యేసు ప్రభువు బప్తిస్మము
యెషయా 42 :1 -4 , 6 - 7 , అపో 10 : 34 - 38 , లూకా 1 :7 -11
ఈ నాడు మనం క్రీస్తు ప్రభుని యొక్క బప్తిస్మమును కొనియాడుచున్నాము.
-ప్రభు బప్తిస్మమును తూర్పు చర్చీలలో (Eastern Churches) ఘనంగా కొనియాడుతారు. ఎందుకంటే పిత, పుత్ర, పవిత్రాత్మ మొట్ట మొదటిగా ప్రజలందరికి సాక్షాత్కరించిన ఒక గొప్ప సమయం.
-యేసు ప్రభువు యొక్క జ్ఞాన స్నానము ప్రభువు యొక్క సువార్తకు ప్రారంభము.
- జననస్నానము పొందినతరువాత ఆయన ఎడారికి వెళ్లి 40 రోజులు ఉపవాసం, ప్రార్థన చేస్తూ తండ్రియొక్క సమ్మతిని పొందిన తరువాత తన పరిచర్య సాగించారు.
- క్రిస్మస్ పండుగ దేవుడు తనకు తానుగా యూదులకు బయలుపరుచుకొన్న పండుగ.
-క్రీస్తు సాక్షాత్కార పండుగ, తన్ను తాను అన్యులకు బయలుపరుచుకొన్న పండుగ.
-క్రీస్తు జ్ఞానస్నానం దేవుడు తాను పాపులకు బయలుపరుచుకొన్న పండుగ. దీనితో క్రిస్మస్ కాలం ముగిస్తుంది.
యేసు దేవుని కుమారుడు, పాప రహితుడు, ఎలాంటి కళంకము లేనివారు, మరి అలాంటి వ్యక్తి ఎందుకు బప్తిస్మము పొందాలి?
-మనకు రక్షణ ఇవ్వడానికి ..
- అసలు బప్తిస్మము గురించి ఆలోచిస్తే వివిధ రకాల ఆలోచనలు మనకు మదిలోకి వస్తాయి.
- యేసు ప్రభువుకాని లేక బాప్తిస్మ యోహాను గారు కానీ జ్ఞానస్నానము స్థాపించలేదు.
- యూదా సాంప్రదాయంలో చాల సంవత్సరాల నుండి ఇలా నీటిలో మునిగి పాప క్షమాపణ కోసం, హృదయ శుద్ధి పొందటానికి పశ్చాత్తాప పడటానికి ఒక నీటి మడుగును (మికవెహ్) (mikveh) పరిశుద్ధపరుచుకొనుటకు వాడే వారు.
-మగవారు సబ్బాత్ సాయంకాలంలో స్నానం నీటి మడుగు వద్ద ఆధ్యాత్మిక శుద్ధికోసం, పాప క్షమాపనకోసం చేసేవారు.
-ఆడవారు పాప క్షమాపన కోసం నెలకొకసారి మికవెహ్ (mikveh) అనే మడుగు వద్ద స్నానంచేసేవారు.
-అలాగే ఎవరైతే యూదా మతంలోకి రావాలనుకుంటున్నారో వారు కూడా ఇలాంటి స్నానం తప్పనిసరిగా చేయాలి.
“Mikveh water is used as a means of spiritual cleansing, to remove spiritual impurity and sin”.
యేసు ప్రభువు ఎందుకు బప్తిస్మము పొందారు ?
ఒక సమాధానం ఏమిటంటే
- యేసు ప్రభువు తన తల్లిని, బంధువులను సంతృప్తి పరచడానికి, బప్తిస్మ యోహాను నుండి జ్ఞానస్నానము పొందారు.
- ప్రభువు యొక్క జ్ఞానస్నానము తాను పొందబోయే సిలువ శ్రమలను అలాగే రక్తంతో పొందబోయే జ్ఞానస్నానమునకు సూచనగా ఉంది.
-యేసుప్రభువు పాప రహితుడు అయినప్పటికీ తాను అందరితో సమానం అని చెప్పుటకు పాపులతో కలిసి జ్ఞానస్నానం పొందారు.
- యేసు ప్రభువు జ్ఞానస్నానం పొందినతరువాత తాను దేవుని కుమారుడని అంగీకార నిర్దారణ, పిత దేవుడు రుజువు చేస్తున్నారు.
- ఇతడు నా ప్రియమైన కుమారుడు ఇతనియందు నేను ఆనందించుచున్నాను. అని తండ్రి దేవుడు పలుకుచున్నారు.
- ఆదాము చేసిన పాపం వల్ల, మూసి వేయబడిన పరలోకరాజ్యం మరల తెరువబడింది. క్రీస్తు ప్రభువు రక్షణ కార్యం ప్రారంబించినప్పుడు పిత, పవిత్రాత్మ, వారి సంతోషాన్ని, సమ్మతిని వెల్లడి చేస్తున్నారు.ఇదే మాటలు మనం కీర్తన 2 : 7 లో అలాగే యెషయా 42: 1 లో వింటున్నాం.
-యేసు ప్రభువు యొక్క జ్ఞానస్నానం ద్వారా దేవుడు తన రక్షణ ప్రణాళికను ప్రారంబించారు.
జ్ఞానస్నానం పొందటం ద్వారా మనందరం దేవుని బిడ్డలమవుతున్నాం.
