26, ఫిబ్రవరి 2026, గురువారం

3వ పాస్కా ఆదివారం

 3 పాస్కా ఆదివారం

పో 2: 14, 22-28

1 పేతురు 1: 17-21

లూకా 24: 13-35

ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు దేవుడు తనను విశ్వసించే ప్రజలకు ఎప్పుడు చేరువలోనే ఉంటారు అని తెలుపుచున్నాయిమన జీవితంలో మనం ఎట్టి పరిస్థితులకు లోనైనాకానీ పునరుత్తాన దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటారుదేవుడి గురించి ఎవ్వరైతే తాపత్రయ పడుతుంటారోవెదకుతుంటారోఆయన సాన్నిధ్యంతో జీవించాలని భావిస్తారో వారికి ప్రభువు అతి సమీపంలోనే ఉంటారు అనే విషయం గురించి మనకు ఈనాటి పఠనాలు బోధిస్తున్నాయి.

ఈనాటి మొదటి పఠనంలో పేతురు గారు చేసిన మొదటి పునరుత్తాన భోధన గురించి వింటున్నాంఅపొస్తలులు యేసు ప్రభువు యొక్క పునరుత్తానం తరువాత అదే విధంగా దేవుని యొక్క పవిత్రాత్మను పొందిన తరువాత సువార్త ప్రకటన చేయుట మనం వింటున్నాం.  పవిత్రాత్మను పొందిన తరువాత వారిలో భయం పోయినది అందుకనే వారు బహిరంగంగా సువార్తను అధికారుల మధ్య సమూహాల మధ్య బోధించారు.

వారు బోధించిన అంశం ఏమిటంటే యేసు ప్రభువును అన్యాయంగా సిలువ మరణంకు గురిచేశారు అయినా కానీ దేవుడు మాత్రం తన కుమారున్నివిడిచి పెట్టలేదు ఆయన్ను మరణమును గెలిచేలా చేశారు.  యేసు ప్రభువు తన యొక్క అద్భుతాలు ద్వారామహాత్కారాల ద్వారా తన యొక్క బోధనల ద్వారా తానే యేసయ్య అని తెలిపారుఅయినప్పటికిని అది గ్రహించక ఆయన్ను మీరు సిలువ శిక్షకు గురి చేశారుఆయన మరణంకు కారణం అయ్యారు అని తెలిపారు.

యేసు ప్రభువును తన తండ్రి ఎన్నడును విడిచిపెట్టలేదు అని పేతురు గట్టిగా  ప్రకటించారుతండ్రి తన కుమారున్ని ఎన్నడూ విడిచిపెట్టరుఎందుకంటే ప్రభువు అంటున్నారు "తల్లి మరచినా నేను నిన్ను మరువను అనియెషయా 49 : 15 . మనల్ని మరచిపోని దేవుడు మరి తన కుమారున్నిఏ విధంగా మరువగలడుమరవడు సత్యమును గ్రహించిన అపోస్తులు ప్రభువు యొక్క పునరుత్తానం గురించి గట్టిగా ప్రకటించారు.

 నాటి మొదటి పఠనంలో పేతురు గారు దేవుడు అందరిని తన ప్రజలుగా స్వీకరిస్తున్నారు అని తెలుపుచున్నారుమొదటిగా యూదులను మార్చితరువాత అన్యులకు సువార్త ప్రకటన చేసి వారిని  తన బిడ్డలుగా స్వీకరిస్తారు అని ప్రభువు పలుకుచున్నారు.  యూదులు యొక్క విశ్వాసాన్ని బలపరచుటకువారిని యేసు ప్రభువు వైపు తిప్పుటకు పేతుటకు పేతురు గారు వారిని తన యొక్క పరిచర్య ద్వారా బోధించిన విధానం తెలుసుకుంటున్నాం.

ఈనాటి రెండవ పఠనంలో పేతురు గారు మనందరినీ దేవుడి యందు భయభక్తులు  కలిగి జీవించమని కోరుచున్నారుపేతురు గారు ఆనాటి యూదులను అదే విధంగా హృదయ పరివర్తనం చెందిన అన్యులను దేవుని యందు విశ్వాసం ఉంచినమ్మకం ఉంచి  భయభక్తులతో జీవించమని కోరుచున్నారు.

ప్రభువు యొక్క మరణం అనేది దైవ ప్రణాళిక అని పేతురుగారు పలికారు.  ప్రభువు యొక్క రక్తం చేత మనం పాప విముక్తులముగా చేయబడ్డాంనిష్కళంక గొర్రెపిల్ల యొక్క రక్తం ద్వారా మనం పవిత్ర పరచబడ్డాంస్వతంత్రులముగా చేయబడ్డాంకావున ఆయన యందు ఎల్లప్పుడూవిశ్వాసం ఉంచి మంచిగా  జీవించమని పేతురు గారు  పలుకుచున్నారు.

ఈనాటి సువిశేష పఠనంలో యేసు ప్రభువు ఎమ్మావు మార్గంలో శిష్యులకు ఇచ్చిన దర్శనం గురించి వింటున్నాంఇద్దరు శిష్యులు యేసు ప్రభువు యొక్క మరణం తరువాత యెరూషలేము నుండి ఎమ్మావు గ్రామంకు వెళ్లే సమయంలో దేవుడు వారితో పాటు ప్రయాణం చేస్తున్నారుఇక్కడ కొన్ని విషయాలు మనం గ్రహించాలి.

1దేవుడు నీ బాధలో  నీకు తోడుగా వుంటారు ఇద్దరి శిష్యులు ప్రభువు యొక్క మరణమును తట్టుకోలేకపోయారునిరాశలో వున్నారురాజును  కోల్పోయాము అనే బాధలో వున్నారుఆయన్ను గొప్ప నాయకుడిగారాజుగా భావించారురోమా చక్రవర్తుల నుండి స్వేచ్ఛను దయచేసి వ్యక్తిగా భావించారు అయితే వారి యొక్క ఆలోచనలకు బిన్నంగా ఆయన మరణించారుఅలాంటి తట్టుకోలేనటువంటి స్థితిలో వున్న వారికి ప్రభువు దర్శనం ఇస్తున్నారు.

  శిష్యులు యేసు ప్రభువు యిస్రాయేలు ప్రజలను ఉద్ధరిస్తాడనితన రాజ్యాన్ని స్థాపించి ప్రజలకు శాంతి సమాధానాలు సిరిసంపదలు దయ చేస్తాడని వారు ఎంతగానో ఎదురుచూశారుఅయితే అదేమి జరగలేదుయేసు మరణంతో  శిష్యుల యొక్క ఆశలు వమ్ము అయ్యాయి.

 అంతా కోల్పోయాముఅంతా అయిపోయింది అని జీవచ్ఛవాలుగా ఎమ్మావు గ్రామానికి వెళ్లుచున్న శిష్యులను ప్రభువు కలుసుకుంటున్నారు.

  దేవుడు తనను వెంబడించే వారిని విడిచిపెట్టరు శిష్యులు ఎమ్మావు గ్రామముకు వెళ్లే దారిలో వారి యొక్క సంభాషణ యేసు ప్రభువు గురించియే అందుకే ప్రభువు అంటారు "ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా పేరిట కూడివుంటారో అక్కడ నేనుంటానని" - మత్తయి 18 : 20 .

మార్గమధ్యన వారి సంభాషణ అంత దేవుని గురించియే అందుకే వారి మధ్యకు దేవుడు వస్తున్నారు.

వారు అంతగా  దేవుడి గురించి సంభాషిస్తున్నారంటే ఎంతగా ఆయన్ను miss  అయ్యామని వారు భావిస్తున్నారో మనం అర్ధం చేసుకోవాలి.

మన జీవితాలలో మన భాదల్లో వున్నప్పుడు దేవుడు మనకు కూడా తోడుగా వుంటారు అది మన యొక్క తల్లిదండ్రుల ద్వారా కావచ్చుస్నేహితుల ద్వారా కావచ్చు లేదా ఇతరుల ద్వారా కావచ్చు దేవుడు మనల్ని ఎన్నడు విడిచిపెట్టారు.

2. మన దేవుడు ప్రయాణించే దేవుడుపూర్వ నిబంధన గ్రంధంలో యావే దేవుడు యిస్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి విముక్తులను చేసివారితో పాటు ఎడారి గుండా 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు ప్రయాణం చేసే సందర్భంలో ఆయన మహిమనుస్వభావమును వెల్లడిచేశారుఆయన యొక్క సాన్నిధ్యమును అనుభవించేలా చేశారు.

అదే విధంగా ఈనాటి సువిశేషంలో యేసు ప్రభవు కూడా  శిష్యులతో పాటు ప్రయాణం చేస్తున్నారు ప్రయాణంలో వారికి అనేక విషయాలు తెలుపుచున్నారు.

ప్రభువు తన ప్రజలతో నడుస్తూ తన యొక్క  గొప్పతనమును వెల్లడించుకుంటున్నారు.

 సృష్టి  ప్రారంభంలో దేవుడు ఆదాముఅవ్వతో నడిచారుదేవుడు నోవాతో నడిచారుఏనోకుతో నడిచారుప్రభువు వారితో నడిచే సందర్భంలో అది సామాన్యమైన నడకకాదు అది యొక్క నడక వారిని బలపరిచే నడకనేర్పించే నడకధైర్యం నింపే నడక కావున మన కూడా గ్రహించవలసిన సత్యం ఏమిటంటే దేవుడు కూడా మనతో పాటు నడుస్తుంటారుఆయన సర్వమును గుర్తించి ఆయన మాట ప్రకారం మనం జీవించాలి.

3. మన దేవుడు మన యొక్క అవసరతలను పట్టించుకునే దేవుడు.

  ఆయనకు ప్రతి ఒక్కరి అవసరతలు తెలుసు అందుకే వారిని ఆదుకుంటారు.

 గ్రుడ్డివారిని అవసరతలు తెలుసు

 పక్షవాత రోగి అవసరం తెలుసు

 అనారోగ్యుల అవసరాలు తెలుసు

 విశ్వాసులు అవసరాలు తెలుసు

అందుకే వారిని ఆదుకుంటారుఅదే విధంగా  ఇద్దరి శిష్యుల అవసరం కూడా తెలుసు అందుకే వారిని ఆదుకుంటారు.

4. మన దేవుడు ఐక్య పరిచే దేవుడు ఇద్దరి శిష్యులను మిగతా శిష్యులతో దేవుడు ఐక్యపరుస్తున్నారు.

ప్రభువును రొట్టె విరుచుట యందు గుర్తించిన శిష్యులు వెంటనే మిగతా శిష్యుల వద్దకు పరుగెత్తుకొని వెళ్లారు.

యేసు ప్రభువు మరణంతో మనల్ని తండ్రితో ఐక్య పరిచారు.

ప్రభువు తొలి సంఘస్థులను ఐక్య పరుస్తున్నారుఅలాగే దేవుడు వివాహం ద్వారా స్త్రీ పురుషులను ఐక్యం చేస్తున్నారు.

5. మన దేవుడు కనువిప్పు కలుగచేసే దేవుడు.

 ఇద్దరి శిష్యులు మొదట్లో యేసు ప్రభువును గుర్తించలేదు కానీ ఆయన స్థాపించిన దివ్య సత్ప్రసాదస్థాపన రోజున చేసిన కార్యమును శిష్యులు జ్ఞాపకం చేసుకున్నారువారి కనువిప్పుకు కారణం అయ్యారు.

తప్పిపోయిన కుమారుడి కనువిప్పు అయ్యేలా చేశారు.   యొక్క రోజున దేవుడు అన్ని సమయాలలో మనకు తోడుగా ఉంటారని గుర్తించి ఆయన్ను విశ్వసించాలి.

 Fr. Balayesu OCD 

పాస్కా 2వ ఆదివారం

 పాస్కా 2వ ఆదివారం

అ. కా. 5: 12-16

దర్శ 1: 9-11, 12-13, 17-19

యోహాను 20 : 19 - 31

ఈరోజు తల్లి శ్రీసభ దివ్యకారుణ్య పండుగను కొనియాడుచున్నది. ఈరోజు దివ్య పఠనాలు కూడా దేవుని యొక్క దయా, కరుణ గురించి బోధిస్తున్నాయి. దేవుని యొక్క కరుణ చల్లని చూపు అందరికి అవసరం దాని ద్వారానే మనం ప్రభువు యొక్క అనుగ్రహాలు పొందుచున్నాము, బ్రతుకుచున్నాం.

దివ్య కారుణ్య పండుగ భక్తి పునీత పౌస్టీనా ద్వారా ప్రారంభమైంది. ప్రభువు ఆమెకు ఏప్రిల్ 30 , 2000 లో ఇచ్చిన దర్శనంలో ప్రభువు ఆమెతో ఈ విధంగా అన్నారు "మానవజాతి, నమ్మకంతో తన కరుణను ఆశ్రయిస్తే వారికి శాంతి లభిస్తుందని" తెలిపారు. పరిశుద్ధ రెండవ జాన్ పాల్ పాపుగారు ఈ పండుగ ప్రతి సంవత్సరం జరుపుకోవాలని ప్రకటించారు. పరిశుద్ధ ప్రాన్సిస్ పాపుగారు దీనిని అధికారికంగా జరుపుకోవాలని తెలిపారు.

పౌస్టీనా గారికి దేవుడు మూడు ముఖ్యమైన బాధ్యతలను అప్పజెప్పారు.

1 . ఆత్మల కోసం ప్రార్ధించుట : దేవుని యొక్క అనంతమైన కరుణకు ఈ ఆత్మలను సమర్పించి వారి కొరకు ప్రార్ధించుట

2 . ఈ ప్రపంచముకు దేవుని యొక్క గొప్ప మనస్సు, కారుణ్య మనస్సు తెలియజేయుట.

3 . దేవుని యొక్క కరుణ చాటుట, విశ్వాసమును ప్రకటించుట దేవుని ప్రేమను విశ్వసించుట అంటే ఆయన యొక్క కరుణను విశ్వసించుటయే కాబట్టి ఈ రోజు దేవుడు మనకు చూపిస్తున్న కరుణ మనం ధ్యానించుకోవాలి.

యేసు ప్రభువు యొక్క దివ్య కారుణ్య picture మనం చూస్తే రెండు రకాలైన కిరణాలు కనబడతాయి. ఎర్రని కిరణాలు - దేవుని యొక్క రక్తంకు గుర్తు. ఆయన రక్తం చిందించటం ద్వారా మనం రక్షించబడ్డాం అని అర్ధం. తెల్లని కిరణాలు మన యొక్క జ్ఞానస్నానంకు గుర్తు. జ్ఞానస్నానం ద్వారా దేవుని బిడ్డలుగా చేయబడుతున్నాం. పవిత్రులుగా చేయబడుతున్నాం.

ఈనాటి మొదటి పఠనంలో యేసు ప్రభువు తన యొక్క శిష్యుల ద్వారా చూపిన కరుణ గురించి తెలియజేస్తుంది. అనారోగ్యంతో ఉన్నవారికి ప్రభువు తన యొక్క అనంత కరుణను చూపిస్తున్నారు. 15 వ వచనంలో పేతురుగారి నీడపడినా చాలు మేము స్వస్థత పొందుతాం అనే అంత గొప్ప విశ్వాసం ప్రజలలో చూస్తున్నాం. ఇలాంటి ఒక విశ్వాసం గెన్నేసరెతు ప్రజలలో కూడా చూస్తున్నాం. కేవలం యేసు ప్రభువు యొక్క అంగీని తాకితే చాలు మేము స్వస్థత పొందుతాం అని అనుకున్నారు. మత్తయి 14 : 34 - 36 .

దేవుని యొక్క దీవెనలు, కరుణ పొందటానికి ప్రజలు తమ జీవితాలను తాము సంసిద్ధం చేసుకొని వున్నారు. విశ్వాసమును కలిగి వున్నారు. యెరూషలేములో సొలొమోను మంటపం దగ్గర వున్నా విశ్వాసులు పేతురు గారిలో పవిత్రాత్మ శక్తి ఉందని గ్రహించారు. ఆయన దేవుని శిష్యుడని తెలుసుకున్నారు, ఆయనకు స్వస్థత నిచ్చే శక్తి వుందని గ్రహించారు.

పేతురు గారు బలహీనుడు, యేసు ప్రభువును మోసం చేశారు అయినా సరే ఆయనలో అంత శక్తి ఎలా దాగివుంది ఆయన తన జీవితమును మార్చుకున్నాడు. హృదయ పరివర్తనం చెందాడు, పవిత్రాత్మ శక్తిని పొందాడు, దేవుని చిత్తం ప్రకారం జీవించారు అందుకే దేవుని యొక్క స్వస్థత పరిచే శక్తి ఆయనకు వచ్చింది ఇది దేవుని యొక్క అనుగ్రహం. దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయాలంటే మనంలో విశ్వాసం ఉండాలి.

ఈనాటి రెండవ పఠనంలో పునీత యోహాను గారు తనకు వచ్చిన దర్శనం గురించి తెలుపుచున్నారు. పునరుత్తానుడైన క్రీస్తు ప్రభువు యొక్క దర్శనం గురించి పలుకుచున్నారు. పునరుత్తానుడైన క్రీస్తు ప్రభువు తాను సజీవుడని, మృత్యు లోకమునకు అధికారి అని తెలుపుచున్నారు. ఈ పఠనం ద్వారా ప్రభువు తానే విశ్వాధిపతి అని తెలుపుచున్నారు. ఈ లోకంలో ఎదురయ్యే కష్టాలకు ఇబ్బందులకు కృంగిపోక దైవశక్తి మీద ఆధారపడి జీవించమని కోరుచున్నారు.

ఈనాటి సువిశేష పఠనంలో యేసు ప్రభువు తన యొక్క శిష్యులకు చూపిన కరుణ గురించి తెలుపుచున్నారు. శిష్యులకు కరుణ చూపించి యేసు ప్రభువు తన యొక్క సువార్త బాధ్యతలను అప్పజెప్పుచున్నారు. దేవుని యొక్క అనంత ప్రేమ, కరుణ, క్షమ గురించి తెలియజేయుటయే ప్రభువు శిష్యులకు అప్పజెప్పిన బాధ్యత .

యేసు ప్రభువు తన శిష్యులకు దేవుని యొక్క కరుణ కొనసాగించుటకు క్షమించే వరం చేస్తున్నారు. ఈ సువిశేషంలో ప్రభువు చాలా విషయాల గురించి బోధిస్తున్నారు. యేసు ప్రభువు తన యొక్క శిష్యులకు దర్శనం ఇచ్చి వారిని బలపరుస్తున్నారు. ఎందుకు ప్రభువు వారిని బలపరుస్తున్నారంటే ఒక్కసారి మనం చూసిన దానిని, గ్రహించిన దానిని, విన్న దానిని గట్టిగా ప్రకటించగలం. పేతురు గారు అంటారు మా కనులారా చూసిన దానిని చెవులారా వినిన దాని గురించి ప్రకటించకుండా ఉండలేదు అని అ.పో. 4 : 20

శిష్యులు దేవున్ని గురించి తెలుసుకున్నారు కాబట్టియే తరువాత అంత గొప్పగా ప్రభువు గురించి ప్రకటించగలిగారు. యేసు ప్రభువు ఉత్తానమైన తరువాత ఇది ఎనిమిదవ రోజు అయితే శిష్య్లఅందరు కూడా భయంతో వున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు క్రీస్తే నాయకుడు అని అనుకున్నారు. ఆయన వారి వెన్నెముక అని, రాజు వారు భావించారు. వారందరి యొక్క ఆలోచనలకు బిన్నంగా క్రీస్తు ప్రభువు మరణించారు.

యుద్ధంలో రాజు చనిపోతే సాధారణంగా సైనికులకు భయ వేస్తుంది అదే విధంగా అప్పటివరకు ధైర్యంగా వున్నశిష్యులు క్రీస్తు మరణంగా ధైర్యంగా కోల్పోయారు. క్రీస్తే వారి ధైర్యం, క్రీస్తే వారి శక్తి, క్రీస్తే వారి నమ్మకం అన్నీ కోల్పోయిన సందర్బంలో ప్రభువు వారికి ధైర్యంనిస్తున్నారు. భయపడే వారికి దేవుడు ఎప్పుడూ ధైర్యంనిస్తున్నారు. అదేవిధంగా వారికి తోడుగా నిలబడుచున్నారు.

- మోషే ఫరో వద్దకు వెళ్ళుటకు భయపడ్డాడు

- యెషయా భయపడ్డాడు - 41 : 10

- యిర్మీయా భయపడ్డారు

- శిష్యులు భయపడ్డారు

వారందరికీ దేవుడు ధైర్యంనిస్తున్నారు, వారిని బలపరుస్తున్నారు.

యూదులు ఎప్పుడు ప్రాణహాని కలుగచేస్తారా అని భయాందోళనతో వున్నారు. ఎప్పుడు ఏ క్షణంలో ఏమి జరుగుతుందో తెలియదు. కాబట్టి వారందరు ఒకే చోట బిక్కి బిక్కి మంటు లోపల దాగుకొని ఉంటున్నారు. గురువును కోల్పోయిన భాధ, ఆశలు అడియాశలు అయ్యాయి. ప్రభువు వారి యొక్క అవసరత గుర్తించి వారి యొక్క అలజడి మనస్సులను, జీవితాలను ప్రశాంతంగా ఉంచుటకై మొదటిగా వారికి కావలసిన శాంతిని ఒసగుతున్నారు.

మన జీవితంలో మొదటిగా దేవుని వరం ఏం కావాలో అది దేవుడు ఇస్తారు.

చేతులను ప్రభువు ప్రక్కకు చూపుచున్నారు. దీని ద్వారా దేవుడు తనను తాను శిష్యులకు ఎరుక పరచుకుంటున్నారు. గాయపడిన చేతులను అదే విధంగా మేకులుదించిన చేతులు చూసినప్పుడు వారి నమ్మకం ఇంకా ఎక్కువైంది. వారికి సంతోషంగా తిరిగివచ్చింది. కోల్పోయినది తిరిగి పొందారు. చేతులు పక్కకు చూపటం అనేది ఆహ్వానంకు కూడా గుర్తు శిష్యులను దేవుడు తన చెంతకు ఆహ్వానిస్తున్నారు అని ఆదం. భారముచే అలసిసొలసిన సమస్త జనులారా........ మత్తయి 11 : 28. తన చెంతకు శిష్యులను ఆహ్వానిస్తున్నారు.

యేసు ప్రభువు శిష్యులను వేద ప్రచారంకై పంపిస్తున్నారు. తండ్రి కుమారుని పంపినవిధంగా నేను మిమ్మల్ని పంపిస్తున్నాను అని అంటున్నారు 21 వ వచనంలో.

తండ్రి కుమారున్ని - రక్షించుటకు పంపారు

- ప్రేమించుటకు

- క్షమించుటకు

- సేవ చేయుటకు

- తండ్రి చిత్తమును తెలియజేయుటకు

- విధేయత చూపుటకు

- త్యాగ జీవితం జీవించుటకు

- నిస్వార్ధ సేవ చేయుటకు

తండ్రి, పవిత్రాత్మల జీవితమును తెలియజేయుటకు పంపిన విధంగా మిమ్మల్ని కూడా పంపిస్తున్నాను అని అంటున్నారు. ఆయన యొక్క శిష్యులుగా మనందరం కూడా క్రీస్తు ప్రభువు జీవించిన విధంగా జీవించాలి. వారిని పంపించేటప్పుడు యేసు ప్రభువు శ్వాసను ఊది పవిత్రాత్మను ఒసగుచున్నారు.

- దేవుడు ఆదాముకు శ్వాసను ఊది జీవమిచ్చారు (ఆది 2: 7)

- ఏలియా ప్రవక్త వితంతువు కుమారునికి దేవుని ప్రవచన శ్వాసను ఊది జీవం ఇచ్చారు (1 రాజు 17: 21 - 23)

- ఎండిన ఎముకలకు దైవవాక్కును ప్రకటించి జీవాన్ని ఇచ్చినట్లుగా (యెహెఙ్కేలు 37: 9 - 10) శిష్యులకు దేవుడు శ్వాసను ఊది జీవమిచ్చారు.

- శ్వాసనూదటం ద్వారా దేవుడు మరలా శిష్యులలో నూతన జీవం నింపుచున్నారు.

మొదటి తల్లిదండ్రులు పాపం చేయటం ద్వారా శాంతి సమాధానాలు నశించాయి. దేవునికి మానవునికి మధ్య బంధం తెగిపోయింది. దేవునికి దూరమయిన మానవున్ని క్రీస్తు ప్రభువు తండ్రి చెంతకు చేర్చుతున్నారు. మానవునిపై తన శ్వాసను ఊది నూతన సృష్టిని, నూతన మానవున్ని రూపొందిస్తున్నారు. ఆదిలో మానవుడు కోల్పోయిన శాంతిని ఇప్పుడు క్రీస్తు తన శిష్యులకు కలుగజేస్తున్నారు. ఈ శాంతి ఆ శిష్యులు ప్రజలందరికి అందజేయాలి.

శాంతిని ప్రతి ఒక్కరు కలిగివుండాలి కోరుకుంటాం. ప్రశాంతగా ఉండాలి, కోరుకుంటారు చాలామంది దేశాల మధ్య శాంతి కావాలనుకుంటాం రాష్ట్రాల మధ్య కుటుంబాల మధ్య మతాల మధ్య శాంతి కావాలనుకుంటాం. కాబట్టి మొట్ట మొదటిగా వ్యక్తి గతంగా మన శాంతియుతంగా ఉండాలి అప్పుడే అది ఇతరులకు అందజేయవచ్చు.

దేవుని యొక్క శాంతి, కరుణ తెలియజేయుట కోసమే శిష్యులకు ప్రభువు క్షమించే అధికారమును ఇస్తున్నారు. పాపం చేసిన వారి శాంతిగా జీవించలేదు అందుకే వారిని ఆ పాపబంధం నుండి విముక్తులను చేసి శాంతిగా జీవింపచేయుటకు వారికి దేవుడు పాపమన్నింపును దయచేస్తున్నారు. క్షమాపణ లేకుండా శాంతికి మనుగడలేదు.

యేసు ప్రభువు శిష్యులకు దర్శనం ఇచ్చిన సందర్భంలో తోమాసు గారు లేరు. ఆయన ప్రభువును చూస్తేగాని నమ్మను అనే అవిశ్వాసంలో వున్నాడు. తోమాసు గారు మొదటిలో అవిశ్వాసిగా ఉంటున్నారు. ఆయన జీవితం గురించి ఒక్కసారి ఆలోచిస్తే ఆయన ఒక ధైర్యవంతుడు అని తెలుస్తుంది ఎందుకంటే శిష్యులందరు భయపడి లోపల ఉంటే తోమాసు గారు మాత్రం బయట ధైర్యంగా వున్నాడు - యోహాను 11 : 16 .

మన గురువు భాధను తట్టుకోలేక ఒంటరిగా ధ్యానిస్తున్నారు. దేవుడిని వ్యక్తి గతంగా చూడాలనుకున్నాడు. వక్తిగత అనుభవం కావాలనుకున్నారు. తోమాసు గారు యేసు ప్రభువు చేతిలో వ్రేళ్ళు పెడితేనే నమ్మను అని అన్నారు కానీ అది చేయలేదు, ప్రభువుని విశ్వసించారు.

విశ్వసం వివిధరకాలుగా వస్తుంది:

- వినుట వలన విశ్వాసం కలుగుతుంది ( రోమా 10 : 17 )

- శిష్యులు ఖాళీ సమాధి చూసి విశ్వసించారు ( యెహాను 20 : 8 )

- యేసు ప్రభువు పిలిచినప్పుడు మరియ మగ్దలేనమ్మ విశ్వసించింది ( యోహాను 20 : 16 )

- శిష్యుల దర్శనం వల్ల విశ్వసించారు ( 20 వ వచనం)

- క్రీస్తును చూడటం వల్ల తోమాసు గారికి విశ్వాసం పెరిగింది (25 వ వచనం)

ఆయన సందేహాలను అధిగమించగలిగాడు క్రీస్తును తన దేవునిగా గుర్తించాడు. యేసు ప్రభువు సజీవునిగా లేచారని గుర్తించారు. యేసు ప్రభువే రక్షకుడని తెలుసుకున్నాడు. తోమాసు గారికి దేవుడు తన కరుణ తెలియజేశారు. తోమాసు గారు క్రీస్తు యొక్క అనుభూతి ద్వారా తాను సువార్త సేవకై వివిధ ప్రాంతాలకు వెళ్లుచున్నారు. ప్రభువు మనందరితో కూడా చూడక నమ్మేవారు ధన్యులని పిలుస్తున్నారు. కొన్ని సందర్భాలలో మనం ఆధారాలు వుంటేనే నమ్ముతాం. ఎంతమంది చెప్పిన తోమాగారు వినలేదు, చేతిలో వ్రేళ్లు పెడితేగాని ఆధారాలు వుంటేగాని నమ్మను అని అన్నారు. అయినా ప్రభువు వారికి దర్శనం ఇస్తున్నారు, ఆయన్ను కరుణిస్తున్నారు.

దేవుని కరుణ మన మీద వున్నట్లే మనం కూడా కరుణ, జాలి, దయ, ప్రేమ కలిగి జీవించాలి. దేవున్ని తెలుసుకొని జీవించాలి.

Fr. Balayesu OCD

పునీత ఆవిలాపురి తెరెసమ్మ

 పునీత ఆవిలాపురి   తెరెసమ్మ 

తెరెసా ఔన్నత్యం -పుట్టుక మరియు బాల్యం 

తెరెసా 1515వ సంవత్సరం ఆవిలాలో మార్చి 28న తేదీన     జన్మించారు. 1582 లో చనిపోయారు. 1622 సంవత్సరంలో  లో ఆమె చనిపోయిన 40 సంవత్సరాలకు ఆమె పునీతురాలుగా ప్రకటించబడింది. 1970 సెప్టెంబర్ 27 న ఆమె తిరుసభ పండితురాలుగా ప్రకటించబడింది. ఈమె ఒక సాధారణ స్త్రీ వలె కనపడిన అసాధారణమైన పట్టుదల, సాంఘిక అసమానతలను ఎదుర్కొని విజయాలను సాధించుటలో గొప్ప వ్యక్తిత్వాన్ని కనపరిచిన అరుదైన వ్యక్తి. ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆమె జీవితంలో అనేక ఆటంకాలలో కూడా తాను అనుకున్న దానికి సాధించిన ఒక స్త్రీ మూర్తి. మనం ప్రేమించే వారి కోసం మనం ఎంత చేయవచ్చో చూపించిన ఒక గొప్ప స్త్రీ. తిరుసభలో వరకట్నం  లేకుండా సన్యాసినులను మఠంలోనికి తీసుకున్న మొదటి వ్యక్తి. అనేక నూతన సంప్రదాయాలకు అంకురార్పణ చేసిన వ్యక్తి. తీరుసభ మొదటి స్త్రీ పండితురాలు. ఒక వ్యక్తి తనలో ఉన్న లోపాలను ఎలా జయించగలమో నేర్పి, మానవుడు తనను తాను ఎలా జయించవచ్చో నేర్పించిన విజయాశీలి.  మానవునిలో ఉన్న దైవాన్ని ఎలా చేరుకోవాలో అంతరంగిక ప్రయాణం ఎలా చేయాలో నేర్పిన గొప్ప గురువు మరియు గొప్ప పండితురాలు.

ఆమె తండ్రిగారి పేరు అలెన్సో సంచేస్  ఆమె తల్లి పేరు  బియాట్రీస్ ఆహుమాద చిన్నప్పుడు తెరెసా పునీతుల జీవితాలు చదివి ఆ పునీతుల చరిత్రల వలన చాలా ప్రోత్సాహం పొందేది. తెరెసా మరియు ఆమె సోదరుడు రోడ్రిగో బాల్యంలోనే  ఇద్దరు కలిసి మూర్సు అనే ప్రాంతం లో వేద సాక్షిగా మరణించాలి అని ప్రయాణం అయి వెళ్లారుఆవిలా పూరీ గోడల బయటకు వెళ్ళి నాలుగు స్తంభాలు అనే ప్రాంతంలో వారి బాబాయి వారిని చూసి ఇంటికి తీసుకొనివచ్చాడు. తరువాత రోడ్రిగో ఇది మొత్తం చేసినది తెరెసా అని ఆమె మీద నెపం మోపాడు. తరువాత తన సోదరుడితో ఎడారిలోని క్రైస్తవ సన్యాసుల జీవిత విధానాలు ఆటల రూపంలో ఆడుకునేవారు.  


యవ్వన వయసు- జీవితపు మొదటి మలుపు

తెరెసా 14 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు ఆమె తల్లి చనిపోయారుఆ సమయములో ఆమె మరియమాతకు చాలా దగ్గర అయ్యారు. మరియమాతను తన తల్లిగా ఉండమని కోరారు. ఈ ప్రాయములో ఆమె కొన్ని వీర గాధలు చదవడం మొదలు పెట్టారు. అంతేకాకుండా తన అందానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడము ఆరంభించారు. తన కుమార్తెలో వస్తున్న ఈ మార్పును గుర్తించిన ఆమె తండ్రి ఆవిలాలో ఉన్న పునిత  అగుస్టిన్ మఠ కన్యల బోర్డింగ్ స్కూల్ లో చేర్పించారు. ఇక్కడ ఉన్న  కన్య స్త్రీల వలన మరలా తన పాత నిర్మల మనస్సును పొందగలిగింది.   ప్రార్ధన గురించి  తెలుసుకున్నారుకానీ తన అనారోగ్య కారణాలతో అక్కడనుండి 1532 లో ఇంటికి రావడం జరిగినది. 1533 లో తాను కార్మెల్ సభలో సన్యాసిగా అవ్వాలని  తన తండ్రిని  అనుమతి అడగగా అందుకు ఆయన  నిరాకరించారు. తరువాత 1535 ,నవంబర్  2 న  ఆవిలాలో ఉన్న కార్మెల్ మఠంలో ప్రవేశించారు.

సన్యాస జీవిత ప్రారంభం - అనారోగ్యం 

1536 లో సభ వస్త్రాన్ని తీసుకుంది.  1537 లో తన  మాట పట్టు తీసుకుంది దాని తరువాత ఆమె ఘోరమైన అనారోగ్యం పాలయ్యింది.  కనుక 1538 లో ఆమెను తన ఆరోగ్య కుదుటపడటానికి  మఠం నుండి బయటకు తీసుకురావడం జరిగినది.  ఈ సమయములోనే ఆమెకు తన బాబాయి  ప్రార్ధన చేయడము గురించి ఒక పుస్తకం ఇవ్వడము జరిగినది.  ఆ పుస్తకము తనకు చాలా  ఉపయోగపడింది,  ఆమె ఆరోగ్యం కుదుటపడకపోగా తాను మరణపుటంచుల వరకు వెళ్ళింది. 1539 లో ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. అందరూ ఆమె చనిపోయింది అనుకున్నారుకానీ మూడు రోజులకి కొద్దిగా చలనం కలిగినది. తరువాత ఆమెను మఠానికి తీసుకొచ్చారు పక్షవాతం తో దాదాపు మూడు సంవత్సరాలు బాధపడ్డారు. పునీత యోసేపు గారి ప్రార్ధన సహాయముతో పూర్తిగా కొలుకున్నది . కానీ  ఆరోగ్య పరంగా ఆమెకు  తన మరణం వరకు కొన్ని సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. తన అనారోగ్య కారణాలతో మరియు ఇతర కారణాలతో  ప్రార్ధన జీవితాన్ని అంతగా పట్టించుకోలేదు.

ముఖ్యమైన మలుపు- శ్రమల క్రీస్తు స్వరూప దర్శనం 

 1557 లో ఒకసారి మఠానికి పండుగ సందర్భంగా యేసు ప్రభువు స్వరూపాన్ని తీసుకురావటము జరిగినది అది యేసు ప్రభువు  శ్రమలు పొందుతున్న స్వరూపము  అది చూసిన తరువాత తెరెసా  యేసు ప్రభువు శ్రమలకు తాను కారణం అని తాను మరల  యేసుప్రభువుకు  ఎటువంటి శ్రమలు ఇవ్వకూడదు అని ఆయన శ్రమలలో ఆయనకు ఓదార్పు  ఇవ్వాలని నిర్ణయించుకుంది. అందుకే ఆమె యేసు ప్రభువుకు చాల మంది స్నేహితులు అవసరము ఉంది మనం ఆయన స్నేహితులము కావాలని తన తోటి సన్యాసినులతో చెప్పేది. ఈ మఠం లో ఆమె చాలా శ్రమలు అనుభవించిందిఆమె తన అనారోగ్యం వలన అనేక బాదలు అనుభవించినది.  ఈ సమయములోనే  తన మొదటి ప్రార్ధన అనుభూతిని పొందింది. తన స్నేహితులు,  ప్రార్ధనలో ఆమె పొందే అనుభవాలు మొత్తం కూడా సాతాను నుండి పొందుతుంది అని చెప్పారు.  1556 సంవత్సరంలో   ఆమె ఆధ్యాత్మిక గురువు ఫ్రాన్సిస్ అనే  యేసు సభ గురువు ఆమె అనుభవాలు  దేవుని నుండి వచ్చే అనుభవాలు అని చెప్పారు. ఆమె అనేక దర్శనాలు పొందేది. కొన్ని సార్లు ప్రార్దనలో ఉన్నప్పుడు వచ్చే అనుభవాలు చాలా గొప్పగా ఉండేవి. ఒక్కోసారి ఆమె ప్రార్ధన చేసే సమయములో గాలిలోకి ఎత్త బడేది. అది చూసిన మిగిలిన వారు  ఆమెను క్రిందకు తీసుకురావడానికి ఆమెను పట్టుకొని లాగేవారు. 1559 లో ఆమెకు ఒక దర్శనము యేసు ప్రభువు ఆమెకి కనపడటము జరిగినది. ఆమె అప్పటినుండి నిజంగా నాకు యేసు ప్రభువు కనపడ్డారు  అలాగున  ఈ దర్శనాలురెండు సంవత్సరాలు పాటు ఆమెకు కలిగాయి.

తెరెసా హృదయాన్ని దేవదూత బాణంతో పొడిచిన అనుభూతి 

ఒక దర్శనములో దేవదూత  ఒక  అగ్నిజ్వాలతో  కూడిన ఒక  బంగారు బాణం తో ఆమె హృదయమును గుచ్చినట్లుగా అనిపించినది. తరువాత శారీరకముగా మరియు ఆధ్యాత్మికముగా కూడా ఆమెకు అది  బాధతో కూడిన తీయటి అనుభూతిని మిగిల్చింది. ఆమె చనిపోయిన తరువాత ఆమె సమాధిలో ఆమె హృదయం పాడు కాకుండా ఉన్నది అంతే కాదు ఆమె హృదయం మీద రెండు గీతలు ఉండటం గమనించడం జరిగింది. ఇప్పటికీ ఆ హృదయం అల్భ దె  థోర్మెస్ అనే ఊరిలో దేవాలయంలో మనం చూడవచ్చు.  

ఆమె ఉన్న ఇన్కర్ణేషన్ మఠంలో  150 మంది మఠవాసులు ఉండటము వలన అది ప్రార్ధనకు అనువుగా లేదు.  మఠానికి వచ్చేపోయె  వారితో మఠం ఒక సంత వలె ఉంది అని ఆ జీవిత విధానాన్ని తన ఆధ్యాత్మిక గురువుల సహాయంతో సంస్కరించాలని అనుకున్నది.  పేదరికంలో మఠాన్ని స్థాపించటానికి అందరూ అడ్డుపడిన కాని  ఆమె ఆగస్ట్ 24న 1562వ సంవత్సరంలో నూతన మఠాన్ని స్థాపించారు. 1563 మార్చిలో తెరెసా నూతన మఠానికి వెళ్ళింది.  కఠినమైన నియమాలతో పాత కార్మెల్ జీవితాన్ని పునరుద్ధరించాలని ఆశతో మొదలు పెట్టిన పని మొదలైనది. కొద్ది మంది సన్యాసినులతో ఎప్పుడు ప్రార్ధన ధ్యానం చేస్తూ వారు అందరికీ ఆదర్శముగా జీవించడం మొదలు పెట్టారు. మొదటి ఐదు సంవత్సరాలు ఆమె ఆ మఠంలోనే  గడిపింది.

మఠాలను స్థాపించుటకు గల ఉన్నతమైన ఉద్దేశం 

ఆమె ఎందుకు ఈ మఠాన్ని స్థాపించారు అని ఒక ప్రశ్న అడిగినప్పడు మనకు ఆమె ఉన్న పాత మఠంలో ప్రార్దనకు అనుకూల వాతవరణం లేదు అందుకే ఆమె నూతన విధానాన్ని స్థాపించారు అని మనం చెప్పవచ్చు. దీనికి ఆమె తన తోటి సహోదరీలతో చెప్పిన సమాధానం మరియొకటి ఉన్నది. అది ఏమిటి అంటే ప్రొటెస్టంట్లు కతొలికులకు వ్యతిరేకంగా ఉద్యమిచ్చిన కాలంలో అనేక దేవాలయాలలో దివ్య సత్ప్రసాదనికి అవమానం కలిగించారు. ఏ విధంగా అంటే అనేక దేవాలయాలలో దివ్య మందసంలో ఉన్న యేసు దివ్య సత్ప్రసాదంను బయటకు తీసి క్రింద పడవేసి అవమానం చేశారు. ఆ అవమాననికి తాను అంటే ఆవిలాపురి తెరేసమ్మ పరిహారం చేయాలని అనుకున్నారు. అది ఏవిధంగా అంటే ఈ నూతన కార్మెల్ మఠంలో ప్రతి నిత్యం దివ్య సత్ప్రసాదంలో ఉన్న యేసు ప్రభువు ఆరాధించబడుతాడు అక్కడి సన్యాసినులతోటి ఆవిధంగా అప్పుడు జరిగిన అవమాననికి తాను పరిహారం చేయాలి అని ఈ నూతన మఠం స్థాపించాలి అనుకున్నది.  

దివ్య పూజబలిలో పాల్గొని దివ్య సత్ప్రసాదం స్వీకరించిన తరువాత ఆమె అనేక ప్రార్ధన అనుభవాలు పొందేది. ఆమె పొందిన ప్రార్దన అనుభవాలలో కొన్నింటిలో ఆమె ప్రార్దన చేస్తూ ఉండగా అవకాశంలోనికి ఎత్త బడేది. ఆ సమయాలలో తన తోటి సన్యాసినులు ఆమెను పట్టుకొని క్రిందకు లాగేవారు. 

 తెరెసా జీవితంలో యేసు ప్రభువు 

పునీత ఆవిలాపురి తెరేసమ్మ కార్మెల్ మఠంలో తీసుకున్న పేరు యేసుని తెరెసా. ఈమె జీవితం మొత్తం యేసు ప్రభువును ఏ విధంగా తాను కలవాలి, లేక ఆయనను తాను ఎలా పొందాలి అనే కోణంలో మాత్రమే ఆలోచించింది అన్నట్లుగా తాను జీవించిది. ఎందుకంటె తాను ఎలా యేసు ప్రభువును చేరుకోవాలి, ఆయన కోసం తాను ఏమి చేయగలదు మరియు ఏమి చేసింది మాత్రమే ఆమె జీవితం మొత్తం కూడ. అంతకు మించి మనం ఆమె జీవితంలో ఏమి చూడం. ఆమె పేరు యేసుని తెరెసా అని ఎలా మార్చుకున్నదో అలానే తాను యేసు ప్రభువును తన అనువణువున నింపుకున్నది. 

యేసు ప్రభువును ఆమె ఎలా చూసింది అని ఒక ప్రశ్న అడిగితే నాకు కొన్ని విషయాలు ఆమె గురించి గుర్తుకు వస్తాయి అవి ఏమిటంటే? ఆమెకు  యేసు ప్రభువే  సర్వస్వం. ఆయన మానవ గుణాలను ఎంతో అభిమానంచేది, సమరియా స్త్రీ తో మాటలాడిన విధానం, వ్యభిచారం లో పట్టుబడిన స్త్రీ ని కాపాడిన విధానం ఆమెకు దైవ కరుణ తెలియజేస్తుంది. మరియ మర్తల వలె ఆయన వద్దనే ఉండాలని, తన మాటలు వినాలని ,  తనకు సేవ చేయాలని కోరుకున్నది. యేసు ప్రభువుని ప్రతి గుణాన్ని ఆమె ప్రేమించింది. ఆయనను తన గురువుగా భావించింది. యేసు ప్రభువు తన మార్గంగా, గమ్యంగా  భావించింది. యేసు ప్రభువుకు ఎలా తను సేవ చేయగలను అనే ఆలోచించింది. యేసు ప్రభువును ఆమె ఎంతలా ప్రేమించింది అంటే ఆమె చేసేది ఏది  అయిన అది క్రీస్తును పొందటం కోసమే అనే విధంగా ప్రేమించింది.  ఆయనను పొందటమే తన జీవిత ధ్యేయం అయ్యింది. తనకు  ప్రార్ధన యేసు ప్రభువును కలుసుకునే ద్వారం అయ్యింది. తనలో యేసు ప్రభువు తనలో ఉన్నారని గ్రహించింది. తనలో ఉన్న యేసు ప్రభువును కలుసుకోవడానికి తనలోనికి తాను ఎలా వెళ్ళాలి అని నేర్చుకున్నది. ఒక వ్యక్తి ఆత్మలోనికి ప్రవేశించడం చాలా క్లిష్టమైన ప్రయాణం అని తెలుసుకుంది. అయిన ఈ తనలో ఉన్న యేసు ప్రభువును కలుసుకోవడానికి ప్రార్దన సహయం ద్వార  అంతరంగిక ప్రయాణం మొదలుపెట్టింది. తనలో ఉన్న యేసు ప్రభువును కలుసుకుంది. ఈవిధంగా ఆమెకు ప్రార్దన తనలో ఉన్న యేసు ప్రభువును కనుగోని ఆయనతో ఉండటం, ఆయన అనుభూతిని పొందటం అయ్యింది. 

కార్మెల్ సభ పురుషుల విభాగాన్ని పునరుద్ధరణకు అంకురార్పణ 

 1567 లో కార్మెల్ సభ అధిపతి జాన్ బాప్టిస్ట్ రోస్సీ ఆవిల వచ్చారు. ఆయన తెరేసా ను మెచ్చుకొని ఇంకా కొన్ని సన్యాసినుల మఠాలను స్థాపించాలని ప్రోత్సహించారు. అదే విధముగా రెండు పురుష మఠాలను స్థాపించటానికి అనుమతి ఇచ్చారు.   అప్పుడు  మెదిన దేల్ కంపో మళగొన్ వయ్యాడోలిద్ ,తోలేదోపస్ట్రాన సాలమాంక మరియు అల్బ దె  తొర్మెస్  లలో మఠాలు స్థాపించారు.

తెరెసాకు  పురుషుల విభాగానికి సంబంధించి సంస్కరించబడిన  రెండు మఠాలను ఏర్పాటు చేయడానికి అనుమతి లభించినది. పునీత సిలువ యోహను మరియు ఆంథోనీ హెరోడియా ల సహకారంతో  1568నవంబర్లో దురుఏలో వద్ద  మొదటి మఠాన్ని స్థాపించారు. తరువాత 1571 లో సెగోవియ వద్ద ,1574 లో బేయస్ సేగుర వద్ద ,1575 లో సేవియ్యే వద్ద 1576 లో కరవక శిలువ వద్ద స్థాపించారు.


నిష్పాదుక కార్మెల్ సభ 

1576 లో  సంస్కరణ ఇష్టపడని కార్మెలియులుసంస్కరించబడిన కార్మెలియులను  హింసించటము మొదలు పెట్టారు. పియసెంజ లో జరిగిన జెనెరల్ చాప్టర్లో ఎటువంటి నూతన మఠాలను ఏర్పాటు చేయవద్దని చట్టం చేశారు. తెరెసాను ఆమె ఏర్పాటు చేసిన ఏదో ఒక మఠానికి మాత్రమే పరిమితం కావాలని ఆదేశించారు. అన్నింటికీ అంగీకరిస్తూ ఆమె తోలేదోలో ఉన్న మఠానికి పరిమితం అయ్యారు.  మిగిలిన వారిని అనేక కష్టాలకు గురిచేశారు. పునీత తెరేసమ్మను అనేక మంది తీరుసభ అధికారులు తప్పుగా అర్ధం చేసుకున్నారు. ఈమె మఠ వాసి అని చెబుతూ మఠంలో ఉండకుండా దేశ దిమ్మరి వలె తిరుగుతుంది అని అన్నారు. కాని ఆమె తన సంతోషం కోసం ఎప్పుడు బయటకు వెళ్లలేదు. కేవలం ఏదో ఒక నూతన మఠం స్థాపించడానికి అక్కడ యేసు ప్రభువును సేవించేలా చేయడానికి మాత్రమే వెళ్ళింది. ఆమె ప్రయాణాలు అన్ని కూడా చాలా కష్టంతో కూడినవి ఎందుకంటే ఆనాటి రోజులలో రాహదారులు ఏమి లేవు, మరియు ప్రయాణాలు గుర్రపు లేదా గాడిద బండ్ల మీదనే జరిగేది. అనేక సార్లు క్రింద పడటం కూడా జరిగేది. కాని యేసు ప్రభువు సేవించ బడాలి అనే కోరికతో ఆమె నూతన మఠలకు స్థలం చూడటానికి లేదా స్థాపించడానికి వెళ్ళేది. 

తెరెసా చివరి రోజులు 

ఆమెజీవితపు చివరి మూడు సంవత్సరాలు అందలుసియా పాలెన్సియ ,సొరియా బుర్గోస్ మరియు గ్రనాద లో మఠాలను స్థాపించారు.  1577 ఆవిలా కు వెళ్ళింది. ఆమెను అనేక విధాలుగా విమర్శించిన కార్డినల్ కూడా ఆమెకు అనుకూలముగా  మాటలాడారు . 1580 లో నూతన మఠాన్ని  స్థాపించారు. 1580  జూన్ 22 న గ్రెగోరి 13 వ పోఫు గారు  నిష్పాదుక కార్మెల్ ప్రొవిన్సు ను ఏర్పాటు చేశారు. 1582సెప్టెంబర్ 19 న మెదిన  దేల్ కాంపొను వదలి  20 న ఆల్బ దె తోర్మేస్ వచ్చారు. అప్పటికే రక్తస్రావంతో  బాధ పడుతున్నారు.   అక్టోబర్ 4 న ఆల్బ దె తోర్మేస్ వద్ద  మరణించారు. మరుసటి రోజు  గ్రెగోరియన్ కాలెండరు మార్పుతోటి  అది అక్టోబర్ 15 అయ్యింది.  ఆమె తన మఠ వాసులకు ప్రార్థన ,  మన ఆత్మలో ఉన్న దేవుని కనుగొనట ఎలా ?, ఆధ్యాత్మిక సంపూర్ణత ఏ విధముగా సాధించాలి అనే అంశాలమీద రాసిన గ్రంధాలు అనేక మందికి దేవుని తెలుసుకొనిచేరుకోవటానికి ఉపయోగపడుతున్నాయి. 

Fr. Amruth OCD

ఐదవ సామాన్య ఆదివారం (మత్తయి 5:13-16)

 మత్తయి 5:13-16 


మీరు భూమికి ఉప్పువలెనున్నారు. ఉప్పు తన ఉప్పదనమును కోల్పోయిన  యెడల దానిని తిరిగి పొందలేదు. అట్టి ఉప్పు బయట పారవేయబడి ప్రజలచే త్రొక్కబడుటకేగాని మరెందుకును పనికిరాదు. మీరు లోకమునకు వెలుగైయున్నారు. కొండపై కట్టబడిన పట్టణము మరుగైయుండజాలదు. ఇంటనున్న వారికి  అందరికి వెలుగునిచ్చుటకై దీపమును వెలిగించి దీప స్తంభము పైననే ఉంచెదరు గాని కుంచము క్రింద ఉంచరు గదా ! ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి యెదుట ప్రకాశింపనిండు.  

మౌరీస్ మొర్లి  పోంటి అనే ఫ్రెంచ్  తత్వ వేత్త క్రైస్తవుల గురించి, క్రైస్తవులు భూమికి సారం ఇచ్చేటువంటి వారు, లోకానికి అర్ధం ఇచ్చేటువంటి వారు  అని చేప్పారు. ఇది నిజమే ఎందుకంటే మానవున్ని సృష్టించినప్పుడు, దేవుడు మానవునికి  ఈ బాధ్యత ఇచ్చాడు. సకల జీవ రాసులను సృష్టించిన దేవుడు మానవున్ని వాటికి అధిపతిని చేసి వాటికి పేర్లు పెట్టుటకు, వాటిని అన్నీ విధాలుగా వృద్ది చెందే విధంగా చేయుటకు మానవునికి అధికారం ఇచ్చాడు. సకల జీవరాసులకు పేర్లు పెట్టుటకు వాటికి ఒక అర్ధం ఇవ్వుటకు, మానవునికి బాధ్యత ఇవ్వబడింది. ఈ లోకానికి అర్ధం ఇవ్వడానికి, దానిని పెంపొందించుటకు మరియు నాశనం కాకుండా చూచుటకు కూడా మానవుని కర్తవ్యం. కాలక్రమేణా మానవుడే లోక నాశననికి కారణం అవుతూ వచ్చాడు. ఇటువంటి స్తితిలో మరల లోకానికి అర్ధం ఇవ్వుటకు, అది నాశనం కాకుండా ఉండుటకు క్రైస్తవుడు తీసుకోవలసిన బాధ్యత గురించి ఈనాటి సువిశేషం తెలియజేస్తుంది. 

మీరు భూమికి ఉప్పువలెనున్నారు.

ఉప్పు ఒక వస్తువును పాడుకాకుండా ఉంచుతుంది. యేసు ప్రభువు మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు అని అన్నప్పుడు దీని అర్ధం ఏమి అయిఉంటుంది అని మనం ధ్యానించినట్లయితే  మనం ఎల్లప్పుడు ఈ లోకము పవిత్రతను కోల్పోకుండ ఉండే విధంగా చేయాలి అని నేర్పుతుంది. మనం భూమికి ఉప్పు వలె ఉండటం అంటే భూమి  దాని సారం పోకుండా కాపాడకలగాలి.  క్రైస్తవులుగా మనం జీవిస్తూ ఈ లోకంలో ఉండి ఈ లోకం చెడిపోకుండా చేయాలి.  క్రైస్తవునిగా మనం పవిత్రంగా ఉండి ఎప్పుడు ఈ లోకానికి పవిత్రతను తెలియజేయాలి. 

 ఉప్పు తన ఉప్పదనమును కోల్పోయిన  యెడల దానిని తిరిగి పొందలేదు. అట్టి ఉప్పు బయట పారవేయబడి ప్రజలచే త్రొక్కబడుటకేగాని మరెందుకును పనికిరాదు. 

ఉప్పు తన ఉప్పదనం కోల్పోతే దానిని తిరిగి పొందలేదు. ఉప్పు సహజంగా ఎరువుగా మరియు పదార్ధాలు నిలువ వుంచుటకు వాడతారు. ఉప్పు ఉప్పదనం ఎలా కోల్పోతుంది అంటే ఉప్పును రొట్టెలను కాల్చుటకు  వేడిచేసేవారు అటువంటి ఉప్పు తన ఉప్పదనం కోల్పోయేది మరియు ఇతర పదార్ధాలు ఎక్కువ మోతాదులో కలిపిన దానిని మరల వాడుటకు ఉపయోగపడదు, అలానే మనం కూడా ఇతర వ్యావహారాలలో ఎక్కువ కలిసినప్పుడు మన క్రైస్తవ్యత్వాన్ని కోల్పోతువుంటాము.  క్రైస్తవులు లోకంలోవారి వలె జీవిస్తూ వారి  క్రైస్తవత్వాన్ని కోల్పోతారో అప్పుడు లోకంలో ఎటువంటి  ప్రభావం చూపలెరు. వారు లోకములోని వారి కంటే భిన్నంగా ఉన్నప్పుడు మాత్రమే  తమ ప్రభావం చూపగలరు.  అందరిలో ఒకరిగా ఉండాలి అని అనుకుంటే మనం క్రైస్తవత్వాన్ని కోల్పోతాము.  

క్రైస్తవుడు లోకానికి ఏ విధంగా ఉపయోగపడతాడు? 

ఉప్పు చెడి పోకుండా ఉండటానికి ఉపయోగ పడుతుంది.  ఈ లోకానికి క్రైస్తవుడు ఉప్పుగా  ఉండుట వలన ఈ లోకము  చెడి పోకుండా ఉండటానికి ఉపయోగపడుతాడు.  ఇది ఎలా ఉంటుంది అంటే  ఆదికాండంలో మనం అబ్రహాము దేవుడుని వేడుకొనిన వృత్తాత్తము వలన దీనిని అర్ధం చేసుకోవచ్చు. అబ్రహాము దేవున్ని సొదొమో గోమోర పట్టణాన్ని కాపాడమని అర్ధిస్తాడు.  ప్రభువా ఒక యాభై మంది మంచి వారు ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా కాపాడుతారా ? నలభై మంది మంచి వారుంటే ఆ పట్టణాన్ని కాపాడుతారా? ముప్పై మంది మంచి వారు ఉంటే కాపాడుతారా? ఇరవై మంది మంచి వారు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతారా? పదిమంది మంచి వారుంటే ఆ పట్టణాన్ని కాపాడుతారా? అబ్రహాము అడిగిన ఆ యాభై మంది , నలభై మంది , ముప్ఫై మంది, ఇరవై మంది, పది మంది మంచి వారు క్రైస్తవులు అయిన మనముగా ఉండాలి.  ఈ లోకము నాశనము కాకుండా ఉండటానికి క్రైస్తవునిగా మనం మన బాధ్యత నిర్వర్తించాలి.  ఇది క్రైస్తవునిగా మన కర్తవ్యం. 

లూకా సువిశేషంలో  ఉప్పు  భూమికి సారం ఇవ్వుటకు వాడటం జరుగుతుంది. అది భూమిలో మంచివి పెరిగే విధంగా చెడును పెరగకుండా చేస్తుంది. క్రైస్తవులు మంచిని లోకంలో  పెంచుటకు మరియు చెడును పెరగకుండా చేయుటకు ఉపయోగపడాలి. 

మానవ జీవితానికి నిజమైన మానవత్వాన్ని పరిచయం చేసేటువంటి బాధ్యత క్రైస్తవునిది. ఎలా అంటే యేసు క్రీస్తు జీవించిన విధంగా జీవించుట ద్వారా మానవత్వానికి దైవిక విలువలు చేరుస్తూ మానవత్వానికి అమరత్వాన్ని చూపిస్తుంది, మరియు పాలుపంచుకొనేలా చేస్తుంది. ఇది నిజానికి  క్రైస్తవ జీవిత ఔన్నత్యం గురించి ఇది తెలుపుతుంది. 


మీరు లోకమునకు వెలుగైయున్నారు. కొండపై కట్టబడిన పట్టణము మరుగైయుండ జాలదు.ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు ,మీ వెలుగును వారి యెదుట ప్రకాశింపనిండు.  

 ఒక పర్వతం మీద కట్టబడిన పట్టణం దాచబడలేదు.  మీ కాంతిని  ఇతరుల ముందు ప్రకాశింప నిండు అప్పుడు వారు మీ మంచి పనులను చూసి పరలోకమున ఉన్న మీ తండ్రిని  మహిమ పరుస్తారు.  ఏమిటి ఈ మాటల యొక్క అర్ధం. 

ప్రభువు  వెలుగు  గురించి చెబుతున్నప్పుడు వాని యొక్క అర్ధము , మనము ఈ లోకమునకు వెలుగుగా ఉన్నాము అని అంటే వెలుగు మనకు కాంతిని ఇవ్వడమేకాదు , మనం ఎటువంటి అపాయములలో చిక్కుకొనకుండా ఉండుటకు ఉపయోగ పడుతుంది. క్రైస్తవుని జీవితం ఇతరులు ఎవరు అపాయమునకు గురికాకుండా చేస్తుంది. ఎందుకు అంటే ఎలా ప్రయాణించాలో క్రైస్తవుడు వెలుగులో ఉండుటవలన  అతనికి తెలుస్తుంది. పాపం అనే అంధకారంలో పడిపోకుండా లోకాన్ని కాపాడవలసిన బాధ్యత, ఇతరులను హెచ్చరించ వలసిన బాధ్యత క్రైస్తవుని మీద ఉంది. 

యేసు ప్రభువు నేనే ఈ లోకానికి వెలుగును అని చెబుతున్నారు. అలానే అయన శిష్యులు కూడా ఈలోకానికి వెలుగు వలె ఉన్నారు అని చెబుతున్నారు. ఈ మాటలకు అర్ధం ఏమిటి అంటే మనం ఆయన వలె జీవించాలసిన ఆవశ్యకత ఉంది అని మనం నేర్చుకోవాలి. ఆయన ఏ విధంగా మనకు వెలుగు అంటే యేసు ప్రభువు దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు వారి జీవితం గురించి పూర్తిగా తెలుసుకుంటున్నారు. వారి జీవితాలు వారి ముందే కనపడుతున్నాయి. మరియు వారి గురించి తెలుసుకున్నవారు పూర్తిగా ఎలా జీవించాలో యేసు ప్రభువు ద్వారా తెలుసు కుంటున్నారు. కనుక మనం ఇతరులకు వారి జీవితాలు ఎలా ఉన్నాయో చెప్పేలా , వారు ఎలా జీవించాలో తెలిపేలా మనం జీవితాలు ఉండాలి. 

ఈ సువిశేష భాగం మనకు క్రైస్తవ ఔన్నత్యాన్ని మనకు తెలియజేస్తుంది. కనుక  మొదటిగా క్రీస్తు అనుచరులు క్రీస్తు వలె జీవించడం  నేర్చుకోవాలి.   క్రైస్తవులు వారి యొక్క జీవిత విధానాన్ని  ఇతరులకు సుమాతృకలు తీసుకురావాలి. ఇతరులు ఎలా జీవించాలి అని నేర్చుకునే విధముగా క్రైస్తవ జీవితాలు ఉండాలి.  క్రై స్తవులు వారి జీవిత విధానం ద్వారా ఇతరులకు మార్గ చూపరులుగా ఉండాలి.  నిజమైన ఆధ్యాత్మిక చింతన వైపు ప్రజలను మార్చవలసిన గొప్ప బాధ్యత క్రైస్తవుల మీద ఉన్నది. ఇది  ప్రతి క్రైస్తవుని కర్తవ్యం.  మనము కేవలం వెలుగు మాత్రమే కాదు, ఇతరులకు మన వెలుగు చూపించవలసిన వాళ్ళము. అంటే మన మంచి పనులను చూసి ఇతరులు దేవుని తెలుసుకొనే విధంగా మన పనులు ఉండాలి. వాని ద్వారా వారు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తారు. కనుక ఆ విధంగా జీవించుటకు ప్రయత్నించుదాం.  


  

తపస్సు కాల రెండవ ఆదివారం

తపస్సు కాల రెండవ ఆదివారం 

మత్తయి 17: 1-9 

ఆరు దినములు గడిచిన పిమ్మట  యేసు  పేతురును, యాకోబును, అతని సహోదరుడగు యోహానును తనవెంట తీసుకొని, ఒక ఉన్నత పర్వతముపైకి  ఏకాంతముగా వెళ్లెను. అచట వారి యెదుట యేసు రూపాంతరము చెందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. అయన వస్త్రములు వెలుగు వలె తెల్లగానయ్యెను. ఆయనతో మోషే, ఏలీయాలు సంభాషించుచున్నట్లు వారికి కనబడిరి. అప్పుడు పేతురు "ప్రభూ !మనము ఇచటనుండుట మంచిది. నీకు అనుమతియైనచో నేను నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఎలియాకు మూడు శిబిరములను నిర్మింతును" అని పలికెను. అంతలో ఓక కాంతివంతమైన మేఘము వారిని ఆవరించెను. అప్పుడు అదిగో ఆ మేఘము నుండి "ఈయన నా కుమారుడు, నాకు ప్రియమైనవాడు. ఈయనను గూర్చి నేను ఆనందభరితుడనైతిని. ఈయనను ఆలకింపుడు", అను వాని వినిపించెను. ఇది వినిన శిష్యులు మిక్కిలి భయభ్రాంతులై బోరగిలపడిరి. అప్పుడు యేసు వారి కడకువచ్చి, వారిని తట్టి , "లెండు , భయపడకుడు"అని పలికెను. అంతట వారు కనులెత్తిచూడగా వారికి యేసు తప్ప మరెవ్వరును కనిపించలేదు. వారు ఆ పర్వతమునుండి దిగి వచ్చుచుండగా యేసు వారితో " మనుష్య కుమారుడు మృతులనుండి లేపబడువరకు మీరు ఈ దర్శనమును గూర్చి ఎవ్వరితో చెప్పరాదు" అని ఆజ్ఞాపించెను. 

యేసు ప్రభువు రూపాంతరికరణ  ప్రభువుని జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. రూపాంతరికరణకు   మెటమోర్పో  అనే గ్రీకు పదంని  వాడటం జరిగినది. రూపంతరీకరణ  అంటే ఒక రూపం నుండి మరియొక రూపం లోనికి మారటం. పేతరు గారు ఈ సంఘటన జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నాను అని తన లేఖలో కూడా చెప్పారు. రూపంతరీకరణను పేతురుగారు యేసు ప్రభువు మహిమాన్విత రూపం అని చెబుతున్నారు. అంటే  ప్రభువు తన దైవ రూపంలో ఉండటం . 1పేతురు 5:1 2 పేతురు 1:15-21.

యేసు ప్రభువు పునరుత్థానము తరువాత,  అందరు ఆయన మహిమ పరుపబడిన  శరీరం కలవాడు అని తెలుసుకున్నారు. ఆయన మానవునిగా జీవించి ఉండగానే ఆయనకు ఆప్తులుగా ఉన్న కొంత మంది  శిష్యులు  ఆయన ఏవిధంగా ఈ మహిమాన్వితమైన శరీరంలో ఉండారో తెలుసుకున్నారు వారు పేతురు ,యాకోబు మరియు యోహానులు. 

యేసు ప్రభువు ఈ ముగ్గురు శిష్యులను తీసుకొని పర్వతం మీదకు ప్రార్ధన చేయుటకు వెళ్లారు. అక్కడ ఆయన ప్రార్ధన చేయుచుండగా   ఆయన ముఖం కాంతివంతమైంది. మనం ప్రార్ధన చేయుటవలన దేవుని    మహిమను చూడగలుగుతాం. 

ఈ దివ్య రూపధారణకు ముందుగానే యేసు ప్రభువు తన శిష్యులకు తన శ్రమలు, మరణం మరియు పునరుత్థానం గురించి చెప్పారు. కాని  అది శిష్యులకు రుచించలేదు. దాని తరువాత యేసు ప్రభుని  రక్షణ కార్య చివరి ఘట్ట సమయంలో, తన   తండ్రి యొక్క ఆమోదం కోసం, ప్రార్ధన చేసుకోవాలని పర్వతం మీదకు వెళ్లారు. 

శిష్యులను వెంటబెట్టుకొని తీసుకెళ్లుట 

తనతో యేసు ప్రభువు ముగ్గురుశిష్యులను తీసుకొని వెళ్లారు. వీళ్ళు ఎవరు? మొదటిగా  పేతురు గారు శ్రమలు పొందడం ఇష్టం లేని వ్యక్తి. తరువాత యోహను, యాకోబులు వీరు యేసు ప్రభువు, కుడి ఎడమ స్థానాల కోసం అడిగిన వారు. ఎందుకు వీరిని యేసు ప్రభువు తీసుకొని వెళుతున్నారు? యేసు ప్రభువుని రక్షకునిగా గుర్తించిన తరువాతనే ఆయన తన మరణం గురించి మాటలాడారు.ఎందుకు ఈ రూపాంతరికరణ అనేది ముఖ్యం అంటే తన శిష్యులకు యేసు ప్రభువు ఎవరో? ఆయన చేసే పని ఏమిటో  ముందుగా తెలియాలి. దాని ద్వారా వారిలో ఉన్న కొన్ని చెడు అభిప్రాయాలు మారిపోవాలి. ఆయన శ్రమలు, సిలువ మరణం వారు అంగీకరించి దానిని  అర్ధం చేసుకొని, శ్రమలు ఉండకూడదు అనే మనస్తత్వం పోయి, గొప్ప  ఆసనాలు కోరుకునే స్థితి పోయి దైవ ఇష్ట జీవితానికి వారు ప్రాముఖ్యత ఇవ్వడం నేర్చుకోవాలి. 

యేసు ప్రభువు  కేవలం ఒక గొప్ప వ్యక్తి మాత్రమే అయితే ఆయన మరణానికి అంత ప్రాముఖ్యత వుండదు. ఆయన దేవుని మెస్సీయ్య, రక్షకుడు, సజీవుడైన దేవుని కుమారుడు అని వారు తెలుసుకున్న తరువాత ఆయన తన మహిమను చూపుతున్నాడు. తన సహజమైన స్వరూపాన్నిరూపాంతరికరణ ద్వారా వారికి చూపుతున్నారు.

 పేతురు గారు ఆయనను దేవుని రక్షకుడు అని ప్రకటించిన తరువాత మీలో కొందరు దేవుని రాజ్యం చూసేవరకుమరణించరని యేసుప్రభువు చెప్పారు. నిజానికి అది ఇక్కడ జరుగుతుంది.  యేసుప్రభువుని మహిమ  సాక్షాత్కారం అవుతుంది ఇక్కడ. రూపాంతరికరణ ఏదో ఒక దర్శనం కాదు. వారు చూసిన యేసు ప్రభుని మహిమ. తన ముఖము  సూర్యుని వలె వెలిగిపోతుంది. తన దైవత్వం వారికి చూపించబడింది. ఆయన దేవుని వెలుగు. హెబ్రీ 1:3.

శిష్యుల సాక్ష్యం 

యేసు ప్రభుని  రూపాంతరికరణ  చాలా సమయం పట్టింది. యోహను గారు తన సువిశేషంలో దీనిని రాస్తున్నారు. యోహను 1:14 . మేము ఆయన మహిమను చూసాము. పేతరు గారు కూడా దీని గురించి చెప్పారు. 1పేతరు 1:16-17. యేసు పునరుత్థానం తరువాతనే వారు దీని ప్రాముఖ్యత గురించి వివరిస్తున్నారు. 

యేసు ప్రభువు రూపాంతరికరణ జరుగుతున్న సమయంలో శిష్యులు నిశబ్దంగా ఉన్నారు. నిశబ్దంగా ఉన్నారు అంటే మాటలాడకుండా ఉండటం కాదు, దేవుని సాన్నిద్ధ్యంలో మాటలకు అంతుపట్టని అనుభూతిని అనుభవించడం. లూకా 2:9 వ వచనంలో మరియ మాత కూడా  ఈ సంగతులనెళ్ళా తన హృదయంలో మననం చేసుకుంటూ జీవించింది అని చూస్తాం. ఇక్కడ కూడా జరుగుతుంది ఇదే, వారు దైవనుభూతిలో నిమగ్నమైఉన్నారు.   కైసరియా పిలిప్పీ ప్రాంతం లో  యేసు ప్రభువు,  మనుష్య కుమారుడు తన మహిమతో వచ్చే వరకు మీలో కొంత మంది చనిపోరు అని చెప్పారు, ఆమహిమ ఇదే కావచ్చు. 

మోషే మరియు  ఏలియా  కనబడుట

మోషే మరియు  ఏలియా, యేసు ప్రభువుతో పాటు మహిమలో కనబడుతున్నారు. వారు యేసు ప్రభువుతో మాట్లాడుతున్నారు. వారు ఎందుకు ఇక్కడ ఉన్నారు? దీనికి కారణం, పాత నిబంధన  యొక్క సారాంశం  యేసు క్రీస్తు మాటలకు అనుకూలంగా జీవించుటలోనే  వుంది. యేసు ప్రభువు అనేక సార్లు  ప్రవక్తల ప్రభోదం మరియు ధర్మ శాస్త్రం యొక్క  సారంశం గురించి భోదంచి, వాటికి విలువ వివ్వడమే కాకుండ  వాటిని వివరిస్తున్నారు. 

ఈనాటి సువిశేషం లో ధర్మ శాస్త్ర మరియు ప్రవక్తల ప్రతినిధులుగా మోషే ఏలియాలు  క్రీస్తు నాధుని మహిమాలో  కనబడ్డారు. అంటే ధర్మ శాస్త్రానికి మరియు ప్రవక్తల ప్రభోదానికి  విలువ, అర్దం వచ్చేది  యేసు క్రీస్తులోనే, అంతే కాదు వాటికి పరిపూర్ణత చేకూరేది క్రీస్తు ద్వారానే.  

ఇది ధర్మశాస్త్రం మరియు ప్రవక్తల కలియక అని,  లేక దేవుని రాజ్యం, చనిపోయిన పునీతులు మరియు చనిపోని  పునీతులతో కలిసి ఉంటుంది అని చెబుతుంటారు, అక్కడ వారు ఆయన నిర్గమం  గురించి మాటలాడుతున్నారు. వీరే ఎందుకు అంటే ? మోషే మరియు ఏలియా,  యేసు ప్రభువు చేసే పనిమీద  పూర్తిగా అవగాహన ఉన్న వారు.  మోషే ద్వార నిర్గమ కాండం లో మనం చూస్తాము , నిర్గమ కాండం ప్రయాణం ద్వారా ఐగుప్తు నుండి వారికి విముక్తి లభించింది. అలానే క్రీస్తు ప్రభుని  శిలువ శ్రమల ద్వార మానవాళికి రక్షణ వస్తుంది. ఏలియా ప్రవక్త అక్కడ ఉండటం, క్రీస్తు ప్రభువు  రక్షకునిగా వచ్చు, విషయాన్ని సూచిస్తుంది. పాత నిబంధనలో చివరి ప్రవచనంలో ఇది మనం చూస్తున్నాం. మాలకి 4:5-6 . ఏలియా క్రీస్తు  ప్రభుని రాకకు ముందు రావాలి అని మనం ఇక్కడ చూస్తాం.

 ఏలియా దేవుని సన్నీది లో ఉన్నటువంటి వాడు.  మోషే దేవున్ని  సినాయి పర్వతం మీద చూసిన వాడు. వీరిద్దరూ ఒకరకంగా దేవున్ని చూసిన వారు. దేవుని మీద అత్యంత ప్రేమ కలిగిన వారు, దేవుని గురించి తప్పుగా మాటలాడితే తట్టుకోలేని వారు, బాలు దేవత పూజారులతో గొడవ పడ్డారు ఏలియా ప్రవక్త.  అదే విధంగా దేవుని గురించి అందరు గొప్పగా చెప్పుకోవాలని కోరుకునే వారు మోషేగారు. దేవునికి ప్రజలు వ్యతిరేఖంగా జీవిస్తున్నపుడు, ఎడారిలో దేవుని మీద తిరుగబడినప్పడు దేవుడు వారిని శిక్షించాలని అనుకున్నప్పుడు ఆయన దేవునితో మీరు అలా చేస్తే, ఇతర ప్రజలు మీ గురించి వీరిని దేవుడు తమ సొంత ప్రాంతానికి తీసుకెళ్లలేక పోయాడు అనుకుంటారు, అలా చేయవద్దు అని అడుగుతున్నారు.  వీరు  పవిత్రం గ్రంధం లో ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలకు  ప్రతినిధులు మోషే ధర్మ శాస్త్రం పొందారు దేవుని నుండి , ఏలియా ప్రవక్తల ప్రతినిది. మరియు దైవ సాన్నిద్యంలో జీవించేవాడు. 

 పరలోక స్వరం 

పేతరు గారు, మనం మూడు గూడారాలను నిర్మించి  ఇక్కడే  ఉందాము అని చేప్పిన సందర్బంలో అక్కడ  పరలోకం నుండి తండ్రి స్వరం వినబడుతుంది. మేఘం వారిని కప్పి వేస్తుంది. ఇది  పాత నిబంధంలో ఉన్న దైవ సాన్నిధ్యంను గుర్తు చేస్తుంది. ద్వితీ 18:18. నిర్గ 24:15-18.  అలానే ఇక్కడ కూడా మనకు దేవుని స్వరం వినబడుతుంది. ఈయన నా ప్రియమైన కుమారుడు, ఇతని యందు నేను మిగుల ఆనందించితిని, ఈయనను ఆలకింపుడు అని ఆ స్వరం వినబడుతుంది.  ఇక్కడ దేవుని వాక్కు శిష్యుల కొరకు వస్తుంది. వారు ఆయన మాట  వినాలి. వారు అక్కడ ఆయనను ఆరాధించారు తెలియకుండానే. వారు కళ్ళు తెరచి చూడగా అక్కడ  వారికి ఏమి కనబడలేదు.

 దేవుని మాట "ఈయన నా ప్రియమైన కుమారుడు , ఈయనను ఆలకించండి". సువార్తలో ఇది మాత్రమే తండ్రి యొక్క స్వరం, చాలా అరుదుగా మనం తండ్రి మాట వింటాం. అదికూడా ఒకే ఒక మాట చెబుతుంది. తండ్రి స్వరం చెప్పేది ఈయనను వినండి అని. పేతరు, యోహను యాకోబులు ఇప్పుడు ఈ మాటలు వింటున్నారు, ఎవరైతే శ్రమలు వద్దు అనే వారో, కుడి ఎడమలు ఆసనాలు అడిగేవారో , వింటున్నారు. శ్రమలు, మరణం  

ఏమి వినాలి యేసు ప్రభువు దగ్గర నుండి, ఆయన మాటలు మొత్తం దేని గురించి? ఆయన మాటలు వింటే ఏమి ఉంటుంది ? అని ఒక సారి మనం ఆలోచిస్తే మన జీవితం ఎలా ఉండాలి అని ఆయన భోధిస్తున్నారు. ఆయన మాట విని జీవిస్తే దానిలో జీవం ఉంటుంది, వారికి నిత్య జీవం ఉంటుంది. ధర్మ శాస్త్రం మొత్తం ఇక్కడ పరి పూర్ణత సంతరించుకుంటుంది. ప్రవక్తల ప్రభోదంకు అర్ధం సమకూరుతుంది. 

రూపాంతరికరణ ఏమి తెలియ జేస్తుంది 

రూపాంతరికరణ యొక్క ఆవశ్యకత చాలా గొప్పది. మొదటిగా అది పన్నెండు మంది శిష్యులకు యేసు ప్రభువు ఇచ్చిన వాగ్దానం. మీలో కొంతమంది దేవుని రాజ్యం చూసినంత వరకు చనిపోరు అని వాగ్ధానం ఇచ్చారు. రూపాంతరికరణ దేవుని రాజ్యనికి ఒక చిన్న నమూనా లాంటిది. యేసు ప్రభువు తన మహిమలో వచ్చిన సమయంలో ఈ విధంగా ఉంటుంది.

 ఈ విషయం రోమియులకు రాసిన 11 వ అధ్యాయంలో 25 వచనం పౌలు గారు దీనిని వెల్లడి చేస్తున్నారు. యేసు రూపాంతరికరణ యేసు ప్రభువు మెస్సీయ్య అని తెలియచేస్తుంది. ధర్మ శాస్త్రం మరియు ప్రవక్తలు ఈయన గురించి ముందుగా  తెలియ చేస్తారు. రూపాంతరికరణ  యేసు ప్రభువు శ్రమలు, సిలువ మరణం పొంది అటుతరువాత మహిమ పొందుతాడు అని తెలియ చేస్తుంది. ఈ రూపాంతరికరణ మరణం తరువాత జీవితం ఉంది అని తెలియ చేసుంది. ఎందుకంటే మోషే మరియు ఏలియా ఇద్దరు జీవిస్తున్నారు. వారు యేసు ప్రభువు తో మాటలాడుతున్నారు.

ఈ రూపాంతరికరణ నిజంగా  యేసు ప్రభువు ఎవరో,ఆయన నిజ స్వరూపం ఏమిటో  , ఆయన ఏమి చేస్తారో అర్ధం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది ఆయన దైవత్వం, మహిమ మరియు ఆయన రక్షణకుడు అని తెలుపుతుంది. ఇది అంతా ఒక ఎత్తు అయితే తండ్రి యొక్క స్వరం మరియొక ఎత్తు. తండ్రి స్వరం ఆయన్ను వినండి అని చెపుతుంది. ఆయనను వినడం వలన మన జీవితాలు పరిపూర్ణత సంతరించుకుంటాయి. కనుక ఎల్లప్పుడు మనం ఆయన మాటలను వింటూ పాటిద్దాం.   

లూకా 5: 33-39

 లూకా 5: 33-39 "యోహాను శిష్యులు తరచుగా ఉపవాసములు, ప్రార్ధనలు చేసెదరు. అటులనే పరిసయ్యుల శిష్యులను చేయుదురు. కాని, మీ శిష్యులు మాత్రము తి...