26, ఫిబ్రవరి 2026, గురువారం

పదునాల్గవ సామాన్య ఆదివారం

 పదునాల్గవ సామాన్య ఆదివారం

జెకరియా 9: 9-10, 
రోమా 8: 9, 11-13, 
మత్తయి  11: 25-30

                      బ్రదర్. సుభాష్ ఓ.సి.డి

క్రీస్తుపూర్వం 538 వ సంవత్సరం యిస్రాయేలు ప్రజలు బబులోనియా బానిసత్వం నుండి తిరిగివచ్చిన కాలం.
యిస్రాయేలు ప్రజలను పరిపాలించుటకు ఈ రాజులూ కూడా లేరు . యిస్రాయేలు ప్రజలు స్వతంత్రులు, కానీ ముఖ్య అధికారం మాత్రం యూదులు, పర్షియా, గ్రీసు మరియు రోమీయులది. కానీ యిస్రాయేలు ప్రజలకు ఏ రాజునూ లేడు. దేవాలయం ధ్వంసం చేయబడింది ప్రజల జీవితములో శాంతి లేదు.
ఈ సమయములో జెకర్యా మరియు హగ్గయి  ప్రవక్తలు ఇద్దరు కూడా దేవాలయ నిర్మాణంలో   యిస్రాయేలు ప్రజలను ప్రోత్సహిస్తారు.
ఆ సందర్భంలో జెకరియా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలను  సంతోష పరిచే వాక్యాలే  మొదటి పఠనంలో చూస్తున్నాము.
9. వచనంలో చూస్తున్నాం, యూదా మరియు యిస్రాయేలు ప్రజలారా మీరు సంతసించండి నేను మీ మధ్య నివసించబోతున్నాను. ఒక శాంతి యుతమైనటువంటి రాజ్యాన్ని స్థాపిస్తాను. మీ శాంతి రాజు గాడిదపై ఊరేగింపుగా వచ్చును అని చెపుతున్నాను. 
రాజులు గుఱ్ఱములపై  లేదా అశ్వములపై  లేదా రథములపైనా కదా ఊరేగింపుగా వస్తారు గాడిదమీద రావటం ఏమిటి?.
ఇక్కడ గాడిద అనే జంతువు వినమ్రతకు, శాంతి సూచనగా నిలుస్తుంది. 
గొప్ప రాజులుకూడా గాడిదపైన ఉరేగింపబడ్డారు. జాయిరు, యిస్రాయేలు ప్రజల ఏడవ నాయకుడు. తన ముప్పది మంది కుమారులతో ముప్పది గాడిదలపై స్వారీ చేసి గిలియాద్ దేశములో ముప్పది పట్టణములను దాడి చేసెను. (న్యాయాధిపతులు 10: 4) 
సొలొమోను మహారాజు కూడా గాడిదపై ప్రయాణించెను (1రాజుల  1 :33). దావీదు మహారాజు కుమారులు కూడా గాడిదపై పర్వతములలోకి పారిపోయాను (2వ సమూయేలు 13 : 29 ). దావీదు మహారాజు కుమారుడు అబ్షాలోము గాడిదపై స్వారీ చేసెను (2వ సమూయేలు 18 : 9 )
ఇక్కడ గాడిదను తక్కువ విలువగల  జంతువుగా కాకుండా గాడిదయొక్క వినమ్రతను ముఖ్యమైన అంశముగా మనం గ్రహించాలి.
10 వ వచనంలో ప్రభువు ఇట్లనుచున్నాడు. నేను యిస్రాయేలు నుండి రథములను యెరూషలేమునుండి యుద్దఅశ్వములను  తొలగింతును ధనస్సులను  నాశనం చేసెదను.
ఇక్కడ రథములు, ధనస్సులు అధికారానికి గుర్తు. కానీ దేవుడు రథములను తొలగిస్తాను  అంటున్నాడు, ధనస్సులను నాశనం చేస్తా అంటున్నాడు.  అంటే అధికారాన్ని తీసివేస్తా అని చెపుతున్నాడు.
యుద్ధాశ్వములు యుద్దానికి ఉపోయోగించే జంతువులు యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉంటాయి. రాజులకు ఒక శక్తి, బలం లాంటివి. దేవుడు వాటిని కూడా తొలగిస్తానని అంటున్నాడు.
యుద్దాలు శత్రుత్వానికి, చంపుకోవడానికి, చావడానికి గుర్తు. 
ఇక యుద్దాలు జరగవు, శాంతిని దయచేస్తాను అని అంటున్నాడు. మిమ్మలను శాంతితో పరిపాలించుటకు రాజు రాబోవుచున్నాడు అని ప్రభువు జెకర్యా ప్రవక్త ద్వారా పలుకుచున్నాడు.
సువిశేషం:
 25 - 27 వచనాలలో క్రీస్తు ప్రభువు, తండ్రి దేవుడిని స్తుతిస్తున్నారు. ఈ వాక్యాలు యూదుల అధికారములను ధర్మశాస్త్ర బోధకులను, పరిస్సయులను ఉద్దేశించినవి. ఈ వచనంలో దేవుడికి క్రీస్తు ప్రభువుకి మధ్య ఉన్న సంబంధాన్ని ప్రేమను మనం గమనించవచ్చు.
అంతేకాక “విజ్ఞులకు, వివేకావంతులకు” ,” వీటిని”, “పసిబిడ్డలకు”  “మరుగు పరచి” “బయలు పరచి” అనే  పదాలను వింటున్నాము.
విజ్ఞులకు, వివేకవంతులు :- అంటే యూదులు అధికారులు, ధర్మశాస్త్ర బోధకులు, పరిసయులు, గర్వాత్ములు క్రీస్తుని రాజుగాను, దేవుని  కుమారుడగును, రక్షకుడిగాను విశ్వశించని వారు నిరాకరించనివారు.
వీటిని :- క్రీస్తు చేసేటటువంటి అద్భుత కార్యాలు, స్వస్థతలు, మంచి పనులు (పరమ రహస్యాలు) 
పసిబిడ్డలు :- అంటే వయస్సు పరంగా కాదు ఇక్కడ ప్రభువు వ్యక్తుత్వన్ని గురించి మాట్లాడుతున్నాడు. వినమ్ర హృదయులు కలిగిన వారు, పేదలు, దరిద్రులు, పాపాత్ములు  క్రీస్తుని తమ రాజుగా స్వీకరించిన వారు, క్రీస్తు రక్షకుడిగా విశ్వసించినవారు.
మరుగుపరచి:- తొలగించి, తీసివేయబడి. విజ్ఞులు మరియు వివేకవంతుల, నుండి తీసివేయటం 
బయలు పరచటం:- పసిబిడ్డలు వంటి వ్యక్తుత్వం, మంచితనం కలిగిన వారికీ దేవుని ఆశిర్వాదములు బయలుపరచబడ్డాయి.
సొలొమోను మహారాజు  వలె విజ్ఞానం, వివేకం ఉంది దేవుని యందు విశ్వాసం మరియు మంచితనం లేకపోతె మరి ఎందుకు పనికిరాము, దేవునిచే తిరస్కరించబడుతాం.
28 - 30 వచనాలను ధ్యానిస్తే: - ఈ వచనాలు, జీవితంలో, మానసిక, శారీరక, ఆత్మలో, భారంగా నలిగి పోతున్న ప్రజలకు, క్రీస్తు పలుకుతున్న వచనాలు, “భారముచే అలసి సొలసి ఉన్న జనులారా నాయొద్దకు రండి విశ్రాంతినిస్తాను”. అని అంటున్నాడు. 
అంటే క్రీస్తు ప్రభువు మనందరినీ ఆహ్వానిస్తున్నారు. శాంతిని పొందుటకు, రక్షణ పొందుటకు, సంతోషంగా ఉండుటకు.
 పునీత  అగస్తీను  గారు " నా ఆత్మా నీలో కలవనిదే దానికి శాంతి లేదు" అని చెపుతారు. 
ఎప్పుడైతే దేవుని చెంతకు వస్తామో, మన ఆత్మలు దేవునిలో లీనమవుతాయో మనకు కూడా శాంతి లభిస్తుంది.
