26, నవంబర్ 2022, శనివారం

ఆగమనకాలం - మొదటి ఆదివారం

 

ఆగమనకాలం - మొదటి ఆదివారం 

యెషయా 2:1-5

రోమి 13:11-14

మత్తయి 24:37-44

ఈనాటి ఆదివారంతో మనం దైవార్చనలో ఒక కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తున్నాము. ఈరోజుతో మనం ఆగమన కాలంలో ప్రవేచించి యున్నాము. 

ఈ యొక్క ఆగమన కాలంలో దివ్య గ్రంథ పఠనాలు మనకు బోధించే అంశం ఏమిటంటే మనందరం ప్రభువు యొక్క రాకడ కోసం సంసిద్ధంగా ఉండుట.

ఈనాటి దివ్యగ్రంధ పట్టణాలు ప్రభువు యొక్క రాకడ గురించి బోధిస్తున్నాయి.

ప్రభు యొక్క రాకడ మూడు విధాలుగా ఉంటుంది:

1. ఏసుప్రభు ఈ లోకంలో మానవ మాతృనిగా జన్మించిన విధానం ఆయన యొక్క మొదటి రాకడను సూచిస్తుంది.

2. దివ్యసత్ప్రసాద స్వీకరణ ద్వారా ఏసుప్రభు మన యొక్క హృదయంలోనికి వస్తున్నారు. అదే విధంగా దివ్య సంస్కారాల స్వీకరణ ద్వారా కూడా ప్రభువు యొక్క రాకడ జరుగుతుంది.

3. ప్రభు యొక్క రెండవ రాకడ ద్వారా ఆయన మరలా మన మధ్యకు వస్తారు. మనందరి గురించి తీర్పు చేయుటకు ప్రభువు రెండవసారి రాబోతున్నారు అప్పుడు ఆయన మంచివారిని రక్షిస్తాడు, చెడ్డవారిని శిక్షిస్తారు.

మనం ప్రభువు యొక్క రాకడకు సంసిద్ధంగా ఉండాలి. ఆయన యొక్క రెండవ రాకడ జరిగే సమయంలో మన యొక్క జీవితంలో పవిత్రత కలిగి ఉండాలి. ఆయన యొక్క రెండవ రాకడ సమయం లో మన యొక్క మాటల్లో, ఆలోచనలో, పనులలో పవిత్రత కలిగి ఉండాలి.

ఈనాటి మొదటి పఠనంలో యెషయా ప్రవక్త చూసిన దర్శనం గురించి తెలుపుచున్నారు. యూదాయేరుషలేము భవిష్యత్తు గురించి తెలిపారు. ప్రవక్త చూసిన దర్శనంలో అన్ని దేశములు, సకల జాతుల ప్రజలు సీయోను పర్వతము వద్ద దేవుని చెంతకు వస్తారు సకల జాతుల ప్రజలు సీయోను పర్వతంను దర్శిస్తారు.

యెషయా ప్రవక్త తన యొక్క దర్శనంలో రాబోయే రోజుల్లో దేవుడు ఏ విధంగా అందరి మధ్య తన యొక్క ఒడంబడికను ఏర్పరచుకుంటున్నారో తెలుపుచున్నారు. కేవలం ఇశ్రాయేలు ప్రజలతో మాత్రమే కాకుండా సకల జాతుల ప్రజలు దేవుని బిడ్డలు అవుతారు. అదే విధంగా యేరుషలేము దేవాలయం అందరి దేవాలయముకును, అందరూ యేరుషలేము దేవాలయంలో ప్రభువును ఆరాధిస్తారు అని ప్రవక్త తెలుపుచున్నారు.

సకల జాతి జనులు ఒకే దేవుడిని విశ్వసించి, ఆరాధించి జీవించుట ద్వారా అందరూ కూడా శాంతియుతంగా ఉంటారని యెషయా ప్రవక్త తెలుపుచున్నారు.

కడవరి దినములలో అందరూ యావే దేవుడు సజీవుడని తెలుసుకుంటారు, అదేవిధంగా ఆయన చెంతకు వచ్చి ఆరాధిస్తారు.

క్రీస్తుపూర్వం 8వ శతాబ్దంలో దేవుని ప్రజలు రెండు రాజ్యాలుగా విడిపోయారు. ఉత్తర రాజ్య ఇశ్రాయేలు, దక్షిణాన యూదా  రెండుగా విభజించబడ్డాయి.

ఇశ్రాయేలు ప్రజలు అస్సిరియుల క్రింద బానిసత్వంలో మగ్గిపోయారు అలాగే యూదాలోని ప్రజలు బాబిలోనియా బానిసత్వంలో జీవించారు.

ఈ విధంగా బానిసత్వంలో ఉన్నప్పటికీని, రెండు రాజ్యాలుగా విభజింపబడినప్పటికిని కడవరి దినమున అందరూ ఐక్యమై జీవిస్తారని ప్రవక్త పలుకుచున్నారు. ఎప్పుడూ అని ప్రవక్త సమయం గురించి తెలుపుట లేదు కానీ కడవరి దినమున అని తెలుపుచున్నారు (పేతురు 1:10-11).

యాకోబు దేవాలయమున అందరూ సమావేశం అవుతున్నారు అని ప్రవక్త చూసిన దర్శనంలో పలుకుచున్నారు (యెషయా 2:3) యేరుషలేముకు అందరూ ఆకర్షించబడతారు - యెషయా 14:1,27:13,66:23 దేవుని యొక్క పర్వతము వద్ద ధర్మ శాస్త్రము బోధించబడుతుంది. ఆయన యొక్క సన్నిధి మానవులకు సూచనలు ఇచ్చే స్థలం (దానియేలు 2:35, ఆమోసు 4:1).

ప్రభువు మందిరమున ఆయన మార్గములు తెలియచేయబడును కాబట్టి ఆయన మాటలు బట్టి నడుచుకోవచ్చు. ఎన్నుకొనబడిన ప్రజలు తమ యొక్క అవిశ్వాసనీయత వలన దేవునికి విరుద్ధంగా జీవించారు, ఆయన యొక్క వడంబటికకు అవిధేయులై ఉన్నారు దాని ఫలితంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు, ప్రేమ కోల్పోయారు. ఇప్పుడు యెరూషలేములో ప్రభువు మాటలు బోధించుట ద్వారా ఆయన బాటలో నడిచి విధేయులై జీవించవచ్చని ప్రవక్త తెలుపుచున్నారు.

సక్రమంగా జీవించుటకు దేవుని యొక్క సూచనలు ఇవ్వబడతాయి. దేవుని యొక్క త్రోవలో నడిస్తే అందరికీ లాభమే అది సక్రమమైన మార్గము మనలను జీవమునకు నడిపించు మార్గము.

యెషయా ప్రవక్త తన యొక్క గ్రంథంలో యూదాకు, ఎరుషలేముకు చాలా ప్రాముఖ్యతను ఇచ్చారు.

ఎందుకంటే అవి దేవుని యొక్క నివాస స్థలాలు కాబట్టి. మరీ ముఖ్యంగా యేరుషలేము అక్కడ దేవుడు ఉంటారు దేవుని ఆలయం నిర్మించబడినది కాబట్టి. ఎరుషలేము, యూదా ప్రాంతాల గురించి పదే పదే తెలిపారు యెషయా 11:9, 25:5-7, 27:13, 30:29,57:13, 65:11, 66:20.

అన్నిసార్లు ఎందుకు ప్రవక్త ఎరుషలేము గురించి చెప్పారంటే దేవుడు తన యొక్క ఒడంబడికకు విధేయుడై ఉంటాడని తెలుపుటకు అదే విధంగా తన యొక్క ప్రజలను ఎల్లప్పుడూ ప్రభువు రక్షిస్తాడని తెలియచేయుటకు ప్రవక్త ఈ విధంగా అనేకసార్లు యేరుషలేము నగరం, సీయోను పర్వతం గురించి తెలిపారు.

ఎన్నుకొనబడిన ప్రజలు ఎంత మాత్రం అవిధేయులై అయినప్పటికీ దేవుడు మాత్రం వారిని రక్షిస్తాడు అంతటి గొప్ప దేవుడని తెలియచేయుటకు యెషయా ప్రవక్త ఈ విధంగా తెలిపారు.

