13 వ సామాన్య ఆదివారం
2రాజులు 4: 8-11, 14-16
రోమా 6: 3-4, 8-11
మత్తయి 10: 37-42
ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు దేవుని యొక్క సేవ చేసేటటువంటి వారి యొక్క జీవితమును గురించి తెలియజేయబడుతున్నాయి. దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి సువార్త సేవకులు,దేవుడిని ప్రేమిస్తూ, పొరుగు వారిని ప్రేమిస్తూ దేవునికి సాక్ష్యం ఇస్తూ జీవించాలి. సువార్త సేవకులు కూడా ఒక త్యాగపూరితమైన జీవితం జీవించాలి అనే అంశము గురించి కూడా ఈనాటి దివ్య ప ఠణనాలు మనకు గుర్తు చేస్తున్నాయి. దేవుని శిష్యులుగా ఉండాలి అంటే వారి జీవితంలో అనేక రకాలైన త్యాగాలు చేయాలి.
ఈనాటి మొదటి పఠనంలో దేవుని యొక్క ప్రవక్త అయిన ఎలిషాకు షునేము పట్టణంలో ఉన్న ఒక సంపన్నురాలు ఆతిథ్యం ఇచ్చినటువంటి విధానం మనం తెలుసుకుంటున్నాం. ఎలీషా ప్రవక్త దేవుని యొక్క సేవకుడని గుర్తించి తాను చేసేటటువంటి పరిచర్యకు షునేము పట్టణంలో ఉన్న సంపన్నురాలు సహకరించింది. ఈమె ఎలీషాకు ఆహ్వానం ఇచ్చి ఆతిథ్యమిచ్చి స్వయంగా తన యొక్క ఇంటి మీదనే అతని కొరకు బస చేయుటకు ఒక గదిని నిర్మించి దానిలో ఒక మంచాన్ని, బల్లను, కుర్చీని, దీపాన్ని ఏర్పాటు చేసింది. ఈ సంపన్నురాలు దేవుని యొక్క రక్షణ కార్యములో తన వంతు సహకారం తాను చేస్తుంది. ఈ సంపన్నురాలు దేవుని యందు అచంచల విశ్వాసం కలిగినటువంటి ఒక వ్యక్తి. దేవుడు తనకిచ్చినటువంటి వరాల ద్వారా ఇతరులకు సహాయం చేస్తుంది. దేవుని యొక్క పని కోసం తనకు సాధ్యమైన విధంగా ఆమె ఎలీషాకు భోజనం పెట్టి, వారి యొక్క బాగోగులను చూసుకున్నారు. ఆమె యొక్క మంచితనమును, ప్రేమను, విశ్వాసమును చూసిన ఎలీషా ప్రవక్త ఈ విశ్వాసికి కృతజ్ఞత తెలపాలి అని భావించారు దానికి గాను తన కుటుంబంలో సంతానం లేదని తన శిష్యుడైన గెహాజీ ద్వారా తెలుసుకొని వారికి సంతాన వరమును ప్రసాదించారు. ఈనాటి మొదటి పట్టణం ద్వారా మనం గ్రహించవలసిన సత్యమేమిటంటే ఇతరులకు మేలు చేస్తే ఆ మేలు ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవుడు ఎవరి రూపాన ఏ అవసరంలో మన కుటుంబాన్ని సందర్శిస్తారు తెలియదు కాబట్టి వచ్చినటువంటి వారిని ప్రేమతో స్వీకరిస్తూ వారికి సాధ్యమైన విధంగా మంచి చేస్తే అది ఒక గొప్ప ఆశీర్వాదంగా మారుతుంది. అదేవిధంగా ఏ కుటుంబం అయితే దేవుని యొక్క సేవకులను గుర్తించి వారికి పరిచర్య చేస్తూ వారిని బాధ పెట్టకుండా మంచిగా చూసుకుంటారో ఆ కుటుంబము ఎల్లప్పుడూ కూడా దీవించబడుతుంది. క్రీస్తు ప్రభువై స్వయముగా తన శిష్యులతో అంటున్నారు మేము స్వీకరించిన వారు నన్ను స్వీకరిస్తారు అలాగే నన్ను పంపిన వారిని కూడా స్వీకరిస్తారని. ఈ సంపన్నురాలు కేవలము ఎలిషాను మాత్రమే కాదు తన ఇంటికి ఆహ్వానించింది స్వయముగా దేవుడిని తన ఇంటిలోనికి ఆహ్వానించింది అందుకనే ఆమె కుటుంబంలో దేవుడు ఒక గొప్ప కార్యం చేస్తున్నారు భర్త వృద్ధుడైనప్పటికిని వారు చేసినటువంటి మంచి పనికి గాను దేవుడు అసాధ్యమైన కార్యం సుసాధ్యం చేస్తున్నారు వారు ఆయన ఎడల గొప్ప ప్రేమను చాటి చెప్పారు అందుకే దేవుడు వారిని దీవించారు. ఈ సంపన్నురాలు ఎలీషా ప్రవక్తకు ప్రత్యక్షంగా సువార్త సేవకు సహకరించకపోయినప్పటికీ పరోక్షంగా ఆమె సహకరించారు అలాగే మనం కూడా సువార్త సేవకులకు సహకరించాలి.
