9, ఆగస్టు 2021, సోమవారం

సంసోను యొక్క జీవిత కథ

సంసోను యొక్క జీవిత కథ

ఇశ్రాయేలీయులును దేవుడు తన సొంత ప్రజలుగా ఎన్నుకొని అయన చేసిన వాగ్దానాలను నెరవేరుస్తూ వారిని కంటికి రెప్పవలె కాపాడుతున్నాడు, కానీ వారు మాత్రం దేవునికి వ్యతిరేకంగా దుష్క్యార్యములను చేస్తున్నారు. ఆ సమయంలో ఇశ్రాయేలీయులను యావే దేవుడు నలువది యేండ్ల పాటు వారిని ఫిలిస్తీయుల వశము చేసెను. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఘోరమైన బానిసత్వ జీవితం జీవిస్తున్నారు అనేకమైన కష్టాలు, బాధలు పడుచున్నారు. ఆవిధంగా నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు ఎందుకంటే వారు దేవునికి ఇష్టమైన వారు. కనుక వారందరిని రక్షించటానికి, కాపాడటానికి ఒక నాయకుడు కావలయును వారినందరిని ఎదురించటానికి ఒక వీరుడు కావాలి, కనుక దేవుడు ఒక గొప్ప వ్యక్తిని ఎన్నుకున్నాడు. అతడే సంసోను. సంసోను పుట్టుక అలాంటిది ఇలాంటిది కాదు. 
మనం బైబిల్ గ్రంధం చూసినట్లయితే ముగ్గురు వ్యక్తుల యొక్క పుట్టుక గురించి దేవదూత పరలోకం నుండి భూలోకానికి దిగివచ్చి శుభవార్తను తీసుకొని వచ్చింది, అందులో మొదటి వ్యక్తి సంసోను. సంసోను జన్మించినప్పటినుంచి దైవానుగ్రహం కలవాడు. అతడు జన్మించినప్పటినుండి మరణించినవరకు వ్రత తాత్పరుడై జీవించెను. ఆ వ్రతము నజరేయ వ్రతము, ఈ వ్రతము చేపట్టడం అంత సాధారణమైనది కాదు. ఎందుకంటే ఆ వ్రతం చేపట్టు వారు ద్రాక్షరసం గాని, తల జుట్టు కత్తరించకూడదు. ఎవరైతే ఈ వ్రతాన్ని చేపడతారో వారు దేవుని శక్తి పొందిఉంటారు. అయితే ఈ వ్రతాన్ని చేపడుతున్న సంసోనుకు దేవుని ఆత్మ, శక్తి కలిగి ఉన్నాడు.
ఒకానొకరోజున సంసోను తిమ్నాతుకు చేరెను ఆ నగరచివరిలో ఒకద్రాక్షతోటను చేరగానే అక్కడ ఒక కొదమసింహం గర్జించుచు అతని మీదికి దూకెను. ఆసమయంలో సింహం మీదపడి మేకపిల్లను చీల్చినట్లు చీల్చివేసెను. ఈసన్నివేశం సంసోనుయొక్క ధైర్యాన్ని, వీరత్వాన్ని మనకు తెలియజేస్తుంది తరువాత సింహండొక్కనుండి చేసిన పట్టు తేనే త్రాగి  మిగిలినది సంసోను తల్లిదండ్రులకు ఇచ్చెను.
సంసోను వివాహం చేసుకోబోయే యువతిని చూసిన తరవాత వారికీ విందు చేసెను. అక్కడ పెండ్లికుమార్తె వైపువారు సంసోనుయొక్కశరీర దారుఢ్యాన్ని, కండలుతిరిగినబలాన్ని, అతని ఎత్తునుచూసి, భయపడి వారికీ తోడుగా ముప్పదిమంది మనుషులను తెచ్చుకొనెను. సంసోనుకు శరీరబలమేకాకా తనకు జ్ఞానంకూడా ఎంతోమిక్కుటంగాఉన్నది, అతని వివాహానికివచ్చిన ముప్పదిమందిలో తనయొక్కజ్ఞానముతో మిమ్మొక పొడుపుకత అడిగెదను పెండ్లిపండుగ ఏడురోజులు ముగియకమునుపే కథ విప్పెదరే మీకు ముప్పది కప్పడములు, ముప్పదికట్టుబట్టలు బహుమానంగాఇచ్చెదను. విప్పలేకుంటే మీరు ఏదైనా బహుమానం నాకు ఇవ్వండి. ఇది పందెం అని వారికీ సవాలు విసిరెను. సంసోను తినెడు దానినుండి తినబడునది వచ్చే బలమైనదాని నుండి తీయనిది వచ్చే అని వారికీ పొడుపు కథ వేసెను. వారికీ మూడురోజులు గడిచినగాని శతవిధాలుగా ప్రయత్నించినా ఎలాంటి సమాధానం దొరకలేదు. చివరికి అతని భార్యపోరు పడలేక పొడుపుకథ విప్పిచెప్పెను. సమాధానంచెప్పిన వారికీ బహుమానంఇచ్చి మిగతావారందరిని కోపంతో చంపివేసెను.
కొంతకాలం తరవాత తన భార్యను చూడటానికి వెళ్ళినప్పుడు ఆమె తండ్రి సంసోనుకి అడ్డువచ్చి నీకు ఆమెమీద అయిష్టము కలిగిందనుకొని స్నేహితునకుఇచ్చి పెండ్లిచేశాను అని చెప్పగా ఆవేశంతో వారిపంటలను, ద్రాక్ష, తోటలను, ఓలీవు తోటలను గుంటనక్కలచేత త్రొక్కించి వాటికి నిప్పంటించి కాల్చివేసెను. దీనంతటికి సంసోనే, కారకుడని  తెలుసుకొని తిమ్నాతు పౌరుని కుమార్తెను పెండ్లాడుననుకొని వారందరిని నిలువునా కాల్చి చంపిరి. సంసోను ఇది అంత  విని మీరింత పాడు పని చేసిరి అని ఫిలిస్తీయుల మీదపడి చిక్కిన వారిని చికినట్లుగా చీల్చి చండాడి చంపివేసెను. ఇది అంతయు కూడా దేవుని అనుగ్రహం వలన జరుగుతున్నది. ఫిలిస్తీయులు యూదా మీదికి దండెత్తి వచ్చి లేహి  నగరమును ముట్టడించిరని చూసిన యూదియులు సంసోనును ఫిలిస్తీయులకు అప్పగించి ఆ వీరునకు యూదియులు రెండు క్రొత్త తాళ్లతో బందించి కొండా గుహ నుండి వెలుపలకు  తీసుకోని వచ్చారు. సంసోను ఫిలిస్తీయులను చూడగానే యావే ఆత్మ సంసోనును ఆవేశింపగా అతని బంధములనియునిపండుకొనిన నారా త్రాళ్లు  ఆవిధంగా అవుతాయో ఆవిధంగా త్రాళ్లు అన్ని ఆయను. 
ఆ త్రాటి కత్తులన్నియు కూడా ఒక్కసారిగా సడలిపోయెను. అదే స్థలములో ఒక పచ్చి పచ్చిగా నున్న గాడిద దౌడ ఎముక ఒకటి సముసోను కంట పడెను. అతడు ఆ ఎముకను అందుకొని ఒక వీరుడు, సైనికుడు ఏవిధంగానైతే తన ప్రజల కోసం పోరాడుతారో అదేవిధంగా సంసోను కూడా ఫిలిస్తీయులతో పోరాడి ఒక్కొక్కరిని గాడిదలను కొట్టినట్టు కొట్టి, ఒక వీరుడివలె వేయి మందిని చంపెను. చేతిలోని దౌడ ఎముకను పారవేసిన స్థలమును రామతులేహి అని పేరు వచ్చెను, మహా విజయం సంసోను దప్పికగొనినపుడు దేవునికి ప్రార్థన చేయగా నెల బ్రద్దలై గోయి ఏర్పడి దాని నుండి నీరు వచ్చెను. ఆ నీరు త్రాగి సంసోను సేద తీర్చుకొనెను కనుక ఆ ఊటకు అన్హాకోరే అనే పేరు వచ్చెను.
