4, సెప్టెంబర్ 2021, శనివారం

23 వ సామాన్య ఆదివారం

నేటి  దివ్య గ్రంధ పఠనాలు దేవుని మీద విశ్వాసము ఉంచిన  వారి  జీవితములో దేవుడు  వారికి
ఎల్లప్పుడు  తోడుగా వుండును అని   వారికి  సకాలములో  దీవెనలు  ఒసగుతారు అనే అంశమును
బోధిస్తున్నాయి. మరియు   దేవుని  మీద భారం వేసి  తన చెంతకు  వచ్చిన  వారి  అక్కరలను
తీర్చి   దేవుడు ఎప్పుడు  కూడా చేరువలోనే  ఉంటారు అనే అంశాన్ని ఈనాటి పఠనాలు
తెలియచేస్తున్నాయి. ఈనాటి మొదటి పఠనంలో
  దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఒక నూతన 
 ఉత్తేజమును , నూతన సంతోషమును ,నూతన ధైర్యమును నింపుచున్నారు.

ఒక విధముగా చెప్పాలంటే  బాబిలోనియా బానిసత్వములోమగ్గుతున్నా ఇస్రాయేలీయులకు
 దేవుడు విముక్తి  కలు చేస్తారనే ఒక  శుభవార్తను యెషయా ప్రవక్త  ద్వారా వెల్లడిస్తున్నారు.
ఇస్రాయేలు ప్రజలు  దేవుని మరిచిన  సమయములో  వారికి అనేక విషయాలు  నేర్పించుటకు
ప్రభువు వారిని  బానిసలుగా  వెళ్ళడానికి  సమ్మతిస్తున్నారు.ఇది కేవలము  యిస్రాయేలు మరలా  దేవుని గొప్పతనం  తెలుసుకొని ఆయనవద్దకు రావాలనేఉద్దేశము వల్లనే.  క్రీస్తు పూర్వము 587 వ సంవత్సరములో నెబుకద్నేసర్ రాజు పాలనలోయొరుషలేము పై దండెత్తి  జయించారు. ఆ సమయములో  ఇస్రాయేలు  ప్రజలు  తమ రాజ్యాన్నికోల్పోయారు, వారికి ఇష్టమైన  యొరుషలేము  దేవాలయమును కోల్పోయారుచాలామందినిబానిసలుగా  బాబిలోనియకు , ఈడ్చుకొని పోయారు. అంతటి దురదృష్టకరం దేవునుని విడిచిపెట్టడంవల్ల , అన్య దైవములను  కొలుచుటవలన  వీరికి ఇంతటి హీనస్థితి ఏర్పడింది.  అయితే దేవుడు వారిని శాశ్వతముగా  బానిసలుగా ఉంచకుండా  50సంవత్సరాల తరువాతపర్షియా రాజు కోరెషు ద్వారా విముక్తినికలుగజేస్తున్నారు. వారికి స్వేచ్ఛనిస్తున్నారు,  మాతృభూమినిస్తున్నారు ,అలాగే వారి దైవాన్నిపూజించుటకు యెరూషలేము వెళ్ళమన్నారు. బాబిలోనియా నుండి బయటకు వచ్చిన యిస్రాయేలు ప్రజలకు చెప్పిన  విలువైన మాటలను మనము ఈరోజు వింటున్నారు. తనను  పిలిచిన  ప్రజలకు, తన మీద  ఆధారపడిన వారికి దేవుడు ఎప్పుడు దగ్గర లోనే ఉంటారు అని  తెలుపుతున్నారు.
యూదా  ప్రజలు దాదాపు 50 సంవత్సరాల తరువాత యెరుషలేముకు తిరిగివచ్చారు, అప్పటికే అక్కడ ఏదోమీయులు నివసించడము ప్రారంభించారు. వారి మధ్య ఒక రకమైన ఘర్షణ ఉన్నసమయములో దేవుడు యెషయా ద్వారా పలుకుచున్నారు వారికీ తోడుగా ఉంటానని. 1.దేవుడు తన ప్రజల పక్షాన  నిలిచి కాపాడతాడని తెలుపుచున్నాడు. 2. దేవుడు తన ప్రజలతో ఉండే సమయములో చాలా గొప్ప కార్యాలు  జరుగుతాయని యెషయా ప్రవక్త  పలుకుచున్నాడు. అవి ఏమిటి అంటే  గ్రుడ్డివారు చూస్తారు, చెవిటివారు  వింటారు, మూగ వారుమాట్లాడుతారు,  కుంటివారు లేడివలె గంతులు వేస్తారు, ఎడారిలో జలములు పెల్లుబుకును అని చెపుతున్నారు.దేవుడు తన ప్రజలతో ఉంటే వారికి కలిగే ప్రయోజనాలు ఇవి, తనకు మొరపెట్టిన ప్రజలమనవులను ప్రభువు ఆలకించి  వారికి ఇవ్వవలసిన వరాలు దయ చేస్తారు.

