22 వ సామాన్య ఆదివారం
ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు క్రైస్తవ విశ్వాస జీవితంలో ఉండవలసిన ఒక గొప్ప లక్షణం గురించి తెలియజేస్తున్నాయి అవి ఏమిటి అంటే 'వినయం' 'తగ్గింపుతనం'.
వినయం ఉంటే దేవుని యొక్క సహకారం, ఆశీర్వాదం మోప్పు ఎల్లప్పుడూ మనకు ఉంటాయి.
మనలో వినయం ఉన్నట్లయితే దేవుడు మనకు ప్రసాదించిన వరాలను ఇతరులతో కూడా పంచుకొని అందరితో సంతోషంగా జీవించగలుగుతాం.
చాలామంది జీవితాలలో తరచుగా చూచే అంశం ఏమిటంటే ఎవరైనా దినదినాభివృద్ధి చెందుతున్నారంటే వారి యొక్క సంపదలతో పాటు వారిలో అసూయ గర్వం స్వార్థం కూడా పెరుగుతుంటాయి అందుకే ఈనాటి దివ్య గ్రంథ పఠనాల ద్వారా ప్రభువు మనందరి ని హెచ్చరిస్తూ వినయంను అలవర్చుకొని జీవించమని పలుకుచున్నారు.
తండ్రి దేవుని యొక్క దీవెనలు పొందాలన్నా రక్షణ వాక్యాన్ని సొంతం చేసుకోవాలన్న ప్రతి ఒక్కరూ దేవుని ఎదుట దీనులుగా వినమ్రులుగా ఉండాలి.
ఈనాటి మొదటి పట్టణంలో రచయిత వినయమును అలవర్సుకోమని చెప్తున్నారు.
మనం పని చేయుటయందు వినయం కలిగి జీవించాలి మన యొక్క మానవ జీవితంను ఒక్కసారి పరిశీలన చేసుకొని చూస్తే చాలా విషయాలలో మనకు వినయం అవసరం ఎందుకంటే వినయం లేకపోవడం వలన శాంతి సమాధానాలు కొరతగా ఉంటున్నాయి.
మన యొక్క ప్రార్థనలో వినయం ఉండాలి
మన యొక్క చదువులలో వినయం ఉండాలి
మన యొక్క వ్యాపారంలో వినయం ఉండాలి
మన యొక్క మాటల్లో వినయం ఉండాలి
మన ఎదుగుదలలో వినయం ఉండాలి
కుటుంబ జీవితంలో వినయం ఉండాలి
మనం చేసే పనులన్నిటిలో వినయం ఉంటే మనం చాలా అభివృద్ధి చెందుతాం అదేవిధంగా దేవునికి ఇష్టమైన వారిగా జీవించవచ్చు.
వినయం ఉన్నవారు అందరి చేత ఆదరించబడతారు గర్వంగా ఉండే వారిని అందరూ దూరంగానే ఉంచుతారు వినయం ఉన్నవారు బహుమతులు ఇచ్చే సంపదలు కలిగిన ధనవంతులకన్నా మిన్నగా ఆదరించబడతారని తెలుపుచున్నారు రచయిత. వినయం కలిగిన వారికి దేవుడు తన యొక్క పరమ రహస్యములను బయలుపరుస్తారు. సిరా 3:19.
రచయిత అందరికీ ఇచ్చే ఒక సూచన ఏమిటంటే మనం ఎంత గొప్ప వాళ్ళమో అంత వినయవంతులు కావాలని తెలుపుచున్నారు అప్పుడే ప్రభువు మన్నను పొందుతావు అని చెబుతున్నారు.
ప్రకృతిలో చూసినట్లయితే మొక్కలు ఎంత పెద్ద వృక్షాలుగా మారినా అవి ఎప్పుడు వంగే /క్రిందకే ఉంటాయి కాబట్టి మన యొక్క ఆస్తి పాస్తులు వలన కానీ పేరు ప్రతిష్టల వలన కానీ అధికారం వలన కానీ మనం గర్వింపకూడదు అందుకే ఎంత ఎదిగినా ఒదిగి దీనతగా ఉండమని రచయిత పలుకుచున్నారు
ఈ లోకంలో ఎంతమంది గొప్పవారు ఉన్నా కేవలం వినయం కలిగిన వారు మాత్రమే దేవుని సంతృప్తి పరచగలరు.