ఈ మొదటి పఠనం చివరి వచనాలలో ప్రభువు అందరి సమస్యలు పరిష్కరిస్తారు అని తెలుపుచున్నారు అందరూ కూడా శాంతియుతంగా కలిసిమెలిసి జీవిస్తారు అని ప్రభువు తెలియజేస్తున్నారు. ప్రజల మధ్య ఇక విభేదాలు ఉండవు ఒక జాతి మరియొక జాతి మీద కత్తిదూయదు ఎటువంటి యుధాలూ  ఉండవు కేవలం వారి మధ్య శాంతి సమాధానాలు ఉంటాయి అని ప్రభువు ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నారు.

శాంతి కేవలం ప్రభువు ప్రసాదించే వరం. తన యొక్క సాన్నిద్యం ద్వారా అందరిని శాంతియుతంగా జీవంప చేస్తారు.

ప్రభువు యూదాతోపాటు అన్ని దేశములను ప్రేమిస్తారు అని కూడా ప్రవక్త తెలియజేశారు. మనము ప్రభువు వెలుగులో నడిస్తే అందరం కూడా సంతోషంగా ఉంటాము.

భవిష్యత్తు గురించి ప్రవక్త తెలిపారు ఎందుకంటే దాని ద్వారా వర్తమాన కాలంలో మన జీవితాలను సరి చేసుకొని దేవునికి ఇష్టంగా జీవించాలి (1థెస్స 4:13-18, 2పేతురు 3:10-14, 1 యోహాను 3:2-3).

ఈనాటి రెండవ పఠనంలో  పౌలు గారు దేవుని యొక్క రాక కొరకు మనందరం కూడా మేల్కొని సంసిద్ధంగా ఉండమని తెలుపుచున్నారు.

ప్రభువు యొక్క రక్షణ లభించు సమయం వచ్చుచున్నది కాబట్టి అందరం కూడా చీకటి పనులు మానివేసి వెలుగులో జీవించాలి అని తెలుపుచున్నారు.

క్రైస్తవులు తమ యొక్క విధులు, బాధ్యతలు మరచి జీవిస్తున్న సందర్భంలో పౌలు గారు ప్రభువు రాకడ కోసం బాధ్యతాయుతంగా జీవించమని కోరారు.

చీకటి సమయంలో సైతాను ఎక్కువగా పని చేయును (2పేతురు 1:19, 2కొరింతి 4:4, ఎఫేసి 2:2).

క్రైస్తవులు అందరూ కూడా ప్రభువు ప్రజలుగా జీవించాలి అందుకే పౌలు గారు వెలుగులో జీవించు ప్రజలుగా సత్ప్రవర్తన కలిగి జీవించాలి అని తెలుపుచున్నారు.

దేవుని యెడల విశ్వాసం కలిగి నీతివంతమైన జీవితం జీవిస్తూ పాపమును విడిచిపెట్టి జీవించాలి అని పౌలు గారు పలుకుచున్నారు.

క్రైస్తవ జీవితం అనేది విందులతో వినోదాలతో భోగ విలాసాలతో కూడుకొని ఉన్నది కాదు దేవుని  జీవితమును జీవింపవలసింది. ఆయనకు అనుగుణంగా జీవించాలి.

క్రైస్తవులుగా మారిన రోమీయులు ఇంకా వారి యొక్క పాత అలవాట్లు మరువలేదు అందుకే పౌలు గారు వారిని సత్ప్రవర్తన కలిగి ఉండమని కోరుచున్నారు.

క్రైస్తవ జీవితం పవిత్రంగా ఉండాలి ఆయన యొక్క రాకడ కోసం సంసిద్ధంగా ఉండాలి అదే విధంగా క్రీస్తును ధరించిన జీవితం లాగా ఉండాలి.

క్రీస్తును ధరించుట అంటే ఆయనలో ఉన్న సుగుణాలను ధరించుట, ప్రేమను, మంచితనంను, క్షమను, త్యాగమను ధరించుట అని అర్థం (ఎఫీసి 4:24, కోలోస్సి 3:10).

దేవుని చిత్తానుసారంగా మనం జీవిస్తే తప్పనిసరిగా మనకు రక్షణ కలుగుతుంది అదేవిధంగా మనం వెలుగులో జీవిస్తాం.