గ్రుడ్డివారు చూస్తారు అని పలికారు. ఎవరైతే దేవుని అద్భుతాలు చూడలేరో  వారందరు ఒకరకంగా
 గ్రుడ్డివారే, ఎందుకంటే దేవుని గొప్ప కార్యాలు వారు చూడలేక పోతున్నారు ఈ అద్భుతాలు అన్ని 
చేయడము ద్వారా దేవుడు ఇంకా కొన్ని విషయాలు తెలుపుచున్నాడు. 1. మరల యొరుషలేము
 వచ్చినప్పుడు దేవుడు వారిని పూర్వంలానే ఆశీర్వదిస్తానని తెలుపుచున్నాడు. 2. దేవుని యొక్క అభయం ఎప్పుడు వారిమీద ఉంటుందని తెలుపుచున్నాడు. 3. దేవుడు తన ప్రజలకు సమృద్ధిగా అన్ని ఇస్తారని కూడా తెలుపుచున్నారు. ఆరోగ్యం, నీరు,మొదలుగునవి. 4. దేవుడు  వారిని శత్రువుల బారినుండి కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు. 5దేవుని చెంతకు నిరాశలో, బాధలో, ఉన్నవారు నమ్మకంతో మరలీ  వస్తే వారిని ఆదుకుంటాను అని కూడా ప్రభువు తెలియ చేస్తున్నాడు.

మనము విశ్వసించే దేవుడు  మనలను ఆదుకోవడానికి వస్తారు , తన కుమారుని ద్వారా మన
 మధ్యకు వచ్చారు. మొదటి పఠనంలో చెప్పబడినవి అన్ని కుడా తన కుమారుని ద్వారా
  నెరవేర్చబడ్డాయి. మూగవారు మాట్లాడారు , చెవిటివారు విన్నారు ,గ్రుడ్డివారు చూడగలిగారు ,బీడు భూములుగా ఉన్న జీవితాలలో వెలుగులు నిండాయి.