కొన్ని రోజుల తరవాత సంసోను గాజాకు వెళ్లి అక్కడ ఒక వేశ్య ఇంటికి వెళ్ళినపుడు సంసోను వచ్చినన్ని విని ఆ ఊరి జనులందరు ప్రోగై నగర ద్వారమున కాపలా ఉండగా సంసోనును చంపవచ్చుగా అనుకోని రాత్రంతయు ఊరకుండిరి. సంసోను నది రాత్రి వరకు అలంటి సద్దా చేయక నిద్రపోయాను. కానీ అతడు అర్ద రాత్రి లేచి నగర ద్వారము తలుపులను, ద్వారా బంధాలను, అడ్డుకర్రలతో సహా ఊడబెరికి చకశక్యంగా అంతో బలమైన ద్వారములనియు భుజాలపైన వేసుకొని హెబ్రోను ఎదురుగ ఉన్న కొండా పైకి ఎక్కి వాటన్నిటిని అక్కడే వదలిపెట్టెను. 
ఆ తరవాత సారెకు లోయలో నివసించే డెలీలా కు వచ్చి పచ్చిగా ఉన్న అల్లే త్రాడులను ఏడింటిని ఇచ్చి ఆమె చేత సంసోను బందీ చేసెను.  సంసోను మాత్రం ఆ త్రాళను అన్నిటిని నిప్పంటించిన నారా తరాల వాలే సునాయాసంగా తెంచివేసెను. ఆ తర్వాత ఎవరు వాడని కొత్త తాళ్లతో సంసోను బంధించిరి. కానీ సంసోను తన చేస్తి కట్టులన్నియు దారములవలె త్రెంచి వేసెను మరల మరొకసారి సంసోను నిద్ర పోయిన సమయంలో అతని తలా జాడలను ఏడూ పడుగులకు వేసి మీకునకు బిగగొట్టి బంధించిరి అతడు నిద్ర లేచి తల వెంట్రుకలను వానిని కట్టిన మేకులను తన బలంతో ఒక్క ఊపున ఊడబీకేను. ఆవిధంగా తన వీరత్వాన్ని, బలాన్ని ఫిలిస్తీయుల ఎదుట నిరూపించుకొనెను.  
చివరకు ఫిలిస్తీయులు సంసోను యిత్తడి గొలుసుతో బంధించి సంకెళ్లు వేసిరి. అక్కడ సంసోను అందరి ఎదుట వీర కార్యాలు చేసెను. ఆ మందిరములో ఫిలిస్తీయ దొరలూ మరియు మూడువేలమంది స్త్రీ పురుషులు పై అంతస్తున కూర్చుండి సంసోను చేయు వీర కార్యాలను చుస్తునారు.ఆ సమయంలో ఫిలిస్తీయులపై ఒక్క దెబ్బతో పాగా తీర్చుకోవటానికికి అతడు మందిరమును మోయు మూలా స్తంభాలను రెండింటి మీద చేతులు మోపి, కుడి చేతితో ఒక దాని మీద, ఎడమ చేతిని ఇంకో దాని మీద మోపి రెండు కంబములపై తన బలము చూపెను.
సంసోను ముందుకు వంగి స్తంభములను శక్తి కొలది నెట్టెను, ఆ నెట్టుకు మందిరము పెళ్లున కూలి, సర్దారుల మీద, ప్రేక్షకుల మీద  పడెను, సంసోను తాను బ్రతికి ఉండగా చంపినా వారి కంటే చనిపోవుచు చంపిన వారే ఎక్కువ. ఆ తర్వాత సంసోను, సోదరులు, బంధువులు వచ్చి మృత దేహాన్ని జోరా, ఏస్తవోలు నగరము మధ్యనున్న మనోవా సమాధిలోనే అతనిని కూడా పాతిపెట్టిరి.
ఈ విధంగా సంసోను ఫిలిస్తీయుల ఎదుట అనేక వీర కార్యాలు ప్రదర్చించి ఇశ్రాయేలు ప్రజలకు ఇరవై యేండ్ల పాటు న్యాయాధిపతిగా ఉండెను. సంసోను బ్రతికినంత కాలం ఫిలిస్తీయులకు హడలెతించెను..
-బ్రదర్. సాలి. రాజు . ఓ.సి.డి.

