23, జులై 2022, శనివారం

17వ సామాన్య ఆదివారము

   17వ సామాన్య ఆదివారము                         


ఆది 18 :20 -32 , కోలస్సి 2 :12 - 14, లూకా 11 :1 - 13    

ఎలా ప్రార్దించాలి 

పరలోక ప్రార్ధన  , విజ్ఞాపన ప్రార్ధన

క్రీస్తునాధునియందు ప్రియమైన స్నేహితులారా ఈనాడు మనము 17వ సామాన్య ఆదివారములోనికి ప్రవేశించియున్నాము.     

నాటి పరిశుద్ధగ్రంథ పఠనములు ద్వారా తల్లి శ్రీసభ మనకు ఎలా ప్రార్ధించాలి? అనే అంశముతో, తండ్రి దేవుణ్ణి ఎలా ప్రార్ధించాలి  మరియు ఆయన బిడ్డలు అయిన మనము ఏ విధముగా ప్రార్ధించాలి, విజ్ఞాపనము ఎలా  చేయాలో మనకు తెలియజేస్తున్నాయి.    

మన క్రైస్తవ జీవితములో ప్రార్ధన ఎంతో ముఖ్యమైనది ప్రార్ధన ద్వారా దేవుని పై మనకున్న విశ్వాసాన్నివెల్లడిస్తూ, ఆయన్ని ప్రార్ధిస్తూ, స్తుతిస్తూ ప్రభువునకు కృతజ్ఞత స్తోత్రములు తెలుపుతాము. ప్రార్ధన వలన దేవునితో మనకున్న సంబంధం మరింత సన్నిహితమై, ఆయన నిజమైన బిడ్డలుగా మనము జీవిస్తుంటాము.

పిల్లలు తల్లితండ్రులపై ఆధారపడిజీవిస్తు, తమకు కావలసిన వాని కొరకై అడుగుతూ వుంటారు. మనము కూడా ప్రార్ధన ద్వారా దేవుని  మన తండ్రిగా భావించి ఆయనపై నమ్మకము ఉంచి, మనకు అవసరమైన వానిని అర్ధిస్తుంటాము.  అయితే ఎప్పుడు మన సొంత అవసరాల కొరకు మాత్రమే కాకుండా ఇతరుల అవసరతలను గూర్చి కూడా దేవున్ని ప్రార్ధిస్తుండాలి.  ప్రార్ధనలో స్వార్ధం పనికిరాదు పొరుగు వాణి యెడల ప్రేమఆధారములు ఎంతో అవసరం అని మనకు తెలుసు అట్లే పొరుగువాని కొరకు ప్రార్ధించాలి.  అది మనం ప్రార్ధన పూర్వకంగా ఇతరులకు చేయవలసిన మన సహాయం. ఇతరుల అవసరముల కొరకై మనం దేవునికి చేసే ప్రార్ధనని విజ్ఞాపన ప్రార్ధన అంటారు.  ఈదినం పరిశుద్ధ గ్రంథ పఠణాలు మనకు బోధిస్తున్నాయి.

ఎలా ప్రార్ధించాలి ?

బాల్యములో  సమూయేలు వలె  ప్రార్ధించాలి[1సాము 3 :1 -10 ]

యవ్వనంలో తిమోతి వలె ప్రార్ధించాలి [2 తెస్స  2:22]

ఉదయమున దావీదు వలె ప్రార్ధించాలి [కీర్త  63 :1]

మధ్యాహ్నం దానియేలు వలె ప్రార్ధించాలి [దాని 6 :10 ]

రాత్రి పౌలు సిలాసులు వలె ప్రార్ధించాలి [అపోస్తు 16 :25 ]

దుఃఖములో అన్నా  వలె ప్రార్ధించాలి [1 సమూ 1 :10 ]

శ్రమలలో యోబు వలె ప్రార్ధించాలి[యోబు 42 :10 ]

మరణములో స్టీఫెన్ వలె ప్రార్ధించాలి [అపోస్తులు 7 : 60 ]

అన్ని వేళలలో యేసు క్రీస్తు వలె ప్రార్ధించాలి [యోహాను 6 :38 ]

ప్రార్ధన అంటే ఏమిటి ?

ప్రార్ధన అంటే అడుగుట [మత్త 7  :7 ]

ప్రార్ధన అంటే వేడుకొనుట [8 :21 ]

ప్రార్ధనను అంటే బ్రతిమిలాడుట [ద్వితియో 9 ;20 ]

ప్రార్ధనను అంటే విన్నవించుట [కీర్త 6 :9 ]

ప్రార్ధన అంటే మనవిచేయుట [కీర్త 140 :6 ]

ప్రార్ధన అంటే మొరపెట్టుట [కీర్త 116 :1 ]

ప్రార్ధన అంటే పదే పదే అడుగుట[లూకా 18 :5 ]

ప్రార్ధన ఆంటే విజ్ఞాపనము చేయుట [1 తిమోతి 2 :2 ]

ప్రార్ధన అంటే ప్రాధేయపడుట [మత్త 9 :27 ]        

మొదటి పఠనములో అబ్రాహాము ప్రజల నిమిత్తం చేసినవిజ్ఞాపన ప్రార్ధన 

ఈనాటి మొదటి పఠనములో అబ్రాహాము తండ్రి దేవునికి సొదొమ గోమోర ప్రజల నిమిత్తం చేసిన విజ్ఞాపనను  ఆలకిస్తున్నాము.  సొదొమ గోమోర ప్రజలు, పాపములో పడి  దేవునికి దూరమయ్యారు వారి పాపములు పండిపోయాయి.  ప్రభువైన యావె అది సహించలేక ఆ ప్రజలను ఆ పట్టణములను ధ్వంసం చేయ తలచారు.  ఆ సమయమున అబ్రాహాము ఆ ప్రజల నిమిత్తం తనకు ప్రత్యక్షమైన యావేకు ప్రార్ధన చేసాడు.  అబ్రాహాము 50 మంది నుంచి 10 మంది వరకు తగిస్తూ వచ్చాడు.  అందుకు దేవుడు చివరికి 10 మంది మంచివారున్నా వారిని బట్టి క్షమిస్తాను అని చెప్పాడు.  అబ్రాహాము యొక్క విజ్ఞాపన ప్రార్ధన ఎంతో గొప్పది ఎందుకంటే 50 నుంచి 10  మంది వరకు తగిస్తూ వచ్చాడు .

మొదటి పఠనములో అబ్రాహాము ప్రజల నిమిత్తం చేసిన విజ్ఞాపన ప్రార్ధన :

ఈనాటి మొదటి పఠనములో అబ్రాహాము తండ్రి దేవునికి సొదొమ గోమోర ప్రజల నిమిత్తం చేసిన విజ్ఞాపన ఆలకిస్తున్నాము.  సొదొమ గోమోర ప్రజలు పాపములో పడి  దేవునికి దూరమయ్యారు.  వారి పాపములు పండిపోయాయి.   ప్రభు వైన యావె  అది సహించలేక ఆ  ప్రజలను ఆ పట్టణములను ద్వంసం  చేయ తలచారు. ఆ సమయమున అబ్రాహాము, ఆ ప్రజల నిమిత్తం తనకు ప్రత్యక్షమైన యావేకు ప్రార్ధన చేసాడు.  అబ్రాహాము 50 మంది నుంచి 10 మంది వరకు తగ్గిస్తూవచ్చాడు.  అందుకు దేవుడు చివరికి 10 మంది మంచివారున్నా వున్నా వారిని బట్టి క్షమిస్తాను అని చెప్పాడు.  అబ్రాహాము యొక్క విజ్ఞాపన ప్రార్ధన ఎంతో గొప్పది  ఎందుకంటే 50 నుంచి 10  మంది వరకు తగిస్తూవచ్చాడు .

దేవునికి సొదొమ గోమోర  ప్రజలకు మధ్యవర్తిగా నిలిచి అబ్రాహాము ప్రార్ధన చేసాడు. వారి నిమిత్తము అబ్రాహాము పదే పదే దేవునికి ప్రార్ధించాడు.  దేవుని దయను ఆయన కృప ఆశీర్వాదం పొందటానికి ఆ పట్టణములో కనీసం 10 మంది మంచి వారున్నా అబ్రాహాము చాలనుకున్నాడు. క్కడ మనము గ్రహించాల్సింది ఏమిటి అంటే, దేవునికి అబ్రాహాముకి జరిగిన సంభాషణలో మనం ఓక గొప్ప గమ్మత్తయిన విషయాన్ని గ్రహించాలి. దేవుడు ప్రజలను శిక్షించటానికి బదులుగా రక్షించటానికి సిద్ధంగావున్నాడు. ఆయన కోరేది ప్రజల రక్షణే గాని వినాశనం కాదు [యిర్మీ29 :11] అట్టి ప్రార్ధనను దేవుడు ఆలకించటానికి సిద్ధంగా వున్నారు.

సువిశేషము :

క్రీస్తు నాధునియందు ప్రియమైన స్నేహితులారా, ఈనాటి సువార్త పఠణములో మనము వింటున్నాము, ఏసుక్రీస్తు ప్రభువారిని శిషులు అడుగుచున్నారు, ప్రార్ధన నేర్పించమని, ఏ విధముగా అయితే యోహాను తన శిష్యులకు నేర్పించాడో మీరును మాకు ప్రార్ధన చేయుట నేర్పుడు అని. క్రీస్తు ప్రభువుకు ప్రార్ధన అంటే చాల ఇష్టం. ప్రతిరోజు ప్రార్ధనలో గడిపేవారు శిష్యులు మాకు ప్రార్ధన నేర్పుము అని అడిగినపుడు ప్రభువు , తాను నిత్యమూ చేసుకునే ప్రార్ధనను వారికీ నేర్పుచున్నాడు

ఇదే ప్రార్ధనను మనము కూడా ప్రతిరోజు మన కుటుంబ ప్రార్ధనలో కాని  వ్యక్తిగత ప్రార్ధనలో కాని  సంఘ ప్రార్ధనలో కాని , దివ్యబలిపూజలో కాని  ప్రార్ధిస్తున్నాము

ఈనాటి సువిశేషపఠనంలో యేసుప్రభువు  నేర్పిన ప్రార్ధనలో విన్నపములు వున్నాయి

1 తండ్రి మీ నామము పవిత్ర పరచ బడును గాక.

2 మీ రాజ్యము వచ్చును గాక.

3 మాకు అనుదినాఆహారము దయచేయుము.

4 మా పాపములను క్షమించుము.

5 మమ్ము శోధనలో చిక్కుకొనకుండా కాపాడుము.

అదే విధముగా ఈ విన్నప ప్రార్థనలకు మత్తయి సువిశేషములో మరొక 2 విన్నపములు చేర్చబడాయి అవి ఏమి అనగా.

1 మీ చిత్తము నెరవేరును గాక.

2 దుష్టునినుండి రక్షింపుము.

అయితే లూకా సువార్తలో చుసిన విధముగా మొదటి ఐదు విన్నప ప్రార్ధనలలో  మొదటి రెండు దేవునికి సంబంధించినవి, చివరి మూడు మన అవసరతలకు సంబంధించినవి. ఈనాటి సువిశేష పఠనంలో యేసు ప్రభు నేర్పిన ప్రార్ధనలో 5 విన్నపములు వున్నాయి.  పరలోక ప్రార్ధనగురించి పునీత మదర్ థెరిస్సా కలకత్తా గారు ఇలా చెప్పారు. పరలోక ప్రార్ధన జపించుట ద్వారా, జీవించుట ద్వారా పునీత తత్వము వైపు నడిపించబడతాము. పరలోక ప్రార్ధన గొప్ప వీలువున్న ప్రార్ధన, శక్తివంతమైన ప్రార్ధన ఎందుకంటే ఈ ప్రార్ధనను నేర్పించింది, మానవులకును దేవదూతలకును, రారాజు ఐన క్రీస్తు ప్రభువును  ప్రార్ధించటానికి మనము మోకాలు వంచినట్లైతే  ఆలకించడానికి అయన తన చెవులను సిద్ధం చేస్తాడు.

పరలోక ప్రార్ధన అంటే

విశ్వాసము -పరలోకమందున్న

సంబంధము -మా యొక్క తండ్రి

ఆరాధనా -మీ నామము పూజింపబడును గాక

నిరీక్షణ -మీ ఆజ్యము లేచును గాక

సమర్పణ -మిచిత్తము నెరవేరును గాక

ప్రార్ధన -మా అనుదిన  ఆహారము

క్షమాపణ -మావద్ద అప్పుబడినవారిని

పశ్చాత్తాపము -మా అప్పులను మీకు క్షమించండి

విజ్ఞాపన -శోధనలో పడనీయక

అవగాహన -రాజ్యము బలము మహిమ నిరంతరము మీవైయున్నవి. ప్రియమైన దేవుని బిడ్డలారా! మానవులమైన మనము, మన ప్రతి వసరము కొరకు ఎవరో ఒక్కరిపైనా ఆధారపడి ఉంటాము.  ఎవరు సహాయం చేయకపోతే దేవుని దగ్గరకు వస్తాము. యేసు ప్రభు తన ప్రార్ధనను మనకు నేర్పించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చేస్తున్న ప్రార్ధన ఎంతసేపు అన్నది ముఖ్యము కాదు ఎలా చేస్తున్నాము అనునదియే ముఖ్యము .

విసుగక ప్రార్ధించాలి [లూక18:1] యేసుప్రభు మనకు ఎలా ప్రార్ధించాలి  నేర్పించాడు.  ఎలా నమ్మకంతో కృతజ్ఞతతో సంతోషముతో తండ్రి దేవునితో మాట్లాడాలో నేర్పించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా మనము చేస్తున్న ప్రార్ధన ఎంతసేపు అన్నది ముఖ్యము కాదు ఎలా చేస్తున్నాము అనునదియే ముఖ్యము .

విసుగక ప్రార్ధించాలి [లూక 18 :1]

ప్రార్ధనకు  జవాబు ఆలస్యమైనందున నిరాశ పడకూడదు మనము ప్రార్ధించే వా టికీ జవాబు ఎలా ఇవ్వాలో ప్రభువునకు తెలుసు, అందుకోసం ఓపికతో ప్రార్ధించాలి [1పేతురు 5 :6 ; కీర్తన 37 :4 -6 ]

విధేయతతో ప్రార్ధించాలి [2 దిన 7 :14 ]

ప్రభు సన్నిధిలో ప్రార్ధించునప్పుడు మనలో అహం భావండంబము ఉండరాదు తగ్గింపు జీవితం కలిగి విరిగి నలిగిన మనసు ఉండాలి [లూకా 18 :10 -14 ].

విశ్వాసముతో ప్రార్ధించాలి [మత్త 21 :22 ].

ప్రతికూలతులను బట్టి మనము కృంగిపోకుండా ధైర్యముకలిగి విశ్వాసంతో ప్రార్ధించాలి. [మత్త 8 :5 -13 ].

దేవుని చిత్తప్రకారము ప్రార్ధించాలి [ 1యోహాను5 :14 ] 

ప్రార్ధనలో ఏమి కావాలో ఎంత కావాలో విస్తరించి మాట్లాడక ఆత్మ నడిపింపుతో ప్రార్ధించాలి.[1యోహాను  ౩ : 22 ].

పరిశుద్ధాత్మలో ప్రార్ధించాలి[యూదా1 :2o ].

పెదవులతో వచ్చే ప్రార్ధన కాక పరిశుదాత్మ మనలో ఉంటే మనము ఆత్మలో ప్రార్ధించగలము. [రోమి 8 :9 ; 1 కోరిం14 :14 -15 ].

ముగింపు :

శ్రీసభ ద్వారా శ్రీసభ సభ్యులమైన మనము పాపముతో నిండిపోయిన ఈలోకము తరుపున మధ్యవర్తిత్వం వహించాలి. యేసు ప్రభువు ప్రార్ధన చేసిన విధానమును గమనించిన శిష్యులు ప్రేరణ పొంది తమకు కూడా ప్రార్ధన నేర్పమని వచ్చి అడిగారు. మన ప్రార్ధన విధానమును బట్టి మన జీవిత విధానమును బట్టి ఇతరులకు అన్యులకు ప్రేరణ కల్పించాలి. దేవుడు ప్రజలను శిక్షించటానికి బదులుగారక్షించటానికి సిద్ధంగ వున్నాడు అని ఈరోజు పరిశుద్ధ గ్రంధం మొదటి పఠనంలో అబ్రాహాము ప్రార్ధన ద్వారా మనము వినియున్నాము. కాబట్టి ప్రియమైన స్నేహితులారా మనము కూడా అటువంటి గొప్ప ప్రార్ధన శక్తితో దేవుని యెడల విశ్వాసం కలిగి జీవించాలి అని ఆయన ఆశీర్వాదములు దీవెనలు పొందుకోవాలి అని ఎల్లప్పుడు దేవునికి విధేయతభయముకలిగి జీవించాలి అని మన జీవితాలనుకుటుంబాలను ప్రభునికి సమర్పిస్తూ ప్రార్ధన జీవితం కలిగి దేవునిలో ప్రార్దించుదాం.  ఆమెన్.

బ్రదర్. మనోజ్. ఓ సి డి 

 

 

            

 

 

               

                                    

                     

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...