ప్రభువు యొక్క రెండవ రాకడ జరుగును కావున ఆ సమయంలో పాపంలో జీవింపకుండా నీతిమంతులుగా జీవిస్తూ ఆయన ప్రసాదించే రక్షణకు సంసిద్ధత కలిగి ఉండాలి.

పౌలు గారు దేవుడు వచ్చే సమయం ఆసన్నమగుచున్నది కావున దాని కొరకు నిద్ర నుండి మేల్కొని జాగరు కథ కలిగి జీవించాలి అని కూడా తెలుపుచున్నారు. నిద్రలో ఉన్నప్పుడు మనం సంసిద్ధంగా లేనట్టే మేల్కొని ఉంటేనే మనం ఏ విధంగానైనా సరే స్పందిస్తాం కావున దేవుని రాకడ కొరకు మంచి మార్గం ద్వారా స్పందించి రక్షణ పొందాలి.

ఈనాటి సువిశేషంలో మనుష్య కుమారుని యొక్క రాకడ నోవా దినములతో పోల్చబడినది ఎందుకంటే ప్రజలు అప్రమత్తంగా లేరు ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధంగా లేరు. నోవా కాలంలో ప్రజలు నైతిక విలువలు లేకుండా జీవించారు భోగ విలాసాలతో, సోమరితనంతో దేవుని మరచి జీవించారు.

నోవా కాలంలో ప్రజలు ఊహించని విధంగా అనూహ్యమైన సమయం వచ్చి వారిని నాశనం అయ్యేలా చేసింది.

అక్కడి ప్రజలలో ఎటువంటి భయం లేదు అదే విధంగా రోజు వారి జీవితం జీవించేవారు. దేవుని రాకడ గురించి దేవుని తీర్పు గురించి ఎటువంటి ఆలోచన లేదు అందుకనే అక్రమ మార్గాలు ఎంచుకున్నారు, దైవమును మరచి జీవించారు.

నోవా కాలంలో ఉన్నట్లే మనుష్య కుమారుడు వచ్చే సమయంలో కూడా ఉండును. సమయం అనేది ఎప్పుడో తెలియదు కాబట్టి సిద్ధంగా ఉండాలి.

నోవా కాలంలో కొందరు మాత్రమే రక్షింపబడ్డారు. కేవలం తన కుటుంబం వారిని ప్రభువు రక్షించారు వేరే వారిని శిక్షించారు అదేవిధంగా మనుష్య కుమారుడు వచ్చే సమయంలో పొలములో పనిచేసే ఇద్దరిలో ఒక్కడిని దేవుడు తీసుకొని వెళతాడు వేరొక వానిని అక్కడే విడిచి పెడతారు అని తెలిపారు. ఎందుకంటే ఒకరు సంసిద్ధత కలిగి ఉన్నారు. వేరొకరు దేవుని రాకడ కొరకు సిద్ధంగా లేరు.

నోవా కాలంలో దృష్టులు శిక్షించబడిన విధంగా మనుష్య కుమారుని కాలంలో అలాగే దృష్టులు శిక్షించబడతారు.

నోవా దేవుని కొరకు తన యొక్క జీవితమును తన్ను తాను సంసిద్ధం చేసుకున్నారు. జల ప్రళయం వస్తుందని ప్రభువు ముందుగానే చెప్పారు అందుకనే చెప్పిన విధంగా నోవా తాయారు అయ్యాడు.

నోవాతో ఓడను తయారు చేయమని చెప్పాడు (ఆది 6:14) నోవా తన కుటుంబాన్ని తయారు చేశాడు, అలాగే నోవా దేవుడు చెప్పినట్లు చేశారు - ఆది 6:22.

నోవా తాయారు అయినప్పుడు మిగతావారు ఆయన్ను హేళన చేశారు ఇష్టం వచ్చిన విధంగా జీవించారు. జీవితం కేవలం విందులకే వినోదాలకి పరిమితం అన్నట్లు జీవించారు. వివాహాలు చేసుకుంటూ అప్రమత్తం లేకుండా జీవించారు అందుకే జలప్రళయము వారిని ముంచి వేసింది.

మనందరిని దేవుడు ఒక విధంగా హెచ్చరిస్తున్నాడు. మనం చాలా సందర్భాలలో వేరే విషయాలకు తయారవుతం కానీ దేవుని రాకడకు సిద్ధం కాము.

