7, జనవరి 2023, శనివారం


ప్రభువు సాక్షాత్కార పండుగ

యెషయా 60:1-6

ఎఫెసీ 3:2-6

మత్తయి 2:1-12

 

నేడు మనం యేసు క్రీస్తు ప్రభువు యొక్క సాక్షాత్కార పండుగను కొనియాడుచున్నాం. దీనిని ముగ్గురు రాజుల పండుగ అని కూడా పిలుస్తారు.

దేవుడు తనను తాను ఈ లోకానికి బయలుపరచుకొన్న గొప్ప రోజు మానవ చరిత్రలో జరిగిన అపూర్వమైన, ఆ సామాన్యమైన ఘటనను కనులారా చూసేందుకు ముగ్గురు రాజులు అన్వేషించి వచ్చారు.

సాక్షాత్కారం అంటే ఎరుకపరుచుట అని అర్థం దేవుడు తన ఏకైక కుమారుని ఈ లోకానికి అంతటికి ఎరుకపరిచారు.

ఏసు సాక్షాత్కారం ద్వారా మానవలోకంలో దైవసాక్షాత్కారం జరిగింది.

దేవుడికి మానవులకు మధ్య తెరచాటు తొలగిపోయింది.

ఈ పండుగను మూడు విధాలుగా పిలుస్తారు.

1. ముగ్గురు రాజుల పండుగ

2. విశ్వాసుల పండుగ

3. అన్యుల క్రిస్మస్ పండుగ అని పిలుస్తారు.

ముగ్గురు జ్ఞానులు అయినప్పటికిని వారు దేవుడిని ఆరాధించారు, వారికి అంతయు తెలిసినప్పటికీని వారి కన్నా గొప్ప దేవుడు, గొప్ప రాజు అని వారు గ్రహించి ఆయనను ఆరాధించారు.

ముగ్గురు రాజులు: 

1. కాస్పర్ (అరేబియా) సాంబ్రాణి సమర్పించారు.

2. మెల్కియారు (ఇరాక్) బంగారం

3. బల్తజార్ (పర్షియా) పరిమళ ద్రవ్యం.

బంగారం: దైవత్వానికి గుర్తు, రాచరికనికి గుర్తు, అది విలువైనది. ఎఫెసి 1:20-22.

రాజుల సంప్రదాయం ప్రకారం ఒక రాజు ఇంకొక రాజును చూడటానికి వెళ్లే సమయంలో బంగారం తీసుకుని వెళ్లేవారు. 1 రాజు 10:10 షేభారాణి సొలోమోను చూడటానికి వెళ్ళినప్పుడు బంగారం ను తీసుకొని వెళ్లారు.

మనం కూడా చుట్టాలను చూడటానికి వెళ్లే సందర్భంలో ఏదో ఒకటి తీసుకుని వెళతాం. సృష్టిని చేసిన దేవుణ్ణి దర్శించటానికి వెళ్లే సమయంలో మనం ఏం తీసుకుని వెళుతున్నాం?

బంగారం ఎప్పుడూ కూడా దాని విలువను కోల్పోదు, రంగు మారదు ఎప్పుడూ కూడా అలాగే ఉంటుంది.

ఏసుప్రభు నీ జీవితం కూడా మారని జీవితం ఆయన నిన్నను, నేడును ఎప్పుడు అలాగే ఉంటారు హెబ్రీ 13:8.

ఈ బంగారం యేసు ప్రభువు రాజు అని, పరిశుద్ధుడు అని సూచిస్తుంది.

మనం చాలా సందర్భాలలో దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు బంగారం పెట్టుకొని వస్తాము కానీ బంగారము పట్టుకొని రాము. పట్టుకొని రావటం అంటే పరిశుద్ధతను చేకొని రావడం.

పరిశుద్ధత లేకుండా మనం దేవుడిని చూడలే, దర్శించలేము, ఆరాధించలేము.