 రెండవ పఠనంలో యాకోబుగారు  ఎటువంటి పక్షపాతం లేకుండా అందరు క్రీస్తునందు 
విశ్వాసము గలవారు ,పేదలను,  ధనికులను ఒకే దృష్టితో  చూడాలని  తెలుపుచున్నారు. ఆనాడు ఈనాడు, దేవుడు ఎలాగైతే తన ప్రజలను సమదృష్టితో చూసారో మనము కూడా  మన పొరుగు వారిపట్ల అలాగే ఉండాలి. అపోస్తుల కార్యాలు 10:34-43 వరకు చదివితే అక్కడ పేతురుగారు దేవుడు ఎటువంటి పక్షపాతము చూపించరు అని చెపుతున్నారు. ఆయన సకాలములో వర్షముకాని,ఎండకాని అందరికి దయ చేస్తారు ఎటువంటి భేదము లేకుండా. మత్తయి 5:45. దేవుడు అందరిని సమ దృష్టితో చూస్తారు. (ద్వితీయోపదేశకాండము 10:17 రోమి 2:11,) దేవుని దృష్టిలో అందరు  సరిసమానులే , అందరు ఆయన బిడ్డలే, మనం పక్షపాతము చూపించుట ద్వారా పేద, ధనిక అనే విభజనను చేస్తున్నాము. దీని ద్వారా సంఘము  విడిపోతుంది. ఈనాటి  ఈ రెండవ పఠనముద్వారా యాకోబు గారు ఒక ఆచరణాత్మక విషయము మనకు వెల్లడిస్తున్నారు, మనమందరం ఒకరినొకరు సహోదరిసహోదరులుగా జీవించాలి . మనమందరం ఒకే దేవుని బిడ్డలము కాబట్టి కలిసి జీవించాలి. యాకోబుగారు ఈ లోకములోని  పేదవారు తొందరగా పరలోక రాజ్యములోచేరతారని అంటారు ఎందుకంటే వారి విశ్వాసములో ధనికులు. దేవుని మీద ఆధారపడుటలో వారు ధనికులు. యేసు ప్రభువు  కూడా పేదవారు ధన్యులు దేవా రాజ్యం వారిది అని పలికారు. యేసు ప్రభువు ధనికుడు - లాజరు  అను  ఉపమానమును ద్వారా పేదవారు దేవుని రాజ్యములోతొందరగా ప్రవేశిస్తారు అని తెలుపుచున్నాడు. మన సమాజములో మనం ఈ వ్యత్యాసాలుచూపిస్తాం. ధనికులతో మంచిగా ఉండటం, పేదవారిని దూరముగా ఉంచుతాము,కానీ యాకోబుగారు  మనము అందరిని ఒకేరీతిగా  చూడాలని తెలుపుచున్నాడు. యేసు ప్రభువు అందరితో సమానముగా  వున్నారు, పాపులతో  సుంకరులతో కలిసి జీవించారు. కాబట్టి  మనము కూడా  అందరితో  కలిసిమెలిసి జీవించి దేవుని రాజ్య స్థాపనకు  కృషి చేయాలి. దేవుడు పేదల పక్షాన  ఎప్పుడు  ఉంటూనే ఉంటారు. నాయీను వితంతువు కుమారుడు చనిపోతే తనకు ఓదార్పు ఇచ్చుటకు తన కుమారుని బ్రతికించారు. పేద విధవరాలు సమర్పించిన  రెండు నాణెములను కూడా ఎక్కువుగా  అంగీకరించారు. మనము కూడా పేదవాని పట్ల, మంచి మనస్సు కలిగి జీవించాలి. వర్ణ , వర్గ , జాతి భేదాలు లేకుండా  పరస్పర ప్రేమ కలిగి జీవించాలి.

      ఈనాటి సువిశేష పఠనములో యేసు ప్రభువు గొప్ప అద్భుతము గురించి వింటున్నాము. యేసుప్రభువు మూగ ,చెవిటివానికి స్వస్థత ఇచ్చిన విధమును తెలుసుకుంటున్నాము. దెకపొలి అనే ప్రాంతములో  అన్యులు  ఎక్కువగా ఉండేవారు అక్కడ అనేక సంవత్సరాలుగా బాధపడే వ్యక్తిని స్వస్థత పరుస్తున్నాడు, ఈ అద్భుతములో యేసు ప్రభువు అందరికి దేవుడని, అందరిని
 సమదృష్టితో చూస్తారని తెలియపరుస్తున్నారు. దేవునియందు, విశ్వాసము ఉంచిన వారందరు
తనబిడ్డలేనని క్రీస్తుప్రభువు తెలుపుచున్నాడు, అందరు సమానులే. ఈ వ్యక్తిని స్వస్థపరిచిన
 విధానము చుస్తే మనకు జ్ఞానస్నానం సాంగ్యములో జరిగే విషయాలు గుర్తుకు వస్తాయి.

 జ్ఞానస్నానములో కూడా ఏప్ఫతా
  సాంగ్యం ఉంది. వీటీద్వారా వినికిడి మాటలాడే వరం
 లభిస్తుంది. ఈ వ్యక్తిని స్వస్థపరచుటలో 7 విధానాలు వాడారు . ఆయన్ను ప్రక్కకు  తీసుకొని వెళ్లారు.(ఎందుకుఅంటే మిగతావారు ఆయనను చిన్నచూపు చూడకుండా ఉండటానికి) 2. తన వ్రేళ్ళు అతని చెవులలో ఉంచారు- దేవుని యొక్క స్పర్శను  అందించారు. దేవుని స్పర్శ తగిలి  స్వస్థత పొందిన వారు అనేకులు . దేవుని స్పర్శ మనలో ఉంటె మనలో కూడా స్వస్థత వస్తుంది. మనము కూడా దేవుని వాక్కు చే తాకబడాలి. దీవెనలు పొందాలి. 3. తన సొంత  వ్రేళ్ళపై  ఉమ్మి  వేసుకున్నారు-
యేసు ప్రభువుకొన్ని సార్లు స్వస్థత ఇచ్చినప్పుడు ఉమ్మితో  చాల మందిని స్వస్తపరిచారు. ఉదా..
బేత్సయిదాలో గ్రుడ్డివానికి స్వస్థత నిచ్చినప్పుడు (మార్కు 8:23), పుట్టుగుడ్డివానికి చూపు
నిచ్చినపుడు (యోహాను 9:6) ఈ రోజు విన్న సువిశేషం మార్కు7:33. ఇదంతా యేసు ప్రభువుకు అవసరము లేదు ఎందుకంటే ఆయన సర్వ శక్తివంతుడు, ఎందుకు ప్రభువు విధముగా  స్వస్థత చేసారు అంటే  అప్పటి ప్రజలు రోమీయులు , యూదా ప్రజలు ముఖ్యముగా బోధకులు ఈ ఉమ్మిలో స్వస్తతను ఇచ్చే గుణం వుంది అని నమ్మేవారు. వారి నమ్మకమును నిజము చేయుటకు ప్రభువు ఉమ్మిని వాడుతున్నారు. 5.తన నాలుకను ఉమ్మితో తాకారు, ఒక పవితమైన వ్యక్తి ఉమ్మిలో స్వస్థతను ఇచ్చే శక్తి ఉందని అప్పటి ప్రజల నమ్మకం. 5. పరలోకం వైపు కన్నులెత్తి  చూశారు, తండ్రికి  ప్రార్థి స్తున్నారు ,తన తండ్రికి కృతఙ్ఞతలు తెలుపుచున్నారు. 6. నిట్టూర్చాడు - ప్రార్ధించాడు దేవుని దీవెన కోసం ప్రభువు తండ్రికి మనవి చేసాడు. 7. ఎప్ఫతా అని పలికారు - తెరవబడుము  అని అనగానే ఆయన చెవులు , పెదాలుతెరవబడ్డాయి. ఎప్ఫతా అనే పదము గురించి మనము ధ్యానించుకుందాము.

- మనందరి యొక్క హృదయాలు కూడా అనేక విషయాలకు తెరువబడాలి.
-దేవుని వాక్కును  ప్రేమతో  మన ,  చెవులు తెరువబడాలి.
-క్షమించుటకు  మన   హృదయము తెరువబడాలి
-దేవుని వాక్కును బహిరంగముగా చాటుటకు మన  పెదవులు తెరవబడాలి.
-దేవుని కార్యాలు విశ్వాసించుటకు మన మనసులు తెరువబడాలి 
- దేవుని ప్రార్దించుటకు , అనుసరించుటకు , ఆరాధించుటకు మన ఆత్మ తెరువబడాలి.
-తల్లిదండ్రులు చెప్పిన లేక చెప్పే మాటలు వినుటకు మన చెవులు తెరువబడాలి .
ఇతరులను సమానముగా చూచుటకు మన మనసు , హృదయం తెరువబడాలి.
దేవుని మీద నమ్మకము ఉంచిన ప్రతి వ్యక్తిని ప్రభువు స్వస్థ పరిచారు. మన జ్ఞాన స్నాన సాంగ్యము
 లో   కూడా మన చెవులనునోటిని తాకుతారు ఎందుకంటే దేవుని వాక్కు  సావధానముగా వినాలని,అనుసరించాలని అదే విధముగా  ఆయన గొప్ప కార్యములునలుగురికి చాటిచెప్పాలని కాబట్టి దేవుని వాక్కు  విని , అనుసరించి భోదిద్దాము.


 By.Rev. Fr. Bala Yesu  OCD



పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు...