18, మార్చి 2023, శనివారం

 తపస్సు కాల నాలుగవ ఆదివారం

1 సమూ 16:1,6-7,10-13

ఎఫేసి 5:8-14

యోహాను 9:1-41

ఈనాటి ఆదివారమును "ఆనందించు ఆదివారం" అని పిలుస్తారు, ఎందుకంటే ప్రభువు యొక్క పునరుద్దాన గడియలు ఆసన్నమవుతున్నాయి కాబట్టి, ఈ నాటి  గ్రంథ పఠనాలు దేవుడు మనకు ప్రసాదించు వెలుగు గురించి తెలియజేస్తున్నాయి, మనకు ఆయన కేవలం శారీరక వెలుగును మాత్రమే కాక ఆధ్యాత్మిక వెలుగును కలుగజేసి మనల్ని మంచి వైపుకు నడిపిస్తారు అనే అంశం తెలియజేస్తున్నారు.

ఈనాటి మొదటి పఠనం లో  దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా దావీదును ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఎన్నుకొనుటను చదువుకుంటున్నాం.

సమూయేలు ప్రవక్త చివరి న్యాయాధిపతి, ఆయన యొక్క జీవితకాలం చివరి సమయంలో తన తరువాత సమూయేలు ఇశ్రాయేలు 12 గోత్రాల వారిని ఒకటిగా చేసి దేవుని యొక్క సందేశమును అందించేలా ప్రయత్నించాడు, కానీ ఇశ్రాయేలు ప్రజలు వారి వల్ల సంతృప్తి చెందలేదు, అందుకని వారు దేవుడిని ఒక రాజు కావాలని సమూయేలు ప్రవక్త ద్వారా అడిగారు.

ప్రజల యొక్క కోరిక మీదగా యావే దేవుడు సౌలును ఇశ్రాయేలుకు రాజుగా నియమించారు. సౌలు రాజును దేవుడు ఇశ్రాయేలుకు మొదటి రాజుగా నియమించారు, వాస్తవానికి యావే దేవుడు మాత్రమే నిజమైన రాజు, ఆయన్ను తిరస్కరించి మానవ మాతృణ్ణి రాజుగా ప్రజల కోరిక మీద బలంగా ధైర్యంగా ఎత్తైన వాడిని దేవుడు రాజుగా నియమించాడు, అయితే దేవుడు సౌలు జీవితం చూసి సంతృప్తి చెందలేదు.

సౌలును దేవుడు ఆమెలికేయులు  మీద యుద్ధం చేసి అంతయు నాశనం చేయమని చెప్పినప్పుడు సౌలు దేవుని యొక్క మాటను ధిక్కరించాడు - 1 సమూ 15:3,8-9 సౌలు అమలేకీయుల రాజు "అగాగును"అదేవిధంగా క్రొవ్విన ఎడ్లను, దూడలను, గొర్రెలను, గొర్రె పిల్లలను మంచివి మిగులుచుకున్నాడు, అందుకే దేవుణ్ణి  నిరాకరించారు. ఆయన రాజుగా నియమించినందుకు దేవుడు విచారించారు.

సమూయేలు సౌలు చేసిన పనికి దుఃఖించే సందర్భంలో యావే  దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మరొక కొత్త రాజును ఎన్నుకొనదలిచాడు, అందుకనే బెత్లెహేములో ఉన్న ఇషాయి కుమారుల వద్దకు సమూహేలును దేవుడు పంపించారు సమూయేలు ఇషాయి యొక్క కుమారులను చూసినప్పుడు వారి యొక్క శరీరాకృతి బట్టి, వరుస క్రమమును బట్టి, ఎత్తును బట్టి ఎన్ను కనక దేవుని చిత్తము ప్రకారం దేవునికి ఇష్టమైన వ్యక్తిని ఎన్నుకున్నారు.

అందుకని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా అంటారు, నేను నరుడు చూసిన దృష్టితో చూడను అని - యెషయా  55:8-9, 1 సమూ 16,7.

సమూయేలు మొదట్లో ఒక్కొక్కరి ఆకారంను, ఎత్తు ప్రకారంగా ఎన్నుకోవాలనుకున్నారు. వారిని అందరిని దేవుడు నిరాకరించి చిన్న కుమారుడైన దావీదును ఎన్నుకున్నాడు. అందరి యొక్క ఆలోచనలకు భిన్నంగా దేవుడు దావీదును ఎన్నుకున్నాడు, దావీదు యొక్క ఎన్నిక చాలా గొప్పది ఎందుకంటే ఒక సామాన్యమైన గొర్రెల కాపరిని దేవుడు అనేక మందికి రాజుగా నియమిస్తున్నారు. ప్రజలు ఎవరు చూడని గొప్పతనం యావే  దేవుడు దావీదులో చూశారు అందుకే ఆయన్ని అభిషేకించమని తెలిపారు.

దావీదు తన యొక్క పనిలో నిమగ్నమైన సమయంలోనే దేవుడు అతడిని ఎన్నుకుంటున్నారు. పవిత్ర గ్రంథంలో కూడా చాలా టుకి పనిచేసే సమయంలోనే దేవుడు వారిని తన సేవకై అనుకుంటున్నారు.

1. మోషే సినాయి పర్వతము వద్ద గొర్రెలు మేపే సందర్భంలో దైవ పిలుపు స్వీకరించాడు - నిర్గమా 3:1-4

2. మత్తయిని సుంకం వసూలు చేసే సందర్భంలో పిలిచారు - మత్తయి 9:13

3. పేతురు, అంద్రియ, యోహాను, యాకోబులను వలలు శుభ్రం చేసే సందర్భంలో పిలిచారు ఎన్నుకొన్నారు - మత్తయి 4:18-22

4. సౌలును మస్కు వెళ్లే సందర్భంలో పిలిచారు తన యొక్క పని నిమిత్తమై వెళ్లే సందర్భంలో పిలిచారు - అపో 9

5. దావీదును కూడా గొర్రెలు మేపుకునే  సందర్భంలో ఎన్నుకుంటున్నారు - 1సమూ 16:11

ప్రతి ఎన్నిక దేవుని యొక్క చిత్తానుసారంగా ఉంటుంది, ఆయన పిలిచారు, ఎన్నుకొన్నారు. స్వయంగా ఆయనే  కావాలని భావించి సమూయేలు చేత అభిషేకించారు. దావీదు తన యొక్క కుటుంబంలో అంతా తక్కువగా పరిగణించబడే వ్యక్తి, అందుకే కేవలం ఆయన ఒక్కడే గొర్రెలు కాయడానికి పలమునకు వెళ్ళాడు మిగతా వారందరూ ఇంటివద్దె ఉన్నారు, దావీదు ఎన్నిక విషయంలో ఈ వాక్యం నిజం. ఇల్లు కట్టు వారు పనికిరాదని పారవేయ బడినరాయి మూలరాయి అయినది - కీర్తన 118:15-27.

కుటుంబంలో ఉన్న వారి దృష్టిలో చిన్నవాడు అంతా పనికిరాని వాడని భావించినప్పటికీ దేవుడు మాత్రము అలాంటి వ్యక్తిని ఎన్నుకున్నారు. మొదటి రాజును ఎన్నుకునే సందర్భంలో దేవుడు ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా వారికి ఎలాంటి వాడు కావాలో ఆయనే ఎన్నుకున్నాడు - 1సమూ 9:2 కానీ ఆ రాజు దేవుని సంతృప్తి పరచలేదు కనుక రెండవ రాజును దేవుడు తనకు ఇష్టమైన రాజును ఎన్నుకున్నారు.

దావీదు యొక్క హృదయమును ప్రభువు చూస్తున్నారు, ఆయన యొక్క ధైర్యమును త్యాగపూరితమైన జీవితంను అలాగే ఆయన యొక్క నడిపింపును చూసిన దేవుడు దావీదును రాజుగా నియమిస్తున్నారు. ఒక కాపరిగా దావీదుకు సహనం, ప్రేమ కూడా ఎక్కువ అందుకే ఆయన్ను ఎన్నుకుంటున్నాడు, దేవుని యొక్క అభిషేకం ఎంతటి బలహీనులనైనా వారిని సైతం బలవంతులను చేస్తుంది, అభిషేకం ద్వారా దేవుని యొక్క ఆత్మ దావీదులో ప్రవేశించి అతని శక్తివంతునిగా చేస్తుంది. దావీదు ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు అనేక యుద్ధాలలో విజయంన్ని దయచేసి దేవుని యొక్క అభిషేకం ప్రత్యేకమైనది అది మానవుల యొక్క ఆలోచనలకు భిన్నంగా ఉంటుంది, దావీదు ఇశ్రాయేలు ప్రజలను 12 గోత్రాల వారిని తన పరిపాలనలో ఐక్యం చేశారు మనం కూడా ఎదుట వారిలో ఉండే మంచితనంను వారి యొక్క హృదయం నే చోడాలి అంతేగాని బయట కనిపించే వారి యొక్క ప్రవక్త కాదు ఎందుకంటే బయటకు చాలామంది మంచిగా ఉన్నట్లు నటిస్తారు కాబట్టి కనపడేదే కాకుండా హృదయం ను చూసి జీవించాలి.

ఈనాటి రెండవ పఠనం లో  పౌలు గారు ఎఫెసులో ఉన్న క్రైస్తవులను వెలుగుకు సంబంధించిన ప్రజలు వలే జీవింపమని కోరుచున్నారు, ప్రభువు నందు జ్ఞాన స్నానం పొందినంతవరకు వారు అందరూ అంధకారంలో జీవించిన వారే కానీ జ్ఞాన స్నానంతో క్రీస్తు ప్రభువు వెలుగును పొంది ఉన్నారు కాబట్టి ఆయన వలె నీతివంతమైన జీవితంను జీవించాలి.

వారి యొక్క పాపపు  క్రియల ద్వారా చీకటిలో జీవించారు, కానీ ఇప్పుడు వెలుగు పుత్రి పుత్రికలుగా జీవించమని తెలిపారు. వెలుగు పుత్రికలుగా అంటే దేవుని యొక్క చిత్తంకు అనుగుణంగా జీవించాలి, మంచితనం కలిగి ఉండాలి, చీకటి ఎన్నటికీని వెలుగును పారత్రోల లేదు, కానీ వెలుగు చీకటిని పారద్రోలుతుంది కాబట్టి మనందరం కూడా మేల్కొని మంచి కార్యములు చేయుటకు ప్రయత్నించాలి ఈ లోకంలో యేసు ప్రభువు చెప్పిన మాట ప్రకారం మనం జీవిస్తే వెలుగు ప్రకారంగా జీవించిన వారమవుతాం.

 ఏ విధంగా మనం వెలుగు నందు జీవించగలుగుతాం అంటే:

1. దేవుని విశ్వసించుట ద్వారా మనం అంధకారంలో ఉండక వెలుగులో జీవిస్తాం - రోమి 1:22-23

2. దైవవాక్కును తెలుసుకున్నట్టు ద్వారా విశ్వాసులు అంధకారం గాక వెలుగులో ఉంటారు - 2 కొరింతీ 4:4,1  కొరింథి 1:18

ప్రభువును గుర్తించలేకపోవడం ద్వారా ఆయన శిలువ యొక్క ఔనత్వం గమనించలేకపోవటం ద్వారా ఇంకా ప్రజల అంధకారంలోనే ఉంటున్నారు.

3. దేవుని యొక్క నీతిని పాటించుట ద్వారా వెలుగులో జీవించవచ్చు - రోమి 13:12-14

4. సత్యం ను పాటించుట ద్వారా వెలుగులో జీవించవచ్చు.

5. శోధనలకు లొంగిపోకుండా జీవించినప్పుడు మన వెలుగులో జీవించవచ్చు.

6. పాపమును విడిచి క్రీస్తు ప్రభువుని అనుసరించినప్పుడు వెలుగులో జీవించవచ్చు.

ఈనాటి సువిశేష పట్టణంలో యేసు ప్రభువు పుట్టు గ్రుడ్డివానికి దృష్టిని ప్రసాదించిన విధానంను చదువుకుంటున్నాం.  యేసుప్రభు పర్ణశాలల పండుగ నిమిత్తమై ఎరుషలేము చేరారు ఈ పండుగ ఎనిమిది రోజుల పండుగ - యోహాను 7:10.

ఏసుప్రభు యెరూషలేములో ఉన్న సందర్భంలో తానే ఈ లోకమునకు వెలుగు అని బోధించారు. నన్ను వెంబడించే వారు చీకటిలో నడవక వెలుగును పొందుతారు అని ప్రభువు పలుకుచున్నారు- యోహాను 8:12.

ఏసుప్రభు వెళ్లే దారి గుండా  ఒక కుటుంబాన్ని చూశారు ప్రభు ఆయన్ను చూసి సానుభూతిని వెల్లడిస్తున్నారు అందుకనే ఆయనకు సహాయం చేయాలనుకున్నారు శిష్యులు కూడా ఈ గ్రుడ్డివాని యొక్క విషయంలో ప్రత్యేకమైన ఆసక్తిని కనబరిచారు.

గ్రుడ్డివాని విషయంలో ప్రభువుని శిష్యులు ఆయన యొక్క అధికారంకు ఎవరూ కారణం అని అడుగుచున్నారు. అప్పటి ప్రజల యొక్క నమ్మకం ఏమిటంటే ఒక వ్యక్తి కష్టాల పాలయ్యేది వారి యొక్క పాపాల వల్లనే అనే అంశమును గట్టిగానే అమ్మేవారు, ఆయన పాపాల వల్ల కానీ ఆయన తల్లిదండ్రుల పాపాల వల్ల గాని అతడు ఎంతటి దురదృష్టకరమైన స్థితికి చేరుకున్నాడు అనే శిష్యులు అతని ఎడల కనికరం కలిగి ఉన్నారు. ఏసుప్రభు పలికిన సమాధానం ఏమిటంటే ఎవరి పాపాలు ఇతని శిక్షకు కారణం కాదు కేవలం దేవుని మహిమా ఇతని యందు భయపడుటకై అతడు గ్రుడ్డి వానిగా  జన్మించాడు అన్నారు.

ఒక వ్యక్తి బాధలు కష్టాలు, అనారోగ్యాలు అనుభవించేది దేవుని మహిమను ప్రభువు వెల్లడి చేయుటకు దేవుని సానుభూతి చూపుటకు దేవుని శక్తి తెలియజేయుటకు దేవుడు ప్రతి ఒక్కరి కష్టాలలో తోడుగా ఉంటారని తెలుపుటకు నమ్మకం లేని వారికి కూడా నమ్మకం కలిగించుటకు అందుకే కొందరు అర్థం కాని విధంగా జీవితంలో బాధలు అనుభవిస్తారు అది అంతయు దేవుని మహిమ కొరకే.

లూక 13:1-9,5:18-20,యాకోబు 5:14-15 దేవుని మహిమ కొరకు బాధలు మరణం అనుభవించిన వారు చాలామంది ఉన్నారు.

ఎవరి యొక్క బాధలు కష్టాలు, శాశ్వతం కాదు అందుకు నిదర్శనం ఈనాటి సువిశేషం అతని యొక్క అంధకార జీవితం మొత్తం కొనసాగించబడలేదు, ఆయన ఈ లోకంలో కష్టపడుతున్నాడు కాబట్టి దేవుడు అతనికి మేలు చేస్తున్నారు.

ఈ గ్రుడ్డివాని విషయంలో యేసు ప్రభువే ఎక్కువ చొరవ ఆసక్తి తీసుకుంటున్నారు. ఆయన వద్దకు వెళ్లి ఆయన్ని స్వస్థత పరుస్తున్నారు అందుకే ప్రభువు ఈ లోకానికి వచ్చారు - లుకా 19:10,1 పేతురు 5:7.

ఏసుక్రీస్తు ఈ లోకమునకు వెలుగై  ఉన్నారు, ఎవరైతే అధికారం నుండి బయటకు రావాలనుకుంటున్నారు వారు క్రీస్తు ప్రభువు చెంతకు రావాలి- యోహాను 1:4, 8:12. ఏసుప్రభువుతో సంభాషించిన గ్రుడ్డివానికి ప్రభువు వెలుగును ప్రసాదించారు.

ఏసుప్రభు సాధారణంగా స్వస్థపరిచేటప్పుడు మాట ద్వారా చాలామందిని స్వస్థపరిచారు, కానీ ఇతడి విషయంలో మాటను ఉపయోగించలేదు క్రియలు చేస్తున్నారు అవి ఏమిటంటే:

1. ఆయన కనులను త్రాగుచున్నారు

2. ఉమ్మిని వినియోగిస్తున్నారు

3. మట్టిని ఉమ్మిని కలిసి అతని కళ్ళకు అద్దుతున్నారు

ఈ విధంగా ప్రభువు ఎందుకు చేస్తున్నారంటే అప్పటి ప్రజల యొక్క విశ్వాసం ఏమిటంటే పవిత్రమైన వ్యక్తుల యొక్క ఉమ్మిలో దైవ శక్తి దాగి ఉన్నదని వారి యొక్క విశ్వాసం, అతని యొక్క విశ్వాసంను బలపరచడం కోసం ప్రభువు ఈ విధంగా చేశారు మట్టిని ఎందుకు వినియోగించారంటే మట్టితో దేవుడు క్రొత్తమనిషిని చేశారు, అలాగే ఈ గ్రుడ్డివానికి కూడా దేవుడు క్రొత్త  జీవితం ప్రసాదించారు ఇక ఆయన ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం లేదు ఇక బిక్షం ఎత్తుకోనవసరం లేదు అందరి చేత నిందలు భరించనవసరం లేదు స్వేచ్ఛ స్వతంత్రునిగా జీవించవచ్చు.

ఏసుప్రభు గ్రుడ్డివానిని శిలోయము కోనేటి వద్దకు పంపిస్తున్నారు శిలోయము అంటేనే పంపుట అని అర్థం అంటే మెస్సయ్య పంపబడిన విధంగా ఇతడు కూడా నీటి వద్దకు పంపబడ్డాడు దేవునికి విధేయత చూపుతూ అతడు నీటి వద్దకు వెళ్లాడు కావున అతడు స్వస్థత పొందాడు.

గ్రుడ్డివాడు స్వస్థత పొందిన తరువాత ఆయన యొక్క శారీరక అంధకారము మాత్రమే కాదు తొలగినది ఆధ్యాత్మిక అంధకారం కూడా తొలగిపోయినది. ఎందుకంటే ఆయన మొదటి ఏసుప్రభువును ఒక సాధారణ వ్యక్తి గానే పరిగణించాడు తరువాత ఆయన్ను ప్రవక్త అని గుర్తించాడు అటు తరువాత ఏసు ప్రభువును మెస్సయ్య అని మనుష్య కుమారుడని గుర్తించాడు ఆయనను స్వస్థత పరిచే దేవునిగా విముక్తిని చేసే దేవునిగా గుర్తించాడు కొంతమంది పరిసయ్యులు గ్రుడ్డివాడు విశ్రాంతి దినమున స్వస్థత పొందుట సహించలేకపోయారు దానికి తోడుగా అతన్ని అతని తల్లిదండ్రులను అనేక ప్రశ్నలు అడుగుచున్నారు వారు సోదర స్వస్థత కన్నా నియమములకే ఎక్కువగా ప్రాధాన్యత నిచ్చే జీవించారు చివరికి స్వస్థత పొందిన వాడినే వెలివేస్తున్నారు.

పరిసయులకు యేసు ప్రభువు చేసిన గొప్ప కార్యం చూచుటకు వారి యొక్క కన్నులను తెరువలేదు గ్రుడ్డివారికి దృష్టితనం చేస్తే మెచ్చుకోవడానికి బదులుగా  విశ్రాంతి దినం పాటించలేదని ఆయన మీద నిందారోపణ చేశారు పరిసయులలో మానవత్వం తగ్గిపోయింది తాము ఇంకా మోషే యొక్క శిష్యులు అని కపిట జీవితం జీవనంను గడుపుచున్నారు ఈ అంధుడు  ఏసుప్రభువు దేవుని దగ్గర నుండి వచ్చిన వాడిని గుర్తించాడు - యోహాను 9:31

దేవుడు పాపులను ఆలకించడని నీతిమంతుల ప్రార్ధన ద్వారా దేవుడు స్వస్థత నిస్తాడని భావించాడు. ప్రభువుని ఆరాధించారు, ప్రభువు మంచితనంను చాటి చెబుతున్నాడు పరిసయ్యులు ఎదుటి వ్యక్తిలో ఉన్న మంచితనం ను చూడలేకపోయారు. మనం కూడా చాలా సందర్భాలలో అంతులమే:

1. పాప జీవితం జీవిస్తూ అంధకారంలో ఉంటున్నాం

2. దేవుని వెంబడించకుండా అంధకారంలో జీవిస్తున్నాము

3. ఎదుటివారిలో మంచితనం చూడలేకపోతున్నాం

4. ఎదుటివారిని ప్రేమను చూడలేకపోతున్నాం

5. ఎదుటివారి కష్టంను చూడలేకున్నాం

6. ఎదుటివారి యొక్క అవసరాలు చూడకుండా అంధకారంలో ఉన్నాము

ఈ విధంగా చాలా సందర్భాలలో మనం అంధకారం లో  ఉన్న వారమే, కాబట్టి దేవుని వెలుగు పొందుతూ వెలుగులో జీవించుదాం.


FR. BALAYESU OCD

11వ సామాన్య ఆదివారం

11వ సామాన్య ఆదివారం  యెహెజ్కేలు17:22-24, 1 కొరింతి 5:6-10, మార్కు 4:26-34 ఈనాటి పరిశుద్ధ గ్రంధ పఠణములు దేవుని యొక్క రాజ్య విస్తరణ గురించి బో...