28, ఆగస్టు 2021, శనివారం

22 వ సామాన్య ఆదివారం( 2)

 22 వ సామాన్య ఆదివారం( 2)

నేటి దివ్య గ్రంధ పఠనాలు నిజమయిన క్రైస్తవ మత యొక్క విశ్వాసము ఎలాగా ఉండాలి అనే విషయాన్ని బోధిస్తుంది. క్రీస్తు ప్రభువు నందు విశ్వాసము ఉంచిన  వారు నామ మాత్రమునకే  దేవుని  యొక్క  నిబంధనలు , చట్టాలు, విధులు పాటించకుండా  వాటిని  నిండు మనసుతో , నిండు హృదయముతో  ఆచరించాలనే  విషయములను  ఈనాటి పఠనాలు మనకు తెలియచేస్తున్నాయి. అదే విధముగా  దేవునియందు  విశ్వాసము ఉంచిన  వారు   జీవించవలసిన జీవిత విధానము  గురించి కూడా ఈ నాటి పఠనాలు భోధిస్తున్నాయి. 

ఈనాటి మొదటి పఠనంలో మోషే ద్వారా  తన యొక్క  చట్టములను,  విధులను పాటించమని ఇశ్రాయేలు ప్రజలను దేవుడు  కోరుచున్నారు. మోషే  ప్రవక్త  తన యొక్క అంతిమ  సందేశమును ఇశ్రాయేలు  ప్రజలకు అందచేస్తున్నారు. వారు  ఎల్లప్పుడూ కూడా  దేవునికి  కృతజ్ఞులై జీవించాలి. వారు దేవుడిని మరవకుండా  ఆయన్ను ఆరాధించాలి , ఆయన మీద ఆధారపడి జీవిస్తూ  దేవునితో ఎల్లప్పుడూ తండ్రి బిడ్డలు అనే  బంధములో కలిసి జీవించాలి అని దేవుడు మోషే ద్వార పలుకుచున్నాడు. 

దేవుని యొక్క ప్రతి ఆజ్ఞ , చట్టము ఏదైన సరే అది మానవ అభివృద్ధి  కొరకు మాత్రమే. దేవుని యొక్క చట్టములను  పాటించుట ద్వార మనము మన   విశ్వాస జీవితాన్ని  సరిగ్గా  జీవించవచ్చు. దేవుని  ఆజ్ఞలు మన జీవితాన్ని బాగు చేస్తాయి.  మనము  ఎలాగా జీవించాలి ,  అని నేర్పి , పాపంలో పడిపోకుండా చేస్తాయి. 

దేవుడు  మోషే ద్వారా  ఇశ్రాయేలు ప్రజలకు   ఈ చట్టాలను  ఆజ్ఞలను  అందచేశారు. దాని ద్వారా  ఎప్పుడు  కూడా వారు దేవునికి దూరం కాకుండా  దేవునికి దగ్గరై జీవించవచ్చు. మోషే ప్రవక్త ద్వార వచ్చిన చట్టాలను  3 రకాలుగా విభజించవచ్చు. 

1 పౌర చట్టము- ఇది  అను దిన జీవితము మంచిగా జీవించాలని చెబుతున్నది.

2 నైతిక చట్టము- ఇది దేవుని యొక్క నీతికి న్యాయమునకు చెందినవి.

3. ఆచార చట్టము.- బలులు సమర్పించేందుకు చెందినవి , బలులు మంచి బలులు  సమర్పించాలి అని తెలియ చేస్తుంది. 

ఈ విధముగా  ఈ మూడు చట్టాలను  పాటించుట ద్వార ప్రతి ఒక్కరూ  పవిత్ర జీవితము జీవించవచ్చు. 

మనకు కూడా భారత దేశ చట్టము ఉంది మనము ఎలా జీవించాలి ,జీవించకూడదు చెపుతుంది , దేవుని చట్టము జీవితమును ఒక మంచి దారిలో నడిపించుటకు సహాయపడుతుంది. 

మోషే ప్రవక్త ద్వార దేవుడు  ఈ చట్టాలు, విధులు  ఆజ్ఞలు పాటించుట ద్వార ప్రజలు  మేలు పొందుతారని తెలియచేస్తున్నాడు  , ఆ మేలులు  ఏమిటి అంటే 

1. దేవుని ఆజ్ఞలు పాటించుట ద్వార బ్రతుకు తారు.- దేవుని యొక్క దయను ,ప్రేమను అనుభవిస్తూ ,ఎల్లప్పుడూ సంతోషముతో  బ్రతుకు తారు. అని తెలియచేస్తున్నారు. 

2 . దేవుడు ఒసగిన   కానాను  దేశము వారి సొంతమవుతుంది. ఈ కానను  దేశము సంతోసముకు గుర్తు, దేవుని యొక్క సమృద్దికి గుర్తు. దేవుని యొక్క నడిపింపునకు గుర్తు, దేవుడు ఆలాంటీ సంతోషంతో ఉండే స్థలాన్ని వారికి ఇస్తానన్నారు. 

3. వారిని ఒకే జాతిగా చేసి అందరూ కలిసి ఉంచుటకు సహాయపడుతుంది. 

4. వారు విజ్ఞానము పొందెలాగా  చేస్తుందీ. అదే విధముగా  మత చట్టములను హృదయ పూర్వ కముగా   పాటిస్తే  దేవుని వారు  పిలిచిన వెంటనే ఆయన వారికి   సమాధానము ఇస్తారు. 

5.  దేవుని యొక్క  ఆజ్ఞలను  పాటించుట ద్వారా దేవుడు మనలను వెయ్యి తరముల వరకు దీవిస్తారు. నిర్గమ.20:6 

6. ఆయన ఆజ్ఞలను చట్టాలను హృదయపూర్వకముగా  పాటిస్తే మనము అడిగినది దేవుడు దయ చేస్తారు.1 యోహను3:22

7 దేవుడు సకాలములో  వర్షాలు దయ చేస్తారు. లెవీ 26:3,4 కేవలము దేవుని ప్రేమించే వారే ఆయన చట్టాలను పాటిస్తారు. యోహను 4:15, మనమందరము కూడా  దేవుని ఆజ్ఞలను , చట్టములను హృదయ పూర్వ కముగా   పాటించి దేవునితో బంధము కలిగి జీవించాలి, ఈ చాట్టాలను  పాటించుట ద్వార  దేవునితో  బంధం కలిగి  జీవించాలి. ఈ చట్టాలను పాటించుట ద్వార మనము దేవునికి విధేయతను చూపుతున్నాము. మన విశ్వాసాన్నీ వ్యక్త పరుస్తున్నాము. 

రెండవ పఠనములో  పునీత యాకోబు గారు  దేవుని యొక్క వాకు మన హృదయాలపై ముద్రించబడింది, దాని ప్రకారము నడచుకోవాలి అని చెపుతున్నారు. ఈ  యొక్క దేవుని వాక్కు   దేవుని చట్టము మనం దాని ప్రకారము  నడుచుకుంటే అది మనలను రక్షిస్తుంది , నిజమైన మతము అనుసరించుట అంటే  దేవునికి విధేయులుగా పేద  సాదలకు సాయపడటమే . దేవుని చట్టమును హృదయపూర్వకముగా ఆచరించేవారు  అనాదలను  ఆదుకోవాలి. విధవరాళ్లకు సహాయము చేయాలి, వారు కష్టములో ఉన్నపుడు వారిని ఆదరించాలి. యాకోబు గారి ప్రకారము నిజమైన మతము అంటే దేవుని ప్రేమిస్తూ  అవసరములో ఉన్న అనాథలను , విధవరాండ్రను  సహాయము చేయుటయే , ఎవరు లేని  వారిని ఆదుకొనుటయే నిజమైన మత ఆచరణ అని యాకోబు గారు తెలియచేస్తున్నారు. యాకోబు గారు పలికిన విధముగా  ఆ దేవుని యొక్క వాక్కు  మన హృదయము  మీద ముద్రించబడినది , హృదయము మీద ముద్రించబడిన ఈ వాక్కు మనల్ని  నడిపిస్తుంది.  కీర్తన 119:15 

దేవుని యొక్క వాక్కు  ప్రకారమే  నడచుకుంటే  మనము నిజమైన మత విశ్వాసం  అనుసరించవచ్చు, దాని  వలన దేవుని యొక్క అనుగ్రహాలు పొందవచ్చు, పవిత్ర జీవితము జీవించవచ్చు. ప్రతి క్రైస్తవుడు యాకోబు గారు పలికిన విధముగా  ఆ  దేవుని  మాటలు పాటిస్తూ పేద వారిని , సహాయము కోసము ఎదురు చూసే అనాథలను  , విధవరాళ్లను ఆదుకుంటే ఈ భూలోకము స్వర్గముగా మారుతుంది. 

ఈనాటి సు విశేషము దేవుని యొక్క విశ్వాసులు  దేనికి ప్రాముఖ్యతని ఇవ్వాలి అని నేర్పుతుంది. దేవుడు  ఇచ్చిన ఆజ్ఞలు చట్టముకా లేక  మానవ మాత్రులు ఏర్పరిచిన  సాంప్రదాయనికా? ఆదే విధముగా బాహ్యంగా మనం పవిత్రులుగా ఉండాలా లేక అంతరంగికముగా పవిత్రులుగా ఉండాలా అని నేటి సు విశేషములో  వింటున్నారు.. మనం  అంతరంగికముగా  పవిత్రముగా ఉండాలి.  సువిశేషములో  ధర్మ శాస్త్ర బోధకులు యేసు ప్రభువు  యొక్క శిష్యులలో తప్పిదములను  ఎతుకుచున్నారు. చేతులు కడుగుకొనుటలేదని చెపుతున్నారు. 

భోజనమునకు ముందు చేతులు కడుగుకొనుట  వారి సాంప్రదాయం చేతులు భోజనమునకు ముందు కడుగుకొంటె వారు తమ భోజనము దేవునికి కృతజ్ఞతగా  సమర్పిస్తున్నారని అర్దము. దేవునికి సమర్పించే సమయములో చేతులు  కడుగుకొనకపోతే  వారు ఆచార చట్టం ప్రకారము అపవిత్రులు. ఆనాటి ప్రజలు యొక్క ఆలోచన ఏమిటి అంటే దేవునికి సంబంధించిన ఏ వస్తువులు పట్టుకొన్న అవి పవిత్రముగా ఉండాలి అని అందుకే పట్టుకునేముందు చేతులు  కడుగు కొంటారు. ఇది మోషే ఇచ్చిన చట్టములోని ఒక విషయము. 

దేవుని విషయములకు ప్రాధాన్యత ఇవ్వకుండ ధర్మ  శాస్త్ర బోధకులు దేవుని యొక్క మాటకు అనేక సంప్రదాయాలను  జత చేశారు. దానివల్ల ప్రజల ఆలోచన  మొత్తము  ఎలాగా  ఈ నియమ నిబంధనలను పాటించుట అనే  కానీ దేవుని మీద ప్రేమ  లేదు. దేవుడిని మరిచి (ద్వితీయో 6:4-5) సంప్రదాయాలకు  విధేయతను చూపిస్తున్నారు. అందుకే దేవుడు వారి విశ్వాసాన్ని  సంప్రదాయాలను సరిచేస్తున్నారు.  దేవుని చిత్తాన్ని మానవ కల్పిత ఆచారాలతో సమానముగా  చూసే  వారి విశ్వాసాన్ని హెచ్చరిస్తున్నారు. 

ధర్మ శాస్త్ర బోధకులు  దేవుని చట్టములోని నిజమైన అర్దమును  అదే విధముగా  నిజ స్పూర్తిని మరుగున  పెట్టి సంప్రదాయాల పేరుతో  ప్రజలకు అనేక నియమాలకి  కర్మలకు ప్రాముఖ్యతని ఇవ్వాలని తప్పుగా  నేర్పుతున్నారు   . అందుకే ప్రభువు  ఆంతరంగిక  విషయములకు  ప్రాముఖ్యతను ఇవ్వాలని చేపుతున్నారు. అంతరంగమునుండి వెలువడు  ఆలోచనలు, క్రియలే మన  పవిత్రతకు లేదా అ పవిత్రతకు కారణమవుతాయి . ఆలోచనలు , మాటలుగా మారతాయి , మాటలునుండి  క్రియలు వస్తాయి , క్రియలు అలవాటుగా మారి వ్యక్తిత్వంలా తయారవుతాయి. కాబట్టి మన యొక్క ఆలోచనలు పవిత్రముగా, మంచిగా ఉండాలి.

దేవుడు యోషయ్య ప్రవక్త ద్వారా చెప్పిన మాటలను గుర్తుకు చేస్తున్నారు. వారి హృదయాలు నా నుండి దూరముగా ఉన్నవి అని చెపుతున్నారు . (యోషయా 29:13, 1 సాము 15:22 ,16:7) 

కేవలము  బాహ్య ఆచరణ కాదు  ఆ బాహ్య ఆచరణలో మంచి హృదయము ఉండాలి. అనగా మన యొక్క హృదయమును   ఎప్పుడు పవిత్రముగా ఉంచుకోని  దేవుణ్ణి అనుసరించాలి. మన హృదయాలను శుద్దిచేసుకొని వాటిని దేవుని ప్రేమతో నింపుకోవాలి అన్నింటికీ కేంద్రముగా ఉన్న హృదయమును  ఎప్పుడు పవిత్రముగా ఉంచుకోవాలి. హృదయమునుండే అన్నీ ఉద్భవిస్తాయి. మంచి గుణాలైన చెడు గుణాలైన కాబట్టి దేవునికి చెందిన మంచి విషయాలకు ప్రాముఖ్యతను ఇవ్వాలి. మంచిని చేయడానికి పూనుకోవాలి. 

మన విశ్వాస జీవితములో  దేవుని ఆజ్ఞలు పాటించేటప్పుడు కొన్ని  బాహ్య ఆచరణలు ఉంటాయి. నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, ఈ నా సోదారులలో అత్యల్పుడైన .... మత్తయి 25:40  ఇలాంటి బాహ్యముగా  చేసే కార్యాలలో మన హృదయ ఉద్దేశ్యము  మంచిదిగా ఉండాలి. లేదంటే అది మన  ఎదుగుదలకు ఒక అడ్డుగా మారుతుంది. మనము గుడికి వెళ్ళిన, సాయము చేసిన ,ప్రార్దన చేసిన , వాక్యము చదివిన , మంచి పనులు చేసిన వాటి అన్నింటిలోనూ పవిత్ర హృదయము , ఉద్దేశ్యము ఉండాలి. 