తోబియా జీవిత కథ



మనము రక్షణ గ్రంధంలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరిని ఒక్కొక్క ఉద్దేశంతో దేవుడు తన సేవ కొరకై మరియు తన ప్రజలను రక్షించడానికి ఎన్నుకున్నారు. మనం ఇప్పుడు చూస్తున్న కథలో తోబియా అనే వ్యక్తి ద్వారా తన తండ్రిఐన  తోబితునకు అంధత్వాన్ని తొలగించడానికి మరియు తనకు కాబోయే భార్య సారాకు పిశాచ విముక్తిని కలిగించడానికి దేవుడు తోబితూను ఎన్నుకున్నాడు.

     తోబియా తల్లిదండ్రులు తోబితూ మరియు అన్న. తోబితూ తన జీవిత కాలమంతా కూడా తల్లి దండ్రులకు చేదోడు వాదోడుగా తమ కన్ను సన్నులలో జీవిస్తు, మరియు అన్ని విషయాలలో సహాయం చేస్తుండేవాడు. 

తోబియా తండ్రి తోబితూ ద్రుష్టి కోల్పోయి వారు అంతయు కోల్పోయి తోబితూ చనిపోతాడు అని అనుకున్న సమయంలో  తోబితుకు పూర్వము తాను మేదియ దేశమునందలి రాగీసు పట్టణమును తన స్నేహితుడైన గబాయేలు ఇంట దాచి ఉంచిన ధనము జ్ఞప్తికి తెచ్చుకొని తన కుమారుడైన తోబియాకు తెలియచేస్తాడు.

తోబియా తండ్రితో నేను నీవు చెప్పినదెల్ల చేయుదును అని చెప్పి తోబియా తండ్రితో నేను గబాయేలు నుండి ధనము తీసుకురావడం ఎలా? నేను అతనిని ఎరుగను, అతడు నన్ను ఎరుగడు. మరి నేను ఏ ఆనవాలు చూపవలెను? అదియుగాక మేదియాకు ఏ త్రోవనా పోవవలెను నాకు తెలియదు, అని తండ్రితో చెప్పెను. అందుకు తండ్రి తోబియాకు గబాయేలు సంతకం చేసిన కాగితం ఒక ముక్క ఇచ్చి మరొకటి గబాయీలు వద్ద ఉన్న సొమ్ముతో ఉన్నదని చెప్పి తన వద్ద ఉన్నదీ తోబియాకు ఇచ్చి, ఇది చూపించు అనెను.

తోబియా తనకు మేదియాకు తీసుకుపోవడానికి ఒక స్నేహితుని వెదకడానికి బయటికి వెళ్ళగానే రఫాయేలు దేవదూత అతనికి ప్రత్యక్షమై కనబడెను. కానీ తోబియాకు దేవుదుతా అని తెలియదు. అందుకు తోబియా అయ్యా! మీది ఏ వూరు అని అడిగెను . అందుకు ఫాయేలు నేను ఇశ్రాయేలుడను. ఈ పని అయినా దొరుకుతుందేమో అని ఈ పట్టణమునకు వచ్చాను అని అనెను. అందుకు తోబియా మేదియు వెళ్ళడానికి దారితెలుసున అని అని ప్రశ్నించెను. అందుకు రెఫాయేలు నేను అచటికి చాల సార్లు వెళ్లితిని, ఆ ధారులన్నియు నాకు సుపరిచితములే అని అనెను. రఫాయేలు నేను ఆ దేశమునకు పోయున్నప్పుడెల్ల రాగీసు నగరమున వసించు మా బంధువగు గబాయేలు ఇంట బస చేసిడివాడను అని అనెను. అందుకు తోబియా స్నేహితునితో నువ్వు ఇక్కడే ఉండుము నేను ఈసంగతిని నా తండ్రితో చెప్పి వత్తును, నీవు నాతో ప్రయాణము చేయవలెను. నేను నీకు వేతనం చెల్లింతును అని అనెను. అందుకు రఫాయేలు సరియే , నీవు కోరినట్లే నేను నీవెంట వత్తును అని అనెను.

అందుకు తోబియా తండ్రి వద్దకు పోయి నాతో ప్రయాణము చేయుటకు మన జాతి వాడు ఒకడు దొరికెను అని చెప్పి రఫాయేలును  ఇంటికి ఆహ్వానించెను. తోబియా తండ్రివద్ద దీవెనలను పొంది తల్లిదండ్రులను ముద్దాడి మేదియాకు ప్రయాణము గట్టెను. తోబియా దేవదూత తో ప్రయాణమై వారు సాయంత్రం వరకు ఠీగ్రీసు నది తీరమున విడిదిచేసెను.  తోబియా కాళ్ళు కడుగు కొనుటకు ఏటిలోకి దిగిన వెంటనే పెద్దచేప ఒకటి నీటిలోనుండి దూకి తోబియా పాదములు పట్టుకో బోయెను . దానిని చూసి అతడు గట్టిగ అరిసెను. దేవదూత అతనితో వోయి ఆ మత్స్యమును పట్టుకొనుము, దానిని జారిపోనీకుము అని అనెను. వెంటనే  తోబియా ఆ చేపను పట్టుకొని ఒడ్డుకులాగెను.  

దేవదూతచేపకడుపును చీల్చి దాని పిత్తమును కాలేయమును మరియు గుండెను తీసి నీవద్ద ఉంచుకొనుము. కానీ దాని ప్రేగులను మాత్రమూ పారవేయుము అనెను. తోబితూ దేవదూత చెప్పినట్లే చేసెను. అతడు చేపలోని కొంత భాగమును కాల్చి భుజించి తరువాత వారు ఇరువురు ప్రయాణమును సాగించిరి. మేదియ దరిదాపుల్లోకి వచ్చిరి. తోబియా దేవదూతను చూసి నేస్తమా అసరియా (దేవదూత అతనికి చెప్పిన పేరు) చేప పిత్తముకాలేయము, గుండెలతో ఏ ఏ రోగములను నయము చేయవచ్చును  అని అడిగెను. అతడు చేప గుండెను కాలేయమును కాల్చి పొగ వేసినచో నరులను పట్టి పీడించు భూతముగాని పిశాచముగాని పారిపోవును. ఆ నరులకు మరల పిశాచము భాధ సోకదు. పిత్తమును తెల్లని పొరలు కమ్మిన వారి కన్నులకు లేపనముగా ఉపయోగించవచ్చును. దాని కంటి పొరలమీద పూసి వాని మీద ఊదిన చాలు, పొరలు తొలగి పోవునని చెప్పెను.  

తరువాత వారిరువురును మేదియ దేశమున ప్రవేశించి ఏక్బటానా నగరమున సమీపించెను.అప్పుడు దేవదూత తోబియానీ పేరేతి పిలిచి నేటి రాత్రి మనము నీ బంధువైన రగువేలు ఇంట బస చేయవలెను. అతనికి సారా అను కుమార్తె కలదు ఆమె తప్ప అతనికి వేరే సంతానం లేదు. ఆ కన్య నీకు దగ్గరి చుట్టము. నీకు ఆమెను పెండ్లియాడు హక్కు కలదు. ఆమె తండ్రి ఆస్తి కూడా నీకు దక్కును అని అనెను.  అందుకు తోబియా రెఫాయేలుతో నేస్తమా ఆ యువతీని ఇది వరకి వరుసగా ఏడుగురు వరులకు ఇచ్చి పెళ్ళిచేసిరి. వారిలో ప్రతి వాడును మొదటి రేయినే శోభనపు గదిలోనే చచ్చెను. ఈ సంగతులెల్ల నాకు తెలియును. 

ఆమెను పట్టిన భూతమే ఆ వరులను సంహరించెను అని వింటిని. ఆ భూతము సారాకు ఎట్టి హాని చేయదట. ఆమెను సమీపించు పురుషులను మాత్రమూ పట్టి చంపును. నా మట్టుకు నాకాపిశాచమానిన భయముగా ఉన్నది. మా తండ్రికి నేనొక్కడినే కుమారుడును నేను చనిపోయినచో, నా తల్లిదండ్రలు దిగులుతో సమాధి చేరుకొందురు. అప్పుడు వారిని పాతి పెట్టు దిక్కు కూడా ఉండదు అని అనెను.అందుకు దేవదూత తోబియాతో ఆ భూతమును తలంచుకొని భయపడకుము. సారాను స్వీకరింపుము. ఈ రాత్రియే రగువేలు  ఆ యువతిని ప్రధానము చేయును. నీవు ఆమె పడక గదిలోకి వెళ్ళినవెంటనే చేప గుండెను తీసికొని కాలుచున్న సాంబ్రాణి మీద వేయుము. ఆ వాసనకు భూతము పారిపోవును. అది మరల సారా చెంతకు రాదు. నీవు ఆ యువతిని కూడక ముందే మీరిరువురు లేచి దేవునిని ప్రార్థింపుము అని అనెను. 

తోబియా రఫాయేలు చెప్పిన మాటలను విని, అతడు సారాను గాఢముగా ప్రేమించి తన హృదయమును ఆమెకు అర్పించెను . వారు ఏక్బటానా నగరమును చేరగానే తోబియా, నేస్తమా అసరియా నన్ను వెంటనే రగువేలు ఇంటికి తీసుకొని పొమ్ము అనెను. దేవదూత తోబియాను అతని ఇంటికి కొనిపోయెను. వారు మొదట రగువేలును పలకరించెను, అతడు వారిని లోనికి ఆహ్వానించెను. వారు వారితో మేము నఫ్తాలి తెగకు చెందినవారలము ప్రస్తుతం నీకివే పట్టణములో ప్రవాసమున ఉన్నవారమని చెప్పిరి తోబియా రగువేలుతో, తోబితూ నా తండ్రియే అని చెప్పెను. ఆ పలుకులు విని రగువేలు తటాలున లేచి ఆనందభాష్పములతో తోబియా ను ముద్దాడెను. వారు స్నానము చేసి భోజనమును కూర్చుండబోవుచుండగా, తోబియా నేస్తునితో, నేస్తమా అసరియా నీవు సారాను నాకిచ్చి పెళ్లి చేయమని రగువేలును అడగవా? అని అసరియా తో చెప్పెను. రగువేలు ప్రక్కనుండి ఆ మాటలు విని తోబియాతో, మా అమ్మాయి సారాను పెండ్లియాడుటకు నీవుతప్ప మరెవ్వరును అర్హులుకారు. నీవు మాకు అయినవాడవు అని అనెను. అంతటా రగువేలు సారాను పిలిపించి, ఆ యువతిని చేపట్టుకొని ఆమెను తోబియాకు అప్పగించెను. 

ఆ తరువాత వారు అన్న పానీయాలు సేవించి ముగించినపిదప రేయి నిద్ర పోవు సమయమాయెను. అప్పుడు సారా తల్లిదండ్రులు తోబియాను శోభనపు గదిలోనికి తీసుకొని పోయిరి. అతడు రెఫాయేలు సలహాలను జ్ఞప్తికి తెచ్చుకొని తన సంచిలోనుండి చేప గుండెను, కాలేయమును వెలుపలికి తీసి కొంత భాగము మండుచున్న సాంబ్రాణి మీద వేసెను. అప్పుడు భూతము ఆ వాసనా భరింపజాలక ఐగుప్తు దేశమునకు పారిపోయెను. సారా తల్లిదండ్రులు గది తలుపులు మూయగా తోబియా పడక మీదనుండి లేచి సారతో నీవును లేచి నిలుచుండుము ప్రభువు మన మీద కరుణ చూపి మనలను కాపాడుటకు ఇరువురము ప్రార్థన చేయుదమనిచెప్పెను. సారా లేచి నిలుచుండగా వారు ఇద్దరు ప్రభువు రక్షింపవలెనని మనవిచేసి ప్రార్థించిరి. ప్రార్థన ముగిసిన తరువాత ఆ రాత్రి ఇద్దరు కలిసి శయనించిరి. అంతలో ఆ రాత్రే రగువేలు సేవకులను తీసుకొని పోయి తోబియా చనిపోతాడని తలంచి సమాధి తవ్వించెను. సమాధి తవ్విన వెంటనే ఇంటిలోకి వెళ్లి భార్యను పిలిచి ఒక సేవకురాలిని లోపలి పంపించి తోబియా బ్రతికి వున్నాడోలేదో తెలుసుకొని రమ్మని చెప్పెను.   

