ఆగమన కాలం రెండవ ఆదివారం
యెషయా 11: 1-10
రోమా 15: 4-9
మత్తయి 3: 1-12
ఈనాటి దివ్యగ్రంథ పఠనాలు దేవుని యొక్క రాకడ, ఆయన జన్మం మనలో
జరగాలంటే మనలో హృదయ పరివర్తన
ఉండాలి అనే అంశం గురించి
తెలియజేస్తున్నాయి.
ఎవరి
హృదయాలు అయితే పరిశుద్ధంగా ఉంటాయో అక్కడ ప్రభువు జన్మిస్తారు. దేవుని
జన్మం కోసం మన ఒక్క
ఆలోచనలు, మనస్తత్వాలు, హృదయాలు నూత్నీకరించాలి.
ఈ యొక్క ఆగమన
కాలంలో మన యొక్క జీవితాలను
మనం నూత్నీకరించుకోవాలి. దేవుని యొక్క రక్షణ ప్రతి ఒక్కరికి అవసరం.
సృష్టి ప్రారంభం నుండి
దేవుడు మానవులను రక్షించాలని ఆశించారు. పాపం
చేయటం వలన మనిషి దేవునికి
దూరమయ్యాడు. తన యొక్క ఆధ్యాత్మిక
జీవితం క్షిణించినది అందుకే ప్రభుక్కు మానవ జాతిని రక్షించాలని
ప్రవక్తలను పంపుచున్నారు. వారి యొక్క జీవితములను
నూత్నీకరించమని తెలుపుచున్నారు.
ఈనాటి మొదటి పఠనంలో దేవుడు ఏ విధంగా తాను
ఎన్నుకొన్న ప్రజలను తన యొక్క కుమారుని
ద్వారా నూత్నీకరిస్తారో యెషయా ప్రవక్త తెలుపుచున్నారు.
యెషయా ప్రవక్త ఈషాయి మొద్దునుండి ఒక పిలక పుట్టును
అని తెలుపుచున్నారు. ఈ యొక్క మాటలు
యేసుప్రభువు యొక్క జీవితంకు వర్తిస్తాయి. ఈషాయి
/ జెస్సే దావీదు తండ్రి. దావీదు
వంశం మెస్సయ్యా జన్మిస్తాడని అర్ధం - దర్శన 22: 16, యిర్మీయా 23: 5. యెషయా ప్రవక్త దేవుడు దావీదుకు చేసిన వాగ్ధానాలను జ్ఞాపకం చేసుకుంటూ పలికిన మాటలివి (2 సమూ 7: 16).
దావీదు వంశమున జన్మించబోయే శిశువు రాజ్యమును పరిపాలించును అని, దావీదు యొక్క
రాజ్యమును రాబోయే మెస్సయ్యా శాశ్వతముగా పరిపాలించును అని యెషయా ప్రవక్త
ప్రవచించారు - యెషయా 9: 7.
దేవుని యొక్క ఆత్మ అతని మీద
నిలుచును, ప్రభుని ఆత్మ రాజ్యపాలన చేయుటకు
దావీదు వంశమున జన్మించు రాజుకు శక్తిని ఒసగును, కావలసిన వరములను దయచేయును (మత్తయి 3:16 - 17).
మెస్సయ్యా వచ్చినటువంటి కాలంలో దేవుడు తన ప్రజలను క్రొత్తవారిగా
నూత్నీకరిస్తారు. ఆయన తన ప్రజలను
న్యాయముగా తీర్పు చేస్తాడు. ఎటువంటి తారతమ్యములు, భేదాభిప్రాయాలు లేకుండా వారికి తీర్పు చేస్తారు.
ఇతరులవలే కాకుండా ప్రభువు మనయొక్క హృదయాలను పరిశీలించి తీర్పు చేస్తారు 1 సమూ 16: 17.
ఈ లోక న్యాయాధిపతులు
కేవలం చూసిన దానిని బట్టి, వినిన దానిని బట్టి తీర్పు చేస్తారు కానీ ఈషాయి మొద్దునుండి
పుట్టిన పిలక మెస్సయ్యా తన
ప్రజలను న్యాయముగా తీర్పు చేస్తారు.
పేదలను, అవసరంలో ఉన్నవారిని అనాధారం చేయడు. ప్రతి ఒక్కరికి ఇవ్వవలసిన గౌరవమును ఇస్తారు. ఈలోక పాలకులవలె కాకుండా
మెస్సయ్యా వచ్చినప్పుడు పేదలను ఆదుకొని వారికి తగిన విధంగా మేలు
చేస్తారు.
