18, ఫిబ్రవరి 2022, శుక్రవారం

7 వ సామాన్య ఆదివారం

7 వ సామాన్య ఆదివారం


1 సామువేలు 26:2,7-9, 12-13,22-23,   1 కోరింథీ 15:45-49, లూకా 6:27-38 

నేను మీతో చెప్పుచున్నది ఏమన్నా: మీ శత్రువులను  ప్రేమింపుడు, మిమ్ము ద్వేషించించిన వారికీ మేలు చేయుడు లూకా: 6 : 27 

* క్రీస్తు నాదునియందు ప్రియ దేవుని బిడ్డలారా మరియు క్రైస్తవ విశ్వాసులారా. ఈ నాడు తల్లి శ్రీసభ  సామాన్యకాలపు ఏడవ  ఆదివారంలోనికి ప్రవేశిస్తుంది. ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు శత్రువులను ప్రేమించుట మరియు  క్షమించుట అను అంశం  గురించి తెలియజేస్తున్నాయి. 

* క్రైస్తవ సంఘం  అంటేనే ప్రేమ, ప్రేమ లేనిదే క్రైస్తవ సంఘం  లేదు. ఈ ప్రేమ అనేది మన సొంతవాళ్లకి, దగ్గర వాళ్ళకి మాత్రమే కాదు, ఈ ప్రేమ అనేది విశ్వవ్యాప్తంగా ఉండాలని తల్లి శ్రీసభ మనందరిని కూడా ఆహ్వానిస్తోంది.

* లూకా 6 :36 లో అంటున్నారు మీ తండ్రి వలెనే మీరు కనికరం గలవారై యుండుడి అని, ఎందుకంటే మనలను ద్వేషించే వారికీ మేలు చేయాలి, మనలను శపించువారిని ఆశీర్వదించాలి, బాధించువారికై  ప్రార్ధించాలి.  ఇతరుల నుండి మనం ఏమి కోరుకుంటామో అదే మనము ఇతరులకు చేయాలి అప్పుడే  దేవుడు చెప్పినటువంటి ప్రేమ నెరవేరుతుంది. 

* ఆలా కాకుండా మనలను ప్రేమించిన వారినే ప్రేమిస్తే, తిరిగి ఇవ్వగలిగినవారికే సహాయం చేయగలిగితే అందులో ఎటువంటి ప్రత్యేకత లేదు అని ప్రభువు మనకు తెలియజేస్తున్నారు. 
* ఈనాటి మొదటి పఠనంలో  దావీదును చంపాలనుకున్న సౌలును సహితం దావీదు  క్షమించి సౌలును వదలివేయటం మనం చూస్తున్నాము.

* అదే విధంగా క్రీస్తు యొక్క జీవితం ద్వారా సువిశేష  పఠనంలో క్రీస్తు ప్రభు  అంటున్నారు నియొక్క శత్రువును ప్రేమింపుము అని చెబుతున్నారు, ఎందుకంటే క్రీస్తు ప్రభువును ఎంతగానో ద్వేషించి, క్రూర హింసలు పెట్టి, కొట్టి, తిట్టి, బళ్ళేముతో తన ప్రక్కన   పొడిచిన కూడా క్రీస్తు ప్రభువు వారికీ తిరిగి  హాని చేయలేదు , వారిని ప్రేమతో క్షమించి తండ్రి దేవునికి వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. తాను జీవించి ఉన్నంత కాలం ప్రేమతోనే జీవించాడు, ప్రేమలో జీవించాడు, ప్రేమిస్తూనే జీవించాడు, అదే ప్రేమను మరణము మరియు పునరుత్తనం  వరకు తీసుకోని వెళ్ళాడు, అదే ప్రేమను ఇప్పుడు పొందుతున్నాడు.

మనము మొదటిపఠనములో చూసినట్లైతే శత్రువును ఎలా ప్రేమించాలి, క్షమించాలి అనే అంశం గురించి తెలియజేస్తుంది. దావీదును చెంపలనుకున్న సౌలు రాజునూదావీదు ఏ విధంగా క్షమించాడో, చంపకుండా వదలివేసాడో మనము మొదటిపఠనములో ఆలకిస్తున్నాము.

1 ) సౌలు ఎవరు 
* బెన్యామీను గోత్రమునకు చెందిన వాడు 
* ఇశ్రాయేలీయుల మొదటి రాజు 
* సమూవేలు సౌలును ఆభిషెకించి ఇశ్రాయేలీయులకు రాజుగా చేసెను 
* 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను పరిపాలించాడు 
*దేవుని యొక్క ఆజ్ఞను దిక్కరించాడు.

దావీదు ఎవరు  
* యూదా గోత్రమునకు చెందిన వాడు 
*ఇశ్రాయేలీయుల రెండొవ రాజు 
*సమూవేలు  ఆభిషెకించిన కూడా దావీదు మాత్రం దేవుడు ఇచ్చేటి వంటి సమయం కోసం వేచిచూసాడు 
*40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను పరిపాలించాడు 
*దేవునికి అను గుణంగా జీవించాడు 
*యోనాతానును మంచి స్నేహితుడు.

