2, మార్చి 2023, గురువారం

 

తపస్సు కాల మొదటి వారం - శుక్రవారం
యెహెజ్కేలు 18: 21-28
మత్తయి 5: 20-26

(బాధ్యత, సఖ్యత  మరియు ఐక్యత)


క్రిస్తునాడుని యందు ప్రియ సహోదరి సహోదరులారా ఈనాటి పఠనాలు మన వ్యక్తిగత బాధ్యతను చాల ముఖ్యమైనదిగ పరిగణించాలని, ఒకరితో ఒకరు మరియు దేవునితో సఖ్యత/ రాజీపడాలని మరియు ఇతరులతో మన సంబంధాన్ని కలిగి ఉండాలని మరియు ఆ విధంగా ఆశీర్వదించబడేలా తిరిగి ఐక్యమవ్వాలని  ఆహ్వానిస్తున్నాయి.

ప్రస్తుత క్షణంలో వ్యక్తిగత బాధ్యత

ఈరోజు మొదటి పఠనంలో యెహెజ్కేలు ప్రవక్త నుండి రెండు ఆసక్తికరమైన మరియు కొంత ఆశ్చర్యకరమైన ప్రకటనలను మనం చూస్తున్నాము  “ ప్రభువైన ప్రభువు ఇలా అంటున్నాడు: దుష్టుడు తన పాపముల నుండి వైదొలగి నా చట్టములను పాటించెనేని, న్యాయసమ్మతమైన మంచి పనులు చేసెనేని, చావును తప్పించుకొని బ్రతుకును.” ఇంకా మరోవైపు " కానీ సజ్జనుడు తన సత్కార్యములు నుండి వైదోలియాగి దుష్క్యార్ములకు పాల్పడి, దుష్టులు చేయు హేయమైన కార్యములు చేసెనేని, బ్రతుకున ?, అతను చనిపోతాడు."

ఇది ఆశ్చర్య పరిచేలా  అనిపిస్తుంది, ధ్యానం చేయవలసిన  మరియు అర్థం చేసుకోవలసిన అంశం ఏమిటంటే ఇది ప్రస్తుత క్షణంలో వ్యక్తిగత బాధ్యత మరియు చర్య గురించి అని, ఏవిధంగా ఉంటున్నాము అని అర్ధం చేసుకోవాలి. ఈ సమయంలో నేను ఎలా ఉన్నాను మరియు ఈ సమయంలో దేవుడు మరియు ఇతరులతో నా సంబంధం ఎలా ఉంది అనేది ముఖ్యం. వాస్తవానికి ఇది మన జీవితంలోని ప్రతి క్షణాన్ని అతి ముఖ్యం గ పరిగణించమని ఆహ్వానిస్తుంది. దేవుడు మనల్ని ఖండించడం కాదు, కానీ మన ఎంపికల వల్ల మనం దాని పర్యవసానాలను మరియు  పరిణామాలను మన తలపైకి తెచ్చుకుంటున్నాము. ప్రతి ఒక్కరు ఎవరి చర్యలకు వారే బాధ్యత వహించాలి.

      ఇక్కడ  మనం మన మంచి పనుల గురించి గర్వించనవసరం లేదు మరియు మంచి చేశా కదా అని  తప్పు దిశలో తిరగ కూడదు, స్వతహాగా మరియు స్పృహతో భగవంతుని నుండి మరియు మంచి పనుల నుండి మనల్ని దూరం చేసుకుంటే, దానికి సంబంధించి  పర్యవసాన ఫలితాలను పొందుతారు.

      ప్రస్తుత క్షణం (ఇప్పుడు) మన పాపపు జీవనం యొక్క దిశను మార్చడానికి మరియు సరైన మార్గం వైపు మళ్లడానికి ఒక అవకాశం. దానిని స్వీకరించి మలచుకుంటే మీరు ఆశీర్వదించబడతారు.

కాబట్టి, మనం మంచి జీవితాన్ని కొనసాగించాలని, మనలో అత్యుత్తమ సంస్కరణగా ఉండాలని, సరైన మార్గంలో ఉండాలని మరియు ప్రతి క్షణం దేవుని వద్దకు తిరిగి రావాలని  కోరిక. దేవుడు అది గుర్తించి దానికి అనుగుణంగా  ప్రతిస్పందిస్తారు.

ఉదాహరణకు: సిలువపై దొంగ, తనకున్న చివరి క్షణంలో పశ్చాత్తాపపడ్డాడు మరియు శాశ్వత జీవితాన్ని పొందాడు.

ఈనాటి సువార్తలో యేసు మనకు  తోటి సహోదరి సహోదరులతో  వ్యక్తిగతం గ ఏవిధంగా ఉండాలి, ఎటువంటి  బాధ్యత ఉంది అని తెలియచేస్తున్నారు ఒక  ముఖ్యమైన ఉదాహరణ   క్రీస్తు ఇలా అన్నారు, “నేను ధర్మశాస్త్రాన్ని లేదా ప్రవక్తల ప్రభోధములను  రద్దు చేయడానికి వచ్చానని తలంపవలదు; నేను వచ్చినది వానిని సంపూర్ణ మొనర్చుటకే గాని, రద్దు చేయుటకు కాదు. ధర్మం మరియు ఆధ్యాత్మిక జీవనం కేవలం చట్టాన్ని బాహ్యంగా పరిశీలించడం మాత్రమే కాదు, హృదయాన్ని క్రమబద్ధీకరించడం. అందుకే యేసు చట్టాలను వాటి యొక్క అంతరార్ధాన్ని వెల్లడించారు మరియు పరిపూర్ణతను చేసారు. నరహత్య చేయరాదు అనే ఆజ్ఞ గురించి వివరిస్తూ,

 

మన సహోదరులు సహోదరులతో  ఈ సమయంలో సఖ్యత  మరియు ఐక్యత ప్రాముఖ్యత గురించి యేసు మాట్లాడుతున్నారు. అందువల్ల మన హృదయాలలో కోపంతో ఆజ్యం పోస్తే, అది మన సంబంధాలను నాశనం చేసే విధంగా నడిపిస్తుంది. “ కనుకనే ఒకవేళ మీకు కోపము వచ్చినచో, ఆ కోపము మిమ్ము పాపములోనికి లాగుకొనిపోకుండా చూచుకొనుడి, సూర్యుడు అస్తమించు లోగ  మీ కోపము చల్లారి పోవలెను.” (ఎఫెసీయులు 4:26). మరియు అవమానించడం కూడా ఒక చంపడం లాంటిది, పదాలు చాల శక్తివంతమైనవి. "కత్తి వల్ల కలిగే గాయాలు మానవచ్చు, కానీ మాటల వల్ల కలిగే గాయాలను ఏదీ మాన్పించదు." అవి హృదయాన్ని గాయపరచి గలవు  లేదా స్వస్థపరచగలవు, అవి  అవమానించగలవు  లేదా విముక్తి చేయగలవు , అవి కలలను బద్దలు చేయగలవు  లేదా వాటిని శక్తివంతం చేయగలవు, అవి నిర్మించగలవు  లేదా నాశనం చేయగలవు”.అందువలన, మన మాటలతో సోదరుడిని లేదా సోదరిని అవమానించడం సంబంధాలను విచ్ఛిన్నం చేస్తుంది. అయితే, ఈ రోజు, ఇది మనకు రెండవ స్వభావంగా మారింది, ఇతరుల ముందు అవమానించడం మరియు హేళన గ పిలవడం, చెడు చెప్పడం, పుకార్లు పుట్టించడం, అపవాదు, నిందలు  మరియు పేరు చేద గొట్టడం. ఇది ఇతరులను చంపడం వంటిదే. మరియు పగను కలిగి ఉండకూడదని యేసు చెప్పాడు, మన సహోదరుడిని లేదా సోదరిని దూరం చేయడానికి మన హృదయాలలో ఉన్న పగ, దేవుని దృష్టిలో మంచిది కాదు. అది చంపడం వంటిదే

దేవుడు మన సమర్పణను అంగీకరించడు, మన సహోదరులు మరియు సోదరీమణుల పట్ల మన హృదయాల తీరు  కారణంగా మనం చేసే స్తుతులు మరియు ఆరాధనలతో సమయాన్ని వృధా చేయడమే తప్ప నిజాయితీ లేదు. కాబట్టి ముందుగా సఖ్యత పదండి అని ఆహ్వానం.  లేకపోతే మన వైఖరికి, మనం వెళ్తున్న తప్పు దారికి తగిన పరిణామం ఉంటుంది. మొదటి దేవుడు చెప్పాడు, ఒక వ్యక్తి ధర్మబద్ధమైన జీవితం నుండి చెడు జీవితంలోకి మారితే అతను చనిపోతాడని మరియు సువార్తలో అతను పరలోక రాజ్యానికి ఆహ్వానం లేదు అని  మరియు జైలులో పడవేయబడతాడని మనం తెలుసుకున్నాము .

కాబట్టి, క్రీస్తులోని ప్రియమైన సహోదరి సహోదరులారా, తపస్సు కాలం అనేది మనకు ఇష్టమైన భోజనం లేదా టీవీని వదులుకోవడం మాత్రమే కాదు, ఇది పాపాన్ని విడిచిపెట్టడం, చెడు జీవితాన్ని విడిచిపెట్టడం, మన హృదయ వైఖరిని మార్చడం మరియు దేవుని నుండి, ఇతరుల నుండి మరియు మనకు దూరం చేసే ప్రతిదానికీ సంబంధించినది విడిచి పెట్టడం.

గుర్తుంచు కోవలసిన అంశాలు.

బాధ్యత - ప్రస్తుత సమయానికి, మన మాటలు మరియు చర్యలకు

సఖ్యత  - పాపం నుండి పుణ్య జీవితం లోకి , కోపం నుండి ప్రేమ లోకి  (ఒకరి హృదయం & మార్గంలో మార్పు ద్వారా సఖ్యత)

ఐక్యత  - దేవునితో, ఇతరులతో మరియు వ్యక్తిగతంగా.

 

 FR. JAYARAJU MANTHENA OCD

 

 

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...