ఒక వేళ మనలో అహంభావం, చెడు ఆలోచనలు నిండినట్లయితే  మనము ఎన్ని చేసినా , దేవుని ఎదుట అవి మనలను పవిత్రులను చేయదు. కాబట్టి హృదయమును పవిత్రముగా ఉంచుకొందాం. దేవునికి ప్రాధాన్యతను ఇస్తూ జీవిస్తూ, నిజమైన  దేవుని బిడ్డలుగా  జీవించుదాము. అదే విధముగా  మన మత ఆచరణ ప్రేమతో ఉండేలా, అలానే  మనం ఏమి గొప్ప కార్యము  చేసిన , ఆలోచనలు చేసిన అవి మంచి హృదయముతో చేయడానికి  దేవుని వరం కోరుకొందాం . 

 By. Rev. Fr. Bala Yesu OCD

సామాన్య 22 వ ఆదివారము

సామాన్య 22 వ ఆదివారము

ద్వితీ 4:1-2, 6-8

యాకోబు 1: 17-18, 21-22, 27 

మార్కు7: 1-8, 14-15, 21-23

క్రీస్తు నాధుని యందు ప్రియమైన విశ్వాసులారా,

ఈనాడు మనము సామాన్య 22 వ ఆదివారమును కొనియాడుతున్నాము. ఈనాడు మొదటి పఠనము ద్వితీయోపదేశ- కాండము నుండి తీసుకొనబడినది. దేవుడు యూదులకు ఇస్తానని ప్రమాణము చేసిన వాగ్దాన భూమిలోనికి యూదులు చేరే వరకు మోషే బ్రతకడని అతనికి తెలుసు. దేవుడు తన ద్వారా ఇచ్చిన ఆజ్ఞలను జాగ్రత్తగా పాటించమని ప్రజలను హెచ్చరిస్తాడు. తాను ఇచ్చిన శాసనాలను ఏ మాత్రము మార్చకుండా తు. చ. తప్పకుండా యూదులు ఆచరించాలని చెబుతాడు. వాళ్ళు ఈ విధముగా జీవిస్తే ఇతర జాతుల కన్నా వారిని దేవుడు గొప్పగా దీవిస్తాడని చెప్పాడు(ద్వితీ 4:6)

ప్రియమైన విశ్వాసులారా, దేవుడు ఈ యూదా ప్రజలకు తానే స్వయముగా మంచి మంచి కట్టడలు ఇచ్చి వాటి ప్రకారము జీవించడానికి వారికి సహాయపడటం వారి అదృష్టమని చెప్పాలి. ఇక మరొక జాతికి దేవుడు ఇలా చేయలేదు. ఈనాడు మనము చదివిన సువిశేషములో కొందరు న్యాయపండితులు, వారు చెప్పిన ఆచారములు తు. చ. తప్పకుండా పాటించే పరిసయ్యులు, క్రీస్తు ప్రభువు దగ్గరకు వచ్చి మీ శిష్యులు యూదా ఆచారముల ప్రకారము భోజనమునకు ముందు చేతులు కడుకొనకుండా భోజనము చేస్తున్నారు. వారు మా ఆచారమును కించ పరుస్తున్నారు అని తెలివిగా ఒక ప్రశ్న వేశారు. నిజమే! యూదుల ఆచార ప్రకారము ప్రకారము పూజారులు దేవాలయములో ఏదైనా సాంగ్యము చేస్తే దానికి ముందు చేతులు కడుకోవాలి. అయితే రాను రాను ఈ ఆచారము మామూలు జనానికి అన్వయిస్తుందని వారు చెప్పారు. ఎవరైనా సరే ప్రార్ధన చేయుటకు ముందు, భోజనము చేయటానికి ముందు చేతులు శుభ్రముగా కడుగుకోవాలను ఆచారము వచ్చేసింది. కాలక్రమేణా ఈ ఆచారము ఎలా స్థిరపడినది అంటే బాహ్యశుద్ది ముఖ్యమైనది కానీ హృదయ శుద్ధి అనేది మరుగున పడిపోయింది. ఒళ్ళు శుభ్రముగా ఉంటె చాలు, హృదయ శుద్ధి ఎవరు చూస్తున్నారు? భక్తి అనేది బాహ్య ఆచరణములకే పరిమితమైపోయినది. ఎంత శుభ్రముగా దేవాలయమునకు వెళితే అంత భక్తుడను అను భావము జనములో స్థిరపడిపోయింది. తలంటు స్నానము, మంచి బట్టలు, ఇలా అన్ని కనబడే అట్టహాసములే కానీ కనబడు హృదయ శుద్ధి అడుగంటిపోయినది. 

ఇలాంటి బాహ్యశుద్ది లేకపోయినా హృదయశుద్ధి కావాలని చూపించడానికి క్రీస్తు ప్రభువు కానీ, అయన శిష్యులు కానీ ఆ ఆచారములను పాటించలేదు. చేతులు కడుకొనకుండా భోజనము చేసారు, శుద్ధిలేని పాపులతో ఒకే పంక్తిన భోజనము చేసారు. కావున ప్రియమైన విశ్వాసులారా, క్రీస్తు ప్రభువు ఈవిధముగా అంటున్నారు, "మీరంతా కేవలము మీ పెదవులతోనే దేవుని ప్రీతి పరచాలని అనుకుంటున్నారు, అలంటి వారు దేవుని దరి చేరలేరు. దేవునికి కావలసినది భక్తి, ప్రేమ". ఏమి తింటాము, ఎలా తింటాము అనేది పైకి కనబడేవి కానీ ఇవి మనిషిని శుభ్రము చేయవు. మనిషి హృదయము నుండి వచ్చేవి మంచి లేక చేదు. మనిషిని చెరిచేది అతను తినే ఆహారము కాదు కానీ అతని మనస్సులో నుంచి వచ్చే చెడుగు అతనిని మలినపరుస్తాయి. చెడుగా ఆలోచించేవాడు, దేవుని పొరుగు వాని ప్రేమించలేనివాడు, పాపమును మూటకట్టుకుంటారు. ఆ పాపమే వానిని అపవిత్రపరుస్తుంది. 

ఈనాడు రెండవ పఠనము మనకు ఏమి నేర్పుతుంది? దేవుని రాజ్యములో ప్రేమ అంటే ఎలా ఉంటుంది, మతము అంటే అర్ధము ఏమిటి అనే విషయాన్ని యాకోబు గారు మనకు ఈ విధముగా చెబుతున్నారు(యాకోబు 1:21-25). దేవుని వాక్కులే మనజీవితాలకు మార్గదర్శులుగా ఉండాలంటున్నారు. దేవుని మాట ప్రకారము జీవించే వారు నిజముగా మతమును అవలంబించేవారు. వానికే దేవుని ఆశీస్సులు నిండుగా, దండిగా వస్తాయి. మనము పొరుగు వారిని ప్రేమించడమే అసలైన మతము. అంత కంటే వేరొక మతము లేదు. కావున లోక ఆశలనుండి దూరముగా ఉండుటయే దేవుని దృష్టిలో నిజమైన మతము. 

ఆమెన్…

Br. Avinash OCD

14, ఆగస్టు 2021, శనివారం

అమ్మా, నువ్వే నా ప్రాణం”


                     ఇది ఒక తల్లి కొడుకుల ప్రేమ కథ. తల్లి పేరు మని. కుమారునిపేరు ప్రేమ్.

          మని తన కుమారుని తన చిన్న నాటి నుండి అల్లారు ముద్దుగా పెంచుతూ, తనకు ఏది కావాలన్న ప్రతి ఒక్కటి ఇస్తూ తన కుమారుడిని సంతోష పరుస్తూ, ఆ ఆనందంలో తాను మురిసిపోతూ ఉండేది. ప్రేమ్ పెద్ద వాడయ్యే కొద్దీ జ్ఞానం పెరుగుతూ, చదువులో మంచిగా రాణిస్తూ, ఆటలలో ఎప్పుడు ముందంజలో వుంటూ ఎంతో చురుకుగా ఉండేవాడు. తాను స్కూల్లో చేసిన ప్రతి ఒక్కటి తన తల్లికి చెప్పి మురిసిపోతుండేవాడు. ఒకరికి ఒకరు అంటే ఎంతో ప్రాణం. ఒకరిని ఒకరు చూడకుండా ఒక్కరోజైన ఉండలేరు. 

          కానీ, ఒకరోజు ప్రేమ్ ను తన స్నేహితులు తన తండ్రి గురించి గుచ్చి గుచ్చి అడిగినపుడు ఏంచెప్పాలో తనకు అర్థం కాలేదు. భాదతో, నిరాశతో ఇంటికి వచ్చి మౌనంగా వున్నాడు. ఇది గమనించిన తన తల్లి ప్రేమ్ దగ్గరకు వచ్చి తన ఒడిలోకి తీసుకొని ఏమైంది నాన్న, ఎందుకలా వున్నావు? స్కూల్లో ఏమైనా జరిగిందా? ఎవరైనా నిన్ను తిట్టారా? టీచర్ ఏమైనా కొట్టిందా? అని ప్రేమ్ ని అడిగినపుడు, ప్రేమ్ తన తల్లి చేతులు పట్టుకొని, జాలిగా, అమ్మా, నాన్న ఎక్కడమ్మా? నేను పుట్టినప్పటి నుండి నా నాన్నను చూడలేదు, తనతో మాట్లాడ లేదు, తన ప్రేమను నేను పొంద లేదు. నాన్న ఎక్కడున్నాడో చెప్పమ్మా? నా స్నేహితులు నన్ను ఎంతో కాలంగా నాన్న గురించి గుచ్చి గుచ్చి అడుగుతున్నారు. అప్పుడు మని, ప్రేమ్ వంక చూస్తూ, ప్రేమ్ మీ నాన్న ఎంతో గొప్పవాడు. ఆయన అమెరికాలో వుంటూ, ఎంతో కష్టపడుతూ నిన్ను నన్ను పోషిస్తున్నాడు. ఆయనకు ఇక్కడికి రావాలని ఎంతో కోరిక వుంది. నీతో ఆడుకోవాలని, తన ప్రేమను మనిద్దరికీ పంచాలని ఎంతో వుంది. కానీ ఏంచేస్తాం, ఇక్కడికి రావడానికి సరైన సదుపాయం లేకపోవడంతో ఇక్కడికి రాలేకపోతున్నాడు. కానీ నిన్ను ప్రతిరోజు తలచుకుంటూనే ఉంటాడు, అని చెప్పింది.ఆ మాటలు ప్రేమ్ నమ్మి అమ్మా, నానెంతో గ్రేట్ కదమ్మా! అని తన తల్లిని హత్తుకొని సంతోషంగా చెప్పాడు.అప్పుడు మని తన కన్నీళ్లను తుడుచుకుంటూ ప్రేమ్ ను గట్టిగా హత్తుకుంది. 

               కొన్ని రోజులతరువాత మరల తన స్నేహితులు తన తండ్రి గురించి గుచ్చి గుచ్చి అడగడం ప్రారంభించినపుడు, తన తల్లి ఎం చెప్పిందో మొత్తం తన స్నేహితులకు వివరించి చెప్పాడు.కానీ వారు నమ్మలేదు. పైగా తిరిగి ప్రశ్నలేసారు. అదేమిటంటే, నీకు తండ్రి లేడు. ఒకవేళ ఉంటే ఒక్కసారైనా నిన్ను చూడ్డానికి వచ్చేవాడు. లేదుకాబట్టే నిన్ను చూడడానికి రాలేదు, కనీసం ఫోన్ చేసైనా మాట్లాడేవాడు. మీ అమ్మ నిన్ను ఎలా కానిందో ఏమో మరి, మీ అమ్మ తిరుగు బోతేమో అని అన్నపుడు, ఇక తట్టు కోలేక ఒక వైపు కోపంతో, మరో వైపు బాధతో, ఇంటికివెళ్ళి తన తల్లిని కోపంగా తన తండ్రి గురించి అడిగాడు.మరల అప్పుడు అదే  చెప్పింది. తాను కోపంతో  నువ్వు చెప్పేది అంతా అబద్ధం. నువ్వు ఒక పచ్చి తిరుగు బొతువు. నన్ను ఎలాకన్నావో ఆ దేవుడికే తెలియాలి అని అన్నప్పుడు, ఆ తల్లికి కోపం వచ్చి చెంపపై ఒక్కటి ఇచ్చింది. అప్పుడు ఇది తట్టుకోలేక ప్రేమ్ కోపంలో దగ్గరలో ఉన్నటువంటి ఇనుప రాడ్డుని తీసుకొని గట్టిగా మని  తలపై ఒక్కటి ఇచ్చాడు. అంతే, మని పడిపోయింది తలకు గట్టిగా గాయం తగలడంతో క్రింద పడి  పోయి గిలగిలా కొట్టుకోవడం ప్రారంభించింది.రక్తం ఒక వైపైతే, కన్నీళ్లు మరొకవైపు కారుతున్నాయి. కోన ఊపిరితో ఉండి తన చేతి వ్రేళ్ళను బియ్యం డ్రమ్ము వైపు ప్రేమ్ కు చూపించింది. దానిని తెరచి చూస్తే, అందులో ఒక డైరీ కనిపించింది.

            మొదటి పేజీ తెరచి చూస్తే దాంట్లో తన తల్లి యొక్క జీవితం గూర్చి రాసిఉంది. అదేమిటంటే, మని  ఒక ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తి. ఎంతో గొప్పగా, ఒక రాణిలా, ఎటువంటి కష్టాలులేకుండా, ఎంతో అల్లారు ముద్దుగా పెరిగింది. ఆమె ఇంట్లో ఎంతోమంది పనివాళ్ళు ఇక్కడున్న వస్తువు తీసి వేరేదగ్గర పెట్టెదే కాదు. ఆమె ముందుగా బెడ్ కాఫీ తో రోజును ప్రారంభించి, రాత్రి గ్లాసు పాలతో ముగుస్తుంది. ఎంతో అల్లరు ముద్దుగా పెరిగింది. ఆమె ఎం.బి.ఏ చేస్తున్న సమయంలో, ఒక వ్యక్తిని ప్రేమించింది. అతని పేరు సత్య. ఆ విషయం ఇంట్లో చెబితే, ఇంట్లో వారు తిరస్కరించారు. ఇద్దరు బయటికి వెళ్లి వివాహం చేసుకున్నారు. 

                ఇది చదివిన తరువాత ప్రేమ్ తన తల్లి వైపు చూసి నాతల్లి ఇంత గొప్పగా జీవించిందా? అన్నట్లు తన తల్లి వైపు చూసి మళ్ళీ చదవడం మొదలు పెట్టాడు.

                రెండవ పేజీ  తెరచి చూస్తే , సత్య మరియు మని సంతోషముగా, ఆనందంగా జీవించారు.వారిలో ఎటువంటి గొడవలు లేవు. కానీ ఒక్కటే వారిలో బాధ. అదేమిటంటే వారికి సంతానం లేదు. వారు ఐదు సంవత్సరాలుగా ఎన్నో నోములు నోచాడు. ఎన్నో ప్రార్థనలు చేసాడు. ఎన్నో దేవుళ్ళని మ్రొక్కారు. వెళ్లని స్థలం లేదు. మ్రొక్కని దేవుడు లేదు. చేయని సాయం లేదు. చివరకు వారిపై దేవుని కరుణ వలన మని  గర్భం ధరించింది.వారికి దేవుడు ఒక కుమారుని ప్రసాదిస్తున్నాడు కనుక . దేవుడు వారికి చేసిన గొప్ప మేలుకు గాను, ప్రేమకు గాను, అతని పేరు ప్రేమ్ అని పెడదామని ఇద్దరు అనుకున్నారు..

                   ఆరోజు రానే వచ్చింది. మని పురుటి నొప్పులతో  భాధ పడుతూ వుంది. సత్య కి ఏమీ చెయ్యాలో అర్ధం కాక అంబులెన్స్ కు ఫోన్ చేసాడు. అది వచ్చిన వెంటనే, మని ను, ఆమెకు తోడుగా, సత్య తన తల్లిని పంపించాడు. అది తెల్లవారు జాము, సత్య కి ఫోన్ వచ్చింది. చూస్తే, అది హాసుపత్రి నుండి వచ్చిన ఫోన్. డాక్టర్ సత్యతో నీకు కుమారుడు పుట్టాడు, అని సంతోషకరమైన వార్త ను చెప్పినపుడు, ఆ సంతోషాన్ని పట్టలేక ఎగిరి గంతేసాడు. ఆ డాక్టర్ కు ధన్యవాదములు తెలిపి, తనకున్నటువంటి ఆర్ ఎక్స్ 100 బండిని తీసి ప్రయాణం ప్రారంభించాడు.ఇంకా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న సమయంలో ఎదురుగ్గా వచ్చే లారీ మంచు చే సరిగ్గా కనపడక పోవడంతో రెండు వాహనాలు ఒక్క సారిగా ఢీకొనడంతో సత్య ధురంగా పడిపోయి ప్రాణం కోసం కొట్టిమిట్టాడు తున్నాడు.

               అప్పుడు అక్కడున్న వారు అంబులెన్సు సహాయంతో దగ్గరలో వున్నటువంటి  ఆసుపత్రికి తీసుకొని వచ్చారు.ఇక్కడేమో మని, సత్య రాకకోసం ఎదురుచూస్తుంది. ఫోన్ చేస్తుంది కానీ రింగ్ కావడం లేదు. అప్పుడే అక్కడ వార్డులో వున్న వారు జరిగిన ప్రమాదం గురించి మాట్లాడుకుంటూ ఉండగా, మని ఎంతో బయపడి పోయి నా భర్తకు ఇలా జరగకుండా చూడు స్వామి, అంటూ ప్రార్థన చేస్తుండగా, ప్రార్థన ముగించేలోపే కొంతమంది వ్యక్తులు ఆమెకు తెలిసిన వారు ఈ విషయాన్నీ తెలుసుకొని పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరకు వచ్చి, మని! గోరం జరిగి పోయింది. నీ భర్త నీదగ్గరకు వస్తున్న సమయంలో ఆక్సిడెంట్ అయ్యి చావు బ్రతుకులలో ఉండగా, ఇక్కడకు తీసుకొని వచ్చారు. అనిచెప్పినవెంటనే గట్టిగా ఏడుస్తూ, గుండెలు బాదుకుంటూ, లేచి తన భర్త దగ్గరికి వెళదామని లేస్తున్న సమయంలో ఆమెకు వున్నటు వంటి  నొప్పులను భరించలేక అక్కడే క్రింద పడిపోయిది. దానితో ఆమెలో కంగారు ఎక్కువయ్యి, ఆభయంతో పక్షవాతం వచ్చి అక్కడే పడిపోయింది. కాళ్ళు చేతులు పడిపోయాయి.ఏమీ చేయలేని పరిస్థితి. ఒక వైపు బాలుని జన్మ, మరోవైపు తండ్రి చావు, ఇంకొకవైపు,తల్లికి పక్షవాతం. అక్కడ వున్న వారికి ఏమీ చెయ్యాలో తోచక ఆ బాలుడిని  తన ప్రాణ స్నేహితురాలైన రాణి తీసుకొని ఆ బాలుడిని సంవత్సరం పాటు పెంచింది. మరి ఆసుపత్రిలోనే ఉంటూ, తాగి న జాగ్రత్తలు తీసు కొని పూర్తిగా కోలుకొని తన కుమారుడిని తన స్నేహితురాలి దగ్గరనుండి తీసు కొని కృతజ్ఞతలు తెలిపి, తన సొంత ఇంటికి బయలుదేరి, తన తల్లి దండ్రులను సహాయం చేయమని తన కొంగు చాచి అడిగితే, వారు ఈమె ఎవరో తెలియదన్నట్లు చూసి, తన సేవకులచే రోడ్డు బయటికి గెంటివేశారు.ఇది తట్టుకోలేక, మేరి తన బాలుడినితీసుకొని ఎవరికీ తెలియని ప్రదేశమునకు వెళ్లి జీవించడం మొదలు పెట్టింది. అక్కడకు వెళ్ళినతరువాత తన కుమారునికి మేరి సత్య అప్పుడు అనుకున్నట్లు, ఆ బాలునికి ప్రేమ్ అని పేరు పెట్టి ఒక నూతన జీవితాన్ని ప్రారంభించింది 

             ఇదంతా చదివిన ప్రేమ్ తన దుఃఖాన్ని ఆపు కోలేక పోయాడు. తన కన్నీళ్లను తుడుచు కుంటూ, తన తల్లి వైపు తీక్షణం గా చూస్తూ, ఎంతో బాధ పడుతూ, మనసులో అమ్మ నన్ను క్షమించమ్మా అని అనుకుంటూ, తారువాత ఎం జరిగిందోనని, తరువాత పేజీని తెరచి చూసాడు.

        ఈ నాలుగవ పేజీలో ఆ తల్లి పడిన కష్టాల గురించి వివరిస్తుంది. పక్షవాతం వచ్చి పడిపోయినపుడు, ఆమె జ్ఞానం కోల్పోయింది.చదివిన చదువు అంతా వృధా అయిపోయింది. ఎం చెయ్యాలో అర్ధం కాలేదు. అయినా కూడా ఏదో ఒక పని చేద్దాం అని వెళితే ఎవరూ పని ఇవ్వకుండా, నీకు ఏ పనీ రాదు అని గేలిచేసేవారు. ఎం చెయ్యాలో అర్థం కాలేదు. అల్లారుముద్దుగా పెరిగిన మేరి, ఏ పనీ చేయని  మని  ఇప్పుడు ఏదో ఒక పని కోసం వెదుకుతూ, తన కుమారుడిని ఎలాగోలా గొప్ప ప్రయోజకుడిని చేయాలని తపనపడింది. అప్పుడు టీ అమ్మడం, షూ పాలిషింగ్ చేయడం వంటి చిన్న చిన్న పనులైనా చేస్తూ డబ్బులు సంపాదించి కుమారుడికి మంచి జీవితాన్ని ఇవ్వాలని అనుకోని, తన పనిని ప్రారంభించింది. ఆమె ఒక్కపూట తిని రెండు పూటలు పస్తులుండి, ప్రేమ్ కు కడుపు నిండా అన్నం పెట్టేది. చివరికి భిక్షాటనకుకుడా వెనుకాడలేదు. ఇదంతా చేస్తూ, ప్రేమ్ కు తెలియనివ్వకుండా జాగ్రత్తపడేది. అడిగితే నాన్న, నీకోసం నేను గొప్పజాబ్ చేస్తున్నాను. నేను ఏమి చేసినా నీకోసమే కదా, అని చెబుతుండేది. అది ఆ తల్లి యొక్క గొప్పతనం. ఇదంతా చదువుతున్న ప్రేమ్ తనలో ఉన్న కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు.ఇదంతా తల్లి గమనిస్తూనే వుంది.

               తన కన్నీళ్లను తుడుచు కుంటూ ఐదవ పేజీని చదవడం మొదలు పెట్టాడు. ఇక్కడ ఆమె ఇలా వ్రాస్తుంది. నాన్న,ప్రేమ్!   నీకివన్నీ చెప్పి నిన్ను బాధపెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే ఇవన్నీ నీకు చెప్పలేదు.కానీ ఎదో ఒక రోజు నామీద నీవు తిరగబడతావని నాకు ముందే తెలుసు.నీవు తిరగబడినపుడు,నన్ను నీవు కొట్టినప్పుడు, ఇవన్నీ చెప్పకుండా, చనిపోతానేమోనని,నిన్న రాత్రి నీవు నిద్రిస్తున్న తరువాత ఇవన్నీ రాసి ఈ బియ్యం డ్రమ్ములో పెట్టాను. నీలో ఎప్పుడు కన్నీళ్లు చూడకూడదనుకు నాను.అందుకే మీ నాన్న గురించి, నా గురించి,ఎప్పుడు నీకు చెప్పలేదు.నువ్వంటే నాకు ప్రాణం.నీవు లేకుండా నేను ఉండలేను.నీవెప్పుడు సంతోషంగా ఉండాలి ఓకేనా! ప్రేమ్ పేజీ తిప్పాడు,కానీ అక్కడ కాళీగా వుంది. వెంటనే ప్రేమ్ తల్లి వైపు చూసి పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మా!. అమ్మా...నువ్వటే నాకు ఎంతో ఇష్టం అమ్మా. నువ్వేనా ప్రాణం అమ్మా. అని మని  ను తన ఒడిలోకి తీసుకొని హత్తుకొని ఏడవడం మొదలు పెట్టాడు.అప్పుడు మని కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మాట్లాడదామన్న మాట్లాడలేని పరిస్థితి. ఒకవైపు రక్తం ధారాళంగా కారుతుంది. కళ్లలోనుండి నీరు ఆగకుండా వస్తూనే వున్నాయి.నొప్పి విపరీతంగా వుంది అయినాకానీ, తన ప్రాణాన్ని తన గుప్పెట్లో పెట్టుకొని చిన్నగా పెదాలు కదిలిస్తూ,అర్ధమయ్యి, కానట్లు మాట్లాడడం ప్రారంభించింది.నాన్నా ప్రేమ్, ఈ ఒక్క మాటకోసమే నేను ఇన్ని రోజులుగా ఎదురుచూస్తున్నాను."నువ్వే నా ప్రాణం". నీ కన్నీళ్లను నేను చూడలేను అంటూ,ప్రేమ్ చెంపపై కారుతున్నటువంటి కన్నీళ్లను తూడుస్తూ, నాన్న నీకోసం నేను కష్టపడి పనిచేసి కొంత డబ్బు నీకోసం, నీ చదువుకోసం,రూపాయి,రూపాయి,కూడబెట్టి,మనిద్దరి ఫోటో ఫ్రెమ్ వెనుక పెట్టాను.దానిని నీవు తీసుకొని నీ అవసరాలకు, నీ చదువుకు వాడుకొని,గొప్ప ప్రయోజకుడివి అయ్యి, అవసరాలలో వున్నా వారికి సహాయపడు.దానికంటే ముందు ఆ ఫోటో ఫ్రెమ్ తీసుకొని తెరిస్తే, అందులో మీనాన్న సత్య, నేను దిగిన ఫోటో ఉంటుంది అని చెప్పి తుది శ్వస విడిచింది.

               ఇది ఒక్కసారిగా గ్రహించిన ప్రేమ్ అమ్మా!అమ్మా! అని గట్టిగా అరచి, ఏడుస్తూ నువ్వునా ప్రాణం అమ్మా! నువ్వే నా ప్రపంచం అమ్మా! నువ్వు నాకు కావాలమ్మా,లే అమ్మా ! తప్పై పోయిందమ్మా, అంటూ తల్లి గుండెలపై వాలి,హత్తుకొని,తాను కూడా ప్రాణం విడిచాడు.

              ఒక తల్లి అంటే జీవం పోసిన దేవుడితో సమానం.ఆ తల్లి ప్రేమను నువ్వు నేను అర్థం చేసుకోలేక పోతే, మన జీవితం వ్యర్థం. మనం జీవించిననాళ్లు మన తల్లి ప్రేమను ఆస్వాదిస్తూ, ఆ ప్రేమలో ఒదిగిపోతూ,అదే ప్రేమను ఆమెకుకూడా ఇస్తూ, మనం జీవించిననాళ్లు ఆమెతో కలిసి జీవించడానికి ప్రయత్నిదాం.

            కావున ఈ కథను ప్రతి ఒక్క తల్లికి సమర్పిస్తున్నాను.వారు ఎప్పుడు సంతోషంగా, ఆనందంగా,ఆరోగ్యంగా,ఉండాలని మరియు వారి ముఖం లో ఎప్పుడూ చిరునవ్వు ఉండాలని  ఆశిద్దాం.

                                                                                                                               

                                                                                                            జోసెఫ్ మారియో  ఓ.సి.డి.

      

మరియ తల్లి యొక్క మధురమైన స్వభావం


మంచి మనసు కలిగి ఎందరో హృదయాలను

       సొంతం చేసుకొని రివ్వుమంటూ తన ప్రేమతో

                     ఏకం చేసుకునే తల్లి మరియతల్లి.

 

యవ్వన ప్రాయములో దేవుని వాగ్దానాన్ని స్వీకరించి

                 ఆ దేవుని పుత్రుని ఈ లోకానికి ప్రసాదించిన 

                                ఓ అద్భుతమైన తల్లి మరియ తల్లి. 


పాపములో పడి కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు 

             వెలుగును చూపిన

                            ఓ వరప్రసాదాల తల్లి మరియ తల్లి.


 నవమాసాలు మోసి కని పెంచి పెద్దచేసి 

           ఈ లోకానికి ఓ మరచిపోలేని చిరు దివ్వెను

                               ప్రసాదించిన తల్లి మరియ తల్లి. 


 లోకరక్షకుడి కోసం ఎదురు చూస్తున్న ప్రజలకోసం 

       తన సర్వస్వాన్ని వదిలివేసి దేవుడే తన సర్వస్వంగా భావించి

                     ఆ దేవుడినే ఈ లోకానికి తెచ్చిన వన్నె తల్లి మరియతల్లి.