ఇవి కొన్ని ముఖ్యమైన అంశాలు, వారియొక్క జీవితంలో అసలు సౌలు దావీదును ఎందుకు చంపాలని అనుకున్నాడు అంటే దావీదుపైన అసూయతో-చంపాలనుకున్నాడు. అందుకు తాను 
ప్రయత్నించాడు. అది తెలుసుకున్న దావీదు సౌలుకు దొరకకుండా అరణ్యములో దాగుకున్నాడు. అది తెలుసుకొన్న సౌలు దావీదును చంపుటకు మూడువేలమంది యోధులను వెంటపెట్టుకొని చంపుటకు బయలుదేరాడు. అలా దావీదును వెదకి దొరకక అలసిపోయినటువంటి సౌలు సైనికులతో కలసి విశ్రాంతి తీసుకుంటూ నిద్రించినప్పుడు సౌలుని చూసి చంపడానికి వచ్చినపుడు, దావీదుమాత్రం సౌలును చంపుటకు నిరాకరించాడు. ఎందుకంటే సౌలురాజు దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తి కాబట్టి.  దావీదు సౌలు రాజు యొక్క ఈటెను, మంచినీటి కుండను ఆయనతోపాటు తీసుకుని పోయాడు.కాబట్టి ఈయొక్క మొదటి పఠనంలో క్షమాగుణం అనే అంశం గురించి తెలియజేస్తుంది. 
 
సువార్తా పఠనము :లూకా :
నేటి సువార్తాపఠనమును చూసినట్లయితే, ఈ సువార్తను క్రీస్తు ప్రభువు రెండు విధాలుగా విభజించాడు:

మొదటిది:
మనలను ద్వేషించినవారికి మేలుచేయాలి.(  వచనము).
మిమ్ము శపించినవారిని ఆశీర్వదింపుడు(  వచనము).
మిమ్ము భాదింపువారికై ప్రార్ధింపుడు(  వ వచనము)

రెండవది: 
నీపైబట్టలను ఎత్తుకొని పోవువాడికి నీ అంగీనికూడా తీసుకొనిపోనిమ్ము 
నిన్ను ఒకచెంపపై కొట్టిన వానికి నీ రెండవ చేంపను కూడా చూపుము.
నిన్ను అడిగిన ప్రతివారికి ఇమ్ము, నీసొత్తును ఎత్తుకొని పోవువాడిని మరలా అడగవద్దు.

 ఈ రెండిటిలో మనము ముఖ్యముగా క్షమించేగుణాన్ని తెలుసుకుందాం.  శత్రువులను ఎలా ప్రేమించాలో యేసు ప్రభువు మనకు చూపించియున్నారు.

 దేవుడు తన వ్యక్తిగత జీవితముద్వారా  తన  ప్రేమను మనలో పెంచి  మనలను తన బిడ్డలుగా చేసుకున్నట్టుగానే క్రైస్తవులైన మనమందరము కూడా ఇతరులతో అలా మెలగడమే దేవుడు ఆశించే క్రైస్తవ నీతి  లేదా జీవితము.
సువార్తాపఠనంలో ప్రేమించండి, మంచిచేయండి, ఇవ్వండి అనే అంశాలను గురించి తెలియజేస్తుంది. కాబట్టి దేవునియొక్క బిడ్డలమైనటువంటి మనము అంటే క్రైస్తవులము, దేవుడు ఇచ్చినటువంటి  ఈ నియమాలను తప్పనిసరిగా పాటించాలని యేసుప్రభువు సువిశేషములో స్పష్టం చేసాడు.

  క్రైస్తవ జీవితం అనేది సోదర ప్రేమ, క్షమా గుణము .  మనము ఎప్పుడైతే ఇతరులను ప్రేమిస్తామో అప్పుడే మనలను కూడా అదేవిధముగా ప్రేమిస్తారు అని దేవుడు ఈనాడు తెలియజేస్తున్నాడు.
 చివరిగా మనము దేవునియొక్క శిష్యులుగా పిలువబడాలి అంటే, అందరినీకూడా (శత్రువులను) సమానముగా ప్రేమించగలగాలి. క్రీస్తు ప్రభువు ఏవిధముగానయితే సిలువపై వ్రేలాడుతూ కూడా తన ప్రేమను వ్యక్తపరిచారు, అందరికోసం ప్రార్ధన చేశారు. అదేవిధముగా మనం కూడా చేయాలి. శత్రువులను ప్రేమించడము అంటే, వారిని మనస్ఫూర్తిగా క్షమించడం. వారికి మంచిజరగాలని కోరుకోవడం.వారికి మనము చేయగలిగిన మంచిచేయడం, వారిని దేవుడు దీవించాలని ప్రార్ధన చేయడం. అలా అందరినీ ప్రేమించినందులకు దేవుడు మనకు ఒసగే గొప్ప బహుమానము మనం పొందుతాము. 

Br. Johannes 

11వ సామాన్య ఆదివారం

11వ సామాన్య ఆదివారం  యెహెజ్కేలు17:22-24, 1 కొరింతి 5:6-10, మార్కు 4:26-34 ఈనాటి పరిశుద్ధ గ్రంధ పఠణములు దేవుని యొక్క రాజ్య విస్తరణ గురించి బో...