- వర్షాకాలం వచ్చినప్పుడు గొరుగులతో సిద్ధంగా ఉంటాం.

- చలికాలం వచ్చినప్పుడు చలికోటులతో సిద్ధంగా ఉంటాం.

అలాగే ఎండాకాలంలో AC లతో సిద్ధంగా ఉంటాం. బస్సు కోసం ఉద్యోగం కోసం మనం సిద్ధంగానే ఉంటాం మరి ప్రభువు రాకడ కొరకు ఎందుకు సిద్ధంగా ఉండలేకపోతున్నాం?

ప్రభువు ఎప్పుడూ అని క్లుప్తంగా చెప్పలేదు కాబట్టి అనునిత్యం సిద్ధంగా ఉండాలి. మానవ జీవితంలో ఎన్నో విషయాలకు మనం సిద్ధంగా ఉండాలి కాబట్టి దేవుని రాక కోసం కూడా అదే విధంగా సిద్ధపడాలి.

మనం ఈ లోక ఆశల్లో వాంఛల్లో పడిపోయి జీవింపకుండా దేవుని తెలుసుకొని ఆయన రాకడ కొరకు సిద్ధంగా ఉండాలి.

ప్రభువు వచ్చే సమయంలో మంచి వారిని చెడ్డవారిని వేరుపరచి వారికి తగిన విధంగా తీర్పు చేస్తారు కాబట్టి మనం మంచిగా పవిత్రంగా నీతివంతంగా జీవించాలి.

విశ్వాసులందరూ జాగరుకులై ఉండాలి అంటే ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండుట. మనం సిద్ధంగా ఉంటే దొంగలు మన ఇంట్లోకి ప్రవేశించరు. జాగరు కథ కలిగి ఉంటే తప్పులు జరగవు.

మనుష్య కుమారుడు కూడా ఊహించనీ ఘడియలలో వస్తారు కావున ఎలాగా మనం ఆయన రాకడ కోసం సిద్ధంగా ఉంటున్నాం అని అందరూ కూడా వ్యక్తిగతంగా ధ్యానించుకొని మన జీవితాలు సరి చేసుకుని ఆయన చిత్తానుసారంగా జీవించుదాం.

ప్రభువుని యొక్క రాకడ మనలో శాంతిని తీసుకొని వస్తుంది ఆయన ఈ లోకంలో మొదటిగా జన్మించినప్పుడు పరలోక దూతలు ఈ విధంగా పాడారు మహోన్నతమైన సర్వేశ్వరునికి భూలోకమున మనుషులకు శాంతి కలుగును గాక అని - లూకా 2:14.

ఈనాటి దివ్య పఠనాలు  కూడా ప్రభువు రాకతో మనలో శాంతి వస్తుంది అని తెలుపుచున్నవి.

మొదటి  పఠనంలో దేవుడు అందరి మధ్య శాంతి నెలకొల్పుతారు అని యెషయా ప్రవక్త పలికారు.

రెండవ పఠనంలో వెలుగులో జీవించుట ద్వారా సత్ప్రవర్తన కలిగి జీవించుట ద్వారా శాంతియుతంగా ఉంటామని పౌలు గారు తెలిపారు.

సువిశేషంలో ప్రభువు రెండవ రాకడ కోసం తాయారు అయితే శాంతి ఉంటుందని తెలిపారు.

by FR. BALAYESU OCD

 

19, నవంబర్ 2022, శనివారం

క్రీస్తురాజు మహోత్సవము

 

క్రీస్తురాజు మహోత్సవము 

                                                                                        2సమూ :5:1-3

కొలస్సి :1:12-20

లూకా :23:35-43

     పూజ్య గురువులు, ప్రియమయిన సహోదరీ, సహోదరులారా! ఈరోజు మన తల్లి అయిన తిరుసభ క్రీస్తురాజు మహోత్సవమును కొనియాడుతుంది. ముందుగా మీ అందరికి పండుగరోజు శుభాకాంక్షలు, దేవునియొక్క దీవెనలు.