 కార్మెల్ మఠవాసులంతా ఒక్కటిగా చేరి

      ప్రార్థిస్తుండగా వారి ప్రార్థనలను ఆలకించి

                 ఉతర్యము అను తన రక్షణకవచాన్ని ప్రసాదించిన

                                 గొప్ప కరుణగల తల్లి మన  మరియతల్లి.           

                                                                                                       బ్రథర్. జోసెఫ్ మారియో. ఓసిడి.

పరిశుద్ధ కన్య మరియ మోక్షరోపణ మహోత్సవము

పరిశుద్ధ కన్య మరియ మోక్షరోపణ మహోత్సవము

దర్శన 11; 19, 12; 1 -6, 10 

1కొరింతి 15; 20 -26 

లూకా 1;39 -56 

క్రీస్తునందునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ నాడు మనం 20 వ సామాన్య ఆదివారములోనికి ప్రవేశించి యున్నాము. అదేవిధంగా తల్లి శ్రీసభ పరిశుద్ధ కన్య మరియమాత మోక్షారోపణ మహోత్సవాన్ని కొనియాడుచున్నది. ఈ నాటి దివ్య గ్రంథ పఠనాలను మనం ధ్యానించినట్లైతే తల్లి మరియ మాత గొప్పతనాన్ని మరియు దేవుడు ఆమెయందు చేసిన గొప్ప కార్యాలను గురించి తెలియచేస్తున్నాయి. నిష్కళంక కన్యక అయిన దేవమాత తన భూలోక జీవిత యాత్రను ముగించిన తరువాత ఆత్మా శరీరాలతో పరలోకమునకు కొనిపోబడిందని నవంబర్ 1, 1950 వ సంవత్సరంలో 12 వ భక్తినాథా పోపు గారు మరియమాత మోక్షారోపణ పండుగను విశ్వాస సంవత్సరంగా ఆమోదించారు.

మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లైతే హానోకు, మోషే మరియు ఏలీయా ప్రవక్తలు మాత్రమే దేవుడు పరలోకంలోకి తమ ఆత్మా శరీరాలతో తీసుకుపోయాడని చూస్తున్నాము. పవిత్త్ర గ్రంథంలో ఈ ముగ్గురు వ్యక్తులగురించి మాత్రమే తెలియచేస్తుంది. కానీ మరియమాత మోక్షారోహానమవడం ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. అయినా కాథోలికులమైన మనం ఎందుకు ఈ పండుగను కొనియాడుచున్నాము? ముందుగా రక్షణ గ్రంథ చరిత్రలో చూసుకున్నట్లైతే ఆదికాండము మూడవ అధ్యాయంలో చూసుకున్నట్లైతే ఒక స్త్రీ అవిధేయత వల్ల ఈలోకానికి పాపం వచ్చింది. అదేవిధంగా నూతన నిబంధన గ్రంథంలో చూసుకున్నట్లైతే మరియమాత విధేయత ద్వారా ఈ లోకానికి రక్షణ వచ్చింది. ఏ విధంగా అంటే సాక్షాత్తు ఆ దైవ కుమారుణ్ణి ఆమె తన గర్భమునందుమోసి, క్రీస్తు ప్రభువుకి జన్మనిచ్చి రక్షణ తీసుకొని వచ్చింది. అదేవిధంగా కాథోలికులమైన మనం. సాక్షాత్తు దైవ కుమారుణ్ణి ఆమె గర్భమునందు తొమ్మిది మాసాలు నివశించాడు కాబట్టి ఆమెను వాగ్ధత్త మందసము లేదా దేవుని మందసము అని విశ్వసిస్తున్నాం.

సమువేలు 2 వ గ్రంథంలో 6; 6 -7 చూసుకున్నట్లైతే దావీదు మహారాజు దేవుని మందసాన్ని యెరూషలేముకు తీసుకొస్తున్నప్పుడు ఎడ్లబండిని గతుకులలో ఈడ్చడం వలన మందసము జారీ క్రిందకి పడిపోయెను. దానిని మోస్తున్న ఉస్సా అనే వ్యక్తి చేయి చాచి మందసము తాకిన వెంటనే ప్రక్కకు కూలి చనిపోతాడు ఎందుకంటే దైవ మందసము ఎంతో పవిత్రమైనది. ఆ మందసంలో మోషే చేతి కర్ర, మన్నా, మరియు పది ఆజ్ఞలు ఉన్నవి. అలాంటిది పట్టుకోగానే చనిపోయారంటే , మరియ తల్లి ఇంకా ఎంతో పవిత్రమైనది. చూడండి సాక్షాత్తు క్రీస్తుభగవానుడు తొమ్మిది మాసాలు ఆమె గర్భంలో నివశించారు. అలాంటి శరీరం ఈ లోకంలో నశించిపోవడం దేవునికి ఇష్టంలేదు. కనుక ఆమె చనిపోయిన తరువాత ఆత్మా శరీరాలతో పరలోకంలోకి తీసుకువెళ్లాడని మనం విశ్వసిస్తున్నాం.

యోహాను 14; 3 వ వచనంలో క్రీస్తు ప్రభువు ఈ విధంగా పలుకుతున్నారు. నేను ఉండు స్థలంలోనే మీరును ఉందురు,  అని తన తల్లిని తనతో ఉండుటకు మరియ తల్లిని మొక్షానికి తీసుకెళ్లడం జరిగింది. అదే విధంగా ఈ నాటి మొదటి పఠనం దర్శన గ్రంథంలో చూసుకున్నట్లైతే దివియందు ఒక స్త్రీ దర్శనమిచ్చెను . సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరముపై  పండ్రెండు నక్షత్రములుగల కిరీటము ఉండెను (దర్శన 12 ;1 ). ఇక్కడ ఈ స్త్రీ యే మరియ తల్లి అని ఆమెను మోక్షమునకు తీసుకుపోయిన తర్వాత దేవుని వద్ద ఉన్నది అని కథోలికుల విశ్వాసం. ఈ నాటి సువార్త పఠనాన్ని ధ్యానించినట్లైతే, మరియ మాత ఎలిజబెతమ్మను దర్శించిన ఘట్టాన్ని మరియు మరియమ్మ స్తోత్రగీతాన్ని గురించి వింటున్నాం. ఎప్పుడైతే మరియతల్లి జక్రయ్య, ఎలిజబెతమ్మల ఇంటిలోనికి ప్రవేశించిందో, ఇల్లంతయు కూడా వెలుగుతో నింపబడింది. మరియు ఆమె గర్భమునందలి శిశువు గంతులు వేసెను. ఎందుకంటే దేవుని తల్లి ఆ గృహములోకి అడుగుపెట్టగానే వారి జీవితాలు మరియు ఇంటిలో వెలుగు వచ్చింది. 

మరియు ఎలిజబెతమ్మ ఎలుగెత్తి ఈ విధంగా అంటుంది. స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడినదానవు, నీ గర్భం ఆశీర్వదింపబడెను, చూడండి ఎంతటి పవిత్రమైనదో మరియ తల్లి. ఆమె పవిత్ర మైన జీవితం జీవించింది కాబట్టి దైవ కుమారుడు ఆమె గర్భం నందు జనియించారు. ఆమె నిష్కళంకమైనది. అందుకనే మనం చూస్తున్నాం లూకా 1; 48 లో తర తరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు అని మరియ మాత దేవునికి స్తోత్రగీతంలో తెలియచేస్తుంది.

కావున ఇలాంటి మరియ తల్లిని మరియు ఎంతో పవిత్రంగా జీవించిన తల్లిని ఈ లోకానికి రక్షణ తీసుకొచ్చిన తల్లిని దేవుడు తప్పక పరలోకంలోకి ఆత్మా శరీరంలా ద్వారా తీసుకెళ్లాడని మనం విశ్వసిస్తున్నాం.  కావున ప్రియా సహోదరి సహోదరులారా ఎవరైతే దేవునికి సాక్షులుగా జీవిస్తారో, ఆ ఆజ్ఞలను తప్పకుండ పాటిస్తారో, వారందరు దేవుడిని దర్శిస్తారు. మరియు మనందరము  పాప  జీవితమునుండి బయటికి వచ్చి మన పాపాలన్నీ త్యజించి దేవుని బిడ్డలుగా జీవిస్తే ఆయన రాకడ సమయమున ఆయనకు చెందుతామని ఈ నాటి రెండవ పఠనం ద్వారా పునీత పౌలుగారు తెలియచేస్తున్నారు. కావున మనందరము  మరియ తల్లి ఏవిధంగా జీవించి దేవునికి విధేయురాలై దేవుని చిత్తాన్ని నెరవేర్చిందో మనం కూడా ఆమె బాటలో నడవాలని ఆమె వలె  జీవించాలని ఆ తండ్రి దేవునికి ప్రార్థన చేసుకుందాం.

-బ్రదర్. సాలి. రాజు ఓ.సి.డి

13, ఆగస్టు 2021, శుక్రవారం

దైవభక్తుడైన యోసేపు

దైవభక్తుడైన యోసేపు

        యాకోబునకు  పండ్రెoడుగురు కొడుకులు కలరు. వారిలో యోసేపు చిన్నకుమారుడు. ఇతని తల్లి పేరు రాహేలు. తన తండ్రి స్థిరపడిన కనాను దేశమునందు యాకోబు నివసించెను. యోసేపు పనేడుసంవత్సరములు ప్రాయము కలవాడు. అతడింకను చిన్నవాడే. సోదరులతో కలిసి తండ్రి మందలను మేపెడివాడు.అతడు సోదరులు చేసిన చెడ్డ పనులు తండ్రికి చెప్పెను. ముదిమిన పుట్టిన బిడ్డడు కావున ఇశ్రాయేలు యోసేపును ఇతర కుమారులకంటే ఎక్కువగా ప్రేమించెను.అతనికి పొడుగు చేతుల నిలువుటంగీని కుట్టించెను.తమకంటే ఎక్కువగా తండ్రి అనురాగమునకు పాత్రుడగుటచే యోసేపును అతని సోదరులు ద్వేషింపసాగిరి. అతనితో ప్రియముగా మాట్లాడరైరి. 

యోసేపు కలలు కనేవాడు. అతనికి చిన్ననాడే రెండు కలలు వచ్చాయి.మొదటికలఇది: అతడి సోదరులు పొలములో పైరుకోసి కట్టలు కట్టారు.కానీ సోదరులకట్టలు నిలువుగా నిలబడి  వున్న అతనికట్టకు దండంపెట్టెను. అతడు సోదరుల మీద అధికారము నేర్పుతాడని ఈ కల భావము. రెండవకల ఇది: సూర్య చంద్రులు పదకొండు నక్షత్రాలు అతనికి నమస్కారం చేశాయి.సోదరులు తల్లి దండ్రులు యోసేపుకి దండం పెడతాయని ఈ కల యొక్క అర్ధము.ఈ కలలను విని తోబుట్టువులు యోసేపుపై మండిపడ్డారు.అతన్ని ఇంకా ద్వేషింపసాగారు.తండ్రి యోసేపుతో, నీసోదరులు షెకెములో మందలను మేపుచున్నారు.రమ్ము నిన్ను కుడా వారిదగ్గరకు పంపెదను అని అనెను .యోసేపు నేను సిద్ధముగావున్నాను అనెను.యోసేపు సోదరులు పట్టినబాటనే పోయి వారిని దోతానులో చూసేను.వారు ధారిణ ఉండగానే, అతనిని చూచిరి. 

అతడు దగ్గరకు రాకముందే అతనిని చంపవలెనని అన్నలు కుట్ర పన్నిరి. ఇది విన్న రూబేను యోసేపును కాపాడగోరి అతనిని చంపవలదనెను.మనకీ రక్తపాతమేల? యోసేపును ఈ అడవిమండలి గోతిలో త్రోయుడు. అతనికి ప్రాణహాని చేయకుడు, అని వారితో చెప్పెను.యోసేపు సోదరుల దగ్గరకు వచ్చెను.వారు అతను ధరించిన పొడవుచేతుల నిలువుటంగీని తీసివేసి గోతిలో పడవేసెను.అప్పుడు యూదా అప్పుడు తన సోదరులతో యోసేపునుచంపి అతని చావును కప్పిపుచ్చిన మనకు మేలేమి కలుగును ? రండు, అతనిని ఇష్మాలీయులకు అమ్మివేయుదము అని అతనిని ఇరువది నాణ్యములకు అమ్మిరి.ఇష్మాయేలీయులు యోసేపుకి సంకెళ్లు వేసి ఆతనిని బానిసగా ఈజిప్తుకు కొనిపోయి ఫోతీఫరునకు అమ్మిరి.ఫోతీఫరు ఫరోరాజుకాడ వున్న ఉద్యోగి. రాజా సంరక్షకులకు నాయకుడు. 

యోసేపు ఐగుప్తుదేశీయుడగు యజమాని ఇంటిలో ఉండెను.దేవుడు యోసేపుకు తోడుగా ఉండెను.కావుననే అతడు అంచెలంచెలుగాదీవించబడెను.అతడు చక్కనిముర్తిగలవాడు, అందగాడు. కనుక యజమాని భార్య అతనిమీద కన్ను వేసెను. తనతో శయింపమనిరమ్మని కోరెను. కానీ యోసేపు దానికి అంగీకరింపలేదు.ఒకనాడు, అతడు ఎప్పటి మాదిరిగా యజమానుని ఇంటిలోపలికి వెళ్లెను.ఇంటిబలగములోనివారు ఒక్కడైననూ అప్పుడు అక్కడ లేడు. యజమానుని భార్య అతనిపైబట్ట పట్టుకొని, శయనింపరమ్మని కోరెను.అతడు ఆ పైబట్ట ఆమె చేతులలో వదలివేసి, ఇంటినుండి బయటకు పారిపోయెను.తన చేతికి చిక్కిన యోసేపు పై బట్టను భర్తకు చూపించి అతడునన్ను మానభంగముచేయదలచి తన గదిలోనికి వచ్చాడని తన భర్తకు పిర్యాదు చేసింది.ఆ మాటలు విని యజమానుడు మండిపడెను.

