26, ఫిబ్రవరి 2026, గురువారం

18 వ సామాన్య ఆదివారము

 

18 వ సామాన్య ఆదివారము


దివ్య రూప ధారణ మహోత్సవము

దానియేలు 7 : 9 -10 , 13 -14

2 పేతురు 1: 16 -19

మత్తయి 17 : 1 -9 

క్రీస్తు నాధుని యందు ప్రియా సహోదరి సహోదరులారా ! 

ఈనాడు మనము సామాన్య 18 వ ఆదివారములోనికి ప్రవేశించి యున్నాము. అదే విధంగా ఈనాడు యేసు క్రీస్తు ప్రభువు యొక్క దివ్య రూప ధారణా పండుగను జరుపుకొనుచున్నాము. ఈనాటి  పరిశుద్ధ గ్రంథమునందు  పఠనాల ద్వారా మనము ధ్యానించబోయే అంశము:“యేసు క్రీస్తు యొక్క రూపాంతరము మరియు సాక్షపూరిత జీవితం. ఈనాటి మొదటి గ్రంథ పఠనములో చూస్తూన్నాము7 : 14 " అతని  యొక్క రాజ్యమునకు అంతమే లేదు అని అతని పరిపాలనము శాశ్వతమైనదని వింటున్నాము". రెండొవ పఠనములో పేతురు పలుకుచుకున్నారు " మా కనులారా మేము ఆయన యొక్క గొప్పతనమును చూచితిమి. పితయగు దేవుడు ఆయనకు కీర్తినివైభవమును ప్రసాదించినపుడు మేము అచట ఉంటిమి. ఈయన నా ప్రియమైన కుమారుడుఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్న దివ్య వాణి వింటిమి. సువిశేష పఠనములో మొదటి రెండు పఠనాల ద్వారా తెలియజేయబడినట్లు దానియేలు  ప్రవక్త యొక్క  మాటల ద్వారా మరియు పేతురు మాటల ద్వారా మనము విన్నటువంటి వాక్యములన్ని కూడా ఈరోజుఈనాటి యొక్క సువిశేష పఠనములో క్రీస్తు ప్రభుని యొక్క దివ్య రూప ధారణ గురించి తెలియచేయబడినాయి.

దివ్య రూప ధారణ అంటే యేసు క్రీస్తు యొక్క రూపాంతరం పండుగ. రూపాంతరము అనేది "మెటామారుఫో" అనే గ్రీకు పదము నుండి వచ్చింది. అంటే మరొక రూపాన్ని పొందుకొనుట అని అర్ధము. భౌధిక జీవితము నుండి అధ్యాద్మిక జీవితంలోనికి మార్పు చెందటం. దేవుని బిడ్డలుగా మనము ఉండాలంటే మన పాపపు జీవితము నుండి మనము రూపాంతరము చెందాలి. అలా రూపాంతరము చెందాలి అంటే దేవునిలో మనము కాస్త పడాలి. కాస్త పడటం ద్వారా మనలో మార్పు వస్తుంది. ఆ మార్పు ఇతరుల చేత తెలియజేయబడాలె గాని మనము మారాము అనడం కాదు. ఇతరులు మనచుట్టూ పక్కల వాళ్ళు మనలను అడగాలి మన మార్పు గురించి. అప్పుడు మన మార్పు గురించి మనకి ఈ మార్పు ఎవరు ఇచ్చారో ఎవరి ద్వారా మనలో ఈ మార్పు  కలిగిందోఏ శక్తీ మనలను నడిపిస్తుందో ఆవ్యక్తి గురించి మనము మాట్లాడటమే రూపాంతరము.

ప్రియమైనటువంటి దేవుని బిడాలారా!  ఈనాటి సువిశేషములో మనము కొంతమంది వ్యక్తులను చూస్తూన్నాము. యేసు ప్రభువు ఆయనతో వచ్చిన ముగ్గురు శిష్యులు పేతురుయాకోబు మరియు యోహాను. అదే విధంగా పర్వతంపై ఇద్దరు వ్యక్తులను చూస్తూన్నారు. వారు మోషే నాయకుడు మరియు ఏలీయా ప్రవక్త. మనము ఎక్కువేసార్లు సువిశేష గ్రంధములో చుస్తూఉంటాము క్రీస్తు ప్రభువు తో ఎప్పుడు ఈ ముగ్గురు శిష్యులే కనుబడతారు. ఈ ముగ్గురికి ఈరోజు ఆ దర్శనముయినటువంటి యేసు రూపాంతరము కనబడింది. అదేవిధంగా దేవుని యొక్క స్వరము కూడా వినపడింది. యేసు మాటలు కూడా వినబడ్డాయి. మోషే ప్రజలను నడిపించే నాయకుడు. ఏలీయా ప్రవక్తలందరిలో ప్రథముడుమొదటి వాడు.

ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ! ఈనాటి రూపాంతర సమయంలో శిష్యులు ముఖ్యముగా మూడు విషయాలు చూసారువిన్నారు కూడా.

1.క్రీస్తుని ముఖము సూర్యుని వలె ప్రకాశించుట చూసారు {మత్త 17:2}

2.దేవుని యొక్క స్వరాన్ని విన్నారు. ఈయన నా ప్రియమైన కుమారుడుఅని.{మత్త 17 : 5 }

3.వీరు యేసు క్రీస్తు యొక్క స్వరము కూడా విన్నారు. లేదు భయపడకుడి అని. {మత్త17:7}

పర్వతము మీద ఒక సభ జరిగినది యేసు క్రీస్తు ప్రవక్తలతో మాట్లాడుతున్నటువంటి ఒక సభ. ఈ సమయములోనే ప్రభువుకి దివ్య రూప ధారణ జరిగింది. యేసు ప్రభువుకి దివ్యరూపధారణ ఎందుకు జరిగింది అంటే అయన శ్రమలను అనుభవించి సిలువ మరణము పొందాలనేది దేవుని యొక్క చిత్తాన్ని తెలియజేయడానికి.

యేసు శిష్యులను పర్వతము పైకి ఎందుకు తీసుకువెళ్లారుఅని మనము ధ్యానిస్తే పరవత స్థానములో దేవాలయము ఉంది. శిష్యుల స్థానంలో మనము ఉన్నాము. యేసు ప్రభువుల వారి స్థానములోజీవ వాక్యము అప్ప ద్రాక్ష రసములు ఉన్నాయి. శిష్యుల జీవితంలో జరిగిన సంఘటన  ఒక సారి మాత్రమే కానీ కథోలికులమైన మన జీవితములో పవిత్ర దివ్య బాలి పూజలో పాల్గున్న ప్రతిసారి ఈ సంఘటన జరుగుతూవున్నది. ఆ ఒక సంఘటన శిష్యుల విశ్వాసాన్ని పెంపొందిస్తే దివ్య బలిపూజలో పాల్గున్న ప్రతి సారి మన విశ్వాసం అధికమధికమై ముందుకు సాగాలని ప్రభువు ఆసిస్తున్నాడు మన నుండి.

*పరవతము నుండి దిగి వచ్చుట అనగా?క్రీస్తు ప్రభువు తిరిగి శిష్యుల వైపు వస్తూన్నారు. అంటే ప్రజల వైపుకు వస్తున్నారు అని అర్ధము. ముందుగా పర్వతమును దేవాలయముగా భావించాము. ఇప్పుడు ఆ దేవాలయమునందు ప్రభువు బయిటకు సమాజంవైపుకు ప్రజల యొద్దకు వస్తున్నారు. యేసుతో ఉండటం అంటే పర్వతము మీద( దేవాలయం) ఉండిపోవడం కాదు. గుడిలో ఉన్నప్పుడు యేసుతో సమయం గడిపినప్పుడు ఎవరికైనా ఆనందం కలుగుతుంది. అందుకే పేతురు అన్నారు  " ప్రభు మనము ఇచటనే ఉండుట మంచిది " మత్త 17 : 4  అంటే పేతురు తన జీవిత శైలిని మర్చిపోయి దేవునిలో లీనమైపోవునట్లు ఉండుట మనకు కనబడుతుంది. అంటే ఆయనకు కిందకు రావడం ఇష్టం లేక ప్రభువుతో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. దేవాలయంలో ఉండటం మంచిదే కానీ మనము అర్ధం చేసుకోవలసినది ఏంటి అంటే ప్రభువు కిందకు దిగి వచ్చింది పరలోకం నుండి దిగి వచ్చింది ప్రజలతో ఉండటానికే. వారి బాధలలోకష్టాలలో పాలుపంచుకోవడానికి. మనలను పాపపు జీవితము నుండి రక్షించ్చి పుణ్య మార్గములో నడిపించడానికి. క్రీస్తును అనుసరించే మనము భూమికి ఉప్పు వలె లోకమునకు వెలుగు వలె దీప స్తంభముపై పెట్టబడిన దీపముల ఉండాలి. యేసు ప్రభువును ఈ లోక రక్షకుడని ఈ లోకమునకు తెలిపే సాధనములుగా దేవుని ప్రేమ వాహనాలుగా మనము సేవ చేయాలి. 

ప్రియమైనటువంటి బిడ్డలారా ! ఈరోజు క్రీస్తు ప్రభు రూపాంతరాన్ని శిష్యులు చూసినట్లుగా మనము కూడా ప్రతిరోజు దివ్య బాలి పూజలో అప్ప ద్రాక్ష రసములో ఉన్న క్రీస్తు ప్రభు దర్శనాన్ని మనము కూడా చూడాలి. 1 యోహాను 3:2 లో "క్రీస్తు దర్శనం ఇచ్చినప్పుడు ఆయన యదార్ధ రూపమును చూతుము " అని అదేవిధంగా పౌలు రోమయులకు రాసిన లేఖలో కూడా 8: 17 వ వచనంలో చూసినట్లు క్రీస్తు బాధలలో మనము పాలుపంచుకొనిన యెడల అయన మహిమతో కూడా మనము భాగస్థులము అవుతాము. అదే విధంగా పౌలు కోలస్సీయులకు రాసిన లేఖలో 3 : 4 వ వచనంలో మనకు జీవమై యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు  మీరును ఆయనతో కూడా మహిమయందు కనబడుదురు. ఇవన్నీ మనము ప్రతి దివ్య బాలి పూజలో క్రీస్తు ప్రత్యక్ష రూపాన్ని చూస్తున్నాము.

రూపాంతము అంటే మార్పు ని అర్ధము చేసుకోవాలి. మనస్సు మారకపోతే శరీరం మారదు. లోపల మారితేనే బయట మార్పు కనిపిస్తుంది. మన మనసుమన క్రియలుమన ఆలోచనలు మారాలి. తద్వారా క్రీస్తు ప్రత్యక్ష రూపాన్ని మనము చూడాలి. యోహాను 3 : 3 . మనిష్యుడు నూతనముగా జన్మించిననే తప్ప దేవుని రాజ్యమును చూడజాలడని నేను నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆత్మ పరిశీలన అనేది ఎంతో అవసరం. దేవుని వాక్యమును బట్టి మనము నిజముగా దేవుని కలిగినూతన జన్మ కలిగి అయన దర్శనాన్ని శిష్యుల వాలే పొందుతున్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి.

రూపాంతరము అనగా మానవ శరీరం మహిమ శరీరంగా మారడం అని అర్ధం. ఈరోజు ఏ యొక్క దివ్య ధారణ ద్వారా క్రీస్తు ప్రభువుతో మోషేనుఏలీయాను చూస్తున్నాము. మోషే ధర్మశాస్త్రానికి ప్రతినిధి. ఏలీయా  ప్రవక్తలందరికి ప్రాథినిత్యం వహిస్తున్నాడు. రూపాంతరము అంటే బయట వెలుగు లోపలి రావడం కాదుక్రీస్తు ప్రభువులో నుండి వచ్చిన వెలుగు మహిమ బహిర్గతమైంది. యేసు తన రూపాంతర దర్శనం అయన శిష్యులు అయినటువంటి  పేతురుయాకోబుయోహానులకు పర్వతము మీద చూపించాడు. యేసు ప్రభు యొక్క పరిపూర్ణత మానవత్వ రూపంలో కనిపిస్తుంది అనగా అయన దైవత్వంతో పాటు మానవత్వం కూడా ఈ యొక్క రూపాంతరములో ప్రత్యక్షమవుతుంది. యేసు ప్రభువు శిష్యులకు కొండా మీద చూపిన దర్శనం రూపాంతరము ద్వారా కిష్టుకు సాక్షులుగా ఉన్నారు.

క్రీస్తు దివ్య రూప ధారణ చూపించడానికి ముగ్గురు సాక్షులు అయినా ఉన్నారుమరి క్రీస్తు ప్రభు ప్రతి దినము దివ్య బాలి పీఠము మీద ప్రత్యక్ష మవుతున్నారు.  2 వ పేతురు 1: 16 - 18 లో పేతురు గారు చూచిన దానిని గురించిఅనుభవించిన దానిని గురించి వివరిస్తున్నారు.  అటువంటి అనుభవం మన జీవితంలో ఉందాక్రీస్తు శిష్యుల వాలే మనము అయన ప్రత్యక్ష రూపాన్ని చూసి ఆయనకు సాక్ష్యులుగా ఉన్నామా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి.

*యేసు క్రీస్తు వాలే అయన శిష్యుల వాలే మనము భౌతికంగ రూపాంతరం చెందాలి అంటే ముందు మన మనసు రూపాంతరము చెందాలి. క్రీస్తు శిష్యులు చూచిన మహిమ మనము మరణించిన తరువాత పరలోకపు పర్వతము మీద ఆ మహిమను అనుభవించడానికి కావలసిన యోగ్యతను ఈ లోకంలో మనము సంపాదించుటకు ప్రయత్నం చేసే వారీగా ఉండాలి. మార్పు అనేది జీవితంలో ఒక నిరంతర ప్రక్రియ. మనలో చాల మందికి మారాలనే కోరిక ఉన్నప్పటికీ మారలేకపోతున్నాము. ఆ మార్పు అనేది బాహ్యంగా కాకుండా అంతరంగికంగా జరగాలి అని ప్రార్ధన చేదాం.

శ్రీ సభ బోధన ద్వారా పర్వతము మీద ప్రకాశించిన క్రీస్తు ముఖం అయన పర్వతము నుండి క్రిందకు దిగి వచ్చింది. ఆ ప్రకాశించే ముఖమును మనకు ఇచ్చి మన పాప జీవితాన్ని తాను శ్రమల ద్వారా సిలువ మరణం పొందాలి. అటువంటి మహిమ పొందినటువంటి మరియు రూపాంతరము చెందినటువంటి మన శ్రీ సభ పునీతులను మనము ఉదాహరణగా తీసుకొనవచ్చు. వారిలో ముఖ్యమైన వారు పునీత పౌలు గారుపునీత అగస్టీను గారుపునీత మాగ్దలా మరియమ్మ గారు అదేవిధంగా క్రీస్తు కోసం తమ ప్రాణాలను అర్పించినటువంటి హత సాక్షులుపునీతులు ఎందరో ఉన్నారు. వారివలె మన జీవితములో కూడా క్రీస్తు ప్రభు యొక్క మహిమను మనము కూడా పొందుకోవాలి. అయన పొందినటువంటి వెలుగును మన జీవితములో కూడా ఎల్లవేళల అనుభవిస్తూ అయన యొక్క వెలుగు బాటలో నడిచే బిడ్డలుగా ఎదగాలని ప్రార్ధన చేసుకుందాం. ఆమెన్

డీకన్. మనోజ్ చౌటపల్లి ఓ.సి.డి

17 వ సామాన్య ఆదివారం

 17 వ సామాన్య ఆదివారం

1రాజులు 3:5,7-12

 రోమా 8:28-30

 మత్తయి 13:44-52

ఈనాటి దివ్య గ్రంథణాలు పఠణాలు క్రైస్తవ విశ్వాస జీవితంలో దేవుని యొక్క విలువ తెలుసుకొని ఆయనను కలిగి ఉండుటయే ముఖ్యమైన సంపదని మనకు బోధిస్తున్నాయి. మనందరి యొక్క అనుదిన జీవితంలో ఎన్నో అంశాలలో మనం ఏది ఉత్తమము, ఏది సరైనదో దానిని మాత్రమే ఎంచుకొని దాని కొరకు జీవిస్తూ ఉంటాం అదేవిధంగా క్రైస్తవ జీవితంలో ఈ లోక సంపదల కన్నా పేరు ప్రతిష్టల కన్నా, ఆస్తిపాస్తులు కన్నా, అధికారం కన్నా, దేవుడే విలువైన వారు అని తెలుసుకొని వారిని కలిగి ఉంటే వారి జీవితంలో దేవుడు అంతయు సమకూరుస్తూ ఉంటారు. అందుకే దావీదు రాజు కీర్తనల గ్రంథం 23 వ అధ్యాయం 1 వచనంలో ప్రభువే నాకు కాపరి ఇక నాకు ఏ కొదమయు లేదు అని పలుకుతూ ఉన్నారు. 

