21 వ సామాన్య ఆదివారం
హెబ్రీ 12 : 5 - 7 ,11 - 13
లూకా 13 : 22 - 30
ఈ నాటి దివ్య పఠనాలు దేవుని రక్షణ గురించి తెలియచేస్తున్నాయి రక్షణ పొందుటకు అందరు అర్హులేనా లేక కొందరు మాత్రమేనా అనే అంశమును గురించి ఈ పఠనాలు బోధిస్తున్నాయి.
ఈ నాటి మొదటి పఠనంలో యెషయా ప్రవక్త యొక్క ప్రవచనాలు తెలియచేయబడ్డాయి.
యెషయా ప్రవక్త అందరు కూడా రక్షించబడతారు అని ప్రవచిస్తున్నారు దాదాపు 47 సంవత్సరాల సుదీర్ఘ బానిస జీవితం గడిపిన ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేముకు తిరిగి వచ్చినపుడు వారిలో ఒక ఆలోచన ఏమిటంటే కేవలం ఎన్నుకొనబడిన వారు మాత్రమే రక్షణ పొందేది లేక అన్యులు కూడా రక్షణ పొందుతారు అన్నది ఎందుకంటెచాలా మంది ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వములో జీవించే సమయములో అన్యులను వివాహమాడేవారు దాని వలన వారిలో విభిన్నమైన ఆలోచన వచ్చింది.
వారు అన్యులైనప్పటికీ యూదా మత ఆచారాలు ఆచరించరు అలంటి సందర్బములో యెషయా ప్రవక్త యావే దేవుని యొక్క గొప్పతనమును తెలియజేస్తూ యావే దేవుడు అందరికి దేవుడు అందరిని రక్షిస్తారు అనే అంశమును తెలియచేశారు. దేవుడు అందరిని రక్షిస్తారు అదేవిధంగా ప్రభువు అందరిని ఏకం చేస్తారని ప్రవక్త తెలుపుచున్నారు.
యావే దేవుడు తన యొక్క పని నిమిత్తమై అన్యులను కూడా ఎంచుకుంటానని తెలుపుచున్నారు. వాస్తవానికి యాకోబు వంశియులకు అప్ప చెప్పిన యాజక విధులు భవిష్యతులో అన్యులు కూడా పాలుపంచుకుంటారని ప్రవక్త ముందుగానే వివరించారు.
యెషయా ప్రవక్త మెస్సయ్య యొక్క రాకడ ద్వారా రక్షణలో కేవలం ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే కాక మిగతా అన్యులు అందరు కూడా బాగస్తులు అవుతారని తెలుపుచున్నారు.
ఈ నాటి మొదటి పఠనంలో ఇశ్రాయేలు ప్రజలకు కష్టతరమైన విషయం ప్రభువు ఒకటి తెలియజేస్తున్నారు ఎందుకంటె అప్పటి వరకు కేవలం ఎన్నుకొనబడిన వారే పుణ్యాత్ములు వేరే వారు పాపాత్ములు అని భావించేవారు.
అన్యులకు దైవారాధన చేసే అవకాశం ఉండదు బలులు సమర్పించే అవకాశం లేదు కానీ ప్రభువు అన్యులను కూడా యాజక బలులు సమర్పించుటకు ఎన్నుకొంటున్నారు ఇశ్రాయేలు ప్రజలకు ఇది ఊహించనిది, సహించలేని విషయం.
దేవుని యొక్క అపారమైన ప్రేమ వలన, కరుణ వలన అందరిని రక్షించాలనుకుంటున్నారు.
ఇశ్రాయేలు ప్రజలకు ఇది అంగీకరించుటకు కష్టమైన కానీ ఈ ఇరుకైన మార్గమును అంగీకరించి ముందుకు సాగాలి.
ఈ నాటి రెండవ పఠనంలో రచయిత క్రమశిక్షణ అనే అంశమును గురించి తెలియచేస్తున్నరు.
దేవుని బిడ్డలుగా ఆయనకు సాక్ష్యమిచ్చి జీవించే సమయములో ఎదుర్కొనే కష్టాలు, శారీరక బాధలు అన్నియు కూడా వారి యొక్క క్రమ శిక్షణలో భాగమే.మనలను శిక్షించినపుడు మనం బాధపడనవసరం లేదు ఎందుకంటె మన యొక్క కష్టములొ నుండి మనం మంచి నేర్చుకోవచ్చు.