ఎవరైతే దేవుని ప్రణాళికకు విరుద్ధంగా జీవిస్తారో వారు శిక్షించబడతారు. యెషయా
ప్రవక్త యిస్రాయేలు ప్రజల్లో ఒక క్రొత్త నమ్మకమును
తీసుకొని రావటానికి ప్రజలకు రెండవ దావీదు మెస్సయ్యా గురించి బోధిస్తున్నారు.
యెషయా ప్రవక్త పలికినటువంటి మాటల్లో మెస్సయ్యా తన
యొక్క రాజ్య పరిపాలన చేసే సమయంలో కొన్ని
క్రొత్త పరిణామాలు చోటుచేసుకుంటాయి, అవి ఏమిటంటే తోడేళ్ళు
గొర్రె పిల్లలతో కలిసి జీవించును, చిరుతపులి మేకపిల్లలతో కలిసి నిద్రిస్తాయి. అదేవిధంగా కొదమ సింహం లేగ
దూడలు కలిసి మేస్తాయి మరియు ఆవు ఎలుగుబంటి కలిసి
మేతమేస్తాయి. ఈ వచనాలలో మనం
అర్ధం చేసుకోవలసిన అంశమేమిటంటే మెస్సయ్యా యొక్క రాకతో క్రూర మృగాలు సైతం మిగతా సాదు
జంతువులతో కలిసి మెలసి అన్యోన్యంగా జీవిస్తాయి. దేవుడు సృష్టిని చేసినప్పుడు మొదట్లో ఏ విధంగానైతే అన్ని
జంతువులు కలిసి మెలసి జీవించాయో మరల అదే విధంగా
ఉంటాయి అని ప్రవక్త తెలియజేస్తున్నారు.
మనిషి చేయనంతవరకు అన్ని జంతువులు శాంతియుతంగా జీవించాయి. మరలా మెస్సయ్యా వచ్చే
సమయంలో అన్ని జంతువులు కలిసి ఉంటాయి, వాటి మధ్య శాంతి
ఉంటుంది అని తెలిపారు.
అన్నింటి మధ్య శాంతి నెలకొల్పేది
కేవలం ఈ యావేను గూర్చిన
జ్ఞానం కలిగినప్పుడు మాత్రమే (యెషయా 11: 9, యిర్మీయా 31: 34, హబక్కుకు 2:14).
దేవున్ని కేవలం మనస్సు ద్వారా తెలుసుకొనుట కాక ఆయన్ను హృదయ
పూర్వకంగా స్వీకరిస్తే, దేవుని ఆజ్ఞాను ఆజ్ఞానుసారంగా జీవిస్తే ఇది సాధ్యం ని
ప్రవక్త పలుకుచున్నారు.
దైవ జ్ఞానమంటే మానసిక
పరిజ్ఞానం మాత్రమే కాదు, దేవునితో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకోవడం, విశ్వాసంతో ఆయన్ను వెంబడించుట.
మెస్సయ్యా తన ప్రజలకు చేరువలో
వున్నంతవరకు ప్రజలలో శాంతి సమాధానాలు వుంటాయి. యిస్రాయేలు, యూదా రాజ్యాలు కలిసి
మరలా యెరూషలేములో యావే దేవున్ని విశ్వసించి
ఆరాధిస్తారు.
ఈషాయి వంశము నుండి పుట్టిన శిశువు వలన అందరు కూడా
ఆశీర్వదిచబడతారు అని (ఆది 12: 3), కేవలం
ఎన్నుకొనబడిన ప్రజలు మాత్రమే కాకుండా అందరు కూడా, అన్ని దేశాలు కూడా ప్రభువుకు ఆకర్షితులవుతారు.
ఈ మొదటి పఠనం
ద్వారా మనం గ్రహించవలసిన అంశం
ఏమిటంటే దేవునికి స్పందించి జీవిస్తే మనలో నూతనత్వం ఉంటుంది,
అదే విధంగా దేవుని యొక్క కుమారుడును, ఈషాయి మొద్దునుండి జన్మించిన శిశువు రాక ద్వారా మనలో
నూతనత్వం వస్తుంది.
ఈనాటి రెండవ పఠనంలోపునీత పౌలు గారు వివిధ
రకాల వర్గాలు సఖ్యపడి, అందరూ కలిసి దేవున్ని ఏక కంఠంతో, హృదయంలో
స్తుతించమని పలుకుచున్నారు. పౌలు గారు రోమీయులకు
కొన్ని విశ్వాస సూచనలు తెలుపుచున్నారు. ఎవరైతే దేవుని రాక కోసం ఎదురు
చూస్తున్నారో వారు ఎటువంటి బేధాభిప్రాయాలు
లేకుండా జీవించాలి. ఒకరిని ఒకరు అంగీకరించుకొని, సహాయం
చేసుకొని జీవించాలి.