యూదుల మతాచారాలు వారి చట్టాలు, వారి పరిపాలన ప్రజలకు చాల భారమైంది, శాంతి లేని ఒక అన్యాయపు పరిపాలన యూదులు ప్రజలపై భారం మోపుదురు, కానీ వారి చిటికిన వ్రేలుకూడా సహాయం చేయడానికి కదుపరు. మత్తయి 23 : 4 
యూదా సిద్దాంతాలతో, చట్టాలతో ప్రజలు నలిగి సతమతమవుతున్నారు, కానీ వారు మాత్రం సుఖవంతమైన జీవితాన్ని జీవించేవారు. 
కానీ క్రీస్తు మాత్రం యూదులకంటే భిన్నంగా ప్రజల భారాన్ని కూడా మోశారు.
నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది . ఏమిటి దీని అర్థం?
ఇక్కడ క్రీస్తు ప్రభువు తన సిద్దాంతాలతో , ధర్మశాస్త్ర బోధకులు లేదా యూదుల చట్టాలను పోల్చి చెపుతున్నారు.
యూదుల చట్టాలు " ప్రాణానికి ప్రాణం , కంటికి కన్ను , పంటికి పన్ను, చేతికి చేయి, కాలికి కాలు, దెబ్బకు దెబ్బ నిర్గమ 21 వ అధ్యాయంలో చూస్తున్నాం.  ఈ విధంగా ఉంటుంది. అంటే ప్రతీకారం అనే చట్టం యూదులది. 
యేసు కాడి,  ప్రేమతో కూడినది, దైవ ప్రేమ, సోదర ప్రేమ.
క్రీస్తుని  చట్టం నీ శత్రువులను ప్రేమింపుము, వారికోసం ప్రార్థన చేయుము. క్రీస్తు చట్టంలో క్షమా , దయ , జాలి, సహాయం, కనికరం ఉంటాయి. కానీ యూదా చట్టంలో ఇవేవి ఉండవు.
క్రీస్తు ఈ లోకంలో శాంతిని నెలకొల్పడం కోసం గాడిదపైన వినమ్రుడై , ఉరేగించబడ్డాడు, శ్రమలు అనుభవించి , అవమానాలు పొంది, యూదులు మోపిన సిలువ అనే భారాన్ని మోసి మనకోసం మరణించాడు.
క్షమించు అనే మాట ద్వారా లోకమంతటికి శాంతిని నెలకొల్పాడు.
రెండవ పఠనం;
దేవుని ఆత్మ మనలో వాసమై ఉందని పునీత పౌలు గారు పలుకుతున్నారు.
కాబట్టి మనము ఇక శరీరానికి భానిసలము కాము. ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించమని కోరుతున్నారు. 
13 వ వచనంలో మనము శరీరాను సారంగా జీవిస్తే, మనం మరణిస్తాం. ఆత్మచే జీవిస్తే మరణించినను జీవిస్తాము అని అంటున్నారు. 
ఎందుకంటే ఒక సందర్భంలో పౌలుగారు ఈవిధంగా పలుకుతున్నారు మన హృదయాలు దేవుని ఆలయాలు కాబట్టి దేవుడు మనలో ఉన్నప్పుడు మనము కూడా దేవుడివలె జీవించాలని మనకు తెలియచేస్తున్నారు. 
చివరిగా ఈ మూడు పఠనాలు మనందరినీ కూడా సువిశేషంలో క్రీస్తు ప్రభువు బోధించిన విధంగా 29 వ వచనం . సాధుశీలుడుగను, వినమ్ర హృదయము కలిగి జీవించాలి అప్పుడే మన ఆత్మలకు శాంతి లభిస్తుంది.
మత్తయి 5 : 5  వినమ్ర హృదయులు ధన్యులు, వారు భూమికి వారసులు అగుదురు.
మత్తయి 5 : 9 శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు.
కాబట్టి మనందరం కూడా క్రీస్తు వాలే శాంతి స్థాపకులుగా, మన కుటుంబాలలో , మన సంఘాలలో ఒక నిర్మలమైన జీవితాన్ని జీవించుదాం

13 వ సామాన్య ఆదివారం

 13 వ సామాన్య ఆదివారం

2రాజులు 4: 8-11, 14-16

రోమా 6: 3-4, 8-11

మత్తయి 10: 37-42

ఈనాటి  దివ్య గ్రంథ పఠనాలు దేవుని యొక్క సేవ చేసేటటువంటి వారి యొక్క జీవితమును గురించి తెలియజేయబడుతున్నాయి. దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి సువార్త సేవకులు,దేవుడిని ప్రేమిస్తూ, పొరుగు వారిని ప్రేమిస్తూ దేవునికి సాక్ష్యం ఇస్తూ జీవించాలి. సువార్త సేవకులు కూడా ఒక త్యాగపూరితమైన జీవితం జీవించాలి అనే అంశము గురించి కూడా ఈనాటి దివ్య ప ఠణనాలు మనకు గుర్తు చేస్తున్నాయి. దేవుని శిష్యులుగా ఉండాలి అంటే వారి జీవితంలో అనేక రకాలైన త్యాగాలు చేయాలి.

ఈనాటి మొదటి పఠనంలో దేవుని యొక్క ప్రవక్త అయిన ఎలిషాకు షునేము పట్టణంలో ఉన్న ఒక సంపన్నురాలు ఆతిథ్యం ఇచ్చినటువంటి విధానం మనం తెలుసుకుంటున్నాం. ఎలీషా ప్రవక్త దేవుని యొక్క సేవకుడని గుర్తించి తాను చేసేటటువంటి పరిచర్యకు షునేము పట్టణంలో ఉన్న సంపన్నురాలు సహకరించింది. ఈమె ఎలీషాకు ఆహ్వానం ఇచ్చి ఆతిథ్యమిచ్చి స్వయంగా తన యొక్క ఇంటి మీదనే అతని కొరకు బస చేయుటకు ఒక గదిని నిర్మించి దానిలో ఒక మంచాన్ని, బల్లను, కుర్చీని, దీపాన్ని ఏర్పాటు చేసింది. ఈ సంపన్నురాలు దేవుని యొక్క రక్షణ కార్యములో తన వంతు సహకారం తాను చేస్తుంది. ఈ సంపన్నురాలు దేవుని యందు అచంచల విశ్వాసం కలిగినటువంటి ఒక వ్యక్తి. దేవుడు తనకిచ్చినటువంటి వరాల ద్వారా ఇతరులకు సహాయం చేస్తుంది. దేవుని యొక్క పని కోసం తనకు సాధ్యమైన విధంగా ఆమె ఎలీషాకు భోజనం పెట్టి, వారి యొక్క బాగోగులను చూసుకున్నారు. ఆమె యొక్క మంచితనమును, ప్రేమను, విశ్వాసమును చూసిన ఎలీషా ప్రవక్త ఈ విశ్వాసికి కృతజ్ఞత తెలపాలి అని భావించారు దానికి గాను తన కుటుంబంలో సంతానం లేదని తన శిష్యుడైన గెహాజీ ద్వారా తెలుసుకొని వారికి సంతాన వరమును ప్రసాదించారు. ఈనాటి మొదటి పట్టణం ద్వారా మనం గ్రహించవలసిన సత్యమేమిటంటే ఇతరులకు మేలు చేస్తే ఆ మేలు ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవుడు ఎవరి రూపాన ఏ అవసరంలో మన కుటుంబాన్ని సందర్శిస్తారు తెలియదు కాబట్టి వచ్చినటువంటి వారిని ప్రేమతో స్వీకరిస్తూ వారికి సాధ్యమైన విధంగా మంచి చేస్తే అది ఒక గొప్ప ఆశీర్వాదంగా మారుతుంది. అదేవిధంగా ఏ కుటుంబం అయితే దేవుని యొక్క సేవకులను గుర్తించి వారికి పరిచర్య చేస్తూ వారిని బాధ పెట్టకుండా మంచిగా చూసుకుంటారో ఆ కుటుంబము ఎల్లప్పుడూ కూడా దీవించబడుతుంది. క్రీస్తు ప్రభువై స్వయముగా తన శిష్యులతో అంటున్నారు మేము స్వీకరించిన వారు నన్ను స్వీకరిస్తారు అలాగే నన్ను పంపిన వారిని కూడా స్వీకరిస్తారని. ఈ సంపన్నురాలు కేవలము ఎలిషాను మాత్రమే కాదు తన ఇంటికి ఆహ్వానించింది స్వయముగా దేవుడిని తన ఇంటిలోనికి ఆహ్వానించింది అందుకనే ఆమె కుటుంబంలో దేవుడు ఒక గొప్ప కార్యం చేస్తున్నారు భర్త వృద్ధుడైనప్పటికిని వారు చేసినటువంటి మంచి పనికి గాను దేవుడు అసాధ్యమైన కార్యం సుసాధ్యం చేస్తున్నారు వారు ఆయన ఎడల గొప్ప ప్రేమను చాటి చెప్పారు అందుకే దేవుడు వారిని దీవించారు. ఈ సంపన్నురాలు ఎలీషా ప్రవక్తకు ప్రత్యక్షంగా సువార్త సేవకు సహకరించకపోయినప్పటికీ పరోక్షంగా ఆమె సహకరించారు అలాగే మనం కూడా సువార్త సేవకులకు సహకరించాలి.

రోమీ-12:13

హెబ్రి-13:2

1పేతు-1:4-9

ఈనాటి రెండవ పట్టణంలో పునీత పౌలు గారు మనందరం కూడా క్రీస్తు నందు జ్ఞాన స్నానం పొందినట్లయితే క్రీస్తు మరణం మందు జ్ఞాన స్నానము పొందుతామని మనందరికీ కూడా గుర్తు చేస్తున్నారు. క్రీస్తుతో మరణించుట అంటే మనం కూడా మన యొక్క పాపములకు మరణించి ఒక కొత్త జీవితమును జీవించాలి అప్పుడే మన యొక్క జీవితమునకు సరియైనటువంటి అర్థం ఉంటుంది. ఏ విధముగానయితే క్రీస్తు ప్రభువు యొక్క పునరుత్థానం ఒక కొత్తదనము తీసుకుని వచ్చినదో అదే విధముగా మనము కూడా క్రీస్తుతో మన యొక్క పాపములకు మరణించినట్లయితే ఒక పవిత్రమైన, కొత్తదైన, సంతోషకరమైనటి జీవితం జీవించవచ్చు అదియే పునీత పౌలు గారు మనకు తెలియచేసే అంశం.

ఈనాటి సువిశేష పట్టణంలో ఏసుప్రభు యొక్క శిష్యులకు ఉండవలసినటువంటి కొన్ని లక్షల గురించి మత్తయి సువార్తికుడు మనకు తెలియచేస్తున్నారు ప్రభు యొక్క శిష్యులకు ఉండవలసిన మొట్టమొదటి లక్షణం అన్నిటికంటే దేవుడిని ఎక్కువగా దేవుడిని ఎక్కువగా ప్రేమించడం అంటే తమ యొక్క జీవితంలో మొట్టమొదటి ప్రాధాన్యత దేవునికి ఇచ్చుటయే. ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువుల మీద కాకుండా వ్యక్తుల మీద కాకుండా ప్రేమ నంతయు దేవుని మీద చూపించినప్పుడే మనం గొప్ప సాక్షి పూరిత జీవితం జీవిస్తున్నాం. చాలా సందర్భాలలో మనందరం కూడా ఈ లోకంలో ఉన్న వ్యక్తులను వస్తువులను ప్రేమిస్తుంటాం వాటికే ప్రాధాన్యతనిస్తుంటా కానీ ఏసుప్రభు ఎవరైతే తన శిష్యులుగా ఉండాలి అనుకుంటున్నారో వారు మొట్టమొదటిగా తమ జీవితంలో దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి అని తెలుపుచున్నారు. ఎందుకంటే దేవుడే వారిని తన ముఖ పోలికలో సృజించారు, వారిని దీవించారు ఎన్నుకున్నారు. కాబట్టి వారు తమ జీవితంలో అన్నిటికన్నా దేవుడిని ఎక్కువగా ప్రేమిస్తూ ప్రాధాన్యతనిస్తూ జీవించాలి. దేవునికి ప్రాముఖ్యతను ఇవ్వటం ద్వారా  వారు దేవుని యొక్క కుటుంబంలో భాగస్తులు అవుతారు.

రెండవ లక్షణం- ఏసుప్రభు యొక్క శిష్యులుగా ఉండాలి అంటే వారికి ఉండవలసిన రెండవ లక్షణం ఏమిటంటే తమ శిలువను తాము ఎత్తుకొని దేవుడిని వెంబడించాలి. యూదుల నమ్మకం ప్రకారం సిలువ శిక్ష అనేది అతిపెద్ద తప్పిదం చేసిన వారికి వేసేటటువంటి శిక్ష అయితే ఈ సిలువ యూదులకు అవమానంగా ఉన్నది కానీ క్రీస్తు ప్రభువు తన శిష్యులకు నేర్పిన విషయం ఏమిటంటే సిలువను ఎత్తుకొని రావటం అంటే వారి జీవితంలో గొప్ప క్షమించే గుణమును కలిగి ఉండటం, అవమానాలు భరించటం, నిందలు మోయటం. సిలువను ఎత్తుకొని రావటం అంటే బాధలు కష్టాలు సమస్యలు అన్నిటిని కూడా ప్రేమతో భరించుకొని స్వీకరించుకొని క్రీస్తు ప్రభువును వెంబడించుట అలాగే సిలువను ఎత్తుకొని ఏసుక్రీస్తును అనుసరించడం అంటే సమస్తమును కూడా విడిచిపెట్టి దేవుడిని వెంబడించుటయే. వీటన్నిటినీ చేకొని క్రీస్తు ప్రభువుని అనుసరించాలి. చాలా సందర్భాలలో మనము సిలువను తృణీకరిస్తాం కానీ క్రీస్తు ప్రభువు మనందరినీ కూడా సిలువను ఎత్తుకొని తనను అనుసరించమన్నారు అనగా ఈ క్షమించే గుణములు కలిగి అవమానాలు భరించి అలాగే సమస్తమును త్యజించుకొని క్రీస్తు ప్రభువుని అనుసరించాలి.

మూడో లక్షణం-దేవుని కొరకు మన జీవితములను కోల్పోవుట మనం కలిగి ఉండాలి. మన జీవితంలో మన యొక్క స్వార్ధపు ఆలోచనలకు కాకుండా స్వార్థపు జీవితం కాకుండా మన కొరకు మనము జీవించకుండా క్రీస్తు కొరకు జీవించాలి అప్పుడే ఆ జీవితమునకు సరియైనటువంటి అర్థం ఉంటుంది. పునీతులు ఈ లోకంలో జీవించినప్పుడు తమ కొరకు తాము జీవించకుండా ఇతరుల కొరకు దేవుని కొరకు జీవించిన విధంగా మనం కూడా దేవుని కొరకు జీవించాలి.

దేవుని యొక్క సేవ చేసేటటువంటి వారికి తగినటువంటి ప్రతిఫలం దొరుకుతుందని యేసు క్రీస్తు ప్రభువు ముందుగానే తెలియజేస్తున్నారు. అలాగే ఎవరైతే దేవుని యొక్క సేవకులు వీరు అని గుర్తించి వారిని ఆదరించి మంచిగా చూసుకుంటారు వారి ఎల్లప్పుడూ కూడా దీవించబడుతుంటారు. కాబట్టి దేవుని యొక్క సేవకులను గుర్తించి వారికి మంచిని చేస్తూ మనం కూడా దేవుని యొక్క సువార్తలో భావిస్తులై జీవించుదాం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సువార్త సేవ చేసే వారికి మన వంతు సహాయం మనం చేద్దాం.

ఈనాటి పరిశుద్ధ దివ్య గ్రంథ పఠనాలు దేవుని యొక్క సేవ చేసేటటువంటి వారి యొక్క జీవితమును గురించి తెలియజేయబడుతున్నాయి. దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి సువార్త సేవకులు,దేవుడిని ప్రేమిస్తూ, పొరుగు వారిని ప్రేమిస్తూ దేవునికి సాక్ష్యం ఇస్తూ జీవించాలి. సువార్త సేవకులు కూడా ఒక త్యాగపూరితమైన జీవితం జీవించాలి అనే అంశము గురించి కూడా ఈనాటి దివ్య ప ఠణనాలు మనకు గుర్తు చేస్తున్నాయి. దేవుని శిష్యులుగా ఉండాలి అంటే వారి జీవితంలో అనేక రకాలైన త్యాగాలు చేయాలి.

Fr. Bala Yesu OCD

లూకా 5: 33-39

 లూకా 5: 33-39 "యోహాను శిష్యులు తరచుగా ఉపవాసములు, ప్రార్ధనలు చేసెదరు. అటులనే పరిసయ్యుల శిష్యులను చేయుదురు. కాని, మీ శిష్యులు మాత్రము తి...