4, మార్చి 2023, శనివారం

 

తపస్సుకాలం రెండొవ ఆదివారము

ఆది 12: 1 -4

2 తిమోతి 1: 8 -10

మత్తయి 17: 1 - 9

క్రిస్తునాధుని యందు ప్రియా సహోదరి సహోదరులారా

ఈనాడు తల్లి తిరుసభ తపస్సుకాలం రెండొవ ఆదివారములోనికి ప్రవేశిస్తూఉన్నది. వారమును మనము దివ్యరూపధారణ వారముగా కొనియాడుతూ ఉన్నాము. ఎందుకు అని అంటే యేసు ప్రభువు తన యొక్క సిలువ శ్రమలను అనుభింవించడానికి ముందు యేసు ప్రభువు తన యొక్క పవిత్రతను తన యొక్క శిష్యులకు తెలియపరుస్తూ వారిని తన యొక్క దైవ రాజ్య వ్యాప్తికై వారిని సంసిద్ద పరుస్తూ ఉన్నారు. తాబోరు పర్వతముపై శిష్యులకు యేసు ప్రభువు తన యొక్క దివ్యరూపాన్ని వారికి తెలియపరుస్తూ, దర్శనమును గూర్చి తాను సిలువ శ్రమలను అనుభించదోవు వరకు ఎవ్వరికి కూడా తెలియపరచ వద్దని వారిని ఆదేశిస్తూఉన్నారు. 

మరి ఈనాడు దివ్య రూపధారణ మహోత్సవము ద్వారా తల్లి తిరుసభ మనలను అందరిని కూడా మన యొక్క పాపాలను విడనాడి, పవిత్రమైన జీవితములోనడువమని మన అందరికి ఆహ్వానాన్ని  పలుకుచున్నది.

ఈనాటి మూడు దివ్య గ్రంథ పఠనాలు ధ్యానించుకున్నట్లైతే మూడు పఠనాలు కూడా పవిత్రతను గూర్చిన సందేశమును మనకు తెలియపరుస్తూఉన్నాయి. తండ్రి దేవుని వాక్కుకు అనుకూలంగా మనము విధంగా జీవించాలి అని పవిత్ర వచనాలలో మనము చూస్తూ ఉన్నాము.   పవిత్ర జీవితాన్ని జీవించాలి అంటే మనము చేయవలసిన పని ముందుగా దేవుని యొక్క పిలుపును ఆలకించి తరువాత పిలుపుకు సాక్షిగా జీవిస్తూ అటుపిమ్మట నూతన జీవితాన్ని కలిగి, మన మనసులు రూపాంతరము చెంది, పిలుపు పట్ల పవిత్రతను కలిగి జీవించడమే యొక్క పవిత్ర జీవితాన్ని సాకారం చేసుకోవడానికి మనం చేయవలసిన ప్రయత్నము.

మూడు పఠనాలను చూసినట్లయితే మొదటి పఠనంలో విశ్వాసానికి తండ్రి అయిన అబ్రహాము యొక్క పిలుపును గూర్చి మనము చూస్తున్నాము. అదేవిధంగా దేవుడు అబ్రహామునకు   ఇచ్చిన వాగ్దానమును గుర్తుచేస్తూ. నేను నిన్ను ఒక మహా జాతిగా తీర్చిదిద్దుతానని మరియు ఆశీర్వదిస్తానని, తన ద్వారా ఒక సమస్త జాతి జనులను దీవింతును అని యావే దేవుడు తన ఆశీర్వాదమును పలుకుచున్నాడు. కానీ  దీని కంటే ముందు దేవుడు ఒక షరతు పెడుతున్నాడు, అది ఏమిటంటే నీ బంధువులను, నీ దేశమును వాడాలి నేను చూపే దేశమునకు వెళ్ళమని షరతు పెడుతున్నాడు, ఆ సమయంలో అబ్రాహాము వయస్సు డెభై ఐదు ఏండ్లు. దేవుని మాటకు విధేయుడై తాను ముసలి ప్రాయంలో ఉన్న అని చూడకుండా దేవుడు చెప్పినటువంటి ప్రదేశానికి వెళ్లాలని తన వారిని అందరిని కూడా వదలి సిద్దమయ్యాడు. తన నమ్మకాన్ని దేవునిపై పెట్టి, మాటకు విధేయుడై నడుచుకున్నాడు. ఏ విధంగానంటే మత్తయి సువార్త 16 : 24 - 25 వచనాలలో చూస్తున్నాము అది ఏమిటంటే "నన్ను వెంబడింపగోరిన యెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తి కొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించు కొనగోరువాడు దాని పోగొట్టుకొనును; నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని దక్కించు కొనును." అను వాక్యమును మనం అబ్రహాము జీవితంలో చూస్తున్నాము. 