క్రొత్తగా క్రైస్తవత్వంలోకి మారిన రోమీయ విశ్వసులకు పౌలు గారు మిగతా
యూదా క్రైస్తవులను కలసిమెలసి జీవించమని పలికారు. అన్యులు అదేవిధంగా యూదా క్రైస్తవులు కలిసి
జీవిస్తే వారి మధ్య శాంతి
సమాధానం నెలకొనివుంటుంది. దేవుడు ఏ విధంగానైతే అందరిని
అంగీకరించి జీవించారో మీరు కూడా ఎటువంటి
భేదాలు లేకుండా పరస్పర అంగీకారం కలిగి జీవించమని కోరారు.
ఈనాటి సువిశేష పఠనంలో బాప్తిస్మ యోహాను గారు చేసిన భోధన
గురించి వింటున్నాం.
దేవుని యొక్క రాకడ కోసం ప్రజల
యొక్క హృదయాలను శుద్ధి చేసుకొని ప్రభువును స్వీకరించమని యోహాను గారు పలికారు.
బాప్తిస్మ యోహాను నూతన నిబంధన గ్రంధంలో
మొదటి ప్రవక్త మరియు పూర్వ నిబంధనలో చివరి ప్రవక్తా. యిస్రాయేలు ప్రజల యొక్క చరిత్రలో మలాకీ ప్రవక్త తరువాత
దాదాపు 400 సంవత్సరాలు
దేవుడు ఏ ప్రవక్తను తన
ప్రజల చెంతకు పంపలేదు.
బాప్తిస్మ యోహాను క్రీస్తు ప్రభువు మార్గం సిద్ధం చేసిన ప్రవక్త. ఆయన యొక్క బోధన్
అందరిని ఉద్దేశించినది. క్రీస్తు
ప్రభువు యొక్క రాకతో దేవుని రాజ్యము సమీపించింది అని అందుకు హృదయ
పరివర్తనం చెందమని పలికారు.
పవిత్ర గ్రంధంలో హృదయ పరివర్తనం గురించి
అనేక సార్లు చెప్పబడినది ఎందుకంటే పశ్చాత్తాపము, హృదయ పరివర్తనం లేనిదే
దేవుడిని మన హృదయంలోకి ఆహ్వానించలేము
(లూకా 13 : 3 , అపో 3 : 38 , 3 : 19 , 2 రాజుల దిన 7 : 14 , యెషయా 55 : 7 , యెహెఙ్కేలు 18 : 21 ).
ప్రభువుకు ప్రతి ఒక్కరూ మార్గం సిద్ధం చేయాలి. దేవుడు మన జీవితం గుండా
నడిచిపోవాలంటే మార్గం సిద్ధం చేసుకోవాలి.
ప్రతి మార్గం మనలను గమ్యం చేరుటకు సహాయపడుతుంది. అదే విధంగా దేవుని
కొరకు సిద్ధం చేసే మార్గం మనం
పరలోకం చేరుటకు సహాయపడుతుంది (యెషయా 40: 3, ఆమోసు 4:12, హోషయా 10: 12, యావేలు 2: 12 -13).
మన యొక్క దారిలో
ఏదైనా ఆటంకంగా ఉంటే ప్రయాణం సాగదు
అన్నింటిని తొలగించుకోవాలి, అలాగే దేవుడు కూడా నీ/నా
జీవితం గుండా వెళ్లాలంటే మనలో వున్నా ఆటంకాలు
అన్నీ తొలగించుకోవాలి అందుకే హృదయ పరివర్తనం అవసరం.
బాప్తిస్మ యోహాను యొక్క భోధన ఫలిచింది అందుకనే
అనేకమంది బాప్తిస్మము పొందుటకు యోహాను గారి దగ్గరికి వచ్చారు. అక్కడవున్న
వారు తాము పాపాత్ములమని గ్రహించారు.
దేవుని రాక కొరకు పవిత్రంగా
వుండాలని భావించారు.
యోహాను గారి సందేశం విన్న
వారందరు కూడా ఆ సందేశానుసారంగా
నడుచుకున్నారు, అందుకనే తమ తమ పాపాలు
ఒప్పుకున్నారు. మరి మనం ఎంతమంది
సందేశాన్ని అంగీకరించి జీవిస్తున్నాం. ఎంతమంది పాప సంకీర్తనం చేస్తున్నాం?
ఎంతమంది హృదయ పరివర్తనం చెందుతున్నాం?
ప్రతి ఒక్కరు కూడా ధ్యానించుకొని జీవించాలి.
దేవుని దగ్గర పాపాలు ఒప్పుకుంటే ప్రభువు సమాన పాపాలు ఒప్పుకుంటారు
(అపో 5: 31, 13: 38, కీర్తన
103: 3, యిర్మీయా 31:
34).
