30, సెప్టెంబర్ 2022, శుక్రవారం

27 వ సామాన్య ఆదివారం(2)

                      27 వ సామాన్య ఆదివారం


హబక్కూకు 1: 2-3, 2: 2-4 , 2 తిమోతి 1: 6-8, 13-14, లూకా 17: 5-10


ఈ నాటి మూడు పఠనాల ద్వారా తల్లి మనందరిని కూడా దేవుని పై మనకున్నటువంటి నమ్మకమును దృఢపరుచుకోమని

లేదా మన విశ్వాసమును సుదృఢపరుచుకోమని ఆహ్వానిస్తోంది.

దేవునికి మనకు మధ్య ఉన్న భందాన్ని దృఢపరుచుకోమని కోరుతుంది.

మరి ఎప్పుడు దేవునికి మనకి మధ్య ఉన్న ఆబంధం దృడంగా ఉంటుంది అంటే దేవుని ఆజ్ఞలను పాటించినప్పుడు, దేవునికి

ప్రియమైన వారిగా , నీతివంతమైన జీవితాన్ని జీవించినప్పుడు. ముఖ్యముగా క్రైస్తవ జీవితంలో వచ్చే ఆటంకాలకు,

సమస్యలకు భయపడకుండా, దేవుని యందు విశ్వాసముంచి జీవించినప్పుడు. దేవునికి ప్రియమైన వారిగా ఉంటాము.

మొదటి పఠనం

ఈ మొదటి పఠనం హబక్కూకు ప్రవక్త మరియు దేవాది దేవుడికి మధ్య జరిగిన సంభాషణ సన్నివేశాన్ని తెలియ చేస్తుంది.

అసలు దీనిగురించి ఈ సంభాషణ, ఏమిటి ఈ సంభాషణ ?

హబక్కూకు ప్రవక్త ప్రశ్న మరియు దేవుని సమాధానమే ఈ సంభాషణ.

క్రీస్తు పూర్వం 6 వ శతాబ్దం కాలంలో (609-597) . ఈ కాలానికి చెందినవాడు హబక్కూకు ప్రవక్త. అప్పుడు యూదా

రాజ్యాన్ని యెహోయాకీము రాజు పరిపాలిస్తున్నాడు. ప్రజల జీవితాలు, చీకటి జీవితలుగా మారిపోయాయి, మంచి

పరిపాలనలేదు, నీతి గల నాయకుడు లేడు. ఈ యోహాయాకీము రాజు అవినీతితో , అధర్మం , దౌర్జన్యం , దోపిడీ,

హింసలతో రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయం. దేవుని ప్రజలు ఆకలి తో అలమటిస్తున్నారు. రాజ్యం ఇలా ఉండగా ,

మరోవైపు బబులోనియా రాజు ఈజిప్టు ని ఓడించి యూదా ప్రజలమీద దండయాత్రకు , రాజ్యం వెలుపల సిద్ధంగా ఉన్నారు.

ఇలాంటి సమయంలో నీతివంతమైన జీవితాన్ని జీవిస్తున్న హబక్కూకు ప్రవక్త యూదా ప్రజల మధ్యవర్తిగా దేవుడికి పిర్యాదు

చేస్తున్నారు. దేవుడికి మొరపెడుతున్నారు. ?

2, 3 వచనాలను చుస్తే ప్రవక్త దేవుడిని ప్రశ్నిస్తున్నారు “నీవు ఆ దుష్కార్యములుచూసి ఎట్లు సహింతువు”? అని.

ఎందుకంటే మనము 4 వచనము ధ్యానిస్తే , ఇక్కడ ప్రవక్త అంటారు “ధర్మ శాస్త్రం బలహీనమైనది , నిష్ప్రయోజనమైనది

న్యాయం జరుగుటలేదు, దుష్టులు సజ్జనులను అణగద్రొక్కుతున్నారు , న్యాయం తారుమారగుచున్నది . నీవు

ఏమిచేస్తున్నావు” అని దేవుడిని ప్రశిస్తున్నాడు అని మొదటిభాగం మొదటి అధ్యాయంలో చూస్తున్నాం.

ఈ యోహాయాకీము రాజు , ధర్మశాస్త్రమును పాటించుటలేదు. ఏమిటి ఈ ధర్మశాస్త్రము ?

ధర్మశాస్త్రమంతా కూడా బోధించేది మనకు దేవుని ప్రేమిచడం మరియు మానవుని ప్రేమిచడం. ఇక్కడ ఈ రాజు రెండు

చేయుటలేదు. రాజ్యాన్ని అన్యాయముగా పరిపాలిస్తున్నాడు.