మన జీవితంలో కూడా అబ్రాహాము వాలే దేవుని యొక్క మాటకు విధేయులై జీవిస్తు ఉన్నామా లేదా? మన విశ్వాసము ఏ విధంగా ఉంది అని ఆత్మ పరిశీలన చేసుకుందాం.

ఈ నాటి రెండొవ పఠనంలో మనం ఆవిదమైనటువంటి పిలుపును కలిగియున్నామో పునీత పౌలు గారు మనకు తెలియపరుస్తున్నారు 2 తిమోతి 1 : 9  వ వచనంలో మనము చూస్తున్నాము "మనం చేసిన కార్యములవలనగాక తన యొక్క అనుగ్రహ పూర్వకమగు ఉద్దేశ్యముతోడను తన యొక్క బిడ్డలుగా జీవించు పిలచియున్నారు". మన జీవితంలో ఈ యొక్క అంశాన్ని మనం చూస్తున్నాము. మన చేసే ప్రతి కార్యాన్ని కూడా మనయొక్క తలంపు వలన జరుగుతున్నవి అని మనం అనుకుంటాము కానీ మన జీవితంలో జరిగే ప్రతి కార్యం కూడా దేవుని యొక్క అనుగ్రహం వలన జరుగుతున్నవి అని మనం తెలుసుకోవాలి. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రాహాముకు అందిన పిలుపు కూడా దేవుని యొక్క అనుగ్రహం వలన తనకు బిడ్డగా జీవించడానికి అందినటువంటి పిలుపు. అదే విధంగా యేసు ప్రభు పౌలును ఏ విధంగా తన దైవ రాజ్య వ్యాప్తికై వినియోగించుకున్నారో కూడా మనం చూస్తున్నాము 2 తిమోతి 1 : 10  వచనంలో మనం చూస్తున్నాము. "యేసు ప్రభు తన యొక్క సిలువ శ్రమల ద్వారా మనకు నిత్యా జీవితాన్ని ప్రదర్శించుయున్నారు", ఈ నిత్య జీవితాన్ని పొందిన మనము దేవునికి సాక్షులుగా జీవించాలి, ఈ విషయమై మీరు దేనికిని బయపడవలదు అంతకు మించి దేవుని యొక్క వాక్కును వ్యాపింపచేయడానికై సిగ్గుపడవలదు అని పవిత్ర గ్రంధములో మనం చూస్తున్నాము. మనము కూడా ఈ యొక్క నిత్య జీవితాన్ని బాప్తిస్మ రూపంలో పొందియున్నాము, కానీ దాని యొక్క సార్ధకతను మనము మరచి జీవిస్తుం ఉన్నాము. మనం చేసే ప్రతి యొక్క పనిలో కూడా ఒక సార్థకత అనేది ఉంటుంది ఆ యొక్క సార్దకతను మనం అర్ధం చేసుకోకుండా ఆ యొక్క కార్యాలను చేసినట్లయితే అవి వట్టి అలంకారంగా మాత్రమే మిగులుతు ఉంటాయి.  ప్రియ సహోదరులారా, దేవుడు మన అందరికి కూడా తన యొక్క అనుగ్రహ పూర్వకమైన పిలుపును తన యొక్క బిడ్డలుగా జీవించడానికి మనలను పిలిచియున్నారు. తండ్రి అబ్రాహాము వాలే ఆ పిలుపు యొక్క సార్థకతను అర్థం చేసుకొని జీవించడానికి ప్రయత్నిద్దాము, ప్రయాసపడుదాము.

ఈనాటి సువిశేష పఠనాన్ని చూచినట్లయితే రు ప్రభువు యొక్క దివ్యరూపధారణ గూర్చి మనం చూస్తూన్నాము. యేసు ప్రభువు తనయొక్క ముగ్గురు శిష్యులను ఉన్నతపర్వతము అయిన తాబోరు పర్వతము పైకి తీసుకొనిపోయి వారి ఎదుట తన యొక్క మహిమను తెలియజేస్తూఉన్నారు. యొక్క పరమ రహస్యమును ద్వారా యేసు ప్రభువు తాను పొందబోయే సిలువ శ్రమలను తెలియపరచడమే కాకుండా మనలను దేవునిలో మమేకమై జీవించడానికి ప్రభువు పిలుస్తూఉన్నారు.

