26, ఫిబ్రవరి 2026, గురువారం

పదహారవసామాన్యఆదివారం

 

పదహారవసామాన్యఆదివారం

సొ.జ్ఞాన 12:13,16-19

రోమ 8:26-27

మత్తయి 13:24-43

                                                                                                                    బ్రదర్సుభాష్సిడి 

 

మొదటిపఠనందేవుడుతానున్యాయంమరియుదయగలదేవుడిగాచూపిస్తున్నాడు.

దేవుడు తన ప్రజలు పశ్చాత్తాపపడాలని ఎదురు చూస్తున్నాడుదేవుడు తన ప్రజలు నీతిగా జీవించాలని కోరుకుంటాడుదేవుడు తన ప్రజలకు నీతిమంతమైన జీవితాన్ని గడపడానికి స్వేచ్ఛనిచ్చాడు.

మళ్లీమళ్లీ పాపంచేయడం మరియు తప్పుచేయడం మానవత్వందయ మరియు క్షమించడం దైవత్వంఅని మొదటిపఠనం వివరిస్తుంది. దేవుడు న్యాయమైన మరియు దయగలతండ్రిఅతను ప్రతిఒక్కరినీ సమానంగా చూస్తాడుఆయన మనందరికీ రక్షణపొందే అవకాశాన్ని కల్పిస్తాడుమరియు ఎవరైనా దేవునిశక్తిని అనుమానించినప్పుడుదేవునిశక్తి వివిధమార్గాల్లో ప్రజలకు చూపబడుతుందిమానవులనుఖండించడానికిదేవునికిఅధికారంఉందికానీ ఆయన ఇంకా మనల్ని ఓపికగా భరిస్తున్నాడు.

Vs.19. దేవుడు తన ప్రజలు పశ్చాత్తాపపడుటకు వేచియుండుట మరియు ఆయన వారిని క్షమించుట మనము చూస్తాముఅలాగే దేవుడు మనలను కూడా తానుచేసినట్లుగాఒకరినొకరు క్షమించాలని కోరుకుంటున్నాడుతన ప్రజలు నీతిగా జీవించాలని ఆయన కోరుకుంటాడుదయ మరియు క్షమాపణవంటి దేవుని లక్షణాలను కలిగి ఉండమని ఆయన మనలను ఆహ్వానిస్తున్నాడు.

మంచిచేసేవారు దేవుని బిడ్డలని మరియు చెడుచేసేవారు సాతాను బిడ్డలని తెలియచేస్తున్నారు .

కావున దేవుడు మనలను తన మంచిబిడ్డలుగా ఉండమనికోరుచున్నాడు

 

కీర్తన: 86:5-6,9-10,15-16 : ఇది దయకోసం దేవునికి ప్రార్థన.

 

రెండవ పఠనంఆత్మ మనకొరకు దేవునితో విజ్ఞాపన చేస్తుంది.

స్వభావరీత్యా మానవులు బలహీనులుపాపంవైపు సులభంగా పడిపోతారుమనము తరచుగా పాపపుఉచ్చులో పడిపోతాముమన సోదరులను ప్రేమించడంలో విఫలమవుతాముఇతరులను క్షమించడంలో విఫలమవుతాముమరొకరి అవసరంలో మనం కనికరంచూపడంలో విఫలమవుతాము.

కానీ ఆత్మ అలాంటి వారందరికీ సహాయం చేయడానికి మరియు అవసరమైనది చేయడానికి సహకరిస్తుంది అని పునీత పౌలుగారు చెపుతున్నారుఆత్మమనలోఉందిమన తరపున తండ్రికి విజ్ఞప్తి చేస్తుంది మరియు దేవుణ్ణి తండ్రి అని సంభోదించుటకు వీలు కల్పిస్తుందికాబట్టి మానవులుగా మనం శరీరానికి వ్యతిరేకంగామన కోరికలు మరియు స్వార్థపూరిత వైఖరితో పోరాడుతామని పౌలుగారు చెపుతున్నారుమనం యేసు ద్వారా మనతండ్రికి ప్రార్థిస్తున్నప్పుడు ఆత్మ నిజానికి మనలో మూలుగుతూ ఉంటుందిమరియు యేసుక్రీస్తుద్వారా మనం ప్రార్థనలో ఏది అడిగినా తండ్రి అయిన దేవుడు మనకు సమాధానం ఇస్తాడు లేదా దయచేస్తాడు అని పునీత పౌలుగారు చెపుతున్నారు.

