16వ సామాన్య ఆదివారము
కోలస్సి 1: 24-28
లూకా 10: 38-42
క్రీస్తునాదునియందు ప్రియమైనటువంటి పూజ్యగురువులు మరియు దేవునిబిడ్డలైనటువంటి క్రైస్తవ విశ్వాసులారా. ఈనాడు తల్లి శ్రీసభ పదహారోవ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశించియున్నది.
ఈ నాటి మూడు దివ్య గ్రంథ పఠనములను గ్రహించినట్లైతే మూడు కూడా ముఖ్యమైనటువంటి రెండు అంశాల గురించి మనకు తెలియజేస్తున్నాయి అవి ఏమిటంటే.
1) దేవుని మానవుడు ఆహ్వానించటం
2) దేవుని యొక్క ఆశీర్వాదం.
ఈ రెండు అంశాలు ఈ నాటి పఠనాలలో క్లుప్తంగా చూస్తున్నాము. మొదటి పఠనముమరియుసువిశేషపఠనములలో చూసినట్లయితే
దేవుడు మానవుల యొద్దకు వచినప్పుడు మానవుడు ఏవిధంగా దేవుని ఆహ్వానించి తనకు ఉన్న దానిలో దేవునికి సమర్పించింది మరియు దేవుని యొక్క ఆశీర్వాదాలు ఏవిధంగా పొందియున్నారో చూస్తున్నాము. మానవుడు దేవుని యొక్క ఆశీర్వాదములు పొందాలంటే ఏమి చేయాలి అని మనం గమనించినట్లయితే ఈ నాటి పఠనాలలో చూస్తున్నాము అబ్రాహాము మరియు మార్తమ్మ, మరియమ్మలు ఏవిధంగా దేవుని యొక్క అనుగ్రహాలను పొందియున్నారో.
ముందుగా మొదటి పఠనంలో చూసినట్లయితే రెండు మూడు వచనాలలో అబ్రాహామునకు అతిధులు కనిపించినప్పుడు అబ్రాహాము వారి యొద్దకు వెళ్లి ఏవిధంగా వారిని తనయొక్క ఇంటిలోనికి ఆహ్వానించి వారికీ అన్ని విధాలుగా పరిచర్య లేదాసేవ చేస్తున్నాడో మనమందరము కూడా గమనిస్తున్నాము అతని యొక్కసేవ మరియు విశ్వాసము ద్వారా ఆముగ్గురు వ్యక్తులు అబ్రాహామును మరియు సారాను దీవించి వారికీ సంతాన ప్రాప్తిని దయచేసి ఉన్నారు, నిజంగా చెప్పాలంటే ముసలి వయసులో బిడ్డలను కనడం అంటే ఒక గొప్ప అద్భుతమే, ఈయొక్క అద్భుతాన్ని దేవుడుతప్ప మానవుడు చేయలేడు కాబ్బటి అబ్రాహాము మరియు సారాను ఆశీర్వదించిన వారు దేవుడనే చెప్పవచ్చు.
సువార్త పఠనంలో మరియా, మార్తలు ఒక గొప్ప వ్యక్తిని తనయొక్క ఇంటికి ఆహ్వానించి ఆ వ్యక్తికి అతిధి సంప్రదాయాలు చేయటం మనం చూస్తున్నాము. ఆ వ్యక్తియే యేసుప్రభు ఇక్కడ మనం గమనించినట్లయితే మానవుడు దేవుని పట్ల చూపాల్సిన ప్రేమ, శ్రద్ధ మరియు అంకిత భావం ఎప్పుడైతే కలిగి జీవిస్తునాడో అప్పుడే దేవుడు మానవుని ఆశీర్వదించటం మనమందరము చూస్తున్నాము అతిధిని ఎలా సత్క రించాలో ఈ నాటి పఠనములు మనకు ప్రత్యే కంగా తెలియజేస్తున్నాయిన మరియు మన తోటి వారిని ఏ విధంగా గౌరవించాలి, వారితో ఏ విధంగా ఉండాలో అబ్రాహాము మరియు మార్తా, మరియల ద్వారా మనం తెలుసుకోవచ్చు అంటే ఈ రెండు సన్ని వేశాలు కూడా మనకు ఇంకొక్క విషయాన్ని కూడా తెలియజేస్తున్నాయి అదే విందు.
రెండు పఠనాలు కూడా అబ్రాహాము మరియు మార్తలు అతిధులను ఆహ్వానించినప్పుడు వారికీ వీరిద్దరూ కూడా విందును తయారు చేసి వారికీ గౌరవప్రదంగా పెట్టడం మనం చూస్తున్నాము.
అదే విధంగా క్రైస్తవులమైన మనం దివ్యబలి పూజలో పాల్గొన్నప్పుడు ఏవిధంగా వుంటున్నామో ఒక్కసారి మనం గమనించుకోవాలి ముఖ్యంగా ప్రతిరోజు మనం దివ్య బలిపూజలో పాల్గొన్నప్పుడు ఏవిధంగా పాల్గొంటున్నామో మరి ముఖ్యంగా దివ్య సప్రసాదాన్ని స్వీకరించేటప్పుడు మనము భక్తితో మరియు ప్రేమతో స్వీకరిస్తున్నామ, మరియా ఏవిధంగానైతే క్రీస్తు యొక్క పాదాల చంత కూర్చొని క్రీస్తు చెప్పిన ప్రతి ఒక్క మాటను ప్రేమతో మరియు శ్రద్ధతో విన్నదో అదే విధంగా మనం దివ్య సత్ప్ర సాదాన్ని స్వీకరించే ముందు చేయాల్సిన పని గురువు చెప్పిన దానిని శ్రద్ధగా విని ఆ యొక్క వాక్యాన్ని ప్రేమతో ఆహ్వానించి దివ్య సత్ప్రసాదని స్వీకరించాలి అప్పుడు మనం దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతాము అంతే కాకుండా క్రీస్తు ప్రభు మన యొక్క హృదయంలోనికి ప్రవేశిస్తారు, కాబ్బటి ప్రియ దేవుని బిడ్డలారా ఏ విధంగానైతే అబ్రాహాము, మార్త మరియు మరియలు అతిధులను ఆహ్వానించి మరియు వారు ఇచ్చినటువంటి ఆశీర్వాదములను ప్రేమతో స్వీకరించారో అదే విధంగా క్రైస్తవులమైన మనము దేవుడు ఇచ్చిన ఆశీర్వా దాలు మరియు దేవుడు చెప్పిన దానిని మన జీవితాలలో పాటించాలని ఈ దివ్య బలిపూజలో ప్రార్దించుదాం మరియు దేవుని యొక్క ఆశీర్వాదాలను ప్రేమతో స్వీకరించుదాం, ఆమెన్.
బ్రదర్. జొహాన్నెస్. ఓ.సి.డి