ఇదివినిన  యజమానుడుమండిపడి యోసేపును చెరసాలలో బంధించెను. అయిననూ దేవుడు యోసేపుకి తోడుగా ఉండెను.ఒక రోజు ఆచెరలోనికి ఇద్దరు కొత్త   ఖైదీలు వచ్చారు. వారు ఫరోరాజు వంటవాడు, పానీయవాహకుడు.ఏదో నేరంపై ఆ ఇద్దరిమీద  రాజు కోపపడెను. వారు యోసేపు చెరసాలలో త్రోయబడ్డారు.ఒక రోజు ఆ ఇద్దరికి  వేరువేరు కలలు వచ్చాయి.యోసేపు స్వప్న వ్యాఖ్యానమునందు నిపుణుడు.అతడు ఆ ఇద్దరి కలలకు అర్ధం చెప్పాడు.పానీయవాహకుడికి మూడురోజులతరువాత ఫరోరాజు అతనిని విడుదలచేయించి,మరలా తనపనిని తనకు అప్పగిస్తాడని,వంటవానికి మూడు రోజులతరువాత ఫరో రాజు అతనిని ఉరి తీయిస్తాడని వివరించాడు.అది జరిగిన తరువాత, యోసేపు పానీయవాహకునితో నీవు నాకొక ఉపకారం చేసిపెట్టాలి,ఇక్కడ అన్యాయముగా నేను ఈ చెరలో త్రోయించబడ్డాను.నీవు ఫరోనుకలుసుకొనినప్పుడు,ఆ రాజుకి నాసంగతి తెలియజేసి,ఆయన నాపై దయపుట్టేలా చూడు అని చెప్పాడు.కానీ ఆ చెరనుండి విడుదల పొందిన పానీయవాహకుడు యోసేపును పూర్తిగా  మర్చిపోయాడు.   ఫరో ప్రభువు రెండు కలలుకనెను . 

తెల్లవారిన తరువాత  అతనికి మనస్సు కలవరపడెను .ఫరోరాజు ఉన్న ఆ  దేశములో  వున్న జ్ఞనులను  పిలిపించి ,వారికి తన కలలుగూర్చి చెప్పెను .కానీ వారిలో స్వప్న ఫలములను వివరించు వాళ్ళు ఒక్కరు లేరాయెను. అంతట పానీయవాహకుడు తన యేలికతో ఈ నాటికి నేను చేసిన తప్పులు నాకు తెలిసి వచ్చినవి .ఒకసారి ఏలినవారు దాసులమీద కోప పడితిరి .అప్పుడు నన్నును వంటవానిని అంగ రక్షకుని,  నాయకుని ఆదీనమునందుంచి చెరసాలలోఉంచిరి .ఒక రాత్రి మేమిరువురము కలలు గంటిమి .అవి వేరువేరు భావములు కలవి . చెరసాలలో మాతో పాటు ఒక హెబీయ పడుచువాడు ఉండెను.  అతడు   అంగరక్షానాయకుని  సేవకుడు. మేమతనికి మా కలలు చెప్పుకొంటిమి .అతడు చెప్పునట్టే  మా కలలు    నిజములైనవి . నాకు కొలువు దొరికినది వంటవానిని ఉరితీసిరి. 

అంతటా ఫరో రాజు యోసేపును పిలువనంపెను .సేవకులు అతనిని శీఘ్రముగా కొనివచ్చారు అప్పుడు, ఫరో రాజు యోసేపుతో  తన కలలు చెప్పెను .దానికి యోసేపు దేవరువారు కన్నా కలలు రెండును ఒక్కటే దేవుడు తాను చేయబోవుపనిని ఏలినవారికి  తెలియజేసెను. ఈజిప్తులో మొదటి ఏడేండ్లు పంటలు బాగాపండుతాయి. ధాన్యం సమృద్ధిగా లభిస్తుంది కానీ తరువాత ఏడేండ్లు దారుణమైన  కరువు వస్తుంది.  ప్రజలు తిండి లేక మలమల మాడి   చస్తారు.అందుచేత రాజు ముందుగానే వివేకము ఉపాయముగల అధికారిని నియమించారు. ఆ ఉద్యోగి పంటలు బాగా పండిన ఏడేండ్ల కాలం లో ధాన్యాన్ని ప్రోగుచేసి ఆయానగరాలో నిలువచేయాలి .కరువు కాలం లో ఆగింజలను  ప్రజలకు పంచిపెట్టాలి అలా చేస్తే దేశం కరువుకు బలికాకుండా ఉన్నటుంది అని యోసేపు దైవ జ్ఞానంతో రాజు కలలను వివరించెను. ఫరో అతనిని మించిన వివేకి ఉపాయశీలి లేడని ఎంచి కరువుకాలానికి ధాన్యాన్ని నిలువచేసే అధికారాన్ని యోసేపుకి అప్పచెప్పాడు. అతనిని దేశంలో రాజు తరువాత రెండో అధికారిని చేసాడు. 

       కానానులోకూడా కరువు వచ్చుటచే ఇతరులతోపాటు ఇశ్రాయేలుకుమారులు కూడా ధాన్యాన్ని కొనుటకై ఐగుప్తు దేశం వచ్చారు యోసేపు ఐగుప్తుదేశములో సర్వాధికారి కదా దేశప్రజలకు ధాన్యమును అమ్మేడివాడు అతడే .యోసేపుసోదరులువచ్చి అతనికి సాష్ట్గాoగ ప్రణామములు చేసిరి. అతడు  సోదరులను చూసి గుర్తుపట్టెను.  కానీ వారు అతనిని గుర్తుపట్టలేదు. యోసేపు నటించి పౌరుషంగా మాట్లాడాడు. అతనికి వారిని గూర్చికన్న కలలను కూడా జ్ఞప్తికి తెచుకొనెను. అతడు వారితో మీరు గూఢచారులు మా దుర్గములు లోటుపాటులు తెలిసికొనుటకు వచ్చితిరి అని అనెను .వారిని మూడు నాళ్లు పాటు చెరలో త్రోయి oచాడు.వాళ్ళు లబోదిబో మొత్తుకొని తమ కుటుంబ  పరిస్థితులను తమ్ముని  ముందు ఎరుకపరిచారు. తమ ముసలి తండ్రి  యాకోబునీ గూర్చి తమ్ముడు   బెన్యామీనును  గూర్చివివరించారు .యోసేపు మీరు చెప్పేది నిజమైతే మీ  తమ్ముడు  బెంజమీనును ఇచటికి తీసుకుని రండి. అప్పటి దాకా మీలోఒక్కడు చేరలోఉండాలి  అన్నాడు. షియోనుని బంధించి కారాగారంలో ఉంచి మిగిలిన సోదరులను ధాన్యాన్నితీసికొని వెళ్ళమన్నాడు. దానితో అన్నలకు పశ్చాత్తపం కలిగింది. వాళ్ళు పూర్వం తాము యోసేపుకి చేసిన ద్రోహానికి చింతించారు. సోదరులు ఆ చింతనతో ధాన్యాన్ని యింటికి తీసికొని వెళ్లారు. సోదరులుమొదటి సారి తెచ్చ్చుకొన్న ధన్నము ఐపోఇంది. వాళ్ళు రెండొవసారి ధాన్యానికి వచ్చారు .యాకోబు చాలా అనిష్టం గానే  బెన్యామీనును  వాళ్ళు వెంట పంపాడు.  బెన్యామీనును  తన సొంత తల్లి కి పుట్టిన వాడు కనుక యోసేపుకి సొంత తమ్ముడు . ఇతడు పుట్టగానే తల్లి చనిపోయింది. ఇతడు యోసేపు  ఇల్లు  వీడివచ్చిన తర్వాత  పుట్టాడు . కనుక అతను తమ్ముడిని చూడ్డం ఇదే మొదటిసారి అతన్ని చూడగానే యోసేపుకి కన్నుల్లో నీళ్లు గిర్రున  తిరిగాయి .వెలుపలికి వెళ్లి  వెక్కివెక్కి ఏడ్చాడు. .యోసేపు అన్నలకు ఇంకా ఎక్కువ పశ్చాత్తపం పుట్టింప గోరాడు. అతడు తానుపానీయం సేవించే గిన్నెను  బెన్యామీను  గోతంలో పెట్టించాడు. .సోదరులు ధాన్యాము తీసికొని నగరం వీడి పొలిమేర వరకు వెళ్ళాక, వారి గోతాలు సోదాచేయంచాడు.  

బెన్యామీనుపై నేరం మోపి, అందరిని తిరిగి తన చెంతకు రప్పించాడు. ఈ కారణంగా సోదరులు ఇరకాటంలో పడి,  బిక్కముఖం  వేసి కొని నిలబడ్డారు.యూదా తన చిన్న తమ్మునికి తాను పూటపడతానని అతనికి బదులుగా తాను చెరలో ఉంటానని, తమ్ముడిని తండ్రి వద్దకి పంపివేయమని విన్నవించుకున్నాడు .యోసేపు దు;ఖం ఆపుకోలేకపొయాడు. అతను సేవకులందరిని ఆవలకు పంపివేసి సోదరులకు తన్నుతాను తెలియజేసికొన్నాడు.  ఎప్పుడో గతించాడనుకొన్న సోదరులు  తమ్ముణ్ణి  చూచి, దిగ్రాంతి  చెందారు .యోసేపు దైవలీలలను వారికి వివరించాడు .మీరు నన్ను బానిసగా అమ్మివేసి నందుకు చింతించకండి. మీ ప్రాణాలను, ఐగుప్తు ప్రజల ప్రాణాలను నిలబెట్టడానికి  మీకు ముందుగా   దేవుడే  నన్నిక్కడికి  పంపాడు. నన్ను ఈ ఐగుప్తుకి ప్రధానమంత్రిని చేసింది భగవంతుడే అని చెప్పాడు.  అతడు తన తండ్రిని కుటుంబ సమేతంగా ఈ ఐగుప్తుకి రప్పించి,సారవంతమైన గోషెను మండలంలో వారికి నివాసం కప్పించాడు. ఆ కుటుంబం వాళ్ళు మొత్తం  డెభైమంది. యోసేపు యొక్క ఇద్దరు కొడుకులు  ఎఫ్రాయిము, మనస్సే లను యాకోబు దత్తతు తీసికొన్నాడు. ఈ ఇద్దరు కుమారులతో కలసి ఇశ్రాయేలు గోత్రాలు పండ్రెడుఅయ్యాయి. తర్వాత యూదులు, లేవి, యోసేపులను గోత్ర కర్తలు గా లెక్కలోకి తీసికోలేదు. యాకోబు చనిపోయాక, సోదరులకు బెదరు పుట్టింది. కనుక వాళ్ళు ఓ కథ అల్లుకొని వచ్చారు. 

తన తండ్రి యోసేపుకు వర్తమానం తెలియజేయమన్నాడు అని సోదరులు తన తమ్ముడు తో ఇలాపలికారు. తెలిసో తెలియకో నీ సోదరులు నీకు కీడు చేసారు. నీవు వాళ్లను క్షమించు వదలియేయి. ఈ మాటలు విని యోసేపు మనస్సు నొచ్చుకొన్నాడు.  

అతడు వారితో మీరు నాకు కీడు తల పెట్టారు. కానీ దేవుడు ఆకీడును మేలుగా మార్చాడు. నన్ను మీకంటే ముందుగా ఎక్కడికిపంపి ఈ కరువు కాలంలో నేను మీ ప్రాణాలను, ఇంకా చాలామంది  ప్రాణాలనునిలబెట్టేలా చేసాడు. కనుక జరిగిన దానికి మీరేమీ బాధపడకండి. నేను మిమ్ముమీ బిడ్డలను తప్పక కాపాడతాను అన్నాడు. యోసేపు  ఈ ఐగుప్తులో నూటపది సంవస్సరాలు  జీవించాడు . అది నీతిమంతుల ఆయుస్సు. అతడు చనిపోకముందు సోదరులను ఒక కోరిక కోరాడు. దేవుడు మిమ్ము ఈ దేశం నుండి  మరలా కనాను మండలానికి తీసికొనిపోతాడు. అప్పుడు  నా అస్థికలను   మీవెంట కొనిపోండి అని చెప్పాడు. అతడు చెప్పెన విధంగా మోషే కాలంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి వెడలిపోయెనపుడు.   పుణ్యపురుషుని, అస్థికలను గూడా తమవెంట తీసికొనిపోయారు.

-Br. Simon



9, ఆగస్టు 2021, సోమవారం

సంసోను యొక్క జీవిత కథ

సంసోను యొక్క జీవిత కథ

ఇశ్రాయేలీయులును దేవుడు తన సొంత ప్రజలుగా ఎన్నుకొని అయన చేసిన వాగ్దానాలను నెరవేరుస్తూ వారిని కంటికి రెప్పవలె కాపాడుతున్నాడు, కానీ వారు మాత్రం దేవునికి వ్యతిరేకంగా దుష్క్యార్యములను చేస్తున్నారు. ఆ సమయంలో ఇశ్రాయేలీయులను యావే దేవుడు నలువది యేండ్ల పాటు వారిని ఫిలిస్తీయుల వశము చేసెను. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఘోరమైన బానిసత్వ జీవితం జీవిస్తున్నారు అనేకమైన కష్టాలు, బాధలు పడుచున్నారు. ఆవిధంగా నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు ఎందుకంటే వారు దేవునికి ఇష్టమైన వారు. కనుక వారందరిని రక్షించటానికి, కాపాడటానికి ఒక నాయకుడు కావలయును వారినందరిని ఎదురించటానికి ఒక వీరుడు కావాలి, కనుక దేవుడు ఒక గొప్ప వ్యక్తిని ఎన్నుకున్నాడు. అతడే సంసోను. సంసోను పుట్టుక అలాంటిది ఇలాంటిది కాదు. 
మనం బైబిల్ గ్రంధం చూసినట్లయితే ముగ్గురు వ్యక్తుల యొక్క పుట్టుక గురించి దేవదూత పరలోకం నుండి భూలోకానికి దిగివచ్చి శుభవార్తను తీసుకొని వచ్చింది, అందులో మొదటి వ్యక్తి సంసోను. సంసోను జన్మించినప్పటినుంచి దైవానుగ్రహం కలవాడు. అతడు జన్మించినప్పటినుండి మరణించినవరకు వ్రత తాత్పరుడై జీవించెను. ఆ వ్రతము నజరేయ వ్రతము, ఈ వ్రతము చేపట్టడం అంత సాధారణమైనది కాదు. ఎందుకంటే ఆ వ్రతం చేపట్టు వారు ద్రాక్షరసం గాని, తల జుట్టు కత్తరించకూడదు. ఎవరైతే ఈ వ్రతాన్ని చేపడతారో వారు దేవుని శక్తి పొందిఉంటారు. అయితే ఈ వ్రతాన్ని చేపడుతున్న సంసోనుకు దేవుని ఆత్మ, శక్తి కలిగి ఉన్నాడు.
ఒకానొకరోజున సంసోను తిమ్నాతుకు చేరెను ఆ నగరచివరిలో ఒకద్రాక్షతోటను చేరగానే అక్కడ ఒక కొదమసింహం గర్జించుచు అతని మీదికి దూకెను. ఆసమయంలో సింహం మీదపడి మేకపిల్లను చీల్చినట్లు చీల్చివేసెను. ఈసన్నివేశం సంసోనుయొక్క ధైర్యాన్ని, వీరత్వాన్ని మనకు తెలియజేస్తుంది తరువాత సింహండొక్కనుండి చేసిన పట్టు తేనే త్రాగి  మిగిలినది సంసోను తల్లిదండ్రులకు ఇచ్చెను.
సంసోను వివాహం చేసుకోబోయే యువతిని చూసిన తరవాత వారికీ విందు చేసెను. అక్కడ పెండ్లికుమార్తె వైపువారు సంసోనుయొక్కశరీర దారుఢ్యాన్ని, కండలుతిరిగినబలాన్ని, అతని ఎత్తునుచూసి, భయపడి వారికీ తోడుగా ముప్పదిమంది మనుషులను తెచ్చుకొనెను. సంసోనుకు శరీరబలమేకాకా తనకు జ్ఞానంకూడా ఎంతోమిక్కుటంగాఉన్నది, అతని వివాహానికివచ్చిన ముప్పదిమందిలో తనయొక్కజ్ఞానముతో మిమ్మొక పొడుపుకత అడిగెదను పెండ్లిపండుగ ఏడురోజులు ముగియకమునుపే కథ విప్పెదరే మీకు ముప్పది కప్పడములు, ముప్పదికట్టుబట్టలు బహుమానంగాఇచ్చెదను. విప్పలేకుంటే మీరు ఏదైనా బహుమానం నాకు ఇవ్వండి. ఇది పందెం అని వారికీ సవాలు విసిరెను. సంసోను తినెడు దానినుండి తినబడునది వచ్చే బలమైనదాని నుండి తీయనిది వచ్చే అని వారికీ పొడుపు కథ వేసెను. వారికీ మూడురోజులు గడిచినగాని శతవిధాలుగా ప్రయత్నించినా ఎలాంటి సమాధానం దొరకలేదు. చివరికి అతని భార్యపోరు పడలేక పొడుపుకథ విప్పిచెప్పెను. సమాధానంచెప్పిన వారికీ బహుమానంఇచ్చి మిగతావారందరిని కోపంతో చంపివేసెను.
కొంతకాలం తరవాత తన భార్యను చూడటానికి వెళ్ళినప్పుడు ఆమె తండ్రి సంసోనుకి అడ్డువచ్చి నీకు ఆమెమీద అయిష్టము కలిగిందనుకొని స్నేహితునకుఇచ్చి పెండ్లిచేశాను అని చెప్పగా ఆవేశంతో వారిపంటలను, ద్రాక్ష, తోటలను, ఓలీవు తోటలను గుంటనక్కలచేత త్రొక్కించి వాటికి నిప్పంటించి కాల్చివేసెను. దీనంతటికి సంసోనే, కారకుడని  తెలుసుకొని తిమ్నాతు పౌరుని కుమార్తెను పెండ్లాడుననుకొని వారందరిని నిలువునా కాల్చి చంపిరి. సంసోను ఇది అంత  విని మీరింత పాడు పని చేసిరి అని ఫిలిస్తీయుల మీదపడి చిక్కిన వారిని చికినట్లుగా చీల్చి చండాడి చంపివేసెను. ఇది అంతయు కూడా దేవుని అనుగ్రహం వలన జరుగుతున్నది. ఫిలిస్తీయులు యూదా మీదికి దండెత్తి వచ్చి లేహి  నగరమును ముట్టడించిరని చూసిన యూదియులు సంసోనును ఫిలిస్తీయులకు అప్పగించి ఆ వీరునకు యూదియులు రెండు క్రొత్త తాళ్లతో బందించి కొండా గుహ నుండి వెలుపలకు  తీసుకోని వచ్చారు. సంసోను ఫిలిస్తీయులను చూడగానే యావే ఆత్మ సంసోనును ఆవేశింపగా అతని బంధములనియునిపండుకొనిన నారా త్రాళ్లు  ఆవిధంగా అవుతాయో ఆవిధంగా త్రాళ్లు అన్ని ఆయను. 
ఆ త్రాటి కత్తులన్నియు కూడా ఒక్కసారిగా సడలిపోయెను. అదే స్థలములో ఒక పచ్చి పచ్చిగా నున్న గాడిద దౌడ ఎముక ఒకటి సముసోను కంట పడెను. అతడు ఆ ఎముకను అందుకొని ఒక వీరుడు, సైనికుడు ఏవిధంగానైతే తన ప్రజల కోసం పోరాడుతారో అదేవిధంగా సంసోను కూడా ఫిలిస్తీయులతో పోరాడి ఒక్కొక్కరిని గాడిదలను కొట్టినట్టు కొట్టి, ఒక వీరుడివలె వేయి మందిని చంపెను. చేతిలోని దౌడ ఎముకను పారవేసిన స్థలమును రామతులేహి అని పేరు వచ్చెను, మహా విజయం సంసోను దప్పికగొనినపుడు దేవునికి ప్రార్థన చేయగా నెల బ్రద్దలై గోయి ఏర్పడి దాని నుండి నీరు వచ్చెను. ఆ నీరు త్రాగి సంసోను సేద తీర్చుకొనెను కనుక ఆ ఊటకు అన్హాకోరే అనే పేరు వచ్చెను.
కొన్ని రోజుల తరవాత సంసోను గాజాకు వెళ్లి అక్కడ ఒక వేశ్య ఇంటికి వెళ్ళినపుడు సంసోను వచ్చినన్ని విని ఆ ఊరి జనులందరు ప్రోగై నగర ద్వారమున కాపలా ఉండగా సంసోనును చంపవచ్చుగా అనుకోని రాత్రంతయు ఊరకుండిరి. సంసోను నది రాత్రి వరకు అలంటి సద్దా చేయక నిద్రపోయాను. కానీ అతడు అర్ద రాత్రి లేచి నగర ద్వారము తలుపులను, ద్వారా బంధాలను, అడ్డుకర్రలతో సహా ఊడబెరికి చకశక్యంగా అంతో బలమైన ద్వారములనియు భుజాలపైన వేసుకొని హెబ్రోను ఎదురుగ ఉన్న కొండా పైకి ఎక్కి వాటన్నిటిని అక్కడే వదలిపెట్టెను. 
ఆ తరవాత సారెకు లోయలో నివసించే డెలీలా కు వచ్చి పచ్చిగా ఉన్న అల్లే త్రాడులను ఏడింటిని ఇచ్చి ఆమె చేత సంసోను బందీ చేసెను.  సంసోను మాత్రం ఆ త్రాళను అన్నిటిని నిప్పంటించిన నారా తరాల వాలే సునాయాసంగా తెంచివేసెను. ఆ తర్వాత ఎవరు వాడని కొత్త తాళ్లతో సంసోను బంధించిరి. కానీ సంసోను తన చేస్తి కట్టులన్నియు దారములవలె త్రెంచి వేసెను మరల మరొకసారి సంసోను నిద్ర పోయిన సమయంలో అతని తలా జాడలను ఏడూ పడుగులకు వేసి మీకునకు బిగగొట్టి బంధించిరి అతడు నిద్ర లేచి తల వెంట్రుకలను వానిని కట్టిన మేకులను తన బలంతో ఒక్క ఊపున ఊడబీకేను. ఆవిధంగా తన వీరత్వాన్ని, బలాన్ని ఫిలిస్తీయుల ఎదుట నిరూపించుకొనెను.  
చివరకు ఫిలిస్తీయులు సంసోను యిత్తడి గొలుసుతో బంధించి సంకెళ్లు వేసిరి. అక్కడ సంసోను అందరి ఎదుట వీర కార్యాలు చేసెను. ఆ మందిరములో ఫిలిస్తీయ దొరలూ మరియు మూడువేలమంది స్త్రీ పురుషులు పై అంతస్తున కూర్చుండి సంసోను చేయు వీర కార్యాలను చుస్తునారు.ఆ సమయంలో ఫిలిస్తీయులపై ఒక్క దెబ్బతో పాగా తీర్చుకోవటానికికి అతడు మందిరమును మోయు మూలా స్తంభాలను రెండింటి మీద చేతులు మోపి, కుడి చేతితో ఒక దాని మీద, ఎడమ చేతిని ఇంకో దాని మీద మోపి రెండు కంబములపై తన బలము చూపెను.
సంసోను ముందుకు వంగి స్తంభములను శక్తి కొలది నెట్టెను, ఆ నెట్టుకు మందిరము పెళ్లున కూలి, సర్దారుల మీద, ప్రేక్షకుల మీద  పడెను, సంసోను తాను బ్రతికి ఉండగా చంపినా వారి కంటే చనిపోవుచు చంపిన వారే ఎక్కువ. ఆ తర్వాత సంసోను, సోదరులు, బంధువులు వచ్చి మృత దేహాన్ని జోరా, ఏస్తవోలు నగరము మధ్యనున్న మనోవా సమాధిలోనే అతనిని కూడా పాతిపెట్టిరి.
ఈ విధంగా సంసోను ఫిలిస్తీయుల ఎదుట అనేక వీర కార్యాలు ప్రదర్చించి ఇశ్రాయేలు ప్రజలకు ఇరవై యేండ్ల పాటు న్యాయాధిపతిగా ఉండెను. సంసోను బ్రతికినంత కాలం ఫిలిస్తీయులకు హడలెతించెను..
-బ్రదర్. సాలి. రాజు . ఓ.సి.డి.

తోబియా జీవిత కథ



మనము రక్షణ గ్రంధంలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరిని ఒక్కొక్క ఉద్దేశంతో దేవుడు తన సేవ కొరకై మరియు తన ప్రజలను రక్షించడానికి ఎన్నుకున్నారు. మనం ఇప్పుడు చూస్తున్న కథలో తోబియా అనే వ్యక్తి ద్వారా తన తండ్రిఐన  తోబితునకు అంధత్వాన్ని తొలగించడానికి మరియు తనకు కాబోయే భార్య సారాకు పిశాచ విముక్తిని కలిగించడానికి దేవుడు తోబితూను ఎన్నుకున్నాడు.

     తోబియా తల్లిదండ్రులు తోబితూ మరియు అన్న. తోబితూ తన జీవిత కాలమంతా కూడా తల్లి దండ్రులకు చేదోడు వాదోడుగా తమ కన్ను సన్నులలో జీవిస్తు, మరియు అన్ని విషయాలలో సహాయం చేస్తుండేవాడు. 

తోబియా తండ్రి తోబితూ ద్రుష్టి కోల్పోయి వారు అంతయు కోల్పోయి తోబితూ చనిపోతాడు అని అనుకున్న సమయంలో  తోబితుకు పూర్వము తాను మేదియ దేశమునందలి రాగీసు పట్టణమును తన స్నేహితుడైన గబాయేలు ఇంట దాచి ఉంచిన ధనము జ్ఞప్తికి తెచ్చుకొని తన కుమారుడైన తోబియాకు తెలియచేస్తాడు.

తోబియా తండ్రితో నేను నీవు చెప్పినదెల్ల చేయుదును అని చెప్పి తోబియా తండ్రితో నేను గబాయేలు నుండి ధనము తీసుకురావడం ఎలా? నేను అతనిని ఎరుగను, అతడు నన్ను ఎరుగడు. మరి నేను ఏ ఆనవాలు చూపవలెను? అదియుగాక మేదియాకు ఏ త్రోవనా పోవవలెను నాకు తెలియదు, అని తండ్రితో చెప్పెను. అందుకు తండ్రి తోబియాకు గబాయేలు సంతకం చేసిన కాగితం ఒక ముక్క ఇచ్చి మరొకటి గబాయీలు వద్ద ఉన్న సొమ్ముతో ఉన్నదని చెప్పి తన వద్ద ఉన్నదీ తోబియాకు ఇచ్చి, ఇది చూపించు అనెను.

తోబియా తనకు మేదియాకు తీసుకుపోవడానికి ఒక స్నేహితుని వెదకడానికి బయటికి వెళ్ళగానే రఫాయేలు దేవదూత అతనికి ప్రత్యక్షమై కనబడెను. కానీ తోబియాకు దేవుదుతా అని తెలియదు. అందుకు తోబియా అయ్యా! మీది ఏ వూరు అని అడిగెను . అందుకు ఫాయేలు నేను ఇశ్రాయేలుడను. ఈ పని అయినా దొరుకుతుందేమో అని ఈ పట్టణమునకు వచ్చాను అని అనెను. అందుకు తోబియా మేదియు వెళ్ళడానికి దారితెలుసున అని అని ప్రశ్నించెను. అందుకు రెఫాయేలు నేను అచటికి చాల సార్లు వెళ్లితిని, ఆ ధారులన్నియు నాకు సుపరిచితములే అని అనెను. రఫాయేలు నేను ఆ దేశమునకు పోయున్నప్పుడెల్ల రాగీసు నగరమున వసించు మా బంధువగు గబాయేలు ఇంట బస చేసిడివాడను అని అనెను. అందుకు తోబియా స్నేహితునితో నువ్వు ఇక్కడే ఉండుము నేను ఈసంగతిని నా తండ్రితో చెప్పి వత్తును, నీవు నాతో ప్రయాణము చేయవలెను. నేను నీకు వేతనం చెల్లింతును అని అనెను. అందుకు రఫాయేలు సరియే , నీవు కోరినట్లే నేను నీవెంట వత్తును అని అనెను.

అందుకు తోబియా తండ్రి వద్దకు పోయి నాతో ప్రయాణము చేయుటకు మన జాతి వాడు ఒకడు దొరికెను అని చెప్పి రఫాయేలును  ఇంటికి ఆహ్వానించెను. తోబియా తండ్రివద్ద దీవెనలను పొంది తల్లిదండ్రులను ముద్దాడి మేదియాకు ప్రయాణము గట్టెను. తోబియా దేవదూత తో ప్రయాణమై వారు సాయంత్రం వరకు ఠీగ్రీసు నది తీరమున విడిదిచేసెను.  తోబియా కాళ్ళు కడుగు కొనుటకు ఏటిలోకి దిగిన వెంటనే పెద్దచేప ఒకటి నీటిలోనుండి దూకి తోబియా పాదములు పట్టుకో బోయెను . దానిని చూసి అతడు గట్టిగ అరిసెను. దేవదూత అతనితో వోయి ఆ మత్స్యమును పట్టుకొనుము, దానిని జారిపోనీకుము అని అనెను. వెంటనే  తోబియా ఆ చేపను పట్టుకొని ఒడ్డుకులాగెను.  

దేవదూతచేపకడుపును చీల్చి దాని పిత్తమును కాలేయమును మరియు గుండెను తీసి నీవద్ద ఉంచుకొనుము. కానీ దాని ప్రేగులను మాత్రమూ పారవేయుము అనెను. తోబితూ దేవదూత చెప్పినట్లే చేసెను. అతడు చేపలోని కొంత భాగమును కాల్చి భుజించి తరువాత వారు ఇరువురు ప్రయాణమును సాగించిరి. మేదియ దరిదాపుల్లోకి వచ్చిరి. తోబియా దేవదూతను చూసి నేస్తమా అసరియా (దేవదూత అతనికి చెప్పిన పేరు) చేప పిత్తముకాలేయము, గుండెలతో ఏ ఏ రోగములను నయము చేయవచ్చును  అని అడిగెను. అతడు చేప గుండెను కాలేయమును కాల్చి పొగ వేసినచో నరులను పట్టి పీడించు భూతముగాని పిశాచముగాని పారిపోవును. ఆ నరులకు మరల పిశాచము భాధ సోకదు. పిత్తమును తెల్లని పొరలు కమ్మిన వారి కన్నులకు లేపనముగా ఉపయోగించవచ్చును. దాని కంటి పొరలమీద పూసి వాని మీద ఊదిన చాలు, పొరలు తొలగి పోవునని చెప్పెను.  

తరువాత వారిరువురును మేదియ దేశమున ప్రవేశించి ఏక్బటానా నగరమున సమీపించెను.అప్పుడు దేవదూత తోబియానీ పేరేతి పిలిచి నేటి రాత్రి మనము నీ బంధువైన రగువేలు ఇంట బస చేయవలెను. అతనికి సారా అను కుమార్తె కలదు ఆమె తప్ప అతనికి వేరే సంతానం లేదు. ఆ కన్య నీకు దగ్గరి చుట్టము. నీకు ఆమెను పెండ్లియాడు హక్కు కలదు. ఆమె తండ్రి ఆస్తి కూడా నీకు దక్కును అని అనెను.  అందుకు తోబియా రెఫాయేలుతో నేస్తమా ఆ యువతీని ఇది వరకి వరుసగా ఏడుగురు వరులకు ఇచ్చి పెళ్ళిచేసిరి. వారిలో ప్రతి వాడును మొదటి రేయినే శోభనపు గదిలోనే చచ్చెను. ఈ సంగతులెల్ల నాకు తెలియును. 

ఆమెను పట్టిన భూతమే ఆ వరులను సంహరించెను అని వింటిని. ఆ భూతము సారాకు ఎట్టి హాని చేయదట. ఆమెను సమీపించు పురుషులను మాత్రమూ పట్టి చంపును. నా మట్టుకు నాకాపిశాచమానిన భయముగా ఉన్నది. మా తండ్రికి నేనొక్కడినే కుమారుడును నేను చనిపోయినచో, నా తల్లిదండ్రలు దిగులుతో సమాధి చేరుకొందురు. అప్పుడు వారిని పాతి పెట్టు దిక్కు కూడా ఉండదు అని అనెను.అందుకు దేవదూత తోబియాతో ఆ భూతమును తలంచుకొని భయపడకుము. సారాను స్వీకరింపుము. ఈ రాత్రియే రగువేలు  ఆ యువతిని ప్రధానము చేయును. నీవు ఆమె పడక గదిలోకి వెళ్ళినవెంటనే చేప గుండెను తీసికొని కాలుచున్న సాంబ్రాణి మీద వేయుము. ఆ వాసనకు భూతము పారిపోవును. అది మరల సారా చెంతకు రాదు. నీవు ఆ యువతిని కూడక ముందే మీరిరువురు లేచి దేవునిని ప్రార్థింపుము అని అనెను. 

తోబియా రఫాయేలు చెప్పిన మాటలను విని, అతడు సారాను గాఢముగా ప్రేమించి తన హృదయమును ఆమెకు అర్పించెను . వారు ఏక్బటానా నగరమును చేరగానే తోబియా, నేస్తమా అసరియా నన్ను వెంటనే రగువేలు ఇంటికి తీసుకొని పొమ్ము అనెను. దేవదూత తోబియాను అతని ఇంటికి కొనిపోయెను. వారు మొదట రగువేలును పలకరించెను, అతడు వారిని లోనికి ఆహ్వానించెను. వారు వారితో మేము నఫ్తాలి తెగకు చెందినవారలము ప్రస్తుతం నీకివే పట్టణములో ప్రవాసమున ఉన్నవారమని చెప్పిరి తోబియా రగువేలుతో, తోబితూ నా తండ్రియే అని చెప్పెను. ఆ పలుకులు విని రగువేలు తటాలున లేచి ఆనందభాష్పములతో తోబియా ను ముద్దాడెను. వారు స్నానము చేసి భోజనమును కూర్చుండబోవుచుండగా, తోబియా నేస్తునితో, నేస్తమా అసరియా నీవు సారాను నాకిచ్చి పెళ్లి చేయమని రగువేలును అడగవా? అని అసరియా తో చెప్పెను. రగువేలు ప్రక్కనుండి ఆ మాటలు విని తోబియాతో, మా అమ్మాయి సారాను పెండ్లియాడుటకు నీవుతప్ప మరెవ్వరును అర్హులుకారు. నీవు మాకు అయినవాడవు అని అనెను. అంతటా రగువేలు సారాను పిలిపించి, ఆ యువతిని చేపట్టుకొని ఆమెను తోబియాకు అప్పగించెను. 

ఆ తరువాత వారు అన్న పానీయాలు సేవించి ముగించినపిదప రేయి నిద్ర పోవు సమయమాయెను. అప్పుడు సారా తల్లిదండ్రులు తోబియాను శోభనపు గదిలోనికి తీసుకొని పోయిరి. అతడు రెఫాయేలు సలహాలను జ్ఞప్తికి తెచ్చుకొని తన సంచిలోనుండి చేప గుండెను, కాలేయమును వెలుపలికి తీసి కొంత భాగము మండుచున్న సాంబ్రాణి మీద వేసెను. అప్పుడు భూతము ఆ వాసనా భరింపజాలక ఐగుప్తు దేశమునకు పారిపోయెను. సారా తల్లిదండ్రులు గది తలుపులు మూయగా తోబియా పడక మీదనుండి లేచి సారతో నీవును లేచి నిలుచుండుము ప్రభువు మన మీద కరుణ చూపి మనలను కాపాడుటకు ఇరువురము ప్రార్థన చేయుదమనిచెప్పెను. సారా లేచి నిలుచుండగా వారు ఇద్దరు ప్రభువు రక్షింపవలెనని మనవిచేసి ప్రార్థించిరి. ప్రార్థన ముగిసిన తరువాత ఆ రాత్రి ఇద్దరు కలిసి శయనించిరి. అంతలో ఆ రాత్రే రగువేలు సేవకులను తీసుకొని పోయి తోబియా చనిపోతాడని తలంచి సమాధి తవ్వించెను. సమాధి తవ్విన వెంటనే ఇంటిలోకి వెళ్లి భార్యను పిలిచి ఒక సేవకురాలిని లోపలి పంపించి తోబియా బ్రతికి వున్నాడోలేదో తెలుసుకొని రమ్మని చెప్పెను.   

ఆమె లోపలికి వెళ్లిచూడగా వధూ వరులు ఇద్దరు గాఢ నిద్రలో ఉండిరి. కనుక సేవకురాలు బయటకు వచ్చి రగువేలుతో తోబియా చనిపోలేదు అనిచెప్పెను. ఆ తరువాత తోబియా రెఫాయేలును పిలిచి నీవు నలుగురు సేవకులను రెండు ఒంటెలను వెంటపెట్టుకొని రాగీసునందలి గాబయలు ఇంటికి పొమ్ము, అతనికి ఈ చేవ్రాలుకు పత్రమును చూపి సొమ్మును అడుగుము మరియు అతనిని కూడా వివాహ మహోత్సవమునకు తోడ్కొని రమ్ము. మా తండ్రి నా కొరకై రోజులు లెక్కపెట్టుకొనుచుండును. నేను ఒక్క రోజు జాగు చేసిన అతడు దుఃక్కించును. మా మావ రగువేలు నన్ను ఇక్కడే ఉండమని నిర్బంధము చేసెను. అతని మాట కాదనలేక పోతినిఅనిచెప్పెను. రెఫాయేలు నలుగురు సేవకులను తీసుకొని పోయి గాబయలు ఇంటికి చేరి, అతనికి చేవ్రాలు కల పత్రమును చూపించెను. మరియు తోబితూ కుమారుడు తోబియా పెండ్లి సంగతి చెప్పి అతనిని వివాహ మహోత్సవమునకు ఆహ్వానించెను. వెంటనే గాబయలు వెండి నాణెముల, సంచులను లెక్కపెట్టి ఇచ్చెను.  ఆ సంచులను ఒంటెలమీదకెక్కించి , వారు మరుసటి రోజున వేకువనే ఇల్లుచేరుకొనునప్పటికీ తోబియా భోజనము చేయుచుండెను. తోబియా గబాయేలునకు స్వాగతం చెప్పెను. గాబయలు తోబియాను దీవించెను.

రగువేలు తన కూతురు సారా వివాహ సందర్భమున జరుప నిశ్చయించెను. పదునాలుగు దినముల ఉత్సవము ముగిసెను. తోబియా మామ చెంతకు వచ్చి నన్ను వెళ్లి పోనిమ్ము. మా తల్లిదండ్రలు నన్ను కంటితో చూచు ఆశను వదులుకొని యుందురు. కనుక నన్ను మాఇంటికి పోనిమ్ము అని అనెను. రగువేలు ఇక జాగు చేయక సారాను తోబియాకు అప్పగించెను. తోబియా తన ఆస్తిలో సగభాగములో, బానిసలను, ఎడ్లను, గొర్రెలను, గాడిదలను, సామానులను, మొదలైనవి తీసుకొని సంతోషముతో రగువేలు ఇంటినుండి భయలుదేరేను. అతడు తన ప్రయాణము విజయవంతమైయ్యేను గనుక స్వర్గాధిపతియు లోకపాలకుడైన దేవుని స్తుతించెను. ఇల్లు వీడకముందు తన అత్తా మామలను వారు బ్రతికున్నంతకాలము గౌరవముతో చూచుకొందునని ,మాట ఇచ్చెను. వారు ప్రయాణము చేయుచు, నినెవే చెంతగల కాసెరెను నగరము దరిదాపుల్లోకి వచ్చిరి. రెఫాయేలు, తోబియా చేప పిత్తమును తీసుకొని తన భార్యకంటె ముందుపోయెను. తోబియా చేప పిత్తముతో తండ్రి యెదుటికి వచ్చెను. అతడు తన తండ్రి కన్నులమీద వూది అతనిని తన చేతితో పట్టుకొని నాయన ధైర్యము తెచ్చుకొనుము అనిచెప్పెను. అంతటా అతడు చేప పిత్తమును తండ్రి కన్నులకు పూసెను. ఆ వృద్ధుని కన్నులనుండి కంటి కొనాలతో మొదలుపెట్టి తెల్లని పొరను పెరికివేసెను.  

అంతటా తోబియా సంతోషముతో దేవుని బిగ్గరగా స్తుతించుచు ఇంటిలోనికి వెళ్లెను. తరువాత అతడు తండ్రికి తనసంగతంతయు తండ్రికి చెప్పెను. తన ప్రయాణము సఫలమైనదని, తన సొమ్మును కొని వచ్చితినని అంత మాత్రమే కాకా రగువేలు కుమార్తె ఐన సారాను కూడా పెండ్లియాడితినని ఆమెను కూడా వెను వెంటనే వచ్చుచున్నదనియు, ఇప్పటికే నినివే నగర ద్వారములను చేరి యుండునని వివరించెను.

వివాహ మహోత్సవము ముగిసిన తర్వాత తోబియా తండ్రితో నాయన నన్ను ఇతనికి ఎంత చెల్లింపమందువు? మేము తెచ్చిన సొత్తులో సగము అతనికి ఇచినను నష్టములేదు. అతడు నన్ను సురక్షితముగ  నీ చెంతకు కొనివచ్చి, గాబయలు వద్దకు మన సొమ్ములను తీసుకొని వచ్చెను. అదియే గాక నా భార్య కి భూత విముక్తి నీకు రోగ విముక్తి కలిగించెను. ఈ ఉపకారములన్నిటికి అసరియాకు ఎంత సొమ్ము చెల్లిపమందువు  అని అడిగెను. అతడు కొనివచ్చిన సొత్తులో సగం పంచియిమ్ము. అతడు అంత వేతనమునకు అర్హుడు అని చెప్పెను తండ్రి. కనుక తోబియా రెఫాయేలును పిలిచి నేస్తమా నీవు తీసుకొచ్చిన ధనముతో సగము తీసుకొనుము. నీవు నాకు చేసినమేలులకు ఇది బహుమానము. ఇక క్షేమముగా మీ ఇంటికి పొమ్ము అని అనెను. అప్పుడు రెఫాయేలు తండ్రి కొడుకులను పిలిచి వారితో ఇట్లనెను; నేను దేవుని సన్నిధిలో నిలిచి అతనికి సేవలు చేయుటకు సిద్ధముగానుండు ఏడుగురు దేవదూతలలో ఒకరైన రెఫాయేలును అని అనెను. ఆ పలుకు విని ఆ తండ్రీకొడుకులు ఇద్దరును భయకంపితులై గడగడా వణుకుచు నేలమీద బోర్లగిలా పడెను. కానీ దేవదూత వారితో నీవు భయపడకుడి మీకు ఎట్టికీడును కలుగదు, ప్రభువుని సదా కీర్తింపుడు అని అనెను. వారిద్దరూ, నేలమీదనుండి లేచి నిలబడుచుండిరి, కానీ ఆ దేవదూత మరల వారికి కనిపింపలేదు. వారు కీర్తనలతో దేవుని స్తుతియించిరి. దేవదూత తన చెంతనున్నప్పుడు ప్రభువు తమకు చేసిన అద్భుత కార్యములకు గాను దేవుడిని కీర్తించిరి.

తరువాత కొంత కాలానికి తండ్రి చనిపోయినప్పుడు వారు అతనిని గౌరవ మర్యాదలతో పాతి పెట్టిరి. ఆ కొంతకాలానికి తల్లియును చనిపోగా తోబియా ఆమెను తండ్రి ప్రక్కనే పాతి పెట్టెను. తదనంతరం అతడు భార్య,పిల్లలతో మేదియ దేశములోని వెళ్లి అక్కడ తన మామ రగువేలు ఇంటివద్దనే నివసించెను . అతడు వృద్ధులైన అత్త మామలను మిగుల గౌరవముతో చూచుకొనెను. ఆ వృద్ధులు చనిపోయినప్పుడు అక్కడే పాతిపెట్టెను. తోబియా తండ్రి ఆస్తికి వలే మామ ఆస్తికి వారసుడాయెను. అతడు ఎల్లరి మన్నులకు పాత్రుడై నూట ఇరువది యేండ్లు వరకు జీవించి తనువూ చాలించెను. తాను చనిపోకముందు నినివే నాశనమగుటను గూర్చియు మేదియ రాజు సియాకరు నినెవే పౌరులను బందీలుగా కొనిపోవుటను గూర్చియు వినెను. తోబియా చనిపోవకముందే నినెవే నగరమునకు పట్టిన దుర్గతిని చూసి సంతసించి నిత్యుడైన దేవునికి వందనములు అర్పించెను.

-బ్రదర్. సాలి. రాజు. ఓ.సి.డి.

7, ఆగస్టు 2021, శనివారం

19 వ సామాన్య ఆదివారం

సామాన్య 19 వ ఆదివారం

1 రాజుల 19: 4 - 8, ఏఫేసి 4: 30; 5: 2, యోహాను 6 :41-51

ఈనాటి సువార్త పట్నంలో యేసు "నేనే పరలోకమునుండి దిగివచ్చిన ఆహారమును" అని ఎలుగెత్తి పలుకుచున్నాడు. పరలోక పిత క్రీస్తును మానవాళికి ఆహారంగ ఒసగాడు. క్రీస్తు ద్వారా అందించిన ఆయన వాక్కు, సందేశం, ఉపదేశం మనందరకు జీవాహారం. క్రీస్తును విశ్వాసంతో స్వీకరించినవాడే ఆ జీవాన్ని పొందగలడు. నన్ను విశ్వసించువాడు నిత్య జీవము పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అని యేసు పలికెను. భౌతిక జీవితానికి ఆహారము అత్యవసరమైనట్లే, క్రీస్తు ఈ లోకములో మానవ జీవితానికి ఏంతో అవసరం. ఆయన మానవాళికి జీవాహారం. యావే భోజనం ప్రయాణంలో అలసి సొలసి పడిఉన్న ఏలీయా ప్రవక్తకు శక్తినిచ్చి గమ్యానికి నడిపించింది. ఇపుడు నూతన వేదంలో దేవుడే స్వయంగా ప్రజలకు ఆహారoగా దిగి వచ్చాడు. ఈ లోకములో మనం జీవిత ప్రయాణాన్ని కొనసాగించి మన గమ్యస్థానాన్ని చేరుకోవాలంటే ఆ దివ్య భోజనం మనకెంతో అవసరం. క్రీస్తు శరీరం మన జీవితానికి దివ్య భోజనం. జీవితంలో అలసి, సొలసి విసిగి వేసారి బాధలతో మ్రగ్గుతున్న ప్రజలకు ఆ దివ్యాసప్రసాదం శక్తిని, ఓదార్పును, శాంతిని ఒసగుతుంది. దివ్యాసప్రసాదాన్ని లోకేనేటప్పుడు   నిజంగా మనం దైవకుమారిని శరీరాన్ని బక్షిస్తునాం. కనుక ఆయన మనయందు ప్రవేశించి మనకు శక్తిని జీవాన్ని ప్రసాదిస్తాడని విశ్వసించాలి. విశ్వాసంతో యోగ్యతతో దివ్యాసప్రసాదవిందులో పాల్గొన్న వారికే అట్టి అనుభవం లభిస్తుంది.

క్రీస్తు వాక్కు, సందేశం, మన జీవితానికి దివ్యవరం. ఆ ఆహారాన్ని స్వీకరించినపుడే మనం క్రెస్తవులుగా జీవించగలం. అపుడే మనకు భౌతికమైన ఆకలిదప్పులు అప్రధానంగా గోచరించగలవు. క్రీస్తుతో నిండినవాడు ఆకాలిదప్పులను గూర్చి అలమటించడు. మరణాన్ని గూర్చి భయపడడు. ఎలైన అతని యందు నిత్యజీవము ఎపుడు పారుతూ ఉంటుంది. మనం ఇతరులకు ఆహారమై ఉండాలి మన ఆదర్శ జీవితం ద్వారా సత్య సందేశం ద్వారా మనం ఇతరులకు ఆహారమై జీవిస్తుండాలి.- Br.Ratna Raju

19 వ సామాన్య ఆదివారం

19 వ సామాన్య ఆదివారము

1 రాజులు 19: 4-8 

ఎఫెసీ 4: 30 – 5: 2

యోహాను 6: 41-51

నేటి దివ్య పఠనాలు మరొకసారి దేవుని యొక్క జీవాహారం, ఆ జీవాహారం ఇచ్చే శక్తిని గురించి భోదిస్తున్నాయి. దేవుని యొక్క ఆహరం స్వీకరించడము ద్వారా విశ్వాసుల యొక్క జీవితాలలో అనేక రకాల మేలులు, అద్భుతాలు జరుగుతుంటాయి, దీవెనలు పొందుతారు.

ఈనాటి మొదటి పఠనములో ఏలీయా ప్రవక్త రొట్టెను భుజించి శక్తిని పొందిన విధానము తెలుసుకుంటున్నాము. ఏలీయా ప్రవక్త ఇశ్రాయేలులో ప్రవచించే సమయములో కార్మెల్ కొండమీద 450 మంది బాలు ప్రవక్తలను వధించి నిజదేవుడైన యావే గురించి తెలియజేసారు. అటు తరువాత ఆ విషయము విన్న అన్య జాతికి చెందిన యెసెబెలు రాణి ఇది భరించలేక వెంటనే ఏలీయా ప్రవక్తను చంపాలన్న వార్తను పంపించింది. అది విన్న ప్రవక్త భయముతో ఉన్నారు. హోరేబు కొండవద్దకు వచ్చి ప్రాణాలను కాపాడుకోవాలనుకున్నారు. అప్పుడు దేవుని దూత ప్రత్యక్షమై ఏలీయా ప్రవక్తను పోషిస్తుంది. ఆయనలో కొత్త ధైర్యము, ఒక నూతన తేజాన్ని నింపుతుంది  

ఇక్కడ మనము అర్ధము చేసుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి

  1. రొట్టె భుజించిన తరువాత మార్పు వచ్చింది. అప్పటివరకు బలహీనంగా ఉన్నాడు, ప్రాణభయంతో ఉన్నారు, శారీరక శక్తి నశించిపోతుంది. ఎందుకంటే చాల దూరం అరణ్యములో ప్రయాణము చేసారు. ఒక్కసారి రొట్టెను భుజించిన తరువాత తాను శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తిని పొందాడు. తనలో కొత్త ధైర్యము వచ్చింది, కొత్త విశ్వాసము నమ్మిక పుట్టుకొచ్చాయి. దేవుని యొక్క పని బ్రతికినా, మరణించినా పరిపూర్తి చేయాలనుకున్నారు. మనలో కూడా దేవుని యొక్క జీవాహారము భుజించినప్పుడు  మార్పు రావాలి. మనము పాపులం కావచ్చు, అన్యాయము చేసినవారు కావచ్చు, వివిధ రకాలుగా స్వార్ధపు ఆలోచనలతో జీవించిన వారు కావచ్చు. అయినప్పటికీ దేవుడిని నీ నా హృదయములోనికి పిలిచినప్పుడు స్వీకరించినప్పుడు పాపి పుణ్యాత్ముడుగా మారాలి, స్వార్ధం నిస్వార్ధము అవ్వాలి, అన్యాయము న్యాయము చేసేలా ఉండాలి. మనలో మార్పు వస్తేనే మనము స్వీకరించే దివ్యసత్ప్రసాద స్వీకరణకు ఒక మంచి అర్ధము ఉంటుంది 

  2. ఇక్కడ దేవదూత ఏలీయాతో నీవు చాల దూరము ప్రయాణము చేయాలి అని చెబుతుంది. ఒక జీవితము ప్రారంభించిన తరువాత (క్రైస్తవ జీవితము) మనము కూడా దేవునిలో ప్రయాణము చేయాలి. ప్రయాణము అంటే ముందుకు సాగుట. అది ఎక్కడినుండి అయినా సరే. ముందుకు వెళ్ళుట అని కూడా చెప్పవచ్చు. ఏలీయా నీవు ప్రయాణం చేయాలి అనగా దేవుని యొక్క పనిని పూర్తి చేయుటకు నీవు ప్రయాణం చేయాలి. ఆ పనిలో ముందుకు సాగాలి. దేవుని కీర్తిని వెదజల్లుటలో ముందుకు వెళ్ళాలి. దేవుని యొక్క సాన్నిధ్యం అనుభవించుటలో ముందుకు వెళ్ళాలి. ప్రతి యొక్క ప్రయాణములో దేవుని యొక్క అభయ హస్తమును చవిచూడాలి. ఇశ్రాయేలీయులు తమ ప్రయాణములో దేవుణ్ణి తెలుసుకున్నారు. అలాగే ఏలీయా కూడా తన ప్రయాణములో ఇంకా దేవుణ్ణి తెలుసుకుని అయన కోసం నిలబడాలని దీని అర్ధం. ఏలీయా ఎలాగైతే ప్రయాణము చేసాడో మనము కూడా అలాగే ప్రయాణము చేయాలి. దివ్యసత్ప్రసాదము స్వీకరించిన తరువాత దేవుని వైపు మాత్రమే ప్రయాణము చేయాలి. దేవుని ప్రేమను పంచుటలో ప్రయాణము చేయాలి. దేవుని సాన్నిధ్యము రోజురోజుకి ఎక్కువగా అనుభవించుటకు ముందుకు ప్రయాణము చేయాలి. సమస్యలు అను పర్వతము ఎక్కి మరి ప్రయాణము చేయాలి. అలాగే కుటంబ జీవితము జీవిస్తున్న భార్యాభర్తలు చాలాదూరం అన్యోన్యముగా, ప్రేమగా ప్రయాణము చేయాలి, మంచిగా ఉండాలి.  

  3. దేవుని యొక్క అభయం ఉంటే ఎవ్వరు ఎన్నడును ఒంటరి కాదు. ఎందుకంటే వారికి దేవుడు తోడుగా ఉంటారు. నిస్సహాయుడిగా ఉన్న ఏలీయాకు దేవుడు తోడుగా ఉన్నారు, ఓదార్చారు, నడిపించారు. పడిపోయిన తనను మరల లేవనెత్తుతున్నారు. అలాగే మన బాధల సమయములో మనము ఒంటరి కాదు దేవుడు మనకు తోడుగా ఉంటారు.

  4. మనము విశ్వసించే దేవుడు, సమకూర్చే దేవుడు. ఏలీయా ప్రవక్త తన ప్రయాణములో తాను ఏమి తీసుకువెళ్లకపోయిన దేవుడు ఆహారము ఒసగుతున్నారు, సమకూరుస్తున్నారు.

రెండవ పఠనములో పౌలు గారు క్రీస్తునందు నూతన జీవితము గురించి బోధిస్తున్నారు. క్రీస్తుని అంగీకరించిన తరువాత, స్వీకరించిన తరువాత వారిలో కొత్త జీవితము ఉండాలి. ఆ జీవితములో పరస్పర ప్రేమ, దయ ఉండాలి. క్షమించుకునే మనస్సు ఉండాలి. అయన తన శరీర రక్తాలు మన కోసము ధారపోసి మరణించారు కాబట్టి ఆయనను మనలోకి ఆహ్వానించే సమయములో ఇలాంటి మంచి గుణాలు మనలోకి రావాలి. మొదటి పఠనములో చెప్పిన విధముగా రొట్టె స్వీకరించినప్పుడు మార్పు వచ్చిన విధముగా క్రీస్తుని శరీర రక్తాలు స్వీకరించినపుడు క్షమా, దయ, ప్రేమ అనేవి మనలో పుట్టాలి. మనము మారాలి. ప్రేమతో నడుచుకోవాలి. 

సువిశేషములో మరొకసారి దివ్యసత్ప్రసాదము గురించి చేసిన ప్రభోదం గురించి వింటున్నాము. యేసు ప్రభువు తాను పరలోకము నుండి దిగివచ్చిన ఆహారముగా అంటున్నారు. చాల మందికి అర్ధం కాని విషయం ఇది. ఎందుకంటే ఎలాగా ఒకరు పరలోకము నుండి దిగివస్తారని మానవ ఆలోచన. అందుకే వారు విశ్వసించలేదు. దేవుడిని విశ్వసించాలన్న, దేవుని యొక్క మాటలు అంగీకరించాలన్నా మనలో దేవుని యొక్క ఆత్మ ఉండాలి. దేవుని యొక్క ఆత్మకు మనము సహకరించాలి. యేసు ప్రభువు ఎన్నో అద్భుతాలు చేసారు. ఎవ్వరుకూడా చేయనటువంటి గొప్ప కార్యాలు చేసారు. అయినా సరే వారు అంగీకరించలేదు. ఎందుకంటే వారు ఆయనలో తప్పును మాత్రమే వెదికారు. కొందరు మాత్రమే ఆయనను రక్షకునిగా అంగీకరించారు. వారి హృదయాలు కఠినమైనవి. వారి విశ్వాసము కన్నా వారి తర్కము వారిని ఎక్కువగా ప్రభావితము చేసింది. దేవుని విషయాలు మనము విశ్వాసము ద్వారా అర్ధము చేసుకోవాలి. యేసు ప్రభువే జీవాహారము. మన ఆత్మలకు జీవము. మనయొక్క ఆత్మలను పోషించేవారు కాబట్టి ప్రభువును ఎపుడు స్వీకరించాలి.

దేవుని యొక్క దివ్య సత్ప్రసాదం స్వీకరించుట ద్వారా కలుగు ఆశీర్వాదాలు .

1.మనం నిత్య జీవం పొందుతాముద

2.దేవుని ఐక్యమై ఉంటాం (యోహాను 6 :57 )

3.మనకు ధైర్యం ఇస్తుంది

4.మనకు శక్తిని ఇస్తుంది

5.అనారోగ్యాలను బాగు చేస్తుంది

6.హృదయ పరివర్తనకు దారి తీస్తుంది

7.పరలోక ద్వారాలను తెరుస్తుంది

8.దేవుని యొక్క తోడునిస్తుంది.ఆమెన్

By Rev. Fr. Bala Yesu OCD

పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు...