26 వ సామాన్య ఆదివారం(3)
క్రీస్తు నాధునియందు ప్రియమైన స్నేహితులారా, ఈ నాడు మనము ఇరవైఆరొవ సామాన్య ఆధివారంలోనికి ప్రవేశించియున్నాము .తల్లి శ్రీసభ మనకు ఇచిన్నటువంటి పఠనములను గ్రహించినట్లయితే, మొదటి పఠనములోతండ్రిఐన యావే దేవుడు తన ఆత్మను డెబ్భై మంది పెద్దలకు ఇచ్చుటను ఇచ్చినతరువాత వారు ప్రవచనములు పలుకునట్లును మనము చూస్తున్నాము.
రెండవ పఠనములో చూచినట్లై ఐతే యాకోబు గారు భాగ్యవంతులను హెచ్చరించుటను దేవునివైపుకు ఆహ్వానించడాన్ని మనము చూస్తున్నాము.సువిశేష పఠనము మనము గ్రహించినట్లు ఐతే క్రీస్తుని అనుసరింపని ఒక్కడు, క్రీస్తు పేరా దయ్యములను పారద్రోలుటను వింటున్నాము. అదేవిధంగా ప్రభువైన క్రిస్తుమాటలను కూడా మనము వింటున్నాము, అవి ఏమి మాటలు అంటే పాపమునుడి వైదొలగమని నరకములో పురుగు చావదు అగ్నిఆరదు అనే మాటలను వింటున్నాము.
క్రిస్తునాధునియందు ప్రియమైన స్నేహితులారా పరిశుద్ధ గ్రంథ పఠనాల ద్వారా తండ్రి దేవుడు, మరియి కుమారుడైన క్రీస్తు, మరియు శిష్యుడును దైవభక్తుడును ఐన యాకోబుగారు, మనకు హెచ్చరికను తెలియ చేస్తున్నారు .ఆ హెచ్చరిక ఏమిటంటే పాపము చేయకు లోకమును అనుసరింపకు వీటిద్వారా దేవుని శిక్షకు గురికాకు అని మనలను హెచ్చరిస్తున్నారు.
ప్రియమైన దేవుని బిడ్డలారా ,మొదటి పఠనములో మనము చూస్తున్నాము మోషే ప్రవక్త యెహోషువ యొక్క అసూయను గమనించి ఆ ప్రజలకోసమై దేవుని ఆత్మా కొరకు మాట్లాడటం .అసూయా అనేది కూడా పాపమే అసూయా వలన మనము ఇతరులను నిందిస్తాము, తక్కువ చూపు చూస్తాము వారు మంచిగావుంటే ఇష్టపడము మనకంటే తక్కువగా వుండాలని,మన అంతటివారు కాకూడాదని ,మనలా ఉండ కూడాదని అసూయా పడతాము ఎందుకు అంటే వారు మనకన్నా ఒక గొప్ప స్థాయి లోఉండుటచే .ప్రియమైన స్నేహితులారా అసూయా అనేది ఒక గోరమైన పాపం ఈ అసూయా వలన మోషే తన శిశుడైన యెహోషువను సరిచేయుటను మనం చూస్తున్నాం అసూయా అనే పదాన్ని గలతీయులకు రాసిన లేఖలో 5 వ ఆద్యం 20 వ వచనములో మనం చూస్తున్నాం అన్ని వర్గాలకు అడ్డా అసూయా ఒక సారీ దాని ఊబిలో పడితే జీవితం ఇక పతనమే. అనూహ్యంగా అసహ్యంగా మన నోటి వెంట ఏమాట రాదు అసూయా మనహృదయంలో నాటుకు పోతే తప్ప.
నేడు సమాజములో వృత్తిలో కానీ ఏరంగములోనైనా ఇది ఉంది అది లేదు అని చెప్పా వచ్చుగాని అసూయా లేదు అని చెప్పలేము.అసూయా అనేది చాల భయంకరమైనది ఎముకల్లో పుటిన కుళ్ళు అని బైబిల్ గ్రంధం మనకుసెలవిస్తోంది .బైబిల్ లు చరిత్రలో మొట్టమొతటి హత్యా అసూయా వలననే జరిగింది (ఆది:4 :8 -9) అసూయకలిగిన కొందరువేక్తులను మనం గుర్తుచేకుందాం కాయిను అసూయా వలన తన తమ్ముడైన ఆబేలు మృతికి కారకుడై శిక్షకు గురయ్యాడు ,రాహేలు అసూయా చెందింది తన అక్క లేయా గర్భము దాల్చుటవలన యేసేపు సోదరులు అసూయా చెందారు . అసూయా ఆయుషును తగ్గించును (సామె:14 :౩౦) లో మనము చూస్తున్నాము ఇశ్రాయేలు పెద్దలు అహరోను మోషే సోదరి మిరియం మోషే మీద
అసూయా పడ్డారు {సంఖ్య 12 }యువకుడైన దావీదుని చూసి ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు సౌలు అసూయపడ్డాడు .[1 సమువేలు 18 ]
ఈనాటి మొదటి పఠనములో యెహోషువ ఇశ్రాయేలు డెబ్భై మంది పెద్దలలో ఇద్దరు పెద్దలైనా ఎల్దదు ,మేదాదు అను వారి పై అసూయా చెందటం మనము చుస్తున్నాము.[సంఖ్య 11 :29] లో చూస్తున్నాము .మోషే వృధాప్యంలో నాయకుడిగా తన కర్తవ్యాన్ని నెరవేర్చడం కష్టమైంది .అప్పుడు మోషే దేవునికి ప్రాదించి సహాయం అడిగినప్పుడు మోషేకి సహాయంగా డెబ్బది మంది పెద్దలను అనుకోని వారి సహాయంతో ప్రజలను నడిపించామన్నాడు ప్రభుఆవిధముగా మోషే డెబ్బది మంది పెద్దలను ఎన్నుకున్నాడు వారిని ప్రార్ధన గుడారములోనికి తీసుకోమనివెళ్ళి ప్రార్ధించాడు పవిత్రాత్మబలం వారిమీదికి దిగివచ్చింది.
ఇది తెలిసిన యెహోషువ మోషే దగ్గరికి వీళ్ళు వారిద్దరిమీద ఫిరియాదు చేస్తాడు వారిద్దరూ ప్రార్ధన గుడారములోనికి రాలేదు కాబ్బట్టి వారు ప్రవచనం చెప్పడానికి విలేద్దన్నాడక్రీస్తు నాధునియందు ప్రియమైన స్నేహితులారా వారములనిచ్చువాడు ఒక దేవుడు పాలురకములైన వరములను కుమ్మరిస్తాడు అని {1 కొరింథీయులు12వ మద్యంలోచూస్తున్నాము}.ఆవిధముగానే డెబ్బదిమంది ప్రవచించే వరము కలిగియున్నారు .మొదటి పఠనములో మోషే అన్నటున్నారు దైవప్రజలందరు ప్రవక్తలుగా తయారుకావలెను ,వారి అందరియందు దేవుని ఆత్మ ఉండవలయును అని నా కోరిక అని [సంఖ్య 11 ;25 -29 ]అని పలికాడు.
అసూయా వలన పొందిన వారముఏదీలేదుగాని దేవునికి దూరమవుతాముప్రియామైన స్నేహితులారా మొదటిపఠనములో మనంచూసినట్లుగా ప్రభు ఆత్మ ఆవహించినవారు ధన్యులు దేవుని సేవకులు వివిధ పరిచరియాలలో నిమగ్నమై వుంటారు .వారు ప్రవచనములు పలుకుతారు అద్భుతకార్యములు చేస్తారు దుష్ట శక్తులను పారద్రోలుతారు నిజమైన సేవకులు వారు ఏమి చేసిన అది దేవుని మహిమ కొరకు మాత్రమే చేస్తారు వరములను ఈచు దేవుడు ఒక దేవుడు పాలురకములైన వరములను పవిత్రాత్మచే ఇస్తాడు ప్రవచించే వారము,స్వస్థపరిచే వారము అర్ధము చేసుకునే వారము భాషలు మాట్లాడే వారము .{కొరింథీయులు 12 }లో చూస్తున్నాము ఈ విధముగా మొదటి పెద్దలకి ప్రవచించే వరాన్ని అనుగ్రహిచారు.
ఈనాటి సువిశేషంలో క్రీస్తుప్రభుతో శిష్యుడైన యోహాన్ గారు అంటునారు మనలని అనుసరిపనివాడు మీ పేరిట దయ్యములను పారద్రోలుతున్నాడు అని అన్నారు ఇక్కడ శిష్యుని యొక్క అసూయను మనం చూస్తున్నాం.ప్రియా దేవుని బిడ్డలారా నిజానికి దుష్టాత్మలు ప్రభుని నిజమైన నామానికి మాత్రమే భయ పడతాయి .పైన మొదటి పఠనములో మనము చూస్తున్నట్లుగా ,ప్రవచనాలు పలికేవారు దుష్టాత్మలను వెడలగొటేవారు చాలా ప్రవిత్రముగా దేవునిలో అంట్టుగట్టబడి పరిశుద్ధమైన మలినంలేని జీవితం జీవిస్తారు ఈ శువిశేషములో దయ్యములను పారద్రోలువారుగూర్చిశిషులు అసూయా పాడగాప్రభు వారిని మందలించారు గమినించవలిసిన విష్యం ఏమనగా ఆధ్యాత్మిక, సామజిక, సంగిక ,రాజకీయ ,మొదలైన వివిధ రంగాలలో అసూయా అనేది సహజంగానే కనిపిస్తుంది .అయితే సహజంగా వ్యక్తులలో చోటుచేసుకున్న దేవుని దృష్టిలో సహించరానిది.
అందుకే ప్రభు అంటున్నారు మీరు అసూయా పరులుకాగూడదు {రోమా :12 :11 } అంటూ బైబిల్ గ్రoదములో సెలవిస్తున్నారు . అసూయా పడక మంచిని అభివృదిని అభినందిస్తూ జీవించడం మంచి క్రైస్తవుడు యొక్క లక్షణం గురుతించుకోవాలి .మన విరోధికానివాడు మన పక్షమున ఉండువాడు మార్కు శుభవార్త తొమ్మిదో వాద్యము నేలపై వచనంలో చూస్తున్నాము మంచి చేయు ప్రతివాడు ప్రభువుతో ఉండును .ఆ వ్యక్తి వేరుగా ప్రభువును అనుసరించక పోయినప్పటికీ ప్రభువు అనుచరుడే.శిష్యులకు ప్రభువు రెండు విషయాలను నేర్పించాడు .1 .శిష్యులకు ఇతరులకు మధ్యన గోడలునిర్మించరాదు .క్రీస్తు నామములో మంచికార్యాలను చేయు ప్రతివారినీ శిష్యులుగా స్వీకరించాలి 2 .శిష్యులు అసూయను ద్వేషమును జయించాలి సత్యాన్వేషణ చేయాలి .
దేవుని వాక్య ప్రకటన అనేది పవిత్రాత్మ వరం మనమందరం దేవుని ప్రవక్తలము కనుక దేవుని వాక్కుని ప్రకటించాలి .దైవ రాజ్య స్థాపనకై పాటుపడాలి .పవిత్రాత్మనందు మనమందరము ఒకే సంఘము మనము దైవసంగము ,మనలోవున్న స్వార్ధని అసూయను ద్వేషాన్ని వీడి అందరితో సఖ్యతగా జీవించాలి ఇతరులను ఆలకించాలి అందరిని గౌరవించాలి కాబట్టి మనజీవిత ప్రయాణములో మార్పుచెందిన వారముగా జీవించాలి మంచిపనులు చేసే ప్రతిఒక్కరు కూడా దేవుని రాజ్యంలోకి అర్హులు. క్రైస్తవులమైన మనము అసూయా ద్వారా ఇతరులమనసులను ఇబ్బందిపెట్టకుండా ఐక్యత కల్గి ప్రేమతో ఆదరించాలి .నిన్ను నిన్నునీవు ప్రేమించినట్లు ని పొరుగువారికి కూడా ప్రేమించాలి. అదేవిధముగా పరలోక రాజ్యం చెర గొప్ప భాగ్యాన్ని దయచేయమని ఈ దివ్యబలిలో ప్రార్ధన చేసుకుందాము ఆమెన్ .
బ్రదర్ .మనోజ్ చౌటపల్లి ఓ .సి. డి