పేరు ప్రసిద్ధులు జ్ఞానవంతులు ధనవంతులు కన్నా వినయాత్ములకే తన యొక్క రహస్యాలు ఎరిగిస్తారు. మనలో ఉన్న వినయం మనల్ని దేవునికి దగ్గరగా చేర్చుతుంది మన గర్వం మనలను దేవుని నుండి దూరం చేస్తుంది. యాకోబు 4:6, సామెత 3:34
మన యొక్క ఆది తల్లిదండ్రులు కేవలం గర్వం వలనే ఆ యొక్క చెట్టు పండును తిన్నారు దేవునికి విధేయత చూపకుండా దేవుడిలా మారాలి అనే స్వార్ధపు ఆలోచనతో సాతాను మాట ప్రకారం పాపం చేశారు దేవుని యెడల వినయం చూపుటకు బదులుగా గర్వమే వారిని తప్పు చేసేలా చేసింది. మన యొక్క గర్వమే మన యొక్క నాశనం కారణం పవిత్ర గ్రంథములో అనేకమంది గర్వం వలన దేవుని సహావసమును కోల్పోయారు. గర్వము వలన లూసీఫర్ సాతానుడిగా మారాడు దేవదూతగా ఉన్న అతడు దేవుని దగ్గర స్థానం కోల్పోయాడు. ఆహాబు రాజు గర్వము వలన దేవుని దీవెనలు కోల్పోయారు. హేరోదు రాజు గర్వము వల్లనే బాల యేసును చంపాలనుకున్నాడు. చాలామంది గర్వము వల్లనే రాజ్యాలు కోల్పోయారు కాబట్టి మనం జీవితంలో వినయమును అలవర్చుకోవాలి. పవిత్ర గ్రంథములో వినయాత్ములు చాలామంది ఉన్నారు మోషే అధిక నమ్రత గల ఒక మనుజుడు ఆయన యందున్న నమ్రత భూలోకమున ఎవరికి లేదు అని మోషే ప్రవక్త గురించి తెలిపారు. సంఖ్యా 12:3.
మరియ తల్లి వినమ్రతకు ఒక సుమాకృత.
ఏసుక్రీస్తు ప్రభువు అందరికీ ఒక సుమాకృత పిలిప్పి 2:6-11.
ఆయన దేవుడైనప్పటికిని తనను తాను తగ్గించుకొని ఒక మానవుని లాగా ఈ లోకానికి వేంచేశారు. వినయం కలిగి జీవించుట వలన యేసు క్రీస్తు ప్రభువు యొక్క నామం అన్ని నామముల కంటే ఘనమైనది అని పౌలు గారు తెలిపారు.
ఈనాటి రెండోవ పఠనం లో రచయిత పూర్వ నిబంధనలో ఉన్న దేవునికి అదే విధంగా నూతన నిబంధన గ్రంథములో ఉన్న దేవునికి మధ్య గల వ్యత్యాసం తెలుపుచున్నారు. పాత నిబంధన గ్రంథంలో దేవుడు అగ్నితో ప్రత్యక్షమై తన మహిమను వ్యక్తపరిచారు నూతన నిబంధన గ్రంధంలో యేసు ప్రభువు దేవుని యొక్క గొర్రె పిల్ల వలె జీవించారు ఆయన ఈ లోకంలో వినయం కలిగి అందరి మధ్య స్నేహభావంతో జీవించారు. ఏసుప్రభు తన యొక్క శ్రమలలో తండ్రి దేవునికి విధేయత వినయం కనబరిచారు. హెబ్రీ 2:5-18. మనం కూడా క్రీస్తు ప్రభువు వలె వినయం కలిగి జీవిస్తే దేవుడు మనలను ఉన్నతమైన స్థితికి చేర్చుతారు.
ఈనాటి విశేష పట్టణంలో యేసు ప్రభు వినయం గురించి అక్కడ ఎవరైతే ప్రధాన ఆసనంల కొరకు చూస్తున్నారు వారిని ఉద్దేశించి చెప్పారు.
ఏసుప్రభు ఒక పెండ్లి విందును ఆదర్శంగా
చేసుకొని అక్కడ ఉన్న వారందరికీ ఒక గొప్ప విషయం తెలుపుచున్నారు మన యొక్క జీవితంలో
మనం ఎంత గొప్ప వారం అయినా సరే గర్వంతో జీవింపక అనుకువ కలికి వినయంతో జీవించాలి.
పెండ్లి జరిగినప్పుడు కొంతమంది ఉన్నతులు ప్రధాన ఆసనాలను ఆశిస్తారు వారి యొక్క
గొప్పతనం ను చాటి చెప్పుటకు ముందుగానే వచ్చి మంచి మంచి స్థలాలలో కూర్చుంటారు.
మొదటి వారు కడపటి వారు అవుదురు కడపటి వారు మొదటి వారగుదురు అనే ప్రభువు అనేకసార్లు
పలికారు ఎందుకంటే గర్వంతో మేమే గొప్ప అని భావించేవారు ఎల్లప్పుడూ హేళనకు గురి
అవుతారు వినయంతో జీవించేవారు దేవుని మెప్పు పొందుతారు. పునీత ఫ్రాన్సిస్ గారు
అంటారు నేను దేవుని ముంగిట ఏమీ లేని వాడినే అంతయు నాకు దేవుడిచ్చారు కావున ఆయనకు
ఎల్లప్పుడూ కృతజ్ఞతా తెలుపుతూ వినయం కలిగి జీవిస్తాను అని అన్నారు. చాలామంది
పరిసయుల యొక్క మనస్తత్వం ఏమిటంటే వారు అందరి చేత ఆదరించబడాలి అని అందుకే పెద్ద
పెద్ద అంగీలు ధరిస్తారు ఇవన్నీ కూడా ప్రజల కంటబడుటకే కానీ వారు వినయ్ హృదయముతో అందరితో
కలిసిపోయే మనస్తత్వం కాదు వారి యొక్క గర్వం వలన తామే నీతిమంతులమని మిగతా అన్ని లో
పాపాత్ములు భావించేవారు. అందుకే ప్రభువు వినయం కలిగి జీవించమని తెలుపుచున్నారు
అన్నియు దేవుడే ఇచ్చారు అని ఆలోచన కలిగి జీవిస్తే మనం అనుకోవ కలిగి జీవి ఉంటాం.
దేవుడే అన్నియు వదిలిపెట్టి ఈ లోకంలో ఒక
సామాన్యమైన వ్యక్తిగా జీవించారు పాపాత్ముల మధ్య జీవించారు వారితో భుజించారు
అవమానాలు భరించారు శిష్యులు యొక్క పాదాలు కడిగారు ఒక దొంగవాని వలె సిలువను మోసి
సిలువ మీద మరణించారు. ప్రభువు తన వినయంను తండ్రికి చూపిస్తే మరి మనం దేవునికి వింత
వినయం చూపించాలి. పునీత ఆగస్తీను గారు అంటారు క్రైస్తవ పరిపూర్ణతకు వినయం అనేది
చాలా అవసరం ఆయన అంటారు మొదటిగా వినయం కావాలి రెండవదిగా వినయం కావాలి మూడవది కూడా
వినయం కావాలి అని తెలిపారు ఇంకా వినయం గురించి ప్రస్తావిస్తూ వినయం మానవులను దేవదూతలుగా
చేస్తుంది అని అన్నారు అలాగే గర్వం దేవదూతలను సైతం సైతానులుగా చేస్తుంది అని
పలికారు.
పునీత బర్నాడు గారు అంటారు వినియో మనుష్యులను ఉన్నత స్థానమున ఉంచుతుంది అలాగే గర్వం ఉన్నత శిఖరమున ఉన్న వారిని సైతం క్రిందకు పడవేస్తుంది. గర్వం నేనే గొప్ప అని భావిస్తుంది వినియో అనేది నా కన్నా మిగతావారు గొప్ప అని తెలుపుతుంది మనం దేవునికి దగ్గర అవ్వాలి అంటే వినయం కలిగి జీవించాలి. దేవుడు తన విందుకు మనలను పిలిచినప్పుడు మనలో గర్వం ఉండకూడదు.
పునీత గ్రేగారి గారు అంటారు నీవు ఎన్ని పుణ్యకార్యాలు చేసినప్పటికీ నీకు దేనత లేనీఎడల అంతయు ఎత్తని అని పలుకుతున్నారు. రెండవదిగా మనం విందు జరుపుకునే సమయంలో మనకు తిరిగి ఏమి ఇవ్వనటువంటి వారిని విందుకు పిలవాలి అని ప్రభువు పలుకుచున్నారు ఎందుకంటే మనం ఎంత గొప్పవారమై పేదవారిని పిలిస్తే అక్కడ మన యొక్క వినయం ప్రదర్శిస్తాం. మన యొక్క ఉదార స్వభావంతో పేదవారికి సహాయం చేసినట్లు ఉంటుంది వాస్తవానికి ఏమీ లేని వారిని విందుకు పిలవాలంటే అది ఒక పెద్ద సవాలు లాంటిది అందుకే ప్రభువు మనందరినీ కష్టతరమైన విషయాలు పాటించమని తెలుపుతున్నారు. పేదవారి యొక్క ఆకలి తీర్చుట ద్వారా అందరిలో మనం దైవాలను చూస్తున్నా దైవ సోదర ప్రేమలను ప్రదర్శిస్తున్నం. పౌలు గారు కఠినుడైనప్పటికిని క్రీస్తు ప్రభువును తెలుసుకున్నాక అని ఎంతో వినియో నేర్చుకున్నారు మనం కూడా క్రీస్తు విందులో పాల్గొని వినయంతో జీవించటానికి ప్రయాస పడదు వినయం ఉంటే అన్నిటిలో విజయం వస్తుంది మన యొక్క వినియం ద్వారా మనం అందరితో స్నేహ సంబంధం కలిగి జీవించవచ్చు వినయంను అలవర్చుకొని క్రీస్తు ప్రేమలో సోదర ప్రేమలో జీవించడం వినయం కష్టమైనా సరే ఇష్టంగా భావిస్తే అంతా తేలికగా ఉంటుంది కాబట్టి అందరూ తగ్గించుకొని జీవించి దేవుని చేత హెచ్చించబడధం.
ఫాదర్. బాల యేసు ఓ సి డి