తపస్సు కాల మొదటి వారం - గురువారం
ఎస్తేరు 9
మత్తయి 7:7-12
యేసు
తన శిష్యులతో ఇలా అంటున్నారు: "అడుగుడు మీ కొసగాబడును, వెదకుడు మీకు దొరుకును, తట్టుడు
మీకు తెరవబడును.
క్రీస్తు
నాధుని యందు సహోదర సహోదరీలారా, మనం ఏమి అడగాలి మరియు ఎలా అడగాలి అనేది ముఖ్య ప్రశ్న.
ఏమి వెతకాలి మరియు ఎక్కడ వెతకాలి; మనం ఎవరి తలుపు తట్టాలి మరియు ఏవిధంగా అని.
అడుగుడు మీ కొసగాబడును: ముందుగా
అడగడానికి,
●
మొదటగా, మనం
మన కొరతను గుర్తించాలి, మనకు లేనిది ఏమిటి లేదా మన జీవిత అవసరం ఏమిటి. అవసరాన్ని గుర్తించండి.
●
మనం అడగడం (సమాచారం,
సహాయం లేదా వస్తువు కావచ్చు) అనేది ఇతర వ్యక్తి ప్రమేయాన్ని సూచిస్తుంది. ఆ వ్యక్తిని గుర్తించండి
●
మనం అడిగే స్థితిలో
ఉన్నామనేడి వాస్తవం, కాబట్టి ఉత్తమమైన వైఖరితో (డిమాండ్ చేయడం లేదు, నియంత్రించడం లేదు)
- వినయ విధేయతలు
తో ఉండమని ప్రోత్సహిస్తుంది.
●
చివరగా, మనం
అవతలి వ్యక్తి యొక్క ప్రతిస్పందనను అంగీకరించాలి మరియు గుర్తించాలి.
అలాగే
మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా, అవసరాన్ని, వెలితి
గుర్తించండి; మనమే దీన్ని తీర్చుకోలేము
మరియు ఆజ్ఞాపించడం ద్వారా మరియు నియంత్రించడం ద్వారా పొందలేము కాబట్టి, మనం
ఆ వైఖరులను విడిచిపెట్టి, అడగడంలో వినయంగా మరియు ప్రతిస్పందించడంలో విధేయతతో ఉండాలి.
(సరైన రీతిలో అడగడం నేర్చుకోండి)
వెదకుడు మీకు దొరుకును:
మనం,
దేవుని అనుచరించే మరియు విశ్వసించే మనమందరం ఏమి వెతకాలి మరియు ఎక్కడ వెతకాలి. వెదకడం
అంటే ఎల్లప్పుడూ మనం కోల్పోయింది మాత్రమే కాదు.
మనం వెతకవలసినది దేవుడే. ఆయన చిత్తాన్ని వెదికినప్పుడు
ఆయన సన్నిధిని అనుభవిస్తారు. అని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియచేసింది, కీర్తన 34:10, "సింహపు పిల్లలు ఆహారము
దొరకక అలమటించును, కానీ ప్రభువును వెదకువారికి
అన్ని మేలులు దొరుకును". మరియు మత్తయి
6:33లో " మొదట అయన రాజ్యమును , నీతిని వెదకుడుఅప్పుడు అన్ని మీకు అనుగ్రహించు
బడును " అని చెప్పబడింది.
వెదకుటకు
ఒకరి పూర్తి శ్రద్ధ మరియు అవగాహన అవసరం. మన దృష్టిలో మార్చితే మనం దానిని కనుగొనే అవకాశం
లేదు. అందువల్ల ప్రాథమిక అవసరాలపై శ్రద్ధ చూపడం, మన అన్వేషణలో విధేయత చూపడం, ఎందుకంటే
మన వెదకుట అనే ప్రయాణంలో మనం ఊహించని విషయాలు కనుగొనే అవకాశం ఉంది. ఊహించనిది ఆశించండి.
తద్వారా మనం భగవంతుని మార్గాలకు అనువుగా ఉండడం నేర్చుకోవచ్చు.
తట్టుడు మీకు తెరువబడును
ఈ రోజుల్లో
మనం ఆన్‌లైన్‌లో చేసే ఆర్డర్‌లకు డోర్ డెలివరీ
సదుపాయం ఉంది, ఆర్డర్ వచ్చినప్పుడు తీసుకువచ్చే వ్యక్తి (కాల్స్) ఇంటి తలుపు తట్టడం (రింగ్
చేస్తారు). అతను కొన్ని సమయాల్లో పట్టుదలతో ఉంటాడు, తద్వారా మనము మా ప్యాకేజీని
అందుకునేలా అక్కడే ఉంటారు.
మనం
తట్టకపోతే, మనం తలుపు దగ్గర నిలబడి ఉన్నామని ఎవరికీ తెలియదు. తట్టకపోతే మనకు కావాల్సినవి
పొందలేము. కాబట్టి వాస్తవానికి మనకు అవసరమైన వాటిని స్వీకరించడానికి మనం సరైన తలుపును
నిరంతరం తట్టాలి. విశ్వాసంతో దేవుని తలుపు తట్టండి, తలుపు తెరవబడుతుంది మరియు మీ కోరికలు
నెరవేరుతాయి.
మరియు మొదటి పఠనంలో, జీవిస్తున్న దేవుని దయగల
తలుపును అడిగిన, కోరిన మరియు తట్టిన క్వీన్ ఎస్తేర్ వ్యక్తిలో మనకు సరైన ఉదాహరణ ఉంది.
సందర్భం:
పర్షియన్ రాజు అహష్వేరోషు మంత్రులందరిలో ముఖ్యుడైన
హామాను యూదు ప్రజల పట్ల అసూయ మరియు కోపంతో
ఉన్నాడు, కాబట్టి అతను వారందరినీ నాశనం చేయాలనుకున్నాడు. అతను యూదు ప్రజలందరినీ ఉరితీసి
నాశనం చేయమని రాజును ఒప్పించాడు.
ఈ భయంకరమైన మరియు తీరని పరిస్థితిలో ఆమె తన
ప్రజలకు అండగా నిలబడాలని నిర్ణయించుకుంది మరియు విధ్వంసం నుండి వారిని రక్షించమని రాజును
వేడుకోవాలను కుంది. రాజు ఆహ్వానం లేకుండా రాజుతో మాట్లాడటం ద్వారా తాను ఖచ్చితంగా మరణమే
అని ఆమెకు తెలుసు. అయినప్పటికీ, ఆమె తన ప్రజలను
నడిపించిన మరియు వారిని రక్షించే దేవుని శక్తి గురించి కూడా ఆమెకు తెలుసు. కాబట్టి ఆమె రాజును
సమీపించే ముందు ప్రార్థన చేసి ఉపవాసం ఉంది. ఎందుకంటే తనను మరియు తన ప్రజలను రక్షించగల
దేవుని శక్తిని ఆమె విశ్వసించింది/ ఆధారపడింది.
నిజమైన ప్రభావితురాలు/ స్ఫూర్తి నిచ్చు వ్యక్తి:
ఒక నిర్ణిత లేదా నిర్దిష్ట
స్థితిలో ఉండటం అంటే తనకు మరియు ఇతరులకు సంబందిచి బాధ్యత కలిగి ఉండటం.
ఒక విధంగా దేవుని ప్రణాళికలు ప్రకారం రాణి అయ్యింది. ఆమె తన నిరాశ మరియు దిక్కు తోచని సమయంలో ప్రభువు వైపు తిరిగింది మరియు భగవంతుడు
మాత్రమే చివరి ఆశ అని అర్థం చేసుకుంది. ఇది
అందమైన మరియు స్ఫూర్తి దాయకమైన ప్రార్థన. ఆమె దేవుని గొప్పతనాన్ని వ్యక్తపరిచింది,
యూద ప్రజలలో అతని అద్భుతమైన పనులను గుర్తుచేసుకుంది, వాటంతటికి కృతజ్ఞతలు తెలిపింది మరియు ప్రజల విశ్వాసం మరియు
విధేయత లేకపోవడాన్ని కూడా అంగీకరించింది. ఆమె మూడు రోజులు నిరంతరాయంగా ఈ విధంగా ప్రార్ధన
ఉపవాసం చేసింది మరియు ఈ గొప్ప ప్రయత్నంలో పాల్గొనమని తన ప్రజలందరినీ
ఆహ్వానించింది.
రాణి హోదాలో ఉన్న
కూడా, ఆమె ఆడంబరాన్ని, అహంకారాన్ని ప్రదర్శించలేదు
, వినయ హృదయంతో తన ప్రజల సంక్షేమం కోసం మాత్రమే
ప్రభువును ఆశ్రయించింది.
●
ఆమె ధైర్యం మరియు దైవ సలహా కోసం మాత్రమే అడిగింది
, సుఖాలు మరియు విలాసాల కాదు.
●
ఆమె మాటలు మరియు చేపట్టే పనికి శక్తినివ్వమని
దేవుడిని కోరింది.
●
ఆమె ప్రభువు నుండి మార్గదర్శకత్వం కోరింది.
●
యూద ప్రజల
రక్షణ కోసం ఆమె నిజమైన రక్షకుడి తలుపు తట్టింది.
ఆమె
ఆశీర్వదించబడింది మరియు అదే విధంగా ఆమె ప్రజలు
కూడా రాబోయే వినాశనం నుండి రక్షించబడ్డారు.
సువార్త
చివరి మాటల్లో యేసు చెప్పినట్లుగా, “ఇతరులు మీకు ఏమి చేయాలని మీరు కోరుకుంటున్నారో
అదే వారికి చేయండి. ఇదే ధర్మశాస్త్రం మరియు ప్రవక్తల ప్రబోధనలు."
ఆమె ప్రార్థనలోని కొన్ని ముఖ్యమైన అంశాలు
అడుగుట: ఆమె తన ఉన్న పరిస్థితిలో ధైర్యం, సలహా కోసం వినయంతో కోరింది
ఇద్దరి దగ్గర దేవుని దగ్గర మరియు రాజు దగ్గర కూడా. ఆమెకు తన
అవసరం తెలుసు మరియు తీర్చగల వ్యక్తి తెలుసు.
వెదకుట /అన్వేషణ : ప్రార్థన మరియు ఉపవాసం ద్వారా, దేవుని పట్ల మాత్రమే శ్రద్ధతో
ఆమె దేవుని చిత్తాన్ని మరియు రక్షణను కోరింది.
తట్టుట: ఆమె భయంకరమైన పరిస్థితిలో దేవుని తలుపు వద్ద. ఎందుకంటే ఆ పరిస్థితుల్లో
దేవుని తలుపు మాత్రమే తెరవబడుతుంది. దేవుడు మాత్రమే తన ప్రజలను రక్షించగలడు. ఆమె పట్టుదలతో
మరియు నమ్మకంగా ఉండేది.
అడుగు ప్రతివానికి లభించును, వెతకు ప్రతివానికి దొరుకును. తట్టు ప్రతివానికి
తెరవబడును
ప్రియమైన మిత్రులారా, ఈ తపస్సు
కాలంలో సరైన వైఖరితో అడగాలి మరియు సరైన స్థలంలో
వెతకాలి మరియు సరైన తలుపుతో తట్టాలి.