15, అక్టోబర్ 2022, శనివారం

29వ సామాన్య ఆదివారం(2)

 

29 సామాన్య ఆదివారం

నిర్గమ 17:8-13

2 తిమోతి 3:14-4:2

లూకా 18 1-8

ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు ప్రార్ధన గురించి తెలియజేస్తున్నాయి. మన యొక్క ప్రార్థనలో పట్టుదల నమ్మకం స్థిరత్వం ఉండాలి అనే అంశాల గురించి ఈనాటి దివ్య పఠనాలు తెలుపుచున్నాయి.

ప్రతి ఒక్క మతంలో విశ్వాసులు అందరూ ప్రార్థిస్తారు. క్రైస్తవులమైన మనము రోజుకు అనేకసార్లు ప్రార్థిస్తాం. ఈనాడు ప్రత్యేకంగా మన యొక్క ప్రార్థన ఎలాగా ఉందో ధ్యానించుకుందాం.

ప్రార్థన అంటే దేవునితో సంభాషించుట అని పునీత అభిలాపరీతరేసమ్మ గారు తెలిపారు.

ప్రార్థన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దేవునితో ఐక్యమై జీవించుట. మానవులం దేవునికి మన యొక్క కష్టాలు బాధలు తెలుపుటకు ఉన్నా ఏకైక మార్గం ప్రార్థనయే.

సునీత అగస్తీను గారు ప్రార్థన గురించి మాట్లాడిన సందర్భంలో ఆయన విధంగా అన్నారు "మనిషి శరీరానికి ఆహారం ఎంత అవసరమో, హృదయానికి ప్రార్ధన అంతే అవసరం.

మదర్ తెరిసా గారు కూడా ప్రార్థన లేని జీవితం నిర్జీవీతో సమానం అని అన్నారు. అదేవిధంగా మనిషి బ్రతకటానికి ఆక్సిజన్ ఎంత అవసరమో ఆత్మ జీవించడానికి ప్రార్థన కూడా అంతే అవసరం.

మనం కూడా ప్రార్థన అవసరతను తెలుసుకొని ప్రార్థించాలి.

ప్రార్థన స్వస్థత చేకూర్చను

ప్రార్థన విజయమును తెచ్చాను

ప్రార్థన అద్భుతములను చేయును

ప్రార్థన రక్షణను ఇచ్చెను

ప్రార్థన మారుమనస్సును కలుగజేయును

ప్రార్థన మనలను దేవునితో ఒకటి చేయను.

ఈనాటి మొదటి పఠనం లో మోషే ప్రవక్త ఇశ్రాయేలు ప్రజల కొరకు చేసిన ప్రార్థన గురించి చదువుకున్నాం. అమెలేకు రాజు ఇశ్రాయేలు ప్రజల మీదకు దండెత్తి వచ్చినప్పుడు మోషే ప్రవక్త చేతులెత్తి దేవునికి ప్రార్ధన చేస్తున్నారు.

మోషే ప్రవక్త దండంతో ప్రార్థిస్తున్నారు. దండనము దేవుని యొక్క గొప్ప శక్తికి సూచకం.

దైవ దండముతోనే మోషే ప్రవక్త ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చేశారు. రాతి నుండి నీటిని పుట్టించారు. దైవ దండనముతో ప్రార్థిస్తే దేవుడు ఆలకిస్తారని మోషే ప్రవక్త గట్టిగా విశ్వసించారు.

మోషే ప్రవక్త రెండు చేతులెత్తి ప్రార్ధించినంతవరకు ఇశ్రాయేలు ప్రజలదే పైచేయి. మోషే ప్రవక్త ఇశ్రాయేలు ప్రజల తరఫున దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు.

తన యొక్క రెండు చేతులను పైకెత్తుట దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడుటను సూచిస్తుంది. దేవుని యొక్క శక్తిని నమ్ముకొని ఆయన తప్ప ఇంకొకరు మేలు చేయరని సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడితే మనలను ప్రభువు ఆశీర్వదిస్తారు. ఆయన చేతులను దించుట తన యొక్క బలహీనతను సూచిస్తుంది. అదే విధంగా తన యొక్క తక్కువ నమ్మకమును సూచిస్తుంది.మోషే ప్రవక్త దేవుని మీదనే ఆధారపడుట వలనే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు విజయమును దయ చేశారు.

మన జీవితంలో కూడా సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి జీవించాలి అందుకే ఏసుప్రభు నేర్పిన పరలోక ప్రార్థనలో మనో రోజు చెపుతూ ఉంటాం నానాతికి కావలసిన ఆహారము నేటికీ ఇవ్వమని ప్రతి నిత్యం కూడా దేవుని మేతనే ఆధారపడితే ఆయన తప్పక దీవిస్తారు. విజయం ద్వారా దేవుడు యెహోషువ విశ్వాసాన్ని బలపరుస్తూ దేవుడు ఇశ్రాయేలు ప్రజల తరఫున పోరాడతారని తెలియజేస్తున్నారు. విషయం ద్వారా ప్రభు ఇస్రాయేలు ప్రజల పట్ల విశ్వాసనీయుడుగా ఉండి వారిని రక్షిస్తారని వారి తరుపున పోరాడతారని తెలియజేస్తున్నారు. మోషే ప్రవక్త ఎంత కష్టమైనా సరే ప్రజల కొరకు ప్రార్ధించారు. మొదటి పఠనం ద్వారా మనం గ్రహించవలసిన ఇంకొక్క విషయం ఏమిటి అంటే మనం కూడా గురువులకు సహకరించాలి వారు చేసే పరిచర్యలో సహాయం చేయాలి

అహరోను, ఊరు అనే ఇద్దరు ప్రవక్త చేతులను పట్టుకొని వారు ప్రార్ధించుటకు సహకరించారు. ఆయన ప్రార్థన చేస్తే విజయం చేకూరుతుందని తెలుసుకున్నారు. కాబట్టి మోషే ప్రవక్తకు సహకరించాలి. విశ్వాసులపై దేవుని ఆశీర్వాదం రావాలంటే మనం కూడా గురువు ప్రార్థించుటకు పరిచర్య చేయుటకు సహకరించాలి. మోషే ప్రవక్త యొక్క ప్రార్థనలో పట్టు విడవటం లేదు అందుకే దేవుడు అతని ప్రార్థన ఆలకించారు. మన యొక్క ప్రార్థనలో కూడా మనం కష్టపడాలి. పునీత అవిలాపురి తెరేసమ్మ గారు అంటారు "ప్రార్థన, సుఖం ఎప్పుడూ కలిసి వెళ్ళవు అని". Prayer and comfort do not go together.

మోషే ప్రవక్త చేతులు నొప్పి వచ్చిన సరే ప్రార్థించారు మనం కూడా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించాలి కన్నీటి ప్రార్థన చేయాలి.

ఈనాటి రెండవ పఠనంలో తిమోతికి రాసిన లేఖ ద్వారా వాక్యం చదువుటలోనూ, ప్రార్థించుటలోనూ, ప్రకటించుటలోనూ, విశ్వసించుటలోను ఒక పట్టుదల కలిగి జీవించమని పౌలు గారు తెలుపుచున్నారు. తిమోతి ఒక దైవ సేవకుడిగా అన్ని సమయాలలో సత్కారములు చేయుటకు సిద్ధంగా ఉండమని తెలుపుతున్నారు. నేర్చుకున్న ప్రతి దైవ విషయమును బోధించుటకు సిద్ధంగా ఉండమని తెలుపుతున్నారు. పౌలు గారు తిమోతికి వాక్యమును ప్రతి సమయంలో అనుకూల సమయమందు ప్రతికూల సమయమందు బోధించమని తెలుపుచున్నారు. వాక్యము మనకు జ్ఞానమనిచ్చెను. అందుకే తిమోతిని దైవవాక్కును సహనముతో బోధించు అని తెలిపారు. అదేవిధంగా వాక్యం మనకు అనేక పరలోక సత్యములను నేర్పించును కాబట్టి వాక్కును సహనముతో బోధించు అని పౌలు గారు తిమోతికి తెలిపారు.

దైవ వాక్కు ప్రేరేపించి రాయబడినది కాబట్టి అది ఇతరులను ప్రేరేపిస్తుంది అందుకే ప్రజలను ఒప్పించుచు ప్రోత్సహించి వారి విశ్వాస ఎదుగుదలకు సహకరించమని తెలిపారు.

 ఈనాటి విశేష పఠనంలో వితంతువు యొక్క ప్రార్థన ద్వారా దేవుడు మనం నిరుత్సాహపడకుండా ప్రార్థించాలి అని తెలిపారు.

అనేకసార్లు మనం ప్రార్ధించినప్పుడు మనకు అనుగ్రహాలు దొరకకపోతే మనందరం కూడా ప్రార్థన చేయటం ఆపివేస్తాం. ప్రభువు ఉపమానం ద్వారా మనందరికీ తెలిపే అంశం ఏమిటంటే మనం ఎల్లప్పుడూ ప్రార్థించాలి. ఒక వితంతువు న్యాయాధిపతిని సంప్రదించి తనకు న్యాయం చేయమని పదేపదే అడిగింది. అన్యాయాధిపతి యూదుడు కాదు చిన్న చిన్న సమస్యలు మొత్తం కూడా వారి మధ్యన ఉన్న ఒక పెద్ద పరిష్కరించేవారు. ఒకవేళ న్యాయాధిపతి యూధుడైతే అతనితో పాటు ఇంకొక ముగ్గురు న్యాయాధిపతులు కూడా ఉండాలి. ఇతడు రోమీయుల వల్ల లేదా ఏరోజు చేత ఎన్నుకో బడిన న్యాయాధిపతి అందుకే అతడు ఎవరినీ లెక్క చేయటం లేదు. ఇలాంటి న్యాయాధిపతులు న్యాయం కోసం పోరాడే వారు కాదు. వారు ధనంకు ఆశపడేవారు అక్రమార్గములు ఎన్నుకునే వారు.

అతడు ఎంత చెడ్డవాడైనప్పటికీ ఏమే పదేపదే అడుగుతవలన ఆమెకు అతడు న్యాయం చేశాడు. వితంతువు పేదవారికి అదే విధంగా ఎవరైతే తమకోసం పోరాడుతారు వారికి ఒక సుమాత్రుక. ఆమె పేద వితంతువు ఎటువంటి ఆధారం లేదు కనీసం న్యాయాధిపతికి సొమ్ము ఇవ్వటానికి సైతం తన చెంత ఏమీ లేదు. ఆమెకు సమాజంలో ఎటువంటి అధికారం హక్కులు లేవు.ఆమె నిస్సహాయురాలు భర్త లేని వితంతువును ఆనాటి సమాజం గౌరవించడం సహాయం చేయడం తక్కువ. ఆమె శత్రువుల చేత హింసించబడేది అందుకే న్యాయం కోసం పోరాడుతుంది. వితంతువు యొక్క ప్రార్థనలో మనం కొన్ని విషయాలు గుర్తించాలి.

1. ప్రార్థన చేసేటప్పుడు పట్టుదల కలిగి ఉండాలి- ఆది 32:26.

యాకోబు దేవునితో కృస్తీ పట్టే సందర్భంలో నన్ను దీవిస్తే కానీ నీ చేయి వదలను అని అంటున్నాడు. అప్పటికే తన యొక్క తంటి విరిగిపోయినది అయినప్పటికీ ఆశీర్వదించమని పట్టుదలతో ప్రార్థించాడు. పౌలు గారు కూడా పట్టుదలతో ప్రార్థించమని కోరుచున్నారు - కొలోసి 4:2. వితంతువు కూడా పట్టుదలతోనే న్యాయాధిపతినే ప్రార్థించింది అందుకే అతడు దేవుడికి భయపడనప్పటికీని ఆయన ఈమెకు న్యాయం చేశారు.

2. ప్రార్థన చేసేటప్పుడు నమ్మకం ఉండాలి:

దేవుడు ఇస్తారని మనం నమ్మకం కలిగి జీవించాలి. కననీయ స్త్రీ క్రీస్తు ప్రభువును తన కుమార్తెకు స్వస్థత ఇవ్వమని విశ్వాసంతో ప్రార్ధించింది. ఆమె గొప్ప విశ్వాసం వల్లనే తన కుమార్తె దీవించబడింది. అదేవిధంగా వితంతువు కూడా న్యాయాధిపతి ఎడల విశ్వాసం కలిగి పదేపదే అడిగింది, న్యాయం ను పొందింది.

3. ప్రార్థించేటప్పుడు ప్రార్థనలో వినయం ఉండాలి:

తంతువు అనేకసార్లు న్యాయాధిపతి దగ్గరకు విసుగు చెందక వెళ్లి ప్రాదేయపడింది ఆమె ఇతడు కాకపోతే ఇంకొక వ్యక్తి న్యాయం చేస్తాడని వేరే వారి దగ్గరకు వెళ్ళలేదు. ఎంతో వినయంతో సహనంతో న్యాయాధిపతి దగ్గరకు వెళ్లి అడిగింది కాబట్టి ఆమె లాభం పొందింది.

మన యొక్క ప్రార్ధన దేవుడు వింటారు అనే నమ్మకం మనం ఎప్పుడూ కలిగి ఉండాలి - మార్కు 11:24.

విశ్వాసంతో యెహోషువ ప్రార్థిస్తే దేవుడు సూర్యాచంద్రులను సైతం ఆపివేశారు - యెహోషువ 10:12-13.

ప్రార్థనలో నిరుత్సాహ పడకూడదు. సునీత మౌనిక అగస్తీను గారి తల్లి నిరుత్సాహపడకుండా కుమారుడు భర్త మార్పు కోసం దాదాపు 16 సంవత్సరాలు ప్రార్ధించింది.

మనం సర్వదా ప్రార్థించాలి - రోమీ 12:12.

సదా ప్రార్థించమని పౌలు గారు తెలుపుచున్నారు- 1 తెస్స 5:17.

సువిశేషం ద్వారా ప్రభువు మనందరి ప్రార్ధన ఆలకిస్తాడని తెలుపుచున్నారు మనం కూడా దేవుడిని న్యాయపూరితంగా అడిగితే దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు అదే నమ్మకం కలిగి ఉండాలి. ప్రార్థన ఎప్పుడూ కూడా విడిచిపెట్టకూడదు. మన జీవితంలో దేవుడు మనకు న్యాయం చేస్తారు మన ప్రార్ధన ఆలకిస్తారు అనే నమ్మకం ఎల్లప్పుడూ మనలో ఉండాలి.

 BY. FR BALA YESU OCD 

31 వ సామాన్య ఆదివారము

31 వ సామాన్య ఆదివారము  ద్వితియెపదేశకాండము 6:2-6 హెబ్రీయులు 7:23-28 మార్కు 12:28-34             ప్రియా దేవుని బిడ్డలరా ఈ రోజు మనమందరము కూడా 3...