చదువుకునేటప్పుడు ఉపాధ్యాయులు పిల్లలను మంచి క్రమ శిక్షణలో ఉంచుటకు కొడతారు, పిల్లలకు అది బాధ అయినా కానీ వారిని మంచి మార్గంలో నడిపించుటకే వారి పెట్టె బాధలు.
మనల్ని మందలించినపుడు నిరుత్సహపడకూడదు ఎందుకంటె మనం ఇంకా మంచి వారీగా అవ్వటానికి మనల్ని మందలిస్తారు.
మొక్కలు ఎదిగేటప్పుడు కూడా వాటిని కత్తరించి సరిచేస్తారు అవి మంచిగా ఎదుగుటకు అదే విధంగా దేవుడు కూడా తన యొక్క బిడ్డలను కత్తరించి సరిచేస్తారు అంటే ఏ అలవాట్లు అయితే పరలోకరాజ్యములో ప్రవేశించటానికి ఆటంకంగా ఉంటాయో వాటిని కత్తిరిస్తారు.
ఈ రెండవ పఠనంలో కూడా రచయిత కష్టతరమైన విషయములను బోధిస్తున్నారు అదేమిటంటే "క్రమ శిక్షణ" అప్పటి వరకు విలాసవంతంగా జీవించిన వారికీ ఆ మార్గం విడిచిపెట్టాలంటే కష్టమే.
ఆనందంగా జీవించే వారు కష్టాలు అంగీకరించుట కూడా తేలిక కాదు అదేవిధంగా మనం క్రమశిక్షణ కలిగి జీవించాలని బాగా కష్టపడి ప్రతినిత్యం ప్రయత్నం చేయాలి.
ఎవరైనా మనల్ని సరిచేసిన అది అంగీకరించుట కష్టంగానే ఉంటుంది, దేవుడు మన కుటుంబమును కష్టాలకు గురిచేస్తే అది బాధగానే ఉంటుంది కాబట్టి ఈలాంటి ఇరుకైన మార్గాలు, మన మనస్సులను బాధపెట్టే మార్గాలు వాటిని సవాలుగా తీసుకొని ముందుకు వెళితే దేవునికి సాక్షులుగా జీవించగలుగుతాం.
దేవుడు ఇశ్రాయేలు ప్రజలను సరిచెయుటకు ఎడారిలో వారిని శిక్షించారు అది వారి మనస్సుకు బాధైనా కానీ దాని తరువాత ఫలితం వేరే విధంగా ఉంటుంది. దేవునికి విధేయులై జీవిస్తున్నారు.
మన యొక్క జీవితంలో కూడా మనకు నచ్చనివి జరిగితే వాటిని అంగీకరించలేము అదేవిధంగా మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్న చెడును, చేదు అలవాట్లను, పాపపు జీవితమును తెసివేయటానికి దేవుడు మనల్ని శిక్షించినపుడు, సరిచేసినపుడు, నేర్పించినపుడు దానిని అంగీకరించాలి.
చివరి వరకు సాక్షులై జీవించిన వారు దేవుని యొక్క బహుమానం పొందును.
యేసు ప్రభువు యొక్క రక్షణ కార్యం ముగించుటకు యెరూషలేము వెళ్లే సమయములో ఈ ప్రశ్న అడుగుచున్నారు. బహుశా ఆ వ్యక్తి అన్యుడై ఉండవచ్చు లేదా దేవుని రక్షణ కోసం ఎదురు చూసే భక్తుడైన అయి ఉండవచ్చు.
ఆ వ్యక్తి కేవలం రక్షణ అనేది ఎన్నుకొనబడిన యూదా ప్రజలకు మాత్రమేనా లేక అందరు కూడా ధర్మశాస్త్రమును పాటిస్తే రక్షణ పొందుతారా అని తెలుసుకొనుటకు యేసు ప్రభువును ఈ ప్రశ్న అడుగుచున్నాడు.
ఇంకొక విధంగా చెప్పాలంటే యూదులు మాత్రమే దేవుని రాజ్యములో ప్రవేశించుటకు అర్హులు మిగతా వారందరు అనర్హులే వారు బయటనే ఉండాలి అని.
యేసు ప్రభువు ఈ యొక్క వ్యక్తికీ రక్షణ పొందే మార్గమును తెలుపుచున్నారు. అందరు కూడా రక్షణ పొందుటకు అర్హులే అని అంటున్నారు దాని కోసం ఇరుకైన మార్గములో ప్రవేశించామని అంటున్నారు.
అందరూ నిత్య జీవితం పొందుట దేవుని యొక్క అభిలాష కానీ అందరూ కష్టతరమైన మార్గము అనుసరించుట తేలిక కాదు.
జీవమునకు పోవు మార్గము ఇరుకైనది అని ప్రభువు ముందుగానే తెలిపారు. మత్తయి 7 : 14
దేవుని రాజ్యంలో అందరూ ప్రవేశించాలన్నది ప్రభువు యొక్క కోరిక అయితే ప్రతి ఒక్కరూ దాని కోసం వ్యక్తిగతంగా సిద్ధమవ్వాలి. దేవుడు ప్రతినిత్యం మనకు వరాలు ఇచ్చేది ఎందుకంటే మన జీవితాలను మార్చుకోవటానికి.
దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రభువు మన జీవితాలను సరిచేసూకోమని తెలుపుచున్నారు. ఇరుకైన మార్గమున ప్రవేశించాలంటే చాలా కష్టపడాలి, ప్రతి నిత్యం చూసుకొని నడవాలి జాగ్రత్తగా ఉండాలి లేదంటే పడిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి.
ఇరుకైన మార్గము అనగా పరిత్యజించే మార్గము. దేవుని రాజ్యంలో ప్రవేశించాలన్నా లేదా రక్షణ పొందాలన్న మనం మన యొక్క పాపాలను పరిత్యజించాలి, ప్రభువును విశ్వసించాలి ఆయనను వెంబడించాలి. ప్రవక్తలు ఇరుకైన మార్గంలో ప్రవేశించారు అంటే శ్రమలు అనుభవించిన మార్గం. వారు దేవునికి సాక్షులుగా జీవించే సందర్భంలో అనేక రకాలైన శ్రమలు అనుభవించారు కాబట్టియే వారు దేవునితో సహవాసం చేయగలుగుచున్నారు, ఆయన రాజ్యంలో ప్రవేశిస్తున్నారు.
ఎవరైతే దేవుని కొరకు అన్ని పరిత్యజించి ఇరుకైన మార్గాన్ని అనుసరిస్తారో వారందరు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. కొంతమంది యూదుల యొక్క నమ్మకం ఏమిటంటే మనిషి ఎలా జీవించినా యూదా జాతికి చెందిన వాడైతే వాడు రక్షణ పొందుతారు అని ఒక నమ్మకం.
తన్ను విశ్వసించి, తన జీవితంలో పాలు పంచుకొంటూ తన రక్షణను అనుభవించటానికి యేసు ప్రభువు యూదులను అన్యులను అందరిని ఆహ్వానించారు.
అనేకమందికి రక్షణ పొందాలనే ఆశ ఉంటుంది కానీ కొందరు మాత్రమే యేసు ప్రభువు యొక్క అడుగు జాడలలో నడుస్తారు. రక్షణ ఉచితంగా వస్తుందంటే దాని కోసం ఎవ్వరూ ప్రయత్నించారు. అందరూ రక్షించబడాలని దేవుడు కోరుకున్నప్పటికీ మనమందరం దాని కొరకు ప్రయతించాలి.
రక్షణ అనేది అందరికి అవసరం కాబట్టి దానికి రెండు షరతులు మనం పాటించాలి .
1. నిత్య రక్షణ అనేది కష్టార్జితం కాబట్టి దాని కోసం మనం ప్రతిరోజు కష్టపడాలి. ప్రభువుతో ప్రతిరోజు వ్యక్తిగతంగా జీవిస్తూ, ఆత్మతో ఆయన జీవాన్ని పంచుకుంటూ నీతిమంతమైన పనులు చేస్తూ, దేవునికి విధేయులై జీవించడానికి మన జీవితాంతం మనం ప్రయతించాలి. మన జివితంలో విశ్వసనీయత కలిగి జీవించాలి .
2. ఇరుకైన మార్గమున ప్రవేశించాలి: ఈ లోక మార్గములు విడిచిపెట్టి దేవుని మార్గమును, ఆయన యొక్క ఆజ్ఞలు పాటిస్తూ, దేవుని మార్గంలో ప్రయాణం చేస్తూ జీవించాలి .
కొన్ని ఇరుకైన మార్గాలు ఏమిటంటే
1. పాపములను విడిచి పెట్టుట అంత సులభతరమైనది కాదు, దాని కోసం కష్టపడి పనిచేయాలి.
2. దేవుని యొక్క చిత్తం ప్రకారం జీవించుట ఇది అందరికి సాధ్యపడే విషయం కాదు.
3. దేవునికి ప్రార్ధించుట, ఆయన సన్నిధికి వచ్చుట కొంతమందికి అది కష్టంగా ఉంటుంది
4. దేవుని యొక్క ఆజ్ఞలను, చట్టములను పాటించుట కేవలం కొన్ని మాత్రమేఅందరూ పాటించగలరు అన్నింటిని 100% పాటించుట అందరికి సాధ్యపడే విషయం కాదు.
5. వ్యసనములను త్యజించుట వ్యసనములకు బానిస అయిన తరువాత వాటినుండి బయటకు రావాటం కష్టతరమైనది.
6. నిరాశలో, కష్టాలలో, వేదనలో, దేవుని యందు ఆధారపడి జీవించుట కొందరికి కష్టమే. అలాంటి సమయంలో కేవలం కొందరు మాత్రమే ప్రభువును వెంబడిస్తారు.కొందరు దేవునియందు విశ్వసం కోల్పోయి జీవిస్తారు.
తప్పిపోయిన కుమారుని ఉపమానంలో చిన్న కుమారుడు విలాసవంతమైన మార్గమును అనుసరించి అనేక కష్టాలు అనుభవించారు కాబట్టి ఇరుకైన మార్గంలో ప్రయాణం చేస్తూ దేవుని రాజ్యం చేరుకోవాలి.
మార్గం ఇరుకైనప్పటికిని అది మనలను గమ్యం చేర్చుతుంది. క్రీస్తు ప్రభువు యొక్క జీవితమును చూస్తూ మనందరం ముందుకు సాగాలి.క్రైస్తవ కతోలిక విశ్వసం "రక్షణ" గురించి బోధించే అంశమేమిటంటే - మన యొక్క రక్షణ.
1 . భూతకాలం
2 . వర్తమాన కాలం
3. భవిష్యత్ కాలంకు సంబంధించినది.
ప్రాతినిత్యం కూడా మనం తయారుచేసుకొని జీవించాలి .
కొంతమంది క్రైస్తవ సంఘాల నమ్మిక ఏమిటంటే ఒక్కసారి యేసు ప్రభువును రక్షకుడని నీవు అంగీకరిస్తే ఆ తరువాత నీవు ఎన్ని పాపాలు చేసినా, మత నియమాలు ఆచరించక పోయినా సరే నీవు రక్షణ కథోలిక విశ్వాసం సత్యమేమిటంటే భూత, వర్తమాన, భవిష్యత్తు కాలంలో మనం రక్షించబడుతున్నాం అది ఒక్కసారితో ఆగిపోవుట లేదు అని
- భూతకాలంలో జ్ఞానస్నానం ద్వారా రక్షించబడ్డాం.
-వర్తమాన కాలంలో దేవుని కృపకు సహకరించి జీవించినప్పుడు రక్షించబడుచున్నాము.
-భవిష్యత్తు కాలంలో మంచి విశ్వాస జీవితం జీవించినందుకు, దేవునికి విధేయులై ఉన్నందుకు మరణం తరువాత తుది తీర్పునాడు మనం రక్షించబడుతాం .
కాబట్టి క్రీస్తు ప్రభువు యొక్క జీవితమును ఆదర్శంగా చేసుకొని ప్రతినిత్యం పరలోక రాజ్యంలో ప్రవేశించాలనే ఆలోచలను కలిగి మన జీవితాలను సరిచేసుకొంటూ క్రీస్తు ప్రభువును వెంబడించాలి .
రక్షణ పొందుటకు అందరూ అర్హులే. దేవుడు తన కృపను బట్టి మనల్ని రక్షిస్తారు. అదే విధంగా మనం కూడా దేవుని కృపకు సహకరించి ఆయన రక్షణ పొందాలి.