పెంతుకోస్తు మహోత్సవం
అ. కా. 2 ;1-11
1 కొరింతి 2;3-7,12-13,
యోహాను 20;19-23
ఈరోజు తల్లి శ్రీసభ పెంతుకోస్తు పండుగను కొనియాడుతుంది. ఈరోజును వివిధ రకాలుగా పిలువవచ్చు . శ్రీసభ ప్రారంభమైన రోజు అని, పవిత్రాత్మ శిష్యుల పై వేంచేసి వచ్చిన రోజు అని క్రీస్తునందునికి సాక్షులుగా జీవించమని కోరిన పండుగ.
Pentecost అనే మాట గ్రీకు నుంచి వచ్చింది. గ్రీకు భాషలో దీనిని Pentekoste అంటారు. అనగా 50 వ రోజు అని అర్ధం.
పాస్కా పండుగ అయిన 50 రోజుల తరువాత జరుపుకునే ఒక విలువైన పండుగ. క్రీస్తు ప్రభు యొక్క పునరుత్తానం అయిన 50 రోజులకు క్రైస్తవులు భక్తి విశ్వాసంతో జరుపుకునే పండుగ ఇది.
ఈ పండుగను యూదులు కృతజ్ఞత పండుగగా జరుపుకునే వారు. దేవుడు ఇచ్చిన పంటలకు గాను కృతజ్ఞత తెలుపుతూ దేవుని యొక్క గొప్ప కార్యాలు తలుచుకొని చేసే పండుగ ఇది .
ఈరోజు తల్లి శ్రీసభ పుట్టిన రోజు ఎందుకంటే పవిత్రాత్మ శక్తిని పొందుకున్న తరువాతనే శిష్యులు భహిరంగ సువార్త ప్రకటన చేశారు. దేవుని యొక్క ఆత్మను స్వీకరించిన అపోస్తులు భయం విడనాడి దేవుని యొక్క రక్షణ ప్రణాళికను కొనసాగించారు. యేసు ప్రభు శిష్యులకు వాగ్దానం చేసిన విధంగా ఆదరణ కర్తను వారి చెంతకు పంపించారు. మనందరికీ పవిత్రాత్మ రాకడ ఎంతగానో ఎన్నో విధాలుగా సహాయం చేస్తుంది.
ఈనాటి మొదటి పఠనములో పవిత్రాత్మ సర్వేశ్వరుడు అపోస్తుల మీదకి వేంచేసిన విధానాన్ని చదువుకుంటున్నం మరియతల్లి శిష్యులందరు ఒక గదిలో వుండగా ప్రార్ధించే సమయంలో పవిత్రాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చారు.
అప్పటివరకు వరకు భయంతో వున్నారు ప్రాణాలు అరచేతులో పెట్టుకొని జీవించారు కానీ ఎప్పుడైతే పవిత్రాత్మను స్వీకరించారో వారి జీవితములే మారిపోతున్నాయి . బలహీనులు బలవంతులు అవుతున్నారు భయంతో వున్నవారు ధైర్యవంతులు అగుచున్నారు .
పవిత్రాత్మ అగ్నిజ్వాలలు రూపంలో శిష్యుల మీదకి దిగివచ్చారు. యెరుషలేములో సువార్త ప్రారంభించిన సమయంలో అక్కడ దాదాపు 16 భాషలు మాట్లాడేవారు ఉన్నారు. వారందరు కూడాప్రవచనాలు వారి యొక్క సొంత భాషలోనే వింటున్నారు ఇది కేవలం పవిత్రాత్మ యొక్క పనియే .(అపో 2 ;9 -10 ).
బాబెలు గోపురం వల్ల పలు భాషల అడ్డు గోడలు కూలి పోయాయి .దీని ద్వారా యేసు ప్రభు సందేశం అందరికి చెందింది దానిని అందరు అర్ధం చేసుకుంటారు అని తెలుస్తుంది అన్నీ భాషలో దేనువుని సందేశం వింటున్నారు అంటే ఎన్నుకొన్న జాతి , ప్రజా ,అంటూ ప్రత్యకంగా లేరు అందరూ కూడా దేవుందని ప్రజలే దేవుని రాజ్యంలోకి నడరు పిలువా పడినవారు ఎవరు కూడా ప్రత్యకంగా నియమింప పడిన వారు కాదు అందరు కూడా దేవుని యొక్క సొంత ప్రజలే .
పవిత్రాత్మను స్వేకరించి తరువాతనే శిష్యులు సాక్షులుగా మరి తమ యొక్క ప్రాణాలు సైతం దేవునికి ఇవ్వాలి అనుకున్నారు .పెంతుకోస్తు పండుగ పాత నిబంధన గ్రంధంలో కూడా చూస్తుంటం పాత పెంతుకోస్తు పండుగకు క్రొత్త పెంతుకోస్తు పండుగకు దెగ్గర సంభందం ఉంది .
