క్రీస్తురాజు మహోత్సవం
దానియేలు
7:13-14, దర్శన 1:5-8, యోహను 18:33-37
నేడు
తల్లి శ్రీ సభ క్రీస్తు రాజు
మహోత్సవమును కొనియాడుచున్నది. 11 భక్తి నాధ పాపుగారు
క్రీస్తు రాజు పండుగను 1925 వ సంవత్సరంలో
ప్రతిష్టించారు.
ఈ
లోకంలో అందరు పాలకులు తమంతట
తాము గొప్పవారని భావించే సమయంలో సార్వ భౌమాధికారం,సామంత పాలనంలో పడిపోతూ, ఈ ప్రపంచంలో ప్రజా స్వామ్య వ్యవస్థ, నాస్తికత్వంలో ప్రవేశిస్తున్న సమయంలో క్రీస్తు ప్రభువు ప్రజలకు నిజమైన రాజు
అని ఆనాటి 11 వ భక్తి నాధ పాపుగారు
తెలియచేసారు.
దేవుడే
నిజమైన రాజు మానవ మాత్రులు కేవలం ఒక సాధనములే,
క్రీస్తు
ప్రభువు రాజు ఎందుకంటే దేవుడు కాబట్టి తండ్రితో , పవిత్రాత్మతో
కలసి సృష్టిని చేసి పరిపాలిస్తున్న దేవుడు,
ఈ
లోకం మీద సర్వాధికారం కలిగిన వ్యక్తి.
సర్వము
ఆయన ద్వారా , ఆయన కొరకు
సృష్టించబడినది అందుకే ఆయనకు సర్వాధికారం ఇవ్వబడినది.
మనందరి
జీవితాలను రక్షించే రాజు క్రీస్తు
ప్రభువు ఆయన విలువైన తన
రక్తమును ధారపోసి , మనందరిని కాపాడిన
రాజు . మనయొక్క జీవితంలో సంతోషం ఉండుటకు, శాంతి ఉండుటకు తానే తన జీవం ఇచ్చి మనందరిని కాపాడారు. ఈ రోజు ప్రత్యేకంగా క్రీస్తు
ప్రభువు యొక్క రాజ్యం గురించి, ఆ రాజు యొక్క లక్షణాలు ధ్యానించుకుందాం.
రక్షణ
చరిత్రలో దేవుడు మొదటిగా యిస్రాయేలుకు నాయకునిగా మోషేను ఎన్నుకొంటున్నారు. ఆయన
తరువాత యోహోషువాను
ఎన్నుకొన్నారు. ఈ విధంగా దేవుడు కొంతమంది ప్రవక్తలుగా , న్యాయాదిపతులుగా ఎన్నుకొని యిస్రాయేలు
ప్రజలను నడిపించారు.
కానీ
పూర్వ నిబంధన కాలంలోని యిస్రాయేలు ప్రజలకు వారిని పరిపాలించటానికి ఒక రాజు కావాలని ప్రగాఢ మైన కోరిక కలిగి
ఉండేవారు.
వాస్తవానికి
దేవుడే వారి యొక్క రాజు అని మరిచారు. యిస్రాయేలు ప్రజలకు ఎల్లప్పుడు తమతో ఉంటూ , తమ కష్టాలలో పాలుపంచుకొనే రాజు
కావాలనుకున్నారు.
ఒక
రాజు కోసం వారు అహర్నిశలు
ప్రార్ధించేవారు. వారి ప్రార్ధన విన్న దేవుడు సౌలును రాజుగా నియమించారు. దేవుడు
అతని పాలనతో సంతృప్తి చెందలేదు, అందుకే దేవుడు మరొక
రాజును దావీదును ఎన్నుకొన్నారు. దావీదు రాజు ప్రజలకు మేలు చేస్తూ, దేవునికి విధేయుడై జీవిస్తూ ఒక మంచి రాజుగా పేరు పొందాడు.
యావే దేవుడు ఆయన వలన సంతృప్తి చెందారు.(1 సము 13:14) అ పో 13:22. తరువాత
తన కుమారుడు సోలోమోను దేవుని ప్రణాళికకు తగిన విధంగా నడుచుకొలేదు. ఆయన పాలన అనేక
మందిని భారంగా మారింది. అన్య దేవుళ్ళను ఆరాధించాడు. నిజమైన యావే దేవున్ని
మారిచిపోయాడు.
