25, సెప్టెంబర్ 2021, శనివారం

26 వ సామాన్య ఆదివారం(3)

     26 వ సామాన్య ఆదివారం(3)   

క్రీస్తు నాధునియందు ప్రియమైన స్నేహితులారా, ఈ నాడు మనము ఇరవైఆరొవ సామాన్య ఆధివారంలోనికి ప్రవేశించియున్నాము .తల్లి శ్రీసభ మనకు ఇచిన్నటువంటి పఠనములను గ్రహించినట్లయితే, మొదటి పఠనములోతండ్రిఐన యావే దేవుడు తన ఆత్మను డెబ్భై మంది పెద్దలకు ఇచ్చుటను ఇచ్చినతరువాత వారు ప్రవచనములు పలుకునట్లును మనము చూస్తున్నాము. 
రెండవ పఠనములో చూచినట్లై ఐతే యాకోబు గారు భాగ్యవంతులను హెచ్చరించుటను దేవునివైపుకు ఆహ్వానించడాన్ని మనము చూస్తున్నాము.సువిశేష పఠనము మనము గ్రహించినట్లు ఐతే క్రీస్తుని అనుసరింపని ఒక్కడు, క్రీస్తు పేరా దయ్యములను పారద్రోలుటను వింటున్నాము. అదేవిధంగా ప్రభువైన క్రిస్తుమాటలను కూడా మనము  వింటున్నాము, అవి ఏమి మాటలు అంటే పాపమునుడి వైదొలగమని నరకములో పురుగు చావదు అగ్నిఆరదు అనే మాటలను  వింటున్నాము.
  
క్రిస్తునాధునియందు ప్రియమైన స్నేహితులారా పరిశుద్ధ గ్రంథ పఠనాల ద్వారా తండ్రి దేవుడు, మరియి కుమారుడైన క్రీస్తు, మరియు శిష్యుడును దైవభక్తుడును ఐన యాకోబుగారు, మనకు హెచ్చరికను తెలియ చేస్తున్నారు .ఆ హెచ్చరిక ఏమిటంటే పాపము చేయకు లోకమును అనుసరింపకు వీటిద్వారా దేవుని శిక్షకు గురికాకు అని మనలను హెచ్చరిస్తున్నారు. 
 
 ప్రియమైన దేవుని బిడ్డలారా ,మొదటి పఠనములో మనము చూస్తున్నాము మోషే ప్రవక్త యెహోషువ యొక్క అసూయను గమనించి ఆ ప్రజలకోసమై   దేవుని ఆత్మా కొరకు మాట్లాడటం .అసూయా అనేది కూడా పాపమే అసూయా వలన మనము ఇతరులను నిందిస్తాము, తక్కువ చూపు చూస్తాము వారు మంచిగావుంటే ఇష్టపడము మనకంటే తక్కువగా వుండాలని,మన అంతటివారు కాకూడాదని ,మనలా ఉండ కూడాదని  అసూయా పడతాము ఎందుకు అంటే వారు  మనకన్నా  ఒక గొప్ప స్థాయి లోఉండుటచే .ప్రియమైన స్నేహితులారా  అసూయా అనేది ఒక గోరమైన పాపం ఈ అసూయా వలన మోషే తన శిశుడైన యెహోషువను సరిచేయుటను మనం చూస్తున్నాం అసూయా అనే పదాన్ని గలతీయులకు రాసిన లేఖలో 5 వ ఆద్యం 20 వ వచనములో మనం చూస్తున్నాం అన్ని వర్గాలకు అడ్డా అసూయా ఒక సారీ దాని ఊబిలో పడితే జీవితం ఇక పతనమే.   అనూహ్యంగా  అసహ్యంగా మన నోటి వెంట  ఏమాట రాదు అసూయా   మనహృదయంలో నాటుకు పోతే తప్ప.

 నేడు సమాజములో వృత్తిలో కానీ  ఏరంగములోనైనా ఇది ఉంది అది లేదు అని చెప్పా వచ్చుగాని అసూయా లేదు అని చెప్పలేము.అసూయా అనేది చాల భయంకరమైనది ఎముకల్లో పుటిన  కుళ్ళు అని బైబిల్ గ్రంధం మనకుసెలవిస్తోంది .బైబిల్ లు చరిత్రలో   మొట్టమొతటి  హత్యా అసూయా వలననే జరిగింది (ఆది:4 :8 -9) అసూయకలిగిన కొందరువేక్తులను మనం గుర్తుచేకుందాం కాయిను అసూయా వలన తన తమ్ముడైన ఆబేలు మృతికి కారకుడై శిక్షకు గురయ్యాడు ,రాహేలు అసూయా చెందింది  తన అక్క లేయా గర్భము దాల్చుటవలన యేసేపు సోదరులు అసూయా చెందారు . అసూయా ఆయుషును తగ్గించును  (సామె:14 :౩౦) లో మనము చూస్తున్నాము ఇశ్రాయేలు పెద్దలు అహరోను మోషే సోదరి మిరియం మోషే మీద 
అసూయా పడ్డారు {సంఖ్య 12 }యువకుడైన దావీదుని చూసి ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు సౌలు అసూయపడ్డాడు .[1  సమువేలు 18 ]

 ఈనాటి మొదటి పఠనములో యెహోషువ ఇశ్రాయేలు డెబ్భై మంది పెద్దలలో ఇద్దరు పెద్దలైనా ఎల్దదు ,మేదాదు అను వారి పై అసూయా చెందటం మనము చుస్తున్నాము.[సంఖ్య 11 :29] లో చూస్తున్నాము .మోషే వృధాప్యంలో నాయకుడిగా తన కర్తవ్యాన్ని నెరవేర్చడం కష్టమైంది .అప్పుడు మోషే దేవునికి ప్రాదించి సహాయం అడిగినప్పుడు మోషేకి సహాయంగా డెబ్బది మంది పెద్దలను అనుకోని వారి సహాయంతో ప్రజలను నడిపించామన్నాడు ప్రభుఆవిధముగా మోషే డెబ్బది మంది పెద్దలను ఎన్నుకున్నాడు వారిని ప్రార్ధన గుడారములోనికి తీసుకోమనివెళ్ళి ప్రార్ధించాడు పవిత్రాత్మబలం వారిమీదికి దిగివచ్చింది.