     ఈపండుగను జరుపుకొనేటప్పుడు మనకు ఒక సందేశమురావచ్చు.అది ఏమిటంటే, మ్రానికొమ్ముల ఆదివారము క్రీస్తు ప్రభువును ఒక రాజుగా కొనియాడుతున్నాము. అప్పుడు యేసుప్రభువు యూదులకు ఒక రాజుగా యెరూషలేము నగరంలోనికి ప్రవేశించడం మనం చూస్తున్నాం.ఆసంఘటన యూదులకు మాత్రము యేసుప్రభువు ఒక  రాజుగా చిత్రీకరించడం జరిగినది.ఈక్రీస్తురాజు పండుగ ప్రపంచములోని రాజులకంటే, యేసుప్రభువు గొప్పవాడిగా, రాజులకు రాజుగా,ప్రభువులకు ప్రభువుగా, పండుగను జరుపుకుంటున్నాము. మనము చరిత్రను చూసినట్లయితే,మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత రాజులు తమ స్వార్ధముతో సొంత ప్రయోజనములకోసము, కీర్తి, పరువు ప్రతిష్ఠలకోసం వేరే దేశములపై తిరుగుబాటును మనం చూస్తున్నాం.దీనిని దృష్టిలో పెట్టుకొని, ప్రపంచములో శాంతిని నెలకొల్పడానికి పొప్ పయస్ XI quas primes (in the first).  దీని అర్ధం మొట్టమొదట విశ్వలేఖలో  రాజులందరూ క్రీస్తుప్రభువుని రాజులకు రారాజుగా, ప్రభులకు ప్రభువుగా,విశ్వసించి, ప్రపంచములో శాంతిని నెలకొల్పాలని ఈలేఖను రాసాడు.

  1. రాబోయే మెస్సయ రాజు:

2.క్రీస్తు ఎలా రాజు?

3.యేసు శాంతికరుడైన రాజు

 1.  రాబోయే మెస్సయారాజు:

         రాజు అనేవాడు ప్రజల బాధలనుండి రక్షించేవాడు. ప్రజలు నిర్భయముగా శాంతి సమాధానాలతో,పరిపాలన చేసేవాడు రాజు.ఇశ్రాయేలు రాజులు సరిగ్గా పరిపాలన చేయలేదు. కనుక రాజవ్యవస్థ కూలిపోయింది.ప్రవక్తలు భావికాలములో మెస్సయ్య నూతన రాజుగా వస్తాడని, ప్రవచనములను చెప్పారు. యెషయా ప్రవక్త ఇలా పలుకుతున్నారు: “మనకొక శిశువు జన్మించాడని చెప్తూ,అతని పుట్టుకను తెలియజేశాడు.అతడు నీతితో పరిపాలనము చేస్తాడు.అతని యేలుబడిలో ప్రజలు శాంతి సౌఖ్యముతో జీవిస్తారు. అతడు బేత్లెహేములో పుడతాడని చెప్పాడు.

  యిర్మీయా ప్రవక్త కూడా ఇలా అంటున్నాడు: “నేడు దావీదు వంశమునుండి నీతిగల రాజును ఎన్నుకొంటాను”(23:5).

జెకరియా ప్రవక్త కూడా ఇలా అంటున్నాడు:”తర్వాత దావీదు వంశానికి చెందిన సెరుబ్భాబేలు రాజ్య వ్యవస్థను పునరుద్ధరిస్తాడు అనుకొన్నారు. కానీ ఆశ నెరవేరలేదు. (8:9).

యెష:60:16, అన్య జాతుల రాజులు రాజుకు లొంగివుంటారు అని భావించారు.

  2.  క్రీస్తు ఎలా రాజు?:

