన్నను చూడలేదు, తనతో మాట్లాడ లేదు, తన ప్రేమను నేను పొంద లేదు. నాన్న ఎక్కడున్నాడో చెప్పమ్మా? నా స్నేహితులు నన్ను ఎంతో కాలంగా నాన్న గురించి గుచ్చి గుచ్చి అడుగుతున్నారు. అప్పుడు మని, ప్రేమ్ వంక చూస్తూ, ప్రేమ్ మీ నాన్న ఎంతో గొప్పవాడు. ఆయన అమెరికాలో వుంటూ, ఎంతో కష్టపడుతూ నిన్ను నన్ను పోషిస్తున్నాడు. ఆయనకు ఇక్కడికి రావాలని ఎంతో కోరిక వుంది. నీతో ఆడుకోవాలని, తన ప్రేమను మనిద్దరికీ పంచాలని ఎంతో వుంది. కానీ ఏంచేస్తాం, ఇక్కడికి రావడానికి సరైన సదుపాయం లేకపోవడంతో ఇక్కడికి రాలేకపోతున్నాడు. కానీ నిన్ను ప్రతిరోజు తలచుకుంటూనే ఉంటాడు, అని చెప్పింది.ఆ మాటలు ప్రేమ్ నమ్మి అమ్మా, నానెంతో గ్రేట్ కదమ్మా! అని తన తల్లిని హత్తుకొని సంతోషంగా చెప్పాడు.అప్పుడు మని తన కన్నీళ్లను తుడుచుకుంటూ ప్రేమ్ ను గట్టిగా హత్తుకుంది. 

               కొన్ని రోజులతరువాత మరల తన స్నేహితులు తన తండ్రి గురించి గుచ్చి గుచ్చి అడగడం ప్రారంభించినపుడు, తన తల్లి ఎం చెప్పిందో మొత్తం తన స్నేహితులకు వివరించి చెప్పాడు.కానీ వారు నమ్మలేదు. పైగా తిరిగి ప్రశ్నలేసారు. అదేమిటంటే, నీకు తండ్రి లేడు. ఒకవేళ ఉంటే ఒక్కసారైనా నిన్ను చూడ్డానికి వచ్చేవాడు. లేదుకాబట్టే నిన్ను చూడడానికి రాలేదు, కనీసం ఫోన్ చేసైనా మాట్లాడేవాడు. మీ అమ్మ నిన్ను ఎలా కానిందో ఏమో మరి, మీ అమ్మ తిరుగు బోతేమో అని అన్నపుడు, ఇక తట్టు కోలేక ఒక వైపు కోపంతో, మరో వైపు బాధతో, ఇంటికివెళ్ళి తన తల్లిని కోపంగా తన తండ్రి గురించి అడిగాడు.మరల అప్పుడు అదే  చెప్పింది. తాను కోపంతో  నువ్వు చెప్పేది అంతా అబద్ధం. నువ్వు ఒక పచ్చి తిరుగు బొతువు. నన్ను ఎలాకన్నావో ఆ దేవుడికే తెలియాలి అని అన్నప్పుడు, ఆ తల్లికి కోపం వచ్చి చెంపపై ఒక్కటి ఇచ్చింది. అప్పుడు ఇది తట్టుకోలేక ప్రేమ్ కోపంలో దగ్గరలో ఉన్నటువంటి ఇనుప రాడ్డుని తీసుకొని గట్టిగా మని  తలపై ఒక్కటి ఇచ్చాడు. అంతే, మని పడిపోయింది తలకు గట్టిగా గాయం తగలడంతో క్రింద పడి  పోయి గిలగిలా కొట్టుకోవడం ప్రారంభించింది.రక్తం ఒక వైపైతే, కన్నీళ్లు మరొకవైపు కారుతున్నాయి. కోన ఊపిరితో ఉండి తన చేతి వ్రేళ్ళను బియ్యం డ్రమ్ము వైపు ప్రేమ్ కు చూపించింది. దానిని తెరచి చూస్తే, అందులో ఒక డైరీ కనిపించింది.