పశ్చాత్తాపానికి పాప సంకీర్తనం అవసరం
అప్పుడే మనలో నూతనత్వం ఉంటుంది
(1 యోహాను 1:9, ఎజ్రా 10:11, కీర్తన 32:5, సామె2 8:13, యిర్మీయా 3: 13).
పరిసయ్యులను, సద్దూకయ్యులను యేసు ప్రభువు సర్ప
సంతానమా అని సంభోదిచారు ఎందుకంటే
య్యేహాను గారి యొక్క భోధనాల్లో
బున్న దోషాలను మాత్రమే వారు వెదుకుటకు అక్కడికి
వచ్చారే కానీ ఆయన యొక్క
సందేశం విని హృదయ పరివర్తనం
చెందుటకు కాదు. అందుకే వారిని ఉద్దేశించి యెహాను గారు ఈ మాటలు
పలికారు.
పరిసయ్యులు, సద్దూకయ్యులు దేవుని యొక్క తీర్పు వేరే వారికే కానీ
తమకు కాదని భావించారు. వారిలో హృదయ పరివర్తనం బాహ్యంగానే
ఉంది కానీ అంతరంగికంగా లేదు.
తామే నీతిమంతులు మిగతా వారు పాపాత్ములు అనే
ఆలోచనలతో ఉన్నారు కాబట్టి వారిని ఉద్దేశించి యోహాను గారు రూఢిగా మాట్లాడారు.
యెహాను గారి సందేశం నాలుగు
ప్రధాన అంశాలు బోధిస్తుంది:
1. మనం
కేవలం నామ మాత్రపు బాప్తిస్మము
తీసుకున్న క్రైస్తవులుగా కాకుండా మంచి జీవితం, విశ్వాస
జీవితం జీవించాలి (యోహాను 3: 36, ఎఫేసి 5: 5 -6, కీర్తన 2: 12). ఎన్ని సార్లు బాప్తిస్మము పొందాం అన్నది కాదు ముఖ్యం (కొంతమంది
ఇతర దేవాలయాలకు వెళ్ళినప్పుడు బాప్తిస్మము తీసుకున్నా మళ్ళీ తీసుకుంటారు) మనం ఎంత మంచి
జీవితం జీవించాం అన్నది ముఖ్యం.
2. పాపంకు
పశ్చాత్తాప పది హృద పరివర్తనం
చెందుడి అని చెప్పారు. బాహ్యంగా
చూపించే పశ్చాత్తాపము కాదు ఆంతరంగిక పశ్చాత్తాపం
ముఖ్యం. పశ్చాత్తాపం మనలో నూతనత్వం తీసుకు
వస్తుంది.
3. మన
యొక్క పూర్వీకుల చరిత్ర చూసి గర్వించక దేవుడు
చెప్పిన పనులను ఆచరించాలి. పరిసయ్యులు, సద్దూకయ్యులు మేము అబ్రాహాము సంతతి
వరం అని గర్వంతో హృదయ
పరివర్తనం లేకుండా వున్నారు. మనం కూడా పుట్టు
క్రైస్తవులము అనే గర్వంతో వుండి
పాప సంకీర్తనం చేయటం లేదు, గుడికి రావటం లేదు.
మనం వ్యక్తిగతంగా దేవునికి
జవాబు ఇవ్వాలి, ఎవరి జీవితానికి వారే
బాధ్యులు, పూర్వికులతో ఏమి సంబంధం లేదు.
మనలో ఉన్న పాపాలను మొదటిగా
కడిగివేయాలి (యిర్మీయా 4: 14, రోమా 4: 4 -5, గలతి 3: 10 - 12).
4. దేవుని
తీర్పు - మంచిగా జీవించని వారందరు కూడా దేవుని శిక్షకు
పాత్రులగుతారు. తీర్పు అనేది అందరికి కేవలం కొద్ది మందికే కాదు కాబట్టి మనం
జీవితాలను సరిచేసుకుంటూ జీవించాలి. దేవుడు మనందరినీ మంచిగా సృష్టించారు కాబట్టి మనం మంచి జీవితం
జీవించాలి.
ఈ దివ్య గ్రంథ
పఠనాలు మనలో నూతనత్వం గురించి
బోధిస్తున్నాయి. కాబట్టి బాప్తిస్మ యోహాను గారి సందేశం అందరికి
ఒక హెచ్చరిక, ఒక నూతన జీవితం
జీవించుటకు ఒక దైవ పిలుపు.
దానిని స్వీకరించి జీవితాలు మార్చుకొని దేవున్ని మన హృదయాలలోకి ఆహ్వానించుదాం.