పాత పెంతుకోస్తు పండుగ సీనాయి పర్వతము దగ్గర దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను సూచిస్తుంది .ప్రభు సినాయ్ పర్వతం పైకి వేంచేసి వచ్చినపుడు ఆ పర్వతం మీద ఉరుములు మెరుపులు మేఘాలలో యెహువె దేవుడు శిష్యులమీదకి దిగి వచ్చారు . (నిర్గమ 19 ;16 -18 )
నూతన నిబంధన గ్రధంలో కూడా శిష్యులమీదకి పవిత్రాత్మ వేంచేసినపుడు బలమైన గాలులు వచ్చాయి .పవిత్రాత్మను పవిత్ర గ్రంధంలో వివిధ చిహ్నాలతో పోల్చుతారు.
-అగ్నితో
- పావురంతో
- గాలితో
- నీటితో
గ్రీకు భాషలో ఉపిరికి ఆత్మకు ఒకే పదాన్ని ఉపయోగించారు ఊపిరి దేవుని ఆత్మకు గుర్తు దేవుని జీవానికి గుర్తు. దేవుడు మట్టితో చేసిన మానవ రూపంలోకి తన జీవం ఊది తొలి మానవ వ్యక్తిని సృష్టించి క్రొత్త జీవితాన్ని ప్రసాదించాడు పవిత్రాత్మ అనే శ్వాసనుది క్రొత్త జీవితం ప్రసాదించారు.
పవిత్రాత్మను అగ్నితో పోలుస్తారు అగ్ని దేవుని స సాన్నిదికి గుర్తు అగ్ని అని తనలాగా మార్చుకుంటుంది అలాగే పవిత్రాత్మ అందర్నీ తనలాగా మార్చుకుంటుంది అగ్ని దహించును అలాగే పవిత్రాత్మ మన పాపాలను దహించి మనకు పవిత్రాత్మను దయచేస్తుంది.
అగ్ని క్రొత్త జీవాన్ని పుట్టిస్తుంది, రగిలించుకుంటుంది. పవిత్రాత్మ కూడా శిష్యులలో క్రొత్త జీవాన్ని పుట్టించారు. అప్పటివరకు భయంతో మరణించిన వారిలో క్రొత్తజీవం నింపారు.
అగ్ని వెలుగును ఇస్తుంది దరి చూపుతుంది అదే విధంగా పవిత్రాత్మ దేవుడు శిష్యుల యొక్క అంధకారం అనే అజ్ఞానం తొలగించి దేవా జ్ఞానం అనే వెలుగును నింపారు .
పవిత్రాత్మ శిష్యులకు దారి చూపించారు ఎటుయైపు వెళ్ళి సువార్తను ప్రకటన చేయాలో తెలిపారు .
రెండొవ పఠనంలో పౌలు గారు ఆత్మ స్వభావం గురుంచి తెలిపారు
1 .ఆత్మ అందర్నీ ఒకే సమాజంగా ఐక్యపరుస్తుంది
ఆత్మ ప్రత్యేక అనుగ్రహాలను దయచేస్తారు. వాటిని అందరూ పొందుకుంటారు.
౩ ఆత్మ పరిచర్యకు ఎన్నుకొంటుంది సేవకు వారిని పంపిస్తారు
జ్ఞానస్నానం పొందిన ప్రతి ఒక్కరు సువార్త సేవకు అర్హులే.
పవిత్రాత్మ దేవుడు మనందరినీ క్రీస్తు శరీరంలో ఐక్యపరచి మనలను ముందుకు నడిపిస్తారు.
సువార్త పఠనంలో కూడా యేసు ప్రభువు శిష్యులకు పవిత్రాత్మను ఒసగి వారిలో ధైర్యం నింపుచున్నారు. వారిలో క్రొత్త జీవం దయ చేశారు. ప్రపంచమంతటా తిరిగి సువార్త సేవచేయుటకు వారిని పంపిస్తున్నారు.
ఈరోజు పవిత్రాత్మ దేవుని పండుగ కాబట్టి పవిత్రాత్మ చేసే వివిధ పనుల గురించి ధ్యానిద్దాం.
1 . పవిత్రాత్మ మనకు సహాయం చేస్తారు - రోమా 8 : 26
2 . పవిత్రాత్మ మనల్ని నడిపిస్తారు - యోహాను 16 : 13
3 . పవిత్రాత్మ మనకు బోధిస్తారు - యోహాను 14 : 26
4 . పవిత్రాత్మ మనతో మాట్లాడతారు - దర్శన 2 : 7
5 . పవిత్రాత్మ మనకు బయలు పరుస్తారు - 1 కొరింతి 2 : 10
6 . పవిత్రాత్మ మనకు సూచనలిస్తారు - అ. కా. 8 : 29
7 . పవిత్రాత్మ క్రీస్తుకు సాక్షమిస్తారు - యోహాను 15 : 26
8 . పవిత్రాత్మ మనల్ని శాంతి పరుస్తారు - అ. కా. 9 : 31
9 . పవిత్రాత్మ మనల్ని పిలుస్తారు - అ. కా. 13 : 2
10 . పవిత్రాత్మ మనలను దైవంతో నింపుతారు - అ. కా. 4 : 31
11 . పవిత్రాత్మ మనల్ని బలపరుస్తారు - ఎఫెసీ ౩: 16
12 . పవిత్రాత్మ మనకోసం ప్రార్ధిస్తారు - రోమా 8 : 26
13 . పవిత్రాత్మ మన ద్వారా సువార్త పరిచర్య చేస్తారు - 2 పేతురు 1 : 21
14 . పవిత్రాత్మ సత్యంకు సాక్ష్యమిస్తారు - రోమా 9 : 1
15 . పవిత్రాత్మ మనకు ఆనందం దయచేస్తారు - 1 తెస్స 1 : 6
16 . పవిత్రాత్మ మనకు స్వేచ్ఛనిస్తారు - 2 కొరింతి 3 : 17
17 . పవిత్రాత్మ విధేయించుటకు సహకరిస్తారు - 1 పేతురు 1 : 22
18 . పవిత్రాత్మ మనల్ని క్రీస్తు చెంతకు నడిపిస్తారు - దర్శన 22 : 17
19 . పవిత్రాత్మ మన జీవితాలను మార్చుతారు - 2 కొరింతి 3 : 18
20 . పవిత్రాత్మ మనలో జీవిస్తారు - 1 కొరింతి 3 : 16
పవిత్రాత్మ మనకు స్వేచ్ఛ నిస్తారు - రోమా 8: 32
పవిత్రాత్మ మనలను నుతనికరిస్తారు - తీతు 3: 5
పవిత్రాత్మ మనలో ఆత్మీయ ఫలములను దయచేస్తారు - గలతి5:22-23
పవిత్రాత్మ మనకు వరాలు దయచేస్తారు - 1 కొరింతి 12:8-10
పవిత్రాత్మ మనల్ని ముందుకు తీసుకొనివెళ్తారు - రోమా 8:14
పవిత్రాత్మ మనల్ని నిరపరాధులు చేస్తారు - యోహాను 16:8
పవిత్రాత్మ మనల్ని పవిత్ర పరుస్తారు - 2 తెస్స 2:13
పవిత్రాత్మ మనల్ని ధృడంగా ఉండేలా చేస్తారు - అ. కా. 1:8
పవిత్రాత్మ మనల్ని ఐక్య పరుస్తారు - ఎఫెసీ 4:3- 4
పవిత్రాత్మ మన మీద దేవుని ముద్ర వేస్తారు - ఎఫేసి 1:13
పవిత్రాత్మ మనల్ని తండ్రి చెంతకు నడిపిస్తారు - ఎఫేసి 2:18
పవిత్రాత్మ మనకు సహనం దయచేస్తారు - గలతి 5:5
పవిత్రాత్మ సైతాను శక్తులను పారద్రోలుతారు
పవిత్రాత్మ దేవుడు మనకు అనేక విధాలుగా దీవెనలు ఒసగుతుంటారు. మనం కూడా పవిత్రాత్మను పొందినవారం కాబట్టి సువార్త సేవ చేస్తూ దేవుని ప్రేమను పంచుదాం.
పవిత్రాత్మ దేవుని యొక్క పాత్ర:
పవిత్రాత్మ దేవుడు మనందరినీ దేవుని నివాస స్ధలం చేశారు. మన హృదయంలో ఉండేలాగా చేస్తారు. కొరింతి మనందరికీ శక్తిని ఇస్తారు. ఈలోక శక్తులను ఎదుర్కొని ముందుకు సాగుటకు, సైతాను శక్తులను అధిగమించుటకు అదే విధంగా దేవునికి సాక్షులై ఉండుటకు దేవుడు వారికి శక్తిని దయచేస్తారు.
పవిత్రాత్మ దేవుడు మనల్ని పవిత్ర పరుస్తారు. దివ్య సంస్కారాలు స్వీకరించుట ద్వారా మనల్ని పవిత్రపరుస్తారు.
- జ్ఞానస్నానం ద్వారా మనల్ని దేవుని బిడ్డలుగా చేస్తారు.
- భద్రమైన అభ్యంగనం ద్వారా దేవునితో మరియు పొరుగువారితో సఖ్యపడేలా చేస్తారు.
- దివ్య సత్ప్రసాదం ద్వారా ఆధ్యాత్మిక భోజనం దయచేస్తారు.
-గురుపట్టాభిషేకం మరియు వివాహం ద్వారా మనల్ని పవిత్రపరుస్తారు.
దేవుని విషయాలు బోధించి మనల్ని పరలోకానికి చేర్చుతారు.
మన యొక్క బాధలను వింటారు. మనకు ఊరటను దయచేస్తారు. మన యొక్క ప్రార్ధనలు వింటారు, మనల్ని ప్రార్ధించేలా చేస్తారు.
మనకి వరాలిచ్చి, ఫలాలను ఇచ్చి మనందరికీ కర్తవ్యం గురించి తెలుపుతారు.
Rev. Fr. Bala Yesu OCD