15, అక్టోబర్ 2022, శనివారం

29వ ఆదివారము

 

29 ఆదివారము

నిర్గమ 17:-8-13 

2తిమోతి 3:-14; 4:-2

లూకా 18:- 1 - 8

క్రీస్తు నాదునియందు ప్రియా దేవుని బిడ్డలారా ఈనాడు తల్లి తిరుసభ 29  సామాన్య ఆదివారములోనికి అడిగిడుతుంది. ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మనకు తెలియ చేసే అంశం ఏమిటంటే పట్టుదలతో ప్రార్థన చేయటం.

ప్రార్థన అనగానే అందరికి సుపరిచితంగా ఉంటది. ఎంతో మంది ప్రార్థనలో వారు పొందిన అనుభూతిని ఎంతో చక్కగా వర్ణిస్తుంటారు, వివరిస్తుంటారు.

ఎవరు ప్రార్థన చేస్తారు? ఎందుకు ప్రార్థన చేస్తారు?  ఐన ప్రభువుకి మన హృదయాంతరంగములు తెలుసు కదా మరి ఎందుకు ప్రార్థన చేయటం?

ఎవరైతే అవసరములలో ఉంటారో వారు దేవుని ఆశ్రయిస్తారు వారు దేవున్ని ప్రార్థిస్తారు వారి యొక్క అవసరములను తీర్చమని ప్రార్థన ద్వారా వేడుకుంటారు

అసలు ప్రార్థన అంటే ఏమిటి?

 కొంతమంది పునీతుల మాటలలో ప్రార్థన అంటే ఏమిటో వారి జీవితములో పొందిన అనుభూతి ద్వారా తెలుసుకుందాం

కార్మెల్ సభ పునీతురాలైన పునీత ఆవిలాపూరి తెరేస్సమ్మగారు ప్రార్థన గురించి ఇలా అంటున్నారు ప్రార్థన అంటే ఇద్దరి స్నేహితులు ఒకరిని ఒకరు ఎరిగినవారి మధ్య  జరిగే సంభాషణ లాంటిది అని

అదేవిధంగా మరొక కార్మెల్ పునీతురాలైన పునీత చిన్న తెరేసమ్మగారు అంటున్నారు ప్రార్థన హృదయానికి ఉప్పెన లాంటిది ప్రార్థన గుండె చప్పుడు లాంటిది ప్రార్థన అంటే దేవుని వైపు కన్నులెత్తి చూడటం, బాధ ఐన కష్టమైన, సంతోషమైన హత్తుకొని ఉండటం.

మరొక కార్మెల్ పునీతురాలు పునీత ఎలిజబెత్ అఫ్ ట్రినిటీ అంటున్నారు దేవుడిని మన మదిలో తలంచుకొంటే చాలు మనం పని చేసేటపుడు కూడా ప్రార్థన చేయవచ్చు అని.

కార్మెల్ సభ పునీతుడు అయినటువంటి పునీత సిలువ యోహాను గారు అంటున్నారు ప్రార్ధనను ఎవరైతే  దూరంచేస్తారో అట్టివారు మంచి వాటన్నిటికీ దూరమవుతారు అని. ఇలా ఒకొక్కరు వారి జీవితాలలో పొందిన ప్రార్థన అనుభూతిని వారి మాటలలో చెపుతూ ఉంటారు

మనం ఎలా ప్రార్థన చేయాలి?

మత్తయి సువార్తలో ప్రభువు చక్కగా చెపుతూ ఉన్నారు ప్రార్ధించటానికి అన్యులు వలే వ్యర్థ పదములు ఉపయోగించకుండా గదిలోనికి వెళ్లి తలుపులు మూసి అదృశ్యుడై ఉన్న నీ తండ్రిని ప్రార్ధించండి (మత్తయి 6 :6) అదేవిదంగ పరలోక ప్రార్ధనను కూడా మనకు ఇచ్చారు. ప్రార్థనలో ఏమి అడిగినను అది దయచేస్తాను అని అభయమిచ్చారు. కానీ ప్రార్థన ఎలా ఉండాలి ఎలా చేయాలి అని ఈనాటి పఠనాల ద్వారా దేవుడు మనకు తెలియ చేస్తున్నాడు.

మొదటి పఠనంలో మోషే ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలు యుద్ధంలో గెలవటానికి ప్రార్థన చేస్తున్నాడు

పట్టుదలతో మోషే ప్రవక్త విడవకుండా దేవున్ని ప్రార్దిస్తున్నాడు.

మోషే ప్రవక్త చేతులు బరువెక్కి ఎప్పుడైతే దించుతున్నాడో ఇశ్రాయేలు ప్రజలు యుద్ధంలో ఓడిపోవటం చూస్తున్నాము.

చేతులు పైకెత్తినంతసేపు ఇశ్రాయేలు ప్రజలు గెలుస్తున్నారు ఎపుడైతే దించుతున్నాడో వారు ఓడిపోతున్నారు. ప్రార్థన తోడునంతసేపు ఎవరైనా విజయాన్ని పొందుతారు.

ఒక వ్యక్తి అంటున్నాడు ప్రార్థనతో  మొదలు పెట్టిన ప్రతిదీ విజయంతో ముగుస్తుంది అని. దేవుడు తోడునంతసేపు విజయమే వరిస్తుంది. పాతనిబంధనలో చూస్తున్నాము దేవుని సన్నిధి దేవుని మందసపు పెట్ట ఎవరిచెంతన ఉంటుందో వారు విజయాన్ని పొందుతున్నారు.

మనం ప్రార్థన పట్టుదలతో చేయాలి ప్రార్థనలో ఎప్పుడు నిరాశ చెందకూడదు పట్టువిడవక చేయాలి.

మోషే గారు కూడా చేతులు భారమైన విడవకుండా పట్టుదలతో ప్రార్థన చేస్తున్నారు.

అదేవిధంగా మన ప్రార్థన ఇతరులకొరకై  కూడా ఉండాలి. అవసరాలలో ఉన్న వారికొరకు ప్రార్థన చేయాలి. మోషే ప్రవక్తలాగా ఇశ్రాయేలు ప్రజలు విజయం కొరకు ఎలా ప్రార్థన చేసారో అబ్రాహాము గారు సోదోము, గొమొఱ్ఱా ప్రజలకోసం ఏవిధంగా దేవున్ని ప్రార్దించారో మనం కూడా మన పొరుగు వారి కోసం ప్రార్ధించాలి. క్రీస్తు ప్రభువు చెప్పినట్లు తన స్నేహితుని కొరకు ప్రాణము దారపోయువాని కంటే అధికుడు ఎవడును లేడు అని.

రెండొవ పఠనంలో పౌల్ గారు కూడా చెపుతున్నారు మీరు దేనినైతే నమ్మారో దాని యందె విశ్వాస ముంచండి అని

ఎఫెసులో జరిగే అలజడులకు పౌల్ గారు వారికీ  లేక రాస్తూ దేవుని యందె విశ్వాసముంచండి పవిత్ర గ్రంధములో రాసిన ప్రతిదీ కూడా పవిత్రాత్మ ప్రేరణ వలననే రాయబడినది మీరు దాని యందె విశ్వాసముంచండి అని పౌల్ గారు చెపుతున్నారు. మాటలకు సాధ్యపడనిధీ ఆత్మ ద్వారా సాధ్యము (రోమా 8 :26 )

సువిశేష పఠనంలో కూడా క్రీస్తు ప్రభువు చెపుతున్నారు యెడతెగక పట్టుదలతో ప్రార్ధించమని.

కీర్తన కారుడు 93వ కీర్తనలో చెప్పినట్లు నిన్ను సృష్టించిన వాడు నువ్వు పిలిస్తే పలకడా అని

నువ్వు పదే పదే ప్రార్థనలో అడిగితె దేవుడు తప్పక దయచేస్తాడు

దావీదు దినముకు 7 సారులు ప్రార్థన చేసేవాడు దానియేలు దినముకు 3సారులు ప్రార్థన చేసేవాడు అలానే మనము కూడా ప్రార్థన చేయటానికి వెనకాడకూడదు ప్రార్థన చేసేటపుడు సహనము ఉండాలి సహనంతో కూడిన ప్రార్థన దేవుడు తప్పక వింటాడు

మౌనికమ్మ గారి ప్రార్థన వినట్లు హన్నా గారి ప్రార్థన వినట్లు మన ప్రార్థన కూడా వింటాడు

క్రై స్తవులమైన మనము మన జీవితము ప్రార్థన అవ్వాలి చేతలు కాదు.

బ్రదర్ లూకాస్ ఓ సి డి

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...