11, మార్చి 2023, శనివారం

3వ తపస్సు కాల ఆదివారము

3 తపస్సు కాల ఆదివారము

నిర్గమ 17 : 3-7

రోమా 5 :1 -2 , 5 -8

యోహాను 4 :5 -42

క్రీస్తునాధునియందు ప్రియా విశ్వాసులారా ఈనాడు తల్లి తిరుసభ తపస్సుకాలపు ౩వ ఆదివారాన్ని కొనియాడుతుంది. ఈనాటి మొదటి పఠనము మానవులకు జీవనాధారమైనటువంటి తాత్కాలిక దాహము గుర్నిచ్చి బోధిస్తే సువార్త పఠనము మాత్రం శాశ్వతమైనటువంటి జీవజలం గురించి బోధిస్తున్నాయి. మానవ జీవితంలో రకరకాల దాహాలు ఉన్నాయి ఈదాహాలు తీరకపోతే మానవుడు ఒక జంతువువలె మారిపోతూవుంటాడు

మరి నరుడు తన జీవితంలో దాహం ఉంది అని తెలుసుకోవాలంటే ముందుగా దాహమంటే ఏమిటో గ్రహించి ఉండాలి సాధారణంగా మన దాహాన్ని ఏవిధంగా తీర్చుకుంటామంటే నీటి ద్వారా అందుకే నీరు అనేది మానవ జీవితంలో ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తుంది. పాత నిబంధన గ్రంధములో చూసినట్లైతే నీరు ఎన్నో గురుతులు నిదర్శనంగా నిలుస్తుంది మొదటిగా నీరు జీవానికి గురుతుగా నిలుస్తుంది రెండొవదిగా నీరు మోక్షానికి గురుతుగా నిలుస్తుంది. మూడొవదిగా దేవుని దీవెనలు గురుతుగా నిలుస్తుంది. మరి నీరు శుద్ధికరణకు ఆరాధన మరియు అంకిత భావానికి గురుతుగా మరియు పరిశుదాత్మకు గురుతుగా దేవుని యొక్క శక్తికి ప్రత్యేకంగా నిలుస్తుంది. ఉదాహరణకు ఏలీయా ప్రవక్త తన ప్రయాణంలో యొక్క నీటికోసం తపన పడుతున్నపుడు దేవదూత ఇచ్చినటువంటి నీరు తాగి జీవాన్ని పొందుతున్నాడు మరియు ఇష్మాయేలు ప్రయాణములో నీరులేక మరణిస్తూనపుడు దేవుడిచ్చిన నీరు త్రాగి జీవ వంతుడవుతున్నాడు అదేవిధంగా సైన్యాదిపతి ఐన నామాను తన వ్యాధి శుద్దీకరణ కోసం 7సారులు యొక్క నీటిలో మునుగుతాడు   ఐన కూడా ఏమి మార్పు కనిపించదు కానీ ఎపుడైతే ప్రవక్తమాటను విశ్వసించి యొక్క  నీటిలో మునిగాడో నీరు దీవెనలాగా మారిపోయి తన వ్యాధికి శుద్దీకరణ జరిగింది అందుకే ప్రియా విశ్వాసులారా నీరు అనేది మానవులకు చాల ప్రధానమైనటువంటిది ఎందుకంటె యొక్క నీరు ప్రతి మానవునికి జీవాన్ని ఇస్తుంది మరి ఈనాటి మొదటి పఠనంలో చూస్తున్నాము యొక్క ఇశ్రాయేలు ప్రజలు నీరుకోసం ఎడారిలో అల్లాడిపోతున్నారు మరి వారి మధ్యలో తమయొక్క దాహాన్ని తీర్చేవాడు ఉన్నాడు అని గ్రహించక సాతాను చేత శారీరకంగా మరియు మానసికంగా శోధింపబడుతున్నాడు. మరి వారు నడిపిస్తున్నటువంటి మోషే ప్రవక్తను మరియు దేవుణ్ణి దూషిస్తున్నారు మమల్ని ఈయొక్క ఎడారికి చంపుటకు తీసుకొనివచ్చావా అని మోషేను ఎన్నో విధాలుగా విసిగిస్తున్నారు మరి సమస్తాన్ని ఎరిగినటువంటి దేవుడు ఈయొక్క శారీరక దాహాన్ని యొక్క రాతి నుండి తెసివేస్తునాడు మరి విశ్వాసులారా లోకంలో రకరకాల దాహాలు ఉంటాయి ఎందుకంటే లోకమనేది అలాంటి దాహాలను ఏర్పరుస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు ఈనిజ సత్యాన్ని తెలుసుకోకుండా తమను నడిపిస్తున్నటువంటి మోషేను కూడా చంపటానికి సిద్ధమయ్యారు అందుకే వారి జీవితము దేవుని కోపానికి గురిఅయింది మరి మనము కూడా ఈలోక దాహాల మీద లోక వ్యామోహాలమీద దృష్టివుంచి మనలను సృష్టించినటువంటి దువుణ్ణి మరిచి ఈయొక్క ఇశ్రాయేలు  ప్రజలవలె కోపంతోను, క్రోధంతోను, పగతోను మన సృష్టి కర్తకు దూరంగా జీవిస్తుంటాము కానీ దేవుడు మాత్రం మనము తన దెగ్గర నివశించాలని కోరుకుంటున్నాడు ఆదికాండములో చూస్తున్నాము దేవుడు మనిషికి అందాన్ని మరియు దూరతీరములో ఏకాకిగా నివశించే వ్యక్తిగా కాకుండా మానవునితో సన్నిహితంగా ఉంటూ సహవాసంచేసే వ్యక్తిగా మనలను తీర్చిదిద్దాడు కానీ మానవుడు దేవుని ధిక్కరించి ఆయనకు దూరమైనప్పటినుండి దేవుడు మనవాళితో మల్లి దెగరకు రావటానికి సన్నిహిత సంబంధం ఏర్పరుచుకోవటానికి ప్రయత్నిస్తూవస్తునారు

మానవాళి తనతో ప్రేమ బాంధవ్యములో సన్నిహితముగా జీవించాలన్నదే దేవుని కోరిక అందుకే ఆదినుండి దేవుడు మనవాళితో వాగ్దానాలు వాడంబడికలు చేసుకుంటూ వస్తున్నారు నాడు అబ్రాహాముతో వాడంబడిక చేసుకొని తన సంతతికి వాగ్దాన భూమిని దయచేసాడు మరి ఈనాడు ఇశ్రాయేలు ప్రజలతో వాడంబడిక చేసుకొని వారికీ పాలు తేనే  కలిగిన ప్రదేశాన్ని వారికీ ఇస్తున్నారు ఎందుకంటె దేవుడు  వారితో నివశించటానికి వారిమధ్య ఉండటానికి కానీ మానవులు ఈలోగా అంశాలమీద వ్యామోహాలమీద ద్రుష్టి  ఉంచి దేవునికి  దూరంగా నివశిస్తున్నారు ప్రియా విశ్వాసులారా ఈపుడైన కనులు తెరిచి మనకు జీవమిచ్చే నాధుడు మన మధ్యన  ఉన్నాడు అని గ్రహించి ఆయనకు ప్రియా పుత్రులుగా జీవించుదాం. ఈనాటి సువార్త పఠనములో సమరియా స్త్రీ అశాశ్వితమైనటువంటి దాహం కోసం ప్రాకులాడుతుంది  కానీ  ఆమె మధ్యలో శాశ్వతమైనటువంటి దాహాన్ని తీర్చేవాడిని గుర్తించలేక పోతుంది ఎందుకంటె ఆమె జీవితంలో ౩రకాలైనటువంటి దాహాలు ఉన్నాయి.

1 ) ఈలోకసంబంధమైనటువంటి దాహము: ఈలోక పరమైనటువంటి ఆశలతో తన యొక్క శాశ్వత దాహాన్ని తీర్చుకోవాలనుకుంటుంది కానీ ఆమెకు ఈలోకంలో లభించదు అందుకే ఏన్నొ ఏండ్లుగా శాశ్వత దాహము కోసం ఎదురుచూస్తుంది

2 ) తాత్కాలిక మైనటువంటి దాహము: ఆమె తన తాత్కాలిక దాహాన్ని తీర్చుకోవటానికి ఎవరూలేని సమయములో బావి దెగరకు వెళ్లి జీవనాధారమైనటువంటి నీరుని తెచ్చుకొని జీవిస్తూ ఉండేది మరి ఎపుడైతే ఆమె తన  జీవితంలోకి ప్రభువని  ఆహ్వానించిందో తన తాత్కాలిక దాహాన్ని వదిలి శాశ్వతజలమును కోరింది.

3 ) ఆధ్యాత్మికమైన దాహము: ఈమె సమాజములో ఒంటరిగా జీవించేది మరి ఆమెకు సమాజములో తలయెత్తుకొని దేవునికి  ప్రియా పూర్తురాలుగా జీవించాలనేదే ఆమెయొక్క ఆధ్యాత్మిక దాహము. మరి యొక్క దాహాన్ని ఈరోజు యేసుప్రభువు ద్వారా పొందుతుంది మరి మన జీవితములో కూడా ఇలా ఎన్నో రకాల దాహాలుంటున్నాయి మరి ఎపుడైతే యేసుప్రభువుతో సంభాషిస్తామో మనకు నిత్యా జీవము లభిస్తుంది. ప్రియా విశ్వాసులారా దేవుడు మన జీవితములో మార్పుకోసం ఎన్నో విధాలుగా సహాయం చేస్తూ వస్తున్నాడు దాన్ని మనం గురుతించలేక పోతున్నాము మరి ఈనాడు చుడండి యొక్క సమారియా స్త్రీకి తన జీవితములో మార్పుకోసము నాలుగు  విధాలుగా సహాయం చుస్తునాడు.

1 ) దేవున్ని చూడటానికి కనిపించేదానికంటే నువ్వు మించివెళ్లు అని అంటున్నాడు అంటే దేవుణ్ణి చూడాలని తపన ఉంటె చాలదు దానికి కావలిసిన శ్రమ ఉండాలి ఈమె యేసుప్రభువుని చుసిన వెంటనే ఇతడు యూదుడు అని భావించింది కానీ ఎపుడైతే యేసు ఆమెతో సంబాషించాడో ఆమె తన చట్టాలను, నిబంధనలను వదిలి యేసుతో సంభాషించటం ద్వారా ఆమెలో మార్పు వచ్చింది.

2 ) దేవునితో సంబంధం కలిగి ఉండటానికి ఒక్కరే నిర్ణిత సరిహద్దులను దాటి వేళ్ళు  అంటున్నాడు ఆమె యాకోబు వంశానికి చెందినందుకు గర్విస్తూ బావినీరే తన జీవనాదారం అనుకుంటున్నది కానీ  ప్రభువు అంటున్నాడు నీరు నీకు సంహృదిని ఇవ్వవు కానీ నేను ఇచ్చే నీరు శ్రేష్టమైనవి కావున నీవు నీ యొక్క నిర్ణీత సరిహద్దులను దాటి వేళ్ళు అని అంటున్నాడు.

3 ) ఆధ్యాత్మిక జీవితాన్ని దాటి భగవంతుడిని ఆరాధించు అంటున్నాడు ఈమె అనుకుంటుంది పర్వతంపైన ఉండే దేవుడిని ఆరాదిస్తే సరిపోతుంది కదా అని అనుకుంటుంది కానీ ప్రభువు అంటున్నాడు నీతోటి వారిలో పేదవారిలో కనిపించే దేవుడిని ఆరాధించే అది ఏవిధంగా అంటే ఆత్మతోను, సత్యముతోను ఆరాదించమంటున్నాడు.

4 ) మెస్సయా గురించి ఒకరి భావనకు మించి వేళ్ళు అని అంటున్నాడు ఆమె మెస్సయకోసం ఎదురుచూస్తూ ఉంది కానీ తన ముందున్న దేవుడిని గురుతించలేక పోతుంది అందుకే ప్రభువు అంటున్నాడు నీ ముందు ఉండే వాడిని నమ్ము నీవు నిత్యజీవితాన్ని పొందుతావు అని అంటున్నాడు. విధంగా ప్రభువు ఆమెకు  అశాశ్విత దాహం నుండి శాశ్వతమైనటువంటి దాహం వైపు నడిపిస్తున్నాడు  కావున మనము కూడా యేసుప్రభువుతో ఉంది తాను ఇచ్చే నిత్యా సత్యాన్ని తెలుసుకొని తనకు ప్రియా పుత్రులుగా జీవించుదాం. ఆమెన్.

BRO. SAMSAN OCD 

 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...