30, జులై 2022, శనివారం

18 వ సామాన్య ఆదివారం (2)

18 వ సామాన్య ఆదివారం 

ఉప: 1:2;2:21-23 , కోలస్సి: 3:1-5,9-11, లూకా :12:13-21 

క్రీస్తునాధునియందు ప్రియమైన విశ్వాసులారా ఈనాడు మన తల్లి అయిన తిరుసభ 18వ సామాన్య ఆదివారములోనికి ప్రవేశిస్తున్నాము.ఈనాటి మూడు దివ్య గ్రంథ పఠనాలద్వారా దేవుడు మనకు ఏమి తెలియజేస్తున్నారు అంటే నీవు ఎవరికీ ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తున్నారు: “ధనానికా దేవునికా”.ధనము ఇప్పుడున్న సమాజములో మనజీవితములో ఒక ముఖ్య పాత్రను పోషిస్తుందిఆరోగ్యంగా ఉండాలన్నా, హాస్పిటల్కి వెళ్ళాలి అన్నా, ప్రయాణము చేయాలన్నా, వస్తువులను కొనాలన్నా, ఇల్లుకట్టాలన్నా, పెళ్లి చేయాలన్నా, చదువుకోవాలి అన్నా, ఇంకా ఏమిచేయాలన్నా కానీ డబ్బు మనకు కావాలి. అయితే; ఈ ధనమే మనలను అధికారులను చేస్తుంది  (సొలొమోను )

-పిసినారులను చేస్తుంది(ధనవంతుడు)

మన తోటివారిని మర్చిపోయేలా చేస్తుంది.

-వారికి సహాయా పడేలా చేస్తుంది(జక్కయ్య).

స్వార్ధపరులను చేస్తుంది (యూదా ఇస్కారియోతు ).

శాపానికి గురిచేసేదిగా చేస్తుంది(అననీయ - సప్పీరాలు)

దీవింపబడేలాగా చేస్తుంది(యోబు).

ఈనాటి మన సమాజములో మనం ఎక్కువగా అనుకుంటూవుంటాం , డబ్బు ఉంటేనేనేదయినా చేయగలను అని. కానీ డబ్బు మాత్రమే శాశ్వతం కాదు, కానీ ఇది ఒక మార్గము మాత్రమేwealth can never constitutes happiness, but it is only a means). ధనం ఈలోకంలో ప్రతి ఒక్కటి ఇచ్చినా నిజమయిన సంతోషాన్ని ఇవ్వలేదు. అదేవిధమగా ఒక భాగమే. ఒకవేళ ధనము శాశ్వతము అయితే మనతోపాటు తీసుకొని రావాలి, అదేవిధముగా తీసుకొని వెళ్ళాలి. కానీ ఇలా మనము మనం మరణించిన తరువాత ఒక్క పైసా కూడా తీసుకొని వెళ్లలేము. మొదటి  పఠనం: ఈనాటి  మొదటి  పఠనంలో మనం చూస్తే, ఉప:1:2 ఈఉపదేశకుడుజీవితము వ్యర్థమని చెబుతున్నాడు. ఎందుకంటే, ఉప:2:21-22 లో, నరుడు తాను విజ్ఞానముతో, తెలివి తేటలతో, నేర్పుతో కృషిచేసి సాధించిన వానిని ఎట్టి శ్రమయు చేయని తన వారసునికి అప్పగింపవలసినదేగదా ఇదియును వ్యర్ధమే, అక్రమమే అని చెబుతున్నాడు. ఇలా ఎంతకాలము జీవించినా శ్రమతోనూ, దుఃఖముతోనూ నిండి వుండును. రాత్రులు నిద్రపట్టదు. ఇదియునూ వ్యర్ధమే అని అంటున్నాడు (ఉప:2 :23 ).  

ఈలోకంలో ఎంతోమంది జీవితములలో మనము చూస్తూనే వున్నాం. వారు యెంతకూడా బెట్టినా, ఎంత శ్రమించినా అది తమ వారసులకు దక్కుతుంది తప్ప తనకు ఎప్పుడు దక్కదు. కాబట్టి నీవు జీవించినంతకాలము నీకు ఉన్నదానితో సంతృప్తిపడు అని భోధిస్తున్నాడు. మనము ఎక్కువగా ఆశ పడితే, ఎక్కువగా శ్రమపడాలి. ఎక్కువగా శ్రమపడితే, ఎక్కువగా దుఃఖించాలి. కాబట్టి నీవు తీసుకు వెళ్లలేని, నీవు ఆస్వాదించలేని, నిన్ను సంతోషపెట్టతలేని ధనము కోసము ప్రాకులాడక నీకున్నదానితో సంతృప్తి చెందమని చెబుతున్నాడు.

