2, అక్టోబర్ 2021, శనివారం

27 వ సామాన్య ఆదివారం

 27 వ  సామాన్య ఆదివారం
 ఆది 2:18-24, హెబ్రీ 2:9-11, మార్కు 10:2-16
క్రీస్తు నాధుని యందు ప్రియ మిత్రులారా ఈనాటి దివ్య పఠనాలు దేవుడు ఏర్పరిచిన పవిత్ర  వివాహ బంధము గురించి  బోధిస్తున్నాయి.  పవిత్ర  వివాహము  దేవుడు  స్థాపించిన ఏడు  దివ్య సంస్కారములలో  ఒకటి మరియు ముఖ్యమైనది.  ఈరోజు   తల్లి  శ్రీ సభ  వివాహ బంధాలు ఎలాగా ఉన్నాయని  ఆత్మ  పరిశీలన చేసుకొని వాటిని  సరి దిద్దుకోమని అందరినీ ఆహ్వానిస్తుంది.


ఈనాటి మొదటి పఠనములో  దేవుడు స్త్రీ పురుషులను   విధముగా సృష్టించా రో  అలాగే  వారిని విధముగా  ఒక పవిత్ర కుటుంబముగా   చేశారో మనము వింటున్నాం. సృష్టి ప్రారంభము నుండి యే  దేవుడు వివాహ బంధమును ఏర్పరిచారు.  స్త్రీ, పురుషులను  ఏకం చేసి ఒక కుటుంబమును ఏర్పరిచారు. ఏది  మానవ  జీవితానికి  ప్రాథమికమైనది. దీని ద్వారా  మానవ జీవితము  అభివృద్ధి  చెందుతుంది.
ఆది కాండము 2:18   వచనం మనందరికీ  తెలియచేసే విషయము ఏమిటంటే  మగవాని  యొక్క  జీవితములో  ఆడ వారియొక్క తోడు , సహకారం ఎంతో అవసరం .ఈనాటి మొదటి పఠనములో దేవుడు ఆదాము కు ఎవమ్మ ను తోడు గా ఉండటంకు  ఇస్తున్నారు. దేవుడు స్త్రీని ఆదాము ను చేసిన విధముగా మట్టి తీసుకొని చేయలేదు. కానీ ఆదాము యొక్క శరీర అవయవము ద్వార  సృష్టించారు. దేవుడు స్త్రీని ఆదాము  ప్రక్కటెముక తీసుకొని సృజించారు. వారిద్దరి జీవితము ఒకేలా  ఉండాలని దీనికి వేరొక అర్దం మనం చెప్పుకోవచ్చు. స్త్రీని ప్రక్కటెముక నుండి  తీసుకొని  సృష్టించారు ఎందుకంటే భార్య ఎప్పుడు భర్త  హృదయాన్ని అంటిపెట్టుకుని  దగ్గరగా ఉండాలి. ప్రక్కటెముకలు మన హృదయాన్ని కాపాడిన విధముగా భార్యలు తమ భర్తలను కాపాడాలి.


దేవుడు స్త్రీని మగవాని ఆధీనములో ఉండటంకు అతని పాదం నుండి సృష్టించబడలేదు. మగవాని పై భర్త పై చెలాయించడానికి తన తల నుండి సృష్టించబడలేదు. కానీ ప్రక్కటెముక తీసుకొని సృష్టించారు. ఎల్లప్పుడు  తనకు తోడు గా ఉంది తనలో ఒకటై  ఉంది తనకు సహకరించి  తన ప్రేమను పంచుకోవాలనే ఉద్దేశముతో దేవుడు అలా చేశారు.
దేవుడు వారిద్దరినీ ఒకటిగా చేసింది దేవుని ప్రణాళికను నెరవేర్చటంకు. ఇద్దరు కూడా  ఏక శరీరులై ఉండాలని కోరుతున్నారు. ఒకరి జీవితము ఒకరు పంచుకొను   ద్వార వారిద్దరూ  ఒక దేహంగా రూపొందారు. వివాహముకు ముందు  ఇద్దరు వ్యక్తులుగా ఉన్న వారు వివాహము తరువాత ఒకటిగా మారుతున్నారు. అప్పటి వరకు భిన్న ఆలోచనలు, మనస్తత్వాలు , అభిప్రాయాలు కానీ వివాహము తరువాతే  ఒకే జీవితము , ఒకే మనస్సు , ఒకే హృదయం ఇదే వివాహ జీవితం కు ఉన్న గొప్పతనం. భార్య భర్తలు ఇద్దరు  అన్నింటిలోనూ సరి సమానులే ఎవ్వరూ తక్కువ కాదు ఎవ్వరూ ఎక్కువ కాదు . ఆది 1:27-29. స్త్రీని దేవుడు ఆదాముకు తోడు గా ఇచ్చారు, ఆమె ఎల్లప్పుడు  ఆయనకు తోడు గా ఉండాలి