సువిశేషం:ఈ సువార్తపఠనం గత ఆదివారం యేసు చేసిన ప్రసంగం యొక్క కొనసాగింపు.

నేటి సువార్తలోయేసు పరలోక రాజ్యం గురించి వివరించడానికి మూడు ఉపమానాలు చెప్పాడుయేసు జన సమూహంతో ఉపమానాలుగా ఎందుకు మాట్లాడతాడో మరియు శిష్యులకు విత్తువాడు యొక్క ఉపమానాన్ని ఎందుకు వివరించాడో కూడా తెలియచేస్తుంది.

మొదటి ఉపమానం పరలోకరాజ్యం విత్తువాడు (దేవుడు)తో పోల్చబడిందని చెబుతుందిమరియు పొలమును ప్రపంచం తోపోల్చారుమరియు మంచి విత్తనాలను గోధుమలతో (దేవునిబిడ్డలుగామరియు చెడువిత్తనాలను కలుపు మొక్కలతో (సాతానుబిడ్డలుగాశత్రువును (చెడు)గా పోల్చారు.

ఇక్కడవిత్తువాడు కలుపు విత్తనాలను పొలములో చల్లెనా?

లేదుకానీ ఒక శత్రువు అసూయతో అలాచేశాడు.

దేవుడుచెడ్డవారినిసృష్టించాడా?

లేదుకానీ దుర్మార్గుడు సాతాను చెడును మంచిదని చూపించడం ద్వారాప్రజలను ప్రలోభపెట్టడం లేదా ప్రజలను పాపపు మార్గాన నడిపిస్తున్నాడు .ప్రజలు చెడు వైపు ఎందుకు మొగ్గుచూపుతారు,  ఎందుకంటే

-చెడు ఆకర్షణీయంగా ఉంటుంది.

చెడు ప్రలోభపెడుతుంది.

చెడు అందంగా కనిపిస్తుంది.

-చెడు మంచివలె నటిస్తుంది.

సుఖాలుశక్తి,  లేదా సంపద మొదలైన వాటి రూపంలో చెడు మానవుడిని ప్రలోభపెడుతుందిఅయితేగోధుమలు మరియు కలుపుమొక్కలు కలిసి పెరుగుతాయి మరియు పంటలను సేకరించేవరకు అవి గుర్తించబడవుఅదేవిధంగా ప్రపంచంలో మంచివ్యక్తులు (దేవునిబిడ్డలుగామరియు చెడ్డవ్యక్తులు (చెడుబిడ్డలుగాకలిసిజీవిస్తారు.  తుది తీర్పు వరకు ఏది మంచి మరియు చెడు అనేది గ్రహించబడదు.

విత్తువాడు చివరి వరకు ఓపికపట్టిగోధుమలు మరియు కలుపుమొక్కలను వేరుచేస్తాడుఅలాగే దేవుడు కూడా చాలా ఓపికగా ఉంటాడుచెడ్డ వ్యక్తులు మంచి వారిగా మారాలని ఎదురుచూస్తాడుమరియు తీర్పు రోజున అతను మంచి మరియు చెడులను వేరుచేస్తాడుమంచి వ్యక్తులు దేవునిబిడ్డలుగా అవుతారు మరియు వారు పరలోక రాజ్యాన్ని వారసత్వంగా పొందుతారుమరియు చెడుప్రజలు చెడుబిడ్డలుగా,  నిత్య నరకాగ్ని వారికి వారసత్వంగా ఉంటుంది.

 ఉపమానం దేవుని సహనాన్ని మరియు దీర్ఘశాంతాన్ని నొక్కి చెబుతుందిఎందుకంటే అతను గోధుమలు మరియు కలుపు మొక్కలను రెండింటినీ పంట వరకు కలిసి పెరగడానికి అనుమతించాడుఇది చివరి తీర్పు  మరియు పశ్చాత్తాపానికి ప్రతీక.

ఎదుగుదల మరియు ఫలవంతంవిశ్వాసుల జీవితాల్లో ఆధ్యాత్మిక వృద్ధి మరియు ఫలవంతమైన ప్రాముఖ్యతను  ఉపమానం వివరిస్తుంది.ఇది గోధుమల ద్వారా ప్రాతినిధ్యం వహిస్తుందినిజమైన విశ్వాసం మరియు నీతివంతమైన జీవనం యొక్క అవసరాన్ని నొక్కి చెబుతుంది.

రెండవ ఉపమానం ధ్యానించి నట్లయితేదేవుని రాజ్యం ఆవగింజలాంటి దనిఅది ఒకపెద్ద చెట్టుగా మారి ఆకాశ  పక్షులకు ఆశ్రయం అవుతుందిక్రైస్తవమతం యొక్క విశ్వాసం ప్రారంభంలో చిన్నదికావచ్చు కానీ తరువాత అది పెరుగుతుంది మరియు అనేక మంది ప్రజలుసంస్కృతులు మరియు దేశాలుదేవుని ప్రేమను అర్థం చేసుకొనిదేవుని రాజ్యం మనం ఊహించిన దానికంటే భిన్నమైనదని గ్రహిస్తారు.దేవుని రాజ్యం దయ మరియు కరుణతో నిండి ఉంది అని గ్రహిస్తారు.

మనం నిద్రలో ఉన్నప్పుడు అంటే అజాగ్రత్తతో ఉంటె శత్రువు ఉద్దేశపూర్వకంగానే నాశనం చేయడానికి వచ్చి పొలంలో కలుపు మొక్కలను చల్లుతారుఅంటే మనం మెలుకువగా ఉండాలి లేదా మన చుట్టూ ఉన్నచెడు గురించి జాగ్రత్తలుతెలుసుకోవాలిపునీత పేతురు గారు తన లేఖలలో నిబ్బరమైన బుద్ధిగల వారై మెలకువగా ఉండుడిమీ విరోధియైన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.” (1పేతురు 5:8).

కాబట్టి ఈ ఉపమానం మనలను ప్రార్థనలో అవగాహన కలిగి ఉండాలని బోధిస్తుందివిఫలమవ్వకుండానిత్యమూ ప్రార్థన చెయ్యమనికోరుతున్నాడుఎందుకంటే సాతాను మనవెంటే పొంచి ఉంటుంది.

మూడవ ఉపమానం ద్వారా మనందరం కూడా పులిసిన పిండి వలె ఉండమని , మనం కుటుంబాల్లో మరియు సమాజాలలోదేవుని ప్రేమ మరియు దయను వ్యాప్తిచేయడం లేదా ఇతరులకు మంచితనాన్ని పంచుకోవడంలో పులిసిన పిండిలాగా ఉండాలిమనం కూడా భూమిపై దేవుని రాజ్యాన్ని విస్తరింపచేయాలని ఈమూడుపఠనాలు మనల్నికోరుతున్నాయి.

 

15వ సామాన్య ఆదివారం

 

15వ సామాన్య ఆదివారం

యెషయ 55:10-11
రోమియులు 8 18-23
మత్తయి 13:1-23

ఈనాటి దివ్య పఠణాలు దేవుని యొక్క వాక్కుకు ఉన్నటువంటి గొప్ప శక్తిని గురించి బోధిస్తూ ఉన్నాయి. దేవుని యొక్క వాక్కు మనందరినీ కూడా ఎంతో ప్రభావితం చేసి, మార్చి వేస్తూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యం ప్రకటించిన సందర్భంలో అది ప్రతి ఒక్కరిలో ఏదో ఒక విధమైనటువంటి ప్రేరణ కలిగిస్తుంది. దేవుని యొక్క వాక్యం ప్రకటించిన సందర్భంలో అది కొన్నిసార్లు ప్రజల యొక్క జీవితంలో ఎటువంటి మార్పు తీసుకురాని సందర్భంలో మనం నిరాశ చెందకూడదు అని కూడా ఈ దివ్య పఠణాలు మనకు సెలవిస్తున్నాయి. ఒక విధముగా చెప్పాలి అంటే ఈనాడు మనం విన్నటువంటి ఈ దివ్య పఠణాలు మనకు గుర్తు చేసే అంశం ఏమిటంటే ఏ విధముగా దేవుని యొక్క వాక్యమును మనము వ్యక్తిగతంగా స్వీకరిస్తూ ఉన్నాము అలాగే దేవుని యొక్క వాక్కు మన జీవితములను ఫలభరితము చేస్తూ ఉన్నదా లేదా. దేవుని యొక్క వాక్కు యొక్క గొప్పతనము. కీర్తన 119:9-11, 105
2 తిమోతి 3:16
హెబ్రీ 4:12
ఈనాటి మొదటి పట్టణంలో యెషయ ప్రవక్త బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు దేవుని యొక్క వాక్యమును ప్రకటిస్తున్నారు.యెషయ  ప్రవక్త ప్రభువు యొక్క వాక్కును వానతోను,మంచుతోను పోల్చి చెబుతున్నారు. వానయు, మంచు ఈ రెండిటికి కూడా జీవమును ఇచ్చే శక్తి ఉన్నది. ఎందుకంటే వాన భూమి మీద పడిన సందర్భంలో అది కొత్త మొలకలు పుట్టే లాగా సహాయపడుతూ ఉంది. అదే విధంగా వానయు, మంచుయు జీవన మనుగడను కొనసాగిస్తుంటాయి ఎందుకంటే నీరు లేకపోతే మనం, జంతువులు, వృక్షములు బ్రతుకలేం. దేవుని యొక్క వాక్కు మన అందరిలో కూడా కొత్త జీవమును పుట్టిస్తుంది.ప్రభువు యొక్క వాక్కు ప్రకటించిన సందర్భంలో అది మనలో ఏదో ఒక విధమైన ప్రేరేపణ కలిగిస్తూ ఉంటుంది. యెషయ ప్రవక్త పలికినటువంటి ఈ మాటల యొక్క సంపూర్ణ అర్ధాన్ని గ్రహించాలి అంటే ఆనాటి సందర్భం తెలుసుకోవాలి. క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలో ఇశ్రాయేలు ప్రజలు బాబిలోనియా  దేశంలో బానిసత్వపు జీవితం గడుపుతున్నారు. అక్కడ అనేక కష్టాలు పడుతూ తమకు విముక్తి ఎప్పుడు కలుగుతుందా? అని ఆశతో ఎదురు చూస్తూ నిరాశతో నిస్పృహలతో కృంగి నశించి బాధపడుతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు దేవుని యొక్క వాక్కు ద్వారా ఊరటనిస్తున్నారు. యావే దేవుడు తప్పనిసరిగా ఇశ్రాయేలు ప్రజలకు విముక్తిని దయచేసి మనకు తిరిగి తీసుకొని పోతారని, రక్షణ ప్రసాదిస్తారని ప్రవక్త ప్రజలకు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించారు. ఇస్రాయేలు ప్రజలు ప్రభువు యొక్క వాక్కును కూడా విశ్వసించాలి అని యెషయ ప్రవక్త తెలియజేస్తున్నారు. అదేవిధంగా దేవుని యొక్క వాక్కు శక్తివంతమైనదని విశ్వాసనీయమైనదని సృష్టికి మూలమైనదని, నడిపించే వాక్కుని, ప్రేమించే వాక్కు అని, క్షమించే వాక్కు అని ప్రవక్త తెలియజేస్తున్నారు. ప్రభు యొక్క మాటకు తిరుగులేదు, అది తన కార్యాన్ని తప్పక సాధిస్తుంది. ఏ విధముగానయితే కురిసిన వర్షం వృధాగా పోదో అలాగే ప్రకటించినటువంటి దైవవాక్కు వృధాగా పోదు. వానయు మంచు పంట ఎదుగుదలకు కృషి చేస్తాయి అలాగే దైవ వాక్కు కూడా మన యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకు కృషి చేస్తూ ఉంటుంది. దేవుని యొక్క సంతోషకరమైనటువంటి వార్త ప్రకటించుట ద్వారా ఇశ్రాయేలు ప్రజలలో ఒక కొత్త నమ్మకం, కొత్త ఆశలు పుట్టుకొని వచ్చాయి. ఇది దేవుని యొక్క వాక్కుకు ఉన్నటువంటి శక్తి.
ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు మన యొక్క ఆధ్యాత్మిక జీవితము నశించిపోవుటను గురించి తెలియజేస్తున్నారు. ఈ లోక సంబంధమైన జీవితం జీవిస్తే మన యొక్క ఆధ్యాత్మిక జీవితం నశించి పోతూ ఉంటుంది.  ఏసుప్రభు యొక్క మార్గంలో నడిచినటువంటి పునీత పౌలు గారు రోమీయులను దేవుని యొక్క వాక్కును విశ్వసించమని కోరుతున్నారు. ఆదాము యొక్క పాపము ఈ లోకంలోకి వినాశనమును తీసుకుని వచ్చింది అదేవిధంగా ఈ సృష్టికి మరియు మానవాళికి నాశనమును తీసుకొని వచ్చింది. ఆదికాండము 3:14-19 మనకు తెలిపే అంశము ఏ విధముగా సృష్టి నాశనం అవుతున్నది మానవుని ఒక పాపము వలన. పౌలు గారు తెలిపే అంశమేమిటంటే క్రీస్తు ప్రభువు మనలను రక్షిస్తారు.
ఈనాటి సువిశేషం లో యేసు క్రీస్తు ప్రభువు వారు అందరూ అర్థం చేసుకునే విధంగా ఉపమాన రీతిగా దేవుని యొక్క వాక్కుకు ఉన్నటువంటి శక్తిని గురించి తెలియజేస్తున్నారు. విత్తువాడు విత్తనములు వెదజల్లుటకు వెళుతున్నారు. విత్తనాలు చల్లే సందర్భంలో కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని విత్తనాలు రాతినేలపడ్డాయి, ఇంకొన్ని విత్తనాలు,  కొన్ని ముళ్ళ పొదల మధ్య పడ్డాయి మరికొన్ని విత్తనాలు సారవంతమైన నేలపై పడినవి. ఈ ఉపమానంలో చల్లబడిన విత్తనము ఒక్కటే కానీ ఆ విత్తనములు పడినటువంటి స్థలములు నాలుగు రకములు.
విత్తనము చల్లినది దేవుడే ఆ యొక్క విత్తనము దేవుని యొక్క వాక్యం. చల్లబడినటువంటి స్థలములు మనందరిని కూడా సూచిస్తున్నాయి. ప్రతి ఒక్క రైతు విత్తనములు చల్లిన సందర్భంలో ఒక మంచి ప్రతిఫలాన్ని ఆశిస్తారు. పంట వేసే సందర్భంలో ఏ రైతు కూడా తాను వేసిన విత్తనాలన్నీ ఫలిస్తాయని తలంచడు. కొన్ని విత్తనాలు గాలికి  కొట్టుకొని పోవచ్చు, కొన్ని విత్తనాలు మొలకలు రావచ్చు కొన్ని విత్తనాలు తాలు గింజలు ఉండవచ్చు కాబట్టి ఆయన 100% ఫలమును ఆశించడు కానీ వేసినటువంటి పంట మాత్రం తప్పకుండా లభిస్తుందని విత్తనాలు వెదజల్లుతాడు. ఈ విత్తనాలు పడినటువంటి నాలుగు స్థలాలు మన జీవితములను ఏ విధంగా పోలి ఉన్నాయి అని తెలుసుకుందాం.
1. త్రోవ పక్కపడిన విత్తనాలు
త్రోవ పక్కన పడిన విత్తనాలు మొలక ఎత్తటానికి చాలా కష్టం ఎందుకంటే నేల గట్టిగా ఉంటుంది కాబట్టి. నేల మీద పడిన విత్తనాలు భూమిలోనికి స్వొచ్చుకపోలేనందువలన వాటిని పక్షులు వచ్చి తిని వేస్తాయి. అలాగే ఆ మార్గం గుండా నడిచి వెళ్లేవారు ఆ విత్తనాలను త్రొక్కి వేస్తారు. ఈ యొక్క స్థలమును పోలిన వారు దేవుని యొక్క వాక్కును నామమాత్రంగా వింటారు ఆ యొక్క వాక్కు లోనికి పోనందువలన వారి యొక్క జీవితంపై ఎటువంటి ప్రభావితం ఉండదు. వాస్తవానికి ఈ యొక్క విత్తనాన్ని పోలిన వారు వారి యొక్క హృదయములను ఈ లోక సంబంధమైన విషయంతో మూసేస్తారు అందుకని దేవుడి యొక్క వాక్యం వారిలో ప్రవేశించదు కావున ఆ యొక్క వాక్యం ఎటువంటి ప్రతిఫలమును వారి జీవితంలో ఇవ్వదు.
2. రాతి నేలపై పడిన విత్తనాలు
ఈ యొక్క నేలను పోలినటువంటి వారు ఎక్కువ భావోద్వేగాలను కలిగినటువంటి వారు వారు ఎప్పుడు కొత్తదనం కోసం ఎదురు చూస్తూనే ఉంటూ ఉంటారు కానీ జీవితంలో దేని మీద కూడా సరియైనటువంటి ఆసక్తి చూపనై ఉంటారు. ఇలాంటివారు దేవుని యొక్క వాక్కును విన్నటువంటి సందర్భంలో బాగానే ఉంటారు సంతోషిస్తారు ఆసక్తిగా వింటారు కానీ కొద్ది సమయంకే ఆ యొక్క వాక్కు నుండి వారు వేరే అంశముల వైపు పయనిస్తారు. మొదట్లో వారు చాలా ఆసక్తిగా ఉంటారు కానీ తర్వాత తర్వాత వారి యొక్క ఇంట్రెస్ట్ దేవుని యొక్క వాక్కు మీద తగ్గిపోతుంది. పవిత్ర గ్రంథంలో యోహాను సువార్తలో దీనికి తగినటువంటి ఉదాహరణ ఉంది. ఏసుప్రభువుని వెంబడించే శిష్యులు అనేక అనేకమంది ఉన్నప్పటికీ ఎప్పుడైతే తాను ప్రజలకు తన యొక్క శరీర రక్తాలను భోజనంగా ఇస్తారని చెప్పారో అప్పుడు ఆ మాటలను వారు స్వీకరించడానికి అంగీకరించలేరు. ఆ మాటలు వారు జీర్ణించుకోలేకపోయారు. మొదట్లో యేసు ప్రభువు చెప్పినటువంటి మాటలన్నీ కూడా వారికి సంతోషంగానే, వినసొంపుగా ఉన్నాయి కానీ కొద్దిసేపటికే వారికి దేవుని మీద , దేవుని యొక్క ఆ వాక్కు మీద ఉన్నటువంటి ఆసక్తి పోయింది అందుకే వారు క్రీస్తు ప్రభువుని వెంబడించలేకపోయారు . యోహాను 6:60
3. ముళ్ళ పొదల్లో పడినటువంటి విత్తనములు
ఈ విత్తనములు పోలిన వారు మొదట్లో దేవుని యొక్క వాక్యమును విని కొంత సమయం వరకు ఆచరిస్తూ ఉంటారు కానీ ఈ లోక సంబంధమైన వ్యసనాలు, వ్యామోహాలు వారిని ఈ లోకానికి పరిమితం చేస్తాయి. సైతాన్ కి సంబంధించినటువంటి అలవాట్లు కలిగిన వారు దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువ కాలం పాటించలేరు. ఎవరి యొక్క ఆలోచనలైతే ధనం మీద గాని, అధికారం మీద కానీ పేరు ప్రతిష్టల మీద కానీ ఉంటాయో వారు ఎక్కువగా వీటి గురించే ఆలోచన చేస్తారే అలాంటి వారిలో దేవుని యొక్క వాక్కు ప్రభావం ఎక్కువగా ఉండదు. వారు దేవుని యొక్క వాక్కు ప్రకారంగా జీవించాలి అని అనుకోరు. చాలామంది దేవుని యొక్క వాక్కు ప్రకారంగా జీవించలేక పోతారు ఎందుకంటే దైవవాక్కు కన్నా ఈ లోక సంబంధమైన విషయాలే వారిని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. చాలామంది ఈ విత్తనమును పోలి ఉంటారు ఎందుకంటే వాక్యమును వింటారు కానీ ఆ వాక్యానికి తగినటువంటి జీవితం జీవించరు.
4. సారవంతమైన నేల మీద పడిన విత్తనములు
ఈ నేలను పోలిన వారు దేవుని యొక్క వాక్యమును విని విన్నటువంటి వాక్యమును ఆచరించేవారు. వారి జీవితంలో ఎన్ని శోధనలు వచ్చిన, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా, సమస్యలు వచ్చిన వారు పడిపోరు విశ్వాసాన్ని కోల్పోరు దేవుని యొక్క వాక్కు అనుసారముగా ప్రతినిత్యం జీవిస్తూ ఉంటారు. దేవుని యొక్క వాక్కు అనుసరించే సందర్భంలో ప్రాణాలను సైతం కోల్పోవుటకు వారు ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు ఇలాంటి వారి జీవితంలో వారు ముప్పదంతలుగా అరవ దంతులగా నూరంతులుగా ప్రతి ఫలమును చూస్తారు వారు అడిగిన ప్రతి వరమును దేవుడు దయచేసి ఉంటారు. మనందరం కూడా సారవంతమైన నేలను పోలిన వ్యక్తులుగా ఉండాలి అన్నదే దేవుని యొక్క కోరిక అందుకే దేవుడు ప్రవక్తల తర్వాత ప్రవక్తలను రాజుల తర్వాత రాజులను యాజకుల తర్వాత యాజకులను సేవకుల తర్వాత సేవకులను సేవకుల తర్వాత సేవకులను పంపిస్తున్నారు వాక్యమును బోధించేలాగా చేస్తున్నారు ఆ వాక్యము ద్వారా మన అందరి జీవితాలు మారాలి అని మనందరి జీవితం ప్రతిఫలం ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు కాబట్టి దేవుడి యొక్క వాక్యమును ఏ విధముగా స్వీకరిస్తున్నారు ఏ విధముగా ఆలకిస్తున్నాం ఏ విధముగా ఆచరిస్తున్నాం అని మనందరం కూడా వ్యక్తిగతంగా ఆలోచన చేసుకోవాలి. దేవుని యొక్క వాక్కు ఎంతో శక్తివంతమైంది కాబట్టి ఆ వాక్యము క అనుసారంగా మనం జీవించి మన జీవితాలను దేవునికి అనుగుణంగా మార్చుకోవాలి.

Fr. Balayesu OCD

లూకా 5: 33-39

 లూకా 5: 33-39 "యోహాను శిష్యులు తరచుగా ఉపవాసములు, ప్రార్ధనలు చేసెదరు. అటులనే పరిసయ్యుల శిష్యులను చేయుదురు. కాని, మీ శిష్యులు మాత్రము తి...