సువిశేష పఠనము:

ఈనాటి సువిశేష పఠనంలో ధనముకోసము ధనము మీద ఆశపడి దానిని కూడబెట్టి, దానియందు సంతోషించి దానిని ఆస్వాదించలేనటువంటి వక్తి యొక్క జీవితమును మనము చూస్తున్నాము.యేసు ప్రభువు దగ్గరికి ఒక వ్యక్తి జనసమూహమునుండి వచ్చి బోధకుడా! అని సంబోధిస్తూ,పిత్రార్జితమున నాకూపాలుపంచమని నా సహోదరునితో చెప్పుము"అని అంటున్నాడు.ఎందుకు ఈవ్యక్తి  ఇలా అంటున్నాడు అంటే,ఆనాటి కాలములో యూదులు బోధకుల దగ్గరకు వెళ్లి వారికి న్యాయము చేయమని కోరుకుంటారు.  అందుకే ఈవ్యక్తి ఈనాడు ఇలా చేస్తున్నాడు.మరి ఎప్పుడయితే ఈవ్యక్తి యేసుప్రభువు చెంతకు వస్తున్నాడో, యేసుప్రభువు తనకు ఇలా సమాధానమిస్తున్నాడు: నన్ను ఎవరు మీకు తీర్పరిగా లేక పంపిణీ దారునిగా నియమించెను? అని పలుకుచున్నాడు. ఎందుకు యేసుప్రభువు ఇలా సమాధానమిస్తున్నాడు అంటే,యూదుల ఆచారము ప్రకారము వారు ఉమ్మడి కుటుంభం జీవితమును జీవించాలి. ఈ మీ ఉమ్మడి కుటుంబమునుకు, ఈ అన్నదమ్ముల సంభంధమును విడదీయడానికి నేనెవరిని అని యేసుప్రభువు బదులు పలుకుచున్నాడు.

అయితే ఇక్కడ అసలయిన కారణము ఏమిటంటే, ఈ వ్యక్తి ధనముమీద  ఆశపడి తన రక్త సంభంధమునుండి విడిపోవాలని చూస్తున్నాడు.ఇటువంటి సమయములో యేసుప్రభువు ఆ వ్యక్తికి అర్ధమయ్యేరీతిగా ఒక ఉపమానమును తెలియజేస్తున్నాడు.ఈఉపమానము ఒక ధనవంతునికి ధనము మీద కోరికను తెలియజేస్తుంది.

1.     ముందుగా:రాబోవు రోజుల కొరకు ధాన్యమును భద్రపరుస్తున్నాడు(పిసినారిగా మారుతున్నాడు):

2 .ధనము మీద సంతోషపడుచున్నాడు.

3 .దేవుడు చేసిన మేలులని మర్చిపోతున్నాడు.

4. పొరుగువారికి గూర్చి పట్టించుకోవడంలేదు;

5 .చివరికి ప్రాణమును కోల్పోవుతున్నాడు.

 

  1 .రాబోవు రోజుల కొరకు ధాన్యమును భద్రపరుస్తున్నాడు(పిసినారిగా మారుతున్నాడు):

 

ఈ ధనవంతుడు రాబోవు రోజుల కొరకు ధాన్యమునుభద్రపరచుకొనుచున్నాడు.దేవుని నమ్మిన ప్రతిఒక్కరిని వారి కష్టకాలములలో ఆదరిస్తాడు మన దేవుడు. నిర్గమ: 16: 4 లో మనము చూస్తే, ప్రభువు మోషే ప్రవక్తతో ఇలా అంటున్నాడు, "ఇదిగో! నేను ఆకాశము నుండి వారికి ఆహారమును కురియింతును.ప్రతి దినము ఆ ప్రజలు వెలుపలికివెళ్ళి ఈనాటి బత్తెమును ఆనాటికే సమకూర్చుకోవలెను". అంటే ఇక్కడ దేవునిమీద ఆ ఇశ్రాయేలు ప్రజలు ప్రతిరోజు ఆధారపడి జీవించాలని వారికి మోషే ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నాడు.కానీ, ఈనాటి సువిశేష పఠనంలో  ఆ ధనవంతుడు తన స్వార్ధం కోసం తన పొలములో పండిన పంటను భద్రముగా భద్రపరచుకొంటున్నాడు.   దేవుడు అంటున్నాడు "ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, అవి కోయవు. అవి కోట్లలో దాచుకోవు.స్వార్ధము వంచన వాటికుండదు" అని. ఈనాడు మనమందరము కూడా మనకోసం ఎంతోకొంత దాచుకొనుచునే ఉంటాము. కానీ ఎంతమందిమి మన హృదయ పూర్వకముగా దేవునియందు ఆధారపడి జీవిస్తున్నామన్నదానిని మనం ఆత్మ పరిశోధన చేసుకోవాలి.

  2 .ధనము మీద సంతోషపడుచున్నాడు:

రచయిత అయినటువంటి థోమస్ గారు ఇలా అంటుంటారు:"మానవునియొక్క నిజాయితీ తాను పెరుగుచున్న ధనముతో పెరగడం నేను ఇంతవరకు చూడలేదు" అని. ఈనాటి సువిశేష పఠనంలో ధనవంతుడు తన ధనముమీద సంతోషాన్ని  తెలియజేస్తున్నాడు ఇలా, నా ప్రాణమా! నీకు అనేక సంవత్సరములకు సరిపడు గొప్ప సంపదలున్నవి.సుఖముగా ఉండుము. తిని, త్రాగి, ఆనందింపుము" (లూకా:12 :19 ).అతని ఆనందము ఈలోగా వుందికానీ ఉందికానీ, దానినిచిన దేవునిపైన లేదు.

తప్పిపోయిన కుమారుడు ఈలోక ఆశలతో పడిపోయి ధనము అతనికి సంతోషమును, స్నేహితులను, అధికారమును ఇస్తుందనుకొని తన తండ్రి దగ్గరనుంచి ధనమును తీసుకొని వెళ్ళిపోయాడు. దాని ఫలితముగా తను శ్రమలకు లోను కావలసి వచ్చింది.స్నేహితులు అతనిని విడిచివెళ్లిపోయారు,తాను నమ్మినటువంటి ధనము అతనితో ఎంతోకాలం నిలువలేదు.చివరికి పందుల పొట్టుతినడానికి కూడా వెనకాడలేదు. చివరికి తన తప్పు తాను తెలుసుకొని తిరిగి తండ్రి వద్దకు వచ్చినప్పుడు తన తండ్రి తనను గట్టిగా హత్తుకొని ముద్దుపెట్టి, తనను సమస్తమును ఇస్తున్నాడు (లూకా:15 :11 -32 ).సిరా:5 :1 :లో చూస్తే, "నీవు ధనము మీద ఆధారపడకుము. డబ్బుతో నేను స్వేచ్ఛగా జీవించగలనని తలవకుము" అని అంటున్నాడు.కాబట్టి మనమందరముకూడా ధనముపై ఆధారపడకుండా సంతోషపడకుండా దేవునియందు ఆధారపడుతూ, సంతోషపడదాం.

 

 

 

      3 .దేవుడు చేసిన మేలులని మర్చిపోతున్నాడు:  దేవుడు మనజీవితములలో ఎంతో గొప్ప కార్యములు చేసి వున్నాడు కానీ అవి మనము సర్వసాధారణముగా మర్చిపోతువున్నాం. గుర్తుపెట్టుకోవాల్సినది మర్చిపోతూ, మర్చిపోయే దానిని గుర్తుంచుకుంటున్నాం.మనము ఈనాడు అనుభవిస్తున్నటువంటి జీవితాన్ని ఇచ్చినది ప్రభువే, మంచు ఆరోగ్యమును ఇచ్చినది ప్రభువే, నీకున్నటువంటి ధనమును ఇచినదికూడా ప్రభువే, కానీ మనము మాత్రము ఆ దేవాతి దేవుడు మనజీవితములో చేసిన మేలులను మర్చిపోతూ,మనము కూడబెట్టినటువంటి ధనముమీద మన హృదయమును లగ్నము చేస్తున్నాం.పు.పౌలు గారు తెలిపిన విధముగా, మన హృదయములు పవిత్రాత్మకు నివాస స్థలములు".కాబట్టి మనహృదయములను దేవునికి అర్పిస్తూ,ఆ సంపదలను ఇచ్చినటువంటి ఆ దేవాతి దేవుడికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇద్దాము. లూకా; 12:34:"మీ సంపదలున్న చోటనే మీ హృదయముండును".

కథ: హల్సిన్  పక్షులు తన గూడును మూసిన పిడికిలి ఆకారములో కట్టుకుంటాయి.ఆ గూటికి పై భాగము మాత్రమే ఒక చిన్న రంధ్రము ఉంటుంది.సముద్రతీరంలో కట్టుకున్న ఈ గుళ్ళు అలల తాకిడికి సముద్రములోకి కొట్టుకొనిపోతాయి.కానీ, అవి తేలుతూనే ఉంటాయి.ఎటువంటి ఇబంది దాంట్లోవున్న పిల్లలకు కలగకుండా ఉంటుంది.ఒక చుక్క కూడా లోనికి వెళ్ళదు.అవి నది సముద్రములోకూడా నిశ్చితముగా తేలుతూ,ఆ పక్షులు సాగర రాణుల్లా చలామణి అవుతాయి.

 మన హృదయం కూడా ఇలాగే పరలోకము వైపు తిరుగుతూ ఉండాలి.ఈలోగా ఆశలపై మోజు పెంచుకోకుండా దేవునివైపు మన మనసులను లగ్నము చేసుకొని జీవుంచాలి.

 

4.పొరుగువారికి గూర్చి పట్టించుకోవడంలేదు:

ఈ ధనవంతుడు తన స్వార్ధంకోసమే ఆలోచించాడు కానీ తన పొరుగువారి గురించి ఆలోచించలేదు.తన సంతోషము కోసమే, తన స్వార్ధం కోసమే చూసాడు కానీ నాతోపాటు నివసిస్తున్నటువంటి పేదవారికి కొంచెం సహాయపడదాం, వారిని ఆపదలో ఆదుకుందాం,నా సంతోషముతో వారిని కూడా పాళీ భాగస్థులను చేసుకుందాం అనే ఉద్దేశము లేకుండా ఏకాడికి తనకున్నటువంటి  కొట్లను పడగొట్టించి వాటిని పెద్దవిగా చేసి వాటిలో తన ధాన్యమును భద్ర పరచుకోవాలనుకుంటున్నాడు.

ఉదా: ధనికుడు-లాజరు ఉపమానములో మనము చూస్తే, అక్కడ ధనవంతుడు సంతోషముగా భోజనము చేస్తున్నాడు, లాజరు నిరుపేద. తన వ్రణములను కుక్కలు నాకుచున్నాయి.అయినాకానీ ఇతను మాత్రం బల్లమీదనుండి జారిపడి మెతుకుల కొరకు కాచుకొని వున్నాడు. కానీ ఈ ధనికుడు ఆ నిరుపేద అయినటువంటి లాజరును పట్టించుకోవడంలేదు. చివరికి ఇద్దరు మరణించిన తరువాత లాజరు అబ్రాహాము ఒడిలోకి వెళ్ళాడు. ధనికుడు మాత్రం నరకాగ్నిలోనికి వెళ్ళాడు.

 

మనము ఎప్పుడయితే మనతోవున్నటువంటి వ్యక్తులను వారి అవసరములలో సహాయపెడతామో మన అవసరాలలో కూడా దేవుడు మానాలకు సహాయపడతారు.కానీ ఈనాటి సువిశేషములోవున్న ధనవంతుడికి మాత్రం దేవుడు సహాయ పడక తనకు ఏమిజరుగా బోతోందో తెలియజేస్తున్నాడు.

 

5 .చివరికి ప్రాణమును కోల్పోవుతున్నాడు:

ధనమును ప్రేమించిన యూదా ఇస్కారియోతు చివరికి  తనకిచ్చినటువంటి గొప్పపిలుపును వదులుకొని మరణించివున్నాడు (మత్త:27 :5 ).ఇక్కడ  తెలిపినటువంటి ధనవంతుడుకూడా తన తోటివారిని పట్టించుకోకుండా వుంది మరణించివున్నాడు(లూకా:16 :19 -31 ).

ఇలా ఎంతోమంది ధనమును ఎక్కువగా ప్రేమించి మరణించివున్నారు.అయితే ఈనాడు నువ్వు నేను దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నాము. ధనమును ప్రేమిస్తున్నామా, లేక దైవమును ఎక్కువగా ప్రేమిస్తున్నామా అనేది ఈనాడు ఆత్మ పరిశీలన చేసుకోవాలి.దేవుడు ఆ ధనవంతుడితో ఈవిధముగా అంటున్నాడు,"ఓరీ! అవివేకి!ఈ రాత్రికే నీ ప్రాణములు తీసివేయబడును.అప్పుడు నీవు కూడభేట్టినది ఎవరికీ చెందును"అని.మనం కూడబెట్టిన ధనము మనతో రాదు.ఈ అవివేకి ధనవంతుడు తనను తాను ధనవంతుడిగా భావించాడు.కానీ దేవుడు మాత్రం అతనిని ఒక అవివేకిగా గుర్తించాడు.

కాబట్టి ఈనాడు ఎవరయితే ఎవరికీ వారు ధనవంతుడిగా భావిస్తున్నారో,వారు దేవుని దృష్టిలో ధనవంతులు ఎప్పటికీ కారు. చివరి రోజున మరణ శయ్యపై పడివున్నప్పుడు మన బంధువులు, మిత్రులు అడుగుతారు,"ఎంత ఈయన విడిచిపెట్టాడు" అని. కానీ దేవదూతలు అడుగుతారు: "ఎంత ఈయన ఈయనతోపాటు తీసుకెళ్లాడని".కాబట్టి మనము ఈలోకమునుండి వెళ్ళేటప్పుడు మనమందరము కూడా మనతోటివారికి ధనమును కాక ప్రేమను,సమాధానమును, సహాయమును,వినయమును విడిచిపెట్టి వారి ప్రేమను మనతోపాటు తీసుకొని వెళదాం.

 

ధనమును ప్రేమించిన యూదా ఇస్కారియోతు ముప్పది వెండినాణాలకు ప్రభువును అమ్మివేశాడు(మత్త:26:14-16).

ధనమును ప్రేమించిన ధనికుడు నిరాశతో వెళ్ళిపోయాడు.( లూకా:18:18-30)

ధనమును ప్రేమించిన తప్పిపోయిన కుమారుడు శ్రమలను అనుభవించాడు(లూకా:15 :11 -32 )

ధనమును ప్రేమించిన ధనవంతుడు నిత్యజీవమును కోల్పోయాడు.లూకా 18 :18 )

 ధనమును ప్రేమించిన జక్కయ్య ప్రజలదగ్గర చెడ్డపేరు తెచ్చుకున్నాడు(లూకా:19 :1 -10 ).

 

ధనమును ప్రేమించిన అననీయ - సప్పీరాలు మరణమును కొనితెచ్చుకున్నారు(అపో:5 :1 -15 ).

 ఇలా ఎంతో మంది ని మనం బైబిల్ గ్రంధంలో చూస్తున్నాం.ధనము ఎక్కడో నీ హృదయమెక్కడా, హృదయమెక్కడో నీ భ్రాతుకు అక్కడ.ధనము ఎంత వున్నా,ధాన్యమెంత వున్నా, మెదలెన్ని వున్నా, మిథలెన్ని వున్నా, పరిశుధుడు ప్రభువు లేకున్నా సున్న.కాబట్టి మనజీవితములో మనము దేవుడిని వెతుకుదాం . 

 రెండవ పఠనం:

ఈనాటి రెండవ పఠనములో పు.పౌలు గారు కోలస్సియులకు లేఖను వ్రాస్తూవారికి రెండు విషయాలను భోధిస్తున్నాడు.

1 . పరలోక మందలి  వస్తువులను కాంక్షించండి.

2. భూలోక వస్తువులపై మీ మనసులను లగ్నము చేయకండి.

ఎందుకంటే, మనమంతా కూడా క్రీస్తుతోపాటు  జ్ఞాన స్నానము ద్వారా మరణించి తన పునరుత్తానము ద్వారా తనతోపాటు లేవనెత్తబడుచున్నాము.  కాబట్టి ఈలోగా ధనము మీద కాక,అధికారముమీదకాకా, ఈలోక ఆశలమీద కాక దేవునిపై మన మనసులను లగ్నము చేసి ఆ దేవాతి దేవుడి యొక్క ఆశిశులు, దీవెనలు పొందుదాం.పునీతుల జీవితములో మనము చూస్తే, పునీత. ఫ్రాన్సిస్ అఫ్ అసిసి గారు తన జీవితములో దేవుడిని అనుసరించడానికి సమస్తమును అంటే తన ఒంటిమీద ఉన్నటువంటి దుస్తులను కూడా  తన తండ్రికి ఇచ్చి ఆ దేవుడిని అనుసరించాడు. ఎలా ఎంతోమంది పునీతులు దేవుని పొందాలని ఈలోగా ఆశలను చంపుకొని సంపూర్తిగా దేవునిలో అంకితమయ్యారు.కాబట్టి మనమందరము కూడా దేవుని చేరడానికి ప్రయత్నిద్దాము. ఆమెన్ 

 

 

 

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆగమన కాలము 2 వ ఆదివారం

ఆగమన కాలము 2 వ ఆదివారం  బారుకు 5:1-9, ఫిలిప్పీ 1:4-6, 8-11, లూకా 3:1-6 ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుని కొరకు మార్గమును సిద్ధం చేయుటను గు...