          మత్త:2:6 లో ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు మెస్సయాను గూర్చి హేరోదు రాజుకి వివరించారు. “మెస్సయ్య రాజుగా జన్మిస్తాడని బేత్లెహేములో పుడతాడని వారి ముందుగానీ ప్రవక్తల ప్రవచనములు ద్వారా తెలుసు. కానీ, యేసు ప్రభువు ఇంత నిడారంబరముగా రాజభవనములకు దూరముగా పశువుల పాకలో యూదుల రాజుగా జన్మిస్తాడని ఎవరూ ఊహించలేదు. కానీ చిత్రముగా యేసు జన్మించినపుడు నిడారంబరముగా ఉన్నాడో, మరణ సమయములో కూడా అలానే వున్నాడు. రాజ్యములేదు, సింహాసనము లేదు, కిరీటము లేదు. ఆయనకు ఎదురయిన ప్రశ్న: “నీవు యూదుల రాజువా?” ఇది పిలాతు అడిగిన ప్రశ్న. మత్త:27:11    వచనములలో దానికి యేసు ప్రభువు సమాధానము: “నీవు అన్నట్లే". చిన్నమాటలో సత్యాన్ని గ్రహించాడు పిలాతు.ఆయన సిలువ పై భాగములోనజరేయుడైన యేసు యూదులరాజు అని రాయించి దానిని మార్చమని అడిగిన వారికి: “నేను రాసినదేమో రాసితిని.అని చెప్పి నోరు మూయించాడు. ఆయన జీవితములో ఆరంభములో వినబడిన    ప్రశ్న: “యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడ?” జీవితాంతములో, వినిపించిన మాట నజరేయుడయినా యేసు యూదుల రాజు. అలాగయితే ఎన్నో సందేహాలు,మరి నీరాజ్యము ఏది నీ సింహాసనము ఏది? నీ సైన్యమేది? ప్రశ్నకు సమాధానం, నా రాజ్యము ఈలోక   సంబంధమయినది కాదు. ఎందుకంటే, అయన రాజ్యము ఈలోక  సంబంద్ధమయిందయితే, అది కాలానికి లోబడుతుంది, కొంతకాలమే ఉంటుంది. దావీదు రాజు సొలొమోను రాజు ప్రపంచాన్ని గడగడా లాడించిన అలెగ్జాండర్ వారి మనుగడ తరువాత కాలగర్భములో కలిసిపోయారు.మరియు మెసయ్య యూదుల రాజుగా జన్మించిన వాడుకూడా అలా కాల గర్భములో కలిసిపోవలసిందేనా? లేదు. అలా జరగడానికి వీలులేదు. ఎందుకంటే, క్రీస్తుపూర్వం ఏడువందల సంవత్సరములో యెషయా ప్రవక్త ప్రవచించాడు(9:7). అతని రాజ్యాధికారం విస్తరించును.

   అతని రాజ్యము సదా శాంతి నెలకొనును. అతడు దావీదు సింహాసనమును అధిష్టించి, నీతి న్యాయములతో అధికారము నేర్పుచూ,నేటినుండి కలకాలం వరకు పరిపాలనను చేయును. శాశ్వతముగా పరిపాలన చేయువాడు దేవుడు మాత్రమే. ఒక నిరపరాధి రక్తముతో తనకు సంబంధము కల్పించవద్దని చేతులు కడుగుకొనిన పిలాతు యేసును రాజుగా అంగీకరించాడు.అప్పుడే జన్మించిన బాలుని జ్ఞానులు రాజుగా అంగీకరించారు.ఫిలిప్పు, నిన్ను పిలువక పూర్వమే,నేను నిన్ను ఎరిగివున్నాను, అని యేసు అనగానే, నతానియేలు, నీవు దేవుని కుమారుడవు, యూదుల రాజువని తన విశ్వాసాన్ని ప్రకటించాడు.

3.యేసు శాంతికరుడైన రాజు:

      శాంతి అంటే,యుద్ధము లేకుండా వుండే వాతావరణము కాదు. ప్రజలు శాంతి సమాధానాలతో  జీవించడం.శాంతిని హీబ్రూ భాషలో షాలోమ్ అని అంటారు. దాని అర్ధం: “ప్రజా సంక్షేమం దేవునితో సమాధానము.మన సువార్తలో చూస్తున్నాం, దూతల సమూహము దేవుని అనుగ్రహమునకు పాత్రులైనవారికి శాంతి కలుగును గాక. దేవుని అనిగ్రహమును పొందు వారికి శాంతిని అనుగ్రహించడానికి బాలుడు (యేసుప్రభువు) జన్మించాడు. ఈయన ప్రధాన లక్ష్యం శాంతిస్థాపన. ఆనాటి కాలములో రాజకీయ పరిస్థితులలో మతపరమైన శాంతిస్థాపన చాలా అవసరం.  యేసు ప్రభువు ఉత్తానమైన తరువాత శిష్యులకు కనిపించి వారితో, "మీకు శాంతికలుగునుగాక" అన్నాడు. భయముతో, ఆందోళనతో  ఉన్న వారికి శాంతి సమాధానము చాలా అవసరం. వాటిని ప్రభువు తన శశిష్యులకు ప్రసాదిస్తున్నాడు.దేవుడు తప్ప మరెవ్వరూ ఇవ్వలేని తిరుగులేని శాంతి ఇది.

   తనతో సిలువ వేయబడిన దొంగలలో ఒకడు తన పాపక్రియలకుకారణము పశ్చాత్తాపపడి, యేసు దైవత్వాన్ని గుర్తించి, యేసూ, నీరాజ్యములో ప్రవేశించినపుడు నన్ను జ్ఞాపకముంచుకొనుము అని ప్రాధేయపడ్డాడు. ప్రభువు తనతో, నేడే నీవు పరలోకములో ప్రవేశించెదవు. ఆవ్యక్తికి అట్టి వాగ్ధానము రాజులకు రాజుతప్ప మరెవ్వరు ఇవ్వలేరు.

మొదటి పఠనంలో: దావీదు దగ్గరకు ప్రజలు వఛ్చి నీవు మాకు  రాజుగా ఉండు అని ప్రాధేయ పడుతున్నారు. ఎందుకంటే, అతడు ఇతర రాజులతో యుద్ధము చేసి వారిని ఓడించి ఇశ్రాయేలు ప్రజలను గొప్పగా గెలిపించాడు. ఇది చూసిన, తెలుసుకొనిన ప్రజలు తన దగ్గరకు వచ్చి, నీవు మాకు రాజుగా ఉండు అని అడుగుతున్నారు.కానీ సువిశేషములో యేసు ప్రభువు సిలువమీద వున్నప్పుడు తనను ప్రజలు చూస్తున్నారు కానీ, దేవునిగా గుర్తించలేకపోయారు. ప్రధానార్చకులు తనను తాను రక్షించుకోమని హేళనచేశారు, అక్కడ ఉన్నటువంటి భటులు యేసు  ప్రభువుని   హేలనచేశారు. కానీ తనతోపాటు సిలువవేయబడిన దొంగవాడు మాత్రం దేవుని యొక్క మహిమను తెలుసుకొని రాజుగా స్వీకరించి, యేసుతో పలికిన మాట:యేసూ, నీవు నీ రాజ్యములో ప్రవేశించేటప్పుడు నన్ను జ్ఞాపకంనుంచుకొనుము" అని పలికాడు. అప్పుడు యేసు ప్రభువు,నీవు ఇప్పుడే నాతోపాటు పరలోక రాజ్యములో ప్రవేశిస్తావు అని పలికాడు. అంటే ఈలోకంలో నీవు ఎన్ని పాపములు చేసినా దేవుని యందు విశ్వాసముకలిగి పశ్చాత్తాపముతో ప్రార్ధన  చేస్తే  దేవుడు తప్పక మన ప్రార్ధన ఆలకిస్తాడు. మన యేసు ప్రభువు ఎంతో మందిని స్వస్థ పరిచాడు, ఎంతోమందికి చూపును దయచేసాడు, ఎంతోమందికి నూతన జీవితమును ప్రసాదించాడు. ఎందుకంటే అయన మనల్ని ఎంతో ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాబట్టి. అంతగా ప్రేమించే దేవాతి దేవుడవైన యేసు ప్రభువుని ఒక రాజుగా, దేవునిగా, అభిషిక్తుడుగా, సృష్టికర్తగా మనము స్వీకరిస్తున్నామా లేదా ని ఆత్మపరిశీలన  చేసుకోవాలి.

     చివరిగా, ఈపండుగరోజు మనమందరముకూడా  యేసును రాజుగా అంగీకరిస్తున్నామా? లేక అయన అధికారమునకు లోబడి ఉంటున్నామా? ఆయనకు విధేయత కలిగి జీవిస్తున్నామా?అని  ఆత్మపరిశీలన చేసుకుందాం! ఆమెన్ .

 

 

                                                                                                                                     By

Br.Simon

31 వ సామాన్య ఆదివారము

31 వ సామాన్య ఆదివారము  ద్వితియెపదేశకాండము 6:2-6 హెబ్రీయులు 7:23-28 మార్కు 12:28-34             ప్రియా దేవుని బిడ్డలరా ఈ రోజు మనమందరము కూడా 3...