సోలోమోను
మరణం తరువాత యిస్రాయెలు ప్రజలు
రెండుగా విభజించబడ్డారు. రాజులు కూడా మారారు. తరువాత దేవుడు ప్రవక్తలను ఎన్నుకొని
తన ప్రజలను నడిపించారు.
ఈ
విధంగా పూర్వ నిబంధన గ్రంధంలో దేవుడు రాజులను
ఎన్నుకొని తన ప్రజలను నడిపించారు. క్రీస్తు ప్రభువు రాజు అనే భావన ముందుగానే
సమూవెలు గ్రంధంలో దానియేలు , యోషయా , యిర్మీయా గ్రంధాల్లో ప్రస్తావించబడింది.
యోషయా 9:6-7, యిర్మీయా 23:5-6, దానియేలు 2:44 . నూతన నిబంధన గ్రంధంలో కూడా
దేవ దూత మరియమ్మకు మంగళ వార్తచెప్పే
సమయంలో దేవ దూత మరియమ్మ తో దావీదు సింహాసనం ఆయనకు ఇవ్వబడుతుంది అని చెప్పారు. లూకా
1:32 . ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును అని అలాగే ఆయన రాజ్యమునకు అంతమే ఉండదని చెప్పారు.
ముగ్గురు
రాజులు బాలయేసును దర్శించుటకు వచ్చిన సమయములో యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడ
అని అడిగారు. మత్తయి 2:2. ముగ్గురు రాజులు
క్రీస్తును రాజుగా గుర్తించారు.
యేసు
ప్రభువు తన యొక్క శిలువ శ్రమలు
అనుభవించే ముందు యెరుషాలేములోకి ప్రవేశించినప్పుడు ప్రజలు ఆయన్ను రాజుగా
అంగీకరించి గొప్పగా నినాదాలు చేశారు, ఆయన్ను
మెచ్చుకున్నారు. లూకా 19:38. ప్రజలు క్రీస్తు
ప్రభువును రాజుగా గుర్తించారు ఎందుకంటే
ఆయన
వారికోసం పోరాడారు. వారికి తోడుగా ఉన్నారు. వారి బాధలలో పాలు పంచుకొన్నారు అందుకే
ఆయన్ను రాజుగా ప్రజలు గుర్తించారు.
పిలాతు
కూడా యేసు ప్రభువును నీవు యూదుల రాజువా అని ప్రశ్నించారు -యోహను 18:33. పిలాతు యేసు
ప్రభువు యొక్క సిలువ మీద వ్రాయించిన మాటలు అవే నజరేతుడైన యేసు యూదుల రాజు. చివరికి
ఆయన రెండవ సారి వచ్చే సరికి ఆయన మేఘారూరుడై వస్తారని చెప్పారు.-మత్తయి 25:18. ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభువు
రాజు అని తెలియజేసే అంశాలు. యేసు ప్రభువు కూడా సువార్తను ప్రారంభించిన సమయంలో మొదటిసారిగా
పలికిన మాటలు కాలం సంపూర్ణమైనది దేవుని రాజ్యం సమీపించినది అని. క్రీస్తు ప్రభువు దేవుని
రాజ్యంనకు రాజు. దేవుని రాజ్యం అంటే సమస్తము. సాధారణంగా రాజు అంటే ఒక రాజ్యాన్ని పాలించేవాడు అని అర్ధం ఆ రాజ్యానికి
కొన్ని సరిహద్దులు ఉంటాయి.
కొందరు వారసత్వం
పరంగా రాజులౌతారు మరికొందరు ప్రజల యొక్క ఆధారభిమానాల వల్ల రాజులౌతారు. యేసు క్రీస్తు
ప్రభువు మాత్రము దేవుడు. అదే విధంగా ప్రజలచేత గుర్తించబడ్డ రాజు. ఆయన ఆధికారం కాని,
ఆయుధాలు కాని ధరించని రాజు. ప్రజలపై ఆధిపత్యం చెలాయించే రాజు కాదు, వారికి స్వేచ్ఛ
నిచ్చే రాజు. ఆయన యొక్క రాజ్యం ఈ లోక సంభధమైనది కాదు, పరలోక సంబంధమైనది
1.
దేవుని రాజ్యం ప్రేమ
రాజ్యం. అందరిని కూడా ప్రేమించిన గొప్ప ప్రేమామయుడు. ఆయన రాజ్యంలో కాలహాలకు యుద్దాలకు
తావులేదు, అధికార వాంఛలకు తావులేదు, ఆయన కేవలం ప్రేమతో తన రాజ్య పాలన చేశారు. ప్రేమతో
ప్రజల వద్దకు వచ్చారు, ప్రేమతో ప్రజల కష్టాలు , బాధలు పంచుకున్నారు. ప్రేమ వలన శిలువ
మోసారు,ప్రాణ త్యాగంచేశారు. దైవ ప్రేమను మానవాళికి పంచిన రాజు క్రీస్తు ప్రభువు.
2.
దేవుని రాజ్యం శాంతి రాజ్యం – దేవునికి మానవునికి మధ్య పాపం
చేయటం వలన ఏర్పడిన ఆ అగాధంను క్రీస్తు రాజు
భర్తీ చేశారు. తన యొక్క జీవితం ద్వార, మరణ పునరుత్తానం ద్వార సమాధానంను ఏర్పరిచారు.
తండ్రికి, ప్రజల మధ్య శాంతిని నెలకొల్పిన రాజు. ప్రజల మధ్య శాంతిని నెలకొల్పిన రాజు.
3.
దేవుని రాజ్యం, సంతోషకరమైన రాజ్యం :- యేసు ప్రభువు ఈ లోకంలోకి
సంతోషమును తీసుకొచ్చిన రాజు. ఆయన జన్మం తల్లిదండ్రులకు సంతోషంను తెచ్చింది, ఆయన జన్మం గొర్రెల కాపరులకు
సంతోషం ఇచ్చింది. ఆయన సేవ రోగులకి సంతోషం సంతోషం ఇచ్చింది. ఆయన సిలువ భారం పాపులకు
రక్షణ అనే సంతోషం ఇచ్చింది. ఆయన పేదవారికి నేనున్నాను అనే భరోసా నిస్తూ సంతోషం ఇచ్చింది.
ఆయన రాజ్యంలో రాజ్యంలో సంతోషమే ఉంటుంది. ఎందుకంటే ఆయన మనకు తోడుగా ఉంటారు. మన బాధలు
పంచుకొని , మన కుటుంబంలో ఒక వ్యక్తిగా జీవిస్తూ మనలో సంతోషంను తీసుకొని వచ్చిన రాజు. సమస్త సృష్టి
ప్రాణులపై క్రీస్తుకు ఆధిపత్యం ఉంది. అయన
రాజ్యాధికారం రెండు రకాలుగా అర్ధం
అవుతుంది.
1. ఆయన సహజ సిద్ధంగా
అయన హక్కులు కలిగివున్నారు.
2. రక్షకునిగా తన
ప్రాణం ఫణంగా పెట్టి సంపాదించుకున్నాడు. రాజు రక్తం ద్వారా మనకు విముక్తి
కలిగింది.
- ప్రజలను యేసుగా
భావించి, అంగీకరించారు.
రోమా రాజ్యంపై దండయాత్ర చేసి వారిని ఓడించి నూతన సామ్రాజ్యాన్ని నిర్మిస్తాడుఅని
వారు తలంచారు.
- అయన మాటల్లో
ఆకర్షణ చూసి, అయన ప్రవర్తనలో, ఆయనయొక్క కార్యాలలో, ప్రజలకు ఆ నమ్మకం
వచ్చింది. ఆకలితో వున్నా వారికి రొట్టెముక్కలను ఇచ్చి పోషించారు,చేపలతో వారిని సంతృప్తి
చేసినపుడు అది గమనించిన ప్రజలు ఆయన్ని రాజునూ చేయాలనుకున్నారు.వారి బానిసత్వ బ్రతుకునుండి
కాపాడే రక్షకుడని, వారికోసం పోరాడే
రాజాని ప్రజలు విశ్వసించారు. యేసుప్రభువు చేసిన అనేక గొప్ప కార్యాలు ఆయన్ని రాజుగా అంగీకరించేలా చేసినవి. అయితే అయన
రాజ్యం ఈలోకమునకు చెందినది కాదని స్పష్టంగా పిలాతునకు తెలియజేసారు.ఈలోకరాజులు
అధికారంతో,అహంతో,స్వార్ధముతో,స్వబుద్ధితో,పాలనా చేసే వారు కానీ
క్రీస్తురాజు వారికి భిన్నముగా జీవించారు. అయన ఆల్ఫా,ఒమేగా - అదియు అంతమైన
రాజు. 1 . మన రాజు
మనల్ని ప్రేమిస్తారు:
అయన తన
ప్రజలందరినీ ఏ తారతమ్యం లేకుండా ప్రేమిస్తారు. పెదాలను, ధనికులను ఒకే దర్శితో ప్రేమించారు.సజ్జనులపై దుర్జనులపై ఒకేవిధంగా వర్షమును ,సూర్యున్ని కుమ్మరిస్తూ ,ప్రేమను
చూపుచున్నాడు.అందరిని ప్రేమించారు. క్రీస్తురాజు తన స్నేహితులకు ప్రాణాలర్పించారు
(యోహా :15 :13 ). దీనికి మించిన ప్రేమ వేరొకటిలేదు.
