1, అక్టోబర్ 2022, శనివారం

27 వ సామాన్య ఆదివారం

 27 వ సామాన్య ఆదివారం

హబక్కుకు 1:2-3,2:2-4
2తిమో 1:6-8,13-14
లుకా 17:11-19

ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు విశ్వాసం గురించి తెలుపుచున్నాయి. ద్రుడ విశ్వాసం కలిగి ఉండుట ద్వారా దేవుడు మన జీవితంలో చాలా అద్భుతాలు చేస్తారు.
అందరి జీవితాలలో కష్టనష్టాలు, బాధ, సంతోషాలు ఉంటూనే ఉంటాయి అలాంటి సందర్భంలో దేవుని మీద మనకు ఉన్న విశ్వాసం ఎలాంటిది.
విశ్వాసం గురించి వివరించే సందర్భంలో పునీతా థామస్ అక్వినస్ గారు ఈ విధంగా అంటారు "విశ్వాసం ఉన్నవారికి ఎలాంటి వివరణ అవసరం లేదు ఎవరికైతే విశ్వాసం ఉండదో వారికి ఎంత వివరణ ఇచ్చినా సరే వారు విశ్వసించారు". దేవుని యొక్క విషయాలు మన యందు నెరవేరతాయి అని ఆయన ఎడల మనం పూర్తి విశ్వాసంను కలిగి జీవించాలి.
ఈనాటి అన్ని పట్ణాలు కూడా మనం దేవుని యెడల ఆయన వాగ్దానాల పట్ల అంచంచల విశ్వాసం కలిగి జీవించాలని తెలుపుచున్నాయి.
ఈనాటి మొదటి పట్ణంలో హబక్కుకు ప్రవక్త తోటి యోధ ప్రజలను విశ్వాసం కలిగి ఉండమని తెలుపుచున్నారు. హబక్కూక్ ప్రవక్త క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలో జీవించారు అది ఎరుషలేము పతనమయ్యే సమయం (586 BC). ప్రవక్త జీవించే సమయంలో యూదా రాజ్యంలో ఎక్కడ చూసినా సరే అవినీతి, దౌర్జన్యం, అన్యాయం, హింసకాండలు జరుగుతుండేవి.
బాబిలోనియా రాజు యోధ పై రాజ్యంపై దండెత్తి వచ్చి వారిని అనేక కష్టాలు పాలు చేశారు అలాంటి కష్ట పరిస్థితులలో హబక్కూకు ప్రవక్త తోటి యూదా ప్రజలను ఉత్సాహపరుస్తూ దేవుని యెడల విశ్వాసం కోల్పోవద్దని తెలిపారు.
హబక్కుకు మొదటి అధ్యాయం రెండవ అధ్యాయంలో ప్రవక్త మరియు దేవుని యొక్క సంభాషణల గురించి తెలియజేయబడింది. ప్రవక్త మొదటి దేవునికి ప్రజల యొక్క బాధల గురించి దేవునికి ఫిర్యాదు చేసేవారు తరువాత దేవుడు తన ప్రజలకు సమాధానం ఇచ్చేవారు.
క్రీస్తుపూర్వం 600 వ సంవత్సరంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుని వడంబడిటకు వ్యతిరేకంగా జీవించినప్పుడు దేవుడు వారికి నేర్పించుట కొరకు వారిని బాబిలోనియాకు బానిసలుగా పంపించారు. ప్రజల యొక్క పాప ఫలితం గానే తమకు కష్టాలు వచ్చాయి అనే ప్రవక్త గ్రహించారు.
హబక్కుకు ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలు అన్యుల క్రింద హింసించబడట అంతగా నచ్చలేదు ఎందుకంటే వారు కూడా అన్యాయం చేసిన వారే. ప్రవక్త ఎందుకు దేవుడు అన్యులకు సహకరిస్తున్నారు అని కూడా అనుకున్నారు. ఎందుకు దేవుడు తన శత్రువులను శిక్షించుటలేదు అని భావించారు అయినప్పటికీ దేవుడు దయామయుడు ఆపదలో ఆదుకునేవాడు పాపాన్ని శిక్షించిన దాన్ని మరలా మన్నించి పాపిని దగ్గరకు చేర్చుకుంటాడు అనీ గ్రహించాడు.ప్రజల యొక్క జీవితం ఎంత బాధగా ఉన్నా దేవుడు మాత్రము ప్రవర్తన తన్ను విశ్వసించమని తెలిపారు. యావే దేవుడిని విశ్వసించి ఆయన యందు సహనం కలిగి జీవించమని ప్రవక్తకు తెలియజేశారు. ప్రజలు ఏ విధంగా ఉన్నా కానీ దేవుడు మాత్రము తన యొక్క విశ్వాసనీయతను ప్రదర్శించుచున్నారు.
ఈ మొదటి పట్ణం చివరి మాటల్లో దేవుడు ప్రజలకు మేలు చేస్తానని పలుకుచున్నారు అదేవిధంగా నీతిమంతులు భక్తి విశ్వాసము వలన జీవిస్తారు అని ప్రభువు ప్రవక్తకు తెలియజేశారు. (హెబ్రీ 2:4 రోమి 1:17, గలతి3:11, హెబ్రీ 10:38).
నీతిమంతులు దేవుని యెడల విశ్వాసమును నిలుపుకుంటారు. వారి జీవితంలో ఎన్ని బాధలు వచ్చినా వారు మాత్రము దేవుని యెడల విశ్వాసం కోల్పోరు. నీతిమంతులు తమ భక్తి విశ్వాసం వలన జీవిస్తారు ఎందుకంటే దేవునితో ఉన్న అనుబంధం అలాంటిది.
ఈనాటి మొదటి పట్ణం ద్వారా మనం గ్రహించవలసిన విషయాలు:
1. దేవుని యెడల గొప్ప విశ్వాసం ఉండాలి ఎందుకంటే ఆయన విశ్వాసనీయుడు.
2. బాధలలో కష్టాలలో దేవుడిని విడువకూడదు. ఆయన మీదనే ఆధారపడి జీవించాలి. 
3.మన హింసలలో మనకు సహనం ఉండాలి.
4. దేవుడి మనకు సమాధానం ఇస్తారు అనే నమ్మకం ఉండాలి.
5. దేవుని దయ అపారమైనది.
ఈనాటి రెండవ పట్ణంలో పుణ్యత పౌలు గారు సువార్త ప్రకటించమని తిమోతి గారిని కోరుచున్నారు. సువార్త ప్రకటన అనేది శ్రమలతో కూడుకున్నది కాబట్టి సువార్తకై పాటుపడమని పౌలు తిమోతికి తెలుపుచున్నారు. పౌలు గారు కూడా క్రీస్తు ప్రభువుని తెలుసుకొనకముందు అనేకమందిని హింసించారు తరువాత ఆయన గురించి సువార్త ప్రకటించారు. మనం జీవితంలో కూడా సువార్త ప్రకటించాలి పౌలు గారు తన పరిచర్యలో అనేక హింసలు పొందారు అయినా విశ్వాసం కోల్పోలేదు ప్రభువు హక్కును ప్రకటించారు అదేవిధంగా చేయమని తిమోతిని కోరారు. 
తన వలి సత్య సువార్త కోసం శ్రమలు అనుభవించడానికి సిద్ధంగా ఉండాలని తిమోతికి తెలుపుచున్నారు. ఈనాటి సువిశేషంలో ప్రభువు విశ్వాసం గురించి తెలుపుచున్నారు అదేవిధంగా ఒక సేవకుని యొక్క కర్తవ్యం గురించి కూడా తెలుపుచున్నారు. 
ఈ విశేష భాగమునకు ముందు వచనాలు చదివినట్లయితే అక్కడ పొరుగు వారిని క్షమించుట గురించి తెలియజేయబడినవి. ఒక వ్యక్తిని పదేపదే క్షమించాలంటే చాలా గొప్ప విశ్వాసమే ఉండాలి అందుకే మా విశ్వాసమును పెంపొందించమని అన్నారు. దానికి సమాధానం క్రీస్తు ప్రభువు ఆవగింజ విశ్వాసం ఉన్న కంబళి చెట్టును వేరుతో పెల్లగిలి సముద్రమనా పడుము అని ఆజ్ఞాపించిన అది అట్లే జరుగును అని అన్నారు.ఆవగింజ చూడటానికి చాలా చిన్నగా ఉంటుంది ఒక ఇసుక రేణువలే ఉంటుంది అలాంటి చిన్న నిజమైన విశ్వాసం మన జీవితంలో అనేక మార్పులు చేస్తుంది అనే ప్రభువు తెలిపారు.
విశ్వాసం అంటే నమ్మకం. మనకు ఉన్న డబ్బును బ్యాంకులలో వేస్తాము ఎందుకంటే ఆ బ్యాంకు మీద ఉన్న నమ్మకమును బట్టి మన డబ్బును దాచుకుంటాం. అదేవిధంగా మన నమ్మకం దేవుని యందు ఉంచాలి. దేవుని యందు ఉంచితే అది మేలు చేకూర్చుతుంది. 
పునీత పౌలు గారు అంటారు విశ్వాసం అంటే చూడని విషయాలు జరుగుతుంటాయి అనే నమ్మకమును కలిగి ఉండటమే. హెబ్రీ 11:1.
ఈ విశ్వాసమును కలిగి ఉండటం ద్వారా దేవుడు అనేక అద్భుత కార్యాలు చేస్తారు. 
1. విశ్వాసం ద్వారా దేవుడు అబ్రహామును మహాజాతిగా తీర్చిదిద్దారు.
2. విశ్వాసం ద్వారానే మోషే ఎర్ర సముద్రమును కర్రతో కొట్టి రెండు పాయలుగా చేశారు.
3. విశ్వాసం ద్వారానే సారేఫతు వితంతువు ఏలియా కు సహాయం చేశారు.
4. విశ్వాసం ద్వారానే నామాను ఎలీషా చెప్పిన విధంగా చేశారు.
5. విశ్వాసం ద్వారానే కణనీయ స్త్రీ తన కుమార్తెకు స్వస్థత వచ్చేలా చేసింది.
6. విశ్వాసం ద్వారానే యాయీరు తన కుమార్తెను బ్రతికించుకున్నారు.
ఈ విధంగా దేవుని యందు విశ్వాసం కలిగి ఉండుట ద్వారా అనేకమంది జీవితాలలో దేవుడు అద్భుతాలు చేశారు.
2. విశ్వాసం దేవునితో ఉన్న బంధంను చూసిస్తుంది. మనకు దేవునితో చిన్న బంధం ఉన్నట్లయితే అది చాలు చాలా అద్భుతాలు జరుగుతాయి అని ప్రభువు తెలుపుచున్నారు. విశ్వాసం కలిగి జీవించుట ద్వారా ఎంతటి పెద్ద సమస్యను అయినా పరిష్కరించుకోవచ్చు అని తెలుపుచున్నారు. భూమిలోకి పాతుకొని పోయిన ఒక పెద్ద చెట్టు సైతం విశ్వాసం ద్వారా పిలికించవచ్చని ప్రభువు అన్నారు. 
ఇక్కడ ఏసుప్రభువు శిష్యులను కేవలం పొరుగు వారిని క్షమించుటకే విశ్వాసమును కలిగి ఉండమని తెలుపుచున్నారు. విశ్వాసం అంటే దేవునితో ఉన్న ప్రేమ అనుబంధం దానివలన మనం ఇతరులకు మేలు చేస్తాం. 
సువిశేష రెండవ భాగంలో సేవకుని కర్తవ్యం గురించి ఏసు ప్రభువు తెలుపుచున్నారు. మన యొక్క విశ్వాసం ఏ విధంగా నిరూపించబడుతుంది అంటే మన యొక్క క్రియల వలన. విశ్వాసమున సేవకుడు తన యొక్క బాధ్యతను సక్రమంగా నెరవేర్చుతాడు. మనము దేవుని యొక్క సేవకులం కాబట్టి యజమాని యొక్క పని చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి ఎటువంటి బహుమానంను ఆశించకూడదు మన యొక్క బాధ్యతలు నెరవేర్చటలో ఏ విధంగా మనం ఉంటున్నాం. ఒక గురువుగా తల్లిగా తండ్రిగా ఉపాధ్యాయుడిగా మన బాధ్యతలు ఎలాగ నెరవేర్చుతున్నాము..
విశ్వాసము ద్వారా దేవుడు అసాధ్యమైనవి సుసాధ్యం చేస్తారు కాబట్టి ఆయన ఎంతో నమ్మకం కోల్పోరాదు. .
విశ్వసించుట అంటే ఆయన ఆజ్ఞలకు కట్టుబడి ఉండటమే.
విశ్వసించుట అంటే ఆయన్ను ప్రేమించడమే.
విశ్వసించుట అంటే ఆయన్ను విదేయించుటయే.
విశ్వసించుట అంటే దేవుని వాగ్దానాలు నెరవేరతాయి అని నమ్ముటయే కాబట్టి ప్రభువుని విశ్వసించి ఆయన యొక్క వాక్కు అనుసారంగా జీవించి దేవునికి ఇష్టమైన సేవకులుగా జీవించుదాం.

BY.  FR. BALAYESU OCD

11వ సామాన్య ఆదివారం

11వ సామాన్య ఆదివారం  యెహెజ్కేలు17:22-24, 1 కొరింతి 5:6-10, మార్కు 4:26-34 ఈనాటి పరిశుద్ధ గ్రంధ పఠణములు దేవుని యొక్క రాజ్య విస్తరణ గురించి బో...