22, జనవరి 2022, శనివారం

మూడవ సామాన్య ఆదివారం

 మూడవ సామాన్య ఆదివారం 

నెహెమ్యా  8:2-4,5-6,8-10 1 కోరింథీ 12:12-30 లూకా 1:1-4,4:14-21 

నేటి దివ్య పఠనాలు  దేవుని  యొక్క వాక్కు వినేటటువంటి  ప్రజలు ఎలాంటి జీవితం జీవించాలి అనే అంశం గురించి తెలుపుతున్నాయి.  దేవుని యొక్క వాక్కు యొక్క గొప్పతనం  శక్తిని  గ్రహించి దేవుని ప్రజలు ఐక్యత, సక్యత  కలిగి  జీవిస్తూ దేవున్ని అంటి పెట్టుకొని  జీవిస్తూ  దేవుని సేవ చేయాలని కూడా  ఈనాటి పఠనాలు  మనకు తెలుపుచున్నాయి. 

ఈనాటి  మొదటి పఠనంలో  దేవుని వాక్కు యొక్క గొప్పతనం గురించి చదువుకుంటున్నాము. మొదటి పఠనం యొక్క చరిత్ర మనం గ్రహిస్తే, ఆనాటి  పర్షియా రాజు కోరేషు బాబిలోనియా ప్రజలను  జయించిన తరువాత బానిసత్వంలో  దాదాపు 70 సంవత్సరాలు గడిపిన యూదులను  వారి సొంత భూమి అయిన యెరుషలేముకు పంపించారు. 

తిరిగి వచ్చిన యూదులు యెరుషలేము  దేవాలయంణు పునర్నిమించారు. ఎజ్రా 6:15-17 అదే విధంగా ఆ పట్టనపు గొడలు కూడా కట్టడం ముగించిన  పిదప  దేవుని యొక్క వాక్యం చదువుచున్నారు.  దేవుని యొక్క వాక్యం చదువుచున్నారు. దేవుని యొక్క వాక్యం చదివినది ఎజ్రా. ఆయన  ధర్మ శాస్త్ర భోధకుడు , యాజకుడు అదే విధంగా  మత సంబంధిత నాయకుడు (నెహెమ్యా 8:9)

అదేవిధంగా నెహెమ్యా  రాష్ట్ర పాలకుడు  దేవునితో మంచి  అనుభందం  కలిగిన వ్యక్తి, దైవ భయం  వున్న వ్యక్తి ,దేవుడు ఎజ్రాకు  మరియు నెహెమ్యాకు  ఒక ముఖ్యమైన బాధ్యతను అప్పజెప్పారు. ఆదేమిటంటె  దేవుని యొక్క  వాక్కును ప్రకటించుట, ప్రకటించుట మాత్రమే కాదు ప్రజలను ప్రేరేపించాలి. 

ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు  విషయాలు గుర్తు పెట్టుకోవాలి. దేవుని వాక్కు మనం ప్రకటించాలి, ఇతరులను దైవ వాక్కుతో ప్రేరేపించాలి. ఈ మొదటి పఠనంలో యిస్రాయేలు  ప్రజలు దేవుని యొక్క వాక్కును వినుటకు కనబరిచిన ఆసక్తి గొప్పది. 

దేవుని యొక్క వాక్కు వినాలని ఎంతో ఆశతో వున్నారు. దేవుని యొక్క వాక్కు దేవునితో సమానమని భావించారు. బానిసత్వంలో  బహిరంగంగా దేవుని వాక్కు ఆలకించే  అవకాశం లేదు అందుకే ఇప్పుడు  దొరికిన  అవకాశంను  బట్టి వారు ఆ వాక్కుకై తయారై వున్నారు. ఎజ్రా దేవుని వాక్కు చదివినప్పుడు ఉదయం నుండి  మధ్యాహ్నం వరకు అందరుకూడా సావదానంగా విన్నారు. వారు విసుగు చెందక, అలసట పొందకు  అదే పనిగా ఎలాగా  వినగలిగారు. అంటే ఆ వాక్కులు  ఆ ప్రజలకు వినసొంపుగా వున్నాయి.  ఆ వాక్కు వల్ల  దేవుని తెలుసుకోవచ్చు అం గ్రహించారు. కీర్తన 119:103 

ఆ వాక్యములు  వారికి  వెలుగును , చూపేలా ఉన్నాయి. అందుకే వాటిని వినడానికి చాలా ఇష్టపడుతున్నారు. దేవుని వాక్కు  యొక్క  ఔనత్యాన్ని తెలుసుకున్నారు. అందుకే  ఎటువంటి  ఇబ్బంది లేకుండా విన్నారు. వారి యొక్క  ఆధ్యాత్మిక జీవితంకు  దైవ వాక్కే ఆహారం. దేవుని యొక్క వాక్కు  సృష్టించే వాక్కు అని. దేవుని యొక్క వాక్కు  ఆదరించే  వాక్కు అని ,దేవుని యొక్క వాక్కు నేర్పించే వాక్కు అని , దేవుని యొక్క వాక్కు పుట్టించే వాక్కు అని , దేవుని యొక్క వాక్కు స్వస్థత నిచ్చే వాక్కు అని వారు గ్రహించారు.

మనం దేవుని  వాక్కుకు  ఎంత ప్రాముఖ్యతనిస్తున్నాం? దేవుని యొక్క వాక్కును ఆలకించడానికి చదవడానికి  ఎంత మందికి ఆసక్తి ఉంది.  యూదుల కాలంలో అందరి దగ్గర దేవుడు మోషే ద్వార ఇచ్చిన  ధర్మ శాస్త్రం  లేదు అయినప్పటికీ అయినప్పటికీ అవకాశం ఉన్న చోటల్లా దేవుని వాక్కు వింటున్నారు. మనందరికీ  ఇప్పుడు బైబుల్  గ్రంధం ఉంది. ఎంత మంది  చదువుతున్నారు? చదువు లేకపోయినా చదువుకున్న బిడ్డల దగ్గర ఎంతమంది చదివించుకొని వింటున్నారు. 

గుడికి వచ్చినప్పుడు యాజకులు బైబుల్ గ్రంధం మొత్తం  వివరించలేరు ప్రసంగంలో , అందుకే  దేవున్ని  తెలుసుకోవాలంటే మన జీవితాలు సన్మార్గంలో నడిపించు కోవాలంటే మనం దేవుని వాక్కు చదవాలి, వినాలి. 

చదివితే మరియు వింటేనే మనలో విశ్వాసం పెరుగుతుంది. రోమి 10:17. ఆనాటి యూదా ప్రజలు సమయం గురించి ఆలోచించలేదు. దేవుని వాక్కు గురించి మాత్రమే  ఆలోచించారు. మనం కూడా పవిత్ర గ్రంధం చదువుట ద్వారా దేవుని ప్రేమ, క్షమా, త్యాగం చాల విషయాలు నేర్చుకోవచ్చు.

అలంటి ఆసక్తి మనలో ఉందా?

2. రెండవది గా దేవుని ధర్మ శాస్త్రమునకు ఇచ్చిన గౌరవం అందరం ధ్యానించుకోవాలి.

నెహెమ్యా 8: 5-6  ఎప్పుడైతే ఏజ్రా గ్రంధమును విప్పారో అప్పుడు అందరుకూడా లేచి నిలబడ్డారు, దేవుణ్ణి స్తుతించి అదేవిధంగా ఆ ప్రభువుని ఆరాధించారు.

- ఆ గ్రంధం గురించి వారికి తెలుసు కాబట్టియే ఆ పుస్తకం కు అంత ప్రాధాన్యత ఇచ్చారు.

-మరి ఈ రోజు మనం పవిత్ర గ్రంథం ను ఎలాంటి స్థలాల్లో ఉంచుతున్నాం?

-కొంతమంది ఎక్కడెక్కడో పెడతారో. అది కాదు మనం చేయాల్సింది, ఆ గ్రంధం దేవుడే కాబట్టి మనం మంచి స్థలం ఇవ్వాలి.

- విలువ గ్రహిస్తే ప్రాధాన్యత ఇస్తాం. ఇశ్రాయేలు ప్రజలు గ్రహించారు కాబట్టియే  అది చేయగలిగారు.

-చర్చిలో నిలబడ్డ సమయంలో కొన్నిసార్లు బైబిలు మన కాళ్ళ దగ్గరఉంటుంది. అది కూడా మనం పట్టుకొని నిలబడితే అప్పుడు ఆ వాక్కు కు మనం గౌరవం ఇచ్చినట్లు అవుతుంది.

- ప్రతి ఒక్కరు పవిత్ర గ్రంధమును దేవాలయానికి తీసుకురావాలి.

-దేవునియొక్క వాక్కును చదివిననప్పుడు వారియొక్క హృదయాలు చలించి పోయాయి. అందుకే దుఃఖం పట్టలేక ఏడ్చిరి . నెహెమ్యా 8:9

- దేవుని ఆజ్ఞలు మీరు జీవించినందుకు ఏడ్చి ఉండవచ్చును.

- వారు బోరున ఏడ్చారు. దేవుని వాక్కును విన్న సమయంలో దేవుడి ప్రేమ వారికి గుర్తుకు వచ్చింది.

-దేవుడు వారిని ఒక కాపరిగా, తండ్రిగా నడిపించిన విధానం గుర్తుకు వచ్చింది.

-వారికి బానిసత్వం వచ్చింది ఆయన యొక్క వాక్కును ధిక్కరించడం వల్లే అని గ్రహించి ఉండవచ్చును.

- వారికి ఇచ్చిన మన్నా, పూరేడు పిట్టలు, సమృద్ధిగా స్వేచ్ఛ జీవితం గుర్తుకు వచ్చింది.

- వారు దైవమును కాదని అన్య దైవములను ఆరాధించిన పాపపు జీవితం గుర్తుకు వచ్చింది.

-దేవుని యొక్క వాక్కు వారి జీవితాలకు అన్వయించారు కాబట్టియే వారియొక్క బలహీనతలు, పాపపు మచ్చలు గుర్తుకు వచ్చాయి.

మనం కూడా దేవుని వాక్కును మన జీవితాలకు అన్వయించుకుంటేనే  మనలో కూడా హృదయ పరివర్తనం అనేది కలుగుతుంది.

- కొన్నిసార్లు మనం కొంతమందిని చూస్తాం ప్రసంగం చెప్పేటప్పుడు ఏడుస్తారు ఎందుకంటే ఆ వాక్యం వారిని తాకింది.

అదేవిధంగా వారియొక్క పాపపు జీవితం గుర్తుకు వచ్చినప్పుడు, ఏడుస్తారు.

-పాపపు జీవితం ద్వారా, స్వార్ధపు జీవితం ద్వారా ఇతరులను దేవుడిని బాధ పెట్టిన సమయాల గురించి వాక్యంతో భోదించినప్పుడు సాధారణంగా అందరూ ఏడుస్తారు. మనం కూడా ప్రభువు యొక్క వాక్కు విన్న సమయంలో భాద కలిగి మార్పు కలగాలి.

1.సౌలు విన్నాడు హృదయ పరివర్తనం చెందాడు. (పౌలు)

2.దావీదు నాతాను ప్రవక్త యొక్క దైవ వాక్కులు విన్నాడు పశ్చాత్తాప పడ్డారు.

3.నినెవె  పట్టణ  వాసులు విన్నారు దుఃఖం తో జీవితాలు సరిచేసుకున్నారు

4.అగస్టీను దేవుని యొక్క వాక్కు విన్నాడు -హృదయ పరివర్తనం చెందాడు. మనం కూడా  అలాగే  మన జీవితాలు మార్చుకోవాలి.

-వాక్యం చదవటానికి, వినటానికి సమయం కేటాయించాలి. అప్పుడే దేవుని గురించి తెలుసుకొని జీవిస్తాము.

-దేవుని వాక్కు చదివితే ఆ వాక్యమే మనలను నడిపిస్తుంది, ప్రేరేపిస్తుంది. మనం ఎలా జీవించాలి అని తెలుపుతుంది.

- దేవుని యొక్క వాక్కు లేని లోపం వారు తెలుసుకున్నారు. అందుకే ఎంత సమయమైనా కాని పట్టించుకోకుండా శ్రద్ధగా విన్నారు, ప్రభువునందు ఆనందించారు. అలాంటి విశ్వాసం, ఆశ మనలో కూడా ఉండాలి.

రెండవ పఠనంలో

దేవుని బిడ్డలు, దేవుని వాక్కు వినేవారు చదివేవారు జీవించవలసిన విధానం గురించి పౌలుగారు తెలుపుచున్నారు.

-కొరింతు ప్రాంతంలో భిన్నమైన ప్రజలు జీవిస్తుండేవారు వారిలో బేధాభిప్రాయాలు ఎక్కువగానే ఉండేయి. ఐతే పౌలు గారు వారందరు కూడా ఐక్యంగా కలిసి జీవించుటకు శరీరం మరియు దానిలో వున్నా అవయవములు ఉదాహరణ తీసుకొని ఐక్యతను గురించి తెలుపుచున్నారు.

-జ్ఞానస్నానం పొందిన ప్రతి యొక్క విశ్వాసి దేవుని యొక్క పవిత్రమైన శరీరంలో భాగమే.

- జ్ఞాన స్నానం స్వీకరించుటకు ముందు మనలో ఎన్నోరకాలైన భావాలూ భేదాలు ఉన్నప్పటికీ వాటన్నింటిని జ్ఞానస్నానం పొందిన తరువాత విడిచిపెట్టాలి అని పౌలుగారు వివరిస్తున్నారు. (1కొరింతి12: 12-13 )

-మన శరీరంలో వున్న ప్రతియొక్క అవయవం ముఖ్యమైనది ఒక్కొక్క దానికి ఒక్కొక్క పని ఉంటుంది. కొన్ని అవయవాలు పెద్దవి అయివుండవచ్చును కొన్ని చిన్నవి అయి ఉండవచ్చు, అయినప్పటికీ దేని ప్రాముఖ్యత దానికి ఉంది.

-కాబట్టి ఒక్క అవయవం ఇంకొక్క దానికి సహకరిస్తూ జీవిస్తే అక్కడ మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది.

-మన శరీరంలో ఉన్న ప్రతి అవయవం పనిచేస్తేనే మనందరం బాగుంటాం. ఏది బాగా లేకపోయినా మనం సంతోషం గా ఉండలేము. అలాగే మనందరం కూడా దేవుని శరీరంలో  భాగస్తులం మరి మనం కూడా ఐక్యంగా జీవించాలి.

చేయి నోటికి సహకరించకపోతే మనం తినలేం

-కన్ను కాలికి సహకరించకపోతే మనం నడవలేం

-నోరు చెవులకు సహకరించకపోతే మనం వినలేం.

అందుకే ప్రతి ఒక్క అవయవం అవసరం, ప్రతి అవయవం శరీర అభివృద్ధి కోసం, మానసిక, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సహాయపడాలి.

-ప్రతి ఒక్క వ్యక్తి తాను శ్రీసభ (శరీరం) కోసం తన వంతు తాను కష్టపడాలి. అప్పుడే శ్రీసభ  ఆనందంగా ఉంటుంది.

- శ్రీ సభ శిరస్సు క్రీస్తుప్రభువే ఆయన లేకుండా మనం లేము. కాబట్టి ఆ శరీరం గొప్పతనం గ్రహించి , సహకరించి జీవించాలి.

-మనందరం కూడా ఐక్యత కలిగి జీవించాలి. పౌలుగారు అంటారు జ్ఞానస్నానం పొందినవారందరు దేవుని బిడ్డలే అందుకే వారు ఐక్యంగా జీవించాలి.

-సాధారణంగా సమాజంలో మనం చుస్తే ఇంకా చాలామందికి జాతి, మత, కుల భేదాభి ప్రాయాలు వున్నాయి. బహుశా ఇంకా వారిని దేవుని యొక్క వాక్కు తాకలేదు.

-స్వయంగా యేసు ప్రభువే తనను తాను తగ్గించుకొని పాపులతో, సుంకరులతో కలిసి జీవించారు.

-పౌలు పరిసయ్యుడు అయినప్పటికీ అన్యులకు సేవచేసారు. ఆయన్ను దేవుని వాక్కు మార్చింది.

-దేవుని వాక్కు అతనికి వివేకాన్ని అందించింది అందుకే భేదాభి ప్రాయాలు లేకుండా జీవించారు.

-మనం దేవుని బిడ్డలం, ఆయన మన తండ్రి మనందరం ఒకే కుటుంబంలో ని బిడ్డలం కాబట్టి అందరితో కలిసి మెలసి ఐక్యంగా జీవించాలి.

-శ్రీ సభ అభివృద్ధి కోసం సహాయపడాలి. అందరుకూడా విలువైన వారే ధనిక -పేద వ్యత్యాసం లేకుండా .

-మనందరం దేవుని వాక్కు చదివి, ధ్యానించి ఆ వాక్కు అనుసారం జీవించాలి, ఎలాంటి భేదాలు మనలో వుండవు. వాక్యమును చదువుకొని జీవించుద్దాం, ఐక్యంగా కృషిచేద్దాం.

-ఈనాటి సువిశేష పఠనంలో యేసు క్రీస్తు ప్రభువు యొక్క పంపబడిన విధానం తెలుసుకుందాం.

-ప్రభువు ఎందుకు ఈ లోకానికి పంపించబడ్డారు అని తెలుపుచున్నారు.

సువార్త ప్రారంభంలో లూకా గారు ఈ సువార్త తెయోఫిలుకు వ్రాస్తున్నారు. అదేవిధంగా అందరి విశ్వాసుల కోసం వ్రాస్తున్నారు.

-తెయోఫిలు బహుశా నీటి గలిగిన వ్యక్తి అయి ఉండవచ్చు, మంచి పేరు కలిగిన వ్యక్తి కావచ్చు, లేకపోతే దేవుణ్ణి తెలుసుకోవాలి అనే ఆసక్తి కలిగి లూకా గారిని యేసు ప్రభువు గురించి వ్రాయమని అడిగివుండవచు.

-బహుశా దేవునియందు విశ్వాసం ఉంచి క్రొత్తగా జ్ఞానస్నానం పొందిన వ్యక్తి అయి ఉండవచ్చు.

-తెయోఫిలు అంటే (a friend of God) దేవునికి స్నేహితుడు, దేవుణ్ణి ప్రేమించువాడు అని అర్థం.

-దేవుణ్ణి ప్రేమించు ప్రతిఒక్కరికి లూకా గారు ఈ సువార్తను వ్రాస్తున్నారు.

-వారియొక్క విశ్వాసంలో దృడంగా ఉండటానికి ఈ విధంగా వ్రాస్తున్నారు.

-సువార్తలో మనం వింటున్నాం లూకా 4:14-15 యేసు ప్రభువు చేసినా సువార్త పరిచర్య గురించి

-ఆయన కేవలం ప్రార్థించుటకు మాత్రమే కాకుండా వీలైన ప్రతి సమయంలో వాక్యాన్ని ప్రకటిస్తున్నారు.

-ప్రకటించిన వాక్యంకు ప్రతి ఫలం ఉండాలి. యేసుప్రభువు తండ్రి గురించి సువార్తలో తెలిపారు. ఆయన యొక్క జీవిత లక్ష్యం, ప్రణాళిక తెలిపారు.

-ప్రభువు ప్రతి ప్రాంతమునకు వెళ్ళేది అందరూ కూడా దేవున్ని తెలుసుకొని, హృదయ పరివర్తనం చెంది, రక్షణ పొందాలి అనే ఉద్దేశంతోనే.

యేసు ప్రభువు చదివిన మాటలు యెషయా 61:1-2 నుండి తీసుకొనబడినవి.

- ఈ మాటలు మోషే ఎన్నికకు దగ్గరగా వున్నాయి. నిర్గమ 3:7-10 మోషేను ఎందుకు ప్రభువు ఎన్నుకున్నారు అని తెలుపుచున్నారు.

-18 వచనం ద్వారా దేవుని ఎన్నిక దేని నిమిత్తం అని అర్థమవుతున్నది.

1. దేవుని  ఆత్మ  ఆయన పై ఉన్నది.

2. పేదలకు సువార్తను భోధించుటకు అభిషేకించారు.

3. చెరలో వున్న వారికి విడుదలను దయచేయుటకు.

4. గ్రుడ్డివారికి చూపును నిచ్చుటకును

5. పీడితులకు విమోచనం కలిగించుటకును

6. ప్రభు హిత సంవత్సరమును ప్రకటించుటకు ఆయన్ను అభిషేకించారు.

-దేవుని కార్యముల కోసం, సువార్త వ్యాప్తి కోసం మూడు రకాల ప్రజలు అభిషేకించబడ్డారు.

1.రాజులు

2.యాజకులు

3.ప్రవక్తలు

1.సమువేలు సౌలును, దావీదును రాజులుగా అభిషేకిస్తున్నారు. దేవుని యొక్క ప్రతినిధులు వుంది దేవుని కార్యములు నెరవేరుచుటకు.

2. యాజకులు ప్రతి ఒక్క యాజకున్ని దేవుడు అభిషేకిస్తారు దేవుని యొక్క యాజకులు ఆరోను దేవుని యొక్క యాజకులు ఆరోను అతని కుమారులు దేవుని సేవకోసం ప్రత్యేకంగా కేటాయించబడిన వారు - 2 రాజులు 29, 30 అధ్యాయాల్లో చెప్పబడినవి.

3. ప్రవక్తలు - దేవుడే  వారికి స్వయంగా పిలుపునిస్తున్నారు. దేవునికి మానవులకు మధ్యవర్తులుగా ఉండటానికి దేవుడు ఏలియాతో ఏలిషాను అభిషేకించడానికి చెప్పారు. 1 రాజులు 19:16-19 వీరందరూ దేవుని యొక్క పనికోశం అభిషేకించబడిన వారే, వారికి అధికారం , శక్తి, ఆత్మ వరములు ఇవ్వబడ్డాయి. కాబట్టి వారు చేసే సువార్త  అంగీకరించి  జీవించాలి. 

1. దేవుని ఆత్మ అభిషేకించబడిన వారి మీద ఉన్నది. దేవుని ఆత్మచె వారు నడిపించబడాలి. యేసు ప్రభువు నాపై ప్రభుని  ఆత్మ ఉన్నది అని పలికారు. ఆ ఆత్మ శక్తిచే శోదనలు  జయించారు, ఆత్మ శక్తిచే  సువార్తను ప్రకటించారు. కష్టలు ఓదార్చుకున్నారు. దేవుని ఆత్మ  తనను పరిచర్యకు సంపూర్ణంగా సిద్దం చేసింది. 

దేవుడు తాను పిలిచిన వారిని బలపరుస్తారు. దేవుని యొక్క ఆత్మ వారిని నడిపిస్తుంది. 

2. పేదలకు సువార్తను భోధించారు. పేదలు అనగా లేని వారు. దేవుని గురించి అవగాహన లేనివారు. దైవ ప్రేమ లేని వారు, దేవుని సుగుణాలు లేని వారు ,దేవుని యొక్క ఆత్మ లేనివారు, దేవుని యొక్క మంచి తనం, గొప్పతనం తెలియని వారికి సువార్తను ప్రకటించుటకు యేసు ప్రభువును తండ్రి దేవుడు అభిషేకించారు. గురువులను కూడా అందుకే  అభిషేకించారు. 

3. చెరసాలలో ఉన్న వారికి విడుదల దయచేయుటకు ఈ లోక ఆశతో , వ్యామోహంతో బంధీలుగా ఉన్నవారిని పాప సంకీర్తనల ద్వారా విడుదల దయ చేయుటకు దేవుని యొక్క పరిశుద్ద వాక్కు ద్వారా విడుదల దయ చేయుటకు ఎన్నుకొనబడ్డారు. 

4. గ్రుడ్డి వారికి చూపు నిచ్చుటకు 

ఎవరైతే దేవుని యొక్క కార్యాలు చూడలేక పోతున్నారు. దేవున్ని తమ జీవితంలో గుర్తించలేక పోతున్నారు. ఎదుటి  వారిలో ఉన్న  ప్రేమను చూడలేని గ్రుడ్డి వారు కొంతమంది కనులుండి గ్రుడ్డి వారిగా ఉండే వాళ్ళు ఉన్నారు. వారు అనుకున్నదే సత్యం అనుకుంటారు అట్టి వారికి దేవుడు మాత్రమే చూపు నివ్వగలరు. 

కొందరికి దేవుడు ఆధ్యాత్మిక చూపు దయ చేస్తారు. 

5.  పిడితులకు  -విమోచనం -ఎవరైతే శారీరకంగా , మానసికంగా ,ఆధ్యాత్మికంగా పీడించబడుతున్నారో అలాగే దయాల చేత పీడించబడేవారికి ,విమోచనం కలిగిస్తారు. మానసిక గాయాలవల్ల పీడించబడే వారు , అణచి వేయబడినవారు , ఎదుటి వారి పట్ల హర్ట్ అయినవారికి  విమోచనం కలుగ చేయుటకు పంపించబడ్డారు. 

6.దేవుని సంవత్సరం ప్రకటించుటకు - దేవుని యొక్క రక్షణ సంవత్సరం అని అర్ధం లేక మెస్సీయ్య యొక్క రాక అని అర్ధం. దేవుడు వారి మధ్యలో ఉన్నారు, అని తెలిపే సంవత్సరం అది. కాబట్టి మనందరం కూడా  దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి, అనుసరించి ఆ వాక్కు చేత స్వతత్రం పొందుతు సన్మార్గంలో నడుస్తూ దేవునికి అంగీకార జీవితం జీవిద్దాం. సాధ్యమైనంత వరకు సువార్త వ్యాప్తి కోసం కృషి చేద్దాం, దేవుని రాజ్య స్థాపనకు కృషి చేద్దాం. 

REV.FR.BALAYESU OCD



15, జనవరి 2022, శనివారం

రెండవ సామాన్య ఆదివారం

రెండవ సామాన్య ఆదివారం 

 యోషయా 62:1-5,  1 కోరింథీ 12:4-11 యోహను 2:1-11 

ఈనాటి దివ్య పఠనాలు దేవునితో దేవునిలో  ఒక క్రొత్త జీవితం  జీవించాలి అనే అంశం గురించి  భోదిస్తున్నాయి. దేవుడు  మనలో ఉన్న  అలాగే మనం దేవునితో ఉన్న అప్పుడు  మన యొక్క జీవితంలో  నూతనత్వం కలిగి జీవించాలి. ఈనాటి మొదటి పఠనంలో  దేవుడు యిస్రాయేలు ప్రజలను  దీవించిన  విధానంను  అదే విధంగా వారి  పునరుద్దరణను గురించి తెలుపుతుంది. 

దేవునికి విరుద్దముగా పాపం  చేసినందువల్ల  యిస్రాయేలు ప్రజలు  బాబిలోనియాకు పంపబడ్డారు. అయితే దేవుడు వారిని అక్కడితో మరచి పోలేదు, విడిచి పెట్టలేదు. వారు క్రొత్త జీవితం జీవించడానికి మరలా పిలుస్తున్నారు. 

మొదటి పఠనంలో దేవునికి మరియు యిస్రాయేలు ప్రజలకు ఉన్న బంధం ఒక వివాహ బంధం వంటిదని తెలుపుచున్నారు. యోషయా 62:5 యిస్రాయేలును  వధువుగా సంభోధీంచుట ద్వార ఇక యిస్రాయేలు ఒంటరి కాదని, వదలివేయ బడదని , అలాగే చేయి విడచి పెట్టబడదని తెలుపుచున్నారు. 

ఒక వరుడు  ఏ విధంగా  తన యొక్క వధువు  పక్షమున నిలబడతాడో అదే విధంగా దేవుడు కూడా యెరుషలేము కొరకు నిలబడతాడు. ఇక వారిద్దరు  సంతోషముగా జీవిస్తారు. వారు జీవించబోయే  ఒక నూతన జీవితం పూర్తిగా  అది ఒక క్రొత్త అనుభందంతో  ముడివేయబడుతుంది. 

దేవుడు తనలో  ఉంటే  ఎంతో లాభం కలుగుతుంది. ఎందుకంటే యోషయా 62:1 చివరి భాగంలో ఆ నగరపు విజయము వేకువ  వెలుగు వలె ప్రకాశించును,  ఆ పట్టణ రక్షణము చీకటిలో దీపమువలే మెరయును. 

వారి జీవితంలో  ఎప్పుడు కూడా విజయము ఉంటుంది. ఈ వెలుగు సంతోషానికి గుర్తు, వారు ఎప్పుడుకూడా సంతోషముగా ఉంటారు. వారి జీవితం బానిసత్వం, అనే అంధకారం నుండి తొలగించ బడుతుంది. 

యెరుషలేము పట్టణం రక్షణము పొందును వారి యొక్క వెలుగు ఎప్పుడు ప్రకాశిస్తుంది. యిస్రాయేలు ప్రజలు దేవునితో ఒక క్రొత్త నిబంధనా జీవితాన్ని జీవించినప్పుడు వారిద్దరి మద్య అన్యోన్య ప్రేమ , విధేయత విశ్వాస పాత్రులుగా ఉంటారు. దేవుడు క్రొత్త  జీవితాన్ని ఒకరికి దయచేసినప్పుడల్లా వారి యొక్క పేరును కూడా మార్చుతున్నారు. ఉదాహరణకు అబ్రాముకు  అబ్రహము అని, యాకోబుకు యిస్రాయేలు అని , సీమోనుకు పేతరు అని మార్చుతున్నారు.  ఈ విధంగా దేవుడు క్రొత్త జీవితాన్ని యెరుషలేము ప్రజలకు దయచేస్తున్నారు. దానిని దాంపత్య బంధంతో పోల్చుతున్నారు. వారిరువురు కూడా ఇక ఒకే జీవితం పంచుకోబోతున్నారు. అది ప్రేమ జీవితం. 

యోషయా ప్రవక్త,  దేవుడు  ఎప్పుడు కూడా వారితో ఉంటారు అనే భరోసా ఇస్తున్నారు. దేవుడు ఎల్లప్పుడు యెరుషలేముకు  మంచిని చేస్తూ  విశ్వాస పాత్రుడైన వరుడుగానే ఉన్నారు. యిస్రాయేలు మాత్రం అవిధేయత వలన , అవిశ్వాసనీయత వలన దేవునికి దూరమయ్యారు, కాని మరలా దేవుడు తనను క్షమించి, అంగీకరించి ఒక క్రొత్త  జీవితానికి  ఆహ్వానిస్తున్నారు. 

వాస్తవానికి  వివాహ బంధంలో కూడా కొన్నిసార్లు  ఎవరైనా బలహీనతవలన తప్పు చేస్తే  క్షమించి అంగీకరించి ఒక క్రొత్త జీవితం జీవించాలే కాని ఒకరినొకరు నిందించుకోకూడదు. దేవుడు  యిస్రాయేలుతో మెలిగిన విధానం అలాంటిదే  ఆయన వారి బలహీనతను అర్ధం చేసుకున్నారు. పవిత్ర గ్రంధం  ఒక వివాహ బంధం ద్వారా ప్రారంభమౌతుంది. అదే విధంగా క్రీస్తు ప్రభువు జీవితం కూడా ఒక వివాహం తోనే  ప్రారంభమగుచున్నది. యేసు ప్రభువే స్వయంగా కానా పల్లెలో జరిగిన పెండ్లి లో వరుడు వధువును ఆశీర్వధించారు. 

రెండవ పఠనంలో పౌలు గారు  దేవుని యొక్క ఆత్మ వరములను గురించి  భోధిస్తున్నారు. దేవుడిచ్చిన వరాలు మనం ఇతరులతో పంచుకోవాలి. 

దేవుడు ప్రతి ఒక్కరికి దీవెనలు ఒసగివున్నారు ఆ  దీవెనలు అందరితో మనం పంచుకోవాలి, అని పౌలుగారు తెలియచేసారు. కృపా వరములు చాలా వున్నాయి కాని  వాటిని ఇచ్చేవాడు మాత్రము దేవుడు. ఈ కృపా వరముల యొక్క ఉద్దేశం ఒక్కటే అది  మంచి చేయడానికి. 

దేవుడు తన జీవితాన్ని మనకు ఇచ్చారు అంటే తన వద్ద ఉన్న కృపా వరములు అన్నీ మనతో పంచుకుంటున్నారు. అలాగే   దేవుడు ఉచితంగా ఇచ్చిన జీవితం మనం కూడా మంచిని చేయడానికి వినియోగించాలి. మన జీవితాలు అభివృద్ది చెందడానికి కారణం  దేవుడు అన్నీ ఇచ్చింది ఆయనయే. మనం ఈ లోకంలోకి వచ్చేటప్పుడు  ఏమి తీసుకొని రాలేదు. కాబట్టి మన జీవితంలో మనం ఏమి సంపాదించిన అది దేవుని వరమే. 

మనకు దేవుడు ఒసగిన ఆత్మ వరములు వివేకం, విజ్ఞానం , విశ్వాసం , స్వస్త పరచు శక్తి , అద్భుతాలు చేయు శక్తి, ప్రవచన శక్తి , ఆత్మలను వివరించు శక్తి, వివిధ బాషలలో మాట్లాడే శక్తి, బాషల అర్ధం వివరించే శక్తి . ఈ కృపా వరాలు అన్నీ స్వంత లాభం కొరకు కాకుండా ఇతరుల మేలు కొరకు ఉపయోగించాలి. 

ఆత్మ వరాలు పొందిన వారు , అవి తమ గొప్ప తనం వల్లనే లభించినవని గర్వించడానికి గాని , పొంగిపోవడానికి కానీ కాదు అహంకారంతో విర్ర వీగుతూవేరె  వారిని చిన్న చూపు చూడకూడదు. 

మన శరీరంలో గుచ్చ బడిన ముల్లు మనల్ని అది ప్రతిసారి  disturb చేస్తుంది , అది మనకు గుర్తు చేస్తుంది. అది మనకు గుర్తు చేసిన సమయంలో మన యొక్క బలహీనత మనకు గుర్తుకు రావాలి. మనం ఎన్ని గొప్ప కార్యాలు చేసినా , ఎంత మంచి చేసినకాని మనం గర్వంగా గొప్పలు చెప్పుకోకూడదు. ఎందుకంటే అది అంతా  దేవుని కృపా వరమే. 

దేవుని యొక్క కృప  మనతో ఉంటే చాలు ఆ కృప వలన మనం జీవించగలుగుతాం.  ఆ కృప వలన మంచి కార్యాలు చేయవచ్చు. మనం గుర్తు పెట్టుకోవలసిన విషయం ఏమిటంటే ఉదారంగా పొందినది , ఉదారంగా ఇస్తే మనం ఇంకా దీవించబడుతాం. చాలా సందర్భాలలో ఇవ్వడానికి మనం ముందుకు రాలేము. అదె విధంగా చాలా సందర్భాలలో మనం గొప్పలు చెప్పుకుంటాం. 

గొప్పలు చెప్పుకోవడం కొందరికి అలవాటు కాని పౌలు గారు గొప్పలు చెప్పుకొనవసరం లేదని తెలుపుచున్నారు. ఎందుకంటే మనలను గొప్ప వానిగా చేసింది దేవుడే కాబట్టి ఆయనను మనం పొగడాలి,  ఆ దేవుడిని ఘన పరచాలి, స్తుతించాలి.  

-ఈనాటి సువిశేషం లో యేసు ప్రభువు చేసిన మొట్ట మొదటి అద్భుతం గురించి చదువు చున్నాం.క్రీస్తు ప్రభువు తన దగ్గర వున్నా దివ్య వరములు తమ పొరుగువారితో పంచుకొనుటను తెలుసుకుంటున్నాం.

- తాను ఈ లోకంలోకి వచ్చింది తనకు వున్నది మనకు ఇవ్వటానికి,

-తన జీవం ఇచ్చారు

-తన ప్రేమనిచ్చారు

-తన సేవనిచ్చారు

-తన క్షమను ఇచ్చారు

-తన వరములు వారములు ఇచ్చారు.

-ఈ లోకంలో దేవుడు ఈ అద్భుతం ద్వారా తన కుమారుని ద్వారా మరలా సృష్టించే శక్తిని గురించి తెలుపుచున్నారు.ఆయనకు సృష్టించే శక్తి మరియు ఉత్పత్తి చేయగల శక్తి ఉంది. కానా పల్లెలో జరిగిన ఆ పెండ్లి యొక్క విధానం మనం తెలుసుకోవాలి.ఆ పెండ్లి ప్రతి ఒక్కరి కుడా కుడా ఆనంద దాయకమైనది. అందరూ కూడా సంతోషంగా  ఉంటారు.యూదుల ఆచారం ప్రకారం జరిగే పెండ్లి దాదాపుగా వారం ఉంటుంది. అక్కడ వారికి కావలసిన దంతా పెండ్లి వారే చూసుకోవాలి. ఈనాటి సువిశేషంలో విన్న అంశం, వారి పెండ్లి జరుగుతున్నప్పుడు ద్రాక్షా రసము తక్కువగా వున్నది అని.

- ఈ పెండ్లికి యేసు ప్రభువు, తల్లి మరియమ్మగారు ఆహ్వానించబడ్డారు. వారితో పాటు ఆంద్రెయ, పేతురు , యోహాను, యాకోబు, ఫిలిప్పు, బర్తలోమియా(నతానియేలు )  కూడా  వివాహ వేడుకలో పాల్గొన్నారని ఒక (Coptic Gospel )లో చెప్పబడింది .ఆ యొక్క సువిశేష ఆదారంగా చెప్పబడే అంశం ఏమిటంటే వరుడు మరియమ్మగారి చుట్టం. వరుడు పేరు "సీమోను" కానాకు చెందిన సీమోను.అతడు యాకోబు, యుదాల యొక్క సోదరుడు. అలాగే మరియమ్మ గారి అక్క  యొక్క కుమారుడు అందుకే బహుశా మరియమ్మ గారు ఎక్కువగా ఆసక్తి తీసుకొని ఆమె యే అంతా నడిపిస్తున్నారు. ఇది ఒక విధమైన భావన.

-ఇంకొక విధంగా ఆలోచిస్తే యేసుప్రభువు మొట్ట మొదటిగా తనయొక్క మహిమను వ్యక్త పరుస్తున్నారు.

-మరియమ్మ గారి ద్వారా ఈలోకంలోకి వచ్చిన యేసు ప్రభువు మళ్ళీ అదే తల్లి యొక్క మధ్య వర్తిత్వం ద్వారా సహాయం చేస్తున్నారు, అద్భుతం చేస్తున్నారు. వివాహం లో ఎందరో ఉన్నప్పటికీ అక్కడ అవసరం గుర్తించింది, తల్లియే గుర్తించటం మాత్రమే కాదు, ఆ అసమానత కొరతను, అవసరతను తీసివేయమని తన కుమారున్ని వేడుకొంది. మరియమ్మ గారు తాను విశ్వసించింది, తన కుమారుడు వారిని నిందలనుండి మరియు అక్కడున్న అవసరతనుండి రక్షిస్తాడు, వారిని ఆనందంగా ఉంచుతాడు అని ఆ తల్లి విశ్వసించినది   కాబట్టే  మొదటిగా  ఆయన దగ్గరకు  వెల్లింది. వేరే వాళ్ళ దగ్గరకు  వెళ్లి  ద్రాక్షా  రసము  కొనమని  చెప్పలేదు కానీ  తన కుమారుని  అడిగింది. మన  జీవితంలో  అవసరాలు  వున్నప్పుడుఎదో   కావాలి  అని అన్నప్పుడు  మనం మొదటిగా  దేవుని  దగ్గరకు  రావాలి.

-దేవుడే అన్నారు యిర్మీయా 17: 7 - తన మీద ఆధార పడితే దీవిస్తానని.

-అడగండి ఇస్తాను అన్నారు - మత్తయి 7: 7

-సమస్యలలో వుంటే తన చెంతకు రమ్మన్నారు- మత్తయి 11: 28

మనం   మాత్రం  బంధువుల  దగ్గరకు  ధనవంతుల దగ్గరకు  ఇంకా  వేరే  వాళ్ళ  చెంతకు  వెళతాం  కానీ  మరియ  తల్లి  తన  దేవుడైన  తన  కుమారుని  చెంతకు  వెల్లింది . అది  ఆమె  యొక్క  విశ్వాసం , నమ్మకం,  గొప్పతనం , వినయం. పాలస్తీనాలో    పెండ్లి జరిగేటప్పుడు ద్రాక్షా రసము చాలా అవసరం. నీటిని చాలా తక్కువగా అవసరమైతేనే వాడేవారు. ఎందుకంటే మధ్య తూర్పు ప్రాంతాలలో అంత మంచి నీరు దొరకదు. అందుకనే నీటికి బదులుగా ద్రాక్షా రసమును ఎక్కువగా వాడేవారు.

ఒక వేళా ఈ వివాహంలో ద్రాక్షా రసము లేకపోతే వారు సంతోషంగా వుండే వారు కాదు. వారు నిందలు, అవమానాలు భరించవలసి వచ్చేది, కానీ దేవునియొక్క సాన్నిధ్యం ద్వారా అలాగే మరియతల్లి యొక్క మధ్య వర్తిత్వం ద్వారా అవేమి జరగకుండా వారు సంతోషంగా వివాహమును కొనసాగించారు. మరియ తల్లి ఎప్పుడు కూడా మనకు సహాయం చేస్తూనే వుంటారు.యేసు క్రీస్తు అద్భుతం చేయకముందు ఆమె పలికిన మాటలు " ఆయన చెప్పినట్లు చేయుడు"వాస్తవానికి ఆయన చెప్పినట్లు చేస్తే మన అందరం కూడా సంతోషంగా ఉంటాం.

-ఆయన చెప్పినట్లు - పొరుగు వారిని ప్రేమించాలి, క్షమించాలి, సహించాలి, విధేయత కలిగి ఉండాలి, హృదయ పరివర్తన చెందాలి, దైవభయం కలిగి ఉండాలి.

-మరియ తల్లి మనతో వుంటే మనకు మేలు కలుగుతుంది. ఎందుకంటే ఆమె మన అవసరతలను గ్రహిస్తుంది. ఆమె మన కొరకు తన కుమారున్ని ప్రార్థిస్తుంది., మనకు సహాయం చేస్తుంది.

-నిందలు, అవమానాలు, సమస్యల్లో మనకు ఆదరువుగా ఉంటుంది.

-నీటిని ద్రాక్షా రసముగా మార్చుతాడని తల్లి ముందే గ్రహించింది. యేసు ప్రభువు వారు తన యొక్క సమయం రాకున్నా కానీ తల్లి అడిగినది కాబట్టియే అద్భుతం చేస్తున్నారు. అది ఆయనకు తన తల్లి మీద ఉన్న ప్రేమ, గౌరవం. దీని ద్వారా యేసు క్రీస్తు తన తల్లి అంటే తనకు చాలా ఇష్టం అని కూడా తెలుపుచున్నారు. తల్లి తన హృదయంకు  దగ్గరగా ఉన్నది కాబట్టియే ఆమె కొరకు అద్భుతం  చేస్తున్నారు. తల్లి అడిగితే కుమారుడు తప్పక దయచేస్తారన్నది మరియమ్మ గారి నమ్మకం.

-మనం కూడా మరియమ్మ గారిని యేసుప్రభువును మన ఇంటికి ఆహ్వానించాలి అప్పుడు మన కుటుంబాలు కూడా దీవించబడతాయి.

-మన జీవితాలు దేవుడికి సమర్పిస్తే అవి శ్రేష్ఠంగా దేవుడు చేస్తారు.

-పాత పాపపు జీవితం తీసివేసి క్రొత్త పవిత్ర జీవితం దయచేస్తారు.

- ఈ సువిశేషంలో సేవకులు విధేయత చూపారు, యేసు ప్రభువును నమ్మారు.

వాస్తవానికి ఈ సేవకులు విందు పెద్ద చెప్తేనే చేసేవారు కానీ ఎప్పుడైతే మరియమ్మ గారు ఆయన చెప్పినట్లు చేయమన్నారో వారు అలాగే చేశారు. అది వారియొక్క విధేయత  మరియు విశ్వాసం. దేవుడు మన కుటుంబంలో ఉంటే మనం దీవించ బడతాం. కాబ్బట్టి మరియమ్మ గారిని, యేసు ప్రభువుని మన గృహంలోకి ఆహ్వానించుకుందాం.

Rev. Fr. Bala Yesu OCD

8, జనవరి 2022, శనివారం

యేసు ప్రభువు బప్తిస్మము

యేసు ప్రభువు బప్తిస్మము

యెషయా 42 :1 -4  , 6 - 7 , అపో 10 : 34 - 38 , లూకా 1 :7 -11

ఈ నాడు మనం క్రీస్తు ప్రభుని యొక్క బప్తిస్మమును కొనియాడుచున్నాము. 

-ప్రభు బప్తిస్మమును తూర్పు చర్చీలలో (Eastern Churches) ఘనంగా కొనియాడుతారు. ఎందుకంటే పిత, పుత్ర, పవిత్రాత్మ మొట్ట మొదటిగా ప్రజలందరికి సాక్షాత్కరించిన ఒక గొప్ప సమయం. 

-యేసు ప్రభువు యొక్క జ్ఞాన స్నానము ప్రభువు యొక్క సువార్తకు ప్రారంభము. 

- జననస్నానము పొందినతరువాత ఆయన ఎడారికి వెళ్లి 40 రోజులు ఉపవాసం, ప్రార్థన చేస్తూ తండ్రియొక్క సమ్మతిని పొందిన తరువాత తన పరిచర్య సాగించారు.

- క్రిస్మస్ పండుగ దేవుడు తనకు తానుగా యూదులకు బయలుపరుచుకొన్న పండుగ.

-క్రీస్తు సాక్షాత్కార పండుగ, తన్ను తాను అన్యులకు బయలుపరుచుకొన్న పండుగ. 

-క్రీస్తు జ్ఞానస్నానం దేవుడు తాను పాపులకు బయలుపరుచుకొన్న పండుగ.  దీనితో క్రిస్మస్ కాలం ముగిస్తుంది.

యేసు దేవుని కుమారుడు, పాప రహితుడు, ఎలాంటి కళంకము లేనివారు, మరి అలాంటి వ్యక్తి ఎందుకు బప్తిస్మము పొందాలి?

-మనకు రక్షణ ఇవ్వడానికి ..

- అసలు బప్తిస్మము గురించి ఆలోచిస్తే వివిధ రకాల ఆలోచనలు మనకు మదిలోకి వస్తాయి. 

- యేసు ప్రభువుకాని లేక బాప్తిస్మ యోహాను గారు కానీ జ్ఞానస్నానము స్థాపించలేదు. 

- యూదా సాంప్రదాయంలో   చాల సంవత్సరాల నుండి ఇలా నీటిలో మునిగి పాప క్షమాపణ కోసం, హృదయ శుద్ధి పొందటానికి పశ్చాత్తాప పడటానికి ఒక నీటి మడుగును (మికవెహ్) (mikveh) పరిశుద్ధపరుచుకొనుటకు వాడే వారు. 

-మగవారు సబ్బాత్ సాయంకాలంలో స్నానం నీటి మడుగు వద్ద   ఆధ్యాత్మిక శుద్ధికోసం, పాప క్షమాపనకోసం చేసేవారు.

-ఆడవారు పాప క్షమాపన కోసం నెలకొకసారి మికవెహ్ (mikveh) అనే మడుగు వద్ద స్నానంచేసేవారు.

-అలాగే ఎవరైతే యూదా మతంలోకి రావాలనుకుంటున్నారో వారు కూడా ఇలాంటి స్నానం తప్పనిసరిగా చేయాలి.

“Mikveh water is used as a means of spiritual cleansing, to remove spiritual impurity and sin”.  

యేసు ప్రభువు ఎందుకు బప్తిస్మము పొందారు ?

ఒక సమాధానం ఏమిటంటే 

- యేసు ప్రభువు తన తల్లిని, బంధువులను సంతృప్తి పరచడానికి, బప్తిస్మ యోహాను నుండి జ్ఞానస్నానము పొందారు.

- ప్రభువు యొక్క జ్ఞానస్నానము తాను పొందబోయే సిలువ శ్రమలను అలాగే రక్తంతో పొందబోయే జ్ఞానస్నానమునకు సూచనగా ఉంది.

-యేసుప్రభువు పాప రహితుడు అయినప్పటికీ తాను అందరితో సమానం అని చెప్పుటకు పాపులతో కలిసి జ్ఞానస్నానం పొందారు. 

- యేసు ప్రభువు జ్ఞానస్నానం పొందినతరువాత తాను దేవుని కుమారుడని అంగీకార నిర్దారణ, పిత దేవుడు రుజువు చేస్తున్నారు. 

- ఇతడు నా ప్రియమైన కుమారుడు ఇతనియందు నేను ఆనందించుచున్నాను. అని తండ్రి దేవుడు పలుకుచున్నారు.

- ఆదాము చేసిన పాపం వల్ల, మూసి వేయబడిన పరలోకరాజ్యం మరల తెరువబడింది. క్రీస్తు ప్రభువు రక్షణ కార్యం ప్రారంబించినప్పుడు పిత, పవిత్రాత్మ, వారి సంతోషాన్ని, సమ్మతిని వెల్లడి చేస్తున్నారు.ఇదే మాటలు మనం కీర్తన 2 :  7 లో  అలాగే యెషయా  42: 1 లో వింటున్నాం.

-యేసు ప్రభువు యొక్క జ్ఞానస్నానం ద్వారా దేవుడు తన రక్షణ ప్రణాళికను ప్రారంబించారు.

జ్ఞానస్నానం పొందటం ద్వారా మనందరం దేవుని బిడ్డలమవుతున్నాం.

- జ్ఞానస్నానము అంటే హృదయ స్నానం చేయటం, స్నానం చేసిన తరువాత వ్యక్తి ఎలాగైతే శుభ్రంగా ఉంటాడో అలాగే జ్ఞానస్నానం పొందినతరువాత మనిషి యొక్క ఆత్మ కూడా శుద్ధిగా ఉంటుంది. 

- ఆ పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలన్న, రక్షణ పొందాలన్న, మిగతా దివ్య సంస్కారాలు స్వీకరించాలన్న, జ్ఞానస్నానం తప్పక అవసరం.

-పేతురు గారు (1 పేతురు 3: 21) రక్షించేది జ్ఞానస్నానం అని పలికారు.

యేసు ప్రభువు యొక్క జ్ఞానస్నానములో మూడు ముఖ్యమైన విషయములు.

1. తండ్రి యొక్క ఆమోదం: యేసుప్రభువు తన పరిచర్య ఆరంబించుటకు ముందు ఆమోదం పొందిన క్రియ జ్ఞానస్నానం.

2. పవిత్రాత్మ సహకారం: పవిత్రాత్మ దేవుడు యేసుప్రభువు యొక్క అన్ని క్రియలలో తోడుగా వున్నారని తెలిపే క్రియ బప్తిస్మం.

3. లోక పాపములను తన మీద వేసుకొని జీవించి, మరణించి, రక్షణ నిచ్చే వారు అని తెలియ చేసే క్రియ.

జ్ఞానస్నానం ద్వారా వచ్చే ప్రయోజనాలు 

1. దేవుని కుమారుని / కుమార్తె అంతస్తులో భాగస్తుల మవుతున్నాం. 

2. దైవ సేవలో భాగస్తులగు చున్నాం. (రాజుగా, ప్రవక్తగా, యాజకునిగా మనలను ఆశీర్వదిస్తున్నారు).

3. పవిత్రాత్మను పొందుతున్నాం. 

4. పవిత్ర పరచబడుతున్నాం. 

5. దేవునియొక్క శక్తిని, అనుగ్రహాలను పొందుతున్నాం.

జ్ఞానస్నానం ద్వారా కలిగే లాభాలు :

  1. రక్షణ - మార్కు 16:16

  2. నిర్మలమైన మనసాక్షిని ఇస్తుంది – 1 పేతురు 3:21

  3. క్రీస్తు మరణములో బాగస్తులమవుతాం - రోమియు 6:3

  4. పునరుతనంలో పాలు పంచుకుంటాం -  రోమియు 6: 4,5

  5. పాప క్షమాపణ కలుగుతుంది- అపో 2:38

  6.  క్రీస్తును ధరించి ఉంటావు – గలతి 3:27 

-జ్ఞానస్నానం దేవుడిచ్చిన ఆజ్ఞ -అపో 10: 44-48, మత్తయి 28:19-20.

-జ్ఞానస్నానం ద్వారా మనం నూతన సృష్టి గ మార్చబడుతున్నాం- 2 కొరింతి 5:17, యెషయా 3: 3, 5.

- మనం ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభించాలి. 

- యొర్దాను నదిలో యేసు ప్రభువు జ్ఞానస్నానము పొంది నీటిని పవిత్ర పరిచారు. ఆ నీటి తో ఇప్పుడు అందరూ కూడా రక్షించ  బడుతున్నారు, పాపక్షమాపణ గావించబడుతున్నారు.

1. నీరు జీవించుటకు అత్యవసరము అది లేకపోతె మరణిస్తాం. అలాగే జ్ఞానస్నానం లేకపోతే నిత్యా నరకాగ్నిలోకి పోతాం. 

2. నీరు శుద్ధి చేయు విధంగా జ్ఞానస్నానం మన పాపాలను శుద్ధిచేస్తుంది. 

3. బప్తిస్మం యేసు ప్రభువు యొక్క క్రొత్త జీవితానికి నాంది పలికిన విధంగా మనం కూడా క్రొత్త సువార్త పరిచర్య జీవితం ప్రారంభించాలి.

మనం వివిధ రకాలైన జ్ఞానస్నానాలు చూస్తున్నాం.

  1. పెళ్లిళ్ల జ్ఞానస్నానం - పెళ్లిళ్ల కోసమై తీసుకుంటారు.

  2. సర్టిఫీకేట్ జ్ఞానస్నానం - కాలేజ్ లో , స్కూల్ లలో స్తానం కోసం తీసుకుంటారు 

  3. జాబు జ్ఞానస్నానం - ఉద్యోగం కోసం జ్ఞానస్నానం తీసుకుంటారు. 

  4. స్వంత అవసరాలకోసం జ్ఞానస్నానం తీసుకుంటారు. 

5. పేరు జ్ఞానస్నానం - అంటే పేరు పెట్టినప్పుడు నచ్చకపోతే వేరే పేరుకు జ్ఞానస్నానం తీసుకుంటారు. 

- ఆనాడు యేసుప్రభువు జ్ఞానస్నానం పొందిన తరువాత తండ్రి, పవిత్రాత్మ దేవుడు సంతోషించారు. మరి ఈ రోజు మన జీవితాలు చుస్తే దేవుడు మన పట్ల సంతోషిస్తారా?

- యేసు ప్రభువు తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన విధంగా మనం దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నామా?

- యేసు ప్రభువు క్రొత్త సువార్త సేవ ప్రారంభించిన విధంగా మనం దేవుని యొక్క వాక్యాన్ని భోదిస్తున్నామా?

Rev. Fr. Bala Yesu OCD

31, డిసెంబర్ 2021, శుక్రవారం

నూతన సంవత్సరము

నూతన సంవత్సరము
                                                                               పఠనములు:సంఖ్యా:6 :22-27,   గల : 4;4-7,లూకా;2:16-21

         ఈనాడు మనమందరము నూతన సంవత్సరములోనికి అడుగెడుతున్నాము. ఈనాడు మనమందరము నూతన సంవత్సరములోనికి అడుగెడుతున్నాము. ఈ నూతన సంవత్సరములో మనము ఈలోకంలో జరుగు విపత్తులను చూచి భయపడనక్కరలేదు. నాజీవితములో ఏమిజరుగుతుందోఅని దిగులుచెందనక్కరలేదు.నేనిప్పడిదాకా పాపపుజీవితాన్ని జీవించాను అని కుమిలిపోనక్కరలేదు. కానీ దేవునియందు విశ్వాసము కలిగి జీవించు. దేవునియందు నమ్మకము కలిగి నాజీవితములో ఏమిజరిగినా అంతా దేవుడే చూసుకుంటాడని నీవు విశ్వసించినట్లయితే, నీవు ఈలోకంలో దేనికీ భయపడనక్కర లేదు. నీవు భయపడేది ఎవరికయ్యా అంటే, నిన్ను సృష్టించిన దేవునికి, నీకు రక్షణ నిచ్చిన దేవునికి.
      ఈనాడు మనమందరము మూడు పండుగలను జరుపుకొనుచున్నాము. అవి:1 .మరియమాత మాతృత్వ పండుగ.2 .యేసుప్రభువు యొక్క నామకరణ పండుగ.3 .నూతన సంవత్సరం.
      1. మరియమాత మాతృత్వ పండుగ:
            మరియ మాత యొక్క మాతృత్వపండుగను ఈలోక నలుమూలల ప్రతియొక్క కాథోలికుడు జరుపుకుంటారు.సాధారణముగా,కాథోలికులైన మనము మరియ మాత అనగానే,దేవునియొక్క తల్లి అని, నిష్కళంక మాత అని, దేవునియొక్క సంకల్పానికి తలయొగ్గి, విశ్వసించి,దానిని తన జీవితములో నెరవేర్చిన గొప్ప తల్లి అని మనందరికీ తెలిసిన విషయమే.అయితే ఈనాడు మనము ఎందుకు ఈ పండుగను జరుపుకొనుచున్నాము,దాని ప్రాముఖ్యత ఏమిటని తెలుసుకుందాము.
          పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజల జీవితములో మనము చూసినట్లయితే, ఫరోరాజు బానిసత్వములో పడి మ్రగ్గిపోతూ, కన్నీరు కారుస్తూ, ఇక దేవుడేమాకు దిక్కు అని ఆ దేవాతి దేవునికి మొరపెట్టినపుడు వారి గోడును ఆలకించి వారి రక్షణకు దాస్యవిముక్తికొరకు మోషే ప్రవక్తను ఎన్నుకొని అతని ద్వారా వారికి దాస్యవిముక్తిని కలుగజేస్తున్నాడు.
       నోవా కాలములో పాపము పండిపోయినది. దేవుని మరచిపోయి వారికి ఇష్టంవచ్చినట్లు జీవిస్తున్న సమయములో నోవాప్రవక్తను ఎన్నుకొని అతని ద్వారా రక్షణను కలుగజేయాలని తన సంతతినుండి ఒక నూతన జీవితాన్ని పునర్నిర్మిస్తున్నాడు.
         యాకోబు పనెండుమంది కుమారులలో చిన్న కుమారుడైనటువంటి ఏసోపును దేవుడు ఎన్నుకొని అతని ద్వారా వారికి దాస్యవిముక్తిని కలుగజేస్తున్నాడు.ఆహార కొరతను తొలగించి వారికి కావలిసిన సదుపాయాలను సమకూర్చి వారిని నూతన ప్రదేశమునకు తీసుకొనివెళ్ళి అక్కడ వారికి నివాస స్థలమును ఏర్పాటుచేస్తున్నారు. ఇలా ఎంతోమంది ప్రవక్తలు, న్యాయాధిపతులు, రాజుల ద్వారా దేవునియొక్క ప్రణాలికను నెరవేరుస్తున్నారు.
          మరి నూతన జీవితమునకు, రక్షణ ప్రణాళికకొరకు డేడు మరియమాతను ఎన్నుకొని ఆమె ద్వారా యేసుప్రభువును ఈలోకానికి పరిచయము చేసి అతని ద్వారా పాప ప్రక్షాళననూ, నూతన జీవితమును కలుగజేస్తున్నాడు.దీనిద్వారా అంధకారములోవున్న ప్రతియొక్క వ్యక్తి  నూతన వెలుగును చవిచూస్తున్నారు.
అయితే మరియమాత యేసుప్రభువు తల్లిగా దేవుని యొక్క ప్రణాళికతో గర్భము ధరించి మనందరికీ తల్లిగా మారింది. మరి ఆమె గర్భం ఈలోగా సంభందమైన గర్భం కాదు. కానీ పరలోక సంభందమైన గర్భం. ఎందుకంటే ఈలోకంలో గర్భం ధరించాలి అంటే, రెండుమనుషుల కలయికవల్ల కలుగుతుంది. కానీ మరియమాత మాత్రం ఇలాకాకుండా దేవునియొక్క సహకారముతో, దేవునియొక్క తోడ్పాటుతో ఈలోకంలోవున్న ప్రతిఒక్క ప్రజలకు దేవునియొక్క ప్రేమనూ, తనయొక్క స్నేహాన్ని తెలియజేయడానికి మనతోనివాసమును ఏర్పరచుకోవడానికి గర్భమనే ప్రధషయాన్ని ఎన్నుకొని మరియమాత ద్వారా ఈలోకములోకి అడుగెడుచున్నాడు.
     మరియమాత యొక్క గర్భంపవిత్రమైన గర్భం.
    మరియమాత యొక్క గర్భం సృష్టికర్తను మోసిన గర్భం.
    మరియమాత యొక్క గర్భం ఈలోకానికి ప్రేమను చవిచూపించిన గర్భం.
     మరియమాత యొక్క గర్భం రక్షణను తీసుకొనివచ్చిన గర్భం.
       మరియమాత యొక్క మాతృత్వానికి గల కారణాలు:
1 . ఇది దేవునియొక్క సంకల్పము:
        యెషయ ప్రవక్త ప్రవచనాల ద్వారా దేవుడు రానున్న ఇమ్మానుయేలుగురించి తెలియజేస్తున్నాడు.ఈ ఇమ్మానుయేలు ఒక యువతి గర్భంధరించడముద్వారా ఈలోకానికివస్తాడు. "యువతి గర్భవతియై ఉన్నది.ఆమె కుమారుని కానీ అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును" (యెష:7 :14 ) అని తెలియజేస్తున్నాడు. ఇది కేవలము దేవుని సంకల్పమే కానీ ఏ ఇతరమైన వ్యక్తులనుండికాదు. "ఇమ్మానుయేలు" అనగా దేవుడుమనతోవున్నదని అర్ధం. ఆదేవుడుమనతోవుంటే అన్నీ మనతోవున్నట్లే. అప్పడిదాకా దేవునియొక్క ఎడబాటును చూసిన వారు ఇప్పుడు అదేదేవుని ద్వారా ఆయనయొక్క స్నేహబంధాన్ని చూస్తారు. అందుకేఇది దేవుని ప్రణాళిక మరియు దేవునియొక్క సంకల్పము. యెష:27 :21 లో చూస్తే, "అదిగో! భూలోకవాసులు చేసిన పాపములను గాంచి వారిని దండించుటకుగాను,ప్రభువు తన నివాసము నుండి వేంచేయుచున్నాడు చూడుడు" అని పలుకుచున్నాడు.అయితే ఇప్పుడు అయన ఈలోకమునకు వచ్చేది ఖండించుటకుకాదు- ప్రేమించుటకు. శిక్షించుటకు కాదు-రక్షించుటకు. శపించుటకుకాదు-దీవించుటకు. యోహా:౩:17 -18  :"దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపనేకాని,దానిని ఖండించుటకు పంపలేదు.ఆయనను విశ్వసిన్హువాడు ఖండింపబడడు, విశ్వసింపనివాడు ఖండింపబడియె ఉన్నాడు.ఏలయన, దేవుని ఏకీక కుమారునినామమున అతడు విశ్వాసముంచలేదు". ఇది దేవునియొక్క సంకల్పము.
2. మరియ మాత అంగీకరణ:
        గాబ్రియేలు దేవదూత మరియమాతదగ్గరకువచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపుర్ణురాలా! నీకు శుభము.నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు.ఆ శిశువుకి యేసు అని పేరు పెట్టుము( లూకా :1 :28 , 31 )అని అన్నప్పుడు ఆమె దేవుని సంకల్పానికి తలవొగ్గి నీమాట చొప్పున నాకు జరుగునుగాక అని అంగీకరించింది (లూకా :1 :38 ). ఎప్పుడయితే మరియ మాత దేవుని యొక్క మాటను అంగీకరించిందో అప్పుడే ఈలోకంలో దేవునియొక్క రక్షణ ప్రణాళిక ప్రారంభమైనది. 
అయితే, ఆమె అంగీకారానికి గల కారణాలు:
   2 .1. మరియమాత యొక్క విశ్వాసము:
        పు.II జాన్ పౌలు పోపుగారు ఇలా అంటారు: "విశ్వసించు ప్రతి ఒక్కరికి మరియ మాత ఒక ఒక ఆదర్శముగా నిలిచింది.అందుకే మనంకూడా ఆమెవలె విశ్వాసాన్ని వెదకాలి".మనము ఈలోకంలో ఎంతోమందిని విశ్వసించి  వారి బాటలోనే నడుస్తుంటాం.ఉదా: డాక్టర్లు, అధికారులు, స్నేహితులు,ఉపాధ్యాయులు. ఇలాఎంతోమందిమాటలువింటూవుంటాం. కానీ ఒకరోజు వారుమానాల్ని మోసము చేయవచ్చు. కానీ దేవుడుమాత్రము అలాకాదు.  ఆయనను మనము నిజంగా విశ్వసిస్తే,మనకోసం ఏదయినా చేస్తాడు.చివరికి తన ప్రాణాన్ని సహితము మన కోసం ధారపోస్తాడు. మరియ మాతకు దేవునిపైన అచెంచలమైన విశ్వాసము ఉన్నది.ఆ విశ్వాసము మూలముననే ఆ దేవాతి దేవుడిని ఈలోకమునకు తీసుకొని రావడానికి తన గర్భమును దేవునికి సమర్పించింది.
     మరియ మాత యొక్క విశ్వాసము వినయముతో కూడుకున్నది.ఎందుకంటే, ఈ వినయమునుండే విశ్వాసము వస్తుంది.వినయము లేకపోతే విశ్వాసము రాదు.అందుకే, నీమాట ప్రకారము నాకు జరుగును గాక అని విశ్వాసముతో వినయముగా దేవదూతతో పలికింది.
    మరియ మాత విశ్వాసముతో అంగీకరించింది.
    మరియ మాత వినయముతో అంగీకరించింది.
    మరియ మాతప్రేమతో అంగీకరించింది.
    మరియ మాత తనను తాను సమర్పించుకుంటూ అంగీకరించింది.
    అదే విధముగా, మరియ మాత ధైర్యముగా అంగీకరించింది.


2. యేసు ప్రభువు యొక్క నామకరణ పండుగ:
            ఈనామకరణ పండుగను జరుపుకొను చున్నామంటే ఆనాడు మరియ మాత, జోజప్ప గారు మోషే ధర్మశాస్త్రము ప్రకారము చిన్నారి బాలయేసును దేవాలయములోకి తీసుకొనివచ్చి నామకరణము చేస్తూ అతనికి యేసు అని పేరు పెడుచున్నారు (లూకా:2 :21 ). ఎనిమిది దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి, ఆ బాలుడు గర్భము నందు పడక పూర్వము దేవదూత సూచించునట్లు "యేసు" అని పేరు పెట్టిరి.
యేసు అంటే హీబ్రు భాషలో యెహోషువ అని అంటారు మరి దీని అర్ధం రక్షణ. "దేవుడు రక్షిస్తాడు". అయితే యేసు అనగా రక్షకుడు అని అర్ధం. ఈ ఏయూ ప్రభువే మనలను రక్షించేది. మోషే ఆజ్ఞ ప్రకారము "ఏ స్త్రీ అయినా ప్రసవించి మగబిడ్డను కనిన యెడల తాను ఋతుమతి అయినప్పటికీ ఏడున్నాళ్ళు శుద్ధిని కోల్పోవును.ఎనిమిదవనాడు శిశువునకు సున్నతి చేయవలయును" లేవి:13 :1 .మరియమాత మోషే చట్టమును తూచా తప్పకుండా పాటించినదని ఇదిఒక గొప్ప ఉదాహరణ. ఎందుకంటే, మరియమాత కూడా యేసుప్రభువును దేవాలయమునకు ఎనిమిదవరోజు తీసుకొనివెళ్ళి నామకరణాన్ని చేస్తూ, యేసుప్రభువుని దేవునికి అంకితము చేస్తుంది. నిర్గ :13 :1 లో చూస్తే,ప్రభువు మోషేతో ఇట్లనుచున్నాడు:"ఇశ్రాయేలీయులలో పుట్టిన తొలిచూలి బిడ్డలనెల్ల నాకుమాత్రమే అంకితము చేయవలయును".ఈనాడు మనము మరియా మాత కూడా చిన్నారి బాలయేసును దేవాలయములో సమర్పిస్తూ, నామకరణము చేస్తుంది. యేసుప్రభువుయొక్క నామమును మనము చూస్తే,
   యేసునామములో శక్తివుంది.
    యేసునామములో ముక్తివుంది.
    యేసునామములో రక్షణ ఉంది.
    యేసునామములో స్వస్థత ఉంది.
ఈనామము ఈయనకుతప్ప ఎవరికీ ఇవ్వబడలేదు.ఆనామమునకు అందరూ మొఖాళ్లు వంచి వినతులు కావలెను." ఆయనకు అన్ని నామాములే కంటే ఘనమగు నామమును ప్రసాదించెను"(ఫిలి:2 :9 ). పరలోక, భూలోక పాతాళలోకములయందలి సమస్తజీవులునూ క్రీస్తు నామమునకు మోకాళ్ళు వంచి వినతులుకావలెను"(ఫిలి:2 :10 ).అయన నామమును విశ్వసించు ప్రతివారు రక్షణ పొందుతారు.
2.1. యేసు అనగా పాపములనుండి రక్షించువాడు:
నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను.అయన క్రీస్తు ప్రభువు. మరి ఈయనను ఎవరైతే రక్షకుడని తెలుసుకుంటారో వారు రక్షణ పొందుతారు.దేవుడంటున్నాడు: నేనీ పాపులను పిలువా వచ్చితిని కానీ,నీతిమంతులను పిలుచుటకు రాలేదు మత్త :9 :13 .
         వ్యభిచారము పట్టుబడిన స్త్రీని తన పాపాలనునుండి రక్షించాడు (యోహా :8 1 -11 ).
         పక్షవాత రోగిని స్వస్థపరిచాడు.  "కుమారా! ధైర్యము వహింపుము. నీపాపములు పరిహరింప బడినవి"(మత్త:9 :2 ).
         సిలువపైఉన్నదొంగను క్షమించాడు. నేడే నీవు నాతో కూడా పరలోకములో ఉందువు" (లూకా :23 :43 ).
2.2. యేసు అనగా రోగములను నయంచేసేవాడు:
      యేసుప్రభువు తన జీవితములో ఎంతోమంది యొక్క జీవితములను మార్చాడు. ఎంతోమందిని స్వస్థపరిచాడు. 
 ఉదా: సీమోను అత్తకు స్వస్థత (లూకా :4 :38-39).
            కుష్టు రోగికి స్వస్థత : (లూకా :5:12-13)
            మూగ చెవిటివానికి స్వస్థత (మర్కు:7:37).
           యాయీరు కుమార్తెకు స్వస్థత (మార్కు :5:41).
  3. నూతన సంవత్సరము:
        నూతన సంవత్సరము నూతన జీవితానికి గుర్తు.క్రొత్త ఆశలతో,క్రొత్త ఆశయాలతో మన జీవితాలను చిగురింపచేయడానికి ప్రయాస పడే సమయము ఈ నూతన సంవత్సర సమయము.ఇంకో విధముగా చెప్పాలి అంటే,గడిచిపోయినా సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ,రాబోవు సంవత్సరానికి స్వాగతము పలకాలి. ఈనాటి మొదటి పఠనంలో చూస్తే,యాజకులు ప్రజలను ఏవిధముగా దీవించాలి అని దేవుడు మోషేప్రవక్తకి ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకు దేవుడు ప్రజలను యాజకులద్వారా దీవిస్తున్నాడు? దేవుడే స్వయముగా ప్రజలను దీవించవచ్చుకదా అని మనకు ఆలోచన రావచ్చు. కానీ, దేవుడు ఒక జాతిని పూర్తిగా ఎన్నుకొని అయన ప్రేమ వారిలోకి కుమ్మరించి ఆ ప్రేమ వారు చవి చూచునట్లు చేయుచున్నాడు. 
మరి కాథోలికులైన మనము ఎందుకు దేవాలయములో మన జీవితమును ఆరంభిస్తున్నాము? ఎందుకంటే,కాలములు,య్యుగములు దేవునియొక్క ఆధీనములో వున్నవి కాబట్టి (దాని :2 :21 ). నూతన సంవత్సరము దేవుని సన్నిధిలోవుండి, ఆయననామమును స్మరించుకొంటాము దీవెన కరము. ఉదా: హిజ్కియా రాజు తన రాజ్యాన్ని దేవాలయములోనే ప్రారంభించాడు. అందుమూలముననే అయన మూడు మేలులను పొందాడు.

 అవి:    1 . పాడిపంటలు సంవృద్ధిగా పండుతాయి.
             2. శత్రువులమీద విజయము కలుగును.
             3. మరణించిన తరువాత నిత్యజీవపు భాగ్యమును దయచేస్తాడు. 
ప్రతిరోజు మనల్నిమనం దేవునికి సమర్పించుకోవాలి.అప్పుడే నీకు ఇవనీ వర్ధిల్లుతాయి. దీనికి దేవునియొక్క తోడ్పాటు ఎంతో అవసరము. 
అందుకే ఈనాడు నూతన సంవత్సరమునాడు మనమందరము దేవుని సన్నిధిలో చేరి ఆ దేవాతి దేవుడిని స్తుతించడానికి ఆరాధించడానికి, గణపరచడానికి వచ్చివున్నాము. అదేవిధముగా,మనయొక్క కోరికలను దేవునికిసమర్పించి అవి మనజీవితములో నెరవేరాలని ప్రార్ధన చేస్తాము.
     ఈనాడు ఈనూతన సంవత్సరము లాగా నువ్వునేను నూతనముగా ఉండాలి అంటే, రెండు కార్యాలు మనము చేయాలి. అవి:
1. మనల్నిమనం దేవునికి సమర్పించాలి:
          ఈలోకంలో ఎంతోమంది ఎన్నోవస్తువులకు, అధికారాలకు,ధనమునకు,చెడ్డ ఆలోచనలకూ, చెడ్డ వ్యసనాలకు,వారిని వారు సమర్పించుకుంటారు.దాని ఫలితముగా వారి జీవితములో నిజమైన శాంతి సమాధానములు కరువగుచున్నాయి. వారి కుటుంబాలలో ప్రేమలేకుండా పోతుంది.ఒకరినొకరు అర్ధం చేసుకోలేక పోతున్నారు.ఉదా; ధనవంతుడు ధనమునకు లోబడి దైవారాజ్యమున సంపదను కోల్పోయాడు.జాలితో తిరిగి వెళ్లి పోయాడు.
   ఎన్నడూ నువ్వునేను కూడా లోకాశాలకు మనల్నిమనం సమర్పించుకుంటే ఈ ధనవంతుడిలాగా మనంకూడా నిత్యముఉండే సంపదను కోల్పోతుంటాము.దానిద్వారా శాంతిసమాహాదానాలు మనలో కరువవుతాయి.కాబట్టి,మనల్ని మనము దేవునికి సమర్పించుకొని అయన అజ్ఞాను సారము నడుచుకోవాలి. పశ్చాత్తాప హృదయముతోదేవుని చేరాలి. విశ్వాసముతో దేవునికి ప్రార్ధన చేయాలి. తప్పిపోయిన కుమారుడివలె పాత జీవితమును విడిచిపెట్టి ఒక క్రొత్తజీవితమును ప్రారంభించాలి.
2. కృతజ్ఞతా భావముతో కలిసి జీవించాలి:
          దేవుడు మనజీవితములో ఎన్నో గొప్ప గొప్ప మేలులు చేసి ఉన్నాడు.నెలనుండిమట్టిని తీసుకొని మనిషిగాచేసి,దానిలో జీవము పోసి తన పోలికలో సృష్టించుకొని,తనతోపాటు నివాస స్థలమును ఏర్పరచుకొని, తన ప్రేమను ప్రతిక్షనం చూపిస్తూ, చివరికి మనందరికోసం ఆ కలువారి సిలువలో గోరతి గోరంగా మరణించి మూడవనాడు తిరిగిలేచి,ఎంతోమంది జీవితాలను మార్చాడు.
ఉదా : పదిమంది కుష్టురోగులు.
    ఈ పదిమంది కుష్టురోగులలో ఒక్కడే వెనుకకు తిరిగి వచ్చి ఆ దేవునికి కృతజ్ఞత తెలిపాడు.దీనిమూలముననే,మిగతా తొమ్మిది మంది కంటే ఎక్కువగా  అందరి సమక్షంలో గొప్పవానిగా పరిగణించబడ్డాడు. ఈనాడు నువ్వు నేను కూడా దేవునికి కృతజ్ఞతా భావముతో జీవించాలి.
         కాబట్టి ఈ నూతన సంవత్సరములో మనమందరము ఒక నూతన జీవితానికి నాంది పలకాలి. ఎందుకంటే, ఈ నూతన సంవత్సరములో నువ్వు నేను కూడా నూతన సంవత్సరములో మరియా మాత ఏవిధముగానైతే,తనను తాను పూర్తిగా దేవునికి సమర్పించుకొని, ఆ దేవాతిదేవుని ఈ లోకమునకు తీసుకొని వచ్చింది. ఈ నాడు నీ విశ్వాసము కూడా మరియమాతవిశ్వాసమువలె ఉండాలి. అదేవిధముగా మరియ మాత మరియు జోజప్ప గారు ఏవిధమిగానయితే  బాలయేసును దేవాలయములో మోషే ధర్మశాస్త్ర ము ప్రకారము బాలయేసును సమర్పించి,నామకరణము చేసియున్నారో, అదేవిధముగా ఒక తల్లి తండ్రిగా పిలువబడుచున్న మీరు మీ పిల్లలను ఎసైప్రభువువలె దేవాలయములో సమర్పించి అయన అడుగుజాడలలో నడిపించడానికి ప్రయత్నము చేయాలి. ఇంకా ఈ నూతన సంవత్సరములో దేవునికి దగ్గరగా జీవించడానికి ప్రయత్నిద్దాము. ఆమెన్.

Br. Sunil Mario Nandigama
  
      
 

24, డిసెంబర్ 2021, శుక్రవారం

క్రీస్తు జయంతి మహోత్సవము(2)

క్రీస్తు జయంతి మహోత్సవము

                       యెషయా 9:1 -6, తీతు 2 :11-14 , లూకా2:1 -14

ప్రతిజననం ఎంతో ప్రత్యేక్యమైనది  ఈలోకంలో  ఉన్న మనందరి జీవితం జన్మoతోనే ప్రారంభంఅవుతుంది మనం చాల మంది పుట్టినరోజులను ఘనంగా కొనియాడతo. అంగరంగవైభవంగా కొన్నీ పుట్టిన రోజులను చేసుకుంటాం. సంఘసేవకుల, రాజకీయానాయకుల పుట్టినరోజును జరువుపుకుంటాం. ఈరోజు ప్రత్యేకమంగా రాజులకు రారాజు ప్రభులకు ప్రభు అయిన క్రీస్తుప్రభు యొక్క జన్మదినము. జరుపుకుంటున్నాం. ఎందరో చూడాలనుకున్నారు కానీ చూడలేదు.ఎందరో ఆయనను తాకాలనుకున్నారు కానీ తాకలేదు. కానీ మనం అదృష్టవంతులము. పరలోకదూతలు మాత్రమేకాదు ఈరోజు సంతోషంమనందరికీ  ఎందుకు అంటే సృష్టిలో మొట్టమొదటి సారి దేవుడు మన మధ్యలోకి వస్తున్నారు.
తన     పర లోక మహిమను అలాగే నిత్యము సేవించుకునే విధానము వదిలి పెట్టి మన కోసం మన మధ్య లోనికి వస్తున్నారు. సృష్టిలో మొట్టమొదటి సారిగా ఒక్క శిశువు జన్మించిన తరువాత తల్లి తన కుమారుని పొలి ఉన్నారు.
మాములుగా ఈలోకంలో జన్మిస్తే, మనం అంటాము మీ అమ్మలాగా ఉన్నావు నాన్నాలాగా ఉన్నావు. కానీ యేసు ప్రభువు జనము తో తన తల్లి శిశువుని పోలి వుంది. ఎందుకంటే  దేవుడు మానందరిని తన పోలికలో సృజించారు . 
దేవుడే మరియమ్మ గారిని  సృజించారు ఆ తల్లి ఇప్పుడు దేవున్ని పోలివుంది. మొట్టమొదట  సారిగా మరియమ్మగారు పరలోక అనుభూతిని పొందారు. తన పవిత్ర చేతులులతో దేవున్ని తాకారు . బాల యేసు జన్మిoచిన స్థలం   పవిత్ర మైనది, పశువుల పాక పవిత్ర స్థలంగా  మారింది. ఆయన  జన్మిoతో భూలోకం పరలోకంగా మారింది . ఎవరు ఇష్ట పడని అంగీకరించని స్థలం అందరిచేత అంగీకరించబడుతుంది. ఎందుకంటే రక్షకుడు జన్మిoచరు .యేసు ప్రభువు పశువుల పాకలో జన్మిoచరు.ఎందుకంటే స్థలం ఆ స్థలం సామాన్యలకు చెందినది, సమాజంలో ఎవ్వరు పట్టించుకోని వారు అక్కడ వుంటారు
(Outcast people ignored people forgotten in the society) ఆయన అక్కడ జన్మనిoచుట ద్వారా ఆయన అందరితో సరిసమానం అని చెబుతున్నారు. ఈ సమాజం పట్టించుకోని వారిని దేవుడు పట్టించుకుంటున్నారు.
దేవుడు కేవలం ఎన్నుకొన్న వారికి మాత్రమే కాదు  జన్మిoచిoది.
 క్రీస్తు ప్రభువు తన్ను తాను అందరి చేత అంగీకరించబడేoదుకు ఆయన కూడా అందరిలో ఒక్కరె, సరి సమానమే  అనే భావన ప్రజల్లో తీసుకొని రావటానికి ఈ విధంగా ఆయన చేశారు.  మనకు జన్మిoచిన శిశువు ఎలాంటి వారంటే
ఆశ్చర్యకరుడు
 ఆలోచన  కర్త
బలవంతుడగు దేవుడు
 నిత్యుడగు తండ్రి
సమాధాన కర్త
ఆనాడు యూదా ప్రజలు చీకటిలో వెలుగును చూసారు అంటే స్వయంగా దేవుడు ఇచ్చే  రక్షకున్ని చూసారు  అని అర్ధం.
  వారి జీవితంలో పాపం తొలగించబడినది అని అర్ధంకూడా.మన కోసం జన్మిoచిన శిశువు తనయొక్క పరిచర్య ద్వారా అద్భుతముల ద్వారా ,బోధనల ద్వారా   ఆశ్చర్యకరమైన కార్యములు ద్వారా అనేక మంది జీవితాలలో వెలుగు ను నింపారు. ఆయన పుట్టుకతో  ఈ లోకంలో వెలుగు నింపబడినది భూలోకం పవిత్ర  పరచబడింది.
 మన కుంటుంబంలో శిశువు  జన్మిస్తే   ఆ తల్లి మీద వున్నా అవమానం తొలిగిపోతుంది శిశువు     దుఃఖము  సంతోషంగా  మారుతుంది.
మనకోసం జన్మిoచిన   శిశువు మాటతప్పని వారు మనస్సు బాధ పెట్టని వారు ,సమర్దుడు మన కోసం తన జీవాన్నే త్యాగం చేసే వారు ,స్వస్థత పరిచే కుమారుడు
 ఆయన తండ్రితో నిత్యం వుంటూ తన దీవెనలు మనకు  ఇచ్చేవారు.
 యేసు ప్రభువు  జన్మిoచిన తరువాత ఆయన్ను కనుగొన్నది రెoడు వర్గాల వారు
1.గొల్లలు - సామాన్న ప్రజలు
2. జ్ఞానులు - అన్ని తెలిసినవారు
ఒక వర్గ  వారు ఏమి తెలియని సామాన్యులు రెండవ వారు అన్ని తెలిసినవారు.
రెoడు వర్గాల వారు ఆయన్ను మెసయ్యగా గుర్తించారు మిగతా సగం  సగం తెలిసినవారు  యేసయ్యను గుర్తించలేదు, అంగీకరించలేదు.
రెoడవ పఠనములో పౌలు గారు రక్షకుని  రాక గురించి చెబుతున్నారు సర్వమానవాళికి రక్షణ కృప  ఒసగబడినది .
 ఆయన ఈలోకంలో వున్నా వారి జీవితములను సరిచేయుటకు  ఆయన వచ్చి వున్నారు
 ఆయన రాకడ కోసమై  మనం -ఇంద్రియ నిగ్రహం కలిగి జీవించాలి ,ఋజు మార్గాన ప్రయాణించాలి, పవిత్రమైన  జీవితం  గడపాలి .ఈ వాన్ని జరిగినప్పుడు ఆయన మనలో  జన్మి స్తారు. కాబట్టి మన జీవితంలను సరిచేసుకోవాలి ఆయన కోసం తయ్యారవాలి. పునీత అగస్టీన్గారుఅంటున్నారు యేసుప్రభు ఈలోకానికి వచ్చింది మనకు దైవత్వం పంచటానికి మనలో దైవత్వం పెంచటానికి, దైవత్వం ఇవ్వడానికి వచ్చారు.
మన కొరకు పంపబడిన వారు లోక రక్షకుడు,
అయన మన పాపముల నుండి రక్షించే వ్యక్తి
అయన మనలను చేడు నుండి రక్షించే వ్యక్తి
అయన మనలను స్వార్ధం నుండి రక్షించే వ్యక్తి
అయన మనలను ఈలోక ఆశల నుండి రక్షించే వ్యక్తి
అశాంతి నుండి రక్షించే దేవుడు సాతాను బాధల నుండి రక్షించే దేవుడు.

అయన మన కొరకు పంపబడిన దేవుడు. అయన మరణించిన వారికే జీవమునిచ్చుటకు వచ్చిన పంపబడిన దేవుడు.
గాయ పడినవారికీ స్వస్థత ఇచ్చుటకు పంపబడ్డాడు.
త్రప్పిపోయిన గొర్రెలను వెదకి రక్షిన్చుటకు పంపబడ్డారు.
గ్రుడ్డువారికిచూపును ఇచ్చుటకు కృంటువారిని నడిపించుటకు చెవిటి వారికి వినికిడి ఇచ్చుటకు స్వర్గఅనుభూతుని ఇచ్చుటకు అయనపంపబడ్డారు.
సేవసేయడానికి అయన పంప బడ్డారు. ఆయనను దేవుడు పంపించింది మన కొఱకు అలానే మనం కుడా  ఈలోకానికి పంపబడ్డాం. మరి ఆయన లాగే మనం జీవిస్తున్నాము? దేవుని యొక్క ప్రణళికయె మనజీవితం దేవుడు పంపించారు కాబట్టి    ఈలోకానికి మనతల్లిదండ్రుల ద్వారా వచ్చాము, అయన మన కొరకు  వచ్చిన వ్యక్తియే   దేవుడు ఇమ్మానుయేల్ అనగా దేవుడుమనతో ఉన్నాడు. పవిత్ర గ్రంధం మనం క్షుణముగా తెలుసు కుంటే దేవుడు తన ప్రజలతో ఉన్నాడు.
ఇశ్రాయేలీయలను నడిపించుటకు దేవుడు వారిమధ్యలోనే ఉన్నారు, వారిని  నడిపిస్తున్నారు నిర్గమ ;   3: 14
దేవుడు వారితో ఉండాలనుకునారు. అయిన ప్రజలు అయన గొప్పతనం గ్రహించలేదు. ఆయనకు అవిశ్వాసముగా జీవించారు. యేసు ప్రభువారు  మన మధ్య లోకి వచ్చారు. మనవునిగా మన మధ్య జీవించారు.
మత్తయి: 14  : 16   దేవుడుమనతో ఉండాలని ఆశపడి 
పరలోకం వీడి   భువికి వచ్చారు.  అన్నీ వదిలేసుకొని వచ్చారు. ఇంకామనం అయనగొప్పతనం తెలుసుకోలేక పోతున్నాం.
దేవుడు మన కొరకు మన మధ్యకు 
వచ్చి ఉండాలనుకున్నారు. అయితే మనం దేవుని తో ఎలాగా ఉంటున్నాం.
క్రీస్తు జననం దేవుని మనకు దగ్గరకు చేర్చింది. ఆయనను మన కుటుంబ సభ్యులుగా పరిచయంచేసింది.
ఆయనను మన స్నేహితులుగాచేసింది.
పంపబడిన యేసుప్రభు యొక్క మంచితనం రక్షణకార్యంలో యేసు ప్రభువు   యొక్క జననం ఈరోజు మనం ధ్యానించు కొంటున్నాం.  అయితే ఆ జననములో నలుగురు ముఖ్య మైన వ్యక్తులు ఉన్నారు. 
తండ్రిదేవుడు, కుమారుడైనయేసుప్రభు, పవిత్రాత్మదేవుడు , మరియమ్మ యేసేపు
వీరు అందరు కూడా ప్రజల కొరకు మేలును మాత్రమే చేసారు. తండ్రి, పవిత్రాత్మ, కుమారుడుని ఈలోకంలో మేలు చేయడానికి పంపిస్తున్నారు. నా కుమారుడు వెంటనే వస్తున్నారు. అయన జీవితములో ఎవరికి హానిచేయలేదు. యేసు మానవ అవతారంకు  సహాకరించిన వారు మరియమ్మగారు యేసేపుగారు. వారు కుడా బిడ్డను తమ బిడ్డగా స్వీకరించారు. 
ఆయనను అనేక విధాలుగా కాపాడారు. 
వీరు అందరు కూడా ప్రజల కోసం ,శ్రీ యేసు కోసం పని  చేసిన వారే. వారి అభివృద్ధికి తోడ్పడిన వారే.

అదేవిధముగా మనం కుడా ఇతరుల మేలుకోరకు పని చేయాలి. 

వారికీ  మనకు ఉన్న దానితో సహాయం చేయాలి.
వారికీ ఇవ్వాల్సినంత ప్రేమను ఇవ్వాలి. క్రిస్మస్ పండుగ
 ద్వారా దేవుడు మనకు ఇచ్చిన  గొప్ప ఆశీర్వాదాలు
ఆయన మనలను దత్త పుత్రులుగాచేసారు గలతి : 4 : 5 మనలను తనబిడ్డలుగా అంగీకరించారు

క్రీస్తు జయంతి సామాన్యుల కు గుర్తుపునిచ్చింది. గొర్రెల కాపరులకు దేవుడు ఒక గుర్తింపు ఇస్తున్నారు.
వారికే గొప్ప దర్శనం కలగజేస్తున్నారు. యేసు ప్రభు వారికీ మనకు కూడా గుర్తిపును ఇస్తున్నాడు.
క్రీస్తు జయంతి దేవుని అభయం ఇస్తుంది. దేవుడు మనతో ఉన్నాడు అన్న అభయం.
క్రీస్తు జయంతి మనలను పాపముల నుండి వైదొలిగి నీతిమంతమైన జీవితం జీవించమని నేర్పిస్తుంది.
క్రీస్తు జయంతి మనకు జీవితం ప్రసాదిస్తుంది. ఆయనతో క్రొత్త జీవితం మొదలైంది. అలాగే ఈరోజు అయన
మనతో జన్మిస్తే క్రొత్తజీవితం ప్రారభించవచ్చు.
Rev.Fr.Bala Yesu OCD

క్రీస్తు జయంతి మహోత్సవము

క్రీస్తు జయంతి మహోత్సవము
మన కోసము దేవుడు మానవుడై రక్షకునిగా జన్మించెను.

క్రిస్మస్ అర్ధరాత్రి పూజ      క్రిస్మస్ వేకువ జామున పూజ           క్రిస్మస్ పగలు పూజ
యెషయా 9:1-6                      యెషయా 62:11-12                     యెషయా 52:7-10
తీతు 2:11-14                          తీతు 3:4-7                                   హెబ్రీ 1:1-6
లూకా2:1-4                             లూకా 2:15-20                               యోహాను 1:1-18
ముందుగా మున్ముందుగా మీకందరికి క్రీస్తు జయంతి మహోత్సవ శుభాకాంక్షలు. క్రిస్మస్ అంటే అర్థమేమిటి? క్రిస్మస్(క్రీస్తు జయంతి) అంటే దేవుడు మానవుడై (యోహా 1:14) ఇమ్మానువేలుగా మన మధ్య, మనతో, మనలో ఉండటము (మత్తయి 1:22-23). ఆనందించడానికి, మహానందించడానికి సరియైన సమయమిది. ఎందుకంటే లోక రక్షకుడు మనకోసము, మన మధ్యలో, మనలో జన్మిస్తున్నారు. మనుష్యావతారము(దేవుడు మానవ రూపము దాల్చడము)  అనేది చరిత్రలో ఒక్కసారి మాత్రమే జరిగినది కాదు. ప్రతిరోజు జరుగుతున్నటువంటి ప్రక్రియ. చిన్నారి పొన్నారి బాలయేసు ప్రతి ఒక్కరి హృదయములో జన్మించేంతవరకు ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. క్రీస్తు జయంతి కేవలము ఒక గొప్ప మహోత్సవము మాత్రమే కాదు, ఓ దైవానుభూతి. ఈ దైవానుభూతి క్రీస్తు మనలో జన్మించినప్పుడు మాత్రమే పొందగలము. లేదంటే ప్రతి క్రిస్మస్ పండుగ కేవలము ఒక మహోత్సవము లానే మిగిలిపోతుంది. కాబట్టి ఈ గొప్ప మహోత్సవ ప్రాముఖ్యతను, ఔన్నత్యాన్ని ఏ విధముగా మన జీవితాలకు అపాందించుకుని, ఆ క్రీస్తు జనన అనుభూతి ఏ విధముగా పొందాలో ఈ క్రింది మూడు అంశాల రూపేణా అర్ధము చేసుకుందాము. 
క్రీస్తు జనన ప్రవచనాలు, వాటి నెరవేర్పు
క్రీస్తు జయంతి పర్వము; మనకు ఆనందాల వరము
క్రీస్తు జయంతి పర్వము; మన రక్షణ చరిత్రలో ఓ అత్యుత్తమ ముఖ్య ఘట్టము 

క్రీస్తు జనన ప్రవచనాలు, వాటి నెరవేర్పు
క్రీస్తు జనన ప్రవచనాలు పాత నిబంధనలో లెక్కకు మిక్కుటము. కానీ మనము ఇక్కడ కొన్నింటిని మాత్రమే ధ్యానిద్దాము. చరిత్రలో ఎందరో గొప్ప గొప్ప వ్యక్తులు జన్మించారు. కానీ ఏ వ్యక్తి గురించి కూడా ఈలాగున, ఈ సమయములో, ఈ స్థితిలో జన్మిస్తాడని ముందుగా ఏ ప్రవక్త ప్రవచించలేదు. కానీ క్రీస్తు ప్రభువు జన్మిస్తాడని కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవక్తలు ప్రవచించారు.
"ప్రభువే మీకు ఒక గుర్తును చూపించును. యువతి గర్భవతియై ఉన్నది. ఆమె కుమారుని కనును. అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుము" (యెషయా 7:14)
"మనకొక శిశువు జన్మించెను. మనము ఒక కుమారుని బడసితిమి. అతని రాజ్యమున సదా శాంతి నెలకొనును" (యెషయా9:6-7)
"మీరు సీయోను కుమారితో ఇట్లు నుడువుము. ప్రభువు నిన్ను రక్షింప వచ్చుచున్నాడు." (యెషయా 62:11)
ఈ ప్రవచనాలు పొల్లుపోకుండా నెరవేరాయి.
ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును. ఆయనను ఇమ్మానువేలు అని పిలిచెదరు. అని ప్రవక్తతో ప్రభువు పలికినది నెరవేరునట్లు ఇదంతయు సంభవించెను" (మత్తయి 1:22-23)
"నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టును. ఆయన క్రీస్తు ప్రభువు" (లూకా 2:11)
"ఆ వాక్కు (దేవుడై) మానవుడై మన మధ్య నివసించెను. (యోహాను 1:14)
క్రీస్తు జయంతి పర్వము; మనకు ఆనందాల వరము
క్రిస్మస్ దగ్గరకు వస్తుందంటే మనకు కలిగే ప్రథమ భావము, ఆనందము. క్రిస్మస్ మన జీవితాలలో చీకటిని తొలగించి వెలుగునిస్తుంది. నిరాశ,నిస్పృహలను తీసివేసి క్రొత్త ఆశలను చిగురింపజేస్తుంది. అశాంతిని తీసివేసి శాంతినిస్తుంది. పాపాన్ని ప్రక్షాళన గావించి రక్షణను ఇస్తుంది. దుఃఖాన్ని తీసివేసి ఆనందాన్నిస్తుంది. పునీత పౌలు గారు నుడువుచున్నారు,"ప్రభువు నందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు! మరల చెప్పుచున్నాను, ఆనందింపుడు (ఫిలిప్పు4:4), ఆనందించడానికి కారణము ప్రభవు దగ్గరలోనే ఉన్నారు (ఫిలిప్పు 4:5)." సీయోను కుమారి ఆనందనాదము చేయుము, ఇశ్రాయేలు హర్షద్వానము చేయుము, యెరూషలేము కుమారి నిండు హృదయముతో సంతసింపుము (జెఫ 3:14) ఎందుకనగా నీ దేవుడైన ప్రభవు నీ నడుమనున్నాడు(జెఫ 3:17). దేవదూత గొర్రెల కాపరులతో, "మీరు భయపడవలదు, సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారము మీకు వినిపించెదను, మీకు ఒక రక్షకుడు జన్మించెను (లూకా 2: 10-11)
ఎందుకు   రక్షకుడు  నడుమనున్నాడని  అని ఆనందించాలి ? ఎందుకు అంటే  ఈ  రక్షకుడే  ఈలోక  సంతోషము కంటే అతీతమైన  ఆనందాన్నిస్తాడు.  ఈ ఆనందం ఏది,  ఎవరు  మననుంచి  తీసివేయలేరు.  ఇది  సత్యమైన  మరియు  శాంతియుతమైన  నిత్యానందం.  ఇమ్మానుయేలు  దేవునిగా  ప్రభు మనకోసం  మన మధ్య  జన్మించింది  మనతో ఉండడానికి (మత్తయి 1: 22 -23) మనలో  ఈ శాంతియుతమైన  నిత్యానందం నింపటానికి  దేవుడు మనతో  ఉండాలంటే  మనం దేవునితో వుండాలి.  మనం దేవునితో దేవుడు మనతో  ఉన్నప్పుడు మాత్రమే క్రీస్తు జయంతి పర్వము మనకు ఆనందాల వరంగా మారుతుంది. అప్పుడు గొర్రెల కాపరులతో కలిసి 'మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులగు వారికి శాంతి కలుగుగాక (లూకా 1:22-23)' అంటూ దేవుని స్తుతిస్తూ క్రీస్తు జయంతిని ఆనందముగా, మహానందముగా జరుపుకోగలము. 
ఈ లోకములో ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులు జన్మించారు. వీరందరూ జన్మించింది జీవించడానికి కానీ క్రీస్తు ప్రభువు జన్మించింది మరణించడానికి. తన జీవన, జీవిత, శ్రమల, మరణ పునరుత్తానాల ద్వారా మనకు రక్షణ తీసుకుని రావడానికి. మానవ రక్షణ చరిత్రలో క్రీస్తు జననము ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఒక మాటలో చెప్పాలంటే మానవ రక్షణ చరిత్రలో క్రిస్మస్ ఒక అత్యుత్తమ ఘట్టము. ఎందుకంటే స్వయానా లోక రక్షకుడు జన్మించిన తరుణము. ఈ తరుణము మానవులను పాప జీవితము నుండి పవిత్ర, పుణ్య జీవితానికి ఆహ్వానించే ముఖ్య సమయము. ఎందుకంటే రక్షింపబడాలంటే పవిత్ర జీవితము ఎంతో అవసరము. 
రక్షణలో రెండు పాత్రలున్నాయి. a. దేవుని పాత్ర, మరియు b. మానవ పాత్ర. 
దేవుని పాత్ర: దేవుడు లోక రక్షకుడు. మనలను రక్షింప జన్మించెను. అది మనకందరికీ తెలుసు. కాబట్టి మనము మన పాత్రపై మననము చేద్దాము. 
మానవ పాత్ర: లూకా19: 1-10 వచనాలలో జక్కయ ఇంటికి ఏ విధముగా రక్షణ వచ్చిందో మనము చదువుతున్నాము. జక్కయ సుంకరులలో ప్రముఖుడు, ధనికుడు(లూకా 19:1), యేసుని చూడాలనే కోరికతో ఉన్నాడు. ఆ కోరిక కార్య సాధనకు తన పొట్టి తనము అడ్డు రాలేదు, తన గురించి ఇతరులు ఏమనుకుంటారో అని తలంచలేదు. కానీ తన లక్ష్యము ఒక్కటే. యేసును చూడాలి. జనసమూహము ఎక్కువగా ఉండినను కూడా ముందుకు పరుగు తీసి మేడి చెట్టును ఎక్కాడు. అది చూచిన యేసు, “జక్కయ్య నీ ఇంటిలో ఉండ తలచితిని” అని చెప్పి పాపియైన జక్కయ ఇంటికి అతిధిగా వెళ్ళాడు. యేసు రాకతో జక్కయ జీవితము మారిపోయింది. ఒకనాడు అన్యాయముగా జనము నుంచి పన్ను తీసుకున్న జక్కయ్య ఇప్పుడు తన ఆస్తిలో సగము పేదలకు దానము చేయడానికి మరియు తాను ఎవరికైనా అన్యాయము చేసినచో నాలుగు రెట్లు కూడా ఇచ్చివేయుటకు సిద్ధముగా ఉన్నాడు. తన జీవితములో అచంచలమైన మార్పును చూసిన ప్రభువు నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఏలన ఇతడును అబ్రాహాము కుమారుడే. మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షించుటకు వచ్చియున్నాడు, అని చెప్పారు. 
అవును క్రీస్తునందుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా మనము కూడా రక్షకుడిని స్వీకరించాలంటే బలమైన, ధృడమైన కోరికను కలిగి ఉండాలి. ఈ కోరిక కార్యసాధనకు శాయశక్తులా కృషించాలి. మన బలహీనతలను సహితము లెక్క చేయకూడదు. మన లక్ష్యము ఒక్కటై ఉండాలి. నేను నా కోసము జన్మించిన రక్షకుని నా జీవితములోనికి ఆహ్వానించాలి. నీ కృషిని చూసిన రక్షకుడు జక్కయ్యతో లాగానే నీతో కూడా నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది అని ఓ శుభ సందేశాన్ని తెలియజేస్తాడు. 
కాబట్టి ఆ క్రిస్మస్ కేవలం ఓ మహోత్సవము లాగానే మిగిలిపోకూడదు. కానీ ఓ దైవానుభవముగా మారాలి. దైవానుభవముగా మారాలి అంటే క్రేస్తును స్వీకరించాలను నీ నిరీక్షణ నమ్మకముగా మారాలి, నీ నమ్మకము ఆనందముగా మారాలి, ఆనందము శాంతిగా మారాలి, శాంతి ప్రేమగా మారాలి. ఈ ప్రేమ క్రీస్తు కోసమై ఉండాలి. ఈ ప్రేమ నీలో క్రీస్తును జన్మింపజేస్తుంది. క్రీస్తులో నిన్ను జన్మింపజేస్తుంది. మరొకసారి మీ అందరికి క్రీస్తు జయంతి శుభాకాంక్షలు.
ఆమెన్.....
Br. Sunil Inturi OCD

18, డిసెంబర్ 2021, శనివారం

ఆగమన కాల 4 వ ఆదివారం

 ఆగమనకాల 4 వ ఆదివారం 

మికా 5:1-4, హెబ్రీ 10:5-10,  లూకా 1:39-45 

నేటి దివ్య పఠనాలు దేవుని యొక్క రాకడ కోసం సంసిద్దులై జీవిస్తున్న వారందరిలో ఆయన యొక్క జన్మం జరుగుతుంది అనే అంశం గురించి భోధిస్తున్నాయి. దేవుని ప్రణాళికకు సహకరిస్తూ ఆ ప్రణాళికను వ్యక్తిగత జీవితములో అమలు చేస్తూ జీవించే ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు జీవిస్తారు. ఈనాటి మొదటి పఠనంలో దేవుడు మీకా ప్రవక్త ద్వారా చేసిన వాగ్దానములను గురించి వింటున్నాం. 

బెత్లెహేము ఏఫ్రాతా !నీవు యూదా నగరములలో మిక్కిలి చిన్న దానవు , కాని యిస్రాయేలు పాలకుడు నీ నుండి ఉద్భవించును మీకా 5:2 . 

బెత్లేహేము నుండి రక్షకుడు  ఉదయిస్తాడు. అని చెప్పినప్పుడు దానిలో ఒక అర్ధము దాగిఉన్నది. ఎందుకు ప్రత్యేకంగా దేవుడు బెత్లేహేమును ఎన్నుకున్నారు. రక్షకుని యొక్క  యొక్క జన్మస్థలంగా? మొదటిగా బెత్లేహేములో  న్యాయాధిపతియైన ఇబ్సాను జన్మించారు. న్యాయదీపతులు 12:8  

బెత్లేహేము లెవీయులకు ఒక కేంద్రంగా ఉన్న స్థలం. న్యాయా 17:7-9, 19:1 

యాజకుల యొక్క స్థలం 

బెత్లేహేము దావీదు రాజు యొక్క జన్మ స్థలం 1 సమూ 16:4 . లెవీయులకు అదే విధంగా  దావీదు  రాజుకు జన్మస్థలంగా కేంద్రంగా ఉన్నటువంటి ఒక చిన్న స్థలంను దేవుడు  పుట్టిన స్థలంగా ఎంనుకొంటున్నారు. 

యిస్రాయేలును పరిపాలించే  పాలకుడు దేవుడు పంపబోయే క్రీస్తు ప్రభువే . ఎందుకంటే దేవ ధూత మరియమ్మకు ప్రత్యక్షమైన  సమయంలో తనతో పలికిన మాటలు ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును, ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు. అని అన్నారు-లూకా 1:33. 

దేవుడు చిన్నదైనటువంటి బెత్లేహేమునే ఎన్నుకొంటున్నారు. అల్పమైన  ప్రదేశమును దేవుడు ఎన్నుకొని ఒక క్రొత్త అర్ధం తెలుపుచున్నారు. 

పూర్వ వేదంలోని ప్రజలు , వారి జీవితాలు అన్నియు రక్షణ కోట కలిగిన యెరుషలేము నగరం మీదనే కేంద్రీకృతమై ఉండేవి. 

యవే దేవునికి ఆరాధన స్థలం యెరుషలేము అని ప్రజల నమ్మకం అలాగే దేవుడు అక్కడ ఉండియే ప్రజలను పరిపాలిస్తాడని వారియొక్క ఆలోచన వారి ఆలోచనలకు భిన్నంగా దేవుడు యిస్రాయేలును పరిపాలించే రాజు అతి చిన్నదైన బెత్లేహేము నుండి జన్మిస్తారని మీకా ప్రవక్త తెలియచేస్తున్నారు. 

ఏఫ్రాతా అనేది ఒక చిన్న గ్రామం , దానికి పెద్ద గుర్తింపు లేదు. అయితే దేవుడు మాత్రం ఆ గ్రామన్నే ఎంచుకున్నారు. ఆయన ఈ భూలోకానికి రావడానికి ఒక గొప్ప ప్రాంతంను  ఎన్నుకొనక కేవలం గుర్తింపు లేని అతి సామాన్యమైన, అల్పమైన చిన్న గ్రామాన్ని , చిన్న మార్గాన్ని ఎంచుకున్నారు. 

మనందరి జీవితంలో ప్రముఖమైన స్థలంలో ఉండటానికి ఆశ కలిగి ఉంటాం. కాని దేవుడు మాత్రం గుర్తింపు లేని వాటికె ప్రాముఖ్యతనిస్తున్నారు. 

దేవుడు కూడా అల్పమైన లేదా  చిన్న వారికి అనగా వినయం కలిగి జీవించే  దీనులను దేవుడు ఎప్పుడు  కూడా బాలపరుస్తూనే ఉన్నారు. 

చిన్న వారైన  చేపలు పట్టుకునే వారిని  ఎన్నుకొని దేవుడు వారిని  సువార్త సేవకులను , అద్భుతాలు చేసేవారిగా ఎన్నుకొన్నారు. 

సామాన్యురాలైన  మరియమ్మను ఎన్నుకొని దేవునికి తల్లిగా దీవించారు. యేసు క్రీస్తు ప్రభువు కూడా తనను తాను  తగ్గించుకొని పశువుల పాకలో  జన్మించారు. ఎవరూ ఊహించని పశువుల తొట్టిలో శయనించారు. దేవుడు బెత్లేహేమును  తన నివాస స్థలంగా ఎన్నుకొన్నారంటే మనం ఆయన యొక్క వినయంను అర్ధం చేసుకోవాలి. గుర్తింపు లేని ఎందరో జీవితాలకు గుర్తింపు ఇవ్వడానికి దేవుడు ఇలా చేశారు. 

ఆ చిన్న ప్రాంతం మానవుల యొక్క  తగ్గింపు జీవితానికి ఒక గుర్తు. తగ్గించుకొని జీవిస్తే దేవుడు వారి జీవితంలో జన్మించి దానికి సరైన అర్ధం దయ చేస్తారు. 

మన కోసం జన్మించే వ్యక్తి సామాన్యుడైన వ్యక్తి కాదు. 

-ఆయన పాలకుడు 

-ఆయన కాపరి 

-ఆయన శాంతి ధూత 

ఆయన ప్రతి ఒక్కరి జీవితాలను పాలించే రాజు , ప్రజల మేలు కోసం తన ప్రాణాలు త్యాగం చేసే పాలకుడు. 

-ప్రజలను ప్రేమతో పాలించే పాలకుడు 

-ప్రజలను శాంతితో నింపే పాలకుడు 

-ప్రజలకు సహాయం చేసే పాలకుడు 

-ప్రజల మీద కరుణ చూపే పాలకుడు 

-ప్రజలను పరలోక గమ్యం వైపు నడిపే పాలకుడు

-తన ప్రజల కోసం సైతనుతో పోరాడి మనకు విజయం చేకూర్చే పాలకుడు

-శాంతితోను,  సమానత్వంతోను, దీవెనలతోనూ నింపే పాలకుడు. ఆ రాజు యొక్క రాకడ కోసం మన జీవితాలను సంసిద్దం చేసుకోవాలి. 

రెండవ పఠనంలో నిత్య యాజకుడైన క్రీస్తు ప్రభువు, తండ్రి  యొక్క చిత్తమును నెరవేర్చుటకు వచ్చియున్నారు అని తెలుపుచున్నారు. హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ ప్రత్యేక విధంగా  యూదా మతం నుండి క్రైస్తవులుగా మారిన వారికోసం వ్రాయబడినది. 

క్రైస్తవులుగా మారటం వల్ల  మిగతా యూదులు వారిని దేవాలయం నుండి , ప్రార్ధనాలయాల నుండి బహిష్కరించారు. బలులు సమర్పించేందుకు యాజకులను సంప్రదించేందుకు   ధర్మ శాస్త్రమును పఠించుటకు నిర్భందించారు. అయితే ఇలాంటి కష్టతరమైన సమయంలో క్రీస్తు ప్రభువే మీ యాజకుడని, ధర్మ శాస్త్రమని ఆయన బలియే శాశ్వత బలి అని వారి విశ్వాసాన్ని పెంపొందిస్తూ ఇలా వ్రాశారు. 

యేసు దేవుడు ఈ లోకంలోకి  వచ్చింది తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట కొరకు వచ్చారు. ఆయన యొక్క మనుష్యవతారం కేవలం తండ్రి చిత్తం పరిపూర్ణమొనర్చుటయే. యేసు ప్రభువు తండ్రి చిత్తమును ప్రతి నిత్యం కనుగోంటు ఆయన చిత్తము వేదకుచు దానిని తన జీవితంలో నెరవేర్చారు. 

మన జీవితంలో మొదటిగా దేవుని చిత్తం వేదకాలి, తరువాత ఆ చిత్త ప్రకారం జీవించాలి. 

యేసు ప్రభువు సుస్పష్టంగా తెలియ జేస్తున్నారు, "దేవా నేను నీ చిత్తం నెరవేర్చుటకు వచ్చి ఉన్నాను" అని. యేసు ప్రభువు యొక్క జీవితంలో ప్రతిసారీ కూడా తండ్రి చిత్తమునే వేదికారు. దేనిలో కూడా స్వార్ధం లేదు. ఆయన చిత్త ప్రకారం ఈ లోకంలోకి వచ్చారు. ఆయన చిత్త ప్రకారం దైవ రాజ్య స్థాపన చేశారు. ఆయన చిత్త ప్రకారం అందరిని ప్రేమించారు, అందరికోసం ప్రాణ త్యాగం చేశారు. సమస్త మానవాళి కోసం తానే ఒక బలిగా సమర్పించబడి తండ్రి చిత్తం సంపూర్ణంగా నెరవేర్చారు. 

మనం కూడా దేవుని  చిత్తాన్ని నెరవేర్చుటకే ఈ లోకంలోకి పంపించబడ్డాం. దేవుని చిత్తాన్ని వెదకి దానిని నెరవేర్చుదాం. దేవుడు మనకు శరీరం ఇచ్చారు. దాని ద్వారా దేవున్ని తెలుసుకొంటూ దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు మన శరీరం ఉపయోగపడాలి. నేటి సువిశే షంలో   మరియమ్మ గారు ఎలిజబెతమ్మ సందర్శించిన విధానం మనం వింటున్నాం. 

దేవ దూత  వద్ద నుండి శుభ వచనం  విన్న మరియమ్మ గారు వెంటనే తన చుట్టమైన ఎలిజబెతమ్మను కలుసుకొనుటకు వెల్లుచున్నారు. దాదాపు నాలుగు రోజుల ప్రయాణం 130 కి. మీ  దూరం. విసుగు చెందకుండా ప్రయాణం చేస్తూ  నజరేతు నుండి యూదయా లో ఉన్న  ఒక పట్టణంనకు వెళ్లారు. 

మరియమ్మ గారి ప్రయాణం చాలా కష్టతరమైనప్పటికిని ఎలిజబెతమ్మ మీద ప్రేమ వల్ల  ప్రయాణం చేసి వెళ్లారు. మరియమ్మ గారి గర్భమందున్న యేసు ప్రభువు, తల్లి  గర్బంనుండియె తండ్రి చిత్తమును నెరవేర్చుట ప్రారంభించారు. అవసరంలో ఉన్నవారికి తన సహాయం చేస్తున్నారు. 

మరియమ్మ గారు మరియు  ఎలిజబెతమ్మ ఇద్దరు గర్భవతులే అయినప్పటికీ మరియమ్మ గారు సేవా బావంతో ఒక అడుగు ముందుకువేసి ఆమెకు సహాయం అందించింది. 

దేవుడు కూడా చేసిన పని అది. మానవ జాతికి  దేవుని యొక్క అవసరం ఉంది. అందుకే తన యొక్క ఏకైక కుమారున్నీ ఈ లోకానికి పంపించారు. యేసు క్రీస్తు ప్రభువు తన పుట్టుకకు ముందే సేవలు అందించేందుకు వచ్చారు. సేవలు అందుకొనుటకు ఆయన రాలేదు. మత్త  20:28 . దేవున్ని తన గర్భమున మోస్తున్న తల్లి మరియమ్మ కూడా సేవా బావంతో సహాయం చేయుటకు వెల్లుచున్నారు. ఇది కూడా దేవుని చిత్తం నెరవేర్చుటలో ఒక ప్రణాళికయే. 

మరియ తల్లి దైవ సందేశం  ఆలకించిన వెంటనే త్వరితముగా సేవకు వెల్లుచున్నది. త్వరితముగా అంటే ఆమె ఎంతో ఉత్సాహం కాలీగ్ , ఆనందంతో నింపబడినదై వెల్లుచున్నది. 

మరియమ్మ గారు  ఎలిజబెతమ్మను సందర్శించినది ఎందుకంటే  దేవుడు వారిద్దరి అద్భుతాలు చేశారు. ఒకరిని దేవుని ప్రవక్తకు జన్మనిచ్చుటకు , ఇంకోకరిని దేవునికే జన్మనిచ్చుటకు ఎన్నుకొన్నారు కాబట్టి. ఈ రెండు అధ్బుత కార్యాలు ఒకరికి ఒకరు పంచుకొనుటకు, సహాయం చేసుకొనుటకు, ఆనందాన్ని వెల్లడించుకొనుటకు కలుసుకొంటున్నారు. 

మరియమ్మ గారికి ఎలిజబెతమ్మ గర్భవతి అని తెలుసు కానీ ఎలిజబెతమ్మకు మరియమ్మ గర్భవతి అని తెలియదు అయినప్పటికీ పవిత్రాత్మ శక్తితో గ్రహించి నా దేవుని తల్లి నా వద్దకు వచ్చుట ఎలాగ ప్రాప్తించేను అనెను. 

మరియ తల్లి వందన వచనం పలికినప్పుడు ఎలిజబెతమ్మ మరియు ఆమె గర్బంలో ఉన్న  శిశువు బాప్తిస్మ యోహను దేవుని యొక్క సాన్నిధ్యంను గుర్తించారు. 

మరియమ్మ గారు ఎలిజబెతమ్మ కలిసిన సమయంలో జరిగిన సంఘటనలు 

1. ఎలిజబెతమ్మ గర్భంలో ఉన్న శిశువు గంతులు వేస్తున్నారు. 

2. ఎలిజబెతమ్మ దేవుని యొక్క  ఆత్మచేత నింపబడింది. అందుకే నా ప్రభుని  తల్లి అని పలికింది. 

3. ఎలిజబెతమ్మ ఆనందంతో  వెలుగెత్తి  దేవుని సువార్తను ప్రకటిస్తుంది. 

ఎలిజబెతమ్మ గారే మొట్ట మొదటిగా  యేసు క్రీస్తును గుర్తించారు. మరియమ్మ గారి గర్భమందున్న  దేవున్ని గుర్తించారు. 

ఎలిజబెతమ్మ గారు కూడా వినయంతో , మరియ తల్లి తన కన్నా చిన్నదైనప్పటికి ఆమెను గౌరవించింది, దేవుని తల్లి అని అంగీకరించింది. ఆమెలో ఎటువంటి స్వార్ధం లేదు. ఆమె పలికిన ప్రతి మాట నిస్వార్ధమే. పిలిప్పీ 2:3-4 . 

ఎలిజబెతమ్మ ,మరియమ్మ గర్భమందున్న శిశువును తన మెస్సియా గా అంగీకరించింది. దేవుని సజీవ కుమారునిగా బావించింది. 

తన గర్బంలో ఉన్న శిశువు కన్నా మరియమ్మ గారి గర్భంలో ఉన్న శిశువు గొప్ప వాడని భావించింది . మరియమ్మ గారు దేవుని ప్రణాళికను తన జీవితంలో నెరవేర్చింది. అందుకే ఆమె గురించి ఎలిజబెతమ్మ గొప్పగా పొగుడుతుంది. స్త్రీలందరిలో  ఆశీర్వదింపబడిన దానవు అని అన్నారు.42 వ వచనం. సృష్టిలో ఎవ్వరికీ దక్కని గొప్ప ఆశీర్వాదం దేవుడు మరియమ్మకు ఇచ్చారు అని ఎలిజబెతమ్మ గ్రహించారు. 

జీవం పోసిన దేవునికే జీవం నీచ్చుటకు నిన్ను ఎన్నుకొన్నారు అని  మరియమ్మను పొగిడారు.మరియమ్మ గారు దేవున్ని తన గర్భమందు మోసారు. అది గొప్ప విషయం. తాను ఆశీర్వదింపబడటానికి కారణం - దేవుడు ఆమెను ఎన్నుకొన్నారు. రెండవది ఆమె దైవ ప్రణాళిక నెరవేర్చుతూ  జీవించింది. 

అదే విధంగా మరియమ్మ గారు దేవుడు పలికిన ప్రతి మాట విశ్వసించింది. తనకు వచ్చిన సందేశం దేవునిది అని విశ్వసించింది. తన గర్భమున జన్మించే శిశువు దేవుడని విశ్వసించింది.  ఆయన తన ప్రజల కోసం జన్మించే దేవుడని మరియ తల్లి విశ్వసించింది. లూకా 11:28,యోహను 15:7 . ఆమె దేవుని వాక్కును విశ్వసించి వీధేయించింది. 

మనం కూడా మన జీవితాలను మరియమ్మ వలె , అదే విధంగా ఎలిజబెతమ్మ వలె దేవుని కొరకు తయారు చేసుకొంటే ఆయన రాకడ మనలో జరుగుతుంది. 

ఇద్దరు దేవుని మాటలు విశ్వసించారు. 

ఇద్దరు దేవుని కొరకు జీవితాలు సిద్దం చేసుకున్నారు. 

ఇద్దరు దేవుని సేవకు , ప్రజల శ్రేయస్సు కొరకు తమ బిడ్డలను సమర్పించారు. 

ఇద్దరు దేవుని చిత్తం నెరవేర్చారు, దేవున్ని ప్రేమించారు. 

కాబట్టి మన జీవితంలో కూడా దైవ ప్రణాళికలను నెరవేర్చుతు దేవుని కొరకు జీవించుదాం, అప్పుడే ఆయన మనలో జన్మించి మనతో ఎప్పుడూ  ఉంటారు.  


Rev. Fr. Bala Yesu OCD

నిత్య జీవము ఎలా వస్తుంది

 యోహాను 6: 22-29  మరునాడు, సరస్సు ఆవలితీరమున నిలచియున్న జనసమూహము అచటనున్న  ఒకే ఒక చిన్న పడవ తప్ప మరియొకటి లేదనియు, ఆ పడవలో శిష్యులతో పాటు యే...