రాజు మాములుగా తన ప్రజలను
యుద్ధం చేయడానికి తనకన్నా ముందుగా సైన్యమును పంపిస్తారు. కానీ మన రాజు తానే
ముందుండి నడిచారు. రాజు తన సైన్యంకోసం ప్రాణాలు సమర్పించరు కానీ క్రీస్తురాజు తన
ప్రాణాలను అందరికోసం అందరికన్నా ముందుండి సమర్పించారు. అయన మనల్ని ప్రేమించారు
కావున తనను తాను సమర్పించుకున్నాడు.
రెండవ పఠనము; దర్శన:1 :5 :
క్రీస్తు మనల్ని ప్రేమించారు అందుకే మన పాపాల్ని కడిగి వేశారు.ఏ రాజు కూడా
క్రీస్తురాజుకన్నా ఉదారస్వభావి కాదు. ఎందుకంటే,అయన మనల్ని తన
బిడ్డలుగా స్వీకరించారు. జ్ఞాన స్నానం ద్వారా, అయన మనతో,తన జీవాన్ని పంచుకున్నారు. అయన తన యొక్క శరీర రక్తాలను మనతో దివ్యాసప్రసాదం
ద్వారా పంచుకున్నారు.అయన తన యాజకత్వమును మనకు ఇచ్చారు (దర్శ :1 :6 ). దేవుడు మనలను
అమితముగా ప్రేమించారు కాబట్టే మనకు సహాయం చేసారు.
2 . క్రీస్తురాజు నమ్మదగిన/ విశ్వసింపదగిన రాజు
:
రాజు
న్యాయం చేస్తాడని చాలామంది వారిని సంప్రదిస్తారు కానీ, కొందరు రాజులు అందరికి న్యాయం చేయరు. అందరూ రాజులు కూడా నమ్మదగిన రాజులు కాదు.
వాగ్ధానాలు చేస్తారు కానీ నెరవేర్చరు. క్రీస్తురాజు మాత్రం నమ్మదగిన రాజు.తన మీద
నమ్మకం ఉంచి తన చెంతకు వచ్చిన వారికి న్యాయం చేసే రాజు. ప్రజలయొక్క అవసరాలలో తోడుగావుండి,వారు అడిగిన వెంటనే సామ కూలంగా వారిని
సహకరించి దీవెనలు ఇచ్చే రాజు. శతాధిపతి నమ్మకంవుంచి అడిగాడు, అప్పుడు క్రీస్తురాజు తన సేవకుణ్ణి స్వస్థత పరిచాడు. భర్తీమయి నమ్మకంతో
అడిగాడు, చూపును పొందాడు.కనానీయ స్త్రీ నమ్మి
ఆశ్రయించింది, ప్రభువు
దీవెనలిచ్చారు. అయితే, నమ్మకమును నిలబెట్టుకోవడం
కూడా ఒక సత్యమైన వ్యక్తిత్వమునకు గుర్తు.
౩.క్రీస్తురాజు
అందరిని కూడా గౌరవించే రాజు :
సాధారణముగా సమాజములో రాజులు పేదవారికి ఎక్కువగా ప్రాముఖ్యతను ఇవ్వరు. వారు
ధనవంతులతో, పేరుప్రఖ్యాతలు వున్నా వారితో సన్నిహితముగా
వుంటారు. కానీ మన క్రీస్తురాజు ప్రతియొక్క వ్యక్తియొక్క వ్యక్తిత్వమును
గౌరవిస్తాడు. అయన ధనికులనుమాత్రమే కాదు చేరదీసింది,పేదవారిని,వితంతువులను,అనాథలను అందరినీ కూడా
గౌరవించాడు. అయన పేదవాని స్నేహితునిగా పిలవబడ్డాడు. సుంకరులతో, పాపులతో భుజించాడు. అది అయన యొక్క గొప్పతనం.
