ముప్పది ఒకటవ సామాన్య ఆదివారము
ద్వితి:6 :2 :6 , హెబ్రి:7 :23 -28 , మార్కు:12 :28 -34
ఈనాటి దివ్య పఠనాలు ఆజ్ఞల యొక్క అంతరంగాన్ని, మరియు వాటి అర్ధాన్ని గురిం చితెలియజేస్తున్నాయి. అదే దైవ ప్రేమ,మానవ ప్రేమ అని బోధిస్తున్నాయి.దానితోపాటు
దేవునియొక్క ఆజ్ఞలను మనం పాటిస్తే కలిగే ప్రయోజనాలు గురించి కూడా ఈనాటి పఠనాలు తెలుపుచున్నాయి. మనం దేవుడి చేత సృష్టించ బడినది దేవుడిని ప్రేమించడానికి అదే విధంగా దైవప్రేమను పొరుగువారితో పాటించడానికి. దేవునియొక్క ప్రేమను పొందాలి అంటే ఆయనయొక్క ఆజ్ఞలను, చట్టాలను తూచా తప్పకుండా పాటిస్తూ, మన పొరుగు వారిని కూడా ప్రేమించాలని, దానిద్వారా దేవునియొక్క ప్రేమను మనం పొందుతామని తెలిజేస్తున్నాయి.
మొదటి పఠనము :
వచనంలోమోషేప్రవక్త ఇశ్రాయేలీయులతో అంటున్నాడు:మీరు దేవునికి భయ పడుదురేని,
దేవునియొక్క ఆజ్ఞలను పాటిస్తే కలుగు లాభాలు:
2. దేవుడిని ప్రేమించి, అయన ఆజ్ఞలను పాటిస్తే,1,000 తరములవరకు దీవెన, కరుణను
పొందుతాం -నిర్గ:20 :6 .
3. దేవుని మాటలను/ ఆజ్ఞలు పాటిస్తే, దేవుడు మనతో వుంటారు. - యోహాను:14 :23 .
4. దేవునియొక్క సంరక్షణ పొందుతాం. - లేవి:25 : 18 .
5. దేవుడు మనయొక్క స్నేహితుడు అవుతాడు. - సామె:15 :14 .
6. దేవునియొక్క ఆజ్ఞలను పాటించడం ద్వారా
-మన జీవితములో సంతోషం కనుగొంటాము.
- దేవుని చేత దీవించబడతాము.
-సమాదానం దొరుకుతుంది.
- దేవుడు మన ప్రార్ధన ఆలకిస్తారు.
-శాశ్వతజీవమును పొందుకుంటాం.
-దేవుని ప్రేమను పొందుకుంటాం, విజ్ఞానాన్ని పొందుతాం.
- మన జీవితములో పరిపూర్ణతను పొందుకుంటాం.
- దేవునియొక్క సాన్నిధ్యం అనుభవించవచ్చు.
సువిశేష పఠనము:
సమీపించి, ప్రధానమైన ఆజ్ఞను తెలుసుకుంటున్నారు.అయితే వివిధ ప్రదేశాలలో ఈ ధర్మశాస్త్ర బోధకులు దేవుని సమీపించేది యేసుప్రభువును ఇరకాటంలో పెట్టడానికే.కానీ ఈనాటి ధర్మశాస్త్ర బోధకుడు మాత్రం తన ప్రశ్నకు జవాబు తెలిసిన తరువాత సంతోషపడుచున్నాడు. ఇతనిలో ఎటువంటి కల్మషము లేకుండా దేవునియొక్క అభిప్రాయం తెలుసుకుంటున్నారు. ఇదే మంచి భోధకులయొక్క లక్షణం. యేసు ప్రభువు అతనియొక్క దేర్యానికి మెచ్చుకొంటున్నాడేకాని కండించడంలేదు. అతనిపై ఎటువంటి పక్షపాతం చూపించడంలేదు.
ఈలోకంలో రెండురకాల ప్రేమలు ఉన్నాయి. అవి:
1. దేవుని ప్రేమ . 2. మానవ ప్రేమ .
1. దేవుని ప్రేమ :
దేవుడిచ్చిన ఆజ్ఞలన్నిటిలో ప్రేమ ఆజ్ఞ మొట్ట మొదటిది. ఈ ఆజ్ఞలయొక్క సారాంశము ఏంటి అంటే,దేవునియొక్క నిత్యరాజ్యములోనికి ప్రవేశింపచేయడానికే. ఆనాడు ఆదాము అవ్వల ద్వారా తెగిపోయిన బంధాన్ని ఈనాడు తిరిగి నిర్మించడానికి ఈ ప్రేమ ఆజ్ఞను మనందరికీ బహుమానంగా ఇస్తున్నాడు. అయితే మనం ఎందుకు దేవుడిని ప్రేమించాలి?
సృష్టించాడు. అయన తోనే నివాసము ఏర్పరచుకునేందుకు, ఆయనతోకలిసి జీవించుటకు
తరువాత మోక్షం పొందుటకు అయన మనలను సృష్టించాడు. దేవుని ఆదరణ పొందాలన్నా,
అయనయొక్క ఆశీర్వాదాలు అందుకోవాలన్నా,అయన ప్రసాదించే అంతిమ బహుమానం
అందుకోవాలన్న,ఆయనయొక్క ప్రేమఆజ్ఞను పాటించాలి. ప్రభువు అంటారు; మీరు నన్నుప్రేమిస్తే ఆ ఆజ్ఞలు పాటిస్తారని (యోహాను:14 :15 ).
2.మానవునియొక్క ప్రేమ:
అధికారము,మరియు వివిధవస్తువులమీద ప్రేమ కోసం ఎన్నో తప్పులను చేస్తూ, మనలను
ప్రేమిస్తున్నటవంటి దేవుని ప్రేమను మాత్రం తెలుసుకోలేక పోతున్నాము. అయితే దేవుడు ఎందుకు పొరుగు వారిపై ప్రేమ కలిగి జీవించాలి అని బోధించాడు అంటే, ఆది:1 :26 లో చూస్తే, "దేవుడు మానవ జాతిని సృజించెను. తన పోలికలో మానవుని చేసెను". ఇందుకుగాను దేవుడు తన పొరుగువారికి ప్రేమించామన్నాడు. ఈలోకంలో జీవిస్తున్న ప్రతిఒక్క వ్యక్తి దేవుని పోలికలోనే సృజింపబడ్డాడు. ఎలా సృజింపబడిన ప్రతిఒక్క వ్యక్తితన పొరుగువారిలో దేవుని చూడాలని ఆ దేవాతి దేవుని కోరిక.పు. చిన్నతెరెసామ్మ గారి జీవితములో చూస్తే, ఆమె జీవించినాన్నాలు, తన పొరుగు వారిలో దేవుణ్ణి చూసింది. అందుకోసమే తన పొరుగువారి ప్రేమను తననుండి ఎప్పుడు కోల్పోలేదు.
పు. మదర్ తెరెసా గారు అనారోగ్యులలో, అనాధలలో, చిన్నారిబిడ్డలలో దేవుని చూసింది. దానిఫలితం ఆమెయొక్క జీవితాన్నిసహితం వారికి సమర్పించి దేవుడినుంచి, మానవులనుంచి గొప్ప మన్నను పొందింది.
-యేసు ప్రభువుగారు తన తండ్రిని ప్రేమించారు,అందుకే అయన తన తండ్రి యొక్క మాటలు
పాటించారు.
- మరియ తల్లి కూడా అదేవిధంగా చేశారు.
మనజీవితములో కూడా దైవంమీద ప్రేమవుంటే, తప్పనిసరిగా ప్రేమిస్తాం, దేవుని ఆజ్ఞలు
పాటిస్తాం. మన రక్షకుడయినా యేసుక్రీస్తు కూడా తన జీవితాన్ని సహితం తన తండ్రి
చిత్తానుసారం ఈలోకంలోవున్న ప్రతిఒక్కరికోసం సమర్పించ బడినది. దాని మూలముననే
రెండవ పఠనం:
ఈనాడు మనమందరము ఆత్మ పరిశీలన చేసుకోవాలి.నిజముగా నువ్వు నేను మన పొరుగు వారుని ప్రేమిస్తున్నామా? లేదా?. ఒకవేళ ప్రేమిస్తే, దేవుడు నీతో అనే మాట: "నా ఆజ్ఞలను స్వీకరించి పాటించువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నాతండ్రివలన ప్రేమింపబడును.నేను వానిని ప్రేమించి,వానికి నన్ను తెలియపరుచుకొందును" (యోహా:14 :21 ).
కాబట్టి, ఈనాటి దివ్య బలిపూజలో ఆ దేవాతి దేవునికి ప్రార్ధన చేదాం. మనం ఆ దేవాతిదేవుడిని ఏవిధంగానయితే ప్రేమిస్తున్నామో, అదేవిధముగా మన పొరుగువారికి కూడా ప్రేమించుటకు మనకు మంచి హృదయాన్ని దయ చేయమని ఒకరినొకరు అర్ధం చేసుకొని జీవించునట్లు చేయమని పశ్చాత్తాప హృదయముతో ప్రార్ధన చేదాం. ఆమెన్.
Rev. Fr. Bala Yesu OCD, Br. Mario