30 వ సామాన్య ఆదివారము(2)
ఈ నాడు మూడు పఠనాలు దేవుని యొక్క రక్షణ మరియు నూతన జీవితం గురించి తెలియజేస్తున్నాయి. తండ్రి ఐన దేవుడు తన ప్రజల పట్ల చూపిన అపారమైన ప్రేమ, ఒక తండ్రికి తన పిల్లపై ఏ విధంగా ఉంటుందో, మరియు దేవున్ని దృఢమైన విశ్వాసంతో ప్రార్థిస్తే మనకు కలిగే రక్షణ మరియు నూతన జీవితం, అనే విషయాలను మనము ఈ నాడు తెలుసుకుంటాము.
మొదటి పఠనము ధ్యానించినట్లైతే బాబిలోను దేశ బానిసత్వంలో మగ్గుచున్న ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఒక తండ్రిగా లేక తండ్రివల్లే విమోచించబోతున్నాడు. మరల వారికీ పూర్వ వైభవం దయచేస్తానని యిర్మీయా ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నాడు. కేవలం బాబిలోనియ నుండి మాత్రమే కాదు ప్రపంచం మొత్తం చెల్లా చెదురైనా వారిని తమ సొంత దేశానికి తరలిస్తున్నాడు దేవుడు. నేల అంచుల నుండి వారిని కొనివత్తును, గ్రుడ్డివారు, కృంటివారు, గర్భవతులు, ప్రసవించుటకు సిద్ధముగా ఉన్నవారను ఎల్లరును కలిసి మహాసముద్రంగా కలిసి వత్తురు.
కాబ్బటి సంతసముతో పాదుడు, స్తుతిగానము చేయుడు. ఎందుకంటే ప్రభు తన ప్రజలను రక్షించెను. యిర్మీయా 31: 9 వారు ఏడ్పులతోను, ప్రార్థనతోను తిరిగి వత్తురు, ఎప్పుడైతే నువ్వు ఈ విదంగాదేవుని యొద్దకు తిరిగి వస్తావో అప్పుడు దేవుడు నిన్ను నడిపిస్తాడని తెలియజేస్తున్నాడు. మనము దేవుని దగ్గరకు తిరిగి వస్తే మనలను అయన సొంత బిడ్డలుగా మార్చుకుంటాడని చెబుతున్నాడు. ప్రియా స్నేహితులారా ఒక్క మాటలో చెప్పాలంటే నేటి మొదటి పఠనము ద్వారా దేవుని యొక్క ప్రేమ తన ప్రజలపై ఒక తండ్రి వాలే ఉంటుందని తెలియజేస్తున్నాడు.
సువిశేష పఠనములో
ద్రుష్టి ప్రదానం చేసే అద్భుతం సంఘటన దానిలో పరమార్థాన్ని చూస్తున్నాము. మొదటి పట్టణములో యావే ప్రభువు గ్రుడ్డి వారి పట్ల చూపిన ప్రేమను నెరవేర్చు ప్రవచనం. యేసు అయన శిస్యులు, గొప్ప జనసమూహముతో యెరికో పట్టణం దాటి పోతున్నారు. అంటే ఎసరుసలేము పట్టణానికి సమీపంలో ఉన్నారని అర్థం.
బర్తిమయి అనే గ్రుడ్డి వాడు త్రోవ పక్కన కూర్చొని బిక్షమడుగుకుంటున్నాడు అటువంటి దౌర్భాగ్యులకు ఆ కాలంలో ఆ దేశంలో గుర్తింపు లేదు.
ఆ వ్యక్తి అక్కడ జనం యొక్క అలజడి విని దానికి కారణం అడగ్గా "నజరేతు నివాసియగు యేసు ఆ మార్గమున వస్తున్నాడని ఒక వ్యక్తి చెప్పాడు" అది విన్న వెంటనే గ్రుడ్డి వాడు, దావీదు కుమారా యేసు ప్రభువు నన్ను కరుణింపుము అని యేసును పిలవడం మొదలుపెట్టాడు. బిగ్గరాగా పిలిచాడు. అక్కడ మనం గమనిస్తే అతని కేకలకు, ఆర్తనాదాలకు ప్రజల యొక్క గదమాయింపు మనం చూస్తున్నాము. చుట్టూ ఉన్న ప్రజలు ఆయన్ను నోరు మూసుకొమ్మని కోపగించుకున్నారు. గ్రుడ్డి వానికి ఆటంకంగా ఉన్నారు కానీ బర్తిమయిని ప్రజలు ఆపలేకపోయారు. పెద్ద పెద్దగా అరవగలిగాడు, అరిచాడు. లూకా 18 : 1-8 వితంతువు ప్రార్థన ద్వారా క్రీస్తు మనకు ఎల్లపుడు ప్రార్ధించండి, నిరుత్సహులు కాకాకండి అని తెలియజేశాడు. చాలాసార్లు మన ప్రార్థన వేడుకోలు ఆర్తనాదాలు ఇతరులకు వెర్రి కేకలుగా కనిపించవచ్చు. మరి నువ్వు నేను దేవుని బర్తిమయి లాగా బిగ్గరగా పిలువగలుగుతున్నామా లేదా?
మనం మన జీవితాలను పరిశీలించినట్లయితే ఎన్నో విషయాలు, వ్యక్తులు, వస్తువులు, మనలను యేసుప్రభువును సమీపించదానికి ఆటంకాలుగా ఉంటునాయి.
కొన్ని సార్లు మనం ఇతరుల దేవుని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటే వారు దేవుని సన్నిధికి వెళ్లకుండా, ప్రార్థన చేయనీయకుండా అడ్డు పాడతాం, ఆటంకాలు కలుగజేస్తాము. అందుకే మనకు ఉదాహరణగా బర్తిమయి తీసుకోవాలి ఎందుకంటే అతడు పట్టుదలతో ప్రార్ధించాడు, దానికి ఫలితం అంధకారాన్ని తొలగించి నూతన జీవితాన్ని ప్రసాదించాడు.
నువ్వు నేను దేవుని పిలిస్తే క్రీస్తు కూడా మనలను అదే ప్రశ్న అడుగుతున్నారు! నీకు ఏమి కావాలి ధనమా, పేరు ప్రఖ్యాతలు, అందమా, ఆరోగ్యంగా లేక ఆయుషా. అందుకే నన్ను ని బిడ్డగా మార్చు ఈ ప్రశ్నకు జవాబు రెండొవ పట్టణములో చూస్తున్నాము, దేవుడు ప్రభువైన క్రీస్తు ప్రభు పలికిన మాటలు మనతోకూడా పలికితే, అది నాకు చాలు అని ప్రార్ధించాలి. ఏంటి ఆ మాట అంటే హెబ్రీ 5 : 5 లో నువ్వు నా కుమారుడవు, నా కుమార్తెవు నేను నీకు తండ్రి నైతిని. క్రీస్తు ప్రభుని భక్తి, వినయాల వల్లనా తండ్రి దేవుడు క్రీస్తు ప్రభుని ప్రార్థన ఆలకించెను అని వింటున్నాము. క్రీస్తు దేవుని పుత్రుడై వుండి కూడా మనకు ఒక గొప్ప సుమాతృకను ఇచ్చి ఉన్నాడు.
బర్తిమయి దృఢమైన విశ్వాసంతో, పట్టుదలతో ప్రార్ధించాడు, దేవుని కరుణ పొంది నూతన జీవితం పొంది క్రీస్తును అనుసరించాడు.
కాబ్బటి ప్రియా స్నేహితులారా మన దేవుడు మన అవసరాలు, బలహీనతలు ఏరిగినవాడు, కావున మన అందరిని ఆదుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి విశ్వాసంతో దేవుని ప్రార్ధించి రక్షణ, నూతన జీవితం పొందుదాం! ఆమెన్.
Br.Suresh OCD