యెషయా 59:2 - పరిశుద్ధత మనందరికీ కావాలి

కీర్తన 66:18 పరిశుద్ధత

రెండవ కానుక - సాంబ్రాణి యాజకత్వం కు గుర్తు. ఈ లోకంలో జన్మించిన వ్యక్తి నిజమైన యాజకుడని అర్థం.

తన యొక్క యాజకత్వ విధులు నిర్వహిస్తూ దేవునికి ప్రజలకు మధ్య ఒక నిచ్చెనగ ఉన్నారు, క్రీస్తు ప్రభువు.

సాంబ్రాణి మనందరికీ సువాసన ఇస్తుంది, ఆనందాన్నిస్తుంది దేవుని జీవితం కూడా మనకు ఆనందం ఇస్తుంది.

ఏసుక్రీస్తు ప్రభువు యాజకునికి మనకోసం తానే ఒక బలిగా సమర్పించబడ్డ నిజమైన యాజకుడు.

సాంబ్రాణి పవిత్ర గ్రంథంలో - నిర్గమ 25:1,2,6 35:4,8,27,29

నిర్గమ 30:7-8,2 రాజు దిన 13:11

సంఖ్యా 4:14

1 సమూ 2:28

సాంబ్రాణి దేవునికి సమర్పించేది ఆ విధంగానే ఏసుప్రభు జీవితం కూడా సమర్పించబడినది.

మూడవ కానుక - పరిమళ ద్రవ్యం - ఆయన మరణమునకు గుర్తు.

పరిమళ ద్రవ్యమును చాలా విధాలుగా వాడుతారు.

నిర్గమ 30:28

కీర్తన 45:8 వస్త్రాలకు

సామెత 7:17 పడక మీద

పరమగీతం 1:30 శరీరానికి

యోహాను 19:39-40 మృతదేహాలకు

ముక్కు రంధ్రంలో ఈ పరిమళ ద్రవ్యమును వేస్తే చాలాకాలం మృత శరీరాలను నిలవ చేయవచ్చును.

ఏసుప్రభుని శరీరమును పరిమళ ద్రవ్యముతో అభ్యాంగనము చేయుటకు ఈ విధంగా చేశారు.

ఈ ముగ్గురు రాజులు దేవుడిని తెలుసుకోవడానికి పవిత్ర గ్రంథమును చదవలేదు ఒక నక్షత్రంను అనుసరించుట ద్వారా రాజును కనుగొన్నారు.

1. అన్వేషించుట - వెదకుట

వెదకుట సర్వసాధారణం గా మనం మన జీవితంలో ప్రతిరోజు కూడా దేనికో దానికి వెతుకుతూనే ఉంటాం.

-సంతోషం కోసం వెదకుతాం

-ప్రేమ కోసం వెదకుతాం

పని కోసం వెదకుతాం

-నిజమైన స్నేహితుల కోసం వెదకుతాం.

పవిత్ర గ్రంథంలో వెదికేవారు

1. మరియమ్మ, యోసేపు

2. వర్తకుడు

3. పోగొట్టుకున్న నాణెం

4. తప్పిపోయిన గొర్రె

మనం నిజాయితీగా వెతికితే తప్పనిసరిగా దాని నీ కనుక్కుంటాం వెదకుడు మీకు దొరకబడును - మత్తయి 7:7.

మన యొక్క జీవితంలో దేవుని వెదకాలి, ఆయన చిత్తం వెదకాలి, ఆయన యొక్క సుగుణాలు వెదకాలి.

2. వారి యొక్క విశ్వాసం - యూదులు ధర్మశాస్త్రమును తెలిసినప్పటికిని ప్రభువు యొక్క జనన సాంకేతాలు గుర్తించలేదు. అనీలు జ్ఞానులు కేవలం నక్షత్రమును మాత్రమే ఆధారంగా చేసుకొని వెంబడించారు.

నక్షత్రం కేవలం రాత్రి మాత్రమే కనబడుతుంది కాబట్టి అది ఒక చీకటి ప్రయాణం దానికి మూలం విశ్వాసమే.