            మొదటి పేజీ తెరచి చూస్తే దాంట్లో తన తల్లి యొక్క జీవితం గూర్చి రాసిఉంది. అదేమిటంటే, మని  ఒక ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తి. ఎంతో గొప్పగా, ఒక రాణిలా, ఎటువంటి కష్టాలులేకుండా, ఎంతో అల్లారు ముద్దుగా పెరిగింది. ఆమె ఇంట్లో ఎంతోమంది పనివాళ్ళు ఇక్కడున్న వస్తువు తీసి వేరేదగ్గర పెట్టెదే కాదు. ఆమె ముందుగా బెడ్ కాఫీ తో రోజును ప్రారంభించి, రాత్రి గ్లాసు పాలతో ముగుస్తుంది. ఎంతో అల్లరు ముద్దుగా పెరిగింది. ఆమె ఎం.బి.ఏ చేస్తున్న సమయంలో, ఒక వ్యక్తిని ప్రేమించింది. అతని పేరు సత్య. ఆ విషయం ఇంట్లో చెబితే, ఇంట్లో వారు తిరస్కరించారు. ఇద్దరు బయటికి వెళ్లి వివాహం చేసుకున్నారు. 

                ఇది చదివిన తరువాత ప్రేమ్ తన తల్లి వైపు చూసి నాతల్లి ఇంత గొప్పగా జీవించిందా? అన్నట్లు తన తల్లి వైపు చూసి మళ్ళీ చదవడం మొదలు పెట్టాడు.

                రెండవ పేజీ  తెరచి చూస్తే , సత్య మరియు మని సంతోషముగా, ఆనందంగా జీవించారు.వారిలో ఎటువంటి గొడవలు లేవు. కానీ ఒక్కటే వారిలో బాధ. అదేమిటంటే వారికి సంతానం లేదు. వారు ఐదు సంవత్సరాలుగా ఎన్నో నోములు నోచాడు. ఎన్నో ప్రార్థనలు చేసాడు. ఎన్నో దేవుళ్ళని మ్రొక్కారు. వెళ్లని స్థలం లేదు. మ్రొక్కని దేవుడు లేదు. చేయని సాయం లేదు. చివరకు వారిపై దేవుని కరుణ వలన మని  గర్భం ధరించింది.వారికి దేవుడు ఒక కుమారుని ప్రసాదిస్తున్నాడు కనుక . దేవుడు వారికి చేసిన గొప్ప మేలుకు గాను, ప్రేమకు గాను, అతని పేరు ప్రేమ్ అని పెడదామని ఇద్దరు అనుకున్నారు..

                   ఆరోజు రానే వచ్చింది. మని పురుటి నొప్పులతో  భాధ పడుతూ వుంది. సత్య కి ఏమీ చెయ్యాలో అర్ధం కాక అంబులెన్స్ కు ఫోన్ చేసాడు. అది వచ్చిన వెంటనే, మని ను, ఆమెకు తోడుగా, సత్య తన తల్లిని పంపించాడు. అది తెల్లవారు జాము, సత్య కి ఫోన్ వచ్చింది. చూస్తే, అది హాసుపత్రి నుండి వచ్చిన ఫోన్. డాక్టర్ సత్యతో నీకు కుమారుడు పుట్టాడు, అని సంతోషకరమైన వార్త ను చెప్పినపుడు, ఆ సంతోషాన్ని పట్టలేక ఎగిరి గంతేసాడు. ఆ డాక్టర్ కు ధన్యవాదములు తెలిపి, తనకున్నటువంటి ఆర్ ఎక్స్ 100 బండిని తీసి ప్రయాణం ప్రారంభించాడు.ఇంకా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న సమయంలో ఎదురుగ్గా వచ్చే లారీ మంచు చే సరిగ్గా కనపడక పోవడంతో రెండు వాహనాలు ఒక్క సారిగా ఢీకొనడంతో సత్య ధురంగా పడిపోయి ప్రాణం కోసం కొట్టిమిట్టాడు తున్నాడు.