యొక్క దర్శన సమయంలో యేసుప్రభువు తనయొక్క శిష్యులకు విధంగా కనిపించారు అని అంటే ప్రధాని యొక్క ముఖము సూర్యునివలె ప్రకాశవంతముగాను, వస్త్రములు వెలుగువలె తెల్లగాను ప్రతిబింబించుచున్నవి అని సువిశేష పట్నంలో మనం చూస్తూ ఉన్నాము. మనలను మనం విధంగా పవిత్ర పరచుకోవాలి అనేది యొక్క వచనాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. పాపముతో మాలినమై అంధకారంలో ఉన్న మనయొక్క మనసులు రూపాంతరము చెందాలి. ఎలా అంటే అంధకారంలో జీవిస్తున్న మనము వెలుగులోనికి ప్రవేశించడం ద్వారా అనగా మన యొక్క పాపపు జీవితాన్ని విడనాడి ఎటువంటి మలినము లేకుండా మనలను మనం మలచుకొని జీవించాలి.

              కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా, మనము మనం జీవించేటువంటి జీవితాన్ని విడనాడి ప్రభువు చూపిన పవిత్ర మార్గములో జీవించడానికి ప్రయత్నించాలి. క్రైస్తవ జీవితం అనేది ఒక పవిత్ర జీవితమునకు పిలుపు. తండ్రి దేవుడు తన యొక్క అనుగ్రహ పూర్వకముగా ఒసగిన ఆ పిలుపును స్వీకరించి మన యొక్క హృదయాలను రూపొందించుకొని జీవించడానికి దేవునికి దగ్గరగా దేవునిలో మమేకమై జీవించడానికి ప్రయత్నిద్దాము, ఆమెన్.

బ్రదర్. పవన్ కుమార్ ఓ సి డి

 తపస్సు కాల రెండవ ఆదివారం

ఆది 12:1-4

1 తిమోతి 1:8-10

మత్తయి 17:1-9

ఈనాటి దివ్య పఠనాలు  దేవునితో ప్రయాణం చేసే వ్యక్తులు యొక్క జీవితం రూపాంతరం చెందాలి అనే అంశం గురించి తెలుపుచున్నాయి.

ఈ తపస్సు కాల 40 రోజుల ప్రార్ధన ఉపవాస, దానధర్మంల యొక్క ప్రతిఫలం మనలను క్రొత్త వ్యక్తులుగా చేయాలి.

దేవునితో ఉండే సమయంలో మనలో ఉన్న పాత స్వభావము, వ్యక్తిత్వం పోయి క్రొత్తదనం, నూతన స్వభావం రావాలి.

ఈనాటి మొదటి పఠనం లో దేవుడైన యావే  అన్యుడైన అబ్రహాము యొక్క జీవితమును మార్చిన విధానం చదువుకున్నాం.  అబ్రాము  అన్యుడు, సంతానం లేనివాడు కానీ దేవుని యొక్క పిలుపును అందుకొని తన యొక్క జీవితం మార్చుకున్నారు.

 ఈనాటి మొదటి పట్టణంలో అబ్రాము  మొట్టమొదటిసారిగా దేవుని కలుసుకుంటున్నారు, దేవుని యొక్క స్వరము వింటున్నారు.

పవిత్ర గ్రంథంలో చాలామంది దేవుణ్ణి మొదటిసారిగా కలిసినప్పుడు మార్పు చెందుతున్నారు.

1. అబ్రాము దేవుని కలిశాడు - ఆయన చెప్పిన విధంగా జీవించారు

2. మోషే హొరేబు  కొండ వద్ద దేవుని కలుసుకున్నారు - ఇశ్రాయేలు ప్రజలను నడిపించే నాయకునిగా ఎన్నుకొన్నబడ్డాడు.

3. సౌలు దేవుణ్ణి కలుసుకున్నారు - సువార్త ప్రకటన చేశారు.

4. యాకోబు దేవుని కలుసుకున్నాడు (కుస్తీపట్టాడు) తన జీవితమును మార్చుకున్నారు.

5. జక్కయ్య దేవుని కలుసుకున్నాడు - హృదయ పరివర్తనం చెందాడు.

ఈ విధంగా ఇంకా చాలామంది దేవుని స్వరం విన్న సందర్భంలో, ఆయనను కలుసుకున్న సందర్భంలో మార్పు చెందుతున్నారు దేవునితో క్రొత్త జీవితమును ప్రారంభిస్తున్నారు.

ఈనాటి మొదటి పఠనం లో అబ్రహం లో ఉన్న కొత్త అంశాలను మనం ధ్యానించాలి.

1. అబ్రాము యొక్క పరిత్యజించుకునే లక్షణం - యావే దేవుడు అబ్రహామును తన దేశమును, చుట్టాలను, పుట్టింటిని వదిలి నేను చూపించే దేశానికి వెళ్ళు అని చెప్పారు.

-దేవునితో క్రొత్త  జీవితం ప్రారంభించాలన్న, దేవుని యొక్క పిలుపు ప్రకారం జీవించాలన్న మనలో పరిత్యజించే లక్షణం ఉండాలి.