- జ్ఞానస్నానము అంటే హృదయ స్నానం చేయటం, స్నానం చేసిన తరువాత వ్యక్తి ఎలాగైతే శుభ్రంగా ఉంటాడో అలాగే జ్ఞానస్నానం పొందినతరువాత మనిషి యొక్క ఆత్మ కూడా శుద్ధిగా ఉంటుంది.
- ఆ పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలన్న, రక్షణ పొందాలన్న, మిగతా దివ్య సంస్కారాలు స్వీకరించాలన్న, జ్ఞానస్నానం తప్పక అవసరం.
-పేతురు గారు (1 పేతురు 3: 21) రక్షించేది జ్ఞానస్నానం అని పలికారు.
యేసు ప్రభువు యొక్క జ్ఞానస్నానములో మూడు ముఖ్యమైన విషయములు.
1. తండ్రి యొక్క ఆమోదం: యేసుప్రభువు తన పరిచర్య ఆరంబించుటకు ముందు ఆమోదం పొందిన క్రియ జ్ఞానస్నానం.
2. పవిత్రాత్మ సహకారం: పవిత్రాత్మ దేవుడు యేసుప్రభువు యొక్క అన్ని క్రియలలో తోడుగా వున్నారని తెలిపే క్రియ బప్తిస్మం.
3. లోక పాపములను తన మీద వేసుకొని జీవించి, మరణించి, రక్షణ నిచ్చే వారు అని తెలియ చేసే క్రియ.
జ్ఞానస్నానం ద్వారా వచ్చే ప్రయోజనాలు
1. దేవుని కుమారుని / కుమార్తె అంతస్తులో భాగస్తుల మవుతున్నాం.
2. దైవ సేవలో భాగస్తులగు చున్నాం. (రాజుగా, ప్రవక్తగా, యాజకునిగా మనలను ఆశీర్వదిస్తున్నారు).
3. పవిత్రాత్మను పొందుతున్నాం.
4. పవిత్ర పరచబడుతున్నాం.
5. దేవునియొక్క శక్తిని, అనుగ్రహాలను పొందుతున్నాం.
జ్ఞానస్నానం ద్వారా కలిగే లాభాలు :
రక్షణ - మార్కు 16:16
నిర్మలమైన మనసాక్షిని ఇస్తుంది – 1 పేతురు 3:21
క్రీస్తు మరణములో బాగస్తులమవుతాం - రోమియు 6:3
పునరుతనంలో పాలు పంచుకుంటాం - రోమియు 6: 4,5
పాప క్షమాపణ కలుగుతుంది- అపో 2:38
క్రీస్తును ధరించి ఉంటావు – గలతి 3:27
-జ్ఞానస్నానం దేవుడిచ్చిన ఆజ్ఞ -అపో 10: 44-48, మత్తయి 28:19-20.
-జ్ఞానస్నానం ద్వారా మనం నూతన సృష్టి గ మార్చబడుతున్నాం- 2 కొరింతి 5:17, యెషయా 3: 3, 5.
- మనం ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభించాలి.
- యొర్దాను నదిలో యేసు ప్రభువు జ్ఞానస్నానము పొంది నీటిని పవిత్ర పరిచారు. ఆ నీటి తో ఇప్పుడు అందరూ కూడా రక్షించ బడుతున్నారు, పాపక్షమాపణ గావించబడుతున్నారు.
1. నీరు జీవించుటకు అత్యవసరము అది లేకపోతె మరణిస్తాం. అలాగే జ్ఞానస్నానం లేకపోతే నిత్యా నరకాగ్నిలోకి పోతాం.
2. నీరు శుద్ధి చేయు విధంగా జ్ఞానస్నానం మన పాపాలను శుద్ధిచేస్తుంది.
3. బప్తిస్మం యేసు ప్రభువు యొక్క క్రొత్త జీవితానికి నాంది పలికిన విధంగా మనం కూడా క్రొత్త సువార్త పరిచర్య జీవితం ప్రారంభించాలి.
మనం వివిధ రకాలైన జ్ఞానస్నానాలు చూస్తున్నాం.
పెళ్లిళ్ల జ్ఞానస్నానం - పెళ్లిళ్ల కోసమై తీసుకుంటారు.
సర్టిఫీకేట్ జ్ఞానస్నానం - కాలేజ్ లో , స్కూల్ లలో స్తానం కోసం తీసుకుంటారు
జాబు జ్ఞానస్నానం - ఉద్యోగం కోసం జ్ఞానస్నానం తీసుకుంటారు.
స్వంత అవసరాలకోసం జ్ఞానస్నానం తీసుకుంటారు.
5. పేరు జ్ఞానస్నానం - అంటే పేరు పెట్టినప్పుడు నచ్చకపోతే వేరే పేరుకు జ్ఞానస్నానం తీసుకుంటారు.
- ఆనాడు యేసుప్రభువు జ్ఞానస్నానం పొందిన తరువాత తండ్రి, పవిత్రాత్మ దేవుడు సంతోషించారు. మరి ఈ రోజు మన జీవితాలు చుస్తే దేవుడు మన పట్ల సంతోషిస్తారా?
- యేసు ప్రభువు తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన విధంగా మనం దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నామా?
- యేసు ప్రభువు క్రొత్త సువార్త సేవ ప్రారంభించిన విధంగా మనం దేవుని యొక్క వాక్యాన్ని భోదిస్తున్నామా?
Rev. Fr. Bala Yesu OCD