1, ఏప్రిల్ 2023, శనివారం

రెండవ పదం

రెండవ పదం

అప్పుడు అతను, 'యేసు, నీవు నీ రాజ్యంలోకి ప్రవేశించినపుడు నన్ను జ్ఞాపకముంచుకొనుము' అన్నాడు. యేసు అతనికి జవాబిచ్చాడు,"యేసు అతనికి జవాబిస్తూ, 'నేడే నీవు నాతో కూడా పరలోకమున ప్రవేశించెదవు, అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను." (లూకా 23:39-43)
సందర్భం:
యేసు మరో ఇద్దరు దొంగలతో కలిసి సిలువను మోస్తూ కల్వరీకి తీసుకువెళ్లారు. అతని ప్రయాణంలో క్రీస్తు శారీరకంగా చాలా బాధపడ్డారు మరియు ఇప్పుడు శిలువపై కూడా అతను అవమానించబడ్డారు మరియు వెక్కిరించబడ్డారు. ఈ రెండవ పదం యేసు మరియు నేరాలు చేసి సిలువ వేయబడిన దొంగల మధ్య సంభాషణ. ఈ రెండవ పదం యేసు తన దయతో స్వీకరించిన ప్రార్థన అభ్యర్థన మరియు ప్రత్యేక అనుగ్రహం.
ఒక నేరస్థుడి నుండి అవమానాలు

యేసుతో పటు సిలువ వేయబడిన నేరస్తులతో ఒక నేరస్థుడు యేసును ఎగతాళి చేస్తూ, వ్యంగ్యంగా యేసును "నువ్వు క్రీస్తువి, కాదా? అప్పుడు నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించుము." అనెను. అతను యేసు అసమర్థతను చూపించే ఉద్దేశ్యంతో అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు మరియు అతని అధికారాన్ని లేదా “మెస్సీయ” అనే బిరుదును ప్రశ్నిస్తున్నాడు. ఒక విధంగా మీరు మాలాగే చనిపోతున్నారు, మీలో గొప్పది ఏమీ లేదు, అతను మోసగాడు అని ఆరోపించాడు. శిలువపై కూడా, ఈ నేరస్థుడి మానసిక హింసను యేసు ఎలా అనుభవించాడో మరియు భరించాడో మనం చూస్తున్నాము. ఈ దొంగకు అపరాధ భావన లేదా పశ్చాత్తాపం లేదా వినయం లేదు. అతను యేసును తన సిలువను తప్పించుకోవడానికి ఒక మార్గంగా మాత్రమే చూశాడు కానీ అనుసరించాల్సిన నిజమైన రాజుగా గుర్తించలేదు.

మరొక దొంగ/ నేరస్తుడు యొక్క ప్రతిస్పందన మరియు అభ్యర్థన

అయితే, రెండవ నేరస్థుడు మొదటి నేరస్థుడిలా దూషించడం లేదు. ఎందుకంటే ఆ భయంకరమైన పరిస్థితిలో కూడా అతను ఈ మాటలకూ మోసపోలేదు, లొంగలేదు, బదులుగా అతను దేవుణ్ణి పట్ల భయం కలిగిన వ్యక్తితత్వం కలవాడు, అందుకే అతను "దేవునికి భయపడవా?. ఇంకా అతను తనను తాను అంగీకరించాడు, అతను చేసింది తప్పు అని మరియు శిక్షను అర్హమైనదిగా, తగినదేనని అంగీకరించాడు.

అదేవిదంగా అతను యేసు నిర్దోషి అని కూడా అర్థం చేసుకున్నాడు మరియు అంగీకరించాడు, యేసు యొక్క నీతిని మరియు రాజుగా అంగీకరించాడు. "అప్పుడు అతడు, 'యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకముంచుకొనుము' అని అడిగాడు." (లూకా 23:42).

నన్ను జ్ఞాపకముంచుకో :

పశ్చాత్తాపపడిన దొంగ ప్రభువు వైపు తిరిగి తన అపరాధాన్ని, దుర్మార్గాన్ని అంగీకరించాడు. మరియు అతనిని జ్ఞాపకముంచుకోవాలని యేసును అడిగాడు. అందరూ అతనిని విడిచిపెట్టి, ఎగతాళి చేసి, ఆటపట్టించినప్పుడు, ఇక్కడ ఒక చనిపోతున్న దొంగ , అతని చీకటి సమయంలో, అతను యేసు యొక్క మంచితనాన్ని మరియు శక్తిని అంగీకరిస్తాడు, యేసును మోసగాడు కాదు దేవుని కుమారుడిగా అంగీకరించాడు. అతని సాధారణ అభ్యర్థన ప్రార్థన, "నన్ను జ్ఞాపకముంచుకో" అతని యొక్క విశ్వాసం, పశ్చాత్తాపం మరియు దేవుని సహాయం, దయ కోసం ఎదురుచూపును తెలుపుతుంది.

పీఠాధిపతులైన ఫుల్టన్ షీన్ చెప్పినట్లుగా, "మంచి దొంగ స్వర్గరాజ్యం వైపు చూస్తుండగా, చెడ్డ దొంగ భూమి వైపు చూస్తూ, యేసును సిలువ నుండి దిగి రావాలని కోరాడు."

నేడే నీవు నాతో కూడా పరలోకమున ప్రవేశించెదవు- ఒక గొప్ప ప్రత్యేక అనుగ్రహం

"యేసు అతనికి జవాబిస్తూ, 'నేడే నీవు నాతో కూడా పరలోకమున ప్రవేశించెదవు, అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను." (లూకా 23:43)

యేసు స్వయంగా బాధను అనుభవిస్తున్నప్పటికీ, పూర్తి వేదనతో ఉన్నపటికీ , క్రీస్తు ఆ నేరస్థుడి పట్ల దయతో ఉన్నారు . క్రీస్తు తన ప్రేమ మరియు దయతో అతనికి వాగ్దానం చేసారు, "నీవు నాతో పటు పరలోకమున ప్రవేశించుదువు".

క్రీస్తు అతనిని పూర్తిగా క్షమించి, ప్రభువుతో సహవాసం చేయడం అనే గొప్ప భాగ్యాన్ని అతనికి ప్రసాదించాడు. ఎందుకంటే స్వర్గం అనేది స్వర్గపు నివాసం/దేవుని ఉనికిని సూచిస్తుంది.
ప్రభుని వాగ్దానము మన పట్ల యేసు కనికరాన్ని మరియు దయను సూచిస్తాయి.
యేసు స్పందన మన జీవితాల్లో కూడా ముఖ్యమైనది. అతను పశ్చాత్తాపపడిన దొంగను ఎంత ఘోరమైన అపరాధం చేసినా స్వాగతించాడు, దైవ రాజ్యంలోకి మరియు తండ్రి యొక్క సహవాసంలోకి స్వాగతించాడు. మనం కూడా ఆశించేది ఆ సహవాసం, మరియు రాజ్యమే.
కొన్నిసార్లు మన విశ్వాసం క్లిష్టంగా ఉంటుంది, మనము చేయవలసినఅంతా మన పాపపు స్థితిని అంగీకరించి ప్రభువు వైపు తిరిగి వేసుకోవడమే. కాబట్టి, సరైన ప్రార్థన అని పెద్ద పెద్ద ప్రార్థనలు చేయనవసరం లేదు, దేవుని విశ్వాసం తో ఒక మాట పలికిన చాలు సమృద్ధిగా దేవుని ఆశీర్వాదాలు కురిపిస్తారు.

మరియు మనం సవాళ్లు, వేధింపులు, ఎదుర్కొన్నప్పుడు, మన చీకటి క్షణాలలో కూడా దేవుడు మనతో ఉన్నాడని ఈ మాటలు ఓదార్పునిస్తాయి. అతను మనలను విడిచిపెట్టడు. తన రక్తాన్ని చిందించడం ద్వారా క్రీస్తు దొంగను క్షమించి స్వర్గంలో దేవునితో ఉండాలనే అదే ప్రత్యేక అనుగ్రహాన్ని దయచేసి విధంగా, , ఈ రోజు మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు.

మన పాపపు పరిస్థితిని అంగీకరించి, మనల్ని జ్ఞాపకముంచుకునేలా యేసు రాజుని ఒప్పుకుందాం.

ప్రార్థన: ప్రియమైన సర్వశక్తిమంతుడైన దేవా, మేము నీకు మొఱ్ఱపెట్టినప్పుడు, మీరు ఆలకించి దయతో మాకు ప్రత్యుత్తరం ఇస్తారు. జ్ఞాపకముంచుకొనుము అని మేము మిమ్మల్ని అడిగినప్పుడు, మీరు మాకు పరలోకభాగ్య వాగ్దనాన్ని దయచేసి ప్రభువు, మేము మా తప్పులను అంగీకరించినప్పుడు మీరు మమ్మల్ని దయతో మరియు క్షమాపణతో చూస్తున్నారని మాకు తెలుసు. దయగల ప్రభువా, నీవు మమ్ములను ప్రోత్సహించి, స్వస్థపరచి, నిన్ను విశ్వసించి, నా జీవితాన్ని నీ పాదాల చెంత ఉంచుతున్నాను, నన్ను నీ రాజ్యంలో స్మరిస్తున్నపుడు, నీ రాజ్యం కోసం నేను జీవిస్తున్నప్పుడు నన్ను జ్ఞాపకముంచుకొనుము. ఆమెన్.

The Second Word
Then he said, 'Jesus, remember me when you come into your kingdom.' Jesus answered him, 'I tell you the truth, today you will be with me in paradise.'(Luke 23:39-43)

The context:

Jesus was being led to the calvary carrying the cross with two other thieves. On his journey he has suffered extremely physically and now on the cross only he is insulted and mocked. The second Word is a dialogue between Jesus and thieves who were also crucified for the crimes. It is a prayer request and privilege granted by Jesus in his mercy.

Insults from one criminal

Now one criminal making fun of Jesus, sarcastically asks Jesus “ You are the Christ, aren’t you? Then save yourself and us”. He is making insulting remarks intending to show Jesus' inability and questioning his authority or title “Messiah”. in a way you are dying like us, there is nothing greater in you, accusing him of imposter. Even on the cross, we see how jesus suffered and endured this mental torture by this criminal. This thief had no feeling of guilt nor penitence nor humility. He saw Jesus only as a way to escape his cross but as a true King to be followed.

Response and Request from another Criminal

However, the second criminal was not blaspheming like the first one. Because even in that terrible situation he is not deceived by all this teasing, rather he feared God that’s why he asks “ Don’t you fear God?. He acknowledged himself, what he had done was wrong and accepted the punishment as deserving. He also understood and acknowledged that Jesus is innocent, admitting Jesus’ righteousness and as king. "Then he said, 'Jesus, remember me when you come into your kingdom.'" (Luke 23:42). An Important word

Remember me :

The penitent thief turned to the Lord and acknowledged his guilt, wickedness. and asked Jesus to remember him. When all deserted him, mocked and teased him, here is a dying thief, in his dark time, he acknowledges the goodness, and power of Jesus, accepting Jesus to be the son of God not imposter. His simple request prayer, “Remember me” also signifies his faith, repentance and his need for help or mercy.

As the Venerable Fulton Sheen said, “while the Good Thief looked up toward the kingdom of heaven, the bad thief looked down to earth and demanded that Jesus come down off the Cross.”
Today You'll Be with Me in Paradise - a great Privilege
"Jesus answered him, 'I tell you the truth, today you will be with me in paradise." (Luke 23:43)

Though Jesus himself was suffering, in full agony, he was merciful to the criminal. He promises to him in his love and grace, that “ you will be with me in my paradise”.

He completely forgave him and bestowed on him the greatest privilege one could receive, that is to be in communion with the Lord. because paradise signifies the heavenly abode/presence of God.
His promises represent Jesus' compassion and grace to mankind.
Jesus’response thus an important one in our lives too. He welcomed the repentant thief, no matter how grievous his offence into the kingdom and into the communion of the Father, we too hope for that communion, kingdom if we are to acknowledge Jesus.
Sometimes our faith is complicated, all that we need is to ask God to remember us and turn to the Lord acknowledging our sinfulness and situation.Therefore, we don’t need to have perfect prayer for asking favour rather when we invoke faith God’s blessings are showered upon in abundance.
And when we go through challenges, persecution, teasing, these words give us comfort and consolation that God is with us even in my darkest moments. He will not leave me abandoned. He promises with the same privilege of being with God in paradise, through the shedding of his blood he forgave the thief and is ready to forgive us today.
Let us admit our sinful situation and acknowledge Jesus the King to remember us.
Prayer: Dear Almighty God, when we cry out to you, you hear and reply to us in mercy and grace. When we ask you to remember, you promise us paradise, when we acknowledge you look on us with mercy and forgiveness. Merciful Lord, you encourage us and heal us, today, trusting in you I place my life at your feet, remember me in your kingdom, remember me as i live for your kingdom. Amen.

Fr. Jayaraju Manthena OCD

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆగమన కాలము 2 వ ఆదివారం

ఆగమన కాలము 2 వ ఆదివారం  బారుకు 5:1-9, ఫిలిప్పీ 1:4-6, 8-11, లూకా 3:1-6 ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుని కొరకు మార్గమును సిద్ధం చేయుటను గు...