25, ఫిబ్రవరి 2026, బుధవారం

మానవుడు దేనిని వెదకాలి

 మానవుడు దేనిని వెదకాలి 

యోహాను 1: 35-42 

మరునాడు మరల యోహాను తన శిష్యులలో ఇద్దరితో నిలుచుని ఉండగా, ఆ సమీపమున  నడచిపోవుచున్న యేసును చూచి "ఇదిగో'!దేవుని గొర్రె పిల్ల" అనెను. అది విని, ఆ యిద్దరు శిష్యులు యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తనను అనుసరించుటను చూచి, "మీరేమి వెదకుచున్నారు?" అని అడిగెను. "రబ్బీ! నీవు ఎక్కడ నివసించుచున్నావు?"అని అడిగిరి. "వచ్చి చూడుడు" అని యేసు సమాధానమిచ్ఛెను. వారు వెళ్ళి ఆయన నివాసస్థలమును చూచి, ఆనాడు ఆయనతో గడిపిరి. అది యించుమించు సాయంకాలము నాలుగు గంటల వేళ. యోహాను చెప్పినది విని యేసును వెంబడించిన ఆ ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు సోదరుడు ఆంద్రెయ. అతడు మొదట తన సహోదరుడగు సీమోనును కనుగొని "మేము మెస్సయ్యాను కనుగొంటిమి" అని చెప్పెను. అతడు సీమోనును యేసు వద్దకు తీసుకొనిరాగా, యేసు అతనిని చూచి "నీవు యోహాను కుమారుడవగు సిమోనువు. నీవు కేఫా అని పిలువ బడుదువు" అనెను. కేఫా అనగా రాయి అని అర్ధము. 

ధ్యానము: యోహాను యేసు ప్ర,భువును తన శిష్యుల ఎదుట మరియు ప్రజల ఎదుట దేవుని గొర్రె పిల్ల అని ప్రకటించుటకు ఏనుకడుగు వేయుట లేదు. యేసు ప్రభువును చూసిన ప్రతి సారి ఆయనను ప్రకటించడానికి ఎంతగానో ఆనందపడుతున్నారు. యేసు ప్రభువు ఆ సమీపమున నడచిపోవుచున్నప్పుడు ఆయనను చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని యోహాను  చెబుతున్నాడు. గొర్రె పిల్లను  యూదులు, వారికి బదులుగా, వారి పాపాలను పరిహరించుటకు  బలి ఇచ్చేవారు. వారి  పాపములను ఆ గొర్రె మొస్తుంది అని వారు నమ్మేవారు. అందుకే యోహాను మానవుల పాపములను మోసే గొర్రె పిల్లగా యేసు ప్రభువును చూస్తున్నారు. ఆయన మన పాపములను మోసే గొర్రెపిల్ల. మనకు బదులుగా శిక్షను అనుభవించడానికి మన వద్దకు వచ్చాడు. వాస్తవానికి గొర్రె పిల్ల రక్తం వారిని రక్షించలేదు, కేవలం యేసు ప్రభువు రక్తం మాత్రమే మనలను రక్షించగలదు అని పూర్తిగా తెలిసిన యోహాను, యేసు ప్రభువును దేవుని గొర్రె పిల్లగా ప్రకటిస్తున్నారు. 

యేసు ప్రభువును దేవుని గొర్రె పిల్లగా ప్రకటిస్తున్నప్పుడు యోహనుతో ఆయన శిష్యులు కూడా ఉన్నారు. ఇది రెండవ సారి యోహాను, యేసు ప్రభువును గొర్రె పిల్లగా ప్రకటించడం. యోహాను శిష్యులకు తమ గురువు పదేపదే యేసు ప్రభువు గురించి ప్రకటిస్తున్నారు కనుక ఆయన గురించి తెలుసుకోవలనుకుంటున్నారు. అందుకే ఆ శిష్యులు ఇద్దరు కూడా ఆయనను వెంబడించడం మొదలుపెట్టారు. అది గమనించిన యేసు ప్రభువు వారితో మీరేమి ఎదుకుచున్నారు అని ప్రశ్నిస్తున్నారు. యేసు ప్రభువు అడిగిన ప్రశ్నకు వారు జవాబు ఇవ్వడం లేదు. కాని మరొక ప్రశ్న అడుగుతున్నారు. నీవు ఎక్కడ నివసించుచున్నావు అని వారు అడుగుతున్నారు. కారణం ఏమిటి అంటే వారికి ఏమి అడగాలో కూడా తెలియదు. ఆనాటి యోహాను శిష్యులు మాత్రమే కాదు, దేవుని మీద నమ్మకం ఉన్న వారు, దేవుని ఆజ్ఞల మీద నమ్మకం ఉన్నవారు ఎదురు చూసేది, వేదికేది కేవలం రక్షకుడిని మరియు మెస్సీయ్యాను. ఇది వారు చెప్పక పోయిన, వారు కూడా తెలియకుండా చేసేది కూడా అదే. 

"రబ్బీ! నీవు ఎక్కడ నివసించుచున్నావు?"అని అడిగిరి. "వచ్చి చూడుడు" అని యేసు సమాధానమిచ్ఛెను. వారు వెళ్ళి ఆయన నివాసస్థలమును చూచి, ఆనాడు ఆయనతో గడిపిరి. అది యించుమించు సాయంకాలము నాలుగు గంటల వేళ. రబ్బీ! నీవు ఎక్కడ నివసించుచున్నావు అని వారు అడుగుతున్నారు. యేసు ప్రభువు వారికి తాను ఎక్కడ నివసించుచున్నది చెప్పడం లేదు, కాని వారిని వచ్చి చూడమని  ఆహ్వానిస్తున్నారు. వారు దానికి మారు మాటలాడకుండా ఆయనను అనుసరిస్తున్నారు. ఆరోజు వారు ఆయనతో గడుపుతున్నారు. ఆయనతో గడపటం వలన వారు అనుభవపూర్వకంగా, యేసు ప్రభువు మెస్సీయ్యా అని తెలుసుకుంటున్నారు. యోహాను వారికి యేసు ప్రభువు దేవుని గొర్రె పిల్ల అని చెప్పారు కాని ఇప్పుడు వారికి ఆయన కేవలం  పాపములను మోసె గొర్రెపిల్ల మాత్రమే కాదు, దేవుడు ఏర్పరిచిన రక్షకుడు అని వారు తెలుసుకుంటున్నారు. 

యోహాను చెప్పినది విని యేసును వెంబడించిన ఆ ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు సోదరుడు ఆంద్రెయ. అతడు మొదట తన సహోదరుడగు సీమోనును కనుగొని "మేము మెస్సయ్యాను కనుగొంటిమి" అని చెప్పెను. అతడు సీమోనును యేసు వద్దకు తీసుకొనిరాగా, యేసు అతనిని చూచి "నీవు యోహాను కుమారుడవగు సిమోనువు. నీవు కేఫా అని పిలువ బడుదువు" అనెను. కేఫా అనగా రాయి అని అర్ధము. యోహాను శిష్యులు ఆయనను వదలి యేసు ప్రభువును అనుభవపూర్వకంగా మెస్సీయ్యా అని, సిఖారు పట్టణ వాసుల వలె, ఎవరో చెప్పినందుకు కాక, ఆయనతో ఒక రోజు గడిపి  తెలుసుకున్నారు. ఈయనే నిజమైన మెస్సీయ్యా అని తెలుసుకున్న ఈ శిష్యులలో ఒకరు, సీమోను సోదరుడు అయిన ఆంద్రెయ. ఆయన తన సోదరుడు అయిన సీమోను పేతురుతో మేము మెస్సీయ్యాను కనుగొన్నాము అని చెప్పాడు. మెస్సీయ్యాను కనుగొనుట అనెది జ్ఞానంతో కూడిన ఒక పక్రియ. అనేక మంది మంచి పనులు చేసిన వారు, దేవుడు గురించి చెప్పిన వారు ఉండవచ్చు కాని అందరు మెస్సీయ్యా కాదు. యోహానుకు  మాత్రమే నిజమైన మెస్సీయ్యా తెలుసు, ఎందుకంటే దేవుడు ఆయనకు మెస్సీయ్యా ఎవరు, ఎలా ఉంటారు అని చెప్పాడు, ఆయన శిష్యుడైన ఆంద్రెయకు మెస్సీయ్యాను కనుగొనుట సాధ్యమే. తన గురువు ఆయన గురించి చెప్పాడు మరియు ఆయన యేసు ప్రభువుతో గడిపి ఆ విషయం తెలుసుకుంటున్నాడు. ఆయన పేతురును యేసు ప్రభువు దగ్గరకు తీసుకొని వస్తున్నాడు. యేసు ప్రభువు ఆయనను కేఫా అని పిలుస్తున్నారు. ఆయన అంతగట్టివాడు కాకపోయినప్పటికి, అంత గట్టిగా ఆయనను చేస్తాడు యేసు ప్రభువు. 

ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్ధన: ప్రభువా! మీరు మా పాపములను మోసే దేవుని గొర్రె పిల్ల అని యోహాను ద్వారా తెలుసుకుంటున్నాం. యోహాను తన శిష్యులు మిమ్ములను అనుసరిస్తున్నందుకు ఎంతగానో ఆనందపడుతున్నాడు. తనను వీడిపోతున్నారు అనే బాధలేకుండా మిమ్ములను తెలుసుకుంటున్నారు అనే సంతోషం ఆయనలో ఉన్నది. మేము కూడా మా జీవితాలలో అటువంటి భావాలు కలిగి జీవించే అనుగ్రహం మాకు దయచేయండి. యోహాను చెప్పినందుకే కాకుండా మిమ్ములను అనుసరించి, మీ దగ్గర ఉండి, మీరు ఎంత గొప్ప వారో, మరియు మీరు రక్షకుడు అని వారు తెలుసుకుంటున్నట్లుగా మేము కూడా అనుభవ పూర్వకంగా మిమ్ములను తెలుసుకునే భాగ్యం మాకు దయచేయండి. ప్రభువా! మీరు ఏమి వెదకుచున్నారు అని శిష్యులను  అడుగుతున్నారు. మేము కూడా మా జీవితములలో చాలా వేదకూచున్నాము. శిష్యుల వలె రక్షకుడను  వేదకుట లేదు. ఏమి వెదకాలో మాకు తెలియదు. మిమ్ములను వెదికే జ్ఞానము మాకు దయచేయండి. సీమోను వలె మమ్ములను గట్టివారిగా  చేయమని వేడుకుంటున్నాము. ఆమెన్ 

ఫిలిప్పు మరియు నతనయేలుల మనస్తత్వం

 ఫిలిప్పు మరియు  నతనయేలుల మనస్తత్వం

యోహాను 1: 43-51 

మరునాడు యేసు గలిలీయా వెళ్ళుటకు నిశ్చయించుకొనెను. ఫిలిప్పును కనుగొని అతనితో "నన్ను అనుసరింపుము" అని పలికెను. ఫిలిప్పు కూడఆంద్రెయ పేతురుల నివాసమగు బేత్సయిదా పుర నివాసియే. ఫిలిప్పు నతనయేలును కనుగొని, "మోషే ధర్మశాస్త్రమునందును, ప్రవక్తల ప్రవచనములందును చెప్పబడిన వానిని మేము కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడును, నజరేతు నివాసియునగు యేసు" అని చెప్పెను. "నజరేతునుండి ఏదైనా మంచి రాగలదా?" అని నతనయేలు  అడుగగా వచ్చి చూడుము" అని పిలిప్పు పలికెను. నతనయేలు తన యొద్దకు వచ్చుటను చూచి, అతనిని గూర్చి యేసు "ఇదిగో!కపటము లేని నిజమైన యిస్రాయేలీయుడు" అని చెప్పెను. "మీరు నన్ను ఎట్లు ఎరుగుదురు" అని నతనయేలు అడుగగా యేసు, "ఫిలిప్పు నిన్ను పిలువకపూర్వమే, నీవు అంజూరపు చెట్టుక్రింద ఉండుటను నేను చూచితిని"అని సమాధానమిచ్ఛెను. "బోధకుడా! నీవు దేవుని కుమారుడవు, యిస్రాయేలు రాజువు"అని నతనయేలు  పలికెను. "నిన్ను అంజూరపు చెట్టు క్రింద చూచితిని, అని చెప్పినందువలన నీవు నన్ను విశ్వసించుచున్నవా? ఇంతకంటే గొప్ప కార్యములను నీవు చూడగలవు" అని యేసు చెప్పెను. ఇంకను, "మీరు పరమండలము తెరువబడుటయు, దేవునిదూతలు మనుష్యకుమారునిపై ఆరోహణ అవరోహణలు చేయుటను చూచెదరు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను" అని పలికెను. 

ధ్యానము: యేసు ప్రభువు గలిలీయాకు వెళ్ళుటకు నిశ్చయించుకున్నాడు. యేసు ప్రభువు అనేక అద్భుతకార్యాలు ఈ ప్రదేశములోనే చేసినది. అంతేకాక ఈ ప్రదేశమున యూదులు మాత్రమే కాక అనేక మంది ఇతరులు అన్యులు కూడా ఉండేవారు. యేసు ప్రభువు పిలిప్పును చూసి నన్ను అనుసరింపమని అడిగాడు. పిలిప్పు యేసు ప్రభువును అనుసరిస్తున్నాడు. అంతేకాక పిలిప్పు జీవితంలో ఎంతో మందిని ప్రభువు దగ్గరకు తీసుకువచ్చిన ఉదంతమును సువిశేషంలో మనం చూస్తాము. ప్రభువుకు ప్రజలకు అనుసంధానం చేయడంలో పిలిప్పు చాలా నేర్పరిగా ఉండేవాడు. రెండు చేపలను ఐదు రొట్టెలను ఐదువేల మందికి పంచి పెట్టినప్పుడు ఒక పిల్లవాని దగ్గర ఉన్న చేపలను రొట్టెలను తీసుకొని వచ్చినది ఇతనే. మరియు కొంతమంది గలిలీయులు యేసు ప్రభువును కలుసుకొనుటకు వచ్చినప్పుడు కూడా ఈ పిలిప్పు వారిని ప్రభువు వద్దకు తీసుకొని వస్తున్నాడు. ఇప్పుడు నతానియేలును ప్రభువు వద్దకు తీసుకొని వస్తున్నాడు. 

ఫిలిప్పు నతనయేలును కనుగొని, "మోషే ధర్మశాస్త్రమునందును, ప్రవక్తల ప్రవచనములందును చెప్పబడిన వానిని మేము కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడును, నజరేతు నివాసియునగు యేసు" అని చెప్పెను. పిలిప్పు కూడ ఆంద్రెయ వలె యేసు ప్రభువు గురించి అనుభవపూర్వకముగా తెలుసుకొని ఆయన మెస్సీయ్యా అని తెలుసుకుంటున్నాడు. అందుకే ధర్మశాస్త్రమునందు, ప్రవక్తల ప్రవచనములందు చెప్పబడిన వానిని కనుగొన్నాము అని చెబుతున్నాడు. యేసు ప్రభువుతో ఉండటం, ఆయనను కలవడం, ఆయనతో మాట్లాడటం ఒక వ్యక్తిని పూర్తిగా దైవ అనుభవంలోనికి తీసుకువెళ్తాయి. మిగిలిన ఎంత గొప్ప విషయంకూడ ఇటువంటి దైవ అనుభవాన్ని ఇవ్వలేవు. పిలిప్పు ఈ విషయము గురించి నమ్మకంతో ఉన్నాడు. ఫిలిప్పు సహాజముగానే దేవుని అన్వేషించే వ్యక్తి అందుకే ఆయనను యేసు ప్రభువే కనుగొంటున్నాడు. దేవున్ని మనం అన్వేషించినట్లయితే దేవుడే మనకు ఆవిష్కారం అవుతారు అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. ఫిలిప్పు ఇప్పుడు ఈ విషయములను నతనయేలుకు చెబుతున్నారు. 

"నజరేతునుండి ఏదైనా మంచి రాగలదా?" అని నతనయేలు  అడుగగా వచ్చి చూడుము" అని పిలిప్పు పలికెను. నతనయేలుకు మెస్సీయ్యా నజరేతు నివాసి అని చెప్పడం వలన ఆయన దానిని నమ్మలేకున్నాడు. ఎందుకంటే యిస్రాయేలులో నజరేతు ఒక తృణీకరింపబడిన పట్టణం. అక్కడ నుండి రక్షకుడు వస్తాడు అంటే నమ్మలేకపోయాడు. నజరేతు నుండి ఏదైన మంచి రాగలదా అని నతనయేలు అడిగిన కాని ఫిలిప్పు ఆయనతో వచ్చి చూడమని చెబుతున్నాడు. యేసు ప్రభువును  చూడడం వలన మనం ఆయనకు పూర్తిగా చెందినవారిగా మారిపోతాము. అందుకే ఫిలిప్పు వచ్చి చూడమని నతనయేలుతో అంటున్నాడు. "ఇదిగో!కపటము లేని నిజమైన యిస్రాయేలీయుడు" అని చెప్పెను. "మీరు నన్ను ఎట్లు ఎరుగుదురు" అని నతనయేలు అడుగగా యేసు, "ఫిలిప్పు నిన్ను పిలువకపూర్వమే, నీవు అంజూరపు చెట్టుక్రింద ఉండుటను నేను చూచితిని"అని సమాధానమిచ్ఛెను. ఫిలిప్పు చెప్పినట్లుగానే యేసు ప్రభువు దగ్గరకు రాగానే నతనయేలు ఆశ్చర్యపోతున్నాడు. నతనయేలు గురించి యేసు ప్రభువు అతనిలో ఎటువంటి కల్మషం లేదు అని అంటున్నాడు. యిస్రాయేలు అంటేనే కల్మషం లేని వాడు అని అర్ధం. యాకోబు అంటే మోసగాడు కాని దేవునికి ఆ పేరు ఇష్టం లేదు. కనుక యాకోబు పేరు మారుస్తున్నాడు. అతనికి యిస్రాయేలు అని పేరుపెడుతున్నాడు. కానాను అంటే నైతిక విలువలు లేనిది కాని, ఆ భూమిని ప్రభువు తన సొంత ప్రజలకు ఇస్తున్నప్పుడు  ఆ భూమికి యిస్రాయేలు అని పేరు పెడుతున్నాడు. నతనయేలును చూసి ఆయనను నిజమైన యిస్రాయేలియుడు అని చెబుతున్నాడు. అతని గురించి పూర్తిగా తెలిసినట్లుగా ప్రభువు మాటలాడుతున్నాడు. అంజూరపు చెట్టుక్రింద ఉండటం నేను చూశాను అని తెలియజేస్తున్నాడు. అంటే జ్ఞానం కోసం ఎదుకుచున్నప్పుడు చూశాను అని అర్ధం. 

 "బోధకుడా! నీవు దేవుని కుమారుడవు, యిస్రాయేలు రాజువు"అని నతనయేలు  పలికెను. "నిన్ను అంజూరపు చెట్టు క్రింద చూచితిని, అని చెప్పినందువలన నీవు నన్ను విశ్వసించుచున్నవా? ఇంతకంటే గొప్ప కార్యములను నీవు చూడగలవు" అని యేసు చెప్పెను. ఇంకను, "మీరు పరమండలము తెరువబడుటయు, దేవునిదూతలు మనుష్యకుమారునిపై ఆరోహణ అవరోహణలు చేయుటను చూచెదరు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను" అని పలికెను. వెంటనే నతనయేలు యేసు ప్రభువును దేవుని కుమారుడవు , యిస్రాయెలు రాజువు  అని సంబోధిస్తున్నాడు. ప్రభువును ప్రత్యక్షంగా చూసిన వారు, ఇలానే ప్రభువు గురించి తెలుసుకుంటారు.ప్రభువుతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండేలా మనకు ఉండేలా మనం ప్రయత్నించాలి అప్పుడు మనకు ప్రభువుతో ఉన్న అనుభవం మారిపోతుంది. ప్రభువు ఇక్కడ నతనయేలుతో ఇంతకంటే గొప్ప విషయాలు చూచెదవు అని చెబుతున్నారు. దేవదూతలు మనుష్య కుమారునిపై ఆరోహణ అవరోహణలు చేయుటను చూచెదరని చెబుతున్నాడు. యేసు ప్రభువు భూలోకమునుండి  పరలోకానికి  పోవుటకు నిచ్చెన ఆయన ద్వారానే మానవుడు పరలోకం పోవడం జరుగుతుంది ఇవి అన్ని కూడ చూడగలం అని ప్రభువు చెబుతున్నాడు. 

ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్ధన:  ప్రభువా! మీరు మిమ్ము అన్వేషించే పిలిప్పును కనుగొని అతనికి రక్షకుడిని తెలుసుకునే అనుగ్రహమును ఇస్తున్నారు. ఫిలిప్పు ఏవిధముగా అయితే అనేక మందిని మీ వద్దకు తీసుకొని వస్తున్నాడో, మేము కూడా అలానే మీ  వద్దకు ఇతరులను తీసుకొని వచ్చేందుకు కావలసిన అనుగ్రహములను పొంది, ఇతరులను మీ వద్దకు తెచ్చేలా మమ్ములను మార్చండి. ప్రభువా ! మిమ్ములను అనుభవపూర్వకంగా తెలుసుకొనుటకు మేము చేయవలసినదంతయు ఎటువంటి లేమి లేకుండా చేసేలా మమ్ము దీవించండి. ప్రభువా! నతనయేలు మీరు నజరేతువాసి అంటే నమ్ముటకు సిద్దంగా లేడు, కాని మిమ్ము చూసిన తరువాత ఆయన అభిప్రాయం మొత్తం మారిపోయింది. మీరు నతనయేలును నిజమైన యిస్రాయేలు అని చెబుతున్నారు. ఆయనలో ఎలా కల్మషం లేకుండా ఉన్నారో మేముకూడా మేము కూడా ఎటువంటి కల్మషం లేకుండా ఉండేలా మమ్ము దీవించండి. ఆమెన్.   

క్రీస్తు సాక్షాత్కార మహోత్సవం

 క్రీస్తు సాక్షాత్కార మహోత్సవం

 మత్తయి 2:1-12

హెరోదు రాజు పరిపాలనాకాలమున యూదయా సీమయందలి బెత్లెహేమునందు యేసు జన్మించెను. అప్పుడు జ్ఞానులు  తూర్పు దిక్కు నుండ యెరుషలెమునకు వచ్చి, "యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడ? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున  చూచి మేము ఆరాధింపవచ్చితిమి" అని అనిరి. ఇది విని హెరోదు రాజును, యెరుషలెము నగరవాసులందరను కలతచెందిరి. అంతట రాజు ప్రజల ప్రధానార్చకులను, ధర్మ శాస్త్రభోదకులను సమావేశపరచి "క్రీస్తు ఎచట జన్మించును?" అని ప్రశ్నించెను. "యూదయ సీమయందలి బెత్లెహేమునందు" అని వారు సమాధానమిచ్చిరి. "యూదయ సీమయందలి బెత్లెహేమా! నీవు యూదయా పాలకులలో ఎంత మాత్రమును అల్పమైనదానవు కావు. ఎలయన నా యిస్రాయేలు ప్రజలను పాలించు నాయకుడు నీలోనుండి వచ్చును" అని ప్రవక్త వ్రాసియుండెను. అంతట హెరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి, నక్షత్రము కనిపించిన సమయమును  వారి నుండి తెలిసికొనేను. పిమ్మట అతడు వారిని బెత్లెహేమునకు పంపుచు, "మీరు వెళ్ళి, జాగ్రత్తగా ఆ శిశువు జాడను కనుగొని నాకు తెలియజేయుడు. నేనును వెళ్ళి అతనిని ఆరాధింతును" అనెను. రాజు మాటలను ఆలకించి ఆ జ్ఞానులు వెళ్లిపోయిరి. అదిగో! తూర్పుదిక్కున వారిముందు నడిచిన నక్షత్రము మరల కనిపించి వారికి మార్గదర్శినియై, ఆ శిశువు ఉన్న స్థలము పైకి వచ్చి నిలిచెను. వారు నక్షత్రమును చూచినప్పుడెంతో ఆనందించిరి. అంతట వారు ఆ గృహమున ప్రవేశించి, తల్లి మరియమ్మతోనున్న బిడ్డను చూచి, సాష్టాంగపడి ఆరాధించిరి. పిదప తమ సంచులను విప్పి ఆ శిశువునకు బంగారము, సాంబ్రాణి, పరిమళద్రవ్యములను కానుకలుగా సమర్పించిరి. హెరోదు చెంతకు మరలిపోరాదని స్వప్నమున దేవుడు వారిని హెచ్చరింపగా వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగిపోయిరి.  
 
 హెరోదు రాజు  యూదయా ప్రాంతాన్ని క్రీస్తు పూర్వం  37 వ సంవత్సరం నుండి  4 వ సంవత్సరం వరకు పాలించాడు. మీకా గ్రంధం 5:1-3 ప్రకారం బెత్లేహేము రక్షకుని యొక్క  జన్మ స్థలం. మరియు అది దావీదు  రాజు యొక్క జన్మ స్థలం కూడా.  లోక రక్షకుడు జన్మించిన విషయం తెలుసుకున్న ముగ్గురు రాజులు యేసు ప్రభువును చూసి ఆరాధించుటకు అక్కడకు వస్తున్నారు. ఈ ముగ్గురు రాజులు హేరేడేటాస్ అనే చారిత్రకారుని  ప్రకారం మెదియ అనే  తెగకు  చెందినవారు. మెదియా అనేది  పర్షియా రాజ్యంలో ఒక భాగం. మెదియా ప్రజలు  పర్షియన్ల పాలన నుండి స్వాతంత్ర దేశంగా ఎదగాలని అనుకునేవారు. అనేక సార్లు యుద్దాలు చేసి ఓడిపోయారు.   వారికి ఉన్న ఈ కోరిక సాధ్యంకాక వారు వేరే విధంగా స్థిరపడ్డారు.  ఏవిధంగా వీరు స్థిరపడ్డారు అంటే వీరికి అంతరిక్ష శాస్త్రంలో ఉన్న నైపుణ్య కారణంగా అంతరిక్షంలో ఏర్పడే మార్పుల ఆదరముగా భవిష్యత్తును చెప్పడం. జ్ఞానమునకు వీరు ఇచ్చే ప్రాముఖ్యతకు అనుకూలంగా దైవ జ్ఞాన విషయాల గురించి తెలుసుకుంటూ యాజకులుగా స్థిరపడ్డారు. భవిష్యవాణి చెప్పేవారిగా , జ్ఞానులుగా మరియు యాజకులుగా స్థిరపడిన వీరు పాలన చేయాలనే రాజ్యాధికార వ్యామోహం వదలిపెట్టారు.  పర్షియా దేశంలో వీరిని జ్ఞానులుగా  మరియు పవిత్రులుగా చూసేవారు. వీరు ప్రవచనాలు చెప్పడంలో , వైద్య శాస్త్రంలో  మరియు అంతరిక్ష శాస్త్రాలలో ప్రసిద్దులు. అంతరిక్షం లో జరిగే మార్పులను బట్టి వీరు ఏమి జరుగుతున్నదో చెప్పేవారు. వీరు యూద ప్రజలు కాదు. వీరు కూడా అన్య ప్రజలే కానీ పరిస్థితులను అవగాహన చేసుకోగలిగిన వారు. మంచి చెడులు తెలిసినవారు. 

ఈ ముగ్గురు రాజులు లేక జ్ఞానులు యేసు ప్రభువు దగ్గరకు రావడం దేవుని యొక్క ప్రణాళికే, ఎందుకు అంటే ఆదికాండం 22 వ అధ్యాయం 18 వ వచనం లో అబ్రహాము సంతతి ద్వార జాతులన్నీ దీవించ బడుతాయి అని మనం తెలుసుకుంటాం. అది ఈ రోజు ఈ ముగ్గురు జ్ఞానులు యేసు ప్రభువు దగ్గరకు రావడం ద్వార జరుగుతుంది. యేసు ప్రభువును దేవునిగా మొదట ఆరాధించిన ప్రజలు అన్యులే, యూదులు కాదు. ఈ ముగ్గురు రాజులు దేవునికి  అర్పించే వాటిని యేసు ప్రభువుకి అర్పించి ఆయనను దేవునిగా గుర్తిస్తున్నారు, తెలుసుకుంటున్నారు మరియు ఆరాధిస్తున్నారు. మత్తయి సువార్త 8:11 లో మనం తూర్పు పడమరల నుండి ప్రజలు అబ్రహాము తో కూర్చుంటారు అనే వింటున్నాం. కనుక వీరి రాకతో మరియు వీరు అర్పించిన బహుమానములతో యేసు ప్రభువు దేవుడు అనే విషయం తెలుస్తుంది. 

ఈ ముగ్గురు రాజులు, ఆకాశంలో ఒక నక్షత్రం చూసి, ఒక గొప్ప వ్యక్తి యిస్రాయేలులో  జన్మించారు, అని తెలుసుకున్నారు. వారు ఆ నక్షత్రం ద్వారా ఎదో ఎదుకుతున్నారు. అది ఏమిటి అంటే ఇన్నాళ్ళూ వారు ఆకాశంలో చూసిన అన్ని మార్పులు వారి జీవితంలో మార్పు తీసుకురాలేదు. కాని ఈ నక్షత్రం ఖచ్చితంగా మార్పు తీసుకువస్తుంది అని వారు నమ్ముతున్నారు. వారు జ్ఞానులుగా ఇప్పటివరకు తెలుసుకున్న విషయాలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు వారు తెలుసుకున్న విషయం వారిజీవితంలో తెలుసుకున్న అన్ని విషయాల కంటే గొప్పది అది ఏమిటి అంటే లోక రక్షకుడు ఎవరు అనెది. బెత్లెహేములో పుట్టిన యేసు ప్రభువు రక్షకుడు అని మరియు దేవుడు అని వారు తెలుసుకుంటున్నారు. అంతే కాదు ఈయన మాత్రమే వారి జీవితాలలో ఉన్న అన్ని అనుమానాలను నివృత్తి చేయగలరు అని తెలుసుకుంటున్నారు.   ఉన్న   వారి అన్ని ఆశలకు సమాధానం ఈ నక్షత్రం తెలియచేస్తుంది అని నమ్మారు, లేకపోతే   వారు అంత దూరంనుండి  వచ్చే వారు కాదు. ఇంత దూరం వచ్చి ఏమి చూసారు అక్కడ? కేవలం చిన్నారి బాల యేసును, సరిగా లేని ఒక పశువుల పాకను,  అటువంటి ప్రదేశంలో మరియు అటువంటి పరిస్థితిలో ఉన్న యేసు ప్రభువును ఎందుకు వారు ఆరాధించారు? ఈ ప్రశ్న మనం అడిగినప్పుడు మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి. వారికి  అక్కడ  దేవుని మహిమను కనబడింది.   వారు అంత దూరం కేవలం కొన్ని బహుమతులు ఇవ్వడానికి వెళ్ళలేదు. దేవుని చూడటానికి వెళుతున్నారు. నిజమైన జ్ఞానాన్ని పొందడానికి వెళుతున్నారు. దేవున్ని కలవడానికి వెళుతున్నారు. ఇవి అన్ని యేసు ప్రభువులో చూస్తున్నారు.  అందుకే ఆయనను ఆరాధిస్తున్నారు. వారి మోకాళ్ల మీద ఉండి యేసు ప్రభువు రాజరికాన్ని ఆమోదిస్తున్నారు.   దేవుడు మానవుని రూపంలో వారు చూసారు. వారు ఆనందముగా కృతఙ్ఞతలు చెప్పి  వెళుతున్నారు. 

 ఈ కారణాల వలన ఈ పండుగను క్రీస్తు సాక్షాత్కార పండుగగా పిలుస్తాము అంటే దేవుడు తనను తాను తెలియ చేసుకోవడం.  ఒక నక్షత్రం ద్వారా దేవుడు ఈ జ్ఞానులకు తనని తాను  తెలియ పరుచుకున్నాడు. వారు జ్ఞానులు కనుక  నక్షత్రం ద్వారా యేసు ప్రభువు దేవుడు అని గుర్తించారు. మనం కూడా ఆయన గురించి విని ఉన్నాము. ఆయన చేసిన పనులు తెలుసుకొని వున్నాము. ఆయనను మనం కూడా గుర్తించి, అంగీకరించి, ఆరాధించి ఆయన దైవత్వాన్ని అంగీకరించి ఆయన రాజరికాన్ని అంగీకరించి ఆయన దీవెనలు పొందవచ్చు. 

ఈ జ్ఞానులు ఏమి అర్పిస్తున్నారు?  యేసు ప్రభువుకి ఆయనను ఆరాధించిన తరువాత వారు బంగారం వారు అర్పిస్తున్నారు. బంగారం ఎందుకు అర్పిస్తున్నారు  అంటే బంగారాన్ని రాజులకు అర్పిస్తూ ఉంటారు, అంటే వారు  ఆయనను రాజుగా వారి అధిపతిగా అంగీకరిస్తున్నారు. మరల పరిమళ ద్రవ్యాలను ఇస్తున్నారు. అవి ఆయన శ్రమలు మరియు మరణాన్ని గుర్తు చేస్తున్నాయి.  ఆయన ఏ విధంగా ప్రజలను రక్షించబోతున్నారు అని తెలియ చేస్తున్నాయి. తరువాత వారు సాంబ్రాణిని అర్పిస్తున్నారు. ఇది దేవుని ఆరాధనకు  అర్పించేది ఎందుకంటే ఆయన తమ యాజకునిగా, దేవునిగా వారు  గుర్తించారు. వారు కూడా యాజకులుగా స్థిరపడినవారే అయినా కాని  నిత్య యాజకునిగా ఆయనను వారు గుర్తిస్తున్నారు. 

వీరు యేసు ప్రభువుని తెలుసుకొని రాజుగా, యాజకునిగా మరి ముఖ్యముగా దేవునిగా తెలుసుకుంటున్నారు. అయన దగ్గరకు వస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఇక్కడ హేరోదు రాజు ఉన్నాడు ఆయన యూదుల రాజు పుట్టాడు మేము ఆయన్ను చూడటానికి వచ్చాము అని చెప్పగానే ఆయన ఆందోళన చెందుతున్నాడు. యేసు ప్రభువును తన ఆధికారముకి అడ్డంగా ఉంటాడు అని ఆయనను చంపాలని అనుకుంటున్నాడు. యేసు ప్రభువు అధికారం మనం చూపించే అధికారం లాంటిది కాదు. అది ప్రేమించే అధికారం, రక్షించే అధికారం. క్షమించే అధికారం. అది తెలియని హెరోదు అనేక మంది చిన్న బిడ్డలను చంపిస్తున్నాడు. హేరోదు రాజు  యూదయ పెద్దలను అందరిని పిలుస్తున్నాడు.  యేసు ప్రభువు ఎక్కడ పుట్టాడో తెలుసుకుంటున్నాడు.  మతపెద్దలకు  ఆయన ఎక్కడ పుడతాడో  తెలుసు.  కాని వారు జ్ఞానుల వలె   ఆయన్ను తెలుసుకొని ఆరాధించాలి అని అనుకోలేదు. మనం వీరిలా ఉండకూడదు.  ఈ  ముగ్గురు జ్ఞానులే ఆయన్ను తెలుసుకొని ఆరాధించాలి.  మనము వీరిని ఆదర్శముగా తీసుకోవాలి, ఆ విధంగా జీవించాలి. అందుకు కావలసిన అనుగ్రహాలు ఇవ్వమని ఆ ప్రభువును అడుగుదాం. 



యేసు క్రీస్తుని బప్తిస్మం

 యేసు క్రీస్తుని బప్తిస్మం 

మార్కు 1: 7-11 

"నా కంటే శక్తిమతుడోకడు నా వెనుక రానున్నాడు. నేను వంగి ఆయన పాదరక్షలవారును విప్పుటకైనను యోగ్యుడనుకాను నేను మిమ్ము నీటితో స్నానము చేయించితిని. కాని, ఆయన మిమ్ము పవిత్రాత్మతో స్నానము చేయించును" అని యోహాను ప్రకటించుచుండెను. ఆ రోజులలో  గలిలీయ సీమలోని నజరేతు నుండి యేసు వచ్చి, యొర్ధాను నదిలో యోహనుచేత బప్తిస్మము పొందెను. ఆయన నీటినుండి వెలుపలికి వచ్చిన వెంటనే పరమండలము తెరువబడుట, పవిత్రాత్మ పావురము రూపమున తనపై దిగి వచ్చుట చూచెను. అపుడు పరలోకము నుండి ఒక వాణి "నీవు నా ప్రియమైన కుమారుడవు. నిన్ను గూర్చి నేను ఆనందించుచున్నాను" అని వినిపించెను

ధ్యానం: యేసు ప్రభువు బప్తిస్మము చాలా ప్రాముఖ్యత కలిగినది మన రక్షణ చరిత్రలో అందుకనే సువార్తికులందరు దీని గురించి రాసారు. మత్తయి 3:14-15 యేసు ప్రభుని బప్తిస్మము ఆయన పాపం చేసినందుకు కాదు దేవుని ఆజ్ఞలకు అనుకూలముగా స్వీకరించాడు అని తెలియచేస్తుంది. యోహాను , యేసు ప్రభువుల మధ్య సంభాషణ ద్వారా ఇది తెలుసుకుంటున్నాము. యోహాను బప్తిస్మము పాప జీవితానికి ముగింపును పలికి నూతన జీవితాన్ని సాగించడానికి కానీ యేసు ప్రభువు స్వీకరించిన బాప్తిస్మము ఒక నూతన కార్యాన్ని స్వీకరించడానికి, అంటే తన పెంపుడు తండ్రి అయినా యేసేపు గారి పని అయిన వడ్రంగి పనిని వదలి ఒక నూతన కార్యాన్ని స్వీకరిస్తున్నారు లేక మొదలు పెడుతున్నారు. ఆ నూతన కార్యం ఏమిటి అంటే మానవ రక్షణ కార్యం. ఈ రక్షణ కార్యం మొదలు పెట్టడానికే యేసు ప్రభువు బాప్తిస్మము తీసుకుంటున్నారు. 

యేసు ప్రభువు బప్తిస్మము తీసుకున్నప్పుడు జరిగిన విషయాలు మనము గురించి ఈ రోజు మనము వింటున్నాము. అవి ఏమిటి అంటే 1. పరలోకం తెరవబడుతుంది. పరలోకం తెరవబడటం అనే మాట దర్శన గ్రంధం లోని భాషలా ఉంది. పరలోకం తెరవ బడటం అంటే  యుదయా ప్రజలు పరలోకానికి భూలోకానికి మధ్య ఒక విభజన ఉంది అని, అవి ఇప్పుడు వేరు చేయ బడినవి  అని నమ్మారు.  అంటే ఇప్పుడు పరలోకానికి , భూలోకానికి ఒక అడ్డు ఉందని అది కొన్ని ప్రత్యేక సంధర్భాలలో తొలగించబడుతుంది అని వారి నమ్మకం. ఎప్పుడు  ఈ ప్రత్యేక సంధర్భం లేక ఎప్పుడు ఇది జరుగుతుంది అంటే పాత నిబంధనలో ప్రవక్తలు , దీర్ఘ దర్శులు దేవ రహస్యాలను చూస్తారు కాబట్టి వారి దృష్టిలో పరలోకం భూలోకం ఏకమవుతాయి. అంటే దేవుడు భూలోకానికి వస్తున్నాడు అని అర్థం. పరలోకం మరియు భూలోకం మధ్య సంగమం ఏర్పడుతుంది. 

ఇది చాలా కాలం తరువాత యేసు ప్రభువు బాప్తిస్మము రోజున జరుగుతుంది. మనం యెషయా  64:1 లో చూసినట్లయితే యెషయా ప్రవక్త "ఓ దేవా ! నీవు పరలోకం చీల్చి క్రిందికి దిగి రమ్ము" అని అంటున్నారు. ఈ ప్రార్ధన అర్ధం దేవుడు ఆయన్ను పూర్వ కాలంలో వలే తెలియ పరచాలి అని, నిర్గమ 19:16-19 , ఇక్కడ దేవుడు పర్వతము నుండి వస్తారు. అంటే దేవుడు పరలోకం నుండి భూలోకానికి వస్తూంటారు. ఎప్పుడు ఇది జరుగుతుంది అంటే దేవుడు కొన్ని ముఖ్యమైన విషయాలను తెలియ చేసే సమయంలో లేక కొన్ని గొప్ప కార్యాలు ప్రారంభించే సమయములో జరుగుతుంది.  

యేసు ప్రభువు బాప్తిస్మము లో జరుగుతుంది కూడా ఇదే. ఇక్కడ సంభాషణ  జరుగుతుంది యేసు ప్రభువుకి మరియు దేవునికి మద్యలో, అందుకే యేసు ప్రభువు ప్రారంభించే పని, సరి అయినది అని దేవుని ఆమోదం పరలోక వాణి ద్వార మరియు పవిత్రాత్మ  యేసు ప్రభువు  మీద పావుర రూపమున దిగి రావడం ద్వార తెలుస్తుంది. రక్షణ కార్యాన్ని ప్రారంభించడానికి  దేవుని అనుగ్రహం ఇక్కడ జరుగుతుంది. పవిత్రాత్మ ఈ కార్యానికి తోడ్పాటు అందిస్తుంది. 

 పరలోక వాణి  : బాప్తిస్మము జరుగుతున్న సమయములో పరలోకము నుండి ఒక వాణి  వినబడుతుంది.  ఇక్కడ జరిగిన ఈ సందర్భంలో మిగిలిన వారు నిజముగా అక్కడ ఉన్న వారందరికీ వినబడింది లేనిది మనకు తెలియదు. ఎందుకంటే యేసు ప్రభువు పౌలుకు  డమాస్కస్ (అ. చ 9:7,22:9) దర్శన మిచ్చిన సమయములో పౌలుతో ఉన్న ప్రజలు వెలుగును మాత్రమే చూసారు, శబ్దం విన్నారు కానీ ఆ మాటలను గుర్తు పట్టలేదు. యేసు ప్రభువుకు మాత్రము ఇక్కడ తండ్రి మాటలు ఊరటను బలాన్ని ఇస్తున్నాయి. 

దేవుడు ప్రజలతో మాట్లాడటం మనం పాత నిబంధనలో కూడా  చూస్తాం. ద్వితీ 4:10-12, నిర్గమ 3:4 కనుక పరలోక వాణి అనేది యిస్రాయేలు ప్రజలకు తెలుసు. నీవు నా ప్రియమైన కుమారుడవు పరలోక వాణి పలుకుతుంది  అని వింటున్నాము.  అంటే ఈ మాటలు యేసు ప్రభువు కొరకు వచ్చినవి. ఈయన దేవుని కుమారుడు అని అదే విధముగా ఈయన చేసే పని దేవుని కార్యము అని తెలియచేస్తుంది. అంటే ఈయన చేయబోయే పనికి తండ్రి ఆమోదం ఉంది అని తెలియచేస్తుంది. 

ఈ క్రీస్తు బాప్తిస్మము మనకు ఏమి తెలియ చేస్తుంది? అని అంటే మొదటిగా దేవుని ప్రణాళిక అమలు చేయడానికి నేను సిద్దముగా ఉండాలి అని తెలియ చేస్తుంది. ఎందుకంటే పునీత బాప్తిస్మ యోహను గారు యేసు ప్రభువు బాప్తిస్మము స్వీకరించడానికి వచ్చినప్పుడు, నేను నీకు బాప్తిస్మము ఇవ్వడానికి అర్హుడను కాను నేనే నీ వద్ద బాప్తిస్మము స్వీకరించ వలసిన వాడను అని అంటున్నారు. కాని యేసు ప్రభువు ఇప్పడు నిర్ణయించబడిన విధముగా జరగనివ్వమని చెబుతున్నాడు. అంటే దేవుని యొక్క ప్రణాళిక చేయడానికి ఆయన తన గొప్పతనం  లేక దేనినైనా కూడా వదులు కోవడానికి సిద్దముగా ఉన్నాడు అని తెలియచేస్తున్నారు. ఈనాటి సువిశేషంలో యేసు ప్రభువు తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు అని మనం చూస్తున్నాం. ఈ రోజుతో తన రక్షణ కార్యాన్ని ప్రారంభిస్తున్నారు. ఆయన పరిచర్య , స్వస్థత చేయటం, క్షమించడం, దేవుని నుండి దూరముగా వెళ్ళిన వారిని వెదకి  తీసుకురావడం మొదలు పెట్టబోవుచున్నారు. వానికి ముందుగా  బాప్తిస్మ యోహను దగ్గరకు వస్తున్నారు. యోహను పాప క్షమాపణ పొందడానికి పశ్చాతాపం కలిగి జీవించమని పిలుపు ఇచ్చారు, వారికి బాప్తిస్మము ఇస్తున్నారు. 

ఎందుకు యేసు ప్రభువు బాప్తిస్మము తీసుకుంటున్నారు?  యోహను ఇచ్చే బాప్తిస్మము పాప క్షమాపణకు కదా!  మరి యేసుప్రభువులో ఎటువంటి పాపం లేదు కదా ! యేసు ప్రభువుకి ఈ బాప్తిస్మము అవసరం లేదు, అందుకే యోహను యేసు ప్రభువుతో  నేనే నీ వద్ద బాప్తిస్మము తీసుకోవలసిన వాడిని, నేను నీకు బాప్తిస్మము ఇవ్వడమా ? అని అంటున్నారు. కానీ యేసు ప్రభువు ఇప్పటికీ ఇటులనే కానిమ్ము,   దైవ  సంకల్పమును మనము ఇప్పుడు ఈ రీతిగా నెరవేర్చుట సమంజసము అని చెపుతున్నారు.  దాని అర్దము దేవుని సంకల్పమును నెరవేర్చుటకు నేను ఏమి చేయడానికి అయిన సిద్దమే అని తెలుపుతున్నారు. యేసు ప్రభువు జీవితము మొత్తము కూడా తండ్రి దేవుని సంకల్పమును నెరవేర్చడమే. అది చేయడము కోసము యేసు ప్రభువు ఎంత వరకు అయిన వెళతారు. తన కంటే తక్కువ వాడైన యోహను ఇచ్చే బాప్తిస్మము తీసుకుంటున్నారు. తన శిష్యుల కాళ్ళు కడుగుతున్నారు, తన ప్రాణాన్ని ఇస్తున్నారు.  దేవునితో తన సమానత్వాన్ని వదలి మానవునిగా మన మధ్యకి వస్తున్నారు. కారణం ఏమిటి అంటే దేవుని సంకల్పం నెరవేరాలి. యేసు ప్రభువు ఒక అనమకునిగా ఎందుకు జన్మించాలి, ఎందుకు మరణించాలి, పాపుల చేత ఎందుకు నిందించబడాలి, ఎందుకు వారి చేత శిక్షించబడాలి , అన్నిటికీ సమాదానం యోహానుకు యేసు ప్రభువు ఇస్తున్నారు. దేవుని సంకల్పం నెరవేరుటకు ఈ విధముగా జరుగనివ్వు అని అంటున్నారు. దేవుని చిత్తం నెరవేర్చడానికి నేను ఏమైనా చేస్తాను అని చెబుతున్నారు. 

యేసు ప్రభువును గురించి తండ్రి దేవుడు చెప్పే విషయాలు మనకు ఇక్కడ వివరించబడ్డాయి. తండ్రి దేవుడు తన కుమారుడును ప్రవర్తన పట్ల ఎంతో ఆనందముగా ఉన్నాడు. అదే విధంగా తన కుమారుడు తండ్రి కోసం ఏమి అయిన చేస్తాడు.  

ఈ రోజు యేసు ప్రభువు బాప్తిస్మము ద్వార ఈ సుగుణాన్ని అలవర్చుకోవాలి దేవుని చిత్తము నెరవేర్చడానికి నేను ఏమి చేయడానికైనా సిద్దముగా ఉండాలి. మనము కూడా ఆ విధంగా జీవించడానికి సిద్దముగా ఉందాం. ఆమెన్

కుష్ట రోగి స్వస్థత- యేసు ప్రభువు కరుణ

 కుష్ట రోగి స్వస్థత- యేసు ప్రభువు కరుణ 

మార్కు 1:40-45 

కుష్టరోగి ఒకడు వచ్చి ప్రభువుఎదుట మోకరించి, "నీకు ఇష్టమగుచో  నన్ను స్వస్థపరపగలవు" అని ప్రాధేయపడెను. యేసు జాలిపడి, చేయిచాచి, వానిని తాకి "నాకు ఇష్టమే శుద్దిపొందుము"అనెను. వెంటనే అతని కుష్టరోగము తొలగిపోయెను. అతడు శుద్దుడయ్యెను. యేసు అపుడు "నీవు ఈ విషయమును ఎవరితోను చెప్పరాదు" అని గట్టిగా అజ్ఞాపించి, "నీవు వెళ్ళి అర్చకునకు కనిపింపుము. నీ స్వస్థతకు నిదర్శనముగా మోషే ఆజ్ఞానుసారము కానుకలను చెల్లించుకొనుము" అని వానిని పంపివేసెను. కాని వాడుపోయి, ఈ విషయమును మరింత ఎక్కువగా ప్రచారము చేయసాగెను. అందువలన యేసు ఏ పట్టణమునను బహిరంగముగా ప్రవేశింపలేక, నిర్జనప్రాంతమునకు వేళ్ళను. కాని నలుదేసలనుండి జనులు ఆయనయొద్దకు వచ్చుచుండిరి. 

ధ్యానము: నీకు ఇష్టమగుచో నన్ను స్వస్థపరపగలవు అని ఒక కుష్టరోగి ప్రభువుతో అంటున్నాడు. కుష్టు రోగము అనే జబ్బును దేవుని శాపంగా ప్రజలు భావించేవారు. లేవియఖాండంలో 13 మరియు 14 అధ్యాయాలలో కుష్టురొగులును యాజకులు అశుద్దులుగా ప్రకటించారు. దీని పర్యవసానంగా కుష్టురోగంతో ఉన్నవారు మత పరమైన మరియు సామాజిక పరమైన విషయాలలో పాల్గొనడం నిషేదించబడింది. ఆనాటి సమాజం కుష్టురోగితో ఎటువంటి సాన్నిహిత్యం లేకుండా ఉండటానికి కోరుకున్నారు.   కుష్టురోగం వారిని కలిసిన వారిని, వారితో మాటలాడిన వారిని కూడా అపవిత్రులను చేస్తుంది అని చెప్పడం వలన వారిని తాకడం లేక వారితో మాట్లాడటం కూడా ప్రజలు ఇష్టపడలేదు. మరియు కొన్ని సార్లు వారిని అశుద్దులుగా పరిగణించి రాళ్ళతో కొట్టేవారు. ఇది అంటురోగం కావడం వలన వారితో సాన్నిహిత్యం ప్రజలు హర్షించలేదు, ఒకరకంగా ద్వేషించారు. వారి పేరు ఉచ్చరించాలన్న భయపడేవారు. సమాజికంగా, సాంఘికంగా మత పరంగా కుష్టురోగి అవమానంతో రోజు మరణించేవాడు. జబ్బుతో మనిషి కృశించి పోయేదానికన్నా సామాజికంగా ఎడబాటు వారిని ఎక్కువగా బాధించేది. 

యేసు ప్రభువు కేవలము దైవికమైన విషయాలు మాత్రమే బోధించలేదు. ఆయన దేవుడు కనుక సమాజంలో ఉన్న అన్ని సమస్యలు, అసమానతలు తెలిసినవాడు. ఒక సంఘ సంఘసంస్కర్త వలె  ఆయన సమాజంలో ఉన్న అన్ని రుగ్మతలకు పరిష్కారం చూపడమే కాకుండా, ఇటువంటి సమస్యలతో బాధించబడే వారితో ఎలా ఉండాలో కూడా తన జీవితంతో నేర్పుతున్నారు. కనుక కుష్టురోగంతో ఉన్న వ్యక్తిని తాకుతున్నాడు. ఆ వ్యక్తి యొక్క విలువ మానవ ఆకారంలో కాదు ఆయన వ్యక్తిత్వంలో ఉన్నది అని తెలియజేస్తున్నాడు. కుష్టు రోగం ఒక వ్యక్తిని అందవికారముగాచేయడమేకాక ఆ వ్యక్తిని  అనేక విధాలుగా తింటుంది. యేసు ప్రభువు  కుష్టు రోగికి మరల ఆ కోల్పోయిన భాగాన్ని అతనికి వచ్చే విధంగా చేస్తున్నాడు.  కుష్టు రోగమునకు స్వస్థత అనేది లేదు, కాని ఆనాటి  ప్రజలు ప్రతి చర్మ వ్యాధిని కూడా కుష్టు రోగముగానే పరిగణించేవారు. ఒక వ్యక్తి స్వస్థత పొందినట్లయితే దానికి దృవీకరించవలసినది యాజకుడు కనుక వారు యాజకుని దగ్గర దృవీకరించుకోవాలి. వారు శుద్దిపొందారు అని యాజకులు నిర్ధారించేవారు. 
 
యేసు ప్రభువు ఆ వ్యక్తి మీద జాలి పడి, చేయి చాపి అతనిని  తాకి నాకు ఇష్టమే. స్వస్థత పొందుము అని అంటున్నాడు.  యేసు ప్రభువు బాధలలో, కష్టాలలో ఉన్న వారి పట్ల ఎంతో ఆధరణ  చూపేవాడు. వారి బాధ తాను అనుభవించినంతగా వారి కోసం పరితపించేవాడు. అందుకే మన అందరి పాపలు మోయుటకు కూడా సిద్దపడ్డాడు. కనుకనే అడిగిన వెంటనే ఆ వ్యక్తి బాధను తీసివేయాలని చేయి చాపి, అతనిని తాకుతున్నాడు.  ఆ వ్యక్తి వెంటనే స్వస్థత పొందుతున్నాడు. యేసు ప్రభువు  మానవుడు అన్ని విధాలుగా సంపూర్ణతను పొంది వుండాలి అని కోరుకుంటాడు. మానవుడు ఎటువంటి లోపం లేకుండా ఉండాలి అని కోరుకుంటున్నాడు. అందుకే ఆ వ్యక్తికి కోల్పోయిన సంపూర్ణతను ఇస్తున్నాడు. ఆ వ్యక్తి కోల్పోయిన ఆరోగ్యమును తిరిగి ఇస్తున్నాడు. అతడు సంపూర్ణమైన వ్యక్తిగా ఉండేటట్లు చేస్తున్నాడు. నీవు స్వస్థత పొందుట నాకు ఇష్టమే అని ప్రకటిస్తున్నాడు. కేవలం ఈ వ్యక్తి మాత్రమే కాదు ప్రతి వ్యక్తి కూడా అన్ని విధాలుగా ఎదగాలని, సంపూర్ణత కలిగిఉండాలని మరియు ఎటువంటి లోపాలు లేకుండా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. 

"నీవు వెళ్ళి అర్చకునకు కనిపింపుము. నీ స్వస్థతకు నిదర్శనముగా మోషే ఆజ్ఞానుసారము కానుకలను చెల్లించుకొనుము" అని వానిని పంపివేసెను. యేసు ప్రభువు ఆ వ్యక్తి స్వస్థత పొందిన తరువాత ఆ వ్యక్తిని వెళ్ళి యాజకునికి కనిపించమని చెప్పుట వలన, యాజకుడు ఆ వ్యక్తిని శుద్దుడు అని దృవీకరించుట వలన సమాజంలోనికి  అతను  అధికారికంగా రాగలుగుతాడు. ఎవరు ఆయనను ఆటంకపరచరు. కాని అలా చేయకపోతే ఇది అతని మీద అనేక అనుమానాలకు దారితీస్తుంది. మరియు ఆ వ్యక్తి  వివక్షకు గురిఅవుతూనే ఉంటాడు. కాని ప్రభువు ఆ వ్యక్తి ఎటువంటి వివక్షకు గురికాకూడదు అని అనుకుంటున్నాడు. అందుకే అతన్ని పోయి అర్చకునికి కనపడి, నీవు చట్టపరంగా చెల్లించవలనసినది చెల్లించమని సూచిస్తున్నాడు. ప్రభువుకు మానవుడు ఏ విధంగా కూడా అసమానతలకు, అవమానములకు, వివక్షకు గురికాకూడదు అని కోరుకుంటున్నాడు. 

సంభాషణ మరియు ప్రభువుతో ప్రార్ధన:   ప్రభువా ! మీ కరుణ ఎంత ఉన్నతమైనది. లోకం మొత్తం కూడా భయంతో కుష్టువారిని దగ్గరకు, రానివ్వప్పటికి వారిని  దగ్గరకువారిని రాళ్ళతో కొట్టలేదు.  వచ్చిన వారిని అసహ్యించుకోలేదు.  మీరు మాత్రం వారిని తాకుతున్నారు. వారు స్వస్థత పొందాలని కోరుతున్నారు. అంతే కాకుండా వారిని స్వస్థపరుస్తున్నారు. కుష్టు రోగి స్వస్థ పడుట నాకు ఇష్టమే అని తెలియజేస్తున్నావు. ప్రభువా మీరు కోల్పోయిన ఆరోగ్యమును తిరిగిఇస్తున్నారు. సమాజంలో కోల్పోయిన గౌరవాన్ని ఇస్తున్నారు. మా జీవితంలో కూడా ప్రభువా అనేక అసమానతలకు మరియు వివక్షకుఅవుతున్నాము. కొన్నిసార్లు సమాజంలో జరుగుతున్న అసమానతనలను చూసి వాటిని తీసివేయడానికి మీవలె మేము కూడా కృషి చేసేలా చేయండి. ప్రభువా! మీరు స్వస్థత పొందిన వ్యక్తిని సమాజంలో గౌరవం పొందాలని, ఆ విషయం చట్టపరంగా దృవికరించబడాలని కోరుతున్నారు. మేము కూడ ప్రతి వ్యక్తి సమాజంలో వివక్ష లేకుండా ఉండుటకు చేయవలసిన పని చేయుటకు కావలసిన అనుగ్రహాలు దయచేయండి. ఆమెన్ 


మోషే జీవిత చరిత్ర

 మోషే జీవిత చరిత్ర 

మోషే అంటే నీటి నుండి తీసుకొనబడిన వాడు. మోషే అమ్రాము యోకెబెదుల చిన్న కుమారుడు. హెబ్రీయుల గొప్ప నాయకుడు  మరియు ధర్మ శాస్త్రమును ప్రజలకు ఇచ్చినవాడు. యిస్రాయేలీయుల నాశనమును  ఐగుప్తు రాజు నిర్ణయించిన సమయంలో పుట్టిన వాడు,  యిస్రాయేలీయుల కుటుంబాలలో పుట్టిన మగ బిడ్డలను సంహరించాలని రాజు  నిర్ణయించిన కాలంలో పుట్టి దేవుని కృపతో ఆ విపత్తు నుండి తప్పించుకున్నవాడు. మోషేను కూడా చంపుతారు అని అతని తల్లిదండ్రులు భయపడ్డారు. ఒక బుట్ట తీసుకువచ్చి అతనిని  దానిలో పెట్టి నీటిలో వదిలారు. ఫరో కూతురు మోషేను నీటి నుండి కాపాడి అతనికి మోషే అనే పేరు పెట్టి ఆయనను దత్తత తీసుకుంది. ఫరో కూతురు  కుమారుడిగా, యువరాజుగా ఆయన అన్ని విద్యలలో నేర్పరి అయ్యాడు.  

మోషే గొప్పతనం గురించి ఎంత చెప్పిన అది తక్కువే అవుతుంది. ఆయన చరిత్రకారుడిగా , నాయకునిగా, రాయబారిగా, శాసనకారుడిగా, దేవునికి మానవునికి మద్యవర్తిగా, సంప్రదాయ దేశభక్తునిగా నిర్వహించిన భాధ్యతలు ఆయన గొప్ప వ్యక్తిత్వాన్ని తెలుపుతాయి. దేవుని యొక్క స్నేహితునిగా ఆయన పిలువబడ్డాడు. ఈయన 120 సంవత్సరాలు జీవించాడు. మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తులో గడిపాడు. తరువాత అక్కడ నుండి పారిపోయి మిదియాలో అనామకునిగా జీవించాడు. అక్కడ నుండి 40 సంవత్సరాలు దేవుని రాయబారిగా ప్రజలను నడిపాడు. 

మోషే ఒక లెవీయ కుటుంబంలో జన్మించాడు. అప్పటి సామాజిక పరిస్తితులు ఐగుప్తులో  యిస్రాయేలియుల పట్ల కఠినంగా ఉండేటువంటి రోజులు. మోషే జన్మించిన తరువాత మూడు నెలలు, తన తల్లి అతనిని ఎవరికి కనపడకుండా దాచినది. మోషేను  ఐగుప్తియుల కంటపడకుండా చేయడం కష్టం అవుతుంది. అటువంటి పరిస్తితులలో ఒక బుట్టను కొని దానిలో మోషేను పడుకోబెట్టి నైలునది ఒడ్డున వదలి పెట్టారు. ఆ పెట్టెను మోషే అక్క అక్కడే ఉండి అది ఎక్కడకు వెళుతుందో చూస్తూఉండిపోయింది.  అప్పుడు ఫరో కూతురు స్నానం చేయుటకు అక్కడకు వచ్చి ఆ బుట్టను చూసి తన దాసీలతో ఆ బుట్టను తెప్పించి దానిలో ఉన్న పిల్లాడిని చూచి జాలిపడి తీసుకున్నది.  అది మొత్తం అక్కడ ఉండి  చూస్తున్న మోషే అక్క ఆమె దగ్గరకు వచ్చి ఆ పిల్లవాడి అలనా పాలనా చూసుకోవడానికి హెబ్రీయ స్త్రీ కావాలా? అని అడిగింది. అందుకు ఆమె ఒక స్త్రీని తీసుకురమ్మని  చెప్పింది. అప్పుడు ఆ బాలిక వెళ్ళి మోషే తల్లిని తీసుకొని  వచ్చింది. అప్పుడు ఆమె మోషే తల్లితో, ఆ పిల్లవాడిని తనఇంటికి తీసుకొని వెళ్ళింది. ఆ బాలుడికి కావలసినవన్నీ  ఫరో కూతురు సమకూర్చింది. 

కొన్నాళ్ళ తరువాత ఆ పిల్లవాన్ని ఫరోకూతురు దగ్గరకు తీసుకు వెళ్ళి ఆమెకు అప్పగించింది. అప్పటినుండి ఆమె పెంపుడు కొడుకుగా జీవించాడు. అతనికి ఆమె మోషే అని పేరు పెట్టింది, మోషే అంటే నీటి నుండి తీయబడినవాడు అని అర్ధం. మోషే పెరిగి పెద్దవాడయిన తరువాత హెబ్రీయులు పడుతున్న కష్టాలు స్వయంగా చూశాడు. హెబ్రీయులు అంటే అతనికి సానుభూతి  ఏర్పాడింది. ఒక రోజు ఐగుప్తుకు చెందిన ఒక వ్యక్తి హెబ్రీయున్ని అకారణంగా కొట్టుతుండగా చూచి, కోపంతో వాడిని కొట్టగా వాడు చనిపోయాడు. తరువాత కొన్ని రోజుల తరువాత ఇద్దరు హెబ్రీయులు కొట్టుకొనుచుండగా చూసి, ఒకరి తప్పు తెలుసుకొని వానితో ఎందుకు నీ తోటి వాడిని అకారణంగా కొడుతున్నావని వాడిని వారించాడు. అందుకు వాడు ఐగుప్తియుడిని చంపినట్లు నన్ను చంపచూచుచున్నవా అని అడిగాడు. తాను చేసిన పని అందరికీ తెలిసింది అని గ్రహించాడు. 

అప్పటికే ఈ విషయం ఫరోకు తెలిసింది అని తనను చంపుతారెెమో అని మోషే, మిద్యాను దేశము పారిపోయి అక్కడ బావి వద్ద కూర్చొని ఉన్నాడు. మిద్యాను దేశపు యాజకునికి  ఏడుగురు కుమార్తెలు ఉన్నారు. వారు ఆ బావి వద్దకు నీరు తొడుకొనుటకు వచ్చారు. వారిని కొంత మంది యువకులు వారిని తరిమివేశారు. కాని మోషే వారి తరుపున ఉండి వారి మందలకు నీళ్ళు పెట్టారు. అపుడు వారు తమ తండ్రి రవూవేలు వద్దకు వెళ్ళగా ఆయన వారిని అంత పెందలకడన ఎలా వచ్చారు అని  అడగగా, వారు ఐగుప్తుదేశీయుడు వారిని గొర్రెల కాపరుల  నుండి కాపాడాడని  మరియు అతనే నీళ్ళుతోడి మందలకు పోశాడు అని చెప్పగానే అందుకు వారి తండ్రి ఆయన ఎక్కడ ఉన్నాడు? ఎలా ఆయనను అక్కడే వదలి వచ్చారు మనతో భుజించుటకు తీసుకురమ్మని కుమార్తెలతో చెప్పాడు. అలా మోషే రవూవేలు వద్ద ఉండి ఆయన కుమార్తె సిప్పోరాను పెండ్లి చేసుకున్నాడు. ఆమెకు బిడ్డ పుట్టగా ఆ బిడ్డకు గెర్షొము అని పేరుపెట్టారు. దాని అర్ధం పరదేశి. 

మోషేకు పిలుపు 

ఐగుప్తులో యిస్రాయేలు ప్రజలు బానిసలుగా మ్రగ్గుతు, సహయం కొరకు ఆక్రందన చేయగా అది దేవుని చెవినపడింది. దేవుడు అబ్రహాము, ఈసాకు యాకోబులతో చేసుకొనిన ఒడంబడిక గుర్తుకు తెచ్చుకొని వారిని కరుణించాడు.  మోషేకు తన మామ మిధ్యాను యాజకుడు యిత్రో మందలను మేపేవాడు అప్పుడు ఒకసారి మందను తొలుకొని హోరెబు కొండమీదకు వచ్చాడు. అక్కడ ఒక పొందనుండి వచ్చు నిప్పుమంట రూపములో యావేదూత ఆయనకు సాక్షాత్కరించినది. మోషే కన్నులేత్తి చూడగా అక్కడ ఒక పొద  మండుచున్నది కాని పొదమాత్రము కాలిపోవడం లేదు. అది చూసిన మోషే, నేను దగ్గరకు వెళ్ళి అది ఏమిటో చూడాలి అని అనుకున్నాడు. ఆ పొద దగ్గరకు వెళ్ళగా పొద నుండి ఒక స్వరము మోషే మోషే అని పిలవగా చిత్తము ప్రభూ అని  చెప్పాడు.   అప్పుడు దేవుడు దగ్గరకు రాకుము. చెప్పులు విడవుము. నీవు నిలుచున్న ఈ తావు పవిత్ర భూమి, నేను మీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను, ఈసాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పాడు.  మోషే దేవున్ని చూచుటకు భయపడి ముఖము కప్పుకున్నాడు. దేవుడు ఐగుప్తులో ఉన్న తన ప్రజలు అనుభవించే బాధలు చూశానని, వారి దాస్యం నుండి వారిని భయటకు తీసుకురావాలని నేను అందుకే క్రిందికి దిగివచ్చను అని చెప్పాడు. ఐగుప్తు నుండి నా ప్రజలను తీసుకొని రావడానికి నిన్ను ఫరో రాజు వద్దకు  పంపుదును అని చెప్పాడు. అందుకు మోషే ఫరో రాజు వద్దకు వెళ్ళుటకు నేను ఎవ్వడను అని అన్నాడు. దేవుడు మోషేతో నేను నీకు తోడై ఉందును అని చెప్పాడు. 

"ఉన్నవాడు"

మోషేకు దేవుడు యిస్రాయేలీయులతో వారి పూర్వీకుల దేవుడనని చెప్పమని చెబుతున్నాడు. యావే వారి పితరుల దేవుడనిఆయన అబ్రహాముఈసాకు మరియు  యాకోబుల దేవుడని  ప్రకటిస్తున్నాడు. అపుడు మోషే దేవునితో ఆ ప్రజలు  నన్ను ఆ దేవుని పేరు ఏమి అని అడిగినచో నేను ఏమి చెప్పవలయును అని అడిగాడు. దానికి దేవుడు సమాధానం ఇస్తూ "నేను ఉన్నవాడను" ఉన్నవాడు నన్ను మీ వద్దకు పంపించాడు అని చెప్పుము అని అన్నాడు. మోషే, దేవుడు వారిని విమోచించి,వాగ్ధత్త భూమికి తీసుకొనిరావడం జరుతుందని ప్రకటించాలి.ఇంకా మోషేతో దేవుడు  వెళ్ళి ఫరోను కలవమని చెప్పాడు. ముందుగా మోషే వెళ్ళి ప్రజలనుకలిసి  దేవుడు చెప్పిన మాటలును  తెలియజేసి వారిని ఐగుప్తు నుండి  దేవున్ని ఆరాధించుటకుబయటకు బయటకు తెచ్చి వారిని విమోచించాలి. మోషేతో  దేవుడు, ఫరో అతని మాటను వినివెంటనే ప్రజలను ఐగుప్తు నుండి పంపివేయాడు అని తెలియజేశాడు. ఐగుప్తులో ఉన్న యిస్రాయేలు ప్రజలను పంపించకపోతే దేవుడు హస్తము చాచి ఐగుప్తుకు  అనేక అరిష్టములతో చేయబోయే నష్టమును తెలియజేయాలి. దాని తరువాతనే యిస్రాయేలు ప్రజలను ఫరో అక్కడ నుండి పంపుతాడు అని తెలియజేశాడు. 

దేవుని నుండి ఇవి మొత్తం విన్న తరువాత కూడా మోషే దేవునీతో  వీటి గురించి మరలా  ప్రశ్నిస్తాడు. ఒక వేళ వారు నా మాటను నమ్మకపోతేలేక నా మాటను వినక దేవుడు నీకు దర్శనము ఇవ్వలేదంటే  అని దేవుడిని ప్రశ్నించాడు. అప్పుడు దేవుడు ఒక అద్భుతంతో మోషేకు  సమాధానం చెప్పాడు. మోషేతో దేవుడు, చేతి కర్రను తీసుకొని నేల మీద కొట్టమని చెప్పగా  అతడు అలానే చేస్తాడు. అప్పుడు  కర్ర పాముగా మారుతుంది. అప్పుడు దేవుడు  పామునుతోకపట్టుకోమని చెబుతున్నాడు. మోషే అలా చేయగానే అది మరలా కర్రలా మారిపోయింది. నీవు ఇక ఇట్లే చేయుము. దానిని చూసిన తరువాత వారు నమ్ముతారు అని చెప్పాడు. తరువాత మోషేను దేవుడు తన వక్షస్థానమునచేయి  పెట్టి వెనుకకు తీసుకోమని  చెప్పగా ఆయన అలానే చేశాడు. అపుడు  చేయి వెంటనే  కుష్టు రోగముతో మంచు వలే తెల్లగా   మారింది. దానిని బయటకు తీయగానే మరలా అది మామూలు చేయిగా మారుతుంది. ఈ విధముగా మోషేకు అధ్బుతాలు చేసే శక్తిని ఇచ్చాడు. ఇవన్నీ చేసిన తరువాత వారు విశ్వసించకపోతే దేవుడు మోషేతో నైలు నది నుండి నీటిని తీసుకొనిపొడినేల మీద పోయుము. అప్పుడు ఆ నీరు రక్తము ఎర్రగా మారుతుంది అని చెబుతున్నారు. 

దేవుడు మోషేతో ఇవన్నీ చెప్పిన తరువాత కూడా మోషే దేవునితో ఇంత గొప్ప పనికి తగిన వ్యక్తిని  కార్యమునకు ఎన్నుకున్నారాఅని అడుగుతు నేను సరిగా మాటలడలేను అనినత్తి వాడిని చెబుతున్నాడు. అప్పుడు దేవుడు ఆయనకు సమాధానం చెబుతూ మానవుని నోరు చేసినదిదానిని మూగగా చేసేదిలేక చెవిటిగా చేసేదిచూపునించేదితీసివేసేది నేనుకదా  అని అడుగుతున్నారు. దేవుడు  మాటను చెప్పిన తరువాత కూడా మోషే దేవా వేరే ఎవరినైన పంపండి నన్నుకాదు అని చెబుతున్నాడు. దేవునికి కోపం వచ్చినప్పటికీ మోషే ఆత్మస్థైర్యం  లేదని అతనికి తోడుగా తన సోదరుడు ఆహారోనును తీసుకొని వెళ్ళమనిఅహరోను మోషే  తరపున మాటలాడుతాడు అని చెప్పాడు.

ఆహారోనుకు మోషే దేవుని సందేశమును తెలియజేయాలి అని చెప్పాడు.  విధంగా దేవుడు వారితో ఉండి వారు ఏమి చేయాలో వారికి నేర్పుతానని వారికి చెప్పడం జరిగినది. ఆహారోను ప్రజలకు ప్రతినిదిగా , ఉండాలి అని చెప్పాడు. దాని తరువాత మోషే తన మామ యిత్రో వద్దకు వచ్చి నేను నా చుట్టూ పక్కాలు ఎలా ఉన్నారో తెలుసుకొనవలయును నాకు సెలవిమ్ము అని అడిగిన వెంటనే యిత్రో వెళ్ళి రమ్మనీ చెప్పాడు. మోషే తన భార్యను పిల్లలను తీసుకొని ఐగుప్తు  బయలుదేరాడు. దేవుడు మోషేతో నీకు ఇచ్చిన శక్తులన్నింటిని ఫరో రాజు ఎదుట చూపమని చెప్పాడు. ఆహారోను మోషేను దేవుని కొండ వద్ద కలుసుకోగా ఇద్దరు కలసిపోయారు. 

 

మోషే ఐగుప్తుకు వెళ్ళుట మరియు పది రకాల అరిష్టములు 

మోషే ఆహారోనులు ఫరో వద్దకు వెళ్ళి యిస్రాయేలు దేవుడైన  యావే తన ప్రజలను అరణ్యములో ఉత్సవము జరుపుకొనుటకు పంపమని చెప్పారు కాని ఫరో ఎవరు ఆ యావే? అతడు నాకు ఎవరో తెలియదు నేను ఎందుకు ఆయన చెప్పినట్లు నేను ఎందుకు చేయాలి అని చెప్పారు. మోషే ఆహారోను వారిని పంపించకపోతే జరిగే అరిష్టముల గురించి చెప్పారు. కాని ఫరో వారి మాటను పెడ చెవిన పెట్టి మోషే ఆహారోను ను పంపివేశాడు. 

మోషే ఐగుప్తు వెళ్ళు సమయంలో ఆయన వయసు 80 సంవత్సరాలు మరియు ఆహారోను వయసు 83 సంవత్సరాలుమోషే ఆహారోను మొదట వెళ్ళి ఫరోను కలసి తమ ప్రజలను ఏడారిలోనికి వెళ్ళి దేవుని పండుగ చేసుకొనుటకు అనుమతించాలని వారికి చెప్పాలని జరగడం జరిగినదిఫరో అందుకు ఒప్పుకోలేదుకనుక దేవుడు ఫరో ఎదుట మొదటి అద్భుతం చేశాడుఆహారోను మోషే చేతి కర్రను తీసుకొని నేల మీద వేయగానే అది పాముగా మారినదిఫరో తన దగ్గర వున్న ఇంద్రజాలీకులు తమ వద్ద వున్న కర్రలను కింద వేయగానే అవి కూడా పాములుగా మారినవిఅపుడు దేవుడు ఎవరి శక్తి గొప్పది అని చూపించుటకు పూనుటకు ఆహారోను వేసిన కర్ర పాముగా మారి వారు చేసిన అన్నీ పాములను మింగివేసినదిదేవుని శక్తిని చూసిన తరువాత ఫరో మనస్సు రాయిలా మారిపోయి ఆయన యిస్రాయేలు ప్రజలను వెళ్లనివ్వలేదుదీని తరువాత దేవుడు పది తీర్పులను ఐగుప్తు మీద చేయడం జరిగినదిఏడు సంవత్సరాల వ్యవదిలో ఇది మొత్తము కూడా జరిగినది.

నీరు రక్తముగా మారుట

మోషీ తన వద్ద వున్న కర్రను తీసుకొని నీటిని కొట్టగా ఐగుప్తులోని నీరు మొత్తం రక్తం వలె మారిపోయిందిదానిలో చేపలు మొత్తం చనిపోయాడుఐగుప్తుయులు  నీటిని తాగలేక పోయారు.  అక్కడి చెరువులుకుంటలునదులు అన్నీ కూడా రక్తం వలె మారిపోయాయిఫరో యాజకులు కూడా అలానే చేయగలిగారుకనుక ఫరో ప్రజలను పంపుటకు ఇష్ట పడలేదు.

కప్పలు

ఫరో ప్రజలను పోనివ్వకపోవడంవలన దేవుడు రెండవ ఉపద్రవాన్ని వారిమీదకు తీసుకురావడం జరిగినదిదేవుడు  ప్రదేశాన్ని కప్పలతో నింపి వారికి ఇబ్బందిని కలుగచేశాడుకప్పలు కుప్పలు కుప్పలుగా నదులలో నుండి బయటకు వచ్చేలా చేసి వారి ఇళ్ళల్లోనికి , పడక గదులలోనికి వెళ్ళి మనుషుల మీద పడేలా చేశాడుఇది చూసిన ఫరోమోషే ఆహారోనులను పిలిచి దీనిని ఆపమని తరువాత వారిని పంపుతాను చెప్పడం  వలన కప్పలు మొత్తం చనిపోయేలా చేశాడు దేవుడు కప్పలను అన్నింటినీ తీసుకురాగా అవి పెద్ద కుప్ప అయినవిఅది చూసిన ఫరో మరలా తన మనస్సును మార్చుకున్నాడుకనుక దేవుడు మూడవ ఉపద్రవాన్ని తీసుకురావాలసి వచ్చినది.

దోమాపోటు 

దేవుడు అప్పుడు మోషేతో ఆహారోనును కర్రను చాచి దుమ్మును కొట్టమని కొడితే అది   ప్రదేశం మొత్తం దోమలు ఆవుతాయి అని చెప్పడం జరిగినది.అప్పుడు అవి మనుషులు జంతువుల మీదకు వస్తాయి అని చెప్పడం జరిగినదిఅప్పుడు ఫరో ఇంద్రజాలీకులు కూడా అలానే చేయ ప్రయత్నించారు కానీ అలా చేయలేకపోయారుఅప్పుడు వారు ఇది దేవుని వ్రేలుతో చేయబడింది మేము చేయలేకపోయాము అని చెప్పడం జరిగినదిఅయినప్పటికీ ఫరో వారు పోవడానికి ఒప్పుకోలేదు.

ఈగలు

ఇప్పుడు దేవుడు మరల వారి మీద ఒక ఉపద్రవం తీసుకు వచ్చేలా ఫరో ప్రవర్తించాడుఒక గుంపు ఈగలు ఐగుప్తు ప్రజల మీద మరియు వారి ఇళ్లలోనికి వెళ్ళి వారిని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టినవిఈగలు ఫరో అన్నీ ఇళ్లలోనికి అతని సేవకుల ఇళ్ళల్లోనికీ  నేల మొత్తం మీదకు వెళ్ళాయిఫరో మరల మోషేతో  ఈగలను వెళ్లిపోయేవిధముగా చేయమని చెప్పగా మోషే అలానే చేస్తాడు కానీ ఫరోమాట మీద నిలబడకుండా యిస్రాయేలు ప్రజలను అక్కడ నుండి పోనియలేదు 

ఐగుప్తు పశువులకు రోగాలు

 తీర్పులో ఐగుప్తు ప్రజల జంతువుల మీద ముఖ్యముగా ఆవులు గుర్రాలు గాడిదలు ఒంటెలు ఎద్దులు మరియు గొర్రెలు  రోగంతో మరణించడం జరిగినదిఅయినకాని ఫరో ప్రజలను పోనివ్వలేదు.

బొబ్బలు

 తీర్పులో దేవుడు మోషేతో ఆహారోనుతో చెప్పమని ఆరోను తన పిడికిలి నిండా బూడిద తీసుకొని దానిని ఐగుప్తియుల వైపు చిమ్మమని చెప్పాడుదానిద్వార వారికిబొబ్బలు వాపులు  బొబ్బలు పగిలి గాయాలు వారికి వారి జంతువులకు కలుగుతున్నాయి బొబ్బలు ఫరో ఇంద్రజాలకులకు కూడా వచ్చాయిఅయినప్పటికీ ఫరో వారిని ఐగుప్తు వదలి వెళ్లిపోనివలేదు.

వడగండ్లు

 తీర్పులోదేవుడు ఐగుప్తులో భారీ వడగండ్ల వాన కురిసేలా చేశాడు బయట ఉన్న మనుషుల మీద మరియు జంతువుల మీద అవి పడ్డాయివాటితో పాటు దేవుడు అగ్నిని కూడ వచ్చేలా చేశాడుదీనితోటి పంటలుమొక్కలు బయట ఉన్న మనుషులు మరియు జంతువులు కూడా నాశనం అయాయిఇది చూసిన ఫరో  అరిష్టమును మోషేతో దీన్ని ఆపివేయమని యిస్రాయేలు ప్రజలను పంపిస్తాను అని చెబుతారుమోషే దేవునితో చెప్పి దానిని ఆపివేయిస్తాడుకానీ ఫరో మనసు మార్చుకొని యిస్రాయేలు ప్రజలను పోనివ్వడు.

మిడుతలు

 అరిష్టములో దేవుడు ఐగుప్తు నేల  మొత్తం మిడుతలు నిండేలా చేశాడుప్రజలు నేలను చూడలేనంతగా  ప్రదేశం మొత్తం మిడుతలతో  నిండిపోయింది  అరిష్టమును కూడా దేవుడు ఫరో యిస్రాయేలు ప్రజలను పంపివేస్తాను అనగానే ఆపివేస్తాడు కానీ ఫరో మరలా మనసు మార్చుకొని యిస్రాయేలు ప్రజలను పంపివేయడు.

చీకటి

తరువాత తీర్పులో దేవుడు మోషేతో తన చేతిని పైకెత్తమని చెప్పాడుమోషే అలా  చేయగానే దేవుడు ఐగుప్తు మొత్తం చీకట్లు కమ్ముకొనునట్లు చేశాడు చీకటి మూడు రోజులు ఉన్నదిప్రజలు ఏమి చూడలేక పోయారుఎవరు వారి ప్రదేశం నుండి లేవలేకపోయారు.వారు ఉన్న ప్రదేశం నుండి ఒక అంగులము కూడా వారికీ కనపడనంత చీకటి వారు అనుభవించారు.  వారి ముందు ఏముందో ఎవరు తెలుసుకోలేకపోయారు.

తొలి చూలు బిడ్డల మరణం

 అరిష్టములో మృత్యు దూత ఐగుప్తులో పుట్టిన ప్రతి తొలిచూలు బిడ్డను చనిపోయేలా చేశాడుకానీ యిస్రాయేలు ప్రజల మాత్రం దీనినుండి తప్పించుకునేందుకుగాను ఐగుప్తులో ఉన్న యిస్రాయేలియుల తలుపుల మీద గొర్రె పిల్ల రక్తమును పూయమనీ చెప్తాడుఅపుడు అది చూసిన మృత్యు దూత  ఇంటిలో ఉన్నవారిని వదలిపెట్టి మిగిలిన ఇళ్ళలో ఉన్నవారు చనిపోయేలా చేసిందికేవలం మనుషుల మాత్రమే కాక జంతువులు తొలిచూలు పుట్టిన వాటిని కూడా చంపుతుందిఇది యిస్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి తీసుకొని పోవుటకు ఐగుప్తులో చేసిన చివరి అరిష్టందీని తరువాత ఫరో యిస్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి వెళ్లిపోవుటకు అంగీకరిస్తాడుయిస్రాయేలు ప్రజలు ఐగుప్తులో 430 సంవత్సరాలు బానిసత్వం తరువాత ఐగుప్తు నుండి విముక్తి పొందారు.

ఎర్ర సముద్రమును చీల్చుట

తరువాత అద్భుతం చాల  నాటకీయంగా ఉంటుందియిస్రాయేలు ప్రజలు ఐగుప్తును వదలివెళ్లారుఫరో వారు వెళ్ళుటకు ఒప్పుకున్న తరువాత ఆయన మరలా తన మనసు మార్చుకున్నాడువారిని వెంటపడి మరలా వెనక్కు తీసుకురావాలి అనుకున్నాడు. అది చూసిన ప్రజలు మోషేతో చెప్పారువారు ఎర్ర సముద్రం ముందుకు రాగానే ఆగిపోయారుఅప్పుడు ఎక్కడకు వెళ్లాలో తెలియదుముందు చూస్తే సముద్రము ఉన్నదిఅంత అగోచరముగా ఉన్నదిముందుకు వెళితే సముద్రంలో మునిగిపోతారుఅక్కడే ఉంటే ఫరో సైనికులు వచ్చి మరల బానిసలుగా తీసుకుపోతారువారిని కాపాడుటకు ఇప్పుడు దేవుడే ఏమైనా చేయాలిఅప్పుడు మోషే వారితో వారికి ధైర్యం చెబుతూ భయపడవద్దుధైర్యముగ ఉండండి దేవుడు చూపబోయే రక్షణను చూడండి మీరు ఇప్పుడు చూసే ఐగుప్తుయులును మరలా మీరు చూడరుదేవుడు మీకోసం యుద్దం చేస్తారు అని వారికి ధైర్యం చెప్పాడు. మోషే దేవునికి మొరపెట్టగా దేవుడు మోషేతో, నీవు నాకు మొరపెట్టుట ఎందుకు  నీ కర్రను తీసుకొని నీ చేతిని సముద్రము మీద చాచి దానిని పాయలుగా చీల్చుము యిస్రాయేలు ప్రజలు ఎండిన నేల మీద నుండి సముద్రం మధ్య గుండా వెళ్లిపోతారు అని చెప్పాడు. దేవుడు చెప్పినట్లు చేయగా సముద్రము రెండుగా చిలిపోయింది.  అప్పుడు  యిశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రము రెండుగా చీలిపోవడం చూసి దానిగుండా  పోవుట మొదలుపెట్టారుసముద్రపు నీరు రెండు ప్రక్కల కూడా గోడవలే వారిని కాపాడినదియిశ్రాయేలు ప్రజలు అందరు సురక్షితము చేరిన తరువాత దేవుడు మోషేతో నీ చేతిని సముద్రముపై చాపు రెండు బాగాలుగా ఉన్న సముద్రము కలసిపోతుంది,  ఐగుప్తు సైనికులు  రధములు అన్నీ సముద్రములో కలసిపోయారు.అప్పుడు మోషే మరియు ఇశ్రాయేలీయులు దేవుని పేరిట విజయ గీతము పాడి దేవుని స్తుతించారు. 

ఎడారిలో యిస్రాయేలు ప్రజలు 

రెల్లు సముద్రము దాటి షూరు అరణ్యమునకు వెళ్లారు. అక్కడ వారికి త్రాగుటకు నీరు దొరకలేదు. అక్కడ నుండి మారా వెళ్లారు. అక్కడ నీరు చేదుగా ఉండుట వలన ఆ నీటిని  త్రాగలేక పోయారు. మోషే దేవునికి మొర పెట్టగా దేవుడు అతనికి ఒక చెట్టును చూపించగా మోషే ఆ చెట్టును నీటిలో వెయ్యగా అవి తియ్యగా అయ్యాయి. అక్కడ నుండి ప్రజలు ఏలీము వెళ్లారు అక్కడ పండేడు నీటి బుగ్గలు ఉన్నాయి. ఎలిము సినాయి మద్యనున్న  సీను ప్రాంతము చేరిన తరువాత ప్రజలు మోషే ఆహారోనులను నిందించడం మొదలెట్టారు. మేము ఐగుప్తులో  ఉన్నప్పుడు  మేము మాంసం కడుపార తిన్నామని, ఇక్కడ ఆకలితో మాడి చనిపోతున్నామని ఇక్కడ మమ్ములను చంపుటకు ఇక్కడకు తీసుకొని వచ్చారా? అని అడిగారు. అప్పుడు దేవుడు వారి మాటలను విని యావే తేజస్సు మేఘము నందు కనపడి  మోషేతో వారు ప్రొద్దుగ్రూంకునప్పుడు మాంసమును తెల్లవారు రొట్టెను కడుపార తినుదురు అని వారికి చెప్పాడు. అప్పటి నుండి ఉదయమున ఎడారి నేలమీద నూగు వంటి సన్నని పొడిగా మోషే మీరు తినుటకు దేవుడు ఇచ్చిన ఆహారము అని చెప్పాడు. దానికి మన్నా అని పేరు పెట్టారు. అలానే సాయం కాలము పూరెడు పిట్టలు వచ్చి వారి విడుదలను కప్పి వేసేవి. మన్నాతో   ఒమెరు పట్టు పాత్రను నింపి మోషె  ఆజ్ఞ ప్రకారం భద్రపరిచారు. ఆ పాత్రను నిబంధన మందసము ఎదుట ఉంచారు. యిస్రాయేలు ప్రజలకు నీరు దొరకక మోషేతో మాకు నీరు చూపించమని జగదమాడారు అప్పుడు మోషేతో దేవుడు నీవు కర్రను తీసుకొనినేను హోరెబు కొండల రాతిమీద నిలబడి ఉంటాను నీవు రాతిని కొట్టుము వెంటనే ఆ రాతి నుండి త్రాగుటకు నీరు వస్తాయి అని చెప్పాడు. మోషే దేవుడు చెప్పినట్లుగా చేసెను. 

మోషే  పది ఆజ్ఞలు పొందుట

ఎడారిలో యిస్రాయేలును పరీక్షిస్తున్నప్పుడు దేవుడు మొదటిగా చూడాలను కున్నది దైవ ప్రజలు దేవుని ఆజ్ఞాలు పాటించగలరో లేదో తెలుసుకోవాలనుకున్నారుకనుక తన ఆజ్ఞలు మొత్తం యిస్రాయేలు ప్రజలు ఎలా పాటిస్తారో పరీక్షించారు.

ఐగుప్తునుండి బయటకు వచ్చిన మూడు నెలలకు దేవుడు మోషేతో నేను నీతో సీనాయి పర్వతం మీద తన ప్రజల సమక్షంలో కలుస్తాను అని చెబుతాడుదేవుడు వచ్చినప్పడు సినాయి పర్వతం మొత్తం పొగతో కప్పబడిందిఅప్పుడు మెరుపులుఉరుములు దట్టమైన పొగ పర్వతం మొత్తం దగదగ మెరిసింది.

దేవుడు సినాయి పర్వతం మీదకు అగ్నిలో వచ్చాడుఅప్పుడు దట్టమైన పొగ పర్వతం మీద నుండి పైకి వెళుతుందిదేవుడు మోషేను మాత్రమే పర్వతం మీదకు రమ్మని చెప్పాడుఅప్పుడు దేవుడు మోషేకు పది ఆజ్ఞలు ఇవ్వడం జరిగినదిఇవి యిస్రాయేలు ప్రజలు పాటించాలనివాటికి కట్టుబడి ఉండాలని  దేవుడు కోరాడుదాని తరువాత మోషే వీటిని ప్రజలకు తెలియపరచడానికి కిందకు వచ్చాడుమరల వెంటనే దేవుడు మోషేను పిలువగా పర్వతం మీద మోషే 40  రోజులు పర్వతం మీదనే ఉన్నాడుదేవుడు పర్వతం మీద దహించివేసే విధంగా ఉన్నది.

 రెండవ సారి దేవున్ని మోషే కలసినప్పుడు దేవుడు మోషేకు ఎలా దివ్య మందసాన్ని ఎలా కట్టాలి అని చెప్పాడుఇక్కడ దేవుని సాన్నిధ్యం ఎలా దేవుడు యిస్రాయేలు ప్రజలతో 40 సంవత్సరాలు వీరితో ఉండుటకు సిద్దపడటం జరిగినదిదేవుడు  రెండవ సారి మోషేను కలిసినప్పుడు పది ఆజ్ఞలు ఇచ్చాడు.

మోషేకు రెండు రాతి పలకలమీద రెండు ప్రక్కల రాయబడ్డాయిపలకల మీద దేవుని  చేతితో రాయబడినవి.  మోషే మాత్రమే దేవునితో మాటలాడటానికిఉండటానికి 40 రోజులుపగల్లు ఉన్నారుఇంత గొప్ప విషయం ఇక్కడ జరుగుతుంటే పర్వతం క్రింద మాత్రం  ఘోరమైన పని జరుగుతుందియిస్రాయేలు ప్రజలు పర్వతం క్రింద అసహనంతో మోషే క్రిందకు రాలేదని గొణుగుకుంటూ ఆయనకు ఏమి అయ్యిందో అసహనంతో ఊగిపోయారు.

వారు ఒక  బంగారపు దూడను చేసి దానిని ఆరాధించడం ప్రారంభించారుదేవుడు పర్వతంపై నుండి కోపబడ్డాడుదేవుడు  ప్రజలను మొండివారని వారిని సంహరిస్తానని చెప్పాడుదేవుడు మోషేతో నేను నీ నుండి గొప్ప జాతిని ఏర్పాటు చేస్తాను అని చెప్పాడుకాని మిగిలిన యిస్రాయేలు ప్రజలను బంగారపు దూడను ఆరాధించిన సంహరించబోతున్నాను అని చెప్పాడు.

 సమయంలో మోషే దేవునితో ప్రజలను చంపవద్దని వాదించగ దానికి దేవుడు ఒప్పుకున్నాడుమోషే క్రిందకు దిగిరాగా అక్కడ ప్రజలు పాటలతో మరియు నృత్యంతో  బంగారు దూడ చుట్టు ఉండుట చూచి మోషే కోపోదృగ్తుడయ్యాడుఅప్పుడు తన చేతిలో ఉన్న దేవుని అజ్ఞాలను రాసి ఉన్న రెండుపలకలను విసిరివేయగా అవి ముక్కలుగా పగిలిపోయాయిమోషే వారు చేసిన  దూడను తీసుకొని దానిని కాల్చి పిండి చేసి నీటిలో పోసి యిస్రాయేలు ప్రజలు దానిని తాగేలా చేశాడుబంగారు దూడను పాడు చేసిన తరువాత మోషే ప్రజల ముందుకు వచ్చి వారిని దేవుని వైపు లేక వారి ప్రక్కనే ఉంటారో నిర్ణయించుకోమన్నాడుఅప్పుడు అందరు ఎవరి వైపు ఉండాలో నిర్ణయించుకున్న తరువాత మోషే దేవుని వైపు కాని వారిని అక్కడే అప్పుడే చంపబడాలని ఆదేశించాడుఆరోజు 3000 మంది వారు దేవుని మీద చేసిన తిరుగుబాటుకుగాను మరణించాడు.

అప్పుడు మరల మోషే సినాయి పర్వతం మీదకు వెళ్ళగా దేవుడు మరల రెండు రాతి పలకలను పగిలిపోయిన వాటికి బదులుగా ఇచ్చాడుమోషే దేవుని సాన్నిధ్యాన్ని చూచుటకు అనుమతించబడ్డాడుతరువాత దేవుడు తనను చూచుటకు అనుమతి ఇచ్చాడు.  మోషేతో దేవుడు నీవు నా ముఖమును చూడవచ్చు అని చెప్పాడు.

ఇక్కడ ఒక స్థలం మీద రాయి ఉన్నాది దానిమీద నీవు ఉండుము నా మహిమ పోవుచున్నప్పుడు నిన్ను నేను రాతి చివరన ఉంచుతాను అని చెప్పాడునేను నిన్ను నా చేతితో కప్పుతానునేను నా చేతిని తీసినప్పుడు నీవు నా వెనుక భాగం చూడవచ్చును  కానీ నా ముఖము కనబడదు అని చెప్పాడుఇది మోషేకు దేవుని గురించి ఉన్న అనుభవందేవుడు మోషేను తన మహిమను చూచుటకు అనుమతించాడుమానవుడు పాపం చేసిన తరువాత దేవుడు మానవునికి ఇచ్చిన  అతి గొప్ప బహుమానం మోషే పొందాడుదేవుని చూడగలిగాడుమోషే దేవున్ని ప్రత్యక్షంగా చూసిన తరువాత అతను కొండ దిగి క్రిందకు రాగానే అతని ముఖ శరీరము మెరిసిపోయిందిప్రజలు ఆయన దగ్గరకు రావడానికి  కాంతికి  భయపడ్డారుమోషే తన ముఖమునకు ఒక గుడ్డను అడ్డుపెట్టుకోవలసివచ్చింది.

దివ్య మందసము

యిస్రాయేలు ప్రజల నాలబై సంవత్సరాల ఎడారి ప్రయాణంలో ఒక గొప్ప కట్టడం ఏమిటి అంటే దివ్యమందసందివ్య మందసము దేవుని సాన్నిధ్యమును తెలియజేస్తుందిదేవుడు మోషేకు దివ్యమందసమును ఎలా కట్టాలో తెలియజేశాడుదివ్యమందసము కట్టిన తరువాత ఒక మేఘము  మందసమును పగలు కమ్మివెయ్యగాఅగ్ని దర్శనము రాత్రి  మందసమును కమ్మివేసేదిఅలా దేవుడు యిస్రాయేలును  దేవుడు 40 సంవత్సరాలు  పగలు మేఘమువలె రాత్రి ద్వీపస్తంభం వలె నడిపించాడుమేఘము దివ్య మందసము పైనుండి వెళుతుందో అప్పుడు యిస్రాయేలు దానీవెంట ఎక్కడకు వెళుతుందో అక్కడకు వెళ్ళి వుండేవారు మేఘం మందసము మీద ఉన్నంత వరకు వారు అక్కడే ఉండేవారు.

గూడాచారులు తిరిగి వచ్చుట

40  సంవత్సరంప్రయాణం మొదటిలో దేవుడు ప్రజలను వాగ్ధాత్త భూమికి దగ్గరకు తీసుకురావడం జరిగినదియిస్రాయెలియులు 12 మందిని భూమిని పరీక్షించడానికి పంపిందిపన్నెండు మంది గూడచరులలో పదిమంది కనానును వశపరచుకోవడం సాధ్యం కాదు అని చెప్పగా  కాలేబ్ వారితో అక్కడకి వెళ్ళి దానిని వశపరుచుకుందాము అని చెప్పాడుదేవుడు  గూడాచారులు ఇచ్చిన సమాచారంతో దేవుడు సంతృప్తి చెందలేదువారు దేవుడు చేసిన అనేక గొప్ప కార్యములు చూసిన కానీ వారు దేవున్ని విశ్వాసించలేదుకనుక దేవుడు వీరు అందరు వాగ్ధాత్త భూమిని చేరరు కానీ కాలేబు మరియు ఆయన సంతతి వారు వాగ్ధాత్త భూమిలో ప్రవేశిస్తారు అని చెప్పాడు.  ఆదేవిధముగా 20 సంవత్సరాల వయసు దాటిన వారు ఎవరు  భూమిలోనికి ప్రవేశించారు ఎందుకంటే వారు నన్ను అనుసరించలేదు అని దేవుడు చెప్పాడు.

కనుక యోహొషువా మరియు కాలేబు  20 సంవత్సరాల లోపు యువతరాన్ని నడిపించవలసినవారువారు విజయవంతముగా వారి పెద్దవారు చూసిన భారీకాయులను జయించుకుంటూ వచ్చారుఇరవైసంవత్సరాలు మరియు  పైన కలిగిన వయసుకలవారు అందరు ఎడారిలో దేవుని యందు విశ్వాసం ఉంచక  నలబై సంవత్సరాల కాలంలో మరణించారుపది ఉప ద్రవాల ద్వారా వీరిని ఐగుప్తు నుండి తీసుకువచ్చి  సముద్రమును రెండుగా చీల్చిన దేవుని మహిమను చూసిన కానీ వారు దేవుడు వారికి  భూమిని ఇస్తాడు అని నమ్మలేదువీటన్నింటిలో ఆశ్చర్యమైన విషయం ఏమిటి అంటే ఒక్కరు కూడా 20 సంవత్సరాలు ధాటినవారు  పరీక్ష ఉత్తీర్ణులైనవారు లేరు.

మోషే మరణం

మోషే జీవితంలో చాలా విషాదాకారమైన విషయం ఏమిటి అంటే మోషే వాగ్ధాన భూమిలోనికి అడుగు పెట్టలేదుమోషే 120 సంవత్సరాల వయసులో నేబో కొండ వద్ద మరణించాడుఆయన వాగ్ధాన భూమికి వెళ్లకపోవడానికి కారణం మెరిబా కాదేశ్  నీటి వద్ద దేవుని మాటను యిస్రాయేలు ప్రజల   ముందు మీరాడుఇక్కడా మోషేతో దేవుడు  రాతితో  ప్రజల సమక్షంలో మాటలాడి దాని  నుండి ప్రజలకు మరియు జంతువులకు నీటిని ఇస్తుంది అని చెప్పాడుకానీ మోషే రాతిని కోపంతో బాదాడు. 


హెరోదు పదవి కాంక్ష - పసిబిడ్డల హత్యలు

  హెరోదు పదవి కాంక్ష - పసిబిడ్డల హత్యలు  మత్తయి 2:13-18  వారు వెళ్ళిన పిదప ప్రభువు దూత  యోసేపునకు కలలో కనిపించి, "శిశువును చంపుటకు హెరో...