               అప్పుడు అక్కడున్న వారు అంబులెన్సు సహాయంతో దగ్గరలో వున్నటువంటి  ఆసుపత్రికి తీసుకొని వచ్చారు.ఇక్కడేమో మని, సత్య రాకకోసం ఎదురుచూస్తుంది. ఫోన్ చేస్తుంది కానీ రింగ్ కావడం లేదు. అప్పుడే అక్కడ వార్డులో వున్న వారు జరిగిన ప్రమాదం గురించి మాట్లాడుకుంటూ ఉండగా, మని ఎంతో బయపడి పోయి నా భర్తకు ఇలా జరగకుండా చూడు స్వామి, అంటూ ప్రార్థన చేస్తుండగా, ప్రార్థన ముగించేలోపే కొంతమంది వ్యక్తులు ఆమెకు తెలిసిన వారు ఈ విషయాన్నీ తెలుసుకొని పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరకు వచ్చి, మని! గోరం జరిగి పోయింది. నీ భర్త నీదగ్గరకు వస్తున్న సమయంలో ఆక్సిడెంట్ అయ్యి చావు బ్రతుకులలో ఉండగా, ఇక్కడకు తీసుకొని వచ్చారు. అనిచెప్పినవెంటనే గట్టిగా ఏడుస్తూ, గుండెలు బాదుకుంటూ, లేచి తన భర్త దగ్గరికి వెళదామని లేస్తున్న సమయంలో ఆమెకు వున్నటు వంటి  నొప్పులను భరించలేక అక్కడే క్రింద పడిపోయిది. దానితో ఆమెలో కంగారు ఎక్కువయ్యి, ఆభయంతో పక్షవాతం వచ్చి అక్కడే పడిపోయింది. కాళ్ళు చేతులు పడిపోయాయి.ఏమీ చేయలేని పరిస్థితి. ఒక వైపు బాలుని జన్మ, మరోవైపు తండ్రి చావు, ఇంకొకవైపు,తల్లికి పక్షవాతం. అక్కడ వున్న వారికి ఏమీ చెయ్యాలో తోచక ఆ బాలుడిని  తన ప్రాణ స్నేహితురాలైన రాణి తీసుకొని ఆ బాలుడిని సంవత్సరం పాటు పెంచింది. మరి ఆసుపత్రిలోనే ఉంటూ, తాగి న జాగ్రత్తలు తీసు కొని పూర్తిగా కోలుకొని తన కుమారుడిని తన స్నేహితురాలి దగ్గరనుండి తీసు కొని కృతజ్ఞతలు తెలిపి, తన సొంత ఇంటికి బయలుదేరి, తన తల్లి దండ్రులను సహాయం చేయమని తన కొంగు చాచి అడిగితే, వారు ఈమె ఎవరో తెలియదన్నట్లు చూసి, తన సేవకులచే రోడ్డు బయటికి గెంటివేశారు.ఇది తట్టుకోలేక, మేరి తన బాలుడినితీసుకొని ఎవరికీ తెలియని ప్రదేశమునకు వెళ్లి జీవించడం మొదలు పెట్టింది. అక్కడకు వెళ్ళినతరువాత తన కుమారునికి మేరి సత్య అప్పుడు అనుకున్నట్లు, ఆ బాలునికి ప్రేమ్ అని పేరు పెట్టి ఒక నూతన జీవితాన్ని ప్రారంభించింది 

             ఇదంతా చదివిన ప్రేమ్ తన దుఃఖాన్ని ఆపు కోలేక పోయాడు. తన కన్నీళ్లను తుడుచు కుంటూ, తన తల్లి వైపు తీక్షణం గా చూస్తూ, ఎంతో బాధ పడుతూ, మనసులో అమ్మ నన్ను క్షమించమ్మా అని అనుకుంటూ, తారువాత ఎం జరిగిందోనని, తరువాత పేజీని తెరచి చూసాడు.

