21, డిసెంబర్ 2019, శనివారం

ప్రేమ జీవ జ్వాల



ఓ  జీవ ప్రేమ జ్వాలా
నా ఆత్మను  గాయపరచి
 నాటి నుండి దాని నాభిలో నుండె
 నీవు  క్రూరంగా లేవిప్పుడు
నీ  ఇష్టమైతే నన్ను దహించిప్పుడు
ఈ తెర  ఈ మధుర కలయికతో చీల్చు

2 ఓ స్వచ్ఛ మధురమా
ఓ  ఆహ్లాదకర గాయమా
ఓ మృదు హస్తమా  ఓ మృదు స్పర్శ
నిత్య జీవాన్ని చవి చూపించే
 ప్రతి అప్పు చెల్లించే
నిన్ను హత్యచేయుటలో మరణం జీవ మయ్యే

3 ఓ అగ్ని దీపములారా
ఎవరి శోభలో
 నిగూడ గృహాల   భావనలో
ఒకప్పుడు చీకటి  మరియు అంధత్వముండినను
ఇప్పుడు   అసాధారణముగా  అద్భుతముగా
వేడి మరియు వెలుతురుని తన ప్రియునికిస్తు

4 ఎంత మృదువుగా ప్రేమగా
నీవు నా హృదయములో మేలుకొంటావు
ఎక్కడ రహస్యముగా నీవు  నివసిస్తావో
 నీ మధుర శ్వాస ద్వారా
మంచి , మరియు మహిమతో నింపి
ఎంత లేతగా నీవు నా హృదయాన్నీ  వ్యాపింప చేస్తావు 

17, డిసెంబర్ 2019, మంగళవారం

కార్మెల్ పర్వత ఆరోహణం


ఓ గాఢాంధకార  రాత్రి 
ప్రియుని మీద కోరిక తో దహించుకు పోతూ 
 ఓ ఆనంద సమయాన    
నేను బయటకు కనపడకుండా  పోయాను 
నా ఆత్మ మొతం నిశ్చలంగ ఉంది 

2   అంధకారం లో సురక్షితంగా ,
రహస్య నిచ్చెన తో మరువేషం లో
ఆ  అదృష్ట  భాగ్యం
అంధకారం లో  దాగిఉన్నా
నా ఆత్మ ఇప్పుడు నిచ్చలంగా ఉంది

3 ఆ సంతోషకర   రాత్రి
రహస్యంగా నన్నెవరు   చూడకుండా ,
నేను కూడా ఏమి చూడకుండా
ఏ దీపం  లేక మార్గ చూపరి  లేకుండా
నా హృదయములో రగిలే దీపం తప్ప

4 ఇది నన్ను నడిపించగా
మధ్యాన్నపు వెలుగు కంటే ఎక్కువుగా
అతను నా కోరకు వేచిఉన్న చోటుకు
ఆయన నాకు బాగా  తెలుసిన
ఎవరు కనపడని చోటుకు

5 ఓ మార్గచుపరి అయ్యిన రాత్రి
ఓ తోలి సంధ్య కంటే   అందమైన  రాత్రి
ఓ ఐక్యం చేసిన రాత్రి
ప్రేయసిని  తన ప్రియునితో
ప్రియురాలుని తన ప్రియునిలో  మారుతున్న రాత్రి

6 నా   పుష్పిస్తున్న ఏద మీద
నా ప్రియుని కోసమే నే ఉంచిన
చోట  తాను పడుకొని నిద్రిస్తుండ
 నేను తనను లాలన చేస్తుండగా
అక్కడ దేవదారు వీచగా  ఓ చిరు గాలిలో

7 ఎప్పుడు  ఆ చిరుగాలి బురుజు నుండి విచిందో
తన వెంట్రుకలు విగినప్పుడు
తాను నా మెడను గాయపరిచాడు
తన  మృదువువైన చేతితో
నా ఇంద్రియాలని స్తంభింపచేస్తూ

8 నన్ను  నేను పరీత్యంజించి మరియు మరిచిపోయి
నా ప్రియుని మీద నా మొమును వాల్చి
అన్నియు నిలిచిపోగా నా నుండి నేను వెడలిపోతిని
నా జాగ్రత్తలన్ని వదలి
లిల్లీల మధ్య  మరచిపోతిని 

28 వ సామాన్య ఆదివారం

సొలోమోను జ్ఞాన గ్రంధం 7:7-11 హెబ్రీ 4:12-13, మార్కు 10:17-30 ఈనాటి పరిశుద్ధ గ్రంథములో మన యొక్క జీవితములో దేవునికి ప్రాముఖ్యత ఇచ్చి, ఆయనను కల...