4 . క్రీస్తు రాజు మన కుటుంబములోనిరాజు/ మానవ
కుటుంబమునకు చెందిన రాజు:
క్రీస్తు
రాజు మనుష్య కుమారుడు. ఈలోకంలోనే మానవ రూపం దాల్చాడు.దానియేలు
మనుష్యకుమారునిగూర్చి చెప్పాడు.దాని:7 : 13 . ఇవి క్రీస్తుని ఆదేశించి పలికిన
మాటలు. అయన మనలో ఒక్కనిగా మానవ రూపం దాల్చి పేదవానిగా జీవించారు- మత్త:8 : 20 .
ఈలోగా సంబంధ
రాజులు ప్రజలయొక్క భాధలు చాలా తక్కువగా ఎరిగివుంటారు.కానీ క్రీస్తురాజు ప్రజలతో
సంచరించారు, ప్రజలనడుమ జీవించారు.తన పరలోక మహిమ
విడిచిపెట్టి ఈ లోకములో మానవునిగా జన్మించి,మనలాగే, ఆకలి దప్పులు, బాధలను, సంతోషాలను కలిగి జీవించిన రాజు. హెబ్రీ :4 :15 , మార్కు:10 : 12 , యోహా :4 : 7 .
క్రీస్తు రాజు
ప్రతిఒక్కరినీ కూడా ప్రతిఒక్కరిని క్షుణ్ణముగా అర్ధం చేసుకున్న రాజు. అయన మన
కుటుంహానికి చెందిన రాజు అని చెప్పినపుడు మనకి ఆయనకు బంధం ఉందని అర్ధం. మనం ఆయనకు
దగ్గరగా వున్నవాళ్ళం, close relationship వున్న వాళ్ళం. మన
కుటుంబములోని రాజు కాబట్టి, మనలను అర్ధం చేసుకొని
మనకు కష్టం వచ్చినపుడు ఆ కష్టమును తొలగిస్తారు.
5 . క్రీస్తు రాజు శక్తి కలిగిన రాజు:
క్రీస్తు
ప్రభువుకు సైన్యం లేనప్పటికీ అయన శక్తి కలిగిన రాజు.
- ఆయన మాటల్లో
శక్తివుంది.
-ఆయన అంగీలో
శక్తివుంది.
-ఆయన స్పర్శలో
శక్తి వుంది.
ఆయన ఈ భూలోక రాజులను పరిపాలించే రాజు (దర్శ :1 :5 ).
ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు (దర్శ :19 : 16 ).
రోమా
చక్రవర్తులు/ రాజులు వారే శక్తివంతులని అనుకున్నారు.వారియొక్క సైనిక బలముతో, అంతా జయించవచ్చు అని అనుకున్నారు.ఆయన/ వారు చెప్పింది, శాసించింది మాత్రమే జరుగుతుంది అని నమ్మరు.కానీ తొలి క్రైస్తవులను రాజు యొక్క విగ్రహాన్ని
ఆరాధించామని చెప్పినపుడు, ఆ క్రై స్తవులు ఆరాధించలేదు. ఎందుకంటే,క్రీస్తే దేవుడు.ఆయనే నిజమైన ఏకైక రాజు అని వారు గ్రహించారు.
క్రీస్తుకు
సమస్తము ఇవ్వబడినది - మత్త: 28 :18 .
ఆయన
రాజ్యమునకు అంతమే ఉండదు. - లూకా : 1 :౩౩ , దాని :7 : 13 , 14 .
క్రీస్తురాజు తన యొక్క శక్తినంతటినీ ఇతరుల
మేలుకోసం వినియోగించాడు. క్రీస్తు ప్రభువు నిజమైన రాజు. ముళ్లకిరీటం ఆయన యొక్క
రాజా కిరీటం.సిలువయే ఆయన సింహాసనము. కాబట్టి మనం క్రీస్తు రాజును మన జీవితాల
రాజుగా గుర్తించి, మనలను పాలించేలా
సహకరిదాం. ఆయన రాజ్యములో దొరికే శాంతి సమాధానాలకోసం, ప్రేమకోసం
జీవిదాం. ఆమెన్.
Rev.Fr. Bala Yesu OCD