ఆమె లోపలికి వెళ్లిచూడగా వధూ వరులు ఇద్దరు గాఢ నిద్రలో ఉండిరి. కనుక సేవకురాలు బయటకు వచ్చి రగువేలుతో తోబియా చనిపోలేదు అనిచెప్పెను. ఆ తరువాత తోబియా రెఫాయేలును పిలిచి నీవు నలుగురు సేవకులను రెండు ఒంటెలను వెంటపెట్టుకొని రాగీసునందలి గాబయలు ఇంటికి పొమ్ము, అతనికి ఈ చేవ్రాలుకు పత్రమును చూపి సొమ్మును అడుగుము మరియు అతనిని కూడా వివాహ మహోత్సవమునకు తోడ్కొని రమ్ము. మా తండ్రి నా కొరకై రోజులు లెక్కపెట్టుకొనుచుండును. నేను ఒక్క రోజు జాగు చేసిన అతడు దుఃక్కించును. మా మావ రగువేలు నన్ను ఇక్కడే ఉండమని నిర్బంధము చేసెను. అతని మాట కాదనలేక పోతినిఅనిచెప్పెను. రెఫాయేలు నలుగురు సేవకులను తీసుకొని పోయి గాబయలు ఇంటికి చేరి, అతనికి చేవ్రాలు కల పత్రమును చూపించెను. మరియు తోబితూ కుమారుడు తోబియా పెండ్లి సంగతి చెప్పి అతనిని వివాహ మహోత్సవమునకు ఆహ్వానించెను. వెంటనే గాబయలు వెండి నాణెముల, సంచులను లెక్కపెట్టి ఇచ్చెను.  ఆ సంచులను ఒంటెలమీదకెక్కించి , వారు మరుసటి రోజున వేకువనే ఇల్లుచేరుకొనునప్పటికీ తోబియా భోజనము చేయుచుండెను. తోబియా గబాయేలునకు స్వాగతం చెప్పెను. గాబయలు తోబియాను దీవించెను.

రగువేలు తన కూతురు సారా వివాహ సందర్భమున జరుప నిశ్చయించెను. పదునాలుగు దినముల ఉత్సవము ముగిసెను. తోబియా మామ చెంతకు వచ్చి నన్ను వెళ్లి పోనిమ్ము. మా తల్లిదండ్రలు నన్ను కంటితో చూచు ఆశను వదులుకొని యుందురు. కనుక నన్ను మాఇంటికి పోనిమ్ము అని అనెను. రగువేలు ఇక జాగు చేయక సారాను తోబియాకు అప్పగించెను. తోబియా తన ఆస్తిలో సగభాగములో, బానిసలను, ఎడ్లను, గొర్రెలను, గాడిదలను, సామానులను, మొదలైనవి తీసుకొని సంతోషముతో రగువేలు ఇంటినుండి భయలుదేరేను. అతడు తన ప్రయాణము విజయవంతమైయ్యేను గనుక స్వర్గాధిపతియు లోకపాలకుడైన దేవుని స్తుతించెను. ఇల్లు వీడకముందు తన అత్తా మామలను వారు బ్రతికున్నంతకాలము గౌరవముతో చూచుకొందునని ,మాట ఇచ్చెను. వారు ప్రయాణము చేయుచు, నినెవే చెంతగల కాసెరెను నగరము దరిదాపుల్లోకి వచ్చిరి. రెఫాయేలు, తోబియా చేప పిత్తమును తీసుకొని తన భార్యకంటె ముందుపోయెను. తోబియా చేప పిత్తముతో తండ్రి యెదుటికి వచ్చెను. అతడు తన తండ్రి కన్నులమీద వూది అతనిని తన చేతితో పట్టుకొని నాయన ధైర్యము తెచ్చుకొనుము అనిచెప్పెను. అంతటా అతడు చేప పిత్తమును తండ్రి కన్నులకు పూసెను. ఆ వృద్ధుని కన్నులనుండి కంటి కొనాలతో మొదలుపెట్టి తెల్లని పొరను పెరికివేసెను.  

అంతటా తోబియా సంతోషముతో దేవుని బిగ్గరగా స్తుతించుచు ఇంటిలోనికి వెళ్లెను. తరువాత అతడు తండ్రికి తనసంగతంతయు తండ్రికి చెప్పెను. తన ప్రయాణము సఫలమైనదని, తన సొమ్మును కొని వచ్చితినని అంత మాత్రమే కాకా రగువేలు కుమార్తె ఐన సారాను కూడా పెండ్లియాడితినని ఆమెను కూడా వెను వెంటనే వచ్చుచున్నదనియు, ఇప్పటికే నినివే నగర ద్వారములను చేరి యుండునని వివరించెను.

వివాహ మహోత్సవము ముగిసిన తర్వాత తోబియా తండ్రితో నాయన నన్ను ఇతనికి ఎంత చెల్లింపమందువు? మేము తెచ్చిన సొత్తులో సగము అతనికి ఇచినను నష్టములేదు. అతడు నన్ను సురక్షితముగ  నీ చెంతకు కొనివచ్చి, గాబయలు వద్దకు మన సొమ్ములను తీసుకొని వచ్చెను. అదియే గాక నా భార్య కి భూత విముక్తి నీకు రోగ విముక్తి కలిగించెను. ఈ ఉపకారములన్నిటికి అసరియాకు ఎంత సొమ్ము చెల్లిపమందువు  అని అడిగెను. అతడు కొనివచ్చిన సొత్తులో సగం పంచియిమ్ము. అతడు అంత వేతనమునకు అర్హుడు అని చెప్పెను తండ్రి. కనుక తోబియా రెఫాయేలును పిలిచి నేస్తమా నీవు తీసుకొచ్చిన ధనముతో సగము తీసుకొనుము. నీవు నాకు చేసినమేలులకు ఇది బహుమానము. ఇక క్షేమముగా మీ ఇంటికి పొమ్ము అని అనెను. అప్పుడు రెఫాయేలు తండ్రి కొడుకులను పిలిచి వారితో ఇట్లనెను; నేను దేవుని సన్నిధిలో నిలిచి అతనికి సేవలు చేయుటకు సిద్ధముగానుండు ఏడుగురు దేవదూతలలో ఒకరైన రెఫాయేలును అని అనెను. ఆ పలుకు విని ఆ తండ్రీకొడుకులు ఇద్దరును భయకంపితులై గడగడా వణుకుచు నేలమీద బోర్లగిలా పడెను. కానీ దేవదూత వారితో నీవు భయపడకుడి మీకు ఎట్టికీడును కలుగదు, ప్రభువుని సదా కీర్తింపుడు అని అనెను. వారిద్దరూ, నేలమీదనుండి లేచి నిలబడుచుండిరి, కానీ ఆ దేవదూత మరల వారికి కనిపింపలేదు. వారు కీర్తనలతో దేవుని స్తుతియించిరి. దేవదూత తన చెంతనున్నప్పుడు ప్రభువు తమకు చేసిన అద్భుత కార్యములకు గాను దేవుడిని కీర్తించిరి.

తరువాత కొంత కాలానికి తండ్రి చనిపోయినప్పుడు వారు అతనిని గౌరవ మర్యాదలతో పాతి పెట్టిరి. ఆ కొంతకాలానికి తల్లియును చనిపోగా తోబియా ఆమెను తండ్రి ప్రక్కనే పాతి పెట్టెను. తదనంతరం అతడు భార్య,పిల్లలతో మేదియ దేశములోని వెళ్లి అక్కడ తన మామ రగువేలు ఇంటివద్దనే నివసించెను . అతడు వృద్ధులైన అత్త మామలను మిగుల గౌరవముతో చూచుకొనెను. ఆ వృద్ధులు చనిపోయినప్పుడు అక్కడే పాతిపెట్టెను. తోబియా తండ్రి ఆస్తికి వలే మామ ఆస్తికి వారసుడాయెను. అతడు ఎల్లరి మన్నులకు పాత్రుడై నూట ఇరువది యేండ్లు వరకు జీవించి తనువూ చాలించెను. తాను చనిపోకముందు నినివే నాశనమగుటను గూర్చియు మేదియ రాజు సియాకరు నినెవే పౌరులను బందీలుగా కొనిపోవుటను గూర్చియు వినెను. తోబియా చనిపోవకముందే నినెవే నగరమునకు పట్టిన దుర్గతిని చూసి సంతసించి నిత్యుడైన దేవునికి వందనములు అర్పించెను.

-బ్రదర్. సాలి. రాజు. ఓ.సి.డి.

సామాన్యకాలపు ఇరవై ఏడవ ఆదివారము

సామాన్యకాలపు ఇరవై ఏడవ ఆదివారము  ఆదికాండము 2:18-24 హెబ్రీయులకు 2:9-11 మార్కు 10:2-16 క్రీస్తునాధునియందు ప్రియ సహోదరీ సహోదరులారా, దేవుని బిడ్డ...