-కష్టములో తోడు గా ఉండాలి
-సంతోషములో తోడు గా ఉండాలి


- సమస్యలలో తోడు గా ఉండాలి
- ఆర్ధిక ఇబ్బందిలో తోడు గా ఉండాలి


-నిరాశలో తోడు గా ఉండాలి
-కుంగిపోయిన వేళలో తోడు గా ఉండాలి


-బాధ్యత లో తోడు గా ఉండాలి
తన జీవిత ప్రతి అవసర సమయంలో స్త్రీ భర్తకు తోడు గా ఉండాలి. అది దేవుని యొక్క ప్రణాళికా . అలాగే భర్త కూడా భార్యకి తోడు గా నిలవాలి . వివాహం రోజున ఇచ్చిన వాగ్దానముకు కట్టుబడి  జీవించాలి. భార్యను ఇచ్చింది తన యొక్క సంతోషాన్ని , ప్రేమను అన్నింటినీ పంచుకోటానికి తన జీవితమను పంచుకోటానికి దేవుడు సృష్టించారు. వారిద్దరినీ  ఏకం చేసింది. దేవుడే. దేవుడే స్వయంగా అవ్వను  ను   సృష్టించిన తరువాత  స్వయంగా దేవుడే అవ్వ ను ఆదాము చెంతకు తీసుకొని వస్తున్నారు. తాను  వారిని ఒక  కుటుంబముగా చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వారందరి వివాహ బంధం ప్రారంభమైనది దేవుని వలనే. దేవుడు మీకు భర్త ను ఏర్పరిచారు, భార్యను ఏర్పరిచారు. బిన్న శరీరములుగా ఉన్నవారు ఏక శరీరులుగా మారాలంటే ఏమీ చేయాలి. అన్నీ మొదటి నుంచి ప్రారంభించాలి, నేర్చుకోవాలి మనం మొదట బడికి వెళ్ళినప్పుడు ఎలాగైతే అన్నీ మొదటి నుంచి  నేర్చుకుంటా మో అలాగే వివాహపు అంతస్తులో కి  అడుగు పెట్టినవారు అన్నీ మొదటి నుండి  ప్రారంభించి  , నేర్చుకోవాలి.


-అర్దం చేసుకోవటం నేర్చుకోవాలి
-ప్రేమించడం నేర్చుకోవాలి


 -క్షమించడం నేర్చుకోవాలి
 -సహించడం నేర్చుకోవాలి


 -విధేయించడం నేర్చుకోవాలి
  -సహకరించడం నేర్చుకోవాలి


 -నమ్మకంతో జీవించడము నేర్చుకోవాలిఇవన్నీ నేర్చుకొని జీవిస్తే తప్పనిసరిగా వారి వివాహ జీవితము  సంతోషముగా ఉంటుంది. వివాహబంధం అనేది కేవలము కలిసి జీవించేందుకు లేక పరస్పర అంగీకారంతో ఇష్టంతో  చేసుకునే ఒప్పందం మాత్రమే  కాదు కానీ ఒక్కొక్కరి యొక్క బలాలను, బలహీనతలను, ప్రేమలను ద్వేషాలను అవమానాలను, సుఖ సంతోషాలను, కష్ట నష్టాలను  మనస్ఫూర్తిగా  అంగీకరించుకొని  జీవించే బంధం  వివాహ బంధం .