        ఈ నాలుగవ పేజీలో ఆ తల్లి పడిన కష్టాల గురించి వివరిస్తుంది. పక్షవాతం వచ్చి పడిపోయినపుడు, ఆమె జ్ఞానం కోల్పోయింది.చదివిన చదువు అంతా వృధా అయిపోయింది. ఎం చెయ్యాలో అర్ధం కాలేదు. అయినా కూడా ఏదో ఒక పని చేద్దాం అని వెళితే ఎవరూ పని ఇవ్వకుండా, నీకు ఏ పనీ రాదు అని గేలిచేసేవారు. ఎం చెయ్యాలో అర్థం కాలేదు. అల్లారుముద్దుగా పెరిగిన మేరి, ఏ పనీ చేయని  మని  ఇప్పుడు ఏదో ఒక పని కోసం వెదుకుతూ, తన కుమారుడిని ఎలాగోలా గొప్ప ప్రయోజకుడిని చేయాలని తపనపడింది. అప్పుడు టీ అమ్మడం, షూ పాలిషింగ్ చేయడం వంటి చిన్న చిన్న పనులైనా చేస్తూ డబ్బులు సంపాదించి కుమారుడికి మంచి జీవితాన్ని ఇవ్వాలని అనుకోని, తన పనిని ప్రారంభించింది. ఆమె ఒక్కపూట తిని రెండు పూటలు పస్తులుండి, ప్రేమ్ కు కడుపు నిండా అన్నం పెట్టేది. చివరికి భిక్షాటనకుకుడా వెనుకాడలేదు. ఇదంతా చేస్తూ, ప్రేమ్ కు తెలియనివ్వకుండా జాగ్రత్తపడేది. అడిగితే నాన్న, నీకోసం నేను గొప్పజాబ్ చేస్తున్నాను. నేను ఏమి చేసినా నీకోసమే కదా, అని చెబుతుండేది. అది ఆ తల్లి యొక్క గొప్పతనం. ఇదంతా చదువుతున్న ప్రేమ్ తనలో ఉన్న కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు.ఇదంతా తల్లి గమనిస్తూనే వుంది.

               తన కన్నీళ్లను తుడుచు కుంటూ ఐదవ పేజీని చదవడం మొదలు పెట్టాడు. ఇక్కడ ఆమె ఇలా వ్రాస్తుంది. నాన్న,ప్రేమ్!   నీకివన్నీ చెప్పి నిన్ను బాధపెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే ఇవన్నీ నీకు చెప్పలేదు.కానీ ఎదో ఒక రోజు నామీద నీవు తిరగబడతావని నాకు ముందే తెలుసు.నీవు తిరగబడినపుడు,నన్ను నీవు కొట్టినప్పుడు, ఇవన్నీ చెప్పకుండా, చనిపోతానేమోనని,నిన్న రాత్రి నీవు నిద్రిస్తున్న తరువాత ఇవన్నీ రాసి ఈ బియ్యం డ్రమ్ములో పెట్టాను. నీలో ఎప్పుడు కన్నీళ్లు చూడకూడదనుకు నాను.అందుకే మీ నాన్న గురించి, నా గురించి,ఎప్పుడు నీకు చెప్పలేదు.నువ్వంటే నాకు ప్రాణం.నీవు లేకుండా నేను ఉండలేను.నీవెప్పుడు సంతోషంగా ఉండాలి ఓకేనా! ప్రేమ్ పేజీ తిప్పాడు,కానీ అక్కడ కాళీగా వుంది. వెంటనే ప్రేమ్ తల్లి వైపు చూసి పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మా!. అమ్మా...నువ్వటే నాకు ఎంతో ఇష్టం అమ్మా. నువ్వేనా ప్రాణం అమ్మా. అని మని  ను తన ఒడిలోకి తీసుకొని హత్తుకొని ఏడవడం మొదలు పెట్టాడు.అప్పుడు మని కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మాట్లాడదామన్న మాట్లాడలేని పరిస్థితి. ఒకవైపు రక్తం ధారాళంగా కారుతుంది. కళ్లలోనుండి నీరు ఆగకుండా వస్తూనే వున్నాయి.నొప్పి విపరీతంగా వుంది అయినాకానీ, తన ప్రాణాన్ని తన గుప్పెట్లో పెట్టుకొని చిన్నగా పెదాలు కదిలిస్తూ,అర్ధమయ్యి, కానట్లు మాట్లాడడం ప్రారంభించింది.నాన్నా ప్రేమ్, ఈ ఒక్క మాటకోసమే నేను ఇన్ని రోజులుగా ఎదురుచూస్తున్నాను."నువ్వే నా ప్రాణం". నీ కన్నీళ్లను నేను చూడలేను అంటూ,ప్రేమ్ చెంపపై కారుతున్నటువంటి కన్నీళ్లను తూడుస్తూ, నాన్న నీకోసం నేను కష్టపడి పనిచేసి కొంత డబ్బు నీకోసం, నీ చదువుకోసం,రూపాయి,రూపాయి,కూడబెట్టి,మనిద్దరి ఫోటో ఫ్రెమ్ వెనుక పెట్టాను.దానిని నీవు తీసుకొని నీ అవసరాలకు, నీ చదువుకు వాడుకొని,గొప్ప ప్రయోజకుడివి అయ్యి, అవసరాలలో వున్నా వారికి సహాయపడు.దానికంటే ముందు ఆ ఫోటో ఫ్రెమ్ తీసుకొని తెరిస్తే, అందులో మీనాన్న సత్య, నేను దిగిన ఫోటో ఉంటుంది అని చెప్పి తుది శ్వస విడిచింది.

               ఇది ఒక్కసారిగా గ్రహించిన ప్రేమ్ అమ్మా!అమ్మా! అని గట్టిగా అరచి, ఏడుస్తూ నువ్వునా ప్రాణం అమ్మా! నువ్వే నా ప్రపంచం అమ్మా! నువ్వు నాకు కావాలమ్మా,లే అమ్మా ! తప్పై పోయిందమ్మా, అంటూ తల్లి గుండెలపై వాలి,హత్తుకొని,తాను కూడా ప్రాణం విడిచాడు.

              ఒక తల్లి అంటే జీవం పోసిన దేవుడితో సమానం.ఆ తల్లి ప్రేమను నువ్వు నేను అర్థం చేసుకోలేక పోతే, మన జీవితం వ్యర్థం. మనం జీవించిననాళ్లు మన తల్లి ప్రేమను ఆస్వాదిస్తూ, ఆ ప్రేమలో ఒదిగిపోతూ,అదే ప్రేమను ఆమెకుకూడా ఇస్తూ, మనం జీవించిననాళ్లు ఆమెతో కలిసి జీవించడానికి ప్రయత్నిదాం.

            కావున ఈ కథను ప్రతి ఒక్క తల్లికి సమర్పిస్తున్నాను.వారు ఎప్పుడు సంతోషంగా, ఆనందంగా,ఆరోగ్యంగా,ఉండాలని మరియు వారి ముఖం లో ఎప్పుడూ చిరునవ్వు ఉండాలని  ఆశిద్దాం.

                                                                                                                               

                                                                                                            జోసెఫ్ మారియో  ఓ.సి.డి.

      

మరియ తల్లి యొక్క మధురమైన స్వభావం


మంచి మనసు కలిగి ఎందరో హృదయాలను

       సొంతం చేసుకొని రివ్వుమంటూ తన ప్రేమతో

                     ఏకం చేసుకునే తల్లి మరియతల్లి.

 

యవ్వన ప్రాయములో దేవుని వాగ్దానాన్ని స్వీకరించి

                 ఆ దేవుని పుత్రుని ఈ లోకానికి ప్రసాదించిన 

                                ఓ అద్భుతమైన తల్లి మరియ తల్లి. 


పాపములో పడి కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు 

             వెలుగును చూపిన

                            ఓ వరప్రసాదాల తల్లి మరియ తల్లి.


 నవమాసాలు మోసి కని పెంచి పెద్దచేసి 

           ఈ లోకానికి ఓ మరచిపోలేని చిరు దివ్వెను

                               ప్రసాదించిన తల్లి మరియ తల్లి. 


 లోకరక్షకుడి కోసం ఎదురు చూస్తున్న ప్రజలకోసం 

       తన సర్వస్వాన్ని వదిలివేసి దేవుడే తన సర్వస్వంగా భావించి

                     ఆ దేవుడినే ఈ లోకానికి తెచ్చిన వన్నె తల్లి మరియతల్లి.


 కార్మెల్ మఠవాసులంతా ఒక్కటిగా చేరి

      ప్రార్థిస్తుండగా వారి ప్రార్థనలను ఆలకించి

                 ఉతర్యము అను తన రక్షణకవచాన్ని ప్రసాదించిన

                                 గొప్ప కరుణగల తల్లి మన  మరియతల్లి.           

                                                                                                       బ్రథర్. జోసెఫ్ మారియో. ఓసిడి.

పరిశుద్ధ కన్య మరియ మోక్షరోపణ మహోత్సవము

పరిశుద్ధ కన్య మరియ మోక్షరోపణ మహోత్సవము

దర్శన 11; 19, 12; 1 -6, 10 

1కొరింతి 15; 20 -26 

లూకా 1;39 -56 

క్రీస్తునందునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ నాడు మనం 20 వ సామాన్య ఆదివారములోనికి ప్రవేశించి యున్నాము. అదేవిధంగా తల్లి శ్రీసభ పరిశుద్ధ కన్య మరియమాత మోక్షారోపణ మహోత్సవాన్ని కొనియాడుచున్నది. ఈ నాటి దివ్య గ్రంథ పఠనాలను మనం ధ్యానించినట్లైతే తల్లి మరియ మాత గొప్పతనాన్ని మరియు దేవుడు ఆమెయందు చేసిన గొప్ప కార్యాలను గురించి తెలియచేస్తున్నాయి. నిష్కళంక కన్యక అయిన దేవమాత తన భూలోక జీవిత యాత్రను ముగించిన తరువాత ఆత్మా శరీరాలతో పరలోకమునకు కొనిపోబడిందని నవంబర్ 1, 1950 వ సంవత్సరంలో 12 వ భక్తినాథా పోపు గారు మరియమాత మోక్షారోపణ పండుగను విశ్వాస సంవత్సరంగా ఆమోదించారు.

మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లైతే హానోకు, మోషే మరియు ఏలీయా ప్రవక్తలు మాత్రమే దేవుడు పరలోకంలోకి తమ ఆత్మా శరీరాలతో తీసుకుపోయాడని చూస్తున్నాము. పవిత్త్ర గ్రంథంలో ఈ ముగ్గురు వ్యక్తులగురించి మాత్రమే తెలియచేస్తుంది. కానీ మరియమాత మోక్షారోహానమవడం ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. అయినా కాథోలికులమైన మనం ఎందుకు ఈ పండుగను కొనియాడుచున్నాము? ముందుగా రక్షణ గ్రంథ చరిత్రలో చూసుకున్నట్లైతే ఆదికాండము మూడవ అధ్యాయంలో చూసుకున్నట్లైతే ఒక స్త్రీ అవిధేయత వల్ల ఈలోకానికి పాపం వచ్చింది. అదేవిధంగా నూతన నిబంధన గ్రంథంలో చూసుకున్నట్లైతే మరియమాత విధేయత ద్వారా ఈ లోకానికి రక్షణ వచ్చింది. ఏ విధంగా అంటే సాక్షాత్తు ఆ దైవ కుమారుణ్ణి ఆమె తన గర్భమునందుమోసి, క్రీస్తు ప్రభువుకి జన్మనిచ్చి రక్షణ తీసుకొని వచ్చింది. అదేవిధంగా కాథోలికులమైన మనం. సాక్షాత్తు దైవ కుమారుణ్ణి ఆమె గర్భమునందు తొమ్మిది మాసాలు నివశించాడు కాబట్టి ఆమెను వాగ్ధత్త మందసము లేదా దేవుని మందసము అని విశ్వసిస్తున్నాం.

సమువేలు 2 వ గ్రంథంలో 6; 6 -7 చూసుకున్నట్లైతే దావీదు మహారాజు దేవుని మందసాన్ని యెరూషలేముకు తీసుకొస్తున్నప్పుడు ఎడ్లబండిని గతుకులలో ఈడ్చడం వలన మందసము జారీ క్రిందకి పడిపోయెను. దానిని మోస్తున్న ఉస్సా అనే వ్యక్తి చేయి చాచి మందసము తాకిన వెంటనే ప్రక్కకు కూలి చనిపోతాడు ఎందుకంటే దైవ మందసము ఎంతో పవిత్రమైనది. ఆ మందసంలో మోషే చేతి కర్ర, మన్నా, మరియు పది ఆజ్ఞలు ఉన్నవి. అలాంటిది పట్టుకోగానే చనిపోయారంటే , మరియ తల్లి ఇంకా ఎంతో పవిత్రమైనది. చూడండి సాక్షాత్తు క్రీస్తుభగవానుడు తొమ్మిది మాసాలు ఆమె గర్భంలో నివశించారు. అలాంటి శరీరం ఈ లోకంలో నశించిపోవడం దేవునికి ఇష్టంలేదు. కనుక ఆమె చనిపోయిన తరువాత ఆత్మా శరీరాలతో పరలోకంలోకి తీసుకువెళ్లాడని మనం విశ్వసిస్తున్నాం.

యోహాను 14; 3 వ వచనంలో క్రీస్తు ప్రభువు ఈ విధంగా పలుకుతున్నారు. నేను ఉండు స్థలంలోనే మీరును ఉందురు,  అని తన తల్లిని తనతో ఉండుటకు మరియ తల్లిని మొక్షానికి తీసుకెళ్లడం జరిగింది. అదే విధంగా ఈ నాటి మొదటి పఠనం దర్శన గ్రంథంలో చూసుకున్నట్లైతే దివియందు ఒక స్త్రీ దర్శనమిచ్చెను . సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరముపై  పండ్రెండు నక్షత్రములుగల కిరీటము ఉండెను (దర్శన 12 ;1 ). ఇక్కడ ఈ స్త్రీ యే మరియ తల్లి అని ఆమెను మోక్షమునకు తీసుకుపోయిన తర్వాత దేవుని వద్ద ఉన్నది అని కథోలికుల విశ్వాసం. ఈ నాటి సువార్త పఠనాన్ని ధ్యానించినట్లైతే, మరియ మాత ఎలిజబెతమ్మను దర్శించిన ఘట్టాన్ని మరియు మరియమ్మ స్తోత్రగీతాన్ని గురించి వింటున్నాం. ఎప్పుడైతే మరియతల్లి జక్రయ్య, ఎలిజబెతమ్మల ఇంటిలోనికి ప్రవేశించిందో, ఇల్లంతయు కూడా వెలుగుతో నింపబడింది. మరియు ఆమె గర్భమునందలి శిశువు గంతులు వేసెను. ఎందుకంటే దేవుని తల్లి ఆ గృహములోకి అడుగుపెట్టగానే వారి జీవితాలు మరియు ఇంటిలో వెలుగు వచ్చింది. 

మరియు ఎలిజబెతమ్మ ఎలుగెత్తి ఈ విధంగా అంటుంది. స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడినదానవు, నీ గర్భం ఆశీర్వదింపబడెను, చూడండి ఎంతటి పవిత్రమైనదో మరియ తల్లి. ఆమె పవిత్ర మైన జీవితం జీవించింది కాబట్టి దైవ కుమారుడు ఆమె గర్భం నందు జనియించారు. ఆమె నిష్కళంకమైనది. అందుకనే మనం చూస్తున్నాం లూకా 1; 48 లో తర తరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు అని మరియ మాత దేవునికి స్తోత్రగీతంలో తెలియచేస్తుంది.

కావున ఇలాంటి మరియ తల్లిని మరియు ఎంతో పవిత్రంగా జీవించిన తల్లిని ఈ లోకానికి రక్షణ తీసుకొచ్చిన తల్లిని దేవుడు తప్పక పరలోకంలోకి ఆత్మా శరీరంలా ద్వారా తీసుకెళ్లాడని మనం విశ్వసిస్తున్నాం.  కావున ప్రియా సహోదరి సహోదరులారా ఎవరైతే దేవునికి సాక్షులుగా జీవిస్తారో, ఆ ఆజ్ఞలను తప్పకుండ పాటిస్తారో, వారందరు దేవుడిని దర్శిస్తారు. మరియు మనందరము  పాప  జీవితమునుండి బయటికి వచ్చి మన పాపాలన్నీ త్యజించి దేవుని బిడ్డలుగా జీవిస్తే ఆయన రాకడ సమయమున ఆయనకు చెందుతామని ఈ నాటి రెండవ పఠనం ద్వారా పునీత పౌలుగారు తెలియచేస్తున్నారు. కావున మనందరము  మరియ తల్లి ఏవిధంగా జీవించి దేవునికి విధేయురాలై దేవుని చిత్తాన్ని నెరవేర్చిందో మనం కూడా ఆమె బాటలో నడవాలని ఆమె వలె  జీవించాలని ఆ తండ్రి దేవునికి ప్రార్థన చేసుకుందాం.

-బ్రదర్. సాలి. రాజు ఓ.సి.డి

11వ సామాన్య ఆదివారం

11వ సామాన్య ఆదివారం  యెహెజ్కేలు17:22-24, 1 కొరింతి 5:6-10, మార్కు 4:26-34 ఈనాటి పరిశుద్ధ గ్రంధ పఠణములు దేవుని యొక్క రాజ్య విస్తరణ గురించి బో...