దేవుడు తన జీవితంలో ఉంటే చాలు ఈలోక సంబంధమైనవి ఏవి కూడా తనకు అక్కరలేదు అనే అంశాన్ని దావీదు రాజు తెలుపుతున్నారు. ఆయన జీవితంలో తెలుసుకొనటువంటి సత్యం ఏమిటంటే దేవుడి కన్నా విలువైనది ఏదీ లేదు ఆయన కలిగి ఉంటే సమస్తము కూడా అందచేయబడుతుంది అని విశ్వసించాడు. ఆయన విశ్వసించిన విధంగానే దేవుడు అన్నియు సమకూర్చాడు ఎన్నో విజయాలు ప్రసాదించారు. ఈనాటి మొదటి పఠణంలో సొలోమోను రాజు యావే దేవుడిని వివేకమును, ప్రసాదించమని కోరుతున్నారు. తన తండ్రి తర్వాత ఇశ్రాయేలు ప్రజల రాజ్య బాధ్యతను స్వీకరించిన సొలోమోను రాజు ఆ ప్రజలను నడిపించుటకు తనకు కావలసినటువంటి జ్ఞానమును అడుగుచున్నారు. 

యావే దేవుడు సొలోమోను రాజుకు కలలో దర్శనమిచ్చిన సందర్భంలో సొలోమోను యొక్క వయసు దాదాపు 20 సంవత్సరాల ప్రాయం అలాంటి చిన్నతనంలో ఒక గొప్ప ప్రజలను నడిపించుటకు తన యొక్క జ్ఞానము సరిపోదని తెలుసుకొని దేవుని మీద ఆధారపడుతూ ఆయన దేవుని యొక్క వివేకము,  విజ్ఞానం కొరకు ప్రార్థిస్తున్నారు. సొలోమోను రాజు దేవుడిని సంపదలు అడగలేదు పేరు ప్రతిష్టలు అడగలేదు, శత్రువుల యొక్క నాశనాన్ని అడగలేదు, దీర్ఘాయుష్షును అడగలేదు కానీ కేవలం ఆయన అడిగినది వివేకం మాత్రమే. మంచి చెడులు తెలుసుకొని ప్రజలను సన్మార్గంలో నడిపించుటకు దేవుని యొక్క జ్ఞానం అడుగుతున్నారు ఆయన యొక్క కోరికలో నిస్వార్థం ఉన్నది. సొలోమోను అడిగినటువంటి వరము దేవునికి ప్రీతికరమైనది ఎందుకంటే ఆయన తన యొక్క ప్రజల మేలుకొరకై యొక్క వరం అడుగుతున్నారు. ప్రజల యొక్క అభివృద్ధి కొరకై, రక్షణ కొరకై అడుగుతున్నాడు కాబట్టి దేవుడు ఈ యొక్క గొప్ప కోరికను తీరుస్తూ ఉన్నారు. 

దేవుడు ఎంతటి గొప్ప వివేకమును దయ చేస్తున్నారంటే 12వ వచనంలో తెలియచేస్తున్నారు నీ ముందటి వారిలో గాని నీ తరువాత వారిలో గాని ఎవ్వరికీ లేని వివేకమును విజ్ఞానమును నీకు ప్రసాదించును అని ప్రభువు తెలియచేస్తున్నారు. దేవుడు ఎవరికీ ఇవ్వనటువంటి గొప్ప వరాన్ని సొలోమోను రాజుకు దయ చేస్తున్నారు. ఒక విధముగా చెప్పాలి అంటే సొలోమోను రాజు విజ్ఞానము విలువైనది అని తెలుసుకున్నారు అందుకనే దానిని సంపాదించుట కొరకు, ధనమును, పేరును ,అధికారమును అన్నియు త్యాగం చేసుకున్నారు. 