మరి ప్రవక్త అడిగిన ప్రశ్నకు సమాధానముగా దేవుడు 2 వ అధ్యాయంలో , సమాధానమిస్తున్నారు. ఇది రెండవభాగం.

ఇక్కడ దేవుని సంధానం ఏమిటి అంటే ; నిర్ణీత కాలమున సంస్తముకూడా జరుగుతుందని, ఆలస్యముగా జరుగుతుందని.

ఓపికతో వేచివుండుము అని, అప్పటివరకు నీతిమంతులుగా భక్తి విశ్వాసములతో జీవించమని దేవుడు

సమాధానమిస్తున్నారు.

కాబట్టి మొదటి పఠనం నుండి మనము నేర్చుకోవలసినది; దేవునియందు విశ్వాసముంచి , ఓపిక గలిగి నీతివంతమైన

జీవితాన్ని జీవించడం.

రెండవ పఠనం

ఈ రెండవ పఠనం కూడా క్రీస్తునందు ప్రేమ, మరియు విశ్వాసము కలిగి జీవించుము అని తెలియచేస్తుంది.

ఏవిధంగానంటే

ఈ నాటి రెండవ పఠన చరిత్ర మనం చూస్తే ; ఇది పునీత పౌలు గారు రోమునగరమందు చెరసాలలో బందీగా ఉన్నప్పుడు

దైవ సేవకుడైన తిమోతీ గారికి సలహాలుగా , సూచనలుగా రాస్తున్న లేక ఇది.

క్రీ. శ 63 వ సంవత్సరంలో పౌలు గారు బందీ గా చేయబడ్డారు. ఎఫెసు నగరంలో తిమోతి గారు దైవసేవకుడిగా ఉన్నారు.

ఆ సమయంలో ఎఫెసు నగరంలో కొన్ని విభేదాలు, సమస్యలు, విభజనలు జరుగుతున్నాయి. ముఖ్యముగా నాస్తికుల

వాదనలు, విమర్శలు పెరిగాయి , క్రీస్తుని అనుసరించువారిని విశ్వాసంలో తప్పుదారిలో నడిపిస్తున్నారు, విశ్వాసులు క్రీస్తుకు

దూరమవుతున్నారు . ఇలాంటి అయోమయ స్థితిలో తిమోతిగారికి సువార్త పరిచర్య కష్టమవుతుంది. అందుకుగాను

పౌలుగారు తన సలహాలను, సూచనలను తిమోతి గారికి పంపిస్తున్నారు.

ఇక్కడ మనము ముఖ్యముగా మూడు సలహాలను చూడవచ్చు.

మొదటిగా

“నీకు జ్ఞాపకము చేయుచున్నాను” ఏమని, నీవు దేవుని సేవకుడవు, క్రీస్తు సేవకుడవు, నాలాగే నీవుకూడా “దేవుని

వరమును” (దేవుని శక్తి లేదా పవిత్రాత్మను) పొందియున్నావు. ఆ శక్తి నిన్ను పిరికివాని చేయదు. నిగ్రహము కలిగి ఉండుము

అని తెలియచేస్తున్నారు.

రెండవదిగా

క్రీస్తు ఒసగినటువంటి శక్తితో, సువార్త కొరకై నావలే పాటుపడుము. దేవునికి సాక్షిగా ఉండుటకు సిగ్గుపడకుము అని

అంటున్నారు . క్రీస్తు కొరకై శ్రమలు అనుభవించడానికి సిగ్గు పడకుము, భయపడకుము అని అంటున్నారు.

మూడవదిగా

“క్రీస్తు యేసునందు ఐక్యము” వలన అంటే “నీవు క్రీస్తు యేసుతో ఐక్యమై ఉండుము”. ప్రేమబందాన్నీ , విశ్వాస బంధాన్ని

కలిగి జీవించు అని అంటున్నారు. ఎప్పుడైతే అలాజీవిస్తావో క్రీస్తు కొరకు పాటుపడటానికి సాధ్యమవుతుంది.

ఈ రెండవ పఠనం నుంచి మనం నేర్చుకునేది ఏమిటంటే

క్రైస్తవులైన మనందరం కూడా జ్ఞానస్నానం ద్వారా పవిత్రాత్మ వరమును , శక్తిని పొందియున్నాము. కాబట్టి మనము కూడా

పైన పేర్కొనిన మూడు సిద్దాంతాల ప్రకారం జీవించాలని పునీత పౌలుగారివలె , తిమోతి గారివలె జీవించమని , క్రైస్తవులైన ,

దైవసేవకులైన మనందరికీ తెలియ చేస్తున్నారు.

1. మనలో కూడా పవిత్రాత్మ ఉన్నది.

