1, మార్చి 2025, శనివారం

సామాన్యకాలపు ఎనిమిదవ ఆదివారము

సామాన్యకాలపు ఎనిమిదవ  ఆదివారము
సిరా 27:4-7
1 కొరింథీయులు 15:54-58
లూకా 6:39-44

          క్రీస్తునాధునియందు మిక్కిలి ప్రియా  దేవుని జనులరా , ఈ రోజున మనము సామాన్య కాలపు ఎనిమిదవ ఆదివారంలోనికి ప్రవేశిస్తున్నాము, ఈ నాటి మూడు దివ్య గ్రంథ పఠనములను మనం చుసినట్లయితే, ఈ మూడు  మనకు ముఖ్యమైనటువంటి మూడు అంశముల గురించి తెలియజేస్తున్నాయి. అవి  మన జీవితానికి చాలా విలువైన విషయాల గురించి నేర్పుతున్నాయి. అవి ఏమిటంటే మన మాటలు, మన చేతలు ద్వారా చేసే పనులు, మన స్వభావం గురించి ఆలోచించి, మంచి జీవితాన్ని గడపమని ఈ వాక్యాలు మనకు నేర్పిస్తున్నాయి. ఈ ముఖ్య గుణములు మన జీవితములో ఎంతగానో ఉపయోగపడతాయి. మనలను మంచి మార్గములో ప్రయాణించుటకు ఉపయోగపడతాయి.

ముందుగా మనము మొదటి పఠనము చూసింట్లయితే 
సిరా 27:4-7 వచనలలో  మన మంచి జీవితం అనేది మన మాట్లమీద ఆధారపడివుందని తెలియజేస్తుంది. అది ఏ విధంగానంటే మనుషుల నిజమైన స్వభావం మీద ఆధారపడివుంది. లూకా సువార్తలో మనము చూస్తున్నాము చెట్టును బట్టే పండ్లు కాస్తాయని. చెట్టు పండును బట్టి ఎలా దాని స్వభావము తెలుస్తుందో, అదే విధంగా మనిషి మాటలను బట్టి అతని హృదయం తెలుస్తుంది.
 ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మాటకూడా చాలా విలువైనది. మన జీవితములో కొన్ని సార్లు తొందరపాటు నిర్ణయాలను తీసుకుంటాము. ఏవిధంగానంటే ఎవరినీ తొందరపడి పొగడకూడదు, వారి మాటలు విన్నాకే వారిని అంచనా వేయాలి.
 నిజం జీవితములో మనం మాటల ద్వారానే మన నిజస్వరూపాన్ని బయటపెడతాము. అందుకే మనం మాట్లాడే ప్రతి మాటలు జాగ్రత్తగా మాట్లాడాలని ఈ మొదటి పఠనములో చూస్తున్నాము.
       రెండొవ పఠనము: 
1 కొరింథీయులు 15:54-58:
 ఈ వాక్యాలు మరణంపై విజయం గురించి, శాశ్వత జీవితం గురించి మాట్లాడుతున్నాయి. యేసుక్రీస్తు ద్వారా మరణం అనేది ఓడిపోతుందని, మానవులమైనటువంటి మనకు శాశ్వత విజయం లభిస్తుందని ఈ వచనాలు మనకు తెలియజేస్తున్నాయి. మన మానవ జీవితంలో మనము అనేక సార్లు పాపమనే ఉబిలో పడిపోతున్నాము అంటే మనము పాపమానే జీవితములో అనేక సార్లు చనిపోతున్నాము. మరి దీని నుండి మనము బయటకి జీవముతో రావాలంటే యేసు క్రీస్తును దృఢనమ్మకముతో విశ్వాసించాలి ఎందుకంటె క్రీస్తు ద్వారా మనము మరణాన్ని జయించవచ్చు. ఎటువంటి గొప్ప బహుమానము క్రీస్తు ద్వారా  దేవుడు మనకు విజయాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేయాలి. మన శ్రమలు ప్రభువులో వ్యర్థం కావు అని, ఎల్లప్పుడూ ప్రభువు పనిలో నిమగ్నమై ఉండాలని అప్పుడే మనము అన్ని జయింపగలమని ఈ వాక్యాలు మనకు నేర్పిస్తున్నాయి.
               చివరిగా సువిశేష పఠనము:
లూకా 6:39-44 ఈ వచనాలు ఇతరులను తీర్పు తీర్చడం గురించి, మంచి ఫలాలను ఇవ్వడం గురించి మాట్లాడుతున్నాయి. ముందుగా గుడ్డివాడు గుడ్డివాడిని నడిపించలేడని, అంటే పాపం అనే జీవితములో జీవించే వాడు ఇతరులకు మంచిని నేర్పించలేడు అని, ముందుగా మన కంటిలోని దూలాన్ని తీసివేయాలని ఈ వచనాలు మనకు తెలియజేస్తున్నాయి. మంచి చెట్టు మంచి పండ్లను ఇచ్చినట్లే, చెడ్డ చెట్టు చెడ్డ పండ్లను ఇస్తుందని, వాక్యం ద్వారా క్రీస్తు ప్రభు అంటున్నారు. మన హృదయం నుండి వచ్చే మాటలు మన స్వభావాన్ని తెలియజేస్తాయనీ. ఇతరులను మనము సరిచేయడానికి ముందు మనల్ని మనం సరిచేసుకోవాలని సువిశేష పఠనము మనకు నేర్పిస్తుంది.
కాబ్బటి మన మాటలు, చేతలు మంచి ఫలాలను ఇవ్వాలనుకుంటే మన స్వభావము అనేది మంచిగా ఉండాలి అప్పుడే మనము ఇతరులను మంచి మార్గములో ప్రయాణించేలా చేయగలుగుతాము. 
           కాబ్బటి ప్రియా దేవుని బిడ్డలరా మన మాటలు, చేతలు, మన స్వభావం ఇవి అన్ని కూడా మనలను మంచి జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాలని నేర్పిస్తున్నాయి. ఒక క్రైస్తవునిగా నీ జీవితాము ఏ విధంగా ఉందొ తెలుసుకొని జీవించాలని ఈ బలి పూజలో ప్రార్దించుకొందము.
Fr. Johannes OCD

మ్రానికొమ్మల ఆదివారము

యెషయా 50:4-7 ఫిలిప్పీ 2:6-11 లూకా 22:14-23:56              ప్రియ సహోదరి సహోదరులరా ఈ రోజు మనకు ఎంతో ప్రత్యేకమైన రోజు, ఎందుకంటే ఈ ఆదివారంతో పా...