- ఎంతో ప్రేమించే సొంత వారిని, ఆస్తిపాస్తులను, సొంత ప్రాంతాన్ని వదిలి వెళ్లాలంటే ఎంతో కష్టం, అయినప్పటికీ ప్రభువు విడిచిపెట్టి వెళ్ళమంటున్నారు, అబ్రాము అన్నియు వదిలివేశారు ఆయన ఎక్కడికి వెళుతున్నాడు కూడా తెలియదు అయినా అన్ని విడిచి వెళ్లారు.

-అబ్రాము దేవుని యొక్క స్వరము విన్న వెంటనే అన్ని విడిచిపెట్టడానికి సిద్ధమయ్యారు ఎప్పుడైతే దేవుడు మనకు మొదటి ప్రాధాన్యత అని గ్రహిస్తామో  అన్నింటికన్నా ముఖ్యమని భావిస్తామో  అప్పుడు దేవుని కొరకు అన్ని విడిచిపెట్టి వెళ్తాము.

- అబ్రాముకు దేవుడు సొంత చుట్టాల కన్నా, పుట్టింటి కన్నా విలువైన వారు, అందుకే ఆయనను వెంబడించుటకు సమస్తమును విడిచి వెళుతున్నారు.

- అబ్రాము అన్యుడైనప్పటికీని దేవుని మాట ఆలకించి తన సొంత వారిని విడిచిపెట్టి వెళుతున్నారు.

మనం కూడా దేవునితో క్రొత్త  జీవితం ప్రారంభించాలంటే అనేక రకాలైన విషయాలను పరిత్యజించాలి అప్పుడే మనం దేవునితో ప్రయాణించగలం.

2. అబ్రాము యొక్క విశ్వాసం, నమ్మిక:

అబ్రహామును విశ్వాసులకు తండ్రి అని పిలుస్తుంటాం. ఎందుకంటే ఎటువంటి నమ్మకం, ఆశ లేని సందర్భంలో అబ్రాము విశ్వసించారు దేవుని యొక్క ప్రతి వాక్కు నెరవేరాలని విశ్వసించారు అబ్రహాము యొక్క విశ్వాసం గురించి పవిత్ర గ్రంథంలో పలుచోట్ల చెప్పబడింది - రోమీ 4:1-3, 16:24, గలతి 3:6-9, హెబ్రీ 11:8-9, యాకోబు 2:21-23.

దేవుని మాటలు విశ్వసించినందున దేవుడు అతని యొక్క సంతతిని ఆకాశం నందలి నక్షత్రం వలె భూమి అంజలి ఇసుక రేణువలు వలే చేశారు. అబ్రహం యొక్క విశ్వాసం చాలా గొప్పది, అది చీకటిలో ప్రయాణం వంటిది ఎటువంటి నమ్మకం లేని సమయంలో అబ్రహాము ముందుకు వెళ్లాడు ఆయనకు ఇక వేరే ఆలోచనలు ఏమీ రాలేదు ఒకవేళ నాకు దేవుడు నిజంగా అన్ని ఇస్తారు లేదా అనే సందేహాలు లేవు కేవలం ఆయన విశ్వసించాడు దాని ప్రకారం గా ముందుకు వెళ్లారు.

ఆయన విశ్వసించారు కాబట్టి దేవుడు తన యొక్క జీవితంలో అసాధ్యమైన కార్యాలు ఎన్నో చేశారు, ఆయన్ను అభివృద్ధి పరిచారు దేవుడు ఆయన యొక్క పక్షమున నిలబడి పోరాడారు.

మన యొక్క విశ్వాస జీవితం ఏవిధంగా ఉంటుంది? అబ్రహం అద్భుతాలు చూడకపోయినా విశ్వసించారు. మరి మన ఏ విధంగా ఉంటున్నాం? ఏ విధంగా విశ్వసిస్తున్నాము?

3. అబ్రాము యొక్క సంపూర్ణ విధేయత:

దేవుడు అబ్రహమును పిలిచిన వెంటనే ఆయన ప్రకారం అనుసరించారు.

అబ్రాము దేవుడిని ఎటువంటి ప్రశ్న కూడా అడగలేదు కేవలం విదేయించారు చాలా సందర్భాలలో క్రొత్తవారు మనకు ఏదైనా వాగ్దానం చేస్తే మనం తిరిగి చాలా ప్రశ్నలు వేస్తాం కానీ ఇక్కడ అబ్రహాము జీవితంలో చాలా భిన్నమైన అంశమును చూస్తున్నాము ఆయన మరొక మాట మాట్లాడలేదు. ఎక్కడికి వెళుతున్నాము అక్కడి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో పిలిచిన వారు నిజమైన దేవుడా కాదా వాగ్దానాలు నెరవేరతాయా లేదా అనే ఆలోచన లేదు కేవలం విశ్వసించి విదేయించాడు.

విధేయత అనగా స్వరం విని నడుచుకోవడమే, అదియే ప్రవక్తలు చేశారు. అది ఏసుప్రభు చేశారు దేవుని స్వరం విని నడుచుకున్నారు. అబ్రహాము కూడా దేవునికి సంపూర్ణ విధేయత చూపించారు కాబట్టి దీవించబడ్డాడు.

విధేయత చూపిన వారిని దేవుడు దీవిస్తారు తన యొక్క విధేయత వలన ఒక ఆశీర్వాదకరంగా ఆయన మారారు తన ద్వారా తన కుటుంబమును అదే విధంగా సకల జాతుల వారు దీవించబడ్డారు.

దేవుడు విధేయత వలన సంతృప్తి చెందుతారు, కాబట్టి మనం కూడా విధేయత చూపి జీవించుదాం - 1 సమూ 15:22,మీకా 6:6-8.

4. అబ్రహం యొక్క ధైర్యం: 

అబ్రాము తన జీవితంలో సరైన నిర్ణయం తీసుకొని ముందుకు సాగారు ఆయన జీవితంలో ఇబ్బందులు పడుతూ ముందుకు అడుగు వేశాడు.

మన విశ్వాస జీవితంలో కూడా ధైర్యంగా ఉండాలి అది మాత్రమే కాదు చదువులలో, ప్రయాణాల్లో, ఆటల్లో అన్నిటిలో ధైర్యంగా ముందుకు వెళ్లాలి.

అబ్రాము దేవుని నమ్ముకొని ముందుకు సాగారు కాబట్టి ఆయన గొప్ప విశ్వాసిగా అనేక జాతులకు తండ్రిగా చేయబడ్డారు, మనం కూడా రూపాంతరం చెందాలంటే అబ్రాము వలే విడిచి పెట్టాలి, విశ్వసించాలి, విదేయించాలి దేవుని కొరకు ధైర్యముగా ముందుకు వెళ్లాలి.

ఈనాటి రెండవ పఠనం లో పౌలు గారు తపస్సు కాలం యొక్క మార్పు ఏ విధంగా ఉండాలో తెలియజేస్తున్నారు.

దేవుని యొక్క సువార్త కొరకు అన్ని రకాలైన ఇబ్బందులు బాధలు ఎదుర్కోవాలి అదేవిధంగా మనం పవిత్ర ప్రజలుగా జీవించుటకు దేవుడు పిలిచినందుకు దేవునికి కృతజ్ఞులై జీవించాలి.

దేవుని కొరకు జీవించే సందర్భంలో మన యొక్క శక్తి మీద కాకుండా దేవుని యొక్క శక్తి మీద ఆధారపడి జీవించాలి.

ఒక రెండవ పఠనం   నాలుగు ప్రధాన అంశాలు తెలుపుచున్నది.

1. సువార్త కొరకు బాధలు, హింసలు అనుభవించుట

2. దేవుడు మన యొక్క గొప్పతనం వల్ల కాకుండా, తన ప్రేమ వలన మనల్ని పిలిచారని గ్రహించుట

3. దేవుని యొక్క గొప్ప కార్యాలు చేయుటకు అంగీకరించి జీవించుట

4. నిత్యజీవం ఉందని విశ్వసిస్తూ మరణమునకు సిద్ధపడుట

ఈ నాలుగు అంశాలు మనల్ని దేవుని దగ్గరకు చేర్చుతాయి.

ఈనాటి సువిషేశ పట్టణంలో యేసు ప్రభువు యొక్క రూపాంతరం చెందుటను మనం చదువుకున్నాం.

ఏసుప్రభు యొక్క దివ్య రూపధారణ వలన తండ్రి దేవుడు ఏసుప్రభు తన యొక్క ప్రియమైన కుమారుడని తెలుపుచున్నారు ఆయన యొక్క దైవత్వం ప్రకటిస్తున్నారు.

దివ్యబలి పూజలో గోధుమ అప్పం, ద్రాక్షారసము ఏసుప్రభు యొక్క శరీర రక్తాలుగా రూపాంతరం చెందుతున్నాయి.

జ్ఞాన స్నాన దివ్య సంస్కారం మనల్ని దేవుని యొక్క పుత్రులుగా రూపాంతరం చెం దిస్తుంది.

పాప సంకీర్తనం  ద్వారా పాపి పవిత్రుడయ్యేలా చేస్తుంది. ఆమె/అతడు మారుతున్నారు వారి జీవితం మారి గొప్ప వారిగా చేయబడుతున్నారు.

దేవుడిని కలుసుకున్న సమయాలలో ప్రతి ఒక్కరి జీవితం రూపాంతరం చెందుతుంది.

- మోషే జీవితం రూపాంతరం చెందుతుంది

-  సౌలు జీవితం

- పేతురు యొక్క జీవితం

- మద్దల మరియమ్మ జీవితం

ఇంకా చాలామంది  జీవితాలు మారుతున్నాయి.

మన జీవితంలో కూడా ఏసుప్రభు వలే పర్వత అనుభూతి కావాలి. తూర్పు దేశాలలో ఆధ్యాత్మికతలో పర్వతానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. దేవునితో గడపటానికి దేవుని యొక్క సాన్నిత్యం అనుభవించడానికి అదేవిధంగా దేవునితో ఆత్మీయ అనుభూతిని పొందటానికి ఎత్తైన పర్వతాలే సరైన ప్రాంతం అని కొందరి యొక్క విశ్వాసం, నమ్మిక అందుకే పర్వతాల మీదకు వెళుతుంటారు.

దేవుడు ఉన్నత స్థలంలో నివసిస్తాడు అన్నది కూడా కొందరి యొక్క నమ్మకం, కొన్ని శతాబ్దాలుగా ఈ నమ్మకం కొనసాగుతుంది. చాలామంది విశ్వాసులు దీనిని అనుసరిస్తున్నారు కొండను ఎక్కి వెళ్ళటం ద్వారా దేవునికి మరింత దగ్గర అవుతామని కూడా కొంతమంది భావించేవారు.

పర్వతం పైన ఉన్న చల్లని వాతావరణం, గాలి, ప్రశాంతత కూడా దేవుని కలుసుకునుటకు ఉపయోగపడును.

పవిత్ర గ్రంథంలో కొన్ని సంఘటనలు ఉన్నాయి దేవుడు మనుషులను కొండమీద కలుసుకున్న సమయాలు:

1. మోరియా పర్వతం వద్ద అబ్రహాము దేవుని కలుసుకున్నారు - ఆది 22:11-12

2. సినాయి పర్వతము వద్ద మోషే దేవుని కలుసుకున్నారు - నిర్గమ 24:12-18

3. కార్మెల్ కొండమీద ఏలియా దేవుని కలుసుకున్నారు - 1 రాజు 18:31-41

4. తాబోరు  కొండమీద శిష్యులు దేవుణ్ణి కలుసుకున్నారు.

5. కల్వరి కొండమీద ఏసుప్రభువు నిజమైన దేవుడని సైనికుడు గ్రహిస్తూ ఆయనను కలుసుకున్నారు.

6. ఏసుప్రభు యొక్క మరణం తరువాత కూడా శిష్యులు పర్వతము వద్దకు వెళ్లారు అని కొందరి నమ్మకం.

మనం చూసిన అన్ని ఉదాహరణలలో అందరూ పర్వతం ఎక్కిన తరువాతనే దేవుడు వారిని కలుసుకుంటున్నారు.

మన యొక్క విశ్వాస జీవితంలో కూడా- 

- పవిత్రత అనే పర్వతం ఎక్కాలి

-మంచితనం అనే పర్వతం ఎక్కాలి

- స్వార్థం విడిచి ముందుకు సాగాలి

- ప్రేమను అలవర్చుకొని పర్వతం ఎక్కాలి

- శోధనలు అనే పర్వతం ఎక్కాలి

- శ్రమలు అనే పర్వతం ఎక్కాలి

ఎప్పుడైతే మనం ఇహలోక కోరికలు, శోధనలు అధికమించి మంచిగా ప్రార్థన చేసుకుంటూ దేవుని యొక్క మాట ప్రకారం ఆయనకు విధేయత చూపుతూ ఆయన యొక్క ఆజ్ఞలు పాటిస్తామో  అప్పుడు మనకు దేవుని దర్శనం అనుభూతి కలుగుతుంది, ప్రయత్నం చేసిన వారందరూ పర్వతం ఎక్కలేరు, కేవలం కష్టపడి ఎన్ని ఇబ్బందులు అలసటలు ఎదుర్కొనీ వెళ్లేవారే ఎక్కగలరు, పర్వతం ఎక్కే సమయంలో జాగ్రత్తగా ఉండాలి, కష్టపడాలి అలసిపోతాం అయినా సరే ముందుకు వెళితే దైవ అనుభూతి కలుగుతుంది మన యొక్క విశ్వాస జీవితంలో కూడా దైవ అనుభూతి కావాలంటే ఆధ్యాత్మికంగా మనం కష్టపడాలి. ఈ లోక ఆశలు విడిచి పెట్టడానికి కష్టపడాలి శోధనలలో పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి అప్పుడే మనం దేవుడిని కలుసుకునగలం.