ది తెలిసిన యెహోషువ మోషే దగ్గరికి వీళ్ళు వారిద్దరిమీద ఫిరియాదు చేస్తాడు వారిద్దరూ ప్రార్ధన గుడారములోనికి రాలేదు కాబ్బట్టి వారు ప్రవచనం చెప్పడానికి విలేద్దన్నాడక్రీస్తు నాధునియందు  ప్రియమైన స్నేహితులారా వారములనిచ్చువాడు ఒక దేవుడు పాలురకములైన వరములను కుమ్మరిస్తాడు అని {1 కొరింథీయులు12వ మద్యంలోచూస్తున్నాము}.ఆవిధముగానే డెబ్బదిమంది ప్రవచించే వరము కలిగియున్నారు .మొదటి పఠనములో మోషే అన్నటున్నారు దైవప్రజలందరు ప్రవక్తలుగా తయారుకావలెను ,వారి అందరియందు దేవుని ఆత్మ ఉండవలయును అని నా కోరిక అని [సంఖ్య 11 ;25 -29 ]అని పలికాడు.

అసూయా వలన పొందిన వారముఏదీలేదుగాని దేవునికి దూరమవుతాముప్రియామైన స్నేహితులారా మొదటిపఠనములో మనంచూసినట్లుగా ప్రభు ఆత్మ  ఆవహించినవారు ధన్యులు    దేవుని  సేవకులు వివిధ పరిచరియాలలో నిమగ్నమై వుంటారు .వారు ప్రవచనములు పలుకుతారు  అద్భుతకార్యములు చేస్తారు దుష్ట శక్తులను పారద్రోలుతారు  నిజమైన సేవకులు వారు ఏమి చేసిన అది దేవుని మహిమ కొరకు మాత్రమే చేస్తారు వరములను ఈచు దేవుడు ఒక దేవుడు పాలురకములైన వరములను పవిత్రాత్మచే ఇస్తాడు ప్రవచించే వారము,స్వస్థపరిచే వారము అర్ధము చేసుకునే వారము భాషలు మాట్లాడే వారము .{కొరింథీయులు 12 }లో చూస్తున్నాము ఈ విధముగా మొదటి పెద్దలకి ప్రవచించే వరాన్ని అనుగ్రహిచారు.

  ఈనాటి సువిశేషంలో క్రీస్తుప్రభుతో శిష్యుడైన యోహాన్ గారు అంటునారు మనలని అనుసరిపనివాడు మీ పేరిట దయ్యములను పారద్రోలుతున్నాడు అని అన్నారు ఇక్కడ శిష్యుని యొక్క అసూయను మనం చూస్తున్నాం.ప్రియా దేవుని బిడ్డలారా నిజానికి దుష్టాత్మలు  ప్రభుని నిజమైన నామానికి మాత్రమే భయ పడతాయి .పైన మొదటి పఠనములో మనము చూస్తున్నట్లుగా ,ప్రవచనాలు పలికేవారు దుష్టాత్మలను వెడలగొటేవారు  చాలా ప్రవిత్రముగా దేవునిలో అంట్టుగట్టబడి పరిశుద్ధమైన మలినంలేని జీవితం జీవిస్తారు ఈ శువిశేషములో దయ్యములను పారద్రోలువారుగూర్చిశిషులు అసూయా పాడగాప్రభు వారిని మందలించారు  గమినించవలిసిన విష్యం ఏమనగా ఆధ్యాత్మిక, సామజిక, సంగిక ,రాజకీయ ,మొదలైన వివిధ  రంగాలలో అసూయా అనేది సహజంగానే కనిపిస్తుంది .అయితే సహజంగా వ్యక్తులలో చోటుచేసుకున్న  దేవుని దృష్టిలో సహించరానిది.

     అందుకే ప్రభు అంటున్నారు  మీరు అసూయా పరులుకాగూడదు {రోమా :12 :11 } అంటూ బైబిల్ గ్రoదములో  సెలవిస్తున్నారు . అసూయా పడక  మంచిని అభివృదిని అభినందిస్తూ జీవించడం మంచి  క్రైస్తవుడు యొక్క లక్షణం గురుతించుకోవాలి .మన విరోధికానివాడు మన పక్షమున ఉండువాడు మార్కు శుభవార్త తొమ్మిదో వాద్యము నేలపై వచనంలో చూస్తున్నాము  మంచి చేయు ప్రతివాడు ప్రభువుతో ఉండును .ఆ వ్యక్తి వేరుగా ప్రభువును అనుసరించక పోయినప్పటికీ ప్రభువు అనుచరుడే.శిష్యులకు ప్రభువు  రెండు విషయాలను నేర్పించాడు .1 .శిష్యులకు ఇతరులకు మధ్యన గోడలునిర్మించరాదు .క్రీస్తు నామములో మంచికార్యాలను చేయు ప్రతివారినీ శిష్యులుగా స్వీకరించాలి 2 .శిష్యులు అసూయను ద్వేషమును జయించాలి సత్యాన్వేషణ చేయాలి .   

   దేవుని వాక్య ప్రకటన అనేది పవిత్రాత్మ వరం మనమందరం దేవుని ప్రవక్తలము కనుక దేవుని వాక్కుని ప్రకటించాలి .దైవ రాజ్య స్థాపనకై పాటుపడాలి .పవిత్రాత్మనందు  మనమందరము ఒకే సంఘము మనము దైవసంగము ,మనలోవున్న స్వార్ధని అసూయను ద్వేషాన్ని వీడి అందరితో సఖ్యతగా జీవించాలి ఇతరులను ఆలకించాలి అందరిని గౌరవించాలి కాబట్టి మనజీవిత ప్రయాణములో మార్పుచెందిన వారముగా జీవించాలి మంచిపనులు చేసే ప్రతిఒక్కరు కూడా దేవుని రాజ్యంలోకి అర్హులు. క్రైస్తవులమైన మనము అసూయా ద్వారా ఇతరులమనసులను ఇబ్బందిపెట్టకుండా ఐక్యత కల్గి ప్రేమతో ఆదరించాలి .నిన్ను నిన్నునీవు ప్రేమించినట్లు ని పొరుగువారికి కూడా ప్రేమించాలి. అదేవిధముగా పరలోక రాజ్యం చెర గొప్ప భాగ్యాన్ని దయచేయమని ఈ దివ్యబలిలో ప్రార్ధన చేసుకుందాము ఆమెన్ .


బ్రదర్ .మనోజ్ చౌటపల్లి ఓ .సి. డి


26వ సామాన్య ఆదివారము(2)

26వ సామాన్య ఆదివారము(2)

సంఖ్యా 11:25-29
యాకోబు 5: 1-6
మార్కు 9: 38-43, 45-46
ఈనాటి దివ్య పఠనములు దేవుని యొక్క సువార్తను ప్రకటించటానికి అందరు అర్హులే అనే అంశము గురించి భోదిస్తున్నాయి. అదేవిధముగా దేవుని యొక్క సువార్త ప్రకటించేటప్పుడు మనకు ఇతరుల గురించి అసూయ ఉండకూడదు అలాగే వారిపట్ల అసహనంగా ఉండకూడదు అనే అంశాల గురించి భోదిస్తున్నాయి. దేవుడు తన సేవకు ఎవరినైనా, ఎప్పుడైనా, ఏవిధముగానైనా ఉపయోగించుకుంటారు. తన మీద ఆధారపడి, తన సాన్నిధ్యము అనుభవించించి తన సేవ చేసే వారు ఎవరైనా తనకు ఇష్టమైన వారే. అందరికి దేవుని యొక్క ఆత్మ జ్ఞానస్నాము ద్వారా ఇవ్వబడినది. 
ఈనాటి మొదటి పఠనములో దేవుడు 70 మీద ఆత్మను కుమ్మరించే విధానమును చూస్తున్నాము. ఎందుకు ఇలా 70 మందిని ఎన్నుకున్నారు అంటే సంఖ్యా 11:  14వ వచనములో మోషే తన యొక్క భాధను వ్యక్తపరుస్తున్నారు. ప్రజల బాగోగులను పరామర్శించే భాద్యత తాను ఒక్కడే భరించలేనని, అందరికి పరిచర్య చేయుటకు కష్టముగా ఉంది కాబట్టి దేవుడిని అడుగుతున్నారు. దేవుడు ఎన్నుకునే వారందరు కూడా ఎలాంటి వారో 16 వ వచనంలో చూస్తున్నాము. వారు ప్రజలచేత గౌరవవింపబడేవారు, సమాజములో మంచి పేరున్నవారు, ప్రార్ధించేవారు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారు. దేవుని యొక్క అభిషేకము ఎంత గొప్పదో ఈరోజు మొదటి పఠనము ద్వారా వింటున్నాము. దేవుడు మోషేకు ఇచ్చిన పరిశుద్ధాత్మను కొంత తీసుకుని మిగతావారికి ఇస్తున్నారు. మోషే ప్రవక్త ఆత్మను స్వీకరించుట ద్వారా పొందిన శక్తులు:
నత్తివాడు అయినా ప్రవచించాడు 
అనేక లక్షల మందిని నడిపించగలిగాడు 
ఫరో ముందు ధైర్యముగా నిలబడ్డాడు
దేవునితో మాట్లాడాడు 
ప్రజలతో ప్రేమగా మెలిగాడు
అనేక అద్భుతాలు చేసాడు 
ఇవన్నీ మోషే దేవుని యొక్క ఆత్మను పొందిన తర్వాత చేసిన పనులే. మోషే డెబ్బది మందిని సమావేశము అవ్వమని చెప్పినప్పుడు అరవై ఎనిమిది మంది మాత్రమే గుడారము వద్ద సమావేశమయ్యారు. వారిలో ఇద్దరు ఎల్దాదు, మేదాదు శిబిరములోనే ఉన్నారు. అయినప్పటికీ వారు కూడా దేవుని యొక్క ఆత్మను పొందారు. ఎందుకంటే అది దేవుని చిత్తము, వారు కూడా ఎన్నుకొనబడినవారే. ఒక్కసారిగా ఆత్మను పొందినప్పుడు వారిలో జరిగిన మార్పు చాల గొప్పది. వెంటనే ప్రవచనాలు పలుకుచున్నారు. పాపులను పుణ్యాత్ములుగా చేస్తుంది దేవుని ఆత్మ. భయస్తులను భయము లేకుండా చేస్తుంది దేవుని ఆత్మ. ఏమిలేనటటువంటి వారిని దేవుని సేవలో గొప్పవారిగా చేస్తుంది దేవుని ఆత్మ.  1 కొరింతి 12 :28 - దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరమును దయచేసారు. యేసు ప్రభువు యొక్క శిష్యులు కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందిన వెంటనే ప్రవచించడము ప్రారంభించారు, భయము వదిలేశారు. అపో 2:8-
దేవుని కోసము మరణించడానికి సైతం సిద్దముగా ఉన్నారు.
దేవుని ఆత్మ వారిని నడిపించింది 
దేవుని ఆత్మ వారిని ప్రేరేపించింది 
దేవుని ఆత్మ వారితో మాట్లాడించింది 
దేవుని ఆత్మ వారితో అద్భుతాలు చేయించింది 
దేవుని ఆత్మ వారితో పరలోక విషయాలు బోధించింది
ఈ యొక్క ఆత్మను మనమందరము మన జీవితములో జ్ఞానస్నానము ద్వారా, భద్రమైన అభ్యంగనము ద్వారా, గురుపట్టాభిషేకము ద్వారా కలిగి ఉన్నాము, కాబట్టి మనము కూడా ప్రవచించాలి. వీరు దేవుని యొక్క ఆత్మను పొందినది వారి కోసము కాదు, పరుల కోసము. ఇరుగుపొరుగువారికి సేవచేయడము కోసము. పొరుగు వారిని పరామర్శించటము కోసము, వారిని సన్మార్గములో నడిపించడము కోసము. ఈ డెబ్బది మంది ఎన్నుకొనబడినది దేవుని ప్రతినిధులుగా ఉండటం కోసమే. మోషే తనకు భారముగా ఉందని చెప్పినప్పుడు తన భారము తగ్గించుటకు అలాగే ఇతరులు కూడా దేవుని సేవకు వినియోగించబడాలని ప్రభువు ఇలా చేసారు. ఇద్దరు గుడారములోనే ఉన్నారు. అయితే ఇక్కడ వారు ఎట్టి పరిస్థితులలో రాలేదో వివరించలేదు, బహుశా అనారోగ్యముతో ఉండవచ్చు లేదా ఇంకేదైనా అయ్యి ఉండవచ్చు దేవుడు వారిని ఎన్నుకొన్నారు. అప్పుడు వెంటనే బలవంతులగుచున్నారు. అది దేవుని యొక్క ఆత్మ శక్తి.
తన మీద ఉన్న ప్రేమ చేత యెహోషువ అసూయపడి మోషేతో ఎల్దాదు, మేదాదు అనువారిని ప్రవచించటము ఆపివేయమని చెప్పారు. ఇది కేవలము అసూయ వల్ల జరిగినది. దేవుని యొక్క అనుగ్రహము ప్రతి ఒక్కరికి ఉంటుందని యేసు ప్రభువు వలె మోషేకు కూడా తెలుసు. దేవుడు మనలను ఎన్నుకున్నది, దీవించినది కేవలము మన కోసమే కాదు, ఇతరుల కోసము కూడా.  దేవునిపై ఎవరికీ హక్కు లేదు, అలాగే ఏ ఒక్కరి ద్వారానో లేక ఏ ఒక్క ప్రజ ద్వారానో మాత్రమే పనిచేయాలని కట్టడి దేవునిపై ఉండదు. అందరు సువార్త ప్రచారము చేస్తే దేవుని రాజ్యము సులువుగా ఉంటుందని చెబుతున్నారు. 
రెండవ పఠనములో యాకోబు గారు ధనవంతులందరిని హెచ్చరిస్తున్నారు. ధనవంతులు పేదవారి పట్ల న్యాయముగా ఉండాలని తెలియజేస్తుంది ఈనాటి రెండవ పఠనము. ధనికుడు పేదవాని యొక్క శ్రమను వినియోగించుకుని ధనము కూడబెట్టుకుంటున్నాడు. ఆ పేదవాని యొక్క ఆక్రందన దేవుని చేరుతుంది. బంగారము వెండి తుప్పు పట్టే వస్తువులు కావు. అయినా యాకోబు గారు తుప్పు పడతాయి అంటున్నారు. అంటే ధనికులు సంపాదించే బంగారము, వెండి అశాశ్వితమైనవి. దేవుని దృష్టిలో అవి నిరుపయోగము. అలాంటి పాడయ్యే వస్తువులకు ప్రాధాన్యత ఇచ్చి పేదలను నిలువు దోపిడీ చేస్తే దేవుని శిక్షకు గురవుతారు అని తెలుపుచున్నారు. దేవుడు ఇచ్చిన ధనముతో పేదలకు సహాయము చేసి ఆదుకోవాలి. యేసు ప్రభువు కూడా పేదవారి పట్ల ప్రేమతో మెలిగారు.
    ఈనాటి సువిశేష పఠనములో యేసు ప్రభువు యొక్క శిష్యులలో భాగస్థుడు కాని ఒక వ్యక్తి సేవను శిష్యులు నిషేదించిన విధానము గురించి వింటున్నాము. అపొస్తలులు దేవుని యొక్క రాజ్య వ్యాప్తి, దేవుని ప్రేమను పంచుట వారికి మాత్రమే పరిమితమైనది భావించారు. వాక్యాన్ని ప్రకటించడానికి, దయ్యాలు వెడలగొట్టడానికి వారికి మాత్రమే అధికారము ఇవ్వబడినది అని భావించారు. కానీ ఇక్కడ యేసు ప్రభువు తనతో, తన కొరకు జీవించే ఏ వ్యక్తి అయినా సువార్త ప్రకటన చేయవచ్చు అని తేటతెల్లము చేస్తున్నారు. యోహాను గారు అసూయపడుచున్నారు దేవుని మీద ఉన్న ప్రేమ వలన. మొదటి పఠనములో మోషే ప్రేమించిన శిష్యుడు అలాగే అసూయపడ్డాడు. అదేవిధముగా సువిశేషములో యేసు ప్రేమించిన శిష్యుడు కూడా అసూయపడ్డాడు. ఈ సువార్త ప్రకటన చేసే వ్యక్తిని మనము అభినందించాలి. అయన విన్నది, చూసినది, తెలుసుకున్నది నలుగురితో పంచుకుంటున్నాడు. దేవుని యందు విశ్వాసము కలిగి ఉంటున్నాడు. దేవునిచే ప్రేరేపించబడ్డాడు. దేవుడు ఆయనను ప్రత్యేకముగా ఆ పనికోసం పిలవలేదు. అయినప్పటికీ యేసు ప్రభువు గొప్పతనము తెలియాలని, దేవుని రాజ్యస్థాపన జరగాలని తపనతో అయన ఈ సువార్త వ్యాప్తి కోసము కష్టపడ్డారు. ఈరోజు ప్రతిఒక్కరు కూడ చేయవలసినది ఇదే . దేవుని యొక్క నామమును చాటిచెప్పాలి. ఆయన గురించి భోదించాలి. ఈ వ్యక్తికి దేవుని భోదించాలి అనే ఘాడమైన కోరిక ఉంది ఉండవచ్చు. 
    దేవుని యొక్క సేవకులను గుర్తించి సహాయము చేస్తే వారికి బహుమానము దొరుకుతుందని చెబుతున్నారు. ఇది చాల సందర్భాలలో చూస్తున్నాము. ఆనాడు అబ్రహాము ముగ్గురు మనుజులను గుర్తించి వారికి సేవ చేసారు., ఆయన దీవించబడ్డాడు (ఆది 18:1-2). ఎలీషాకు షూనేము పట్టణములో ఉన్న సంపన్నురాలు వారికి ఆతిథ్యము ఇచ్చింది దేవుడు ఆమెను దీవించారు. (2రాజుల 4: 8,17) పేతురు ఆతిధ్యము ఇచ్చారు, ఆయన అత్త స్వస్థత పొందినది. ఏలీయాకు సహాయము చేసిన వితంతువు దీవించబడినది. అలాగే మనము కూడా దైవ సేవకులను ఎంతగా ఆదరిస్తే వారు అంతగా మనందరి కోసము ప్రార్థిస్తారు. కాబట్టి దైవ సేవకులకు సహాయము చేయమని ప్రభువు పలుకుతున్నారు. సువిశేష రెండవ భాగములో మనము ఇతరులు పాపము చేయుటకు కారణముగా ఉండకూడదు అని తెలుపుచున్నారు. ఇతరులు మన వల్ల పాపము చేయకూడదు. అసహనం, అసూయవల్ల ఎవరు చిన్నబిడ్డలకు దుర్మాత్రుకగా మారకూడదు. ఇక్కడ చిన్నబిడ్డలంటే చిన్న పిల్లలు కావచ్చు లేదా విశ్వాసపరముగా ప్రారంభ దశలో ఉన్నవారు కావచ్చు, లేదా విశ్వాసములో బలహీనంగా ఉన్నవారు కావచ్చు. ప్రభువు యొక్క ఉద్దేశమేమిటంటే విశ్వాసపరముగా గుర్తింపు ఉన్న పెద్దలు అప్పుడే కొత్తగా విశ్వాసము స్వీకరించి అభివృద్ధి చెందుతున్న వారికి కొన్నిసార్లు పాత విశ్వాసుల దురలవాట్ల వల్ల కొత్తవారి యొక్క ఎదుగుదల ఆటంకంగా మారే  ప్రమాదం ఉందని ప్రభువు తెలుపుచున్నారు.  చాల సందర్భాలలో కొంతమంది ఇతరులను పాపము చేయుటకు ప్రేరేపిస్తారు: 
తల్లిదండ్రులు కావచ్చు
స్నేహితులు కావచ్చు
పెద్దవారు కావచ్చు
ప్రేయసి ప్రియుడు కావచ్చు
    ప్రభువు అంటున్నారు, నీ చేయి నీకు పాప కారణమైనచో దానిని పెరికివేయమని. చేతుల ద్వారా చేసే పాపము - తాకుట, పట్టుకోవడము, లాగుకోవటం, వ్రేలెత్తి చూపుట, కొట్టుట, దొంగిలించుట. మన చేతులతో పాపము చేయుటకన్నా, పాపము చేయకుండా జీవించుటయే మేలు అని చెబుతున్నారు. కళ్ళతో చేసే పాపము - పాపము చేసే స్థలములో ఉండటం ద్వారా, పాపము చేయటానికి వెళ్ళడము ద్వారా, తన్నుట ద్వారా ఇలా మనము పాపము చేస్తాము. ఇలాగ కాళ్ళుండి పాపము చేయుటకన్నా మాములుగా మంచి జీవితము జీవిస్తూ పరలోకము చేరమని ప్రభువు తెలుపుచున్నారు. అలాగే కంటితో చేసే పాపాలు - చూడటము ద్వారా, చూడకూడనటువంటివి చూడటము ద్వారానే మనలో ఆశ కలుగుతుంది. ఈ లోక ఆశలకు గురియై పాపము చేస్తాము కాబట్టి మన యొక్క దేవుడు ఇచ్చిన ప్రతి యొక్క అవయవమును పాపము చేయుటకు కాకా పుణ్యము చేయుటకు వినియోగించాలి. మనమందరము ఆత్మచే నింపబడ్డాము, కాబట్టి దేవుని సేవ చేస్తూ దేవుని రాజ్య స్థాపన కోసము కృషి చేద్దాము. 
ఆమెన్.......... 
By Rev.Fr. BalaYesu OCD

18, సెప్టెంబర్ 2021, శనివారం

25 వ సామాన్య ఆదివారము (౩ )

 25 వ సామాన్య ఆదివారము (౩ )

నేటి దివ్య పఠనాలు దేవుని దృష్టిలో గొప్పవారిగా ఉండటానికి దేవుని చిత్తము నెరవేర్చుతూ యేసు క్రీస్తు వలె మనమందరము సేవాభావం కలిగి జీవించాలని బోధిస్తున్నాయి. ధనము, అధికారము, పేరు ప్రతిష్టలను సంపాదించుకుని గొప్పవ్యక్తిగా గుర్తింపుపొందటం కాదు నిజమైన గొప్పతనము. కానీ సేవ చేస్తూ గొప్పవారిగా దేవుని చేత పరిగణించబడాలని నేటి పఠణములు మనకు తెలియపరుస్తున్నాయి. దానికి మనకు పరలోక జ్ఞానము అవసరమని తెలియపరుస్తున్నాయి నాటి పఠనములు.

 ఈనాటి మొదటి పఠనములో నీతిమంతమైన మార్గమును  ఎంచుకుని జీవించమని గ్రంథ రచయిత పలుకుచున్నారు. నీతిమంతుడంటే పడనటువంటి వ్యక్తులు దుష్టులు ఉన్నారు. వారి యొక్క మూర్ఖ బుద్ధి వలన నీతిమంతుని యొక్క మంచితనమును, సేవాభావమును అర్ధము చేసికొనక అయన పీడను వదిలిచుకోవాలనుకుంటున్నారు. దుష్టులు దైవ భయము లేనివారు, దేవుని నియమాలు కానీ చట్టాలు కానీ పాటించని వారు.  ఆయనను ఎందుకు చంపాలనుకుంటున్నారు అంటే, అయన యొక్క కార్యాలు వారికి గిట్టుటలేదు, వారి యొక్క ఆనందాలకు అడ్డుగా ఉంటున్నారు. మాటలు యేసు ప్రభువు యొక్క జీవితానికి అక్షరాలా సరిపోతాయి. అలాగే దేవుని హెచ్చరికను గుర్తు చేసి శ్రమలు పొందిన ప్రతి ప్రవక్తకు వర్తిస్తాయి. అయన యొక్క సేవ కార్యాలు గిట్టనటువంటి వారే ఆయనను  శిక్షకు గురిచేసారు.

ఇది అసూయ వల్ల జరగవచ్చు లేక కోపము, పగ, స్వార్ధము వల్లనైనా అయ్యుండవచ్చు. నీతిమంతునికి మన కార్యాలు నచ్చుటలేదు. ఎందుకంటే దుష్టులు దేవుణ్ణి తెలుసుకొనక ఇంకా పాపములోనే జీవిస్తూ దేవునికి దూరముగా ఉంటున్నారు. అసత్య బోధనలు చేస్తున్నారు, అన్యాయముగా పేదలను దోచుకుంటున్నారు, నీతిమంతముగా జీవించుటలేదు. అందుకే నీతిమంతుడు వారిని హెచ్చరిస్తున్నారు. దానివలననే ఆయనను శిక్షించాలనుకుంటున్నారు. బాప్తిస్మ యోహాను గారు కూడా ఆనాటి హేరోదును, హేరోదియాను హెచ్చరించాడు. అది సహించలేక హేరోదియ అయన ప్రాణము తీసింది. ఇంకొక విషయము ఏమిటంటే దుష్టులు సాక్షాత్తు దేవునికే ఒక పరీక్ష పెడుతున్నారు. ఏమని అంటే నీతిమంతుడిని దేవుడు కాపాడుతారా లేదా అని పలుకుచున్నారు. ఇది మొత్తము యేసు ప్రభుని జీవితములో జరిగిన యధార్థ సంఘటన. ఆయనను హింసించారు, అవమానించారు, పరీక్షించారు, చావుకు గురిచేసారు. చివరికి మూడవనాడు తాను నమ్ముకున్న తండ్రి ఆయనకు పునరుత్తానము దయచేసారు. తండ్రి తన కుమారుని పట్ల చేసిన గొప్ప కార్యము ఇది.

ఈనాటి రెండవ పఠనములో యాకోబు గారు పరలోక జ్ఞానమునకు, భూలోక జ్ఞనమునకు ఉన్న వ్యత్యాసము గురించి తెలియపరుస్తున్నారు. రెండు రకాల వివేకాలు అందరిలోనూ కనిపిస్తాయి, సంఘములలో కూడా ప్రతిబింబిస్తున్నాయి.

కోరికలు లౌకిక జ్ఞానమునకు సంబంధిచినవి. పరలోక జ్ఞానము వల్ల మనమందరము ప్రేమతో జీవిస్తాము, స్నేహపూర్వకంగా ఒకరితో ఒకరు మెలుగుతాము. వినయముతో ఉంటాము. అధికార వాంఛలకు వెళ్లము. మనము కొన్ని సార్లు ప్రార్ధించినప్పుడు అవి మనము పొందలేము. ఎందుకంటే అవి దేవుని ప్రణాళికలకు వ్యతిరేకముగా ఉంటాయి కాబట్టి. మనము అడిగే ప్రతి వరము కూడా దేవుణ్ణి మహిమ పరిచే విధముగా ఉండాలి. దేవుని చిత్తము నెరవేర్చే లాగా ఉండాలి. మనము పొందే ఆరోగ్యము వల్ల, వస్తువుల వల్ల, భోజనము వలన, వస్త్రముల వలన మనము దేవునికి దగ్గరగా రావాలి. వాటి ద్వారా దేవుణ్ణి స్తుతించి మహిమ పరిస్తే అప్పుడు దేవుడు మన ప్రార్ధన తొందరగా ఆలకిస్తారు.  లౌకిక జ్ఞానము వలన కలిగిన శారీరక కోరికలు, వ్యామోహములు మనలను మంచి జీవితము నుండి గాడి తప్పిస్తాయి.

సువిశేష పఠనములో యేసు ప్రభువు మరొకసారి తన మరణ ప్రస్తావన తీసుకువస్తున్నారు. తన మరణము గురించి భోదిస్తూ యేసు ప్రభువు తన యొక్క శిష్యులలో అణుకువ, సేవాభావం ఉండాలని బోధిస్తున్నారు. యేసు ప్రభువు తన యొక్క మరణము గురించి చెప్పినప్పుడు శిష్యులలో ఇహలోక కోరికలు మొదలయ్యాయి. యేసు ప్రభువు తరువాత నాయకత్వ భాద్యతలు ఎవరు స్వీకరించాలి. ఎవరు ప్రభువు యొక్క ప్రజలను నడిపించాలని వారి యొక్క ఆలోచనలు, కోరికలు.   శిష్యులు కూడా ఆశతో ఉన్నారు దేవుని రాజ్యము స్థాపించినప్పుడు వారి యొక్క స్థానములు ఎలా ఉంటాయో అని. మత్తయి 19:23-24 .

శిష్యులలో ఎవరు గొప్ప అని చర్చ వచ్చింది ఎందుకంటే వారందరికీ కూడా -ఒక గుర్తింపు కావాలి-ఆదికారం కావాలి, -ధనం కావాలి ,గౌరవం కావాలి ,ఆత్మ సంతృప్తి కావాలి.

మనము కూడా మన కుటుంబములో ఉన్నవారు మరణించేటప్పుడు, తరువాత ఎవరు కుటుంబ బాధ్యతలు స్వీకరించాలని ఆలోచిస్తారు. అలాగే  శిష్యులు కూడా ఆలోచించారు. అప్పటివరకు  యేసు ప్రభువు శిష్యులుగా  ఉండాలంటే , యేసు ప్రభువు సీలువను ఎత్తుకొని  నన్ను  అనుసరించాలన్నారు, అన్నీ వదలి వేసి తనను వెంబడించాలని చెప్పారు కానీ  ఆయన తన  మరణం గురించి చెప్పిన తరువాత శిష్యుల ఆశలు , ఆశయాలు మారుతున్నాయి. అది చూసిన గురువు యొక్క హృదయము ఎంతగా తల్లడిల్లి ఉంటుందో  ఊహించాలి. శిష్యులు ఎవరు గొప్ప అని వారు వాదించుకునేది  వారి యొక్క వ్యక్తిత్వం గురించి కాదు, క్వాలిటీ గురించి కాదు కానీ డబ్బులు గురించి , అధికారము గురించి , పేరు గురించి. దేవుని యొక్క రాజ్య స్థాపనలో వారి యొక్క గొప్ప గొప్ప స్థానాల గురించి ఆలోచనలే.  శిష్యులు ముఖ్యముగా ముగ్గురు వ్యక్తులను చూస్తున్నారు, పేతురు , యోహను , యొకోబు  వీరు ముగ్గురు కూడా ప్రత్యేకం ఎందుకంటే యేసు ప్రభువు చేత ప్రత్యేకంగా గౌరవించబడినవారు.

అందుకే మీగతవారు అసూయతో ఎవరు గొప్ప అని ఆలోచించారు. యేసు  ప్రభువు నిజమైన  గొప్పతనము  అంటే సేవ చేయటము అని శిష్యులకు తెలియ పరిచారు. పర లోక జ్ఞానం  కలిగిన వారికి  ఇలాంటి  హృదయము ఉంటుంది. వాషింగ్టన్  ఇర్విన్ అనే  రచయిత  ఒకసారి ఇలా వ్రాశాడు. గొప్ప  మనస్సు గల  వారికి  లక్ష్యాలుంటాయి , చిన్న మనస్సు కలవారికి  కొరికలుంటాయి.  యేసు ప్రభువు  శిష్యుల మనస్సు చిన్నది కాబట్టియే  వారికి కోరికలు ఎక్కువగా ఉన్నాయి. ఆయన ప్రక్కన గొప్ప స్థానాన్ని ఆశించారు. ప్రభువు దృష్టిలో  గొప్పతననికి వేరొక అర్దము ఉంది.  అణకువతో , ప్రేమతో సేవలు చేసేవారే ఆయన దృష్టిలో  గొప్పవారు, అందుకే ప్రధమ స్థానం ఆశించేవారు అందరికీ  ముందుగా సేవకుడిగా ఉండాలని తెలియపరిచారు. ఇతరుల యొక్క అవసరతలను గుర్తించి వారికి సేవ చేస్తే అందులో నిజమైన గొప్పతనం ఇమిడి ఉంది. మదర్ తెరాసా గారు గొప్ప వ్యక్తిగా పిలువబడినది ఎందుకంటే ఆమె సేవ చేసినది కాబట్టి.  ఆమె ఆదికారం కోసం , పేరుకోసం వేదకలేదు. అవసరంలో ఉన్న వారికి సేవ చేసింది అందుకే ఆమెను మనం గొప్ప వ్యక్తిగా పిలుస్తున్నాం. యేసు ప్రభువు కూడా తాను  తనను తాను తగ్గించుకొని సేవకరూపం దాల్చి శిష్యుల యొక్క పాదాలు కడిగారు. ఆయన ఆస్తులు కావాలనుకోలేదు. పుట్టినప్పుడు మంచి ఇల్లు ఆశించలేదు.  ఆధికారము ఆశించలేదు. పేరు ఆశించలేదు. ఇవేమీ ఆశించకుండా  మనందరి అవసరాలనుబట్టి సేవ చేశారు. 

మనం కూడా దేవుని దృష్టిలో గొప్ప వారిగా ఉండాలంటే  లోక అధికార, ఆశలు వదలిపెట్టి  దేవుని సేవ చేయాలి.  కొన్ని సార్లు దేవుని సేవ  చేసేవారు   కూడా స్థానాలకోసం , ఆధికారం కోసం ఎక్కువగా ప్రయత్నిస్తారు. ఇది వ్యర్ధము . మనమందరము సేవకుని మనస్సు కలిగి ఉండాలి. సేవకుడు సేవకు మాత్రమే ఎన్నుకోబడినవాడు,మనము కూడా దేవుని సేవ చేయడానికి మాత్రమే పిలువబడ్డాము. ప్రభువు ఇంకొక చక్కని ఉదాహరణ ఇస్తున్నారు. ఒక చిన్న పిల్లవాడిని తీసుకొని గొప్పవారు కాదలచిన వారు  చిన్న బిడ్డను తీసుకొని ఇట్టి చిన్న బిడ్డలలో ఒకరిని స్వీకరించువాడు నన్ను స్వీకరించువాడగును అని పలికారు. చిన్న పిల్లవాడిని స్వీకరించుట అంటే ఆయనలో ఉన్న గుణాలను స్వీకరించుట అని అర్దము. 

-చిన్న పిల్లలకు అధికార  వ్యామోహము ఉండదు. 

-చిన్న పిల్లలు నిర్మలమైన మనస్సు కలిగి జీవిస్తారు. 

-వారిలో వినయము ఉంటుంది. 

-సంఘములో చిన్న పిల్లవాడికి  ఎటువంటి అధికారం ఉండదు, పేరు కూడా ఉండదు, ఆయన ఎప్పుడు కూడా తల్లిదండ్రుల మీదనే ఆధారపడి జీవిస్తాడు. చిన్న పిల్లలకు సంఘములో ఎటువంటి హోదా ఉండదు. కాబట్టి శిష్యులు అలాంటి మనస్సు కలిగి జీవించాలి. 

1. చిన్న పిల్లలను ఆహ్వానించుటలో మనకు వినయము ఉండాలి. ఎందుకంటే పెద్దవారికి నేర్పించుట సులభమే కానీ పిల్లలకు  అన్నీ a to z వరకు మొత్తము నేర్పించాలంటే  నిజంగా  ప్రతి ఒక్కరి లో వినయము ఉండాలి. 

2. పిల్లల్ని ఆహ్వానించుటలో మనకు ధైర్యం ఉండాలి.  చిన్న పిల్లల భాద్యత చాలా గొప్పది, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి రిస్క్ తీసుకోవడానికైనా సిద్దముగా ఉండాలి. 

3. పిల్లల్ని ఆహ్వానించుటలో మనకు నమ్మకం ఉండాలి. -చిన్న పిల్లవాడు ఎదుగుతాడు , మంచివాడిగా మారతాడు, నేర్చుకుంటాడు, ప్రేమిస్తాడు , అనే నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉండాలి. 

4. చిన్న పిల్లల్ని ఆహ్వానించుటలో సహనం ఉండాలి- పిల్లలకు నేర్పించేటప్పుడు సహనం కోల్పోతే ఏమి చేయలేము. కొన్ని సార్లు నెమ్మదిగా ఉండవచ్చు అయినప్పటికీ నేర్పించేవారు సహనముతో  ఉండాలి. 

5. చిన్న పిల్లల్ని ఆహ్వానించుటలో క్షమ ఉండాలి- అనేక సార్లు పిల్లలు మాట వినకపోవచ్చు అయితే క్షమించాలి. చేసిన తప్పు పదే పదే చేయవచ్చు. అనేక సార్లు పడిపోవచ్చు అయినప్పటికీ క్షమించి జీవించాలి. 

ఒక నీతిమంతుడైన సేవకుడిగా ఇవన్నీ మన జీవితములో పాటిస్తే  దేవుని దృష్టిలో గొప్పవానిగా పరిగణించబడతాము. 

By  Rev Fr. Bala Yesu OCD

 

11వ సామాన్య ఆదివారం

11వ సామాన్య ఆదివారం  యెహెజ్కేలు17:22-24, 1 కొరింతి 5:6-10, మార్కు 4:26-34 ఈనాటి పరిశుద్ధ గ్రంధ పఠణములు దేవుని యొక్క రాజ్య విస్తరణ గురించి బో...