వారు అంతగా విశ్వసించారు కాబట్టి అయినా శ్రమించి ప్రయాణం చేశారు.

వారు విశ్వసించారు కాబట్టియే నడవసాగారు.

వారి ప్రయాణం అంత సామాన్యమైనది, సులభమైనది కాదు అయినప్పటికీ వారు ఓపికతో ప్రయాణం చేశారు. వారి ప్రయాణంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ఆ దేవుని విశ్వసించారు అందుకే ఆయనను చేరారు.

అన్ని రాత్రులు ప్రయాణం చేశారు ఎక్కడకు నక్షత్రం తీసుకొని వెళ్తుందో తెలియదు అయినా ప్రయాణం చేశారు ఎందుకంటే విశ్వసించారు.

3. నూతన మార్గానికి మలుపు - జ్ఞానులు బాల యేసును ఆరాధించిన తరువాత వారు వేరొక మార్గమున తిరిగి వెళ్లారు.

పాతది విడిచిపెట్టి క్రొత్త మార్గం ను వెంబడించారు.

వేరొక మార్గం అంటే ఒక భౌగోళికమైన క్రొత్త దారి మాత్రమే కాదు అది ఒక మనస్తత్వం మానసిక స్వభావం, కొత్త హృదయం, జీవితం ఆనందమును దేవునికి సాన్నిద్యాన్ని మోసుకొని వెళుతున్నారు.

ప్రభు నీ తెలుసుకొన్న వారు కలుసుకున్న వారు ఎప్పుడూ పాత జీవితం జీవించరు.

-సౌలు

-జక్కయ్య

తెలుసుకొని కలుసుకున్న తరువాత మన జీవితం మునుపటి లాగా ఉండదు.

అప్పుడు వారు వేరే మార్గం ద్వారా ప్రయాణం చేస్తారు.

4. నక్షత్రం - వెలుగునిస్తుంది

వారు చూసిన నక్షత్రం వారిని సంతోషంతో నింపింది. మనం కూడా ఇతరులను సంతోషంతో నింపాలి. నక్షత్రం జ్ఞానులను నడిపించింది అలాగే మనం కూడా ఇతరులను దేవుని వైపునకు నడిపించాలి. ఈ నక్షత్రం వేలాది నక్షత్రాలలో ప్రత్యేకమైనది అలాగే మన జీవితం కూడా మిగతా వారి కన్నా ప్రత్యేకంగా ఉండాలి- ప్రేమించుటలో, ప్రార్థించుటలో, క్షమించుటలో etc..

నక్షత్రం ప్రత్యేకమైనది అయినా కానీ మిగతా నక్షత్రాల మధ్యనే ఉన్నది మనం కూడా అందరితో మంచిగా ఉండాలి.

5. వారిలో ఉన్న గాఢమైన కోరిక- దేవుణ్ణి చూడాలి, తాకాలి, ఆయన్ను ఆరాధించాలి అని అనుకున్నారు. కోరిక ప్రకారం శ్రమించారు అప్పుడు కార్యసాధకులుగా ఉంటున్నారు.

6.వారు జ్ఞానులు రాజులు అయినప్పటికీ అప్పుడే జన్మించిన శిష్కుని ఆరాధించారు సాష్టాంగ పడి నమస్కారం తెలిపారు అది వారి వినయంకు గుర్తు.

7. దేవుని మాటలకు విధేయత చూపారు.

8. దేవునికి విలువైన కానుకలు సమర్పించారు.

9. దేవునికి తమ కానుకలను సమర్పించారు.

10. దేవునికి, రాజుకు తమ హృదయాలను విప్పి పూర్ణ హృదయంతో ఆరాధించారు.

11. ముగ్గురు రాజులు కలిసి ఉంటున్నారు. వారి ప్రయాణం కలిసి సాగుతుంది మనం కూడా కలిసి ప్రయాణం చేయాలి.

12. గమ్యం కు నడుచుట - గమ్యం మరువలేదు.

 


పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు...