24, సెప్టెంబర్ 2022, శనివారం

ఇరువది ఆరవ సామాన్య ఆదివారము (2)

                 ఇరువది ఆరవ సామాన్య ఆదివారము

ఆమోసు:6:1,4-7

1తిమో:6:11-16.

లూకా:16:19-31.

క్రీస్తునాధుని యందు ప్రియమైన సహోదరీ సహోదరులారా,ఈ నాడు మనమందరము కూడా ఇరువది ఆరవ సామాన్య ఆదివారములోనికి ప్రవేశిస్తున్నాము. ఈనాటి దివ్యగ్రంధ పఠనములను ధ్యానించినట్లయితే, మనకు మూడు విషయాలను తెలియజేస్తున్నాయి.

మొదటిది, ఐక్యమత్యముగా జీవించాలని, రెండవది,పేద, ధనిక వర్గాలు లేకుండా సోదరరుల్లాగా, ఒకరితో ఒకరు సహాయపడుతూ జీవించాలని. మూడవదిగా,పేదవారిపట్ల జాలి, దయ, కనికరము కలిగి ఆదరణతో జీవించాలని ఈ మూడు పఠనాలు మనకు తెలియజేస్తున్నాయి.

మొదటిపఠనము:

ఈనాటి మొదటి పఠనమును మనమందరము ధ్యానించినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలమధ్య అన్యాయము, అవినీతి, మోసం, కుట్ర, అసూయ పెరిగిపోతున్నాయని మనకు తెలియజేస్తున్నాయి. ముఖ్యముగా వారిమధ్య ధనికులు,పేదవారు అని రెండు వర్గాలు ఏర్పడ్డాయి.మరి ఈధనికులు పెదవా రినుండి, అన్యాయముగా దోచుకొని, సుఖభాగ్యాలను అనుభవించడం మొదలుపెట్టారు. మరియు అనుదిన కలాపాలలో వ్యాపారములో ధనికులు పేదవారికి అన్యాయము జరిగి వారి సంపదలను పెంచుకున్నారు. వారు మేడలను కట్టుకొని సుఖభాగ్యాలతో జీవిస్తున్నారు. దీనిని గ్రహించినటువంటి దేవుడు, ఆమోసు ప్రవక్తను పంపి ధనికులను తీవ్రముగా కండిస్తున్నాడు.

రెండవ పఠనం :

ఈ రెండవ పఠనంను మనం ధ్యానించినట్లయితే, ధనికులు- పేదలు అను రెండువర్గాలవారు ఎఫెసు సంఘమునందు ఇహలోక సంపదలు గూర్చి ఆలోచిస్తూ, దైవ సంపదను విడనాడారు. మరియు వారి హృదయములో నీతి, భక్తి,విశ్వాసము,ప్రేమ సహనములను విడనాడి వారి సుఖ సంతోషాల ప్రకారము జీవిస్తున్న సమయములో మనకు

పు.పౌలుగారి ద్వారా రెండు విషయాలను తెలియజేస్తుంది. అవి:

1. దనాకాంక్షను విడనాడుట.

2.విశ్వాసవంతమైన జీవితమునకై నీతి, భక్తి ప్రేమ,అనువాటి యందు జీవిచాలని తెలియజేస్తున్నాయి.

1. దనాకాంక్షను విడనాడుట:

ఆనాటి ప్రజలు వారి సంతోషముకోసము ఎన్నో చెడ్డ దారులను త్రొక్కుతూ, పేదవారిని పట్టించుకోకుండా విందులు వినోదములతో గడుపుతున్నారు. అందుకుగాను పు.పౌలుగారు ఈలేఖనుతిమోతీకి వ్రాస్తూ ఆప్రజల హృదయములు మార్చమని వారి హృదయములో ఇటువంటి ధనాకాంక్ష కాకుండా దేవుని యందు వారి మనసులను నిమగ్నము చేయాలని తెలియజేస్తున్నాడు.

2. విశ్వాసవంతమైన జీవితమునకై నీతి, భక్తి ప్రేమ,అనువాటి యందు జీవిచాలని

తెలియజేస్తున్నాయి:

పు. పౌలు గారు తమ జీవితములో దేవుని కోసమై ఒక ఉన్నతమైన జీవితమును జీవించాడు. అందుకే ఈనాడు ఆప్రజలతో ;విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును పోరాడి నిత్యజీవితమును పొందండి; అని తెలియజేస్తున్నాడు. కాబట్టి మనమందరము కూడా విశ్వాసవంతమైన జీవితమును జీవించి ఈలోక ఆశలకు దూరంగా ఉంటూ నిత్యజీవితమును పొందుటకు ప్రేమ, భక్తి, జాలి మన పొరుగువారిపై చూపిస్తూ ఒక నూతన జీవితమును జీవిద్దాము.

సువిశేష పఠనము :

ఈనాటి సువిశేష పఠనము ధనికుడు-లాజరు యొక్క ఉపమానమును తెలియజేస్తుంది. అయితే ఈ రెండు విషయాలను మనకు తెలియజేస్తుంది:

1 .పేదవానికి సహాయము చేసి నిత్యజీవితమును పొందటం: ఈనాటి సువిశేష పఠనములో ధనవంతుడు పేదవానికి సహాయము చేయకుండా తన స్వార్ధముకోసము జీవిచి పక్కనేవున్న లాజరును పట్టించుకోకుండా ధనమును దైవముగా భావించి నిత్యజీవమును కోల్పోయి నరకములో కన్నీరు కారుస్తున్నాడు. కానీ లాజరు మాత్రము ఈ ధనవంతుడియందు విశ్వాసముంచి అతడు తనకు ఏమయినా ఇస్తాడేమో అని ఎదురుచూస్తున్నాడు. కానీ, ఈ లాజరు ఏమి పొందలేకపోయారు. మనంకూడా ఈ లాజరు వలె దేవుని యందు నమ్మకము. విశ్వాసము ఉంచి ప్రార్ధనలో అడిగినట్లయితే మనకు లంకావలసినది ఇస్తాడు. మత్తయి:7 :7 లో చూస్తే, అడుగుడు నీకివ్వబడును, వెదకుడు నీకు దొరుకును, తట్టుడు నీకు తెరువబడును అని అంటున్నాడు. కాబట్టి మనము దేవునియందు విశ్వాసముంచి అడిగినట్లయితే ఆయనమనకు ఖచ్చితముగా ఇస్తాడు.

2 .పేదవారికి మనము ఎంతగా సహాయకులుగా వుంటున్నాము: మనయొక్క సహోదరులు కష్టాలలో ఉంటే వారిని పట్టించుకోకుండా మన సొంత అవసరాలను మాత్రమే మనము తీర్చుకుంటూన్నాము. దేవుడు ఇలా అంటున్నాడు, నన్ను ప్రేమించినట్లే, నీ పొరుగువారికి ప్రేమించండి అని అంటున్నాడు. ఇంకా,ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఏఒక్కరికి ఇది చేసినప్పుడు ఆదినాకు చేసితిరి అని ప్రభువు పలుకుచున్నాడు. అంటే, ఈ సహాయము ఎవరికీ కావాలి అంటే పేదవారికి కావాలి. మనము మనతోవున్న ఈ పేదవారికి సహాయము చేసినప్పుడు మనము వారికి కాకుండా దేవునికి చేస్తున్నాము అని మనము అర్ధం చేసుకోవాలి. కానీ, ఈ ధనవంతుడు తన పక్కనే వున్న పేదవాడైనటువంటి లాజరును పట్టించుకోకుండా సంతోషముగా భుజిస్తూ,జీవిస్తున్నాడు. కానీ చివరికి అతను మరణించిన తరువాత అదే లాజరు సహాయమును ఆర్జిస్తున్నాడు. కాబట్టి, మనజీవితములో కూడా మన తోటివారితో ఎప్పుడు అవసరము వస్తుందో మనకు తెలియదు. కాబట్టి మనము అటువంటి సమయములో మనతోటివారిని తిరస్కరించనట్లయితే మనంకూడా ఈనాడు చూస్తున్నటువంటి ధనికునివలె దేవుని యొక్క ప్రేమను కరుణను కోల్పోయి, మరణమును కొనితెచ్చుకొని నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి మనము మన పేదవానికి సహాయకులుగా ఉంటూ, దేవుని యొక్క ప్రేమనుపొంది ఆ ప్రేమలో ఐక్యమగునట్లు జీవంచుటకు ప్రార్ధిద్దాము.

పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు...