31, జులై 2021, శనివారం

18 వ సామాన్య ఆదివారం

18 వ సామాన్య ఆదివారం

నేనే జీవాహారము 

నిర్గమఖాండము;16 ;2 -4 , 12 -16 .

ఎఫెసీయులు;4 -17 , 20 -24 .

యోహాను;6 ; 24 -35 .


క్రీస్తు నాధుని యందు ప్రియా సహోదరి సహోదరులారా ఈనాడు మనం 18 వ సామాన్య ఆదివారం లోనికి ప్రవేశించియున్నాం.

ఈనాడు పఠనములు మనకు తెలియచేసేది ఏమిటంటే- మీరు అశాశ్వతమైన ఆహారం కోసంకాకుండా శాశ్వతమైన ఆహారం కోసం, మరియు శాశ్వత మైన వాటి కొరకు శ్రమించండి, అని బోధిస్తున్నాయి.

మొదటి పఠనంలో దేవుడు ఇశ్రాయేలీయులను పరీక్షిస్తున్నాడు, ఇశ్రాయేలీయులను దేవుడు ఐగుప్తు దేశము నుండి మోషే, అహరోనులతో నడిపించుకుని వస్తున్న సమయంలో వారు ఆకలికి తట్టుకోలేక, మేము ఐగుప్తు మంచిగా ఉండేది అని, యావే దేవుడిని మరియు ఆ మోషే, అహరోను ప్రవక్తలను నిందిస్తున్నారు. 

నిర్గమ: 16 : 11  వ వచనంలో చూసినట్లయితే, యావే ప్రభువు మోషే తో నేను ఇశ్రాయేలీయులు సణుగుకొనుట వింటిని కాబట్టి, ఇదిగో నేను ఆకాశము నుండి వారికీ  ఆహారం కురిపింతును అని చెప్పెను.

ఆవిధంగా యావే దేవుడు వారికీ మన్నాను మరియు పూరేలి పిట్టలను  వారికీ ఆహారంగా దయచేసాడు. కానీ వారు శారీరక ఆహారం కొరకు తపించుచున్నారు, దేవుని తెలుసుకోలేక పోతున్నారు.

రెండవ పఠనంలో పునీత పౌలుగారు ఈవిధంగా బోధిస్తున్నారు, మీరు మీ పూర్వ జీవితమును, స్వభావమును మార్చుకొనుడు. ఎందుకంటే మీ జీవితాలు మోసపూరితమైనవి, భ్రష్టుబట్టిపోయినవి. 23 వ వచనంలో చుస్తే మీ మనస్తత్వమును నూతనత్వము గావించుకొనుడు. నీతిని, పరిశుద్ధతను కలిగి కొత్త స్వభావమును ధరించండి, అని పౌలు గారు ఆ యొక్క ఎఫెసీ ప్రజలకు భోదించారు.

సువిశేష పఠనంలో చుస్తే ప్రజలు క్రీస్తు ప్రభువు యొద్దకు వచ్చారు. క్రీస్తు వారితో, మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందువలన నన్ను వెదకుచున్నారు, నా అద్భుత  కార్యములను చూసికాదు అని అన్నారు. అదే విధంగా ఆయన తన గొప్ప రహస్యాన్ని, వాగ్దధానాన్ని వారికిఇచ్చారు. అది ఏమిటంటే 27 వ వచనంలో మనం చూస్తున్నాం; మీరు అశాశ్వతమైన భోజనముకై శ్రమింపవలదు, నిత్య జీవితము చేకూర్చు శాశ్వత భోజనముకై శ్రమింపుడు, దానిని నేను మీకు ఒసగెదను.  

మనం గమనించినట్లయితే; క్రీస్తుప్రభుని ప్రజలు వెదకుచు వచ్చారు అని మనం వింటున్నాం. క్రీస్తుని వెంబడించిన  వారు 5 రకాల మనుషులు.

1 . తిండికోసం- భుక్తికోసం వెంబడించినవారు 

మత్తయి; 14 ; 13 -21 ( 5 రొట్టెలు 2 చేపలు )

మత్తయి ; 15 ; 32 -39 (7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు)

ఫిలి; 3 ; 19  వారి కడుపు వారికీ దేవుడు.

2 . రెండవ రకం 

అద్భుతములు చూసి వెంబడించారు.

మత్తయి; 11 ;21  అద్భుతాలు చూసారు కానీ నమ్మలేదు. 

3 . స్వస్థత కొరకు వెంబడించినవారు 

లూకా 17 ; 11 -19  పది మంది కుష్టురోగులు.

లూకా 11 ; 23 -26 దెయ్యముల నుండి  వెడలగొట్టబడినవారు.

4 . యేసు బోధనలను తప్పు పట్టడానికి  వెంబడించినవారు. 

లూకా20 ; 1 -8 శాస్త్రులు మరియు పరిసయ్యులు.

5 యేసుని మనస్ఫూర్తిగా నమ్మినవారు.

సమారియా స్త్రీ; యోహాను 4 : 6 -42 .

జక్కయ్య ; లూకా 19 ; 1 -10 .

క్రీస్తు ప్రభుని మనం మనస్ఫూర్తిగా విశ్వసించేవారిగా మనం ఉండాలి. మన దృష్టివలన కాకా విశ్వాసం వలన నడుచుకోవాలని క్రీస్తు మనకు తెలియాచేస్తున్నారు. 

క్రీస్తుప్రభువుని, ఆ నిత్యజీవితాన్ని, ఆ యొక్క శాశ్వత భోజనాన్ని మనం పొందాలంటే, మనం ఏమి చేయాలంటే, క్రీస్తుప్రభుని విశ్వసించాలి, విశ్వాసంతో జీవించాలి. విశ్వాసిగా మారి క్రీస్తులో ఐక్యం కావాలి. 

ప్రజలు దేవుడు ఇచ్చిన రొట్టెలను మాంసాలను చూశారేగాని దానిని ప్రసాదించిన దేవుడిని మాత్రం మరిచిపోయారు. 

కాబట్టి ప్రియా స్నేహితులారా, క్రీస్తుప్రభువు; నేనే జీవాహారమును, నన్ను భుజించువారు, నిత్య  జీవితమును పొందుతారు అని తెలియచేస్తున్నారు. క్రీస్తు ప్రభువు మత్తయి;6;31 లో చెబుతున్నారు, ముందు మీరు దేవుని రాజ్యాన్ని వెదకండి, అపుడు మీకు అన్ని అనుగ్రహించబడతాయి.

_బ్ర. సురేష్ కొలకలూరి

పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు...