27, ఫిబ్రవరి 2026, శుక్రవారం

యెహెఙ్కేలు 9: 1-7, 10:18-22 మత్తయి 18:15-20

 యెహెఙ్కేలు 9: 1-7, 10:18-22 మత్తయి 18:15-20

"నీ సోదరుడు నీకు విరుద్ధముగా తప్పిదము చేసిన యెడల నీవు వెళ్లి అతనికి తన దోషములను ఒంటరిగా నిరూపించి బుద్ది చెప్పుము. నీ మాటలు అతడాలకించిన యెడల వానిని నీవు సంపాదించుకొనిన వాడవగుదువు. నీ మాటలు అతడు ఆలకింపని యెడల ఒకరిద్దరిని నీ వెంట తీసుకొనిపొమ్ము. ఇట్లు ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపడును. వారి మాట కూడ వినని యెడల సంఘమునకు తెలుపుము, ఆ సంఘమును కూడ అతడు లెక్కింపని యెడల, వానిని అవిశ్వాసునిగా, సుంకరిగ పరిగణింపుము. భూలోకమందు మీరు  వేనిని బంధింతురో అవి పరలోక మందు బంధింపబడును. భూలోకమందు  మీరు  వేనిని విప్పుదురో అవి పరలోక మందు విప్పబడునని మీతో నిశ్చయముగ చెప్పుచున్నాను. భూలోకమున మీలో ఇద్దరు ఏక మనస్కులై ఏమి అడిగినను, పరలోక మందుండు నా తండ్రి వారికి దానినొసగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలన, ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా పేరట కూడుదురో అక్కడ నేను వారి మధ్య ఉన్నాను" అనెను. 

క్రిస్తునాధుని యందు ప్రియమైన విశ్వాసులారా ఈనాడు మనము పునీత మాక్సి మిలియాన్ మేరీ కోల్బె గారిని స్మరించుకుంటున్నాము. ఈ పునీతుడు ఎంతో ప్రేమతో, దేవుని సేవ చేసిన గురువు. ప్రతి నిత్యం దైవ ప్రేమను పంచిన పునీతుడు. దేవుని ఆజ్ఞలన్ని దైవ ప్రేమ, సోదర ప్రేమ అనే రెండు ఆజ్ఞల మీద ఆధారపడిఉన్నాయి. దైవ ప్రేమతో నింపబడి, దైవ ప్రేమలో ఎదిగిన వ్యక్తి ఈయన. తన పొరుగువారి కోసం తన ప్రాణమును ధారపోయువాని కంటే గొప్పవాడు ఎవడును లేడు అని క్రీస్తు  ప్రభువు అని చెప్పిన వాక్యాన్ని ధ్యానిస్తూ తన పొరుగు వానిని రక్షించడానికి వేరే వ్యక్తి మరణ శిక్షను తాను తీసుకొని ఆ వ్యక్తి కోసం ప్రాణమును అర్పించిన వ్యక్తి. గొప్ప వేద సాక్షి, దైవ  ప్రేమ మానవ ప్రేమతో నిండిన వ్యక్తి ఈ పునీతుడు. 

ప్రియ విశ్వాసులారా ఈ లోకంలో చాలా మందికి దైవ భయం లేదు, దైవ ప్రేమను కూడా అర్ధం చేసుకోలేక పోతున్నారు. మనము నిజముగా దైవ ప్రేమ కలిగిఉన్నామా? మనకు దైవ భయం ఉన్నదా? ఆలోచించండి. సోదర ప్రేమ ఈ లోకం ప్రజలు తమ తోబుట్టువులనే ప్రేమించలేకపోతున్నారు. అటువంటి మనం ఎలా పొరుగువారికి ప్రేమించగలం. ఆత్మ పరిశీలన చేసుకుందాం. నిజం చెప్పాలంటే దైవ ప్రేమ నీ నా హృదయంలో లేకపోయినట్లయితే మనకు సోదర ప్రేమ లేనట్టే. మన దేవుడి ప్రేమామయుడు, ప్రేమ నిధి ఆయన బిడ్డలుగా ప్రేమ కలిగి పునీత మాక్సిమిలియన్ గారి వలె జీవించడానికి ప్రయత్నించుదాం. 

ఈనాటి మొదటి పఠనంలో మనము వింటున్నాం. యెరూషలేములో ఉన్న ప్రజల పాపములకుగాను దేవుడు తన దూతలను పంపి వారిని శిక్షిస్తున్నాడు. యెహెఙ్కేలు ప్రవక్త ఈ దర్శనాన్ని చూస్తూన్నాడు. దేవుడు తన దూతను పంపుచు అంటున్నాడు. "నీవు యెరూషలేము నగరమంతట సంచరించి పట్టణమున జరుగుచున్న హేయమైన కార్యములకుగాను సంతాపము చెందు వారి నొసటిపై ముద్ర వేయుము. దూతలారా మీరు నగరంలోని వెళ్లి అందరిని వధింపుడు. ఎవరి మీద జాలి చూపకుడు. ఎవ్వరిని వదలి వేయకుడు అని చెబుతూ తమ నొసటి మీద గురుతు ఉన్న వారిని మాత్రము ముట్టుకోనకుడు అని ఆజ్ఞాపించాడు. 

ప్రియ విశ్వాసులారా ఎందుకు దేవుడు వారిని చంపుతున్నాడు అంటే ఆ ప్రజలు యిస్రాయేలీయులు ఘోరమైన పాపములు చేశారు. వారు ఇతరులకు చెడు చేస్తున్నారు. దేవుడు వారిని శిక్షిస్తున్నాడు. కాని వారి పాపములు ఒప్పుకొని వారి తప్పులను తెలుసుకొని పశ్చాత్తాపం చెందువారిని దేవుడు రక్షిస్తున్నాడు. దీని ద్వారా మనందరం ఏమి తెలుసుకోవాలంటే అంతిమ దినమున దేవుడు తన దూతలను పంపి మనలను, మన పాపక్రియలకుగాను మన చెడు క్రియలకుగాను మనలను జాలి, దయ లేకుండా శిక్షిస్తాడు. మరి ఆయన దయను పొందాలంటే మనము పాపపు, చేడు జీవితాన్ని విడిచి పెట్టి, పశ్చాత్తాపంతో దేవుని చెంతకు రావాలి. మిత్రులారా ఒకసారి ఆలోచించండి మన జీవితాలు, మన పనులు, మన మాటలు ఎలా ఉన్నాయి. ఆత్మపరిశీలన చేసుకుందాం. దేవుని మన్నింపును కోరుకుందాం. 

ఈనాటి సువిశేష పఠనంలో మనం మన సోదరుని ఎలా సరిదిద్దుకోవాలిఅనే విషయాన్ని మనం వింటున్నాం. నేటి సమాజంలో మనం చుస్తే చాలా మంది చాలా రకాలైన తప్పులను చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే, అవివేకం వాళ్ళ కొంతమంది తప్పులు చేస్తుంటే, కొంత మంది స్వార్ధ బుద్దితో, కొంత మంది స్వలాభాల కోసం, మరి కొంత మంది డబ్బు కోసం, ఆస్తుల కోసం ఎలా ఎన్నోరకాలైన వాటి కోసం తప్పులు చేస్తున్నారు. క్రీస్తు ప్రభువు ఈనాటి సువిశేషంలో  నీ సోదరుడు నీకు విరుద్ధంగా తప్పు చేస్తే నీవు అతని దగ్గరికి వెళ్లి ప్రేమతో మాట్లాడి, తన తప్పును ఆ వ్యక్తికి అర్ధమైయ్యేలా చెప్పు అంటున్నాడు. ఈనాడు ప్రజలు తప్పు చేసిన వ్యక్తితో తప్ప అందరికి చెబుతారు. ఆమె లేదా అతను ఇలా చేసాడు, అలా చేశారు అని చెబుతుంటారు. అలా చెయ్యడం వలన మనం వారికి ఇంకా చెడ్డవారిగా చేస్తుంటాం. ఆలోచించండి. నీవు చెప్పినట్టు వినకపోతే ఇంకో ఇద్దరినీ తీసుకెళ్లి మాట్లాడు అది కూడా వినకపోతే సంఘానికి చెప్పు అప్పటికి వినకపోతే అతన్నీ అవిశ్వాసిగా పరిగణించు  అని ప్రభువు చెబుతున్నారు. వారి కోసం మనము ప్రార్ధించాలి. ఏక మనస్కులై మనమందరం ప్రార్ధిస్తే దేవుడు మన ప్రార్ధనల ద్వారా ఎంతోమంది జీవితాలను మార్చుతాడు. మనమందరం గుర్తుంచుకోవలసినది ఏమిటంటే మన మాటల వల్లకానిది మన ప్రార్థన వల్ల ఖచ్చితముగా జరుగుతుంది కాబట్టి ప్రతినిత్యం ప్రార్ధించి ఆత్మలను రక్షించడానికి ప్రయత్నించుదాం. 

ప్రార్ధన :తండ్రియైన దేవా ఈనాటి వాక్యం ద్వారా సోదర ప్రేమ మరియు దైవ భయం దైవ ప్రేమను కలిగి జీవించాలని మాకు తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలు. దేవా ఎన్నో సార్లు మేము నీ పట్ల భయ భక్తులు లేకుండా మా తప్పిదములతో, పాప స్థితిలో చెడు పనులలో ప్రయాణించాము. కాని ఈ రోజు నీ వాక్యం ద్వారా మా తప్పులు తెలుసుకొని పశ్చాత్తాప పడుతున్నాము. నిన్ను ప్రేమిస్తూ, నా పొరుగువారిని ప్రేమిస్తూ, వారి మంచి కోసం క్షేమం కోసం తపిస్తూ, ప్రార్ధిస్తూ పునీత మాక్సిమిలియన్ కోల్బె వలె జీవించే భాగ్యం మాకు దయచేయండి. ఆమెన్ 

ఫా. సురేష్ కొలకలూరి OCD

యోహాను 12: 24-26

 యోహాను 12: 24-26    

 నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమన:గోధుమగింజ భూమిలోపడి నశించనంతవరకు అది అట్లే ఉండును. కాని అది నశించినయెడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును. కాని ఈ లోకమున తన ప్రాణమును ద్వేషించువాడు దానిని నిత్యజీవమునకై కాపాడుకొనును. నన్ను సేవింపగోరువాడు నన్ను అనుసరించును. అప్పుడు నేను ఉన్న చోటుననే నా సేవకుడును ఉండును. ఎవడైనను నన్ను సేవించినయెడల వానిని నాతండ్రి గౌరవించును. 

ధ్యానము: ఈరోజు మనము  పునీత లారెన్స్ గారి మహోత్సవమును జరుపుంటున్నాము. ఎవరు పునీత లారెన్స్ గారు అంటే యేసు ప్రభువు వలే జీవించడానికి ఆయన నిజ అనుచరునిగా జీవించిన వ్యక్తి. ఆయన 32 సంవత్సరాల వయసులో మరణించాడు. రోమపుర ఆర్చ్ డికనుగా సేవ చేసాడు. యేసు ప్రభువు మరణించిన రెండువందల సంవత్సరాల తరువాత ఈయన జీవించాడు. ఆనాటి రోజులలో తిరుసభకు స్వతంత్రం లేదు, తిరుసభ మొత్తం  రహస్యంగా దేవుణ్ణి ఆరాధించారు. క్రైస్తవులను అనేక విధాలుగా హింసించారు. ఎంతో గోరంగా హింసించారు అంటే కొంత మందిని మంటలలో కాల్చారు. కొంతమందిని అడవి మృగాలకు  ఆహారంగా ఇచ్చారు. కొంతమందిని నూనెలో కాల్చారు. క్రైస్తవుల మీద హింస వలేరియన్, డైక్లిషియన్లు చక్రవర్తులుగా ఉన్నప్పుడు ఎక్కువగా జరిగింది.  వలేరియన్ చక్రవర్తి  మేత్రానులను , గురువులను, డికనులను చంపాలి అని శాసనము చేసాడు. 258వ సంవత్సరంలో సిక్స్టాస్ పోపుగారిని బంధించారు. ఆది చూచిన  లారెన్స్ పోపుగారి వెంట వెళుతూ నన్ను వదలి ఎలా వెళతారు తండ్రిగారా అని అడిగితే ఆ పోపుగారు లారెన్స్ తో, కుమారా నేను నిన్ను వదలి పెట్టను, నీకు ఎక్కువ హింసలు రాబోతున్నవి.   నీవు ఇంకా ఎక్కువుగా ప్రభువుకు సాక్షమివ్వడానికి వస్తావు అని చెప్పాడు. కనుక లారెన్స్ గారికి వచ్చేటువంటి హింస ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసు.  

లారెన్స్ రోమాపూరి ఆర్చి డికను, రోమా పూరి తిరుసభ   సంపదమొత్తం లారెన్స్ ఆదీనంలో ఉన్నది.  లారెన్స్ ఆ సంపదను పేదలకు పంచుతూ ఉండేవాడు.  అప్పుడు ఆ సంపదను అక్కడి అధికారులు కావాలని అడిగినప్పుడు లారెన్సు వారిని  మూడు రోజులు సమయం అడిగి,  ఆ సమయంలో ఆ సంపదను మొత్తాన్ని పేదలకు పంచి ఇచ్చాడు. తరువాత  రోములో ఉన్న పేదలను మొత్తాన్ని తీసుకొని వచ్చి ఇదే తిరుసభ సంపద అని వారి ముందు ఉంచాడు.  లారెన్స్ గారికి తనకు ఏమి జరుగుతున్నదో ఖచ్చితముగా తెలుసు. అయినప్పటికి అతనికి ఎదురయ్యే సమస్యలను హింసను పట్టించుకోకుండా, యేసు ప్రభువు నిజమైన అనుచరునిగా ఉండటానికి సిద్ధపడ్డాడు. 

ఆది మొత్తం పరిశీలిస్తున్న అధికారి లారెన్స్ గారిని బంధించాడు. ఆయన్ను ఒక మాంసపు ముక్కను నిప్పుల మీద కాల్చినట్లు ఒక ప్రక్క కాల్చగా, నేను ఈ ప్రక్కన కాలిపోయాను, ఇప్పుడు అవతలి ప్రక్కన కాల్చమని అడిగాడు. వారు అటులనే వేరొక ప్రక్కన కాల్చడం జరిగినది. ఎంతటి బాధనైనా తట్టుకోవటానికి పునీత లారెన్స్ గారు సిద్ధపడ్డాడు. తాను పొందే హింస తక్కువ అన్నట్లు హింసించే వారిని ఇంకా ఎక్కువగా హింసించేలా ప్రేరేపించాడు. వారితో పరిహాసం ఆడాడు. అయన దృష్టిలో  యేసు ప్రభువుకు సాక్ష్యం ఇవ్వడం అనేది ఆయన జీవితంలో అత్యంత ముఖ్యమైనది. వారు పెట్టె హింసలు చాలా కఠినమైనవి ఐన ప్రభువు సాక్షిగా నిలబడటానికి ఆనందంగా వాటిని భరించాడు అవి ఆయనకు అల్పమైనవిగా కనపడినవి. ప్రభవు మీద అతని ప్రేమ అంత గొప్పది. యేసు ప్రభువు అనుచరునిగా జీవించాడు. అందుకే పునీత లారెన్స్ గారు హాస్య కళాకారులకు పాలక పునీతునిగా ప్రసిద్ధి. 

ఈనాటి సువిశేషంలో ప్రభువు తన అనుచరుల లక్షణాల గురించి చెబుతున్నాడు. గోధుమగింజ భూమిలో పడి నశించనంతవరకు అది ఫలించదు. అంటే నేను నా బాహ్య పొరను వదిలించుకొని రావాలి అప్పుడు మాత్రమే నేను పూర్తిగా ఫలించడానికి సిద్దము అవుతాను. ఏమిటి ఈ బాహ్యపొర ఎలా దానిని నేను కోల్పోవాలి? ప్రభువే నాకు అది నేర్పుతున్నారు. ఎలా నన్ను నేను రిక్తుని చేసుకోవాలో చెబుతున్నాడు. నెను ఈ లోక జీవితం నాకోసము కాదు, ఈ లోకంలో నేను కేవలం నాకోసమే జీవించినట్లయితే  నా జీవితం  ఫలించదు. ఈ జీవితంలో నన్ను నేను ఇతరుల కోసం ఇవ్వాలి. యేసు ప్రభువు వలె జీవించాలి. ఆయన తన ప్రాణమును, తన సమయాన్ని, తన శక్తిని, తన యుక్తిని, తన జీవితాన్ని మన కోసం హెచ్చించాడు. తన ప్రాణమును కూడా కోల్పోయాడు కాని తండ్రి ఆయనకు తన ప్రాణమును ధారపోయుటకు మరల తీసుకొనుటకు అధికారం ఇచ్చాడు.

ఈ లోకములో తన జీవితమే ముఖ్యం, తన ప్రాణమే ముఖ్యం అనుకునే వారు అందరు స్వార్ధంతో జీవించువారే, వారు దేవుని అనుగ్రహములను కోల్పోతున్నారు. యేసు ప్రభువు చెప్పినట్లు జీవిస్తే ఆయనతో పాటు మనము ఉండవచ్చు. యేసు ప్రభువుతో పాటు ఉంటే తండ్రి దేవుడే మనలను గౌరవిస్తారు. యేసు ప్రభువును అనుసరిస్తూ, నన్ను నేను కోల్పోయిన నాకు లాభమే. ఎందుకంటే పరలోకమున నేను నా ప్రాణమును పొందుతాను. మరల ప్రభువుతో కలసి ఉంటాను, ఈ మహాద్భాగ్యం ఏమిచ్చి నేను పొందగలను. కేవలము ఆ ప్రభువును అనుసరించుటం వలన మాత్రమే. అంతే కాదు అప్పుడు తండ్రి దేవుడు నన్ను గౌరవిస్తారు అని ప్రభువు చెబుతున్నారు. 

ప్రార్ధన : సకల వర ప్రధాత అయిన ప్రభువా! నేను నా జీవితములో ఉహించలేనటువంటి గొప్ప అనుగ్రహాలు నాకు దయచేసి ఉన్నారు.  మీరు వాగ్దానము చేసిన వాటిని పొందుటకు నాకు అర్హత లేదు ప్రభువా కాని , పునీతుల జీవితాలు చూసినప్పుడు నేను కూడా అలా జీవించాలి అనే కోరిక నాలో కూడా పుడుతుంది, వారి వలె మిమ్ములను సంపూర్ణంగా అనుసరించే అనుగ్రహం దయచేయండి. మిమ్ములను అనుసరిస్తూ, ఎల్లప్పుడూ మీతో ఉండే అనుగ్రహం దయచేయండి. ఆమెన్ 

లూకా 5: 33-39

 లూకా 5: 33-39 "యోహాను శిష్యులు తరచుగా ఉపవాసములు, ప్రార్ధనలు చేసెదరు. అటులనే పరిసయ్యుల శిష్యులను చేయుదురు. కాని, మీ శిష్యులు మాత్రము తి...