12, మార్చి 2022, శనివారం

తపస్సు కాల రెండవ ఆదివారము

తపస్సు కాల రెండవ ఆదివారము

ఆది 15 : 5 -12 , 17 -18, ఫిలిపీ త్రీ:17 - 4 :1,  లూకా 9 :28 -36.

క్రీస్తునాదునియందు ప్రియ దేవుని బిడ్డలారా  ఈ నాటి దివ్య గ్రంథ పఠనాలు దేవుని చిత్తాన్ని ఎలా గ్రహించాలి అని తెలియచేస్తున్నాయి. తల్లి  శ్రీ సభ మనలనందరిని కూడా ప్రార్థన శక్తి ద్వారా దేవుని చిత్తాన్ని గ్రహించాలని   ఆహ్వానిస్తున్నాయి.

మొదటి పఠనంలో  విశ్వాసమున   తండ్రి  అయిన అబ్రాహామును రెండు విషయాలలో తన మాట మీద గురి ఉంచమని దేవుడు కోరుతున్నాడు.1) నీకు ఒక గొప్ప బహుమానం ఇస్తాను అని దేవుడు పలుకుతున్నాడు 2) అబ్రాహాము సంతతికి భూమిని దారాదత్తం చేస్తానని దేవుడు అబ్రాహామును వాగ్దానం చేస్తున్నాడు 

1) నీకు ఒక గొప్ప బహుమానం ఇస్తాను అని దేవుడు పలుకుతున్నాడు:  దీనికి అబ్రాహాము, ప్రభు నువ్వు నాకు ఏమి ఈయగలవు నేను బిడ్డలు లేని వాడిని, నీవు నాకు సంతానం కలిగించలేదు అంటున్నాడు.ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే అబ్రాహాము తనను తాను అనుమానించుకుంటున్నాడు, నేను ముసలివాడను నాకు సంతాన ప్రాప్తి లేదు అని అపనమ్మకం అబ్రాహాము వ్యక్తం చేస్తున్నాడు. ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే అబ్రాహామును దేవుడు కల్దియా దేశం నుండి పిలిచి తనను ఒక గొప్ప మహాజాతిగా తీర్చిదిద్దుతాను, నిన్ను దీవించేవారిని దివిస్తాను, నిన్ను శపించేవారిని శపిస్తాను,  నీ ద్వారా నేను సమస్త జాతి జనులను దివిస్తాను అని వాగ్దానం చేసిన మాటలను మరచిపోయి కూడా అబ్రహాము దేవుని మీద  ఈ విధంగా పలికియున్నాడు.

 అప్పుడు దేవుడు అబ్రాహాముతో నీకు పుట్టినవాడే నీకు వారసుడవుతాడు అతడి సంతానం నక్షత్రములవలె అవుతుందని చెప్పినపుడు అబ్రాహాము నమ్మాడు, ఆయన  నమ్మకాన్ని బట్టి దేవుడు అబ్రాహామును నీతిమంతునిగా చేసాడు. 

2) దేవుడు అతని సంతతికి భూమిని దారాదత్తం చేస్తానని వాగ్దానం చేయుట:

       దేవుడు చేసిన వాగ్దానం ప్రకారం, అబ్రాహాము దేవుడు తన యొక్క సంతతికి ఇస్తానన్న భూమిని తండ్రి దేవుడు మాట తప్పకుండా ఇస్తాను అని మాటిచ్చి ఒప్పందం కుదుర్చుకున్న తరువాత, అబ్రాహాము దేవుని యెక్క మాటను విశ్వసముతో నమ్మాడు. విశ్వస ఒప్పందాన్ని 15వ అద్యాయములో చూస్తున్నాము.  దేవునిపై నమ్మకము ఉంచితే మనకు కావలిసినదంత దేవుడు మనకు ఇస్తాడని, మొదటి పఠనము మనకు తెలియజేస్తుంది.


3) సువిశేష పఠనము

   ఈ యొక్క పఠనంలో   క్రీస్తు యొక్క దివ్యరూపం దాల్చడం, క్రీస్తు యొక్క వస్త్రములు తెల్లగా ప్రకాశించడం మరియు ఆయనతో పాటు మరో ఇద్దరు దివ్య వ్యక్తులు మోషే మరియు ఏలీయా కనబడ్డారు అన్న విషయాన్ని  తెలియపరచటం మనము చూస్తున్నాము. ఈ యొక్క  ముగ్గురు వ్యక్తులుకూడా

1) మోషే: మంచి నాయకుడు పుణ్యాత్ముడు, దేవుని యొక్క ముఖాన్ని ముఖ్య ముఖీగా చూసినవాడు, అంతే కాకుండా దేవుని యొక్క ప్రజలను ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చి వాగ్దాన భూమివైపు నడిపించటం కూడా చూస్తున్నాము.

2) ఏలీయా: ఏలీయా అంటేనే ఒక గొప్ప మహాశక్తి పేరు పొందిన వాడు, దేవునితో  సంబాషించిన వ్యక్తి, ఏలీయా, బాలు ప్రవక్తలను మట్టు పెట్టి దేవుని యొక్క   కీర్తిని అందరికి పరిచయం చేసినవాడు. ఈయన అనేక అద్భుత కార్యములను, మనము రాజుల రెండవ గ్రంధములో చూస్తున్నాము. ఈయన  మరణించకుండానే పరలోకమునకు కొనిపోబడినట్లు మనం రాజుల రెండవ గ్రంధంలో చూస్తున్నాము.

దేవుని ధర్మ శాస్త్ర  చట్టాల ప్రతినిధిగా మోషేను, ప్రవచనాల ప్రతినిధిగా ఏలీయాను  ఉన్న వారి ముందు  క్రీస్తు దివ్యరూపం ధరిస్తున్నారు. ఈ ఇద్దరు కూడా క్రీస్తు పొందబోయేటటువంటి  శ్రమలను , కష్టాలను మరియు బాధలను సిలువ మరణము గురించి క్రీస్తుతో సంభాషించటం చూస్తున్నాము.

 వీటినన్నిటిని గ్రహించినటువంటి పేతురు క్రీస్తు దగ్గరకు వచ్చి మనము ఇక్కడ ఉండుట సమంజసము  అందుకని మీకు, మోషే మరియు ఏలీయాకు గుడారములను నిర్మిస్తాం అని పేతురు క్రీస్తు ప్రభువుతో పలుకుచున్నాడు. ఇది ఇలా ఉండగా ఆకాశము నుండి తండ్రి దేవుడు ఈయన నా కుమారుడు ఈయనను చూచి  నేను ఆనందించుచున్నాను,  ఈయనను ఆలకించండి అని దేవుడు మనల్ని ఆదేశిస్తునాడు, అంటే క్రీస్తు చెప్పిన ప్రతిమాటను కూడా పాటిస్తూ, అనుసరిస్తూ, జీవించాలని తండ్రి దేవుడు మననందరికి తెలియజేస్తున్నాడు.

కాబట్టి ప్రియాయమైన క్రైస్తవ విశ్వాసులారా ఈ నాటి పఠనాలు అన్ని కూడా మానవులమైన మనం, ఎటువంటి స్థితిలో ఉన్నాకూడా క్రీస్తు యొక్క మార్గములో పయనిస్తూ, క్రీస్తుయొక్క అనుచరులుగా జీవించాలని మరియు దేవుడు  మనందరిని కూడా అయొక్క బాటలో నడపాలని , ఆశీర్వదించాలని ఈ నాటి దివ్యబలి పూజలో పాల్గొందము.

Br.Simon


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...