22, ఫిబ్రవరి 2025, శనివారం

సామాన్యకాలపు ఏడవ ఆదివారము


1 సమూయేలు 26:2, 7-8, 12-13, 22-23; 
1 కొరింథీయులు 15:45-49
లూకా 6:27-38
క్రీస్తునాధునియందు మిక్కిలి ప్రియ విశ్వసిని విశ్వాసులరా మరియు దేవుని బిడ్డలరా, ఈ దినమున మనమందరము సామాన్య కాలపు ఏడవ ఆదివారంలోనికి ప్రవేశిస్తున్నాము, ఈ నాటి మూడు పఠనములలో మనం చుసినట్లయితే, ఈ మూడు కూడా మనకు ముఖ్యమైన మూడు అంశముల గురించి తెలియజేస్తున్నాయి. అవి ఏమిటంటే మానవుని  వినయం, క్షమాపణ మరియు ఆధ్యాత్మిక పరివర్తన యొక్క ముఖ్యమైన గుణల గురించి నేర్పిస్తున్నాయి.
ముందుగా మొదటి పఠనము చూసినట్లయితే 
1 సమూయేలు 26:2, 7-8, 12-13, 22-23
ఈ వచనలలో  దావీదు రోజు యొక్క వినయమును మనం గమనించ వచ్చు ఎందుకంటే దావీదు ఏవిధంగానైతే దేవుని పట్ల తన వినయమును కనబర్చాడో అదే విధమైనటువంటి వినయం ఈ రోజు దావీదు సౌలు పట్ల చూపిస్తున్నాడు. వినయం అనేది ఒక గొప్ప ముఖ్యమైనుటువంటి లక్షణం. ఇది మనల్ని ఇతరులతో కలిసిమెలిసి ఉండడానికి, వారిని గౌరవించడానికి దోహదపడుతుంది లేదా సహాయపడుతుంది. వినయం గల వ్యక్తి ఎప్పుడూ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాడు మరియు ఇతరుల నుండి మంచిని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాడు. ఇటువంటి వినయమును మనం దావీదులో చూస్తున్నాము. ఎందుకంటే దావీదును సౌలు రాజు వెంబడించే హతమార్చాలి అనుకున్న సమయంలో దావీదు అతనిని ఎదుర్కొంటాడు. దావీదుకు సౌలును చంపడానికి అవకాశం వచ్చినప్పటికి లేదా ఉన్నప్పటికీ, దావీదు సౌలు రాజును విడిచిపెట్టాలని నిర్ణయించుకుంటాడు. ఇక్కడ మనం గమనించలసింది దావీదు దేవుని అభిషిక్తుని పట్ల అతని వినయాన్ని మరియు భక్తిని చూపిస్తుంది. కొన్ని సార్లు మన స్వంత  నిర్ణయాలను తీసుకోవడానికి బదులుగా, దేవుని యొక్క న్యాయాన్ని విశ్వసించడంలో ఉన్నటువంటి ప్రాముఖ్యతను ఇక్కడ చూపిస్తుంది. ఇది దేవుడు మానవునికి ఇచ్చినటువంటి అధికారాన్ని గౌరవించాలని మరియు మనకు కీడు చేసిన వారి పట్ల కూడా వినయం మరియు దయ చూపాలని మనకు నేర్పిస్తుంది. చివరిగా సౌలు రాజు దావీదును అసూయతో వెంబడించాడు. ఒక సందర్భంలో దావీదు సౌలును చంపడానికి అవకాశం వచ్చింది, కానీ దావీదు అలా చేయలేదు. ఎందుకంటే సౌలు దేవునిచే ఎన్నుకోబడిన రాజు అని దావీదుకు తెలుసు. దావీదు దేవుని పట్ల వినయం కలిగి ఉన్నాడు మరియు దేవుని నిర్ణయాలను గౌరవించాడు. మనము దావీదును ఒక ఉదాహరణగా తీసుకుంటూ మన జీవితాలను దేవునికి అనుకుగుణంగా మార్చుకుంటూ వినయంతో జీవించాలని మొదటి పఠనము మనకు నేర్పిస్తుంది.
సువిశేష గ్రంథ పఠనమును మనం ద్యానించినట్లయితే 
లూకా 6:27-38 చుసినట్లయితే యేసు ప్రేమ మరియు క్షమాపణ గురించి తన  బోధనలనలో బోదిస్తున్నాడు. ఏవిధంగానంటే మన శత్రువులను ప్రేమించమని, మనలను ద్వేషించే వారికి మంచి చేయమని మరియు మనలను శపించే వారిని దీవించమని ఆయన మనలను పిలుస్తాడు. యేసు మన శత్రువులను ప్రేమించమని మనకు తెలియజేస్తున్నాడు. సాధారణంగా మానవుని జీవితంలో క్షమించడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం, ఎందుకంటే సహజంగా మనకు హాని చేసిన వారిని ప్రేమించడం అంటే మనకు అసలు నచ్చనటువంటి పని మరియు భయంకరమైనటువంటి కష్టం. కానీ ఈనాడు యేసు మనలను అలా చేయమని పిలుస్తున్నాడు, ఎందుకంటే ఆయన మనలను ఎంతగానో ప్రేమించాడు కాబట్టి.
మన శత్రువులను ప్రేమించడం అంటే వారిని క్షమించడం మరియు వారికి మంచి చేయడం. వారిని ద్వేషించకుండా, వారి పట్ల దయ చూపించాలి. ఇది చాలా కష్టమైన పని, ఒక్క సారి పేతురు గారు యేసు ప్రభుని ఇలా అడిగినపుడు నా సహోదరుడు నాయడల తప్పు చేసినప్పుడు ఎన్ని పర్యాయములు అతని క్షమించవలయునని  అడిగినప్పుడు యేసు ప్రభు ఇచ్చినటువంటి సమాధానం మనము చూసియున్నాము. దీనికి యేసు ప్రభువు మనకు ఒక గొప్ప ఉదాహరణగా చూపించాడు. ఆయన మన కొరకు సిలువపై మరణింంచాడు లేదా చనిపోయాడు, మనము ఆయనకు మన పాపల ద్వారా శత్రువులుగా ఉన్నప్పుడు కూడా. ఆయన మనలను ఎంతగానో ప్రేమించాడు కాబట్టే అలా చేయగలిగాడు. ఈ సమయము నుండి మనము కూడా మన శత్రువులను ప్రేమించాలని యేసు కోరుకుంటున్నాడు. సాధారణముగా ఇది మనకు కష్టంగా అనిపించవచ్చు, కానీ దేవునీ సహాయం మనతో ఉంటే , మనము కచ్చితంగా ఈ క్షమాపణ అనేది నెరవేర్చగలము. ఎందుకంటే 
మన శత్రువులను ప్రేమించడం వలన మనము దేవుని ప్రేమను ఇతరులకు చూపించగలము. ఇది మన జీవితంలో సంతోషాన్ని మరియు సమాధానాన్ని కూడా కలిగిస్తుంది.
కాబట్టి, మన శత్రువులను ప్రేమించడానికి మనమందరము గట్టిగా ప్రయత్నించుదాం. ఇది కష్టమైన పని, కానీ చాలా విలువైనది. ఎందుకంటే దేవుడు మనలను క్షమించినట్లే మనం ఇతరులను క్షమించాలి.
రెండవ పఠనము 1 కొరింథీయులు 15:45-49 వచనలలో మనము చూస్తున్నాము. ఇక్కడ మన శరీరాల పరివర్తన గురించి మాట్లాడుతుంది. ఇది మన లౌకిక, నాశనకరమైనటువంటి శరీరాన్ని పునరుత్థానంలో మనం పొందే మహిమకరమైన శరీరంతో విరుద్ధంగా ఉంటుంది అని తెలియజేస్తుంది. అది ఏవిధంగానంటే మనము ఇప్పుడు చూద్దాము. మొదటి మనిషి అయినటువంటి ఆదాము జీవముగల ప్రాణిగా చేయబడ్డాడు మరియు తన శరీరమంత మట్టితో చేయబడింది మరియు అది ఆశాశ్వతమైనది. కానీ చివరి  ఆదాము అంటే క్రీస్తు ఆయన ఆత్మను ఇచ్చేవాడు. ఆయన శరీరము మహిమకరమైనది మరియు నాశనమయేటువంటిది కాదు. ఒక మానవునిగా మన ప్రస్తుత శరీరాలు ఆదాము నుండి వచ్చినవి. అవి అశాశ్వతమైనవి మరియు పాపానికి లోబడి ఉండేటువంటివి. కానీ పరలోక సంబంధమైనటువంటి శరీరము మనము క్రీస్తును విశ్వసించినప్పుడు, మనము పరలోక సంబంధమైన శరీరాన్ని పొందుతాము. ఇది మహిమకరమైనది మరియు శాశ్వతమైనది. ఈనాడు మనం మన ప్రస్తుత శరీరం గురించి మనం ఏవిధంగా ఆలోచిస్తున్నాము అని మనలను మనం ఒక్క సారి ద్యానిచుకుంటూ ప్రశ్నించుకుందాము.
కాబట్టి ప్రియా దేవుని బిడ్డలరా ఈనాడు మనమందరము దేవుని పట్ల మరియు మానవుని పట్ల వినయం చూపిస్తూ, క్షమాగుణం కలిగి ఇతరులకు పంచుతూ, క్రీస్తులో భాగమై జీవిస్తూ ఆయనతో ఒకటై ఉండాలని ఈ దివ్యబలిలో ప్రార్థిస్తూ పాల్గొందాము.

 ‌Fr. Johannes OCD

మ్రానికొమ్మల ఆదివారము

యెషయా 50:4-7 ఫిలిప్పీ 2:6-11 లూకా 22:14-23:56              ప్రియ సహోదరి సహోదరులరా ఈ రోజు మనకు ఎంతో ప్రత్యేకమైన రోజు, ఎందుకంటే ఈ ఆదివారంతో పా...