29, అక్టోబర్ 2022, శనివారం

31 వ సామాన్య ఆదివారం

 31 వ సామాన్య ఆదివారం

సో. జ్ఞా. 11:22-12:2,  2 తెస్స 1:11-2:2 ,  లూకా 19:1-10

 ఈనాటి దివ్య పఠనాలు దేవుని యొక్క అనంతమైన ప్రేమ గురించి తెలుపుచున్నవి. పాపులను రక్షించుటకు దేవుడు ఎప్పుడు సిద్ధంగా వుంటారు. దేవునిమన్నింపు  పొందినమనము హృదయ పరివర్తన చెంది జీవించాలి.

జక్కయ్య మారుమనసు పొందుట

యేసుప్రభు రోజు సువిశేషంలో జక్కయ్య యొక్క జీవితంను పరిశీలించుటకు వచ్చారు. సువిశేషంలో ఇద్దరు వ్యక్తులను చూస్తున్నాం ఒకరు రక్షించాలి అని అనుకునేవారు, ఇంకొకరు రక్షణ పొందాలని అనుకునేవారు.

జక్కయ్యలోని రక్షణ పొందాలనే కోరిక ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి. యేసుప్రభువు యెరికో పట్టనంలోకి ప్రవేశిస్తారని గ్రహించిన వ్యక్తి ప్రభువును కలవటానికి వస్తున్నారు. దేవుడు వస్తున్నారని వారి ఇంటి గుండా పోతున్నారని తెలుసుకున్న వ్యక్తి చూడటానికి వస్తున్నారు. దేవుడు మన ఇంటిలోకి కూడా వచ్చే సమయాలు మన సంఘంలోనికి వచ్చే సమయాలు చాలా ఉన్నాయి. మన గ్రామంలో ప్రార్థన పెట్టినప్పుడు మైకు తీసుకొని చెబుతారు ఫాదర్ వచ్చారు పూజకు రావాలి అని.  ఎంతమంది ఇలాగ ప్రార్థనకు వస్తున్నాం. జక్కయ్యకు అవకాశం వచ్చింది. ప్రభువు అటు వెళ్తున్నారని తెలుకున్న ఆయన   వచ్చిన అవకాశము సద్వినియోగం చేసుకున్నారు.యేసుప్రభువు గెన్నేసరేతు ప్రాంతమునకు వెళ్ళినప్పుడు కూడా అక్కడికి రోగులను తీసుకొని వచ్చారు- మార్కు 6:55-56.

గ్రుడ్డివాడు ప్రజల కేకలను వింటున్నారు, యేసుప్రభు అటుగా వస్తున్నారని తెలుసుకున్నాడు అందుకే బిగ్గరగా అరుస్తున్నారు(లూకా 18:37,38. మార్కు 10: 46-52 -బర్తిమయి యేరికోలో చూపు పొందుట). దేవుడు వారి మార్గం గుండా పోతున్నారని వారు తెలుసుకున్నారు అందుకే దేవుడిని   కలవాలని వెళ్ళుచున్నారు. సువిశేషం గురించి ధ్యానించే ముందు యెరికో నగరం గురించి తెలుసుకోవాలి. యెరికో పట్టనం ఒక సంపద కలిగిన ప్రదేశం, వనరులు ఎక్కువగా ఉండే స్థలం.  రోము నగరస్తులు వర్తకానికి వచ్చేవారు. అక్కడ అధిక సంపదలు ఉంటాయి కాబట్టి సొమ్ము చేసుకోవడానికి రోము నగరస్తులు వస్తారు. డబ్బు ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి జక్కయ్య కూడా అధికంగా సుంకం వసూలు చేసేవారు. జక్కయ్య డబ్బు సంపాదించుటలో ఒక గొప్ప స్థాయికి ఎదిగాడు కానీ దైవ ప్రేమను పొందుటలో సోదర ప్రేమను పంచుటలో ఆయన ఎదగలేకపోయారు.ఆయన సంపాదనలైయితే పెరిగాయి కానీ స్నేహితులు పెరగలేదు. ఆయనను అందరూ ద్వేషించారు ఎందుకంటే ఎక్కువగా సుంకం వసూలు చేసేవారు కొంత రోమాను చక్రవర్తులకు కొంత తన సొంత లాభానికి . ద్వేషించబడే వ్యక్తి సంఘంలో జీవించుట చాలా కష్టం అయినా జక్కయ్య నివసిస్తున్నారు. సువిశేష పఠనంలో మూడు ముఖ్యమైన స్థాయిలు ఉన్నాయి.

1. ఆయన ధనికుడు: ధనం ఉంది కానీ సంతోషం లేదు (లూకా 12: 16-21). ధనం ఉన్న వాళ్ళు అందరూ కూడా సంతోషంగా ఉండలేరు. డబ్బు పెట్టి double cot ను కొనవచ్చు కానీ నిద్ర నువ్వు కొనలేము. డబ్బు పెట్టి బిర్యానీ కొనవచ్చు కానీ ఆకలిని కొనలేము. డబ్బు పెట్టి వస్తువులను కొనవచ్చు కానీ సంతోషాన్ని కొనలేము. డబ్బుతో అంతా మనము కొనలేం. జక్కయ్య ధనమే సర్వం అనుకొని ధనంకు తన జీవితంలో ప్రాధాన్యత ఇచ్చి ధనం దగ్గరే ఉన్నాడు. నీ సంపద ఉన్న చోటనే నీ హృదయం ఉండును.- మత్తయి 6:21.

జక్కయ్యకు దేవుడిచ్చిన స్వేచ్ఛ వలన ఆయన ఎన్నుకుంటున్నారు తన యొక్క పాపపు జీవితాన్ని. అన్యాయపు మార్గము వలన ఆయన ప్రజలను కోల్పోతున్నారు. మనం ఎలా ఉండాలన్నా మనమే నిర్ణయం తీసుకుంటాం.

- పవిత్రంగా ఉండాలి- పాపిగా ఉండాలి

- మంచి కోడలిగా- మంచి భార్యగా

- తండ్రిగా - భర్తగా

- బిడ్డగా - కూతురిగా

అని మనకు ఇవ్వబడిన స్వేచ్ఛను బట్టి మన మార్గం ఎన్నుకొంటాం. యూరప్ ఖండంలో 15 సంవత్సరాలు వస్తే వారి దారి వారే చూసుకోవాలి ఎందుకంటే ఇవ్వబడినటువంటి స్వేచ్ఛను బట్టి. ఆదాముకు ఇవ్వబడిన స్వేచ్ఛలో ఆయన తన మార్గం ఎన్నుకొన్నారు, పండు తిన్నారు -ఆది 3:6. శిష్యులకు కూడా స్వేచ్ఛ ఇవ్వబడింది యేసుప్రభువు దివ్య సత్ప్రసాదం గురించి చెప్పినప్పుడు అయితే మార్గం ఎన్నుకునేది స్వేచ్ఛ వలన- యోహాను 24:15,16. మనం కూడా మంచి మార్గాన్ని ఎన్నుకుంటే మన జీవితాలు ఫలప్రదంగా ఉంటాయి. జక్కయ్య ప్రభువు గురించి విన్నారు, వినుట వలన విశ్వాసం వచ్చింది- రోమీ 10:17. మనం కూడా వింటాం మంచి మాటలు అయితే అందరితో కలిసి పోతాం. ప్రసంగం చెప్పే వాళ్ల గురించి వింటే గుడికి వస్తాం. యేసుప్రభువు పాపుల యొక్క స్నేహితుడని విన్నారు అందుకే ఆయనను కలవాలని అనుకున్నారు- మత్తయి 11:16-19.

2. యేసు ప్రభువును చూడాలని కోరిక, నిర్ణయం.

ఒక్కసారి దేవుని గురించి విన్న తరువాత ఆయనను చూడాలని కోరిక ఆయనలో కలిగింది. మనలో కూడా దేవుని చూడాలని కోరిక ఉండాలి. కోరిక ఉంటే చదవగలం. పవిత్ర గ్రంథంలో కొన్ని ఉదాహరణలు చూస్తున్నాం:  రక్తస్రావంతో బాధపడే స్త్రీ. ప్రభు అంగీని తాకాలని కోరిక వచ్చింది తాకుతుంది. రోగులు స్వస్థత పొందాలని కోరికతో వచ్చారు పొందుతున్నారు. కోరిక ఉంటే చాలదు దానికోసం ప్రయత్నించాలి. జక్కయ్య ధైర్యంగా ఉన్నటువంటి వ్యక్తి. సమాజంలో అన్యాయం చేసే వ్యక్తిని ఎవరు ఇష్టపడరు. తనను ఏమనుకున్నా పర్వాలేదు అని అనుకున్నాడు, కొట్టిన తిట్టిన ఏమి చేసినా సరే. కొన్నిసార్లు మనం సమాజంలో ఉన్నప్పుడు భయపడతాం. గుడికి వెళ్లాలన్నా, ప్రార్థన బయటకు చెప్పాలన్నా, దివ్య సత్ప్రసాదం తీసుకోవాలన్నా, కానీ జక్కయ్యలో మాత్రం దేవుని కలవాలనే కోరిక చాలా ధృడంగా ఉండిపోయింది. పునీత అవిలాపురి తెరేసమ్మ గారు అంటున్నారు ప్రతి ఒక్కరం ధృడ సంకల్పం కలిగి ఉండాలి, ఎటువంటి వాటికి వెనుదీయక మనం అనుకున్నదానిలో ముందుకు సాగిపోవాలి. మనం కూడా ఇలాగే ఉండాలి.

3. జక్కయ్య తాను ఇక నుండి ఒక కొత్త వ్యక్తి అని సమాజానికి చూపించారు అంటే తాను మారుమనస్సు పొందానని చెప్పాడు.

 యేసుప్రభుతో ఉంటే మన జీవితాలు మారతాయి.

శిష్యులు- మార్కు 3:14.

వ్యభిచారమున పట్టుబడిన స్త్రీ- యోహాను 7:53–8:11

సౌలు ధమస్కు వెళ్లే మార్గంలో- అపో 9:1….

జక్కయ్యకు ఒక మంచి స్నేహితుడు దొరికాడు. యేసుప్రభువును కలిసినప్పుడు మనలో కూడా మార్పు రావాలి. అప్పుడే ఆయన యొక్క రాకడకు అర్థం ఉంటుంది. ప్రభువు మనతో ఉండాలి అంటే మనం కూడ మన జీవితంలో క్రిందికి దిగి రావాలి.

ఎక్కడి నుంచి క్రిందకు రావాలి?

1. మూఢనమ్మకాలు

2. పాపం నుండి

3. గర్వం నుండి

4. చెడు వ్యసనాల నుండి

5. కోపం, ద్వేషం, పగల నుండి

6. ఆస్తులు అంతస్థుల నుండి

అలా ఉంటేనే దేవుడు నీతో ఉంటారు నాతో ఉంటారు. మనం కూడా తగ్గింపు కలిగిన జీవితాన్ని జీవిస్తేనే దీవెనలు ఎక్కువగా వస్తాయి. అవకాశం ఒక్కసారే వస్తుంది వచ్చినప్పుడు జీవితాలను మార్చుకోవాలి.


BY. FR. BALAYESU OCD

దైవ వాక్కు ధ్యానము : జక్కయ్య యేసు ప్రభువు కలుసుకొనుట (లూకా 19: 1-10 )

దైవ వాక్కు ధ్యానము : జక్కయ్య యేసు ప్రభువు కలుసుకొనుట (లూకా 19: 1-10 ):  జక్కయ్య యేసు ప్రభువు కలుసుకొనుట  లూకా 19: 1-10  యేసు యెరికో పట్టణమున ప్రవేశించి దానిగుండ వెళ్ళుచుండెను . అక్కడ సుంకరులలో ప్రముఖుడు ...

22, అక్టోబర్ 2022, శనివారం

30 వ సామాన్య ఆదివారం

 30 సామాన్య ఆదివారం

సిరాకు  35 : 12-14, 16-18

2  తిమోతి  4: 6-8, 16-18

లూకా  18: 9-14

ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మనం దీనతతో చేసే ప్రార్ధనలు దేవుడు ఆలకిస్తారు అనే విషయమును బోధిస్తున్నాయి.

గత రెండు వారాలుగా ప్రభువు ప్రార్ధన అనే అంశం గురించి బోధిస్తున్నారు. 28 ఆదివారం సువిశేష గ్రంధంలో పది మంది కుష్ఠరోగులు క్రీస్తు ప్రభువునకు చేసిన ప్రార్ధన గురించి వింటున్నాం. 29 ఆదివారం సువిశేష పఠనంలో ఒక వితంతువు చేసిన ప్రార్ధన గురించి వింటున్నాం.

ఈనాటి దివ్య పఠనాలు మరొకసారి ప్రార్ధన గురించియే తెలుపుచున్నాయి. మన యొక్క విశ్వాస జీవితంలో దేవునికి ప్రార్ధించే సమయంలో వినయం ఉండాలి అని తెలుపుచున్నారు. దేవుడికి సమస్తము తెలుసు కాబట్టి ఆయన ముందు గొప్పలు చెప్పుకోకుండా వినయంతో ప్రార్ధించమని కోరారు.

ఈనాటి మొదటి పఠనంలో రచయిత దేవుడు దీనుని యొక్క ప్రార్ధన ఎలా ఆలకిస్తారో తెలుపుచున్నారు. దేవుడు పక్షపాతము లేనివాడు ఆయన యొక్క దృష్టిలో అందరూ సరిసమానులే. దేవుడు అందరిని ప్రేమతో తన చెంతకు చేర్చుకుంటారు. దేవుని యొక్క మాట అనుసారంగా జీవించే వారందరి యెడల దేవుడు పక్షపాతం చూపించరు.

దేవుడు అందరి యొక్క మొరలను ఆలకిస్తారు అయన కొందరు మొరలు ఆలకించి, కొందరి మొరలను ఆలకించకుండా వుండరు. ఎవరైతే ఆయనకు నిజాయితీగా ప్రార్ధిస్తారో వారి ప్రార్ధన దేవుడు ఆలకిస్తారు.

దేవుడిని ఎవ్వరు డబ్బుతో కొనలేరు. మనం అన్యాయంగా సంపాదిచిన డబ్బుతో దేవుణ్ణి సంతృప్తి పరచలేము. అన్యాయంగా సంపాదించిన ప్రతిదానిని దేవునికి అర్పించవలదు అని అంటున్నారు.

దేవుడ్ని మన యొక్క మంచితనం, వినయం ద్వారానే మెప్పించగలము. అన్యాయంగా అర్ధించినది అంటే మన యొక్క హృదయం పాపం చేసి దానిని దేవునికి సమర్పిస్తే అది సరిగా  ఉండదు.

పేద విధవరాలు నిజాయితీగా సంపాదించిన రెండు కాసుల వలన దేవుణ్ణి సంతృప్తి పరచగలిగారు. ధనికులు అన్యాయంగా సంపాదించినది కానుకల పెట్టెలో వేసినపుడు అది ప్రభువునకు సంతృప్తి పరచలేక పోయినది. - మార్కు 12: 41 - 44

ప్రభువు పేదలకు అన్యాయం చేయరు అని వింటున్నాం. దేవుడు ఎంతో కరుణ, జాలి కలిగిన వారు. దేవుడు పేదవారి యొక్క ఆక్రందనలు వింటారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో వున్న సమయంలో వారందరు పేదవారే, దేవుడు వారికి న్యాయం చేస్తున్నారు మరియు వారి యొక్క బాధలనుండి బయటకు తీసుకొని వస్తున్నారు.

పేదవారు అంటే తన యొక్క అవసరంలో వున్న వారు. దేవుని అవసరం వుండి విశ్వాసంతో ఎవరైతే మొరపెడతారో వారికి దేవుడు న్యాయం చేస్తారు. - కీర్తన 6 : 33 . దేవుడు బాధితులను అశ్రద్ధ చేయరు, అనాధల ప్రార్ధన విడిచిపెట్టారు అని ప్రభువు తెలుపుచున్నారు. వితంతువు వేడుకోలు ఆలకిస్తారు అని అంటున్నారు.

మనం హృదయ పూర్వకంగా వినయం కలిగి ప్రార్ధిస్తే దేవుడు మన ప్రార్ధనలు ఆలకిస్తారు అనే సత్యంను వెల్లడిస్తున్నారు.

మొదటి పఠనం ద్వారా మనం తెలుసుకోవలసిన ఇంకొక విషయం ఏమిటంటే దేవుడు తన ప్రజలను ఎప్పుడు కూడా ప్రేమతో చూసుకుంటారు, వారి ప్రార్ధనలు ఆలకిస్తారు, ఆయన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారు.

దేవుడు నీతిపరుడని, పక్షపాతం లేని వారని, జాలి ప్రేమ కలిగినవారిని, సమాజంలో గుర్తింపు లేని వారి యెడల ఆయన వారితో, వారి కోసం నిలబడతారని తెలుపుచున్నారు.

విశ్వాసులుగా మనందరం మంచి జీవితం జీవించాలి, పవిత్రంగా ఉండాలి, వినయంతో జీవించాలి.

ఈనాటి రెండవ పఠనంలో పౌలుగారు తన యొక్క పరిచర్య చివరిభాగం గురించి తెలుపుచున్నారు. పౌలుగారు తాను పొందబోయే మరణం ఎలాగ ఉంటుందో ముందుగానే తిమోతికి తెలుపుచున్నారు.

క్రీస్తుప్రభువు యొక్క పనికోసం మంచి పోరాటంనే పోరాడితిని అని పౌలుగారు పలుకుచున్నారు. తనయొక్క పరిచర్య జీవితంలో దేవుడు విధంగా తన కొరకు నిలిచారో తన యొక్క వినయంతో కూడిన ప్రార్ధన ఆలకించారో పౌలుగారు తెలిపారు.

తాను దేవుని పక్షమున పోరాడిన సందర్భంలో దేవుడు తనకు తోడు నిలిచి తనకు శక్తిని ఒసగినారు అని తెలిపారు. మనం క్రీస్తు కొరకు పోరాడాలి. పౌలు గారు ఒకప్పుడు చాలా గర్వంగా వున్న వ్యక్తియే, కానీ తాను మారిపోయి వినయంతో జీవించారు.

ఈనాటి సువిశేష పఠనంలో పరిసయ్యుడు-సుంకరి చేసిన ప్రార్ధన గురించి వింటున్నాం. ఉపమానం చెప్పటానికి కారణం ఏమిటంటే చాలా మంది ఎన్నుకొనబడిన యూదులు మనస్తత్వం ఏమిటంటే వారు మాత్రమే పవిత్రులని, నీతిమంతులని, పరలోకం పొందుటకు అర్హులని, దీవించబడిన వారని, దేవుని వారసులని, వారి ప్రార్ధననే దేవుడు ఆలకిస్తారని మిగతా వారి ప్రార్ధన ప్రభువు తృణీకరిస్తారనే ఆలోచనలో వున్న పరిసయ్యుల మనస్తత్వంను మార్చుటకు ప్రభువే ఉపమానం చెబుతున్నారు.

లూకా సువార్తికుడు తన యొక్క గ్రంధంలో పేదవారికి ప్రాముఖ్యతను ఇచ్చారు. పరిసయ్యుడు - సుంకరి జీవితం ద్వారా మనం కూడా కొన్ని విషయాలు నేర్చుకోవాలి.

పరిసయ్యుడు - సుంకరి ఇద్దరు కూడా ఒకే దేవాలయంకు ప్రార్ధన చేయటానికి వెళ్లారు. దేవాలయంలో  చేసిన ప్రార్థనకు శక్తి చాలా ఉంటుంది. ఇద్దరు  కూడా దేవునికి ప్రార్ధించారు. దేవుడు వారి ప్రార్ధన ఆలకించాలి అన్నదియే వారి యొక్క ఉద్దేశం. ఇద్దరు ఒకే దేవునికి ప్రార్ధించారు. ఇద్దరు ఒకే దేవుని ఆలయంలో ఉన్నారు. కానీ దేవుడు ఒకరి ప్రార్ధనయే ఆలకించారు ఎందుకంటే ఆయన దీనతతో ప్రార్ధించారు.

దేవునికి ప్రార్ధించే సందర్భంలో వీరిద్దరి యొక్క మనస్తత్వం విధంగా ఉన్నదో మనం ధ్యానించాలి. ఎవరిలాగా మనం జీవిస్తే దేవుని యొక్క అంగీకారం పొందుతాం అనే విషయాన్ని కూడా గ్రహించాలి. 

పరిసయ్యుడు దేవునికి ప్రార్ధించలేదు, తనతో తాను మాట్లాడుకున్నారు. ఆయన దేవాలయంకు వెళ్ళినది తన యొక్క గొప్పలు చెప్పుకోవటానికియే. ఒక నిజమైన ప్రార్ధన మనం దేవునికి మాత్రమే సమర్పించాలి.

పరిసయ్యుడు నేను లోభిని కాను, అన్యాయము చేయువాడను కాను, వ్యభిచారిని కాను, సుంకరివంటి వాడను కాను అని తన గురించి తాను గర్వ పడుతూ ఇతరులను కించపరుస్తూ తనకు తానే ప్రార్ధించుకున్నాడు. ఆయన హృదయంలో మనస్సులో గర్వం మాత్రమే ఉంది.

పరిసయ్యుడు ప్రార్ధించటానికి వెళ్ళలేదు దేవునికి తాను చేసే పుణ్య కార్యాల గురించి తెలపడానికి వెళ్ళాడు. నిజానికి దేవునికి అంతయు తెలుసు - కీర్తన 139:2. 139 కీర్తన మొత్తం కూడా దేవునికి అంతయు తెలుసు అనే విషయాన్ని తెలుపుతుంది.

దేవుని ఆలయంలో దేవుణ్ణి స్తుతించుటకు బదులుగా పరిసయ్యుడు తన్ను తాను పొగుడుకుంటున్నాడు. ఆయన దేవుని ముంగిట తనను తాను హెచ్చించుకుంటున్నాడు. తన యొక్క ప్రార్ధనలో ధీనతలేదు, అందుకే దేవుడు ఆయన్ను అంగీకరించలేదు. పరిసయ్యుడు గర్వంతో ఉన్నారు. గర్వం నాశనానికి కారణం. గర్వం దేవదూతలు సైతం సాతానులుగా చేస్తుంది. వినయం మనుషులను సైతం దేవుదుతలుగా మార్చుతుంది.

ఎవరైనా ప్రార్థిచేటప్పుడు ఇతరులతో పోల్చుకోకూడదు ప్రభువు దానిని అంగీకరించరు. పరిసయ్యుడు ఎదుటివారిని హేళన చేసి, తక్కువ చూపు చూసి ప్రార్ధిచాడు అందుకే దేవుడు అంతని ప్రార్ధన ఆలకించలేదు. మన జీవితాలను కేవలం దేవునితోనే పోల్చుకోవాలి.

సుంకరి ప్రార్ధన కన్నీటి ప్రార్ధన. ఆయన ప్రార్ధనలో నిజాయితీ వుంది, హృదయవేదన వుంది, ధీనతావుంది, పశ్చాత్తాపం ఉంది. సుంకరి దేవుడు కరుణామయుడని విశ్వశించాడు. దేవుడే తనను మన్నించి శుద్ధీకరిస్తాడని నమ్మాడు.

సుంకరి ప్రార్ధించేటప్పుడు దేవాలయంలో దూరంగా వున్నారు. ఆయన చేసిన పాపాలకు పశ్చాత్తాపపడ్డారు, పవిత్రమైన దేవుని సన్నిధిలో నిలుచుటకు యోగ్యత లేదు అని తెలుసుకున్నాడు.

తాను చేసిన పాపం వలన దేవునికి దూరమయ్యానని పశ్చాత్తాపపడ్డాడు. తన యొక్క పాపమే తనని ఒంటరిని చేసిందని గ్రహించాడు. తన పాపం చేయుటవలన పొరుగువారిని కూడా బాధపెట్టానని గ్రహించాడు. అందుకే అందరికి దూరంగా నిలుచుండి ప్రార్ధన చేసాడు. ఎంత దూరంగా ఉన్నప్పటికీ ఆయన హృదయపూర్వకంగా ప్రార్ధించాడు.

 సుంకరి కన్నులెత్తి చూడటానికి సైతము ఇష్టపడలేదు. ఆయన యొక్క పశ్చాత్తాప హృదయం దేవుని వైపు తిప్పారు కానీ తన యొక్క కన్నులు పైకెత్తలేదు. తన పాపభారం అంత గట్టిది అని గ్రహించారు.

తన రొమ్మును బాదుకుంటున్నాడు అంటే తాను చేసిన పాపాలకు అంతగా పశ్చాత్తాప పడుతున్నాడని అర్ధం. దేవుని పవిత్రతను గుర్తించాడు, తన పాపభారంను గ్రహించాడు అందుకే పశ్చాత్తాప పడుతూ ప్రార్ధించాడు.

దేవుని కరుణ కొరకు ప్రార్ధించాడు, దేవుని ముంగిట తాను పాపి అని ఒప్పుకున్నాడు అదేవిధంగా దేవుని కరుణ కొరకు ప్రార్ధించాడు.

దేవుని యొక్క మంచితనమును, దయను తెలుసుకున్న వ్యక్తి దేవుడు మన్నిస్తాడని గ్రహించాడు.  తన పాపం దేవుడిని బాధపెట్టానని పశ్చాత్తాపపడ్డాడు.  పశ్చాత్తాపంలో దేవునికి ప్రార్ధిస్తే మన్నిస్తారని సుంకరి తెలుసుకున్నాడు. లూకా 1 : 50, మీకా 7 : 18,  తీతు  3: 5, 4: 7, ఎఫెసీ 2: 4 - 5

దేవునికి భయపడేవారికి ఎల్లప్పుడూ ఆయన కరుణ దొరుకుతుంది.  రక్షణకై సుంకరి దేవుని మీద ఆధారపడ్డాడు. పరిసయ్యుడు తు.. తప్పకుండా అన్ని చేసినా దేవుడు అతని ప్రార్ధన అంగీకరించలేదు కానీ సుంకరి తనను తాను తగ్గించుకొని హృదయపూర్వకంగా చేసిన ప్రార్ధన ఆలకించారు. మనం చేసే ప్రార్ధనలో దీనత ఎప్పుడూ ఉండాలి.

BY. FR. BALAYESU OCD

  

 

నిత్య జీవము ఎలా వస్తుంది

 యోహాను 6: 22-29  మరునాడు, సరస్సు ఆవలితీరమున నిలచియున్న జనసమూహము అచటనున్న  ఒకే ఒక చిన్న పడవ తప్ప మరియొకటి లేదనియు, ఆ పడవలో శిష్యులతో పాటు యే...