అన్నిటికంటే విజ్ఞానానికి, వివేకానికి సొలోమోను ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మంచి చెడ్డలను తెలుసుకునే విచక్షణా జ్ఞానంతో ప్రజల యొక్క అవసరాలను మొత్తం అర్థం చేసుకొని దేవుని చిత్తానుసారంగా ఇశ్రాయేలు ప్రజలను సొలోమోను పరిపాలించ కోరాడు అందుకే దేవుడు అతడు కోరిన వరాన్ని కోరిన వెంటనే దయచేశారు. మన జీవితంలో కూడా జ్ఞానము విలువైనదని తెలుసుకొని ఆ జ్ఞానము కొరకు దేవుడిని అర్థించాలి. ఈనాటి మొదటి పఠణం ద్వారా సొలోమోను ఏ విధంగా అయితే మంచిది కనుగొని,ఎన్నుకున్నారో అలాగే మన జీవితంలో కూడా ఏది విలువైనది అని తెలుసుకొని దానిని పొందుకోవాలి.

ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు ఎవరైతే దేవుడిని ప్రేమిస్తారో అలాగే దేవుని యొక్క ఉద్దేశానుసారంగా పిలువబడిన వారికి అంతయు మేలుయే జరుగును అని తెలుపుతున్నారు. మొదటిలో వారు కష్టాలను అనుభవించినప్పటికీ  చివరికి వారి జీవితంలో అంతా మంచే జరుగును. పౌలు గారు దేవుని చేత పిలవబడిన వారికి మేలు కలుగును అని తెలుపుతున్నారు దానికి ముఖ్యమైన ఉదాహరణ పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఏసేపు గారి జీవితమే. ఆయన జీవితము మొదట కష్టాలతో కూడుకున్నది ఐగుప్తు దేశంలో మొదటిలో కష్టాలు అనుభవించారు జైల్లో ఉన్నారు అయినప్పటికీ దేవుడు అతడిని ఎన్నుకుంటున్నారు అతడే ఐగుప్తు ప్రజలకు ప్రధానమంత్రిగా నియమింపబడుతున్నారు అలాగే కరువు కాలంలో ఆయనే భోజనమును పెట్టేటటువంటి ఒక అన్నదాత గా ఉంటున్నారు మొదటిలో ఆయన కష్టాలు అనుభవించినప్పటికీ దేవుడు అతనికి తోడుగా ఉండుటవలన అంతయు మంచియే జరిగినది. అదేవిధంగా పౌలు గారు కూడా మొదటిలో ఏసుప్రభు యొక్క సువార్తను బోధించేటటువంటి సందర్భంలో తన సొంత వారి దగ్గరకు వెళ్లి సువార్త ప్రకటన చేసినప్పుడు తనను అంగీకరించలేదు తాను కూడా కష్టాలు అనుభవించారు కానీ తర్వాత ఆయన అన్యులకు సువార్త ప్రకటించినప్పుడు వారు దానిని అంగీకరించారు మొదట్లో ఆయన కూడా కష్టాలు అనుభవించారు. దేవుడు తనకు తోడుగా ఉండటం వలన ఆయనకు మేలు ఏ జరిగింది అందుకే ఆయనను అన్యుల అపోస్తులుడు అని పిలుస్తూ ఉంటారు. దేవుడు పిలిచిన వారిని నీతిమంతులుగా చేస్తున్నారు అలాగే వారు తన యొక్క మహిమలో పాలుపంచుకొని జీవించేటటువంటి ఒక గొప్ప అర్హతను ప్రభువు దయచేస్తున్నారు వారి యొక్క జీవితంలో కష్టాలు అనుభవించినప్పటికీ కూడా దేవుడిని కలిగి ఉండుటవలన వారి జీవితంలో దేవుడు మేలులు చేస్తూ ఉన్నారు.