ఏసుప్రభు తాబోరు  పర్వతం ఎక్కినది తండ్రిని కలుసుకునుటకు, తండ్రి చిత్తమును సంపూర్ణంగా నెరవేర్చుటకు కావలసిన శక్తిని, ధైర్యంను పొందుటకు అలాగే తండ్రి యొక్క సమ్మతి తీసుకొనుటకు ఆయన పర్వతం మీదకు వెలుచున్నారు.

వ్యక్తిగతంగా తనను తాను సిద్ధం చేసుకొనుటకు ప్రార్థించుటకు ప్రభువు పర్వతం మీదకు వెళ్లారు.

తపస్సు కాల మొదటి ఆదివారంలో యేసు ప్రభువు మానవ స్వభావంలో ఎదుర్కొన్న విషయాలు మనం నేర్చుకున్నాం. ఈ రెండవ వారంలో ఏసుప్రభు యొక్క దైవత్వమును ధ్యానించుకోవాలి ఆయన నిజముగా దేవుని కుమారుడని తెలుసుకోవాలి.

ప్రభువు శిష్యుల యొక్క విశ్వాసాన్ని బలపరుస్తున్నారు. ఆయన ఏ వారు ఊహించి మెస్సయ్య అని ఎరుకపరచుచున్నారు. ఏసుప్రభువు, పేతురు, యోహాను, యాకోబులను ఎందుకు పర్వతం కు తీసుకొని వెళుతున్నారంటే ఇద్దరూ లేక ముగ్గురు చెప్పే సాక్ష్యం నిజం అవుతుంది  - ద్వితి 19:15 అంటే ఒక విషయాన్ని నిరూపించాలంటే ఇద్దరూ లేక ముగ్గురు సాక్షుల అవసరం అందుకే ప్రభువు ముగ్గురును తీసుకొని వెళ్చున్నారు ఆయన యొక్క దివ్యరూపధారణకు వారే సాక్షులు.

ఏసుప్రభు ప్రార్ధించే సమయంలో రూపాంతరం చెందుచున్నారు మన యొక్క జీవితాలు కూడా ప్రార్థనలు ద్వారా  రూపాంతరం చెందాలి. ఇక్కడ అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే ఆనాటి యూదుల యొక్క నమ్మకం అలాగే పౌలు గారి యొక్క బోధన ఏమిటంటే నీతిమంతుల యొక్క శరీరాలు దివ్య శరీరంలో గా మారే అవకాశం ఉందని తెలుపుచున్నారు - 1 కొరింతి 15:49,2 కొరింతి 5:1-10.

నీతిమంతులు దేవుని యొక్క మహిమను పంచుకొంటారు మోషే 40 రోజులు దేవునితో గడిపిన తరువాత ఆయన మహిమను పంచుకుంటున్నారు - నిర్గమ 34

మనం కూడా నీతిమంతులుగా జీవించాలి అది దేవుడు మన నుండి కోరుకుంటారు.

ఏసుప్రభు వస్త్రాలు తెల్లగా ఉన్నాయి అవి ఆయన యొక్క పవిత్రతకు గుర్తు కాబట్టి.

మోషే, ఏలియాలను కూడా పర్వతం మీద దేవుని యొక్క అనుభూతి కలిగినది అందుకే వారిద్దరూ అక్కడ దర్శనంలో కనిపించారు.

- మండుచున్న పొద లో  దేవుడు మోషేకు దర్శనం ఇచ్చారు - నిర్గమ 3:1-4

- సినాయి ప్రభుత్వం వద్ద దేవునితో గడిపారు - నిర్గమ 24:1,34:29

- దేవునితో ఉన్నప్పుడు ఆయన ముఖం ప్రకాశించింది - నిర్గమ 34:29-38

- ఏలియా హోరేబు కొండ వద్ద దేవుని కలుసుకున్నారు - 1 రాజు 19:9-18

మోషే అలాగే ఏలియాలు ఎత్తరు గొప్ప ప్రవక్తలు ఎందుకంటే మోషే దేవుని వల్ల వారికి ధర్మశాస్త్రము అని ఇచ్చారు ఏలియా ప్రవక్తల అందరి నాయకుడు అందుకే ఏసుప్రభు యొక్క సిలువ శ్రమలు పొందటానికి సరి అయిన సమయం అని తెలియజేయుటకు దర్శనంలో ఇద్దరు కనబడుచున్నారు.

ఈ దర్శనంలో తండ్రి దేవుడు ఇతడు నా ప్రియమైన కుమారుడు ఇతన్ని ఆలకించండి అని పలుకుచున్నారు ఆయన స్వరం ఆలకించి జీవిస్తే మన జీవితాలు సంతోషంగా ఉంటాయి ఆయన మాటలు వినకపోతే మన జీవితంలో ఆధ్యాత్మిక ఎదుగుదల ఉండదు.

పవిత్ర గ్రంథంలో కొంతమంది దేవుని స్వరం విన్నారు కొందరు వినలేదు వారి చివరి ఫలితం ఎలాంటిదో కూడా మనకు తెలుసు కాబట్టి ఆయన మాటలు వినాలి.

మన యొక్క జీవితంలో మరియు ముఖ్యంగా ఆధ్యాత్మిక జీవితంలో మనం దిన దినము రూపాంతరం చెందాలి ఈ తపస్సు కాలంలో మన జీవితాలు దేవునికి ఇష్టమైన విధంగా మారాలి.

మనం మన యొక్క పాపపు జీవితం నుండి రూపాంతరం చెందాలి.

- స్వార్థం నుండి నిస్వార్ధంగా రూపాంతరం చెందాలి

- లోక వ్యామోహాల నుండి దేవుని వైపుకు రూపాంతరం చెందాలి

- అధికార వాంఛల నుండి సేవా భావం కు రూపాంతరం చెందాలి

- అసూయ ద్వేషం నుండి ప్రేమించుటకు రూపాంతరం చెందాలి

- ప్రార్థించుటలో ప్రేమించుటలో రూపాంతరం చెందాలి.

దేవుని యొక్క అనుగ్రహంతో రూపాంతరం చెంది దేవునికి మన యొక్క తల్లిదండ్రులకు సంతోషమును యుద్ధం రూపాంతికరణ ఏసుప్రభు మెసయని తెలుపుతుంది - రోమి 11:25.

ఎందుకు పేతురు యోహాను యాకోబు? మొదటిగా పేతురు గారు శ్రమలు పొందటం ఇష్టం లేని వ్యక్తి తరువాత యోహాను యాకోబులు వేరు ఏసుప్రభువు కుడి ఎడమ స్థానాల కోసం అడిగినవారు.

లూకా సువార్త తొమ్మిదవ అధ్యాయంలో ఏసుప్రభు రక్షకుడని వెల్లడిస్తుంది.

ఈ అధ్యాయంలోని హేరోదు ప్రభువును తెలుసుకోవాలనుకుంటున్నారు పేతురు గారు ఏసుప్రభువును రక్షకునిగా గుర్తించారు ఏసుప్రభువును రక్షకునిగా గుర్తించిన తరువాత ఆయన తన మరణం గురించి మాట్లాడారు ఈ రూపాంతికరణ అనేది ముఖ్యం ఎందుకంటే తన శిష్యులకు యేసు ప్రభువు ఎవరో ఆయన చేసే పని ఏమిటో ముందుగా తెలియాలి దాని ద్వారా వారిలో ఉన్న కొన్ని చెడు అభిప్రాయాలు మారిపోవాలి సిలువ మరణం అంగీకరించి జీవించాలని తెలుపుటకు ప్రభువు వారిని పర్వతం మీదకు తీసుకెళుచున్నారు పేతురు గారు ఏసుప్రభువును రక్షకుడని ప్రకటించిన తరువాత మీలో కొందరు దేవుని రాజ్యం చూసే వరకు మరణించారని ఏసుప్రభు అన్నారు అది ఎక్కడ జరుగుతుంది.

శిష్యుల సాక్ష్యం- ప్రభు యొక్క రూపాంతికరణను అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. వారు ఆయన యొక్క పునరుద్దానం తరువాత దీనిని గురించి రాస్తున్నారు. - యోహాను 1:14 -ఆయన మహిమను చూశాము అన్నారు.

1 పేతురు 1:16-17

శిష్యులు నిశ్శబ్దంగా ఉన్నారు అంటే మాట్లాడకుండా ఉండటం కాదు దేవుని సాన్నిద్యంలో మాటలకు అంతుపట్టని అనుభూతిని అనుభవించటం - లూకా 2:9 మరియమ్మ గారు ఆ వచనాలు తనలో మననం చేసుకుంది.

ఈ తపస్సు కాల దైవ అనుభవం మనల్ని కూడా మార్చాలి.

FR. BALAYESU OCD

సామాన్యకాలపు ఇరవై ఏడవ ఆదివారము

సామాన్యకాలపు ఇరవై ఏడవ ఆదివారము  ఆదికాండము 2:18-24 హెబ్రీయులకు 2:9-11 మార్కు 10:2-16 క్రీస్తునాధునియందు ప్రియ సహోదరీ సహోదరులారా, దేవుని బిడ్డ...