రోమీ-12:13
హెబ్రి-13:2
1పేతు-1:4-9
ఈనాటి రెండవ పట్టణంలో పునీత పౌలు గారు మనందరం కూడా క్రీస్తు నందు జ్ఞాన స్నానం పొందినట్లయితే క్రీస్తు మరణం మందు జ్ఞాన స్నానము పొందుతామని మనందరికీ కూడా గుర్తు చేస్తున్నారు. క్రీస్తుతో మరణించుట అంటే మనం కూడా మన యొక్క పాపములకు మరణించి ఒక కొత్త జీవితమును జీవించాలి అప్పుడే మన యొక్క జీవితమునకు సరియైనటువంటి అర్థం ఉంటుంది. ఏ విధముగానయితే క్రీస్తు ప్రభువు యొక్క పునరుత్థానం ఒక కొత్తదనము తీసుకుని వచ్చినదో అదే విధముగా మనము కూడా క్రీస్తుతో మన యొక్క పాపములకు మరణించినట్లయితే ఒక పవిత్రమైన, కొత్తదైన, సంతోషకరమైనటి జీవితం జీవించవచ్చు అదియే పునీత పౌలు గారు మనకు తెలియచేసే అంశం.
ఈనాటి సువిశేష పట్టణంలో ఏసుప్రభు యొక్క శిష్యులకు ఉండవలసినటువంటి కొన్ని లక్షల గురించి మత్తయి సువార్తికుడు మనకు తెలియచేస్తున్నారు ప్రభు యొక్క శిష్యులకు ఉండవలసిన మొట్టమొదటి లక్షణం అన్నిటికంటే దేవుడిని ఎక్కువగా దేవుడిని ఎక్కువగా ప్రేమించడం అంటే తమ యొక్క జీవితంలో మొట్టమొదటి ప్రాధాన్యత దేవునికి ఇచ్చుటయే. ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువుల మీద కాకుండా వ్యక్తుల మీద కాకుండా ప్రేమ నంతయు దేవుని మీద చూపించినప్పుడే మనం గొప్ప సాక్షి పూరిత జీవితం జీవిస్తున్నాం. చాలా సందర్భాలలో మనందరం కూడా ఈ లోకంలో ఉన్న వ్యక్తులను వస్తువులను ప్రేమిస్తుంటాం వాటికే ప్రాధాన్యతనిస్తుంటా కానీ ఏసుప్రభు ఎవరైతే తన శిష్యులుగా ఉండాలి అనుకుంటున్నారో వారు మొట్టమొదటిగా తమ జీవితంలో దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి అని తెలుపుచున్నారు. ఎందుకంటే దేవుడే వారిని తన ముఖ పోలికలో సృజించారు, వారిని దీవించారు ఎన్నుకున్నారు. కాబట్టి వారు తమ జీవితంలో అన్నిటికన్నా దేవుడిని ఎక్కువగా ప్రేమిస్తూ ప్రాధాన్యతనిస్తూ జీవించాలి. దేవునికి ప్రాముఖ్యతను ఇవ్వటం ద్వారా వారు దేవుని యొక్క కుటుంబంలో భాగస్తులు అవుతారు.
రెండవ లక్షణం- ఏసుప్రభు యొక్క శిష్యులుగా ఉండాలి అంటే వారికి ఉండవలసిన రెండవ లక్షణం ఏమిటంటే తమ శిలువను తాము ఎత్తుకొని దేవుడిని వెంబడించాలి. యూదుల నమ్మకం ప్రకారం సిలువ శిక్ష అనేది అతిపెద్ద తప్పిదం చేసిన వారికి వేసేటటువంటి శిక్ష అయితే ఈ సిలువ యూదులకు అవమానంగా ఉన్నది కానీ క్రీస్తు ప్రభువు తన శిష్యులకు నేర్పిన విషయం ఏమిటంటే సిలువను ఎత్తుకొని రావటం అంటే వారి జీవితంలో గొప్ప క్షమించే గుణమును కలిగి ఉండటం, అవమానాలు భరించటం, నిందలు మోయటం. సిలువను ఎత్తుకొని రావటం అంటే బాధలు కష్టాలు సమస్యలు అన్నిటిని కూడా ప్రేమతో భరించుకొని స్వీకరించుకొని క్రీస్తు ప్రభువును వెంబడించుట అలాగే సిలువను ఎత్తుకొని ఏసుక్రీస్తును అనుసరించడం అంటే సమస్తమును కూడా విడిచిపెట్టి దేవుడిని వెంబడించుటయే. వీటన్నిటినీ చేకొని క్రీస్తు ప్రభువుని అనుసరించాలి. చాలా సందర్భాలలో మనము సిలువను తృణీకరిస్తాం కానీ క్రీస్తు ప్రభువు మనందరినీ కూడా సిలువను ఎత్తుకొని తనను అనుసరించమన్నారు అనగా ఈ క్షమించే గుణములు కలిగి అవమానాలు భరించి అలాగే సమస్తమును త్యజించుకొని క్రీస్తు ప్రభువుని అనుసరించాలి.
మూడో లక్షణం-దేవుని కొరకు మన జీవితములను కోల్పోవుట మనం కలిగి ఉండాలి. మన జీవితంలో మన యొక్క స్వార్ధపు ఆలోచనలకు కాకుండా స్వార్థపు జీవితం కాకుండా మన కొరకు మనము జీవించకుండా క్రీస్తు కొరకు జీవించాలి అప్పుడే ఆ జీవితమునకు సరియైనటువంటి అర్థం ఉంటుంది. పునీతులు ఈ లోకంలో జీవించినప్పుడు తమ కొరకు తాము జీవించకుండా ఇతరుల కొరకు దేవుని కొరకు జీవించిన విధంగా మనం కూడా దేవుని కొరకు జీవించాలి.
దేవుని యొక్క సేవ చేసేటటువంటి వారికి తగినటువంటి ప్రతిఫలం దొరుకుతుందని యేసు క్రీస్తు ప్రభువు ముందుగానే తెలియజేస్తున్నారు. అలాగే ఎవరైతే దేవుని యొక్క సేవకులు వీరు అని గుర్తించి వారిని ఆదరించి మంచిగా చూసుకుంటారు వారి ఎల్లప్పుడూ కూడా దీవించబడుతుంటారు. కాబట్టి దేవుని యొక్క సేవకులను గుర్తించి వారికి మంచిని చేస్తూ మనం కూడా దేవుని యొక్క సువార్తలో భావిస్తులై జీవించుదాం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సువార్త సేవ చేసే వారికి మన వంతు సహాయం మనం చేద్దాం.
ఈనాటి పరిశుద్ధ దివ్య గ్రంథ పఠనాలు దేవుని యొక్క సేవ చేసేటటువంటి వారి యొక్క జీవితమును గురించి తెలియజేయబడుతున్నాయి. దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి సువార్త సేవకులు,దేవుడిని ప్రేమిస్తూ, పొరుగు వారిని ప్రేమిస్తూ దేవునికి సాక్ష్యం ఇస్తూ జీవించాలి. సువార్త సేవకులు కూడా ఒక త్యాగపూరితమైన జీవితం జీవించాలి అనే అంశము గురించి కూడా ఈనాటి దివ్య ప ఠణనాలు మనకు గుర్తు చేస్తున్నాయి. దేవుని శిష్యులుగా ఉండాలి అంటే వారి జీవితంలో అనేక రకాలైన త్యాగాలు చేయాలి.

Fr. Bala Yesu OCD