మనం
ఒకరి కోసం ఒకరుగా , ఒకరినుండి ఒకరుగా చేయబడ్డాం. ఒకసారి తాళి కట్టిన తరువాత దానిని  విప్పే  అధికారం కట్టిన వానికి కూడా ఉండదు, ఎందుకంటే  తాళి కట్టే సమయములో  ఒక్కొముడి వేసే సమయములో ఆ వ్యక్తి   త్రీత్వం  లో  ఒక్కొక్కరి ని తలచుకుంటూ ముడి  వేస్తాడు .  మొదటి ముడి పిత దేవుని నామమును తలచుకుంటూ వేస్తాం. దీన్తో  బంధం ఏర్పడుతుంది రెండవ ముడి పుత్రుడైన యేసు ప్రభువును తలచుకుంటూ వేస్తాం. దీన్తో అనుబంధం ఏర్పడుతుంది, మూడవది పవిత్రాత్మ దేవుని నామమును తలచుకొని వేస్తాం దీన్తో విడదీయ వీలు కాని బంధం ఏర్పడుతుంది.వివాహ జీవితం బలంగా ఉండాలంటే మన కుటుంబ జీవితములో ఎలాంటి లక్షణాలు  కలిగి ఉండాలి . ఒక భార్యగా ఎలా ఉండాలి ఒక భర్తగా ఎలాగా ఉండాలని మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క కోరిక స్త్రీ పురుషులిద్దరు జీవితాంతం ఒకరికొకరు  తోడు గా ఉండాలన్నది.  
వారిద్దరూ జీవితాంతం తోడు గా ఉంటారు లక్షణాలు కలిగి జీవిస్తే
భర్తకు ఉండవలసి లక్షణాలు
1.  భర్త అంటే  భరించేవాడిలా ఉండాలి బాధించేలా ఉండకూడదు   1 సమూ 1;8 ఏల్కాన  అనే భర్త అన్నకు  సంతానం లేక లేనప్పుడు తన భార్య యొక్క బలహీనతను అర్దం చేసుకున్నారుఆమెతో అంటున్నారు నీకు  బిడ్డలు లేక పోతే ఏమీ నేను పది మంది బిడ్డలతో సమానమని తనను తన బాదను భరిస్తున్నాడు.  పవిత్ర గ్రంధములో హొషేయా ప్రవక్త యొక్క భార్య  తనను పట్టించుకోకుండా ఉన్న   కానీ హొషేయా  ప్రవక్త తన భార్యను  భరిస్తూ మంచి మనస్సుతో స్వీకరించారు.2.
భర్తలు ఎప్పుడు కూడా తమ భార్యలను ప్రేమించాలి ఎఫెసీ 5:8, రోమి 12:10  దేవుడు స్త్రీని  నరుని పక్కటెముక  నుంచి చేశారు. అనగా తన పక్కటెముక దగ్గర ఉన్న ఆమె కష్టమను , కన్నీరును వచ్చినప్పుడు కౌగిలించుకొని ఉండాలని అదే విధముగా పక్కటెముక హృదయం వెనుక ఉన్న హృదయంతో ఆమెను ఎప్పుడు కూడా ప్రేమించాలని.
 3. భర్త భార్యను మంచిగా చూసుకోవాలి. ఆది 24:67. ఇస్సాకు తన భార్య రెబ్కా ను బాగా చూసుకున్నారు. చాలా మంది భర్తలు తమ భార్యలను అసలు పట్టించుకోరు వారు తిన్నారా ,లేదా సంతోషంతో ఉన్నారా లేదా అన్నది . నిజమైన భర్తలు తమ భార్యలను పట్టించుకోని జీవించాలి.1 పెతురు 3:7 4.
విశ్వాస పాత్రుడిగా జీవించుటఒకరి పట్ల ఒకరు విశ్వాస పాత్రులుగా జీవించుట చాలా ముఖ్యం. వివాహ బంధములో . వివాహ బంధములో  మోసం చేయకూడదు. దేవుడు కూడా  ఇస్రాయేలు  ప్రజలనుండి  కోరినది విశ్వసనీయతే. ఒకరి పట్ల ఒకరు విశ్వాసం గా ఉండాలి.
     మంచి భార్యకు ఉండవలసి లక్షణాలు
1. భర్తని ప్రేమిస్తూ ఆపదలనుండి కాపాడాలి. 1 సమూ 25:2 అబీగాయిలు  నాబాలు యొక్క భార్య ఆయన మొరటు వాడు , పిసినారి , ధనవంతుడు కానీ దావీదు  సహాయము చేయమన్నప్పుడు చేయకుండా తనను కించపరిచిన  దానికి ప్రతి ఫలంగా దావీదు అతనిని శిక్షించాలనుకున్నప్పుడు అబీగాయిలు తన భర్తని దావీదు నుండి కాపాడుతుంది. అలానే ప్రతి భార్య కూడా తన భర్త గౌరవాన్ని కాపాడాలి . సమాజములో ఎప్పుడు కూడా ఆయనను మర్యాదతో పిలిచి , గౌరవించాలి. అవమానాలనుండి ఆపదలనుండి కాపాడాలి. మంచి భార్యలు ఎప్పుడు కూడా దేవుని నుండి వస్తారు. సామె 19:14 . మంచి భార్యను  కలిగిన వ్యక్తి లాభం కలుగుతుంది. సీరా 26:1
2. వేకువనే లేచి భోజనం సిద్దం చేయాలి  సామె 31:15 అంటే కుటుంబము నడిపించుటకు తాను ఎప్పుడు సిద్దముగా ఉండాలి . కుటుంబంలో అన్నీ సక్రమముగా జరగాలంటే ఇల్లాలు ముందు ఉండాలి .
3.  నోటిని అదుపులో  ఉంచుకోవాలి సామె 27:15,16 ,సీరా 26:14
4. అత్త మామలను తల్లిదండ్రుల వలె ప్రేమించాలి రూతు 1:15 . రూతు తన అత్తను ఆపదలో వదలి  వేయలేదు, తనకు తోడు గా నిలిచింది.
5. భార్య భర్తలు విడిపోవటంకు దేవుడు అనుమతి ఇవ్వలేదు. ప్రజల కాఠిన్యం వలనే మోషే విడాకులు తీసుకొనటంకు అనుమతి ఇచ్చారు. ఎందుకంటే వారి హృదయ కాఠిన్యం అంటువంటిది. దేవుని ప్రణాళికా విడాకులు కావు. మూడు ముళ్ల బంధం నూరేళ్ళ బంధం దేవుని ప్రకారం వివాహ జీవితం గట్టిగా ఉండాలంటే వారి కుటుంబంలో ప్రార్థన ఉండాలి. తోబితు , సారా వారిద్దరూ ప్రార్థించారు. ఒకరిలపట్ల ఒకరికి నమ్మకం ఉండాలి. క్షమాపణ ఉండాలి మత్తయి 5:23,24, ఐక్యమత్యం ఉండాలి, యోహను 7:21-22. విధముగా జీవిస్తే తప్పనిసరిగా వారి యొక్క వివాహ బంధం శాశ్వతముగా ఉంటుంది.
     By Rev. Fr. Bala Yesu OCD


 

11వ సామాన్య ఆదివారం

11వ సామాన్య ఆదివారం  యెహెజ్కేలు17:22-24, 1 కొరింతి 5:6-10, మార్కు 4:26-34 ఈనాటి పరిశుద్ధ గ్రంధ పఠణములు దేవుని యొక్క రాజ్య విస్తరణ గురించి బో...