ఈనాటి సువిశేష పఠణంలో ఏసుక్రీస్తు పరలోక రాజ్యం గురించి మూడు ఉపమానముల ద్వారా తెలుపుతూ ఉన్నారు. దాచబడిన ధనము అను ఉపమానములో ప్రభువు ఒక వ్యక్తి తాను పొలములో పనిచేసే సమయంలో విలువైన సంపదను కనుగొని దానిని ఏ విధముగా పొందారు అనే అంశమును తెలుపుతూ ఉన్నారు. ఆ కాలంలో ప్రజలు డబ్బులు దాచుకోవటానికి ఇప్పుడున్నటువంటి బ్యాంకులు ఉండేవి కాదు మరియు ప్రజలు దొంగలకు, దోపిడీ దారులకు, యుద్దాలకు, భయపడి తమ యొక్క సంపదలను భూమిలోనే దాచి పెట్టేవారు. కొంతమంది దాచిన స్థలంలో ఆ ధనమును మళ్ళీ తీసుకొని వెళతారు మరి కొంతమంది ఆ ధనాన్ని మళ్లీ వెలికి తీసేవారు కాదు బహుశా ఆ స్థలం మరిచిపోవటంవల్ల లేకపోతే వారు మళ్ళీ అక్కడికి రాకపోవటం వల్ల. కాలక్రమేన అది పరుల కంట పడుతుంది మనం ఈరోజు చదివిన ఉపమానంలో ఒకడు భూమిని దున్నేటువంటి సమయంలో అచట పాతిపెట్టబడినటువంటి ధనమును కనుగొంటున్నారు. అది తన సొంత భూమి కాదు కనుక ఆయన తనకు ఉన్నది మొత్తం కూడా అమ్మి  ఆ పొలమును కొనుగోలు చేస్తున్నారు. ఈ యొక్క వ్యక్తి తాను అనుకోని రీతిగా సంపదను కనుగొన్నాడు కనుగొన్నటువంటి సంపదను పొందుటకు తన దగ్గర ఉన్నది మొత్తం కూడా హెచ్చించి ఆ యొక్క పొలమును తన సొంతం చేసుకున్నారు. ఆ సంపదయే విలువైనది అని గ్రహించిన ఈ వ్యక్తి తన దగ్గర ఉన్నది మొత్తం కూడా త్యాగం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే ఇది విలువైనదిగా భావించారు. అదే విధముగా రెండవ ఉపమానంలో ఒక వర్తకుడు ఆణిముత్యముల కొరకు వెదకుచున్నాడు వెదకినటువంటి వ్యక్తి ఒక ఆణిముత్యం దొరకగానే తన దగ్గర ఉన్నది మొత్తం కూడా అమ్మి వేసి ఈ యొక్క ఆణిముత్యమును తన సొంతం చేసుకుంటున్నారు. 

ఈ రెండు ఉపమానములలో ఒక అంశమును ప్రధానంగా చూస్తూ ఉన్నాం. అదేమిటంటే కనుగొనుట దాచబడిన ధనము ఉపమానములో ఒకడు ధనమును కనుగొంటున్నారు ఆణిముత్యం యొక్క ఉపమానములో వర్తకుడు ఆణిముత్యం కనుగొంటున్నాడు. వీరిద్దరూ కూడా వారు కనుగొన్నది ముఖ్యం అని అలాగే అవి విలువైనవి అని తెలుసుకొని వాటిని పొందుకోవటం కోసమై వారి దగ్గర ఉన్నది మొత్తము కూడా త్యాగం చేశారు ఎందుకంటే వారు కనుగొన్నది వారితో ఉంటే దానికన్నా ఇంకా విలువైనది ఏమీ కూడా అవసరం లేదు అని వారు తెలుసుకున్నారు కాబట్టి అందుకనే వారి దగ్గర ఉన్నది మొత్తం కూడా అమ్మి వేసి ఒకరు పొలమును కొంటున్నాడు రెండవ వ్యక్తి ఆణిముత్యమును కొంటున్నారు. ఇద్దరు కూడా ఎంతో శ్రమించారు మరీ ముఖ్యంగా వర్తకుడు ఆణిముత్యం కోసం వెదికకాడు. ఈ సువిశేష భాగంలో మనము గమనించవలసిన విషయం ఏమిటంటే వెదికిన ప్రతి వారికి కూడా దొరుకును అనే సత్యమును దేవుడు వెల్లడిస్తున్నారు. పునీత ఎడిత్  స్టెయిన్ గారు సత్యం కోసం వెదికారు వెతికిన సత్యమును ఆమె క్రీస్తు ప్రభువే అని పునీత అవిలాపురి తెరిస్సమ్మ గారి పుస్తకములో తెలుసుకున్నారు. చాలామంది విశ్వాసులకు వెదికిన చోట దేవుడు దొరికి ఉన్నారు.