2. మనము కూడా సువార్త కొరకై పాటుపడాలి, క్రీస్తుకు సాక్షిగా నిలవాలి

3. క్రీస్తునందు ప్రేమ, మరియు విశ్వాస భందాన్ని ఏర్పరుచుకోవాలి.

సువిశేష పఠనం

సువిశేష పఠనంలో కూడా శిష్యులు ప్రభువుతో “మా విశ్వాసము పెంపొందించుము” అని అంటున్నారు. ఎందుకు?

మనము ఈ నాటి సువిశేష పఠనం 1 నుండి 4 వచనాలు ధ్యానిస్తే ; క్రీస్తు ప్రభువు శిష్యులకు ఈ విధంగా ఉపదేశిస్తున్నారు.

“ఆటంకములు రాక తప్పవు. జాగరూకులు కండు” అని ఉపదేశించిన సందర్భంలో లోని మాటలు ఇవి. ఈ మాటలకి

శిష్యులు “మా విశ్వాసమును పెంపొందించుము” అని అంటున్నారు.

శిష్యులకి కూడా తమ వ్యక్తిగత జీవితాలలో ఆటంకములు, సమస్యలు రావచ్చును. తమ సోదరుల మధ్య ఉన్న

సంభందాలలో ఆటంకములు విమర్శలు రావచ్చును. ముఖ్యముగా తమ సువార్త పరిచర్యలో కష్టాలు, ఆటంకములు,

సమస్యలు రావచ్చును. ఇలా ఎన్ని వచ్చినాకూడా, క్రీస్తు అప్పగించిన, లేదా క్రీస్తు నిర్వహించిన కర్తవ్యమును నెరవేరుస్తారో

వారు మాత్రమే సేవకులంటున్నారు. ఉదాహరణకు రెండవ పఠనం , పునీత పౌలుగారి జీవితం.

అందుకే క్రీస్తు ప్రభువుకూడా -ఒక సేవకుని కర్తవ్యమును ఉదాహరణగా చూపిస్తున్నారు .

సేవకుడు ఎన్ని పనులు చేసిన , ఎంత అలిసిపోయిన , ఎన్ని ఆటంకాలు న్నా , తన యజమానుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం

జీవించడమే సేవకునియొక్క కర్తవ్యం అని క్రీస్తుప్రభువు తెలియచేస్తున్నారు. అలా జీవించడానికి కావలసినవి యజమానుని

యందు ప్రేమ మరియు యజమానుడు ఒసగిన కర్తవ్యాన్ని విశ్వాసంతో చేయడం.

అవిలేనిదే మనము ఏపనికూడా చేయలేము.

అందుకే క్రీస్తు ప్రభువు ఈ నాటి పఠనంలో అంటున్నారు మీకు ఆవగింజంత విశ్వాసము, ప్రేమ ఉన్న , వృక్షాలు సైతం

తొలగించవచ్చని.

మరి మంజీవితాలలో అలాంటి విశ్వాసం , ప్రేమ దేవునియెడల ఉన్నట్లయితే మన జీవితాలలో వృక్షాలుగా పాతుకుపోయిన

ఆటంకాలు, కష్టనష్టాలు , సమస్యలును కూడా ఎదుర్కొనవచును , వాటిని వేరుతో సహా పెళ్లగిలి బయట పారవేయవచ్చును

మరి ఒక్కసారి మనం ధ్యానిద్దాం , ఆత్మ పరిశీలన చేసుకుందాం.

మన క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో ఇలాంటి ఆటంకాలే వస్తాయి. ఏవిధంగా అయితే యూదా ప్రజలు

యోహాయాకీము రాజు అన్యాయ, అక్రమ పరిపాలనను అనుభవించారో, దైవ సేవకులైన పునీత పౌలుగారు మరియు

తిమోతి గారు నాస్తికుల విమర్శలకు మరియు కష్టాలు, శ్రమలకు గురయ్యారో, ఏవిధంగా క్రీస్తు ప్రభువు శిష్యులు విశ్వాస

పరీక్షలకు గురయ్యారో, మనము కూడా అలాంటి సమస్యలనే ఎదుర్కొంటాం. అలాంటి సమయాలలో కూడా మనము

పాటించవలసిన సిద్దాంతం.

1. మనలో కూడా దైవ వరం లేదా పవిత్రాత్మ శక్తి ఉందని గుర్తించాలి.

2. సమస్యలకు ఆటంకాలు భయపడకుండా, క్రీస్తుని సువార్తకై సాక్షిగా జీవించాలి.

3. క్రీస్తుని ప్రేమిస్తూ, ఆయనయందు విశ్వాసముంచి, మనజీవితాలలో ముందుకు సాగాలి.

బ్రదర్. సుభాష్ ఓ.సి.డి

పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు...