28, సెప్టెంబర్ 2024, శనివారం

సామాన్యకాలపు ఇరవై ఆరోవ ఆదివారం

సామాన్యకాలపు ఇరవై ఆరోవ ఆదివారం 
సంఖ్యకాండము 11:25-29, యాకోబు 5:1-6 
మార్కు 9:38-43, 45, 47-48.
క్రీస్తునాధునియయందు ప్రియ సహోదరి  సహోదరులారా మరియు  ప్రియమైనటువంటి భక్తులరా, ఈనాటి మూడు పఠణాలను మనం గ్రహించి ధ్యానిస్తే,  మూడు పఠణాలు కూడా మనకు తెలియజేస్తున్నా అంశం ఏమిటంటే, మూడు  ప్రధానమైనటువంటి విషయలను గురించి మనకు క్లుప్తంగా వివరిస్తున్నాయి, అవి ఏమిటంటే దేవుని కృప, అయన తీర్పు మరియు మన తప్పులను సరిదిద్దుకోని. దేవుని బాటలో ప్రయాణిస్తూ, మనం చేసినటువంటి పాపాలను వదలిపెట్టి, ఇతరులను ప్రేమతో దేవుని చెంతకు తీసుకోని రావాలని ఆహ్వానిస్తున్నాయి.
ముందుగా దేవుని కృప, తీర్పు మరియు మన తప్పులను సరిదిద్దుకోవడం అంటే ఏమిటి అని మనం ముందుగా గ్రహించాలి. అసలు దేవుని కృప అంటే ఏమిటి.
దేవుని కృప అనేది మనం సాదించుకోలేని, సంపాదించుకోలేని దివ్యమైనటువంటి లేదా పవిత్రమైనటువంటి వరం. ఈ వరం  మనకందరికీ కూడా దేవుని ప్రేమ, కరుణ మరియు పాపముల నుండి విముక్తి పొందే వరం. బైబిల్ గ్రంథ ప్రకారం దేవుని కృపకు సంబంధించిన ఎన్నో స్ఫూర్తిదాయకమైన ఉదాహరణలు ఉన్నాయి. వాటి ద్వారా మనం దేవుని కృప ఏ విధంగా మన  జీవితాలను మారుస్తుందో అర్థం చేసుకోవచ్చు.
 రో్మీయులకు వ్రాసిన లేక 5:8 వచనంలో చూస్తున్నాము.మనము పాపులమై యుండగా క్రీస్తు మన కోసము చనిపోయెను. ఈ వాక్యము మనకు దేవుని కృపను ఆవిధంగా మనపై ఉందొ తెలియజేస్తుంది. మనం పాపులమై ఉండి దేవుని నుండి దూరంగా ఉన్నప్పటికీ కూడా క్రీస్తు మనకోసం ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పణంగా పెట్టి మనందరి కోసం తాను ప్రాణత్యాగం చేశాడు. ఈ కృప మన బలహీనతల మధ్యన, దేవుని ప్రేమ ఎల్లప్పుడూ మనతో ఉందని గుర్తుచేస్తుంది. అందుకే 
2 కొరింథీయులకు  వ్రాసిన లేక 12:9 వచనంలో క్రీస్తు ప్రభు అంటున్నారు. నా కృప నీకు సరిపడును. అంటే ఈ వాక్యము దేవుని కృపను మరింత స్పష్టంగా వివరిస్తుంది. మన బలహీనతలలోనూ, సమస్యలలోనూ, దేవుని కృప మనకు ఆధారంగా నిలుస్తుంది. అది మనకు అర్హత లేకున్నా కూడా దేవుడు మన మీద చూపించే దయ మరియు అయన కృప మన పాపాలకు క్షమాపణ ఇచ్చి కొత్త జీవితని అందిస్తుంది. దేవునితో సన్నిహిత సంబంధాన్ని అందిస్తుంది. అదే నిజమైన క్రైస్తవుని యొక్క జీవితం.
 మొదటి పఠనని చుసినట్లయితే దేవుడు ఇజ్రాయెల ప్రజలను ఏవిధంగా బానిసత్వ జీవితం నుండి దేవుడు తన ప్రజల పట్ల చూపించినటువంటి కృపను తెలియజేస్తుంది. వారు చేసినటువంటి తప్పులను క్షమించి వారిపై తన కృపను ఎంతగానో చూపిస్తూ, వారిని అన్ని కష్టాలనుండి కాపాడుతు, వారికీ వచ్చినటువంటి కష్టాలను దూరం చేస్తూ, వారికీ అన్ని మేలులను దయచేస్తున్నారు. ఏ విధంగా అంటే తన ఆత్మ శక్తిని వారిపై పంపి తన కృపను అందజేస్తున్నాడు. అదేవిధంగా మన జీవితాలలో కూడా కష్టాలు వచ్చినప్పుడు, మనం కూడా అందరిలాగా దేవునిపై కోపం చూపించకుండా ఓపికతో ఎదురుచూసినట్లుతే అయన కృప ఎప్పుడు మనతో ఉంటుందని మొదటి పఠనం మనకు తెలియజేస్తుంది.
రెండొవ పఠనము యాకోబు వ్రాసిన లేక 5:1-6 లో దేవుడు ధనికులను హెచ్చరించడం గురించి చూస్తున్నాము అది ఏ విధంగా అంటే నీకు ఉన్నా సంపాదలను ని స్వార్ధం కొరకు ఉపయోగించకుండా ఇతరులకు మేలు చేసే విధంగా ఉపయోగించమని ఆలా ఉపయోగించడం ద్వారా దేవుని చేత ఆశీర్వాడింపబడతావని లేకపోతే దేవుని నుండి శిక్షను పొందుతావని మనకందరికి కూడా తెలియజేస్తున్నాడు, ఇక్కడ ఒక క్రైస్తవునిగా మనం చూడవలసిందేమిటంటే, మనం సర్వస్వాన్ని సంపాదించినా, అది దేవుని యోగ్యమైన విధంగా వాడకపోతే అది వ్యర్థమేనని చూసిస్తుంది. అది ఆవిధంగా అంటే లోకమంత సంపాదించి ఆత్మను కోల్పోయిన  లాభము ఉండదో అలాగే మనకు ఎన్ని ఆస్తిపాస్తులున్న అది దేవునికి ఇష్టనుసారంగా లేకపోతె ప్రయోజనము లేదు. ఎందుకంటే పాపాలు, అత్యాశ, ఇతరుల బాధలను పట్టించుకోకపోవడం వంటివి అన్నీ కూడా దేవుని ఖండనకు దారితీస్తాయి. కాబట్టి మన సంపదలను న్యాయంగా ఉపయోగించాలి, ఇతరుల పట్ల మనము దయ చూపించి ప్రేమను నా అనుకోని చూపించాలని రెండొవ పఠనం మనకి నేర్పిస్తుంది. 
చివరిగా సువిశేష పఠనని గమనించినట్లయితే, క్రీస్తు ప్రభు 
 శిష్యులకు నేర్పించినటువంటి కొన్ని సత్యాలు మరియు ముఖ్యమైనటువంటి గుణపాఠాల గురించి  తెలియజేస్తుంది. అప్పుడైతే యోహాను యేసు దగ్గరకు వచ్చి యేసుతో మాట్లాడడో అప్పుడే, యేసు తన శిష్యులకు కొన్ని ముఖ్యమైన మరియు కీలకమైన సందేశాల్ని అందించాడు.  అది ఆవిధంగా అంటే పాపం ఎంత హానికరమో, దానితో మెలగడంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో పూస గుచ్చినట్లు స్పష్టంగా వివరించాడు.
మొదటిది ఇతరులను అంగీకరించడం ఎందుకంటే యోహాను యేసు దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు, ఒక వ్యక్తి మీ పేరిట దయ్యాలను వెళ్లగొడుతున్నాడు, అతను మనతో ఉండలేదు కాబట్టి మేము అతడు చేసేటువంటి పనిని మేము ఆపివేసితిమి అని చెప్పినప్పుడు. అందుకు క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి సమాధానం మనకందరికి కూడా అత్యునతమైన గుణపాఠాన్ని నేర్పిస్తుంది. యేసు అన్నాడు, ఎందుకంటే క్రీస్తు ప్రభు అంటున్నారు నన్ను విరోధించడం లేనివాడు మనకు అనుకూలం అని. ఇది మనకు ఏమి నేర్పిస్తుంది అంటే ఇతరులు దేవుని పట్ల చేసేటువంటి సేవాలను మనస్ఫూర్తిగా అంగీకరించడం అంతే కాకుండా వాళ్లు మన తోటి వారు కాకపోయినా దేవుని సేవ చేయడానికి వారిని మనం అంగీకరించడం ముఖ్యమని తెలియజేస్తుంది. మరి రెండొవది పాపం పట్ల దూరంగా ఉండటం (9:42-48) అంటే యేసు మనకు నేర్పిస్తున్నారు పాపం మన జీవితాలను ఏవిధంగా  నాశనం చేస్తుందో తెలియజేస్తున్నాడు. ఎలాగంటే నీ చెయ్యి నీకు పాపం చేయడానికి దారితీస్తే దానిని తెగనరుకుము, నీ కాలు లేదా కన్ను  నీకు విరుద్ధముగా పాపానికి దారితీస్తే దానిని తీసివెయుము అని అంటున్నారు యేసు ప్రభు. ఇక్కడ యేసు ఇచ్చిన సందేశం మనకు ఎంత ప్రాముఖ్యమైనదిగా గుర్తించాలి. ఎందుకంటే మొదటిగా పాపం మనకు ఆనందాని కలిగించవచ్చు, కానీ అది మన ఆత్మను మరియు మనకు దేవునితో ఉన్నటువంటి సన్నిహితని దూరం చేస్తూ, నాశనం చేస్తుంది. కాబట్టి యేసు చెప్పిన విధంగా మన జీవితంలో పాపం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని. మనకు ఎన్ని సోదనలు, కష్టాలు వచ్చినప్పుడు మనం దేవునికి దగ్గరగా ఉండి అయన బాటలో నడవడానికి, అయన చేపినటువంటి మాటలను అలకిస్తూ జీవించాలని సువిశేష పఠనం మనలను హెచ్చరిస్తుంది. కాబట్టి ప్రియా సహోదరి సహోదలారా, ఈ నాటి మూడు పఠనలను కూడా మనం గుర్తుచేసుకుంటూ దేవుడు ఆవిధమైనటువంటి సందేశని మనకు ఇస్తున్నాడని మనం గ్రహించాలి. ఒక క్రైస్తవునిగా మనం జీవిత విధానం ఆవిధంగా ఉంది దేవునికి ఇస్టనుసారంగా ఉందా లేకపోతే మనకు ఇష్టమొచ్చినట్లు మనం జీవిస్తునామా అని ఆలోసించుకోవాలి. ఎందుకంటే దేవుని కృపను, అయన ప్రేమను పొందుకోవాలంటే. మనం అందరము కూడా దేవుని దారిలో నడుస్తూ, మన పాపాలను విడిచిపెట్టి దేవునికి దగ్గరగా అవాలని ప్రార్ధించుకుందాము.
Fr. Johannes OCD 

26వ సామాన్య ఆదివారం

సంఖ్యా 11:25-29, యాకోబు 5:1-6, మార్కు9:38-43,45,47-48
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు అసూయ అనే అంశము గురించి బోధిస్తున్నాయి. సమాజంలో చాలామందికి తమ తోటి వారి పట్ల అసూయ భావం ఉంటుంది. అసూయ అనగా ఇతరుల యొక్క ఎదుగుదలను అభివృద్ధిని సహించలేక మనసంతా బాదించేది అసూయ. ఎదుటివారి గొప్పదనమును చూసి మనం కొన్ని సందర్భాలలో ఓర్వలేకుంటాం.
అసూయ అనేది కోపము, క్రూరము కంటే ఘోరమైనది సామెతలు 27:4. 
మనం జీవించేటటువంటి ప్రదేశంలో మనకన్నా గొప్పగా ఎవరైనా ఎదుగుతున్నారంటే మనందరం కూడా తట్టుకోలేక పోతాం. మన కన్నా అందంగా ఉన్నా, డబ్బున్నా, పేరు ప్రతిష్టలన్నా, వారిని చూసినప్పుడు మనలో అసూయ భావం కలుగుతుంది. ఈ యొక్క అసూయ వలన ఎప్పుడు మనము ఎదుటివారి గురించే ఆలోచిస్తాం దానివలన ప్రశాంతంగా జీవించలేం. అసూయ వలన మన యొక్క ఆయుష్షు తగ్గుతుంది. (సిరా 30:24.
చాలా సందర్భాలలో ఈ యొక్క అసూయ వలన పాపం చేస్తాం. మనం దేవునితో మంచిగా ఉంటే సైతాన్కు అసూయ, అందుకే మన జీవితంలో శోధనను ప్రవేశపెడుతుంటుంది. మనం కొంతమందితో మంచిగా మాట్లాడితే వేరే వారికి అసూయ ఉంటుంది. మనం కొన్నిసార్లు ఖరీదైన కార్లు కొన్నా, వస్తువులను కొన్నా కొంతమంది దానిని చూసి తట్టుకోలేరు.
ఈనాటి మొదటి పఠణంలో మోషే ఇశ్రాయేలు ప్రజలపై నాయకత్వం భారం కింద కృంగిపోయి దేవునికి మొరపెట్టుకున్నప్పుడు యావే ప్రభువు అతనికి సహాయంగా ప్రజల పెద్దల నుండి 70 మందిని ఎన్నుకున్నారు వారిని గుడారం చుట్టూ నిలవమని చెప్పారు. మోషే దేవుడు చెప్పిన విధంగా చేశారు అంతట యావే దేవుడు మేఘం నుండి దిగివచ్చి మోషే మీద వచ్చిన ఆత్మలో కొంత ఆత్మను ఆ 70 మంది మీద ఉంచారు. ఆ ఆత్మను స్వీకరించినప్పుడు ఆ 70 మంది కూడా దేవుని వాక్యమును ప్రకటింప సాగారు. ఈ గుంపులో లేనటువంటి ఎల్దాదు, మేధాదు అనే ఇద్దరు వ్యక్తులు మీద కూడా వేరుగా ఆత్మ దిగి వచ్చి వారు కూడా ప్రవచింపసాగారు. గుడారం దగ్గర లేని ఇద్దరు మీదకు ఆత్మ దిగిరాగా, వారు ప్రవచించుట చూచి యెహోషువ వారిని అడ్డుకోవాలని భావించాడు అందుకు మోషే నీవు నా మీద ఉన్న ప్రేమ వలన అసూయపడుచున్నావు అని చెప్పారు.(సంఖ్యా11:29). దానికి ప్రత్యుత్తరముగా మోషే ప్రవక్త యెహోషువతో ఈ విధంగా అంటున్నారు దైవ ప్రజలందరూ ప్రవక్తలుగా మారి దేవుని సేవ చేయాలని దేవుని ప్రణాళిక. యెహోషువ, దేవుని యొక్క ఆత్మ ప్రవచన శక్తి, బోధనా శక్తి అందరి శ్రేయస్సు కొరకై ఇవ్వబడినది అని గ్రహింప లేకపోయారు. అసూయ పడుచున్నారు. ఈ యొక్క ప్రవచన శక్తిని కేవలము 70 మందికి మాత్రమే పరిమితం చేయాలని యెహోషువ భావించాడు. మోషే ప్రవక్త ఎటువంటి అసూయ పడకుండా అందరూ ప్రభువు సేవ చేయుట మంచిదే అని భావించారు. అందుకే తాను స్వీకరించినటువంటి ఆత్మను సైతం ఇతరుల కొరకు ఇవ్వటకు సిద్ధపడ్డాడు. తన గౌరవ ప్రతిష్టలు తగ్గిపోతాయని కానీ, తన అధికారం ఇతరులకు ఇవ్వడం ద్వారా తన నాయకత్వానికి హాని కలుగుతుందని మోషే భావించలేదు ఆయన అనుక్షణం ప్రజల యొక్క శ్రేయస్సునే కోరుకున్నారు. తన యొక్క పదవి గురించి భయపడలేదు. 
కొన్ని సందర్భాలలో మనం కూడా యెహోషువలే తొందరపడి అసూయ చెందుతుంటాం. ఈ అసూయ వలన ఇతరులతో కూడా మాట్లాడటం మానేస్తాం. అసూయ వలన జరిగే కొన్ని నష్టాలు;
1. అసూయ మనలను నిరుత్సాహపరుస్తుంది (సామెతలు 23:17-18)
2. అసూయ మనల్ని కఠినులను చేస్తుంది (పరమగీతం 8:6)
3. అసూయ మనల్నీ confuse చేస్తుంది. (యాకోబు 3:16).
4. అసూయ మనకు అనారోగ్యాన్ని కలిగిస్తుంది.
ఈనాటి రెండవ పఠణంలో ధనవంతులు చేస్తున్నటువంటి మోసము గురించి తెలుపుతున్నారు. వారు పేదవారిని కూలగొట్టి సంపాదించినటువంటి ధనము మొత్తము కూడా నాశనమవుతుంది అని యాకోబు గారు తెలుపుచున్నారు. ధనవంతులు పేదవారి పట్ల, తమ దగ్గర పని చేసే వారి పట్ల ప్రేమ భావం కలిగి జీవించాలి. ధనికులు, పేదవారిని చిన్నచూపు చూడకుండా వారి యెడల కనికర హృదయం కలిగి జీవించాలి. 
ఈనాటి సువిశేష భాగములో కూడా యోహాను, ఒక వ్యక్తి ఏసుప్రభువు పేరిటములను గూర్చి ప్రభువునకు ఫిర్యాదు చేస్తున్నారు అతడిని వెంటనే తన పరిచర్య నుండి నిషేధించాలని ఏసుప్రభువును కోరాడు. యోహాను కూడా యెహోషువలై తన యొక్క అసహనాన్ని, అసూయను వ్యక్తపరుస్తున్నాడు. ప్రభు అంటున్నారు "నా పేరిట అద్భుతములు చేయువాడు వెంటనే నన్ను గూర్చి దుష్ప్రచారము చేయజాలడు. మనకు విరోధి కాని వాడు" మన పక్షమున ఉండు వాడు (మార్కు 9:39-40) అని తెలిపారు. దేవుని వరాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగా అందించబడ్డాయి దానిని యోహాను గుర్తించలేకపోయారు.
కేవలము వారి వలె అద్భుతాలు చేస్తున్నారు అనేటటువంటి అసూయతోనే యోహాను ఏసు ప్రభువునకు ఈ విషయమును తెలియజేశారు. 
పవిత్ర గ్రంథంలో అసూయ గురించి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. 
1. కయీను అసూయ వలనే సోదరుడిని చంపివేశాడు. (ఆది 4:3-8)
2. ఏసేపు యొక్క అన్నలు అసూయ వలనే ఆయన్ను బావిలో పడేశారు (ఆది 37:5-8)
3. మోషే గొప్పతనమును చూసి మిరియం అసూయ పడుతున్నది.
4. సౌలు దావీదు యొక్క కీర్తిని చూసి అసూయ పడుతున్నాడు. 
5. మెర్థుకయి కీర్తిని చూసి హామాను అసూయ పడుతున్నాడు.
6. హేరోదు రాజు కూడా బాల యేసుని చూసి అసూయ పడుతున్నాడు.
అదేవిధంగా ఈ యోహాను గారు కూడా అసూయ పడుతున్నారు. మన యొక్క జీవితంలో అసూయను విడిచి పెట్టేసి తోటి వారిని అంగీకరించి జీవించాలి అప్పుడే మనందరం కూడా సంతోషంగా జీవించగలుగుతాం. 
Fr. Bala Yesu OCD

నిత్య జీవము ఎలా వస్తుంది

 యోహాను 6: 22-29  మరునాడు, సరస్సు ఆవలితీరమున నిలచియున్న జనసమూహము అచటనున్న  ఒకే ఒక చిన్న పడవ తప్ప మరియొకటి లేదనియు, ఆ పడవలో శిష్యులతో పాటు యే...