అలాగే కొంతమందికి దేవుని యొక్క అనుగ్రహం వలన ఉచితముగా దేవుడే తన యొక్క వరములను వెదకకపోయినా ఇస్తారు దానికి నిదర్శనమే దాచబడిన ధనము కనుగొన్న వ్యక్తి జీవితం. ఇది కేవలము దేవుని యొక్క ఉదారతయే. మన యొక్క జీవితంలో కూడా విలువైనది పొందాలి అంటే మనం కూడా కొన్ని త్యాగం చేసుకోవాలి. కొన్ని విడిచి పెట్టాలి. మరీ ముఖ్యముగా దేవుడిని కలిగి ఉండాలి అంటే పాపమును విడిచి పెట్టాలి అలాగే గర్వమును, వ్యసనములను అన్నిటిని కూడా వదిలిపెట్టినప్పుడే విలువైన సంపద అయిన దేవుడిని మనము కలిగి ఉంటాము. మొదటిగా మనందరం కూడా తెలుసుకోవలసిన సత్యం ఏమిటంటే ఈ లోక సంపదల కన్నా అధికారం కన్నా పేరు ప్రతిష్టల కన్నా దేవుడే ఉంటే చాలు ఇంక ఏదీ కూడా అవసరం లేదు అని. ఏసుప్రభు తన యొక్క శరీర రక్తముల గురించి చెప్పినప్పుడు చాలామంది ఆయనను విడిచిపెట్టి వెళ్లిపోయారు కానీ పేతురు మాత్రము ఏసుప్రభు తో ఉంటే చాలు ఇక ఏది కూడా అవసరము లేదు అని మేము ఎక్కడికి పోలేము నిన్ను విడిచిపెట్టి అని అన్నారు ఎందుకంటే ఆయన ఏసుప్రభు యొక్క గొప్పతనమును, విలువను తెలుసుకున్నారు అందుకనే ఆయనను కలిగి ఉంటే చాలు ఇక ఏది కూడా అవసరం లేదు అని భావించాడు. 

మూడవ ఉపమానములో ఏసుప్రభు పరలోక రాజ్యమును మంచి చేపలు చెడు చేపలు పడిన వలతో పోల్చి చెప్తున్నారు అంటే మంచి వారు చెడ్డవారు కూడా అందరూ దేవుని యొక్క రాజ్యమునకు చెందినవారే కానీ అంత్యకాలమున ఎవరైతే దేవుని చిత్తానుసారంగా జీవించరో వారిని పరలోకము నుండి వేరు చేస్తారు నిత్య శిక్షకు వారు గురి అవుతారు అని ప్రభువు తెలియచేస్తున్నారు. దేవుడు మనకు ఇచ్చినటువంటి జ్ఞానము వరములను బట్టి మంచి మార్గములను ఎన్నుకుంటూ దైవ చిత్తాన్ని నెరవేరుస్తూ మనందరం జీవిస్తే తప్పనిసరిగా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం లేకపోతే చెడు చేపల లాగా దేవుని యొక్క రాజ్యము నుండి పంపి వేయబడి శిక్షకు అర్హులవుతాం కాబట్టి మనందరికీ దేవుడు ప్రసాదించినటువంటి ఆత్మీయ వరములు ద్వారా విలువైనటువంటి దేవుని కలిగి మనము మంచి జీవితము జీవించాలి.

Fr. Bala Yesu OCD 

లూకా 5: 33-39

 లూకా 5: 33-39 "యోహాను శిష్యులు తరచుగా ఉపవాసములు, ప్రార్ధనలు చేసెదరు. అటులనే పరిసయ్యుల శిష్యులను చేయుదురు